జైపూర్: కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే రాష్ట్రం నుంచి నామినేషన్ వేసిన బీజేపీ నేతలు చున్నీలాల్ గరాసియా, మదన్ రాథోడ్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం సాయంత్రం ముగిసింది. రాష్ట్రంలో మూడు స్థానాలకు బరిలో ముగ్గురే మిగలడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది.
లోక్‌సభ ఎంపీగా 6 పర్యాయాలు పనిచేసిన సోనియా గాంధీ.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు చెందిన జైపూర్ నుంచి తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. కాగా సోనియా 2006 నుంచి రాయ్‌బరేలీ నుండి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లోనూ అమెథీలో రాహుల్ ఓడిపోయినప్పటికీ సోనియా రాయ్‌బరేలీ స్థానాన్ని గెలుచుకొని ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ గెలుచుకున్న ఏకైక స్థానంగా నిలిచింది.
చదవండి: చండీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Comments
Please login to add a commentAdd a comment