న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల్లో 16 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. ఐతే మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానాలో బీజేపీ విజయకేతనం ఎగురవేయగా.. రాజస్థాన్‌లో కాంగ్రెస్ మూడు స్థానాల్లో విజయం సాధించింది. కానీ కాంగ్రెస్‌కి హర్యానాలో ఊహించని షాక్ తగిలింది. హర్యానాలో రెండు స్థానాలకు ఎన్నికలకు జరగగా.. బీజేపీ నుంచి కృష్ణలాల్ పన్వార్ విజయం సాధించగా.. స్వతంత్ర అభ్యర్థి కార్తికేయ శర్మ గెలుపొందారు.
దీంతో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి అజయ్ మాకెన్ ఓటమిని ఎదుర్కొన్నారు. ఐతే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణాయ్ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. ఆయన శర్మకు ఓటేయడంతో ఆ ఓటును అనర్హతగా ప్రకటించారు. కుల్దీప్ వేసిన ఎత్తుగడ అజయ్ మాకెన్ ఓటమికి దారి తీయడంతో పార్టీ ఆగ్రహానికి గురయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ప్రస్తుతం ఉన్న అన్ని పార్టీ పదవుల నుంచి తక్షణమే బహిష్కరించింది.
Comments
Please login to add a commentAdd a comment