
న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణలోని మూడు రాజ్యసభ స్థానాలల్లోనూ పోటీ చేసిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడు స్థానాల్లోని అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలుపొందినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు మంగళవారం వెల్లడించారు.
తెలంగాణలోని మూడు రాజ్యసభ స్థానాలుకు గాను.. మూడు నామినేషన్లు మాత్రమే దాఖలైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు, బీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఒకరు నామినేషన్ దాఖలు చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్‌ఎస్ పార్టీ నుంచి వద్దిరాజు రవిచంద్రన్ రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా గెలుపొందినట్లు రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారు. ఇక.. రేణుకా చౌదరి రేపు(బుధవారం) గెలుపు ధృవ పత్రాలను అందుకోనున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment