Rajya Sabha polls
-
EC: తెలంగాణ సహా 12 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు..
సాక్షి, ఢిల్లీ: రాజ్యసభ ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీగా ఉన్న 12 రాజ్యసభ స్థానాలకు సీఈసీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇక, తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీ కేశవరావు రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానానికి కూడా ఎన్నికలు జరగనున్నాయి.షెడ్యూల్ ఇలా..సెప్టెంబర్ మూడో తేదీన ఉప ఎన్నికలకు పోలింగ్. అదే సాయంత్రం ఐదు గంటల నుంచి కౌంటింగ్.ఇక, నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 26, 27 చివరి తేదీఅయితే, 12 రాజ్యసభ స్థానాల్లో 11 స్థానాలను ఎన్డీయే కూటమి దక్కించుకునే అవకాశమే ఉంది. తెలంగాణ నుంచి కాంగ్రెస్‌కు ఒక్క స్థానం వచ్చే అవకాశముంది. కాగా, తెలంగాణ నుంచి బీఆర్ఎస్ ఎంపీగా కేశవరావు పార్టీకి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికల జరుగుతోంది. అనంతరం, కేకే కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. Election Commission of India releases notification for the 12 vacant seats of Rajya Sabha. Elections will be held on 3rd September. The last date for withdrawal of nominations is the 26th and 27th of August. pic.twitter.com/1d3SgWivOT— ANI (@ANI) August 7, 2024 -
హిమాచల్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ.. మంత్రి రాజీనామా
సిమ్లా: కాంగ్రెస్ పాలిత హిమాచల్‌ప్రదేశ్‌లో రాజకీయంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మాజీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ కుమారుడు, ప్రస్తుత మంత్రి విక్రమాదిత్య సింగ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా విక్రమాదిత్య సింగ్ మాట్లాడుతూ.. నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను. నా రాజీనామా లేఖను త్వరలో ముఖ్యమంత్రి, గవర్నర్‌కు సమర్పిస్తాను. భవిష్యత్తు కార్యాచరణపై త్వరలో నిర్ణయం తీసుకుంటాను. ప్రస్తుత పరిస్థితుల్లో నేను ప్రభుత్వంలో భాగంగా కొనసాగడం కరెక్ట్ కాదు. అందుకే మంత్రిమండలికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను అని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ హైకమాండ్‌పై ఉంది. #WATCH | Himachal Pradesh Minister Vikramaditya Singh steps down from his position, a day after the Rajya Sabha election result in the state. He says, "All I would like to say is that under the current circumstances, it is not correct for me to continue as a part of the… pic.twitter.com/VNp0nuSfnR — ANI (@ANI) February 28, 2024 ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు మా పార్టీ ఎమ్మెల్యేలను పట్టించుకోలేదు. కాంగ్రెస్ సీనియర్ నేత, మా తండ్రి వీరభద్రసింగ్‌ను కూడా అగౌరవపరిచేలా మాట్లాడారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఎమ్మెల్యేల గొంతులను అణచివేయడం, హైకమాండ్ కూడా సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదని ఫైరయ్యారు. ఇదిలా ఉండగా.. హిమాచల్‌ప్రదేశ్‌రాజ్యసభ ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగి అధికార కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోవడంతో ఇక్కడి ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బీజేపీ ఆట మొదలు పెట్టింది. రాజ్యసభ ఎన్నికల మరుసటి రోజు బుధవారం ఉదయమే రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేత జైరాంఠాకూర్ నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. వెంటనే రాష్ట్ర అసెంబ్లీలో బల పరీక్ష(ఫ్లోర్ టెస్ట్) నిర్వహించాల్సిందిగా బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కోరారు. అనంతరం జైరాం ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడిందని, అందుకే గవర్నర్‌ను కలిసి ఫ్లోర్ టెస్ట్ పెట్టాల్సిందిగా కోరామని తెలిపారు. మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటు వేయడంతో అసెంబ్లీలో ఆ పార్టీ బలం ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సాధారణ మెజారిటీ కంటే దిగువకు పడిపోయింది. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు సమానంగా 34 ఓట్లు వచ్చి ఫలితం టై అయింది. లాటరీ తీయగా బీజేపీ అభ్యర్థి హర్ష్ మహజన్ గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మనుసింఘ్వి ఓటమి పాలయ్యారు. -
బీజేపీ థ్రిల్లింగ్ విక్టరీ.. కాంగ్రెస్‌కు బిగ్గెస్ట్ షాక్!
సిమ్లా: రాజ్యసభ ఎన్నికల్లో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు అయ్యింది. హిమాచల్ ప్రదేశ్‌లో అధికార కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ రాజ్యసభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఓటింగ్‌లో ఫలితం సమం కావడంతో డ్రా కాగా.. టాస్‌లో తమ అభ్యర్థి హర్ష మహాజన్ నెగ్గినట్లు బీజేపీ ప్రకటించుకుంది. దీంతో సంఖ్యా బలం లేకున్నా బీజేపీని అదృష్టం వరించినట్లయ్యింది. అయితే ఈ ఫలితంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. హిమాచల్ ప్రదేశ్ ఒక్క రాజ్యసభ సీటు ఉంది. దీనికి మంగళవారం ఓటింగ్ జరిగింది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 68 ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో కాంగ్రెస్‌కు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు ఉంది. మరోవైపు బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే.. రాజ్యసభ సీటు గెల్చుకోవడానికి అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు కంటే ఐదుగురు కాంగ్రెస్‌కు ఎక్కువే ఉన్నారు. దీంతో కాంగ్రెస్ గెలుపు నల్లేరు మీద నడకే అని అంతా భావించారు. అయితే.. సంఖ్యా బలం లేకున్నా అనూహ్యంగా రాజ్యసభ బరిలో అభ్యర్థిని నిలిపింది బీజేపీ. దీంతో ఓటింగ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇవాళ జరిగిన ఓటింగ్‌లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. అలాగే స్వతంత్ర అభ్యర్థులు కూడా బీజేపీకే ఓటేసినట్లు. దీంతో ఊహించని రీతిలో.. ఫలితం 34-34తో సమం అయ్యింది. డ్రా కావడంతో టాస్ అనివార్యం కాగా.. అందులో తామే నెగ్గినట్లు బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు ప్రతిపక్ష నేత జైరామ్ థాకూర్ ప్రకటన కూడా చేశారు. అయితే.. తమ ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేశారనంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ సర్కార్‌కు ముప్పు.. హిమాచల్ ప్రదేశ్ తాజా పరిణామాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాదంలో పడింది. రాజ్యసభ ఫలితం పరిణామంతో ప్రభుత్వం మెజారిటీలో లేదని స్పష్టమవుతోందని జైరామ్ ఠాకూర్ అన్నారు. ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయాలని ఠాకూర్ డిమాండ్ చేస్తున్నారు. రేపటి బడ్జెట్ సమావేశాల తర్వాత ప్రభుత్వంపై ఫ్లోర్ టెస్ట్ ఒత్తిడికి డిమాండ్ చేస్తామని అన్నారాయన. ఒకవేళ.. అదే జరిగితే రెండేళ్లు తిరగకుండానే హిమాచల్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. అదే విధంగా దేశంలో కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉండగా.. హిమాచల్‌ను కోల్పోతే ఆ సంఖ్య రెండుకే పరిమితం కానుంది. -
జనమంతా జగన్‌తోనే.. టీడీపీ ఖాళీ ఖాయం: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, విజయవాడ: రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని క్లీన్ స్వీప్ చేశామని.. వచ్చే ఎన్నికల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయన బుధవారం ఉదయం అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం సంతోషంగా ఉందన్నారు. టీడీపీని పెద్దల సభలో ఖాళీ చేశామని, మొత్తం స్థానాలు వైఎస్సార్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసిందని తెలిపారు. ఒక్కొక్క సభలో టీడీపీని ఖాళీ చేస్తున్నామని.. త్వరలో లోక్‌సభ, శాసనసభలో కూడా క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పారు.రాజ్యసభ ఎన్నికల్లో సంఖ్యా బలం లేకపోయినా ప్రతిపక్ష టీడీపీ పోటీ చేయాలని భావించిందని కానీ తమ ఎమ్మెల్యేలు అందరూ సీఎం జగన్ పట్ల విశ్వాసంతో ఉండటంతో తాము ఏకగ్రీవంగా గెలవగలిగామని పేర్కొన్నారు. టీడీపీ, కాంగ్రెస్ ప్రలోభాలతో తమ పార్టీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు మళ్ళీ తిరిగివస్తున్నారని, ప్రజా బలం ముందు ప్రలోభాలు పని చేయవని తెలిపారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలలో ఉన్న వారికి రాజకీయ మనుగడ ఉండదని విమర్శించారు. సీఎం జగన్‌తో ఉంటేనే ఎవరికైనా రాజకీయంగా మంచి జరుగుతుందన్నారు. వైఎస్ జగన్‌తోనే జనం ఉన్నారన్నారు. కాగా, రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి వైవీ సుబ్బారెడ్డి, మేడా మల్లిఖార్జునరెడ్డి, గొల్ల బాబూరావు ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ మూడు స్థానాలకు దక్కించుకోవడంతో రాజ్యసభలో వైఎస్సార్సీపీ బలం 11కు చేరుకుంది. చదవండి: విశాఖ బయల్దేరిన సీఎం జగన్ -
TS: మూడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం
న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణలోని మూడు రాజ్యసభ స్థానాలల్లోనూ పోటీ చేసిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడు స్థానాల్లోని అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలుపొందినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు మంగళవారం వెల్లడించారు. తెలంగాణలోని మూడు రాజ్యసభ స్థానాలుకు గాను.. మూడు నామినేషన్లు మాత్రమే దాఖలైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకరు నామినేషన్ దాఖలు చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నుంచి వద్దిరాజు రవిచంద్రన్ రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా గెలుపొందినట్లు రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారు. ఇక.. రేణుకా చౌదరి రేపు(బుధవారం) గెలుపు ధృవ పత్రాలను అందుకోనున్నట్లు తెలుస్తోంది. -
రాజ్యసభకు మోగిన నగారా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే ఏప్రిల్ 2న ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూలు జారీచేసింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 8న జారీచేయనుంది. నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఫిబ్రవరి 15 కాగా.. ఫిబ్రవరి 16న నామినేషన్లను పరిశీలిస్తారు. వాటి ఉపసంహరణకు తుది గడువు ఫిబ్రవరి 20. పోలింగ్‌ను ఫిబ్రవరి 27న ఉ.9 గంటల నుంచి సా.4 గంటల వరకూ నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపును ఫిబ్రవరి 27న సా.5 గంటల నుంచి చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. గతంలో రాష్ట్ర కోటాలో రాజ్యసభకు ఎన్నిౖకైన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (వైఎస్సార్సీపీ), కనకమేడల రవీంద్రకుమార్ (టీడీపీ), సీఎం రమేష్ (బీజేపీ)ల పదవీకాలం ఏప్రిల్ 2తో పూర్తికానుంది. ఖాళీ కానున్న ఈ మూడు రాజ్యసభ స్థానాలకు ఈ ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రస్తుతం శాసనసభలో ఉన్న సంఖ్యా బలాన్ని బట్టి చూస్తే ఈ మూడు రాజ్యసభ స్థానాలూ వైఎస్సార్సీపీ ఖాతాలోకి చేరడం ఖాయం. దీంతో రాష్ట్ర కోటాలో మొత్తం 11 స్థానాలూ వైఎస్సార్సీపీ పరమవుతాయి. అంటే.. ఏప్రిల్ 2 తర్వాత రాజ్యసభలో టీడీపీ ఉనికే లేకుండాపోతోంది. ఆ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటివరకు 41 ఏళ్లలో రాజ్యసభలో టీడీపీకి ప్రాతినిధ్యం లేకుండా పోవడం ఇదే ప్రథమం అవుతుంది. అప్పట్లో ఆ ఎనిమిదీ వైఎస్సార్సీపీకే.. ఇక రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 250 లోపు ఉండాలి. ప్రస్తుతం ఆ సభ్యుల సంఖ్య 245. ఇందులో 233 మందిని దేశంలోని రాష్ట్రాల ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. మిగతా 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. మన రాష్ట్ర కోటాలో రాజ్యసభ సభ్యుల సంఖ్య 11. 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీకి ఇద్దరు.. టీడీపీకి 9 మంది సభ్యులు ఉండేవారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 50 శాతం ఓట్లతో 151 స్థానాల్లో ఘనవిజయం సాధించింది. టీడీపీ 23 స్థానాలకే పరిమితమైంది. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సత్సంబంధాలు నెరిపి.. అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్‌రావు, టీజీ వెంకటేష్‌లను బీజేపీలోకి ఫిరాయించేలా చంద్రబాబు చక్రం తిప్పారు. రాష్ట్ర కోటాలో ఎన్నికైన రాజ్యసభ సభ్యుల్లో 2020లో నలుగురు (టీడీపీ), 2022లో నలుగురు (ముగ్గురు టీడీపీ, ఒకరు వైఎస్సార్సీపీ) పదవీకాలం పూర్తవడంతో ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించింది. అసెంబ్లీలో వైఎస్సార్సీపీకి ఉన్న సంఖ్యాబలం ఆధారంగా ఈ ఎనిమిది స్థానాలు వైఎస్సార్సీపీకే దక్కాయి. ఇందులో నలుగురు బీసీలను రాజ్యసభకు పంపి సామాజిక న్యాయమంటే ఇదీ అని దేశానికి సీఎం జగన్ చాటిచెప్పారు. ఒక్కో స్థానం గెలవాలంటే 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు.. మరోవైపు.. రాష్ట్ర కోటాలో ఖాళీకానున్న మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తోంది. టీడీపీ సభ్యుడు గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించడంతో ప్రస్తుతం అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 174కు తగ్గింది. ఇందులో సాంకేతికంగా చూస్తే వైఎస్సార్సీపీ బలం 151.. టీడీపీ బలం 22.. జనసేనకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. వీటిని పరిగణలోకి తీసుకుంటే.. రాజ్యసభకు ఒక స్థానం నుంచి ఎన్నిక కావాలంటే 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. ప్రస్తుతం శాసనసభలో వైఎస్సార్సీపీకి ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే.. మూడు స్థానాలు ఆ పార్టీ ఖాతాలో చేరడం ఖాయం. -
రాజ్యసభ ఓటుకు రూ.25 కోట్లు ఆఫర్ చేశారు: కాంగ్రెస్ ఎమ్మెల్యే
జైపూర్: తన రాజ్యసభ ఓటుకు రూ.25 కోట్లు ఆఫర్ ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర సింగ్ గుఢా. కొద్ది రోజుల క్రితం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తాము చెప్పిన అభ్యర్థికి ఓటు వేయాలని, అందుకు తనకు రూ.25 కోట్లు ఇవ్వజూపారని పేర్కొన్నారు సైనికుల సంక్షేమ శాఖ సహాయ మంత్రి గుఢా. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు రాజస్థాన్‌లో రాజకీయ దుమారానికి దారి తీశాయి. బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) నుంచి 2019లో కాంగ్రెస్‌లో చేరారు రాజేంద్ర. 2020లో సీఎం అశోక్ గెహ్లోత్‌పై తిరుగుబాటు చేయాలంటూ.. రూ.60 కోట్ల ఆఫర్ వచ్చిందన్నారు. అయితే.. ఆ రెండు ఆఫర్లను తాను తిరస్కరించానని పేర్కొన్నారు మంత్రి రాజేంద్ర సింగ్ గూఢా. కానీ, ఏ నేత, పార్టీ పేరును ప్రస్తావించకుండానే ఈ ఆరోపణలు చేశారు. ఝుంఝునులో సోమవారం ఓ ప్రైవేటు పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు మంత్రి. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు..‘ఓ వ్యక్తికి ఓటు వేసేందుకు నాకు రూ.25 కోట్ల ఆఫర్ ఇచ్చారు. అప్పుడు నా భార్యను అడిగాను. డబ్బులు వద్దు మంచి పేరుంటేచాలని నాతో ఆమె చెప్పింది. అలాగే.. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తినప్పుడు.. నాకు రూ.60 కోట్ల ఆఫర్ వచ్చింది. అప్పుడు నా కుటుంబం, నా భార్య, కుమారుడు, కూతురిని అడిగాను. వారు డబ్బులు వద్దని చెప్పారు. అలా ఆలోచించే వారు మీతో ఉంటే అంతా మంచే జరుగుతుంది.’ అని సమాధానమిచ్చారు మంత్రి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ తరపున గెలిచిన ఆరుగులు ఎమ్మెల్యేల్లో రాజేంద్ర గుఢా ఒకరు. 2019లో కాంగ్రెస్‌లో చేరారు. 2020, జులైలో సచిన్ పైలట్ సహా మరో 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసినప్పుడు.. గెహ్లోత్ క్యాంప్‌లోనే ఉన్నారు గుఢా. 2021లో మంత్రివర్గ విస్తరణలో గుఢాకు సహాయ మంత్రి పదవి దక్కింది. తమ ఎమ్మెల్యేలకు కోట్లాది రూపాయలు ఆఫర్ ఇస్తూ తమ ప్రభుత్వాన్ని బీజేపీ అస్తిరపరచాలని చూస్తోందని పలు వేదికల మీదుగా ఆరోపణలు చేశారు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్. ఈ ఏడాది జూన్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. స్వతంత్ర అభ్యర్థి సుభాశ్ చంద్రకు బీజేపీ మద్దతు తెలిపింది. ముగ్గురు కాంగ్రెస్, ఒకరు బీజేపీ నుంచి ఎన్నికయ్యారు. ఇదీ చదవండి: తెరపైకి ‘పౌరసత్వ’ చట్టం.. బూస్టర్ డోస్ పంపిణీ పూర్తవగానే అమలులోకి! -
కాంగ్రెస్ సీనియర్ నేతకు బిగ్ షాక్
న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల్లో 16 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. ఐతే మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానాలో బీజేపీ విజయకేతనం ఎగురవేయగా.. రాజస్థాన్‌లో కాంగ్రెస్ మూడు స్థానాల్లో విజయం సాధించింది. కానీ కాంగ్రెస్‌కి హర్యానాలో ఊహించని షాక్ తగిలింది. హర్యానాలో రెండు స్థానాలకు ఎన్నికలకు జరగగా.. బీజేపీ నుంచి కృష్ణలాల్ పన్వార్ విజయం సాధించగా.. స్వతంత్ర అభ్యర్థి కార్తికేయ శర్మ గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి అజయ్ మాకెన్ ఓటమిని ఎదుర్కొన్నారు. ఐతే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణాయ్ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. ఆయన శర్మకు ఓటేయడంతో ఆ ఓటును అనర్హతగా ప్రకటించారు. కుల్దీప్ వేసిన ఎత్తుగడ అజయ్ మాకెన్ ఓటమికి దారి తీయడంతో పార్టీ ఆగ్రహానికి గురయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ప్రస్తుతం ఉన్న అన్ని పార్టీ పదవుల నుంచి తక్షణమే బహిష్కరించింది. (చదవండి: బీజేపీ ఎమ్మెల్యేపై వేటు పడింది.. ఎందుకో తెలుసా..?) -
ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది
ముంబై: మహారాష్ట్రలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు అధికార మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ ఎన్నికల్లో తమ కూటమి అభ్యర్థిని ఎంవీఏ గెలిపించుకోలేకపోయింది. బీజేపీ మూడు స్థానాల్లో విజయకేతనం ఎగురువేసి అధికార పక్షానికి గట్టి షాక్ ఇచ్చింది. ఎంవీఏ కూటమిలోని కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన తలొక సీట్ దక్కించుకున్నాయి. ఎవరెవరికి ఎన్ని ఓట్లు? ఆరో స్థానానికి జరిగిన పోటీలో బీజేపీకి చెందిన ధనంజయ్ మహాడిక్.. శివసేన అభ్యర్థి సంజయ్ పవార్‌పై విజయం సాధించారు. అధికార, విపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో ఓట్ల లెక్కింపు ఎనిమిది గంటల ఆలస్యంగా ప్రారంభమైంది. శనివారం తెల్లవారుజామున ఫలితాలు వచ్చాయి. ఒక అభ్యర్థి గెలవడానికి 41 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. బీజేపీ నుంచి గెలిచిన పియూష్ గోయల్, డాక్టర్ అనీల్ బోండేలకు 48 ఓట్ల చొప్పున వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ ప్రతాప్ఘరీకి 44, ఎన్సీపీ అభ్యర్థి ప్రఫుల్ పటేల్‌కు 43 ఓట్లు, శివసేన అభ్యర్థి సంజయ్ రౌత్ 41 దక్కించుకున్నారు. ధనంజయ్ మహాడిక్ 41.56 ఓట్లతో విజయం సాధించారు. బీజేపీ విజయం చాలా చిన్నది ఆరో స్థానంలో పోటీ చేసిన ధనంజయ్ మహాడిక్ గెలిచారని తాము భావించడం లేదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. తమ అభ్యర్థి సంజయ్ పవార్‌కు 33 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయని, మహాడిక్ 27 ఓట్లు మాత్రమే తెచ్చుకున్నారని వెల్లడించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో బీజేపీ అభ్యర్థి గట్టెక్కారని ఎద్దేవా చేశారు. బీజేపీ విజయం చాలా చిన్నదని వ్యాఖ్యానించారు. ట్రైలర్ మాత్రమే.. సినిమా ముందుంది.. రాజ్యసభ ఎన్నికల ఫలితాలపై బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తనదైన శైలిలో స్పందించారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని అసలు సినిమా ముందు ఉందని వ్యాఖ్యానించారు. హనుమాన్ చాలీసాను అవమానించిన వారు ఓడిపోయారని.. దానిని గౌరవించి, దాని కోసం పోరాడిన వారు గెలిచారని అన్నారు. ‘ఎన్నికలు కేవలం పోరాటం కోసమే కాదు గెలుపు కోసమే. జై మహారాష్ట్ర’ అంటూ ట్వీట్ చేశారు. శివసేన నుంచి గెలిచిన సంజయ్ రౌత్ కంటే ఆరో స్థానంలో విజయం సాధించిన తమ అభ్యర్థికే ఎక్కువ ఓట్లు వచ్చాయని వెల్లడించారు. (క్లిక్: బీజేపీ ఎమ్మెల్యే సస్పెండ్.. ఎందుకో తెలుసా..?) ఫడ్నవీస్‌కు పెద్దాయన ప్రశంస రాజ్యసభ ఎన్నికల్లో దేవేంద్ర ఫడ్నవీస్ అద్భుతం చేశారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రశంసించారు. స్వతంత్ర ఎమ్మెల్యేలను ప్రత్యర్థి శిబిరాల నుండి ‘విభిన్న మార్గాల’ ద్వారా దూరం చేసి ‘అద్భుతం’ చేశారని కొనియాడారు. ఆరో స్థానంలో శివసేన అభ్యర్థి ఓడిపోడం తనకు ఆశ్చర్యం కలిగించలేదని పేర్కొన్నారు. సంఖ్యా బలం లేకపోయినప్పటికీ ఆరో సీటును గెలవడానికి తమ కూటమి సాహసోపేతమైన ప్రయత్నం చేసిందన్నారు. అయితే తమ కూటమి నుంచి ఒక్క ఓటు కూడా బీజేపీకి పడలేదని, స్వతంత్రులను బీజేపీ తమవైపు తిప్పుకోవడం వల్లే విజయం సాధ్యమైందని వెల్లడించారు. రాజ్యసభ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలోని ఎంవీఏ ప్రభుత్వ స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తాయా అన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు జవాబిస్తూ.. అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాదని శరద్ పవార్ స్పష్టం చేశారు. (క్లిక్: బీజేపీకి బూస్ట్.. కాంగ్రెస్‌కు ఊహించని షాక్) -
బీజేపీ ఎమ్మెల్యే సస్పెండ్.. ఎందుకో తెలుసా..?
నాలుగు రాష్ట్రాల్లో 16 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు బీజేపీకి మరింత బలానిచ్చాయి. 16 స్థానాల్లో బీజేపీ 8 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యే, జేడీఎస్ ఎమ్మెల్యే క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. ఇదిలా ఉండగా.. రాజస్తాన్ రాజ్యసభ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి షాక్ తగిలింది. రెండు స్థానాల్లో బీజేపీ పోటీ చేయగా కేవలం ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది. కాగా, ధోల్పూర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే శోభారాణి కుశ్వాహా క్రాస్ ఓటింగ్‌కు పాల్పడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ ఎమ్మెల్యే అయిన శోభారాణి.. కాంగ్రెస్ అభ్యర్థి ప్రమోద్ తివారీకి ఓటు వేశారు. దీంతో తివారీ విజయాన్ని అందుకున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం శోభారాణిని సస్పెండ్ చేస్తూ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. క్రాస్ ఓటింగ్ సంబంధించి తనపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. మరోవైపు.. 2020లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కూడా శోభారాణి ఇలాగే క్రాస్ ఓటు వేశారు. ఆ సమయంలో పొరపాటున ఓటు వేసినట్టు చెప్పడంతో బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ, ఈసారి కూడా క్రాస్ ఓటు వేయడంతో వేటు పడింది. ఇక, రాజస్తాన్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు రన్‌దీప్ సుర్జేవాలా, ముకుల్ వాస్నిక్, ప్రమోద్ తివారీ విజయం సాధించారు. The disciplinary committee of the BJP has suspended Rajasthan MLA Shobha Rani for cross-voting in favour of Congress candidate Pramod Tiwari in Rajya Sabha elections and sought her reply for defying the party's whip. #RajyaSabhaElections2022 #RajyaSabha #RajyaSabhaElection pic.twitter.com/8s1dej3vvH — First India (@thefirstindia) June 11, 2022 ఇది కూడా చదవండి: కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ -
Rajya Sabha Result: బీజేపీకి బూస్ట్.. కాంగ్రెస్‌కు ఊహించని షాక్
నాలుగు రాష్ట్రాల్లో 16 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని అందుకుంది. మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానాలో బీజేపీ సత్తా చాటగా.. రాజస్థాన్‌లో కాంగ్రెస్ మూడు స్థానాల్లో విజయం సాధించింది. ఇదిలా ఉండగా.. హర్యానా రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఊహించని షాక్ తగిలింది. మాజీ మంత్రి అజయ్ మాకెన్ ఓటమిని చవిచూశారు. రెండు స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. బీజేపీ నుంచి కృష్ణలాల్ పన్వార్ విజయం సాధించగా.. స్వతంత్ర అభ్యర్థి కార్తికేయ శర్మ గెలుపొందారు. అజయ్ మాకెన్‌కు 29 ఓట్లు రాగా.. కార్తికేయ శర్మ 29.6 ఓట్లు పోలయ్యాయి. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణాయ్ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. ఆయన శర్మకు ఓటేయడంతో ఆ ఓటును అనర్హతగా ప్రకటించారు. మరో వైపు శర్మకు బీజేపీ, జేజేపీ నుంచి మద్దతు లభించడంతో విజయాన్ని అందుకున్నారు. మరోవైపు.. మహారాష్ట్రలో శివసేన కూటమికి బిగ్ షాక్ తగిలింది. మహారాష్ట్రలో ఆరు స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. మూడు స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. ఇక, నేషనలిస్ట్ పార్టీ(ఎన్సీపీ) నుంచి ప్రఫుల్ పటేల్, కాంగ్రెస్ నుంచి ఇమ్రాన్ ప్రతాప్ఘరీ, శివసేన నుంచి సంజయ్ రౌత్ విజయం సాధించారు. మరోవైపు.. బీజేపీ నుంచి కేంద్రమంత్రి పియూష్ గోయల్, అనిల్ బోండే, ధనంజయ్ మహాదిక్ ఎన్నికయ్యారు. మొత్తంగా 16 స్థానాలకు ఎన్నికలు జరుగగా.. బీజేపీ 8 స్థానాల్లో విజయాన్ని అందుకుంది. కాంగ్రెస్ 5 స్థానాల్లో గెలుపొందింది. Rajya Sabha polls: Jolt to Congress, #AjayMaken loses in Haryana ⤵️#RajyaSabhaElection2022 pic.twitter.com/sdMTdhi1Bt — editorji (@editorji) June 11, 2022 ఇది కూడా చదవండి: రాజస్థాన్‌లో కాంగ్రెస్ గెలుపు, ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్! -
Rajya Sabha Results: కర్నాటకలో బీజేపీ ఘన విజయం
కర్నాటకలో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీ ఘన విజయం సాధించింది. శుక్రవారం జరిగిన పోలింగ్‌లో బీజేపీ అభ్యర్థులు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్, ఎమ్మెల్సీ లేహర్ సింగ్ సిరోయా, జగ్గేశ్ విజయం సాధించారు. ఒక్క స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి జైరాం రమేష్ విజయాన్ని అందుకున్నారు. Congratulations madam 💐@nsitharaman @BSYBJP @BSBommai @blsanthosh pic.twitter.com/6Tz5KEY4dD — bhagath chinamalli / ಭಗತ್ ಚಿನಮಳ್ಳಿ (@bbcbhagath) June 10, 2022 ఇది కూడా చదవండి: రాజస్థాన్‌లో కాంగ్రెస్ గెలుపు, ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల క్రాస్‌ఓటింగ్! -
రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేసిన జేడీఎస్ ఎమ్మెల్యే.. కారణం ఏంటంటే!
బెంగళూరు: కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో జేడీఎస్ ఎమ్మెల్యే కే శ్రీనివాస గౌడ కాంగ్రెస్‌కు ఓటు వేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఓటింగ్‌లో పాల్గొని వస్తుండగా ఆయన మీడియాతో మాట్లాడారు. తాను కాంగ్రెస్‌కు ఓటు వేసినట్లు, ఆ పార్టీపై ఇష్టం, అభిమానంతోనే ఓటు వేశానని స్పష్టం చేశారు మరోవైపు కాంగ్రెస్ పార్టీపై కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ బేరసారాలు ఆడుతోందని ఆరోపించారు. జేడీఎస్‌కు ఓటు వేయొద్దని కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య తమ పార్టీ ఎమ్మెల్యేలపై ఒత్తడి తీసుకువస్తున్నారని అన్నారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసేలా ప్రేరేపించారని మండిపడ్డారు. జేడీఎస్ ఎమ్మెల్యేలు తనతో సంప్రదింపులు జరుపుతున్నారని సిద్ధరామయ్య కూడా ఇటీవలే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. చదవండి: సిగ్నల్ జంప్! పైగా నా కారే ఆపుతావా? అంటూ పోలీసులపై ఎమ్మెల్యే కుమార్తె చిందులు జేడీఎస్ ఎమ్మెల్యేలకు సిద్ధరామయ్య ఓ లేఖ రాశారని వస్తున్న వార్తలపై కూడా కుమారస్వామి స్పందించారు. ‘సిద్ధరామయ్య స్థానిక మీడియాతో మాట్లాడుతూ జేడీఎస్ ఎమ్మెల్యేలకు తాను లేఖ రాయలేదని చెప్పారు. కానీ ఇప్పటికే ఆ లేఖను సిద్ధరామయ్య ట్విటర్లోనూ పోస్ట్ చేరు. నిన్న లేఖ రాశానని చెప్పిన సిద్ధరామయ్య నేడు రాయలేదని అంటున్నారు. తన మాటలను ఆయనే కొట్టిపారేస్తున్నారు. ఈ తీరు ఆయన ద్వంద్వ వైఖరిని తెలియజేస్తుంది’ అని మండిపడ్డారు. #WATCH | I have voted for Congress because I love it: K Srinivasa Gowda, Karnataka JD(S) leader on Rajya Sabha elections pic.twitter.com/oMSkdlYSuQ — ANI (@ANI) June 10, 2022 -
రాజ్యసభ ఎన్నికలు: ఆ రాష్ట్రంలో ఒక స్థానానికే పరిమితమైన బీజేపీ
► కర్నాటకలో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ నుంచి నిర్మలా సీతారామన్, ఎమ్మెల్సీ లేహర్ సింగ్ సిరోయా, నటుడు జగ్గేశ్ విజయం సాధించగా.. కాంగ్రెస్ నుంచి జైరాం రమేష్ విజయాన్ని అందుకున్నారు. ► రాజస్థాన్‌లో బీజేపీ నుంచి ఘనశ్యామ్ తివారీ గెలుపొందగా, కాంగ్రెస్ నుంచి రణ్‌దీప్ సుర్జేవాలా, ముకుల్ వాస్నిక్, ప్రమోద్ తివారీలు విజయం సాధించారు. ► రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా రాజస్థాన్ ఫలితాల్లో కాంగ్రెస్ మూడు స్థానాల్లో, బీజేపీ ఒక స్థానంలో గెలుపొందింది. జీ మీడియా అధినేత సుభాష్ చంద్ర పరాజయం చవిచూశారు. ►కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్తాన్, హరియాణాల నుంచి 16 రాజ్యసభ సీట్లకు జరిగిన ఎన్నికల ఓటింగ్ ముగిసింది. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు ఓటింగ్ ముగియగా, ఐదు గంటల నుంచి కౌంటిగ్ ప్రారంభమైంది. దాంతో ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ►మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే ముక్తా తిలక్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, ఆమె క్యాన్సర్‌తో బాధపడుతూ ఆసుప్రతిలో చికిత్స పొందుతోంది. మహారాష్ట్రలో రాజ్యసభ ఎన్నికల దృష్ట్యా ఆమె.. ఆసుపత్రి నుంచి అంబులెన్స్‌లో ఓటు వేసేందుకు వచ్చారు. ఆమె స్ట్రెచర్‌పై నుంచి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ► కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికల్లో జేడీఎస్ ఎమ్మెల్యే కే శ్రీనివాస గౌడ కాంగ్రెస్‌కు ఓటు వేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఓటింగ్‌లో పాల్గొని వస్తుండగా ఆయన మీడియాతో మాట్లాడారు. తాను కాంగ్రెస్‌కు ఓటు వేసినట్లు, ఆ పార్టీపై ఇష్టం, అభిమానంతోనే ఓటు వేశానని స్పష్టం చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లోని 16 రాజ్యసభ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ► తమ 13 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో ఉన్నారని ఆ పార్టీలో చేరిన మాజీ బీఎస్పీ ఎమ్మెల్యే రాజేంద్ర గూడ తెలిపారు. తమకు 126 ఓట్లు ఉన్నాయని, ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ► మహా వికాస్ అఘాడికి చెందిన నలుగురు అభ్యర్థులు గెలుస్తారని, విజయంపై తమకు పూర్తి నమ్మకం ఉందని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ తెలిపారు. ► అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఎంఐఎం ఎమ్మెల్యేలు మహారాష్ట్రలో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయనున్నట్లు వెల్లడించారు. శుక్రవారం జరగనున్న మహారాష్ట్ర నంఉచి రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయాలని ఆల్ ఇండియా మజ్లిస్-ఈ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) నిర్ణయించింది. న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల్లోని 16 రాజ్యసభ సీట్లకు జరగనున్న ఎన్నికల్లో ప్రలోభాల ఆరోపణలతో రిసార్టులు, హోటళ్లలో మకాం వేసిన వివిధ పార్టీల ఎమ్మెల్యేలు నేడు బయటకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ప్రత్యేక పరిశీలకులను నియమించి, పోలింగ్ ప్రక్రియను ఆసాంతం వీడియో రికార్డు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్తాన్, హరియాణాల నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్న ప్రముఖుల్లో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయెల్, కాంగ్రెస్ నేతలు రణ్‌దీప్ సూర్జేవాలా, జైరాం రమేశ్, ముకుల్ వాస్నిక్, శివసేన కీలక నేత సంజయ్ రౌత్ తదితరులున్నారు. ఎన్నికల్లో వీరి గెలుపు ఖాయమని భావిస్తున్నారు. మొత్తం 57 రాజ్యసభ స్థానాలకు గాను ఉత్తరప్రదేశ్, తమిళనాడు, బిహార్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, చత్తీస్‌గఢ్, పంజాబ్, తెలంగాణ, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుంచి 41 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు గత వారం ఈసీ ప్రకటించింది. నాలుగు రాష్ట్రాల్లోని మిగతా 16 సీట్లకు గాను పోటీ తీవ్రంగా ఉంది. ఓపెన్ బ్యాలెట్ విధానంలో ఓటింగ్ నిర్వహిస్తారు. రాజ్యసభ ఎన్నికల్లో నోటా ఆప్షన్ ఉండదు. #RajyaSabhaElections | "We are going to win comfortably": Rajasthan Chief Minister Ashok Gehlot#ElectionsWithNDTV pic.twitter.com/WFqElMOdiC — NDTV (@ndtv) June 10, 2022 తీవ్ర పోటీ ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న మహారాష్ట్ర, రాజస్థాన్‌లో 4 స్థానాలకు తీవ్ర పోటీ నెలకొంది. దీంతో ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు తమ ఎమ్మెల్యేలను రిసార్ట్‌లకు తరలించారు. మహారాష్ట్రలో అత్యధికంగా 6 సీట్లకు, కర్ణాటకలో 5, రాజస్థాన్‌లో 5, ఇక హర్యానాలో 2 సీట్లకు ఓటింగ్ జరగనుంది. కాగా జూలైలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలు ప్రాధాన్యత సంతరించున్నాయి. ఇప్పుడు గెలుపొందిన వారు రాష్ట్రపతి ఎన్నికల్లోఓటు వేయనున్నారు. కాగా అత్యధికంగా చదవండి: రాజ్యసభ ఎన్నికల ఉత్కంఠ; రిసార్ట్‌కు ఎమ్మెల్యేల తరలింపు -
రాజ్యసభ ఎన్నికలు.. జోరందుకున్న బేరసారాలు!
సాక్షి, ముంబై: రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వివిధ పార్టీల, స్వతంత్ర ఎమ్మెల్యేలతో ప్రధాన పార్టీల ప్రతినిధులు రహస్యంగా మంతనాలు జరపడం, ఓట్ల కొనుగోలు కోసం బేరసారాలు చేయడం జోరందుకున్నట్లు తెలుస్తోంది. కొందరు ప్రత్యక్షంగా, మరికొందరు పరోక్షంగా సమావేశాల్లో పాల్గొంటున్నారు. అంతేగాకుండా ఓట్లు చీలిపోకుండా ప్రధాన రాజకీయ పార్టీలు తమతమ ఎమ్మెల్యేలతో, చిన్నాచితక పార్టీలు, ఇండిపెండెంటు ఎమ్మెల్యేలతో వేర్వేరుగా చర్చలు జరుపుతున్నాయి. ఈనెల 10న ఆరు రాజ్యసభ స్ధానాలకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. కానీ ఆరు స్ధానాలకుగాను ఏడుగురు అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో పేచీ మొదలైంది. ఇందులో బీజేపీ తరఫున (ముగ్గురు) కేంద్ర రైల్వే మంత్రి పీయుష్ గోయల్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి, విదర్భకు చెందిన డాక్టర్ అనీల్ బోండే, కొల్హాపూర్‌కు చెందిన మాజీ ఎంపీ ధనంజయ్ మహాడిక్, శివసేన తరఫున (ఇద్దరు) సంజయ్ రావుత్, సంజయ్ పవార్, ఎన్సీపీ తరఫున (ఒక్కరు) ప్రఫుల్ పటేల్, కాంగ్రెస్ తరఫున (ఒక్కరు) ఇమ్రాన్ ప్రతాపగడి ఇలా ఏడుగురు బరిలో ఉన్నారు. నామినేషన్ ఉపసంహరించుకునేందుకు ఇచ్చిన గడువు చివరి నిమిషం వరకు ఇరు పార్టీల నాయకుల మధ్య చర్చలు జరిగాయి. అభ్యర్థి ఉపసంహరణకోసం ఒకరికొకరు ఆఫర్లు ప్రకటించుకున్నారు. అయినప్పటికీ చర్చలు విఫలం కావడంతో ఎన్నికలు అనివార్యమయ్యా యి. దీంతో ఆరో అభ్యర్ధిని గెలిపించుకోవడానికి ఇటు బీజేపీ, అటు శివసేన తమ ప్రతిష్టను ఫణంగా పెడుతున్నాయి. ఎలాగైనా తమ అభ్యర్ధిని గెలిపించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ నేతృత్వంలోని మహావికాస్ ఆఘాడికి చెందిన ఎమ్మెల్యేలతో చర్చించేందుకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ముంబైలోని ఫైవ్‌స్టార్ హోటల్ ట్రయ్డెంట్లో మంగళవారం ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కొందరు ఇండిపెండెంటు ఎమ్మెల్యేలు కూడా హాజరు కానున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. చదవండి: నోట్లపై గాంధీ బొమ్మ బదులు.. ఆర్బీఐ క్లారిటీ బీజేపీ మూడో అభ్యర్థితో మొదలైన కాక... బీజేపీ మూడో అభ్యర్ధిని బరిలో దింపడంతో 24 ఏళ్ల తరువాత రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న విషయం విదితమే. లేని పక్షంలో ఆరుగురు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికై రాజ్యసభకు వెళ్లేవారు. బీజేపీ కారణంగా ఈ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. దీంతో అన్ని ప్రధాన పార్టీలు తమ పరువు, ప్రతిష్టను ఫణంగా పెడుతున్నాయి. ఎక్కడ తమ ఎమ్మెల్యేలు అమ్ముడుపోతారోనని భయం పట్టుకుంది. దీంతో ఎమ్మెల్యేలు చీలిపోకుండా ఎన్నికలకు రెండు రోజుల ముందే తమ పార్టీ ఎమ్మెల్యేలందరినీ ఓ రహస్య స్థావరానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరితో సంప్రదింపులు జరపకుండా, బయట ప్రపంచంతో సంబంధం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఎన్నికలు జరిగే రోజు వరకు ఎమ్మెల్యేలందరూ ఎక్కడ బస చేశారనే విషయం బయటకు పొక్కకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముంబై చేరుకున్న అశ్వినీ వైష్ణవ్ రాష్ట్రంలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల పనులు పర్యవేక్షించేందుకు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను బీజేపీ నియమించింది. దీంతో వైష్ణవ్ ఆదివారమే ముంబైకి చేరుకున్నారు. మూడో అభ్యర్ధిని గెలిపించుకునేందుకు రచించాల్సిన వ్యూహంపై కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైష్ణవ్‌తోపాటు కేంద్ర వాణిజ్య మంత్రి, రాజ్యసభ బీజేపీ అభ్యర్ధి పీయూష్ గోయల్, ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ తదితర కీలక నేతలు హాజరయ్యారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ సమావేశం ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కు చెందిన సాగర్ బంగ్లాలో జరగాల్సి ఉంది. కానీ ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో బీజేపీ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించారు. కరోనా కారణంగా ఫడ్నవీస్ ప్రత్యక్షంగా హాజరు కాలేకపోయినప్పటికీ ఆన్లైన్లో పాల్గొన్నారు. చదవండి: బెడిసికొట్టిన ఏకగ్రీవం.. రాష్ట్రంలో 24 ఏళ్ల తరువాత రాజ్యసభ ఎన్నికలు -
బెడిసికొట్టిన ఏకగ్రీవం.. రాష్ట్రంలో 24 ఏళ్ల తరువాత రాజ్యసభ ఎన్నికలు
సాక్షి, ముంబై: రాజ్యసభ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవడంతో మహారాష్ట్రలో ఏకంగా 24 ఏళ్ల తరువాత ఎన్నికలు జరుగుతున్నాయి. గత 24 ఏళ్ల నుంచి అధికార, ప్రతిపక్షాలు సమన్వయంతో రాజ్యసభ సభ్యులను ఏకగ్రీవంగానే ఎన్నుకుంటూ వస్తున్నాయి. కానీ ఈసారి బీజేపీ, శివసేన మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్ధితి నెలకొంది. దీంతో ఇరు పార్టీల నేతలు చర్చలు జరిపారు. ఒకరికొకరు ఆఫర్లు ఇచ్చుకున్నప్పటికీ వెనక్కి తగ్గకపోవడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఫలితంగా రాజ్యసభ ఎన్నికల పోరు మరింత రసవత్తరమైంది. కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు గడువు విధించింది. ఆలోపు చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు మహావికాస్ ఆఘాడి సీనియర్ నేతలు ఛగన్ భుజబల్, సునీల్ కేదార్ తదితరులు ప్రతిపక్షనేత దేవేంద్ర ఫడ్నవీస్ నివాసమైన సాగర్ బంగ్లాలో చర్చలు జరిపారు. అయినప్పటికీ బీజేపీ, శివసేన నామినేషన్లు ఉపసంహరించుకోకపోవడంతో ఎన్నికలు అనివార్యమైన సంగతి తెలిసిందే. రాజ్యసభకు అభ్యర్ధులను మూజువాణి ఓటు పద్ధతిలో ఎన్నుకోవాలని చట్టం రూపొందించిన తరువాత ఎన్నికలు జరగడం ఇదే ప్రథమం. 1998లో రాజ్యసభ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ పద్ధతిలో జరిగాయి. ఇప్పుడు ఏకంగా 24 ఏళ్ల తరువాత మొదటిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. చదవండి: అక్కడ బడికి పోతే బస్సెక్కినట్లే.. ఎందుకంటే! మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్ధానాలున్నాయి. అందులో ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లిన ముంబైలోని తూర్పు అంధేరీ నియోజక వర్గం శివసేన ఎమ్మెల్యే రమేశ్ లట్కే గుండెపోటుతో అక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో రమేశ్ స్ధానం ఖాళీగా ఉండటంతో ప్రస్తుతం అసెంబ్లీలో 287 మంది సభ్యులున్నారు. మహారాష్ట్రకు చెందిన ఆరు రాజ్యసభ స్ధానాలకు ఈ నెల 10న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. బీజేపీ, శివసేన ఇద్దరు చొప్పున, కాంగ్రెస్, ఎన్సీపీ ఒక్కొక్కరు చొప్పున ఇలా ఆరుగురు సభ్యులు నామినేషన్లు వేయాల్సి ఉంది. కానీ అసెంబ్లీలో తమకు సంఖ్యా బలం ఎక్కువ ఉందని భావించిన బీజేపీ మూడో అభ్యర్ధిని బరిలో దింపింది. కేవలం 11–12 ఓట్లు తక్కువవుతున్నాయి. ఎలాగైనా ఆ ఓట్లను రాబట్టుకుని మూడో అభ్యర్ధిని గెలిపించుకుంటామని బీజేపీ స్పష్టం చేసింది. దీంతో ఓట్ల కొనుగోలుపై భారీగా ఆర్ధిక లావాదేవీలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో తమ ఎమ్మెల్యేలు అమ్ముడుపోకుండా మహావికాస్ ఆఘాడి ప్రభుత్వానికి చెందిన మంత్రులు, నేతలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మహావికాస్ ఆఘాడి ప్రభుత్వంలో మిత్రపక్షాలైన శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీకి చెందిన ఎమ్మెల్యేలందరినీ ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ముంబైలోని ఓ రహస్య ప్రాంతంలో ఒకే చోట ఉంచనున్నారు. ఓట్లు చీలిపోకుండా, బేరమాడకుండా సెల్ఫోన్లో జరిగే సంభాషణలపై కూడా దృష్టిసారించనున్నారు. బీజేపీ, శివసేన ఇరు పార్టీలు ఓ అభ్యర్థిని ఉప సంహరించుకోకపోవడంతో ఆరో అభ్యర్ధి గెలుపు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఆరో అభ్యర్ధిని గెలిపించుకునేందుకు బీజేపీ, శివసేన తమ ప్రతిష్టను ఫణంగా పెట్టాయి. అసెంబ్లీలో బలాబలాలు... రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్ధానాలుండగా అందులో బీజేపీ–106, శివసేన–55, ఎన్సీపీ–54, కాంగ్రెస్–44 మొత్తం 259 ఎమ్మెల్యేలున్నారు. మిగతా చిన్న చితకా పార్టీలకు చెందిన 16 మంది ఎమ్మెల్యేలు, 13 మంది ఇండిపెండెంట్లు ఇలా 29 మందితో కలిసి మొత్తం 288 మంది ఉన్నారు. ఇందులో బహుజన్ వికాస్ ఆఘాడి–3, ఎంఐఎం–2, సమాజ్‌వాది పార్టీ–2, ప్రహార్ జనశక్తి పార్టీ–2, ఎమ్మెన్నెస్–1, ఆర్ఎస్పీ–1, క్రాంతికారి శేత్కరీ పార్టీ–1, జనసురాజ్య పార్టీ–1, కమ్యూనిస్టు పార్టీ–1, శేత్కరి కామ్‌గార్ పార్టీ–1, సీపీఐ (ఎం)–1 ఇలా మొత్తం 16 చిన్నాచితకా పార్టీల ఎమ్మెల్యేలున్నారు. వీరంతా ఎవరికి మద్దతునిస్తారన్న దానిపై రాజ్యసభ సభ్యుల భవిత ఆధారపడి ఉంది. -
సాక్షి కార్టూన్: 03-06-2022
హోటల్ కూడా సేఫ్ కాదని ఇలా ఏర్పాటు చేశాన్సార్! -
రాష్ట్ర ప్రయోజనాలను కాపాడతా
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తానని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ అనుబంధ విభాగాల ఇన్చార్జ్ వేణుంబాక విజయసాయిరెడ్డి చెప్పారు. తనపై నమ్మకం ఉంచి రాజ్యసభకు రెండోసారి ఎంపిక చేసినందుకు సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతిరెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభలో రాష్ట్ర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన నివాసంలో మంగళవారం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం తనపై పెట్టిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని తెలిపారు. సీఎం ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతానని చెప్పారు. వచ్చే నెల నాటికి రాజ్యసభలో మొత్తం 9 మంది వైఎస్సార్సీపీ సభ్యులు ఉంటే.. వారిలో ఐదుగురు బీసీలేనన్నారు. దీన్ని బట్టి బీసీలకు సీఎం జగన్ ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ఇట్టే తెలుసుకోవచ్చన్నారు. బీసీలతోపాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారన్నారు. సమాజంలో మిగిలిన వర్గాలతో సమానంగా బడుగు, బలహీనవర్గాలను నడిపించాలన్న బలమైన ఆకాంక్ష సీఎం జగన్‌కు ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్.కృష్ణయ్య తెలంగాణకు చెందిన నేత అయినప్పటికీ ప్రాంతం చూడకుండా ఆయనను రాజ్యసభకు ఎంపిక చేశారని తెలిపారు. బీసీలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానంలోకి తీసుకురావాలన్న ఆశయంలో భాగంగానే కృష్ణయ్యకు అవకాశమిచ్చారన్నారు. అభ్యర్థి ఎక్కడ వారన్నది అంత ముఖ్యం కాదని.. వారు బడుగు, బలహీనవర్గాల ప్రయోజనాలు.. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడగలరా అనేది ముఖ్యమన్నారు. -
హైడ్రామా.. కాంగ్రెస్ కొంప ముంచిన ఎమ్మెల్యేలు
అస్సాంలో రాజ్యసభ ఎన్నికల్లో అసలైన రాజకీయం కనిపించింది. ఉన్న రెండు రాజ్యసభ సీటులను బీజేపీ, దాని మిత్రపక్షాలు కైవసం చేసుకున్నాయి. ఓ ఎమ్మెల్యే చేసిన పనితో కాంగ్రెస్ కొంప నిండా మునిగింది. దీంతో ఆ ఎమ్మెల్యేపై తక్షణ చర్యలు తీసుకుంది పార్టీ. ఇంతకీ ఆయన ఏం చేశాడో తెలుసా? గురువారం అస్సాం శాసనసభలో.. రెండు రాజ్యసభ సీట్ల కోసం ఓటింగ్ జరిగింది. ఒక సీటును బీజేపీ అభ్యర్థి పవిత్ర మార్గేరీటా ఏకపక్షంగా దక్కించుకోగా.. రెండో సీటు రసవత్తరమైన రాజకీయం నడిచింది. రూపిన్ బోరా(కాంగ్రెస్ తరపున), బీజేపీ అభ్యర్థి నర్జారీ(యూపీపీఎల్ అభ్యర్థి) రెండో సీటు కోసం పోటీ పడ్డారు. ఈ పోటీలో ఏఐయూడీఎఫ్(ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్) బోరాకు మద్ధతు ఇచ్చింది. ఈ సీటు గెలవాలంటే.. అభ్యర్థికి 43 సీట్లు వస్తే సరిపోతుంది. మొత్తం ఓట్లలో.. అధికార బీజేపీ దాని మిత్రపక్షాల కూటమికి 83 ఓట్లు ఉన్నాయి. ఇందులో పవిత్ర మార్గరీటా కోసం సరిపడా ఓట్లు బీజేపీకి అప్పటికే ఉన్నాయి. అయితే నర్జారీ కోసం మాత్రం మూడు ఓట్లు తక్కువ అయ్యాయి. ఇక ప్రత్యర్థి కూటమికి 44 ఓట్లు ఉన్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే తన ఓటును వేస్ట్ చేశాడు. ఓటు వేయడానికి క్యూలో నిల్చున్న సీఎం హిమంత బిస్వా శర్మ(కుడి నుంచి నాలుగో వ్యక్తి) ఓటింగ్ టైంలో బ్యాలెట్ పేపర్ మీద One అని రాయకుండా 1 అని నెంబర్ వేశాడు. దీంతో ఆ ఓటు పనికి రాకుండా పోయింది. ఈ చర్యకు ప్రతిగా విప్ ఉల్లంఘించినందుకు కాంగ్రెస్ పార్టీ అతన్ని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే తానేమీ ద్రోహం చేయలేదని, ఈ విషయంపై హైకమాండ్‌ను కలిసి వివరణ ఇస్తానని అంటున్నారు సదరు ఎమ్మెల్యే. ఆయన ఎవరో కాదు.. మాజీ మంత్రి, కరీమ్గంజ్(సౌత్) ఎమ్మెల్యే సిద్ధిఖీ అహ్మద్. Assam has reposed its faith in PM Sri @narendramodi ji by electing two NDA candidates to the Rajya Sabha by huge margins - BJP's Sri Pabitra Margherita (won by 11 votes) & UPPL's Sri Rwngwra Narzary (won by 9 votes). My compliments to winners @AmitShah @JPNadda @blsanthosh pic.twitter.com/Lozn8hkNGg — Himanta Biswa Sarma (@himantabiswa) March 31, 2022 మరోవైపు ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడడంతో నర్జారీ గెలపు నల్లేరు మీద నడకే అయ్యింది. నర్జారీకి 44 ఓట్లురాగా, బోరాకు 35 ఓట్లు వచ్చాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ.. గతంలో కాంగ్రెస్ నేత. 2015లో ఆయన బీజేపీలో చేరారు. ఈ కారణంగా.. పాత పరిచయాలను ఆసరాగా చేసుకుని ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు ప్రతిపక్ష కూటమి ఆరోపిస్తోంది. ఈ విషయమై ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలపై వేటు వేసింది కాంగ్రెస్. -
పోలింగ్‌లో పాల్గొన్న కరోనా సోకిన ఎమ్మెల్యే
భోపాల్ : కరోనా వైరస్ ఆయనను ఓటు వేయకుండా ఆపలేకపోయింది. పీపీఈ కిట్ ధరించి మరీ రాజ్యసభ ఎన్నికల ఓటింగ్‌లో పాల్గొన్నారు ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే. శుక్రవారం 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. భోపాల్‌లోని మూడు రాజ్యసభ ఎన్నికలకు జరిగిన పోలింగ్‌లో కరోనా సోకిన ఎమ్మెల్యే కునాల్ చౌదరి పీపీపీ కిట్ ధరించి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అప్పటికే మిగతా ఎమ్మెల్యేలు ఓటు వేయగా, కునాల్ చివర్లో ఓటు వేశారు. మధ్యాహ్నం 12.45 గంటలకు అంబులెన్సులో విధానసభకు చేరుకున్న ఎమ్మెల్యే కునాల్ పీపీఈ కిట్ ధరించి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 'మిగతా సభ్యులు నా దరిదాపుల్లోకి కూడా రాలేదు. వాళ్లు భయపడటం సహజమే కానీ నేను పీపీపీ కిట్ ధరించి పూర్తి జాగ్రత్తలు పాటించి మా పార్టీ అభ్యర్థికి ఓటు వేసి వచ్చాను' అని ఎమ్మెల్యే కునాల్ తెలిపారు. (ముందస్తు ప్రణాళికతోనే చైనా దాడి: రాహుల్ గాంధీ ) Madhya Pradesh: A Congress MLA who had tested positive for #COVID19, arrives at the state legislative assembly in Bhopal to cast his vote. Voting is currently underway for three Rajya Sabha seats of the state. #RajyaSabhaElection pic.twitter.com/P8wltUu8fT — ANI (@ANI) June 19, 2020 కరోనా సోకిన ఎమ్మెల్యే పోలింగ్‌లో పాల్గొనడం ఇదే ప్రథమం. దీనిపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. వైరస్ సోకినా బాధ్యతాయుతమైన పౌరుడిలా ఓటు హక్కును వినియోగించుకున్నారు అని కాంగ్రెస్ నేతలు పేర్కొనగా, అసలు కరోనా సోకిన వ్యక్తిని లోపలికి ఎలా అనుమతించారంటూ బీజేపీ నేతలు వాదిస్తున్నారు. క్వారంటైన్లో ఉండాల్సిన వ్యక్తి ఓటు వేయడానికి ఎన్నికల సంఘం ఎలా అనుమతించిందని బీజేపీ నాయకుడు హితేష్ బాజ్‌పాయ్ ప్రశ్నించారు. ఇది అంటువ్యాధి నియంత్రణ నిబంధనల ఉల్లంఘన కిందికే వస్తుందని ట్వీట్ చేశారు. ఈనెల 12న కాంగ్రెస్ ఎమ్మెల్యే కునాల్ చౌదరికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. మార్చి నెలలోనే రాజ్యసభ ఎన్నికలు జరగాల్సి ఉండగా, కరోనా కారణంగా ఎన్నికల సంఘం వాయిదా వేసింది. అయితే గత కొన్ని వారాలుగా దాదాపు 10 రాష్ట్రాల్లో రాజీనామాలు, రిసార్ట్ రాజకీయాలు లాంటి ఆరోపణలు తలెత్తుతున్న నేపథ్యంలో 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించింది. (ప్రైవేట్ ఆస్పత్రుల ఫీ‘జులుం’ చెల్లదు.. ) -
రాజ్యసభ పోలింగ్ వాయిదా
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌తో సహా వివిధ రాష్ట్రాల్లో రాజ్యసభ స్థానాలకు ఈ నెల 26వ తేదీన జరగాల్సిన ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. దేశం మొత్తం మీద కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా నెలకొన్న ఆందోళనకరమైన పరిస్థితులను సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం కేంద్ర ఎన్నికల కమిషన్ ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటికే అభ్యర్థులు వేసిన నామినేషన్లు యథాతథంగా కొనసాగుతాయని, ఎన్నికల పోలింగ్, లెక్కింపును మాత్రమే వాయిదా వేస్తున్నట్లు కమిషన్ పేర్కొంది. - 17 రాష్ట్రాల నుంచి 55 రాజ్యసభ స్థానాల భర్తీకి మార్చి 6న ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు అయిన మార్చి 18వ తేదీ అనంతరం పది రాష్ట్రాల నుంచి 37 మంది పోటీ లేకుండా ఎన్నికయ్యారు. - ఆంధ్రప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, రాజస్థాన్ రాష్ట్రాల్లో 18 స్థానాలకు పోలింగ్ 26న జరగాల్సి ఉంది. - ఆంధ్రప్రదేశ్‌లో 4 స్థానాలకు 5 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గెలిచే అవకాశం లేకపోయినా.. ఓడిపోయే సీటును వర్ల రామయ్యకు ఇచ్చి టీడీపీ పోటీ చేయిస్తున్న విషయం విదితమే. - పోలింగ్ రోజున ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల ఏజెంట్లు, సహాయక అధికారులు, శాసనసభ్యులు గుమిగూడే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితిని నివారించడానికి ప్రజాప్రాతినిథ్య చట్టం–1951లోని 153 సెక్షన్‌ను అనుసరించి ఎన్నికల పోలింగ్‌ను వాయిదా వేసినట్లు కమిషన్ ప్రకటనలో తెలియజేసింది. పరిస్థితిని సమీక్షించిన తరువాత నిర్ణీత సమయంలో తర్వాత తేదీలను ప్రకటిస్తామని కమిషన్ పేర్కొంది. -
ముగిసిన రాజ్యసభ పోలింగ్
-
రాజ్యసభ ఎన్నికలు: ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికలు శుక్రవారం ప్రారంభమ్యాయి. శాసనసభలోని కమిటీ హాల్ నంబర్1లో ఉదయం 9 గంటలకు పోలింగ్ మొదలైంది. ఈ మేరకు శాసనసభ సచివాలయం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 117 మంది ఓటర్లు ఉన్నట్టు అధికారికంగా ప్రకటించారు. మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరుగుతుండగా.. నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థులుగా జోగినపల్లి సంతోష్‌కుమార్, బండా ప్రకాశ్, బడుగుల లింగయ్యయాదవ్ బరిలో ఉండగా.. కాంగ్రెస్ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి పి.బలరాంనాయక్ పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికలకు బీజేపీ, టీడీపీ, సీపీఎం పార్టీలు దూరంగా ఉన్నాయి. ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు రాజ్యసభ ఎన్నికల అధికారికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. పార్టీ ఫిరాయించిన ఏడుగురు ఎమ్మెల్యేల ఓట్లను పరిగణనలోకి తీసుకోవద్దని విజ్ఞప్తి చేసింది. అంతేకాక ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. విప్ ధిక్కరించడం దారుణం ముఖ్యమంత్రి కేసీఆర్ నీచరాజకీయాలు చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు విప్‌ను ధిక్కరించడం దారుణమని తెలిపారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. విప్ దిక్కరించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్ పదవి గౌరవాన్ని టీఆర్ఎస్ నేతలు దిగజార్చొద్దని సూచించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. 63 మంది ఎమ్మెల్యేలున్న టీఆర్ఎస్ ముగ్గురుని పోటీలో ఎలా పెట్టిందని ఆయన ప్రశ్నించారు. -
మా ఎమ్మెల్యేలు డబ్బు అడిగితే ఏంటి..?
బెంగళూరు: బ్యాంకు రుణాలను ఎగవేసి విదేశాలకు పోరిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు మద్దతుగా మాట్లాడిన మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్ డీ దేవేగౌడ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఎమ్మెల్యేలు భారీగా డబ్బు డిమాండ్ చేసినట్టు స్టింగ్ ఆపరేషన్‌లో వెలుగుచూడటంపై దేవేగౌడ స్పందిస్తూ.. ఎమ్మెల్యేలు డబ్బులు అడిగితే ఏంటి అంటూ ప్రశ్నించారు. ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయాలంటే ఎమ్మెల్యేలకు డబ్బు అవసరమని దేవేగౌడ అన్నారు. భారత రాజకీయాలు అవినీతిమయం అయ్యాయని వ్యాఖ్యానించారు. తమ పార్టీపై రాజకీయ కుట్రలో భాగంగా స్టింగ్ ఆపరేషన్ చేపట్టారని ఆరోపించారు. కర్ణాటక రాజ్యసభ ఎన్నికల్లో గెలిచేందుకు ఎమ్మెల్యేలను కొనేందుకు బేరసారాలు జరగుతున్న వీడియో విడుదలవటం సంచలనం సృష్టిస్తోంది. స్వతంత్ర అభ్యర్థికి ఓటేసేందుకు జేడీఎస్ ఎమ్మెల్యే డబ్బులు తీసుకుంటున్నట్లు ఓ వీడియోలో ఉంది. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతిచ్చేవారికి రూ.10 కోట్లు ఇచ్చేలా బేరం జరిగిందని బీజేపీ నేత, మాజీ సీఎం యడ్యూరప్ప ఆరోపించగా, మీడియాను పిచ్చోళ్లను చేసేందుకే జేడీఎస్ ఎమ్మెల్యే మల్లికార్జున కుబా స్టింగ్‌లో పాల్గొన్నాడని జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి చెప్పారు.