Unanimously elected
-
మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా నర్వేకర్
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా బీజేపీకి చెందిన రాహుల్ నర్వేకర్ ఏకగ్రీవ ఎన్నికకు రంగం సిద్ధమైంది. నర్వేకర్ ఆదివారం సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలు షిండే, అజిత్‌లతో కలిసి అసెంబ్లీ కార్యదర్శి జితేంద్ర భోలెకు నామినేషన్ పత్రాలను అందజేశారు. స్పీకర్ పదవికి పోటీ పడరాదన్న ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) నిర్ణయంతో నర్వేకర్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. సోమవారం అసెంబ్లీలో బలపరీక్ష అనంతరం స్పీకర్ ఎన్నికపై నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశముంది. అనంతరం గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ శాసనసభ, శాసనమండలి సభ్యులతో జరిగే ఉమ్మడి సమావేశంలో ప్రసంగిస్తారు. అదేవిధంగా, ప్రొటోకాల్ ప్రకారం డిప్యూటీ స్పీకర్ పదవిని తమ కూటమిలోని పార్టీలకు వదిలేయాలని ఎంవీఏ నేతలు ఆదివారం సీఎం ఫడ్నవీస్‌ను కలిసి కోరారు. ప్రతిపక్ష నేత పదవిని కూడా ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇటీవలి ఎన్నికల్లో అసెంబ్లీలోని 288 సీట్లకుగాను మహాయుతి 230 స్థానాలను గెల్చుకోవడం తెల్సిందే. ముంబైలోని కొలాబా నుంచి మళ్లీ ఎన్నికైన రాహుల్ నర్వేకర్ గత 14వ అసెంబ్లీ స్పీకర్‌గా రెండున్నరేళ్లపాటు కొనసాగారు. ఆ సమయంలో శివసేన, ఎన్సీపీ చీలిక వర్గాల వ్యవహారంపై మహాయుతి ప్రభుత్వానికి అనుకూలంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శివసేన(షిండే)కు 11 మంత్రి పదవులు!మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. అతిత్వరలో విస్తరణ ఉంటుందని మహాయుతి ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కూటమిలో కీలక భగస్వామి అయిన శివసేన(షిండే)కు 11 మంత్రి పదవులు దక్కనున్నట్లు సమాచారం. ఆ పార్టీ నేత ఏక్నాథ్ షిండే ఇప్పటికే ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. కీలక శాఖలు ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారు. శివసేన(షిండే) నుంచి మంత్రులుగా ప్రమాణం చేసేవారిలో ఆరుగురు మాజీ మంత్రులే ఉంటారని సమాచారం. కొత్తగా ఐదుగురికి మంత్రి యోగం పట్టబోతున్నట్లు తెలుస్తోంది. కనీసం 13 మంత్రి పదవులు కావాలని శివసేన(షిండే) డిమాండ్ చేయగా 11 పదవులకు బీజేపీ అంగీకరించినట్లు సమాచారం. -
హరియాణా బీజేపీఎల్పీ నేతగా సైనీ
చండీగఢ్/ పంచకుల: హరియాణా బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా నాయబ్‌సింగ్ సైనీ ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. బుధవారం పంచకులలో సమావేశమైన బీజేపీ ఎమ్మెల్యేలు సైనీని తమ నాయకుడిగా ఎన్ను కున్నారు. సైనీ పేరును ఎమ్మెల్యే క్రిషన్ కుమార్ బేడీ ప్రతిపాదించగా.. సీనియ ర్ నేత అనిల్ విజ్ బలపరిచారు. అనిల్ విజ్ సైతం సీఎం పదవిని ఆశించినప్పటికీ బీజేపీ అగ్రనేతలు సైనీ వైపు మొగ్గారు. పరిశీలకుడిగా హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. సైనీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. అనంతరం సైనీ గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఈనెల 5న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాలు నెగ్గి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలన్నీ అంచనా వేసిన కాంగ్రెస్ 37 స్థానాల వద్దే నిలిచిపోయింది. హరియాణా ముఖ్యమంత్రి రెండోసారి సైనీ గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మోదీ, రాజ్‌నాథ్ సింగ్‌లతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఎన్డీయే సీఎంలు హాజరుకానున్నారు. -
‘అనంత’ మున్సిపల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సత్తా
సాక్షి, అనంతపురం: అనంతపురం మున్సిపల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సత్తా చాటింది. ఐదుగురు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.మునిసిపల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరం కాగా, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో ఐదు స్టాండింగ్ కమిటీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు అనీల్ కుమార్ రెడ్డి, సుజాత, రహంతుల్లా, నాగవినూత, నర్సింహులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల స్క్రూటినీ తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు. -
అరుణాచల్‌లో 10 ఏకగ్రీవాలు
ఇటానగర్: అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం పెమా ఖండూ, డిప్యూటీ సీఎం చౌనా మెయిన్ సహా 10 మంది బీజేపీ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమైంది. శనివారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సరికి ఆయా నియోజకవర్గాల్లో వారు మాత్రమే బరిలో మిగిలారు. దాంతో వారు ఎమ్మెల్యేలుగా ఎన్నికైనట్టు చీఫ్ ఎలక్టోరల్ అధికారి పవన్ కుమార్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో అరుణాచల్‌లోని మిగతా 60 అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు రెండు లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19వ తేదీన తొలి విడతలో పోలింగ్ జరగనుంది. -
రాజ్యసభకు సోనియా గాంధీ ఏకగ్రీవ ఎన్నిక
జైపూర్: కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే రాష్ట్రం నుంచి నామినేషన్ వేసిన బీజేపీ నేతలు చున్నీలాల్ గరాసియా, మదన్ రాథోడ్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం సాయంత్రం ముగిసింది. రాష్ట్రంలో మూడు స్థానాలకు బరిలో ముగ్గురే మిగలడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. లోక్‌సభ ఎంపీగా 6 పర్యాయాలు పనిచేసిన సోనియా గాంధీ.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు చెందిన జైపూర్ నుంచి తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. కాగా సోనియా 2006 నుంచి రాయ్‌బరేలీ నుండి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లోనూ అమెథీలో రాహుల్ ఓడిపోయినప్పటికీ సోనియా రాయ్‌బరేలీ స్థానాన్ని గెలుచుకొని ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ గెలుచుకున్న ఏకైక స్థానంగా నిలిచింది. చదవండి: చండీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు -
TS: మూడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం
న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణలోని మూడు రాజ్యసభ స్థానాలల్లోనూ పోటీ చేసిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడు స్థానాల్లోని అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలుపొందినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు మంగళవారం వెల్లడించారు. తెలంగాణలోని మూడు రాజ్యసభ స్థానాలుకు గాను.. మూడు నామినేషన్లు మాత్రమే దాఖలైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకరు నామినేషన్ దాఖలు చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నుంచి వద్దిరాజు రవిచంద్రన్ రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా గెలుపొందినట్లు రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారు. ఇక.. రేణుకా చౌదరి రేపు(బుధవారం) గెలుపు ధృవ పత్రాలను అందుకోనున్నట్లు తెలుస్తోంది. -
AP: 4 జెడ్పీటీసీలు ఏకగ్రీవమే
సాక్షి, అమరావతి: ఏకగ్రీవంగా గెలిచిన విజేతలు ప్రమాణ స్వీకారానికి ముందే చనిపోవడంతో మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్న మూడు జెడ్పీటీసీ స్థానాలు ఈసారి కూడా ఏకగ్రీవాలే అయ్యాయి. మూడింటికి మూడు చోట్లా మరోసారి వైఎస్సార్సీపీ అభ్యర్ధులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైఎస్సార్ జిల్లా లింగాల, గుంటూరు జిల్లా కారంపూడి, కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల జెడ్పీటీసీ స్థానాల్లో గతంలో ఏకగ్రీవంగా గెలిచిన వారు మరణించడంతో ఈ నెల 16న ఉప ఎన్నిక నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. మంగళవారంతో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియగా అన్ని చోట్లా అధికార పార్టీ అభ్యర్ధులే బరిలో నిలవడంతో ఆయా స్థానాలు ఏకగ్రీవమైనట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. కలకడ.. వైఎస్సార్సీపీదే ఇక వీటికి తోడు మొన్నటి ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియకు, పోలింగ్‌కు మధ్య పోటీలో ఉన్న వివిధ పార్టీల అభ్యర్థులు మరణించడంతో వాయిదా పడ్డ 11 జెడ్పీటీసీ స్థానాలకు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తోంది. వీటిల్లో ఒక జెడ్పీటీసీ స్థానాన్ని అధికార వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. చనిపోయిన అభ్యర్ధికి సంబంధించిన రాజకీయ పార్టీ నుంచి అదనంగా నామినేషన్ దాఖలుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అవకాశం ఇచ్చింది. చిత్తూరు జిల్లా కలకడ జెడ్పీటీసీ స్థానంలో మరణించిన టీడీపీ అభ్యర్థికి బదులుగా ఆ పార్టీ నుంచి ఎవరూ పోటీలో నిలవలేదు. అక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్ధి ఒక్కరే పోటీలో ఉండడంతో ఆ జెడ్పీటీసీ స్థానం ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. మిగిలిన 10 జెడ్పీటీసీ స్థానాల్లో మొత్తం 40 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. సర్పంచి, వార్డు పదవులకు 14న పోలింగ్ రాష్ట్రవ్యాప్తంగా 500 గ్రామ పంచాయతీల పరిధిలో 69 సర్పంచి, 533 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరగనుండగా మంగళవారం సాయంత్రానికి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. 30 సర్పంచి స్థానాల్లో ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది. మరో 4 చోట్ల ఒక్కరు కూడా నామినేషన్లు దాఖలు చేయలేదు. మిగిలిన 35 చోట్ల 109 మంది పోటీలో ఉండగా అక్కడ ఈ నెల 14వ తేదీ పోలింగ్ జరగనుంది. 533 వార్డు సభ్యుల పదవుల్లో 380 చోట్ల ఎన్నిక ఏకగ్రీవమైంది. మరో 85 చోట్ల ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. మిగిలిన 68 వార్డుల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా 192 మంది పోటీలో ఉన్నారు. 50 ఎంపీటీసీలు ఏకగ్రీవం.. ఎన్నికలు ఆగిపోవడం, గెలిచిన వారు మృతి చెందడం లాంటి కారణాలతో 176 ఎంపీటీసీ స్థానాల్లో తాజాగా ఎన్నికలు నిర్వహిస్తుండగా నామినేషన్లు ఉపసంహరణ ప్రక్రియ ముగిసే సమయానికి 50 చోట్ల ఏకగ్రీవాలయ్యాయి. ఇందులో 46 చోట్ల అధికార వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా గెలుచుకోగా మూడు చోట్ల టీడీపీ, ఒక చోట ఇండిపెండెంట్ అభ్యర్ధి ఏకగ్రీవంగా గెలుపొందారు. మరో మూడు ఎంపీటీసీ స్థానాల్లో ఒక్కరు కూడా నామినేషన్ దాఖలు చేయలేదు. మిగిలిన 123 చోట్ల ఎన్నికలు జరగనుండగా 328 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగేచోట ఈ నెల 16వ తేదీన పోలింగ్ జరగనుంది. -
అన్నీ ఆయనే చేసేస్తే.. ఎన్నికల ట్రిబ్యునల్ ఎందుకు!
సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసిన తరువాత పలువురు అభ్యర్థులకు నామినేషన్ల దాఖలుకు అనుమతిస్తూ ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ వైఎస్సార్, చిత్తూరు జిల్లాలకు చెందిన పలువురు అభ్యర్థులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి రద్దు చేయాలని హైకోర్టును కోరారు. కమిషన్ ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్ధించారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు మంగళవారం విచారణ జరిపారు. గడువు ముగిశాక మళ్లీ అవకాశం ఇవ్వడం చట్టవిరుద్ధం పిటిషనర్ల తరఫున వీఆర్ రెడ్డి, ప్రశాంత్ వాదనలు వినిపిస్తూ.. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తరువాత తిరిగి నామినేషన్లు దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వడం ఏపీ మున్సి’పాలిటీల చట్టానికి విరుద్ధమన్నారు. గత ఏడాది మొదలైన మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆయా వార్డులు, డివిజన్లకు పిటిషనర్లు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారని తెలిపారు. కరోనా వల్ల ఎన్నికలు వాయిదా పడటంతో పిటిషనర్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించడం అప్పట్లో సాధ్యం కాలేదన్నారు. ఒకే నామినేషన్ వచ్చిన చోట అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నికయినట్టు ప్రకటిస్తామని అప్పట్లో ఎన్నికల కమిషనర్ తెలిపారని వివరించారు. అయితే, బలవంతంగా నామినేషన్లు ఉపసంహరణ జరిగిన వ్యక్తుల, బెదిరింపుల వల్ల నామినేషన్లు వేయని వ్యక్తుల నామినేషన్లను పునరుద్ధరించాలంటూ జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశిస్తూ ఎన్నికల కమిషనర్ ఇటీవల ఉత్తర్వులిచ్చారని తెలిపారు. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా పలుచోట్ల నామినేషన్ల దాఖలుకు అవకాశం ఇచ్చారని తెలిపారు. సహేతుక కారణాలు, తగిన ఆధారాలు లేకపోయినప్పటికీ నామినేషన్ల దాఖలుకు అవకాశం ఇచ్చారని తెలిపారు. వాస్తవానికి ఓసారి నామినేషన్ల దాఖలు గడువు ముగిసిన తరువాత తిరిగి నామినేషన్ దాఖలుకు అవకాశం ఇవ్వడం చట్ట విరుద్ధమని, ఇందుకు ఏ చట్టం కూడా అంగీకరించదని వారు వివరించారు. ఇలా చేసే అధికారం ఎన్నికల కమిషనర్‌కు లేదన్నారు. ఒకవేళ పిటిషనర్ల నామినేషన్లపై ఎవరికైనా అభ్యంతరం ఉంటే చట్టబద్ధంగా ఏర్పాటైన ఎన్నికల ట్రిబ్యునల్ ముందు సవాల్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇది తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. ఎన్నికల కమిషనర్ పరిధి దాటి వ్యవహరిస్తున్నారు.. ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ.. విశేషాధికారాల పేరుతో ఎన్నికల కమిషనర్ ఇష్టానుసారం వ్యవహరించడానికి వీల్లేదన్నారు. ఎన్నికల కమిషనర్ అధికారాలకూ పరిమితులు ఉన్నాయని, ఈ విషయాన్ని హైకోర్టు, సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పాయన్నారు. రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించే ఎన్నికల అధికారులు ఓ సారి నామినేషన్లు ఆమోదించిన తరువాత అందులో ఎన్నికల కమిషనర్ జోక్యం చేసుకోవడానికి వీల్లేదని, ఎన్నికల అధికారే సుప్రీం అని హైకోర్టు గతంలోనే తీర్పునిచ్చిందన్నారు. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకున్నాయని తేలినా వాటిపై ఎన్నికల ట్రిబ్యునల్‌కు వెళ్లాలని చట్టం చెబుతోందన్నారు. ఎన్నికల ట్రిబ్యునల్ చేయాల్సిన పనులను ఎన్నికల కమిషనర్ చేయడానికి వీల్లేదన్నారు. అన్నీ ఎన్నికల కమిషనరే చేసేస్తే, ఇక ఎన్నికల ట్రిబ్యునల్ ఎందుకని ప్రశ్నించారు. అక్రమాలు జరిగాయని ఎన్నికల కమిషనరే నిర్ధారిస్తే, ఎన్నికల ట్రిబ్యునల్ చేయడానికి ఏమీ ఉండదన్నారు. ఫిర్యాదులు వచ్చినందునే... ఎన్నికల కమిషన్ తరఫున న్యాయవాది అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగినప్పుడు వాటిపై స్పందించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బలవంతపు నామినేషన్లు ఉపసంహరణ, నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం వంటి ఘటనలపై కమిషన్‌కు అనేక ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా నివేదికలు తెప్పించుకుని పరిశీలించాకే.. మళ్లీ నామినేషన్ల దాఖలుకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చినట్టు తెలిపారు. ఎన్నికల కమిషన్‌కు విశేషాధికారాలు ఉన్నాయని ఆయన తెలిపారు. 14 చోట్ల నామినేషన్ల దాఖలుకు అనుమతినిచ్చామని, అయితే కేవలం 4 చోట్ల మాత్రమే నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు ఈ వ్యాజ్యాలపై బుధవారం ఉత్తర్వులు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. -
ఓటర్లంతా ఎస్సీ.. బీసీ సర్పంచ్ !
శ్రీకాళహస్తి రూరల్: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం జగ్గరాజుపల్లి పంచాయతీ సర్పంచ్‌గా ఖాదర్‌బీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ గ్రామంలో అన్నీ ఎస్సీ కుటుంబాలే నివసిస్తున్నాయి. 677 మంది ఓటర్లున్న ఈ పంచాయతీ సర్పంచ్ పదవిని బీసీలకు కేటాయించారు. ఓటర్లంతా ఎస్సీలే కావడంతో మొదట్లో సందిగ్ధానికి గురయ్యారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదరి దామతోటి ముని మైనార్టీ వర్గానికి చెందిన ఖాదర్‌బీని వివాహం చేసుకున్నారు. ఆమెది బీసీ వర్గం కావడంతో సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. పోటీలేకపో వడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చదవండి: విశాఖ ఘటనలో ఏపీ సర్కార్ పనితీరు భేష్ మా జాబితా తప్పని నిరూపించగలవా! -
ఎస్ఈసీకి ఎదురుదెబ్బ.. ఆ అధికారం మీకెక్కడుంది!?
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు న్యాయస్థానంలో మరోసారి చుక్కెదురైంది! ఏకగ్రీవాలను నీరుగార్చి తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించి భంగపడింది. గతేడాది అర్ధాంతరంగా ఆగిపోయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా బలవంతంగా నామినేషన్లను ఉపసంహరించారని నిర్ధారణ అయితే ఆ అభ్యర్థుల నామినేషన్లను పునరుద్ధరించాలని కలెక్టర్లను ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈ నెల 18న జారీ చేసిన ఆదేశాల విషయంలో హైకోర్టు జోక్యం చేసుకుంది. ఒకే ఒక నామినేషన్ దాఖలైన చోట ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తూ ఎన్నికల అధికారి ఫాం – 10 జారీ చేసిన ఏకగ్రీవాలపై ఈ నెల 23వతేదీ వరకు ఎలాంటి విచారణ జరపవద్దని ఎన్నికల కమిషన్, అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ ఫాం – 10 జారీ చేయని చోట ఏవైనా చర్యలు తీసుకుంటే ఈ నెల 23 వరకు వెల్లడించరాదని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల కాపీని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లకు పంపాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించారు. ఇవీ పిటిషన్లు... ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి రద్దు చేయాలని కోరుతూ చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం, ఆరడిగుంట, సింగిరిగుంట ఎంపీటీసీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఫాం 10 అందుకున్న డి.నంజుండప్ప, ఏ.భాస్కర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పీలేరు ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఫాం 10 అందుకున్న ఏటీ రత్నశేఖర్‌రెడ్డి కూడా మరో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. లంచ్ మోషన్ రూపంలో దాఖలైన ఈ వ్యాజ్యాలపై పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి, వీఆర్ఎన్ ప్రశాంత్, ఎస్ఆర్ వివేక్ చంద్రశేఖర్‌లు వాదించగా ఎన్నికల కమిషన్ తరఫున ఎన్.అశ్వనీకుమార్ వాదించారు. ఆర్వోల విధుల్లో కమిషనర్ జోక్యం చేసుకోరాదు.. ‘రాజ్యాంగంలోని అధికరణ 243 కే కింద తన అధికారాలకు అడ్డులేదని ఎన్నికల కమిషనర్ భావిస్తున్నారు. రిటర్నింగ్ అధికారులు ఏం చేయాలో నిబంధనల్లో స్పష్టంగా ఉంది. వారి విధుల్లో ఎన్నికల కమిషనర్ జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. ఒకే అభ్యర్థి బరిలో ఉంటే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి తక్షణమే ప్రకటించి ఫాం 10 ఇవ్వాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ ఎన్నికల కమిషనర్ చట్టాలను ఖాతరు చేయకుండా సూపర్మ్యాన్లా వ్యవహరిస్తున్నారు’ అని పిటిషనర్ల తరపు న్యాయవాది మోహన్‌రెడ్డి నివేదించారు. పిటిషనర్ల తరఫున మరో న్యాయవాది వీఆర్ఎన్ ప్రశాంత్ వాదనలు వినిపిస్తూ ఓ అభ్యర్థి ఎన్నికైనట్లు ప్రకటించి ధ్రువీకరణ పత్రం జారీ చేసిన తరువాత అభ్యంతరాలుంటే ఎన్నికల ట్రిబ్యునల్ ముందు పిటిషన్ దాఖలు చేసుకోవడం ఒక్కటే మార్గమన్నారు. ఎన్నికల కమిషన్ ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయక ముందే దాఖలైన ఈ వ్యాజ్యాలకు విచారణార్హత లేదని కమిషన్ తరపు న్యాయవాది అశ్వనీకుమార్ పేర్కొన్నారు. ఆ అధికారం మీకెక్కడుంది..? ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ విచారణకు ఆదేశించే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉందా? ఆ అధికారం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? అని ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. చట్టంలో ఏమీ చెప్పనప్పుడు మాత్రమే 243 కే కింద అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేస్తూ ఈ వ్యవహారంలో క్షుణ్నంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పిటిషనర్లు ప్రస్తావించిన అంశాలకు ప్రాథమిక ఆధారాలున్నాయని స్పష్టం చేస్తూ విచారణను వాయిదా వేశారు. -
54 ఏళ్ల చరిత్రలో.. ఒకే ఒక్కడు
ఆ పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి ప్రతిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. 54 ఏళ్ల చరిత్రలో ప్రస్తుతం తొలిసారి సర్పంచ్ పదవి ఏకగ్రీవం అయ్యింది. ఒకేఒక ఏకగ్రీవ సర్పంచ్‌గా ఎస్ఎ షుకూర్ చరిత్ర సృష్టించారు. కాగా అక్కడ ఆది నుంచి ముస్లిం మైనారిటీల హవానే కొనసాగుతోంది. పులిచెర్ల(కల్లూరు): మండలంలోని మేజర్ పంచాయతీ అయిన కల్లూరు 1965లో పంచాయతీగా ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటివరకు అన్నిసార్లు ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. ఆ ఎన్నికల్లో ముస్లిం మైనారిటీలే ఆ గ్రామ సర్పంచ్‌లుగా ఎన్నిక అవుతున్నారు. ఇప్పుడు తొలిసారిగా ఈ గ్రామ సర్పంచ్‌గా వైఎస్సార్ సీపీ అభిమాని ఎస్ఎ షుకూర్ ఏకగ్రీవంగా ఎన్నికై రికార్డు సృష్టించారు. తొలి ఏకగ్రీవ సర్పంచ్‌గా ఆ పంచాయతీ చరిత్రలో ఆయన నిలి చిపోయారు. తొలిసారిగా 1967లో జరిగి న ఎన్నికల్లో నన్నే సాహెబ్ మొదటి సర్పంచ్‌గా గెలిచారు. అనంతరం హెచ్ఎస్ గఫూ ర్ 19 ఏళ్లు సర్పంచ్‌గా పనిచేశారు. ఆ తరువాత టీఎస్. గఫర్, ఎస్ఏ జుబేర్‌సాహెబ్, పీఎస్ నజీర్, హెచ్ఎస్ పర్విన్, పీ ఎస్ నజీర్, హెచ్ఎస్ షబానా సర్పంచ్‌లుగా పనిచేశారు. ప్రస్తుతం ఎస్ఎ షు కూర్ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. ఈ పంచాయతీకి 54 ఏళ్ల తరువాత ప్రస్తుతం తొలిసారిగా పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. కాగా ఆది నుంచి ఇప్పటివరకు ముస్లిం మైనారిటీలే సర్పంచ్‌లుగా కొనసాగుతున్నారు. చదవండి: తండ్రి ఎమ్మెల్సీ.. తనయుడు సర్పంచ్.. ఇవేం పాడు పనులు.. కానిస్టేబుల్‌కు దేహశుద్ధి -
తుది విడతలో 553 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం
సాక్షి, అమరావతి: చివరి విడతగా ఈనెల 21న జరగాల్సిన గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 553 పంచాయతీ సర్పంచ్ పదవులు ఏకగ్రీవమైనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించింది. తుది విడతలో జిల్లాల వారీగా ఏకగ్రీవమైన సర్పంచ్, వార్డు స్థానాల సంఖ్యతోపాటు మిగిలినచోట్ల ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నారన్న వివరాలను బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. నాలుగో విడతలో మొత్తం 3,299 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్లు జారీకాగా.. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. 553 పంచాయతీల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. రెండు పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు ఒక్కరు కూడా నామినేషన్ దాఖలు చేయలేదు. దీంతో మిగిలిన 2,744 చోట్ల సర్పంచ్ స్థానాలకు ఈ నెల 21వ తేదీన చివరి పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మొత్తం 7,475 మంది అభ్యర్ధులు సర్పంచ్ పదవులకు పోటీలో ఉన్నారు. చివరి విడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లో 33,435 వార్డులున్నాయి. వీటిలో 10,921 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 22,422 వార్డుల్లో ఈ నెల 21న జరగనున్న ఎన్నికల బరిలో 49,083 మంది పోటీలో ఉన్నారు. మిగిలిన 92 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. చదవండి: ప్రభంజనం: వైఎస్సార్సీపీ సంబరాలు.. పేదలపై భారం మోపలేం.. -
నిన్న వలంటీర్.. నేడు సర్పంచ్..
కదిరి అర్బన్: నిన్నటి దాకా ఆమె ఓ వలంటీర్. తన పరిధిలోని ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేశారు. అయితే ఇప్పుడు ఆమె వలంటీర్లు, అధికారుల భాగస్వామ్యంతో ఊరు మొత్తానికి సేవ చేసే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ఊరందరి సహకారంతో సర్పంచిగా ఏకగ్రీవమయ్యారు. అనంతపురం జిల్లా కదిరి మండలం ముత్యాలచెరువు పంచాయతీ సర్పంచ్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ అయింది. (చదవండి: తొలి దెబ్బ అదిరింది) వలంటీర్‌గా నారికే శుభలేఖ తన ఉద్యోగాన్ని వదిలి సర్పంచి బరిలో నిలిచారు. ఆమెతో పాటు మరో ముగ్గురు కూడా నామినేషన్లు వేశారు. అయితే శుభలేఖ ఉత్తమ సేవలు అందించి ఉండటం, గ్రామస్తుల నిర్ణయం మేరకు మిగతా ముగ్గురు గురువారం నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో శుభలేక సర్పంచిగా ఏకగ్రీవమయ్యారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే డాక్టర్ పెడబల్లి వెంకటసిద్ధారెడ్డిని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా ఆమె కలవగా, పూలమాలతో సన్మానించారు.(చదవండి: 523 పంచాయతీల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవం) -
25 సర్పంచ్, 540 వార్డు స్థానాలు ఏకగ్రీవం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: స్థానిక సమరం తొలి దశలో ఏకగ్రీవాలు.. అభ్యర్థుల్లో ఉత్సాహాన్ని నింపాయి. మొదటి దశ పోరు సెమీ ఫైనల్స్‌కు చేరింది. నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. 25 సర్పంచ్, 540 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని అధికారికంగా ప్రకటించారు. కావలి రెవెన్యూ డివిజన్లోని 9 మండలాల్లో 163 పంచాయతీలు, 1,566 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల ప్రక్రియ సాగుతోంది. ఏకగ్రీవ స్థానాల అనంతరం మిగిలిన 138 సర్పంచ్, 1,026 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నిక జరగనుంది. సర్పంచ్ స్థానాల్లో 15.33 శాతం, వార్డు సభ్యులు 34.48 శాతం ఏకగ్రీవం అయ్యాయి. మొదటి దశ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ, ఉప సంహరణ వరకు ప్రక్రియ పూర్తయింది. ఈ నెల 9న పోలింగ్ ప్రక్రియ జరగనుంది. కావలి డివిజన్లోని కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లోని 163 గ్రామ పంచాయతీలు, 1,566 వార్డులకు గత నెల 29 నుంచి 31వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. సర్పంచ్ స్థానాలకు 920, వార్డు సభ్యుల స్థానాలకు 3,788 నామినేషన్లు దాఖలయ్యాయి. అభ్యంతరాలు, పరిశీలన పూర్తి తర్వాత గురువారం ఉప సంహరణకు తుది గడవు పూర్తయ్యే సరికి 25 సర్పంచ్ స్థానాలు, 540 వార్డు సభ్యుల స్థానాల్లో ఒక్కొక్క నామినేషన్ మాత్రమే ఉండడంతో ఏకగ్రీవాలు లాంఛనంగా మారాయి. ఉదయగిరిలో అత్యధికం ప్రధానంగా ఉదయగిరి నియోజకవర్గంలో మొదటి విడత ఎన్నికలు జరిగే ఐదు మండలాల్లో 22 సర్పంచ్ స్థానాలు, 366 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కావలి నియోజకవర్గంలో మూడు సర్పంచ్ స్థానాలు, 174 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. జలదంకి మండలంలో 17 పంచాయతీలకు నాలుగు సర్పంచ్, 172 వార్డులకు 57 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. కావలిలో 17 పంచాయతీల్లో ఒకటి, 182 వార్డుల్లో 63, వరికుంటపాడులో 24 పంచాయతీల్లో 5 సర్పంచ్, 212 వార్డు సభ్యుల్లో 85, కలిగిరిలో 23 పంచాయతీల్లో 4 సర్పంచ్, 214 వార్డు సభ్యుల్లో 81, దగదర్తిలో 20 పంచాయతీల్లో ఒక సర్పంచ్, 186 వార్డు సభ్యుల్లో 50, కొండాపురంలో 19 పంచాయతీల్లో 4 సర్పంచ్, 184 వార్డు సభ్యుల్లో 80, బోగోలులో 16 పంచాయతీల్లో ఒక సర్పంచ్, 168 వార్డు సభ్యుల్లో 43, దుత్తలూరులో 17 పంచాయతీల్లో 5 సర్పంచ్, 148 వార్డు సభ్యుల్లో 63 ఏకగ్రీవం అయ్యాయి. అల్లూరులో 10 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు ఎన్నిక జరగనుంది. 100 వార్డుల్లో 18 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. -
523 పంచాయతీల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా తొలివిడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 523 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తొలివిడత ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. 3,249 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ జారీ కాగా.. సర్పంచ్ పదవుల కోసం 19,491, వార్డు సభ్యుల కోసం 79,799 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి 1,323 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. (చదవండి: స్థానిక ఎన్నికలు: టీడీపీ నేతల దౌర్జన్యకాండ) 18,168 మాత్రం సక్రమంగా ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. తొలి విడతలో విజయనగరం జిల్లా లేదు. మిగిలిన 12 జిల్లాలను పరిశీలిస్తే.. తొలి విడతలో ఎన్నికలు జరిగే పంచాయతీలు చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 454 ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో అత్యల్పంగా 163 పంచాయతీలున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 110 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవమయ్యారు. అనంతపురం జిల్లాలో అత్యల్పంగా ఆరుగురు సర్పంచ్‌లు ఏకగ్రీవమయ్యారు. అలాగే చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 2,499 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన పంచాయతీలు, వార్డులకు ఈ నెల 9న పోలింగ్ జరగనుంది.(చదవండి: టీడీపీ కిడ్నాప్ డ్రామా బట్టబయలు..) -
అనగనగా ఒక ఊరు.. అందరిదీ ఒకేమాట
ఉలవపాడు: పెదపట్టపుపాలెం.. సముద్ర తీర ప్రాంతంలో ఉండే మత్స్యకార గ్రామం. గ్రామ పంచాయతీ ఏర్పడిన నాటి నుంచి ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించ లేదంటే అతిశయోక్తికాదు. ఇప్పటి వరకు సర్పంచ్‌లందరూ ఏకగ్రీవంగానే ఎన్నికయ్యారు. పెద్దలందరూ కూర్చుని తీసుకున్న నిర్ణయానికి గ్రామస్థులందరూ కట్టుబడి ఉంటారు. పార్టీలకు అతీతంగా ఈ నిర్ణయాలు జరుగుతాయి. దీని వల్ల ప్రభుత్వానికి ఎన్నికల వ్యయం కూడా లేకుండా చేస్తారు. తొలుత చాకిచర్ల నుంచి 1998లో పెదపట్టపుపాలెం ప్రత్యేక పంచాయతీగా ఏర్పడింది. ఆ తరువాత నాలుగు సార్లు పంచాయతీ ఎన్నికలు జరిగాయి. 1998 లో జరిగిన ఎన్నికల్లో ప్రళయ కావేరి సుబ్రమణ్యం, 2003లో ఆవుల జయరాం, 2008 లో వాయల పోలమ్మ, 2013 లో తుమ్మల తిరుపతమ్మ సర్పంచులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా ఏకగ్రీవంగా అభ్యర్థి ఎంపికకు చర్చలు జరుగుతున్నాయి. గ్రామం నడిబొడ్డున ఉన్న రెండు శతాబ్దాల నాటి చెట్టు కింద కూర్చుని గ్రామస్థులందరూ కలసి కాపుల సమక్షంలో నిర్ణయం తీసుకుంటారు. చదవండి: పంచాయతీ ఎన్నికలు: టీడీపీ దుష్ట పన్నాగాలు.. పెదపట్టపుపాలెం గ్రామం వ్యూ .. ఆదర్శప్రాయం... పెదపట్టపుపాలెం గ్రామం విడిపోయిన తరువాత నుంచి ఇప్పటి వరకు ఎంపీటీసీ ఎన్నికలలో కూడా అభ్యర్థులను ఏకగ్రీవంగానే ఎన్నుకున్నారు. ఇటీవల సగంలో నిలిచిపోయిన ఎన్నికల ప్రక్రియతో సహా ఇప్పటి వరకు ఐదు సార్లు ఎంపీటీసీ ఎన్నికలు జరగాయి. అందరూ ఏకగ్రీవంగానే ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఈ గ్రామ జనాభా 4239. ఇందులో 2147 మంది పురుషులు, 2098 మంది మహిళలు. 3070 మంది ఓటర్లలో 1574 మంది పురుషులు, 1496 మంది మహిళలు ఉన్నారు. ఇంత మంది ఓటర్లు ఉన్నా అందరూ కలసికట్టుగా ఒకే నిర్ణయానికి కట్టుబడుతున్నారు. ఎన్నికలు లేకుండా ఏకగ్రీవానికి నిలిచి ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. గత ఏడాది ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం ఇచ్చిన రూ.5 లక్షల నిధులు కూడా గ్రామాభివృద్ధికి ఉపయోగించారు. ఈ సారీ ఏకగ్రీవమే అయితే ప్రభుత్వం నుంచి రూ.10 లక్షలు నజరానా అందే అవకాశం ఉంది. ఇలా ఈ గ్రామం వివాదాలకు తావులేకుండా ఎన్నికల వ్యయం ప్రభుత్వానికి భారం కాకుండా ఆదర్శవంతంగా నిలుస్తోంది. చదవండి: ఎలక్షన్ ఎక్సర్సైజ్ షురూ.. ఏకగ్రీవాలకే మొగ్గు! పెద్దల మాటకు గౌరవం..: ఇక్కడ గ్రామçస్థులు పెద్దల మాటకు గౌరవం ఇస్తారు. అధికారులకు కూడా సమస్యలు రాకుండా చూస్తారు. ఇక్కడ పని చేయడం ఆనందంగా ఉంది. అందరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం. – మాలకొండయ్య, పంచాయతీ కార్యదర్శి -
డీడీసీఏ అధ్యక్షుడిగా రోహన్ జైట్లీ
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, దివంగత బీజేపీ నేత అరుణ్ జైట్లీ కుమారుడు రోహన్ జైట్లీ ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ సంఘం (డీడీసీఏ) అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడవు శనివారంతో ముగియగా... అధ్యక్ష పదవి రేసులో రోహన్ మాత్రమే ఉండటంతో అతడిని ఏకగ్రీవం చేస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. అధ్యక్ష పదవిలో రోహన్ వచ్చే ఏడాది జూన్ 30 వరకు ఉండనున్నారు. గతంలో అరుణ్ జైట్లీ 1999 నుంచి 2013 వరకు డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్నారు. న్యాయవాది అయిన రోహన్... తండ్రి బాటలోనే నడుస్తూ డీడీసీఏ అధ్యక్ష పదవిని అలంకరించడంతో పలువురు క్రికెటర్లు, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలిపారు. కోశాధికారి, డైరెక్టర్ పదవుల కోసం నవంబర్ 5–8 మధ్య ఎన్నికలు జరగనున్నాయి. కోశాధికారి పదవి కోసం బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సీకే ఖన్నా సతీమణి శశి, గౌతమ్ గంభీర్ మేనమామ పవన్ గులాటి మధ్య పోటీ నెలకొని ఉంది. -
విధాన మండలికి ఉద్ధవ్ ఠాక్రే ఏకగ్రీవం!
సాక్షి ముంబై: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే సోమవారం మహారాష్ట్ర విధాన మండలి (ఎంఎల్సీ)కి నామినేషన్ దాఖలు చేశారు. తొమ్మిది స్థానాల కోసం శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల నుంచి అయిదుగురు, బీజేపీకి చెందిన నలుగురు ఇలా మొత్తంగా తొమ్మిది మంది బరిలో నిలిచారు. దీంతో విధాన మండలి ఎన్నికలు దాదాపు ఏకగ్రీవమ య్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండానే ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన ఉద్ధవ్ ఠాక్రేకు మే 27వ తేదీ లోపు ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం అనివార్యంగా ఉన్న సంగతి తెలిసిందే. తొలిసారిగా ఉద్ధవ్ తన నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన తన ఆస్తుల వివరాలు వెల్లడించాల్సి వచ్చింది. తనకు రూ. 143 కోట్ల ఆస్తులున్నట్టు అఫిడవిట్లో తెలిపారు. -
ధర్మశ్రీ చతురత!
చోడవరం: జిల్లాలో చోడవరం నియోజకవర్గం ఓ సంచలనం సృష్టించింది. గతంలో ఎప్పుడూలేని విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు జెడ్పీటీసీ స్థానాలను ఏకగ్రీవం చేయడంలో సీనియర్ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రదర్శించిన చతురుత ప్రత్యర్థి పార్టీ నాయకులకు దిమ్మతిరిగేలా చేసింది. గతంలో టీడీపీకి కంచుకోగా ఉన్న చోడవరం నియోజకవర్గంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయంతో సత్తా చూపిన వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధికంగా ఏకగ్రీవ స్థానాలు దక్కించుకొని మరోసారి ప్రత్యర్థుల స్థానాల్లో పాగా వేసింది. నియోజకవర్గంలో నాలుగు జెడ్పీటీసీ, 77 ఎంపీటీసీ స్థానాలు ఉండగా చరిత్రలో ఎప్పుడూలేని విధంగా రోలుగుంట, రావికమతం మండలాల జెడ్పీటీసీ స్థానాలను ఏకగ్రీవంగా వైఎస్సార్సీపీ దక్కించుకుంది. 11 ఎంపీటీసీ స్థానాలు కూడా ఏకగ్రీవం కాగా మరో 30 స్థానాలు టీడీపీ అభ్యర్థులు విత్‌డ్రా అయ్యేలా చేయడంలో ఎమ్మెల్యే ధర్మశ్రీ చేసిన ప్రయత్నం పార్టీ కేడర్‌లో నూతనుత్సాహాన్ని నింపింది. రోలుగుంట, రావికమతం జెడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకునేలా ఆయన పావులు కదిపి విజయం సా«ధించారు. రోలుగుంట జెడ్పీటీసీ స్థానాన్ని ఏకగ్రీవం చేసుకోగా రావికమతం జెడ్పీటీసీ స్థానం టీడీపీ అభ్యర్థి విత్‌డ్రా అయ్యారు. జనసేన అభ్యర్థి విత్‌డ్రాకు సుముఖత వ్యక్తం చేసినప్పటికీ సమాయానికి ఆయన అందుబాటులో లేకపోవడంతో పోటీ కేవలం నామమాత్రంగానే మారింది. దీనితో జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఈ నియోజకవర్గంలో రెండు జెడ్పీటీసీలను వైఎస్సార్సీపీ దక్కించుకున్నట్టయ్యింది. ఇక చోడవరం, బుచ్చెయ్యపేట జెడ్పీటీసీ స్థానాలు కూడా ఆ పార్టీ దక్కించుకునేలా ధర్మశ్రీ చూపిన చొరవ ఆ పార్టీ విజయానికి చేరువ చేసినట్టుగా ఉంది. నాలుగు మండలాల్లో 80 శాతానికి పైగా ఎంపీటీసీ స్థానాలు దర్కించుకుని నాలుగు ఎంపీపీ స్థానాలు కూడా వైఎస్సార్సీపీ దక్కించుకునేలా ఎమ్మెల్యే ధర్మశ్రీ పావులు కదిపి ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను సైతం తమకు అనుకూలంగా మార్చుకొని సత్తాచాటారు. ధర్మశ్రీ చొరవ వైఎస్సార్సీపీలో నూతనుత్తేజాన్ని నింపింది. స్థానిక ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేస్తామని ఎమ్మెల్యే ధర్మశ్రీ చెప్పారు. -
భారత క్రికెట్లో మళ్లీ ‘దాదా’గిరి!
దాదాపు 20 ఏళ్ల క్రితం... భారత క్రికెట్ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో సౌరవ్ గంగూలీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. అప్పుడే బయటపడ్డ మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం బీసీసీఐ పరువు తీసింది. కెప్టెన్సీ నా వల్ల కాదంటూ సచిన్ స్వచ్ఛందంగా తప్పుకుంటూ కీలక సమయంలో కాడి పడేశాడు. అలాంటి సమయంలో పరిస్థితిని చక్కదిద్దగలడంటూ గంగూలీని నమ్మి బోర్డు బాధ్యతలు అప్పగించింది. కెప్టెన్‌గా తన తొలి వన్డే సిరీస్‌ను గెలిపించడంతో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన సౌరవ్... తదనంతర కాలంలో భారత క్రికెట్ రాత మార్చిన అత్యుత్తమ కెప్టెన్‌గా నిలిచాడు. ఇప్పుడు కూడా... భారత క్రికెట్ పరిపాలన పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదు... ఎన్నికైన ఆఫీస్ బేరర్లతో కాకుండా 33 నెలలుగా సుప్రీం కోర్టు పర్యవేక్షణలో పరిపాలకుల కమిటీ (సీఓఏ) నేతృత్వంలోనే పాలన నడుస్తోంది. అవగాహనలేమి, అనుభవలేమివంటి సమస్యలతో సీఓఏ తీసుకున్న ఎన్నో నిర్ణయాలు క్రికెట్‌ను దెబ్బ తీశాయి. అర్థంపర్థం లేని నిబంధనలు సరైన నిర్ణయాధికార వ్యవస్థ లేకుండా గందరగోళానికి దారి తీశాయి. ఇలాంటి సమయంలో గంగూలీ బోర్డు అధ్యక్షుడిగా వస్తున్నాడు. అభిమానులు ఆత్మీయంగా ‘దాదా’ అని పిలుచుకునే బెంగాలీ బాబు ఇక్కడా తన ముద్ర చూపించగలడా! వేచి చూడాలి. ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని బాగు చేసేందుకు ఇది సరైన సమయంగా భావిస్తున్నట్లు కాబోయే కొత్త అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించాడు. అందు కోసమే ఇక్కడ అడుగు పెట్టినట్లు అతను చెప్పాడు. సోమవారం అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం గంగూలీ మీడియాతో మాట్లాడాడు. అధ్యక్ష పదవి కోసం మరెవరూ నామినేషన్ వేయకపోవడంతో ఏకగ్రీవంగా గంగూలీ ఎంపిక పూర్తయినట్లే. ఈ నేపథ్యంలో వేర్వేరు అంశాలపై తన ఆలోచనలు, ప్రణాళికల గురించి సౌరవ్ వివరించాడు. విశేషాలు అతని మాటల్లోనే... పూర్వ వైభవం తెస్తా... దేశం తరఫున ఆడి కెప్టెన్‌గా కూడా వ్యవహరించిన నాకు ఈ పెద్ద పదవి దక్కడం కూడా గొప్పగా అనిపిస్తోంది. గత మూడేళ్లుగా బీసీసీఐ పరిస్థితి ఏమీ బాగా లేదు. ఇప్పటికే బోర్డు పేరు ప్రఖ్యాతులు బాగా దెబ్బ తిన్నాయి. ఇలాంటి సమయంలో నేను బాధ్యతలు చేపడుతున్నాను. కాబట్టి దీనిని చక్కబెట్టేందుకు నాకు దక్కిన మంచి అవకాశంగా భావిస్తున్నా. వచ్చే కొన్ని నెలల్లో అన్నీ సరిదిద్ది సాధారణ స్థితికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తాం. అపెక్స్ కౌన్సిల్‌లోని నా సహచరులందరితో కలిసి పని చేసి బీసీసీఐకి పూర్వ వైభవం తీసుకొస్తాం. వారి మ్యాచ్ ఫీజు పెంచాలి... ఏవైనా నిర్ణయాలు తీసుకునే ముందు అందరం కలిసి చర్చిస్తాం. అయితే నా మొదటి ప్రాధాన్యత మాత్రం ఫస్ట్ క్లాస్ క్రికెటర్ల బాగోగులు చూడటం గురించే. అప్పట్లో దీని గురించి నేను సీఓఏకు కూడా సూచనలు చేసినా వారు పట్టించుకోలేదు. మన ఫస్ట్ క్లాస్ క్రికెటర్ల ఆర్థిక పరిస్థితి చక్కదిద్దడంపై ముందుగా దృష్టి పెడతా. వారికి లభిస్తున్న మ్యాచ్ ఫీజు మొత్తాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఇదో సవాల్.... ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినా లేక ఏకగ్రీవంగా ఎంపికైనా బాధ్యతలో మాత్రం తేడా ఉండదు. అందులోనూ ప్రపంచ క్రికెట్లో పెద్ద బోర్డుకు నాయకత్వం వహించడం చిన్న విషయం కాదు. ఆర్థికంగా బీసీసీఐ ఎంతో పరిపుష్టమైన వ్యవస్థ కాబట్టి నాకు ఇది సవాల్లాంటిది ఊహించలేదు... నేను బోర్డు అధ్యక్షుడిని అవుతానని ఊహించలేదు. మీరు అడిగినప్పుడు నేను కూడా బ్రిజేష్ పటేల్ పేరే చెప్పాను కానీ నేను పైకి వెళ్లేసరికి అంతా మారిపోయింది. నేను బోర్డు ఎన్నికల్లో ఎప్పుడూ పాల్గొనలేదు కాబట్టి ఇలా కూడా అవకాశం దక్కుతుందని అనుకోలేదు. 10 నెలలకే అధ్యక్ష పదవి నుంచి తప్పుకోనుండటం పట్ల ఎలాంటి బాధ లేదు. అది నిబంధన కాబట్టి పాటించాల్సిందే. నాకు తండ్రిలాంటి జగ్మోహన్ దాల్మియా నిర్వహించిన బాధ్యతలను నేను కూడా చేపట్టగలనని ఎప్పుడూ ఊహించలేదు. గతంలో శ్రీనివాసన్‌లాంటి అనేక మంది వ్యక్తులు సమర్థంగా బోర్డు అధ్యక్షుడి బాధ్యతలు నిర్వర్తించారు. రాజకీయాలు మాట్లాడలేదు... కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీలో ఎలాంటి రాజకీయాలు మాట్లాడలేదు. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ప్రచారం చేయాలని నన్ను ఎవరూ అడగలేదు. నేను ఎలాంటి హామీ ఇవ్వలేదు. నాతో ఏ రాజకీయ నాయకుడు కూడా సంప్రదింపులు జరపలేదు. నాకు అభినందన సందేశం పంపిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కృతజ్ఞతలు. సమర్థుడు కావాలని.... భారత జట్టు కెప్టెన్‌గా ఆడటంకంటే గొప్ప గౌరవానికి మరేదీ సాటి రాదు. 2000లో నేను కెప్టెన్ అయినప్పుడు కూడా ఫిక్సింగ్‌లాంటి సమస్యలు ఉన్నాయి. నేను వాటిని సరిదిద్దగలనని వారు భావించారు. ఇక్కడ అధ్యక్షుడు అయ్యే వ్యక్తి ఆటగాడా, కాదా అనేది అనవసరం. సమర్థుడు కావడం ముఖ్యం. ఐసీసీకి 75–80 శాతం ఆదాయం భారత క్రికెట్ నుంచే వస్తున్నా... గత మూడు నాలుగేళ్లుగా మనకు న్యాయంగా వారి నుంచి ఆశించిన రీతిలో నిధులు రావడం లేదు. దీనికి పరిష్కారం కనుగొంటాం. అదో పెద్ద సమస్య.... పరస్పర ప్రయోజనం (కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్) అనేది ఇప్పుడు ప్రతీ ఒక్కరికి పెద్ద సమస్యగా మారిపోయింది. ఇలా అయితే క్రికెట్ వ్యవస్థలో అత్యుత్తమ వ్యక్తులను తీసుకొచ్చి పని చేయించుకోవడం కష్టమైపోతుంది. వారు వేరే ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తారు. ఒక వ్యక్తికి ఒకే పోస్టు అనే నిబంధన పాటిస్తే మాజీ ఆటగాళ్లెవరూ ముందుకు రారు. ఇక్కడ అడుగుపెట్టిన తర్వాత వారికి ఆర్థిక భద్రత లేకపోతే మనసు పెట్టి ఎలా పని చేస్తారు. -
ఏకగ్రీవంగా రామగుండం మున్సిపల్ ఎన్నికలు
-
ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం
-
ఏదీ ప్రోత్సాహం..?
విజయనగరం మున్సిపాలిటీ: గ్రామ స్వరాజ్యంతోనే దేశ అభివృద్ధి సాధ్యపడుతుందని జాతిపిత ఆశయాలకు నేటి పాలకులు తుంగలోకి తొక్కుతున్నారు. పంచాయతీల అభివృద్ధిపై చిన్న చూపు చూస్తున్నారు. ఎన్నికలు పూర్తయి పాలకవర్గాలు కొలువుదీరి ఏడాది కాలం ముగిసినా ఇప్పటికీ ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలు విడుదల చేయకపోవటం ఇందుకు తార్కాణంగా నిలుస్తోంది. దీంతో ఆయా పంచాయతీల పాలకవర్గాలు నిధులు ఎప్పుడు వస్తాయో అంటూ వేచి చూడాల్సిన పరిస్థితి దాపురించింది. ప్రోత్సాహకాల కోసం ఎదురుచూస్తున్న 129 పంచాయతీలు ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం గతంలో ప్రోత్సాహకాలు అందజేసింది. ఇదే తరహాలో గత ఏడాది జరిగిన పంచాయ తీ ఎన్నికల్లో జిల్లాలోని 129 పంచాయతీల్లో ఓటర్లంతా ఏకగ్రీవంగా పాలకవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే ఆయా పంచాయతీలకు ఇప్పటికీ ప్రోత్సాహకాలు విడుదల కాలేదు. ప్రజాప్రతినిధుల పంచాయతీ పగ్గాలు చేపట్టి సంవత్సరం పూర్తయినప్పటికీ ఈ విషయంపై ప్రభుత్వంలో కనీసం చలనం లేకపోవడం గమనార్హం. దీంతో ఆయా పంచాయతీ పాలకవర్గాలు నిధుల కోసం కళ్లుకాయ లు కాసేలా ఎదురుచూస్తున్నాయి. ఈ విషయంపై జిల్లాస్థాయిలో అధికారులను ప్రశ్నించినా తమకేమీ సమాచారం లేదని... ఏకగ్రీవ పంచాయతీల జాబితాను గతంలో ప్రభుత్వం ఆదేశాలతో పంపించామని సమాధానమిస్తున్నట్లు తెలుస్తోంది. పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకునే ఉద్దేశంతో ఏకగ్రీవంగా పాలకవర్గాలను ఎన్నుకుంటే ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం పట్ల ఆయా పంచాయతీల ప్రజలు తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రూ.5లక్షలు మంజూరు చేస్తే పంచాయతీలో దీర్ఘకాలికంగా పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించుకోవాలన్న వారి కలలు కల్లలగానే మిగిలిపోతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాల విడుదలపై జోక్యం చేసు కోవాలని కోరుతున్నారు. సర్పంచ్ల గౌరవవేతనాలదీ అదే పరిస్థితి ఇదిలా ఉండగా గ్రామ పంచాయతీ ప్రథమ పౌరులైన సర్పంచ్‌లకు ప్రభుత్వం ప్రతి నెలా మంజూరు చేయాల్సిన గౌరవవేతనాలకు అతీగతీ లేదని పలువురు సర్పంచ్‌లు వాపోతున్నారు. మూడేళ్ల ప్రత్యేకాధికారుల పాలన అనంతరం ఎన్నికైన పాలకవర్గాలపై ప్రభుత్వం చిన్న చూపు చూడడం తగదని వాపోతున్నారు. ఈ విషయంపై జిల్లావ్యాప్తంగా 921 పంచాయతీల సర్పంచ్‌లు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.