Cross voting
-
నువ్వా.. నేనా..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక హోరాహోరీగా సాగింది. ఉమ్మడి జిల్లా పరిధిలో గురువారం పోలింగ్ ప్రశాంతంగా ముగియగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య నువ్వా, నేనా అన్నట్లు ఎన్నికల యుద్ధం నడిచించి. అయితే లెక్క ప్రకారం వెయ్యి మందికి పైగా ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ కు ఉండగా.. భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు పోలింగ్ సరళిని బట్టి రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏపీ, కర్ణాటక, గోవా, కొడైకెనాల్, ఊటీలోని క్యాంపుల నుంచి స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిల ర్లు ప్రత్యేక వాహనాల్లో వచ్చి ఆయా కేంద్రాల్లో ఓటు వేశారు. వీరితోపాటు ఎక్స్అఫీషియో హోదా లో ఉమ్మడి పాలమూరులోని 14 మంది ఎమ్మెల్యే లు, ఇద్దరు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఓటు వేశారు. ఏప్రిల్ 2న మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బాలుర కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా.. అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు. 99.86 శాతం పోలింగ్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ప్రధానంగా కాంగ్రెస్ నుంచి యువ పారిశ్రామిక వేత్త, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి జెడ్పీ మాజీ చైర్మన్ నవీన్‌కుమార్‌రెడ్డి బరిలో నిలిచారు. వీరితోపాటు స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్‌గౌడ్ పోటీ చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలో పది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, 99.86 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 1,439 మంది ఓటర్లు ఉండగా.. 1,437 మంది ఓటు హక్కు వినియోగించుకు న్నారు. కాగా, గద్వాలలో పోలింగ్ కేంద్రం వద్ద ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, సీఐ భీం కుమార్ మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఏఎస్పీ గుణశేఖర్ జోక్యంతో వివాదం సద్దుమణిగింది. క్రాస్ ఓటింగ్ కాంగ్రెస్‌కు కలిసొచ్చేనా.. లోక్‌సభ ఎన్నికలకు ముందుగా జరుగుతున్న ఉపఎన్నిక కావడంతో ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. క్యాంపుల్లో భాగంగా ఆయా పార్టీలు పోటాపోటీగా ప్రజాప్రతినిధులకు భారీ ఎత్తున తాయిలాలు ముట్టజెప్పినట్లు సమాచారం. మరోవైపు ఉమ్మడి జిల్లాలో బీజేపీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వంద వరకు ఉన్నారు. వీరు కాంగ్రెస్ అభ్యర్థి వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. మొత్తంగా అన్ని పోలింగ్ స్టేషన్ల పరిధిలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా విజేతను నిర్ణయించనుండడంతో ఆయా పార్టీ అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. క్రాస్‌ఓటింగ్ తమకు కలిసొస్తుందని కాంగ్రెస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
అందుకే క్రాస్ ఓటేశాం.. హిమాచల్ రెబల్స్
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి క్రాస్ ఓటు వేసిన విషయం తెలిసిందే. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్య ఓట్లు టై కావటంతో టాస్ వేసి ఫలితాలు ప్రకటించారు. ఈ అనూహ్య పరిణామాల నడుమ బీజేపీ అభ్యర్థి హర్ష మహాజన్ గెలుపొందారు. అయితే సర్కార్ కూలిపోయే అవకాశాలు కనిపించడంతో.. ఆ వెంటనే క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన ఆరుగురు ఎమ్మెల్యేలపై ఆ రాష్ట్ర స్పీకర్ అనర్హత వేటు వేశారు. తాజాగా ఈ మొత్తం పరిణామాలపై రెబల్ ఎమ్మెల్యేలు స్పందించారు. ఎమ్మెల్యే రాజేంద్ర రానా క్రాస్ ఓటింగ్ విషయంపై మాట్లాడుతూ.. ‘హిమాచల్ ప్రదేశ్ ప్రజలపై ఉన్న గౌరవం, మర్యాద ప్రకారం మేం క్రాస్ ఓటు నిర్ణయం తీసుకున్నాం. హిమాచల్ ప్రదేశ్‌కు దేవభూమిగా పేరుంది. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా నిలపడానికి ఇంకా ఎవరూ లేరా?. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు కాంగ్రెస్‌కి కనిపించలేదా?. అసలు హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎవరూ ప్రాతినిధ్యం వహించాలి?’ అని రాజేంద్ర రానా ప్రశ్నించారు. ‘మేము కోర్టుకు వెళ్తాం. తీవ్రమైన ఒత్తిడి కారణంగా స్పీకర్ మాపై అనర్హత వేటు వేశారు. పోలీసు మా అనుచరులకు చలాన్లు జారీ చేయటం మొదలుపెట్టారు. మేము రాష్ట్రం ఆత్మాభిమానాన్ని రక్షిస్తాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు.. కేవలం సుఖ్విందర్ సింగ్ సుఖు స్నేహితుల ప్రభుత్వం. ప్రతిఒక్కరికి రాష్ట్ర పరిస్థితి ఏంటో తెలుసు. యువత ఉద్యోగ పరీక్షలు రాసి రోడ్లమీద ఉన్నారు. వారు ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చటం లేదు. కొంత మంది ఎమ్మెల్యేలను అవమాన పరుస్తున్నారు. మరో తొమ్మిది మంది మా వెంట వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని రాజేంద్ర రానా అన్నారు. -
కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
సిమ్లా: రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి బీజేపీ అభ్యర్థి గెలుపునకు కారకులైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరుగురిపై హిమాచల్ ప్రదేశ్ శాసనసభ స్పీకర్ కుల్దీప్ సింగ్ పథాలియా అనర్హత వేటు వేశారు. వారిని ఎమ్మెల్యేలుగా అనర్హులుగా ప్రకటించారు. ఈ వివరాలను స్పీకర్ గురువారం మీడియా సమావేశంలో చెప్పారు. ‘‘బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభకు తప్పకుండా హాజరుకావాలని కాంగ్రెస్ పార్టీ విప్ జారీచేసింది. అయినా సరే ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు ఆ రోజు అసెంబ్లీకి రాలేదు. బడ్జెట్‌పై ఓటింగ్‌లో పాల్గొనలేదు. పార్టీ విప్‌ను ఉల్లంఘించారు. అందుకే పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వీరిని అనర్హులుగా ప్రకటించాలని పార్లమెంటరీ వ్యవహారాల రాష్ట్ర మంత్రి హర్షవర్ధన్ ఇచి్చన ఫిర్యాదు మేరకు వీరిని అనర్హులుగా ప్రకటిస్తున్నా. రాజ్యసభలో క్రాస్ ఓటింగ్ ఘటనతో ఈ అనర్హతకు ఎలాంటి సంబంధం లేదు’ అని స్పీకర్ పథాలియా చెప్పారు. అనర్హులైన వారిలో రాజీందర్ రాణా, సు«దీర్శర్మ, ఇందర్ దత్ లఖాన్‌పూర్, దేవీందర్ కుమార్ భుట్టో, రవి ఠాకూర్, చేతన్య శర్మ ఉన్నారు. ఇరువైపుల వాదనలు విన్న స్పీకర్ బుధవారం తన తీర్పును రిజర్వ్‌చేసి గురువారం వెల్లడించారు. కాగా, స్పీకర్ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తానని అనర్హతకు గురైన ఒక ఎమ్మెల్యే రాజీందర్ రాణా చెప్పారు. రెబల్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాక అసెంబ్లీలో ప్రస్తుత సభ్యుల మొత్తం సంఖ్య 68 నుంచి 62కు తగ్గింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలం 40 నుంచి 34కు దిగి వచ్చింది. పార్టీ ఫిరాయింపుల చట్టం ద్వారా హిమాచల్‌లో ఎమ్మెల్యేలు అనర్హతకు గురికావడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. -
జోరుగా క్రాస్ ఓటింగ్
బెంగళూరు/లఖ్‌నవూ/సిమ్లా/న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల్లో జోరుగా క్రాస్ ఓటింగు సాగింది. దాంతో సంఖ్యాబలం ప్రకారం 8 స్థానాలు నెగ్గాల్సిన బీజేపీ మరో రెండు చోట్ల అనూహ్య విజయం సాధించింది! యూపీలో సమాజ్‌వాదీ పార్టీకి, హిమాచల్‌ప్రదేశ్‌లో పాలక కాంగ్రెస్‌కు గట్టి షాకిచ్చింది. ఏప్రిల్‌లో ఖాళీ అవుతున్న 56 రాజ్యసభ స్థానాలకు గాను 41 చోట్ల ఎన్నిక ఇప్పటికే ఏకగ్రీవం కావడం తెలిసిందే. యూపీలో 10, కర్ణాటకలో 4, హిమాచల్‌లో ఒకటి చొప్పున మిగతా 15 స్థానాలకు మంగళవారం ఓటింగ్ జరిగింది. అసెంబ్లీల్లో సంఖ్యాబలం మేరకు యూపీలో బీజేపీ 7, ఎస్పీ 3; కర్ణాటకలో కాంగ్రెస్ 3, బీజేపీ 1; హిమాచల్‌లో ఏకైక స్థానంలో కాంగ్రెస్ గెలవాల్సి ఉంది. కానీ బీజేపీ హిమాచల్‌లో పోటీకి దిగడమే గాక యూపీలో 8వ అభ్యర్థిని రంగంలోకి దించింది. కర్ణాటకలో కూడా ముగ్గురు కాంగ్రెస్, ఒక బీజేపీ అభ్యర్థితో పాటు దాని మిత్రపక్షం జేడీ(ఎస్) నుంచి ఐదో అభ్యర్థీ పోటీకి దిగారు. యూపీలో ఏడుగురు ఎస్పీ, ఒక బీఎస్పీ ఎమ్మెల్యేలు; హిమాచల్‌లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి అనుకూలంగా ఓటేశారు. దాంతో హిమాచల్‌లోని ఏకైక సీటుతో పాటు యూపీలో 8వ రాజ్యసభ స్థానమూ బీజేపీ కైవసమయ్యాయి. కర్ణాటకలో మాత్రం బీజేపీ ఎత్తులు పారలేదు. సంఖ్యాబలానికి అనుగుణంగా కాంగ్రెస్ 3, బీజేపీ ఒక స్థానంలో నెగ్గాయి. అయితే ఒక బీజేపీ ఎమ్మెల్యే కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటేయడమే గాక మరొకరు ఓటింగ్‌కు దూరంగా ఉండి పార్టీకి షాకిచ్చారు! మూడు పార్టీలూ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డ ఎమ్మెల్యేలపై చర్యలకు తమ సిద్ధమవుతున్నాయి! హిమాచల్‌లో టాస్ హిమాచల్ అసెంబ్లీలో మొత్తం 68 స్థానాలకు గాను పాలక కాంగ్రెస్‌కు 40 మంది ఎమ్మెల్యేలుండగా బీజేపీకి 25 మందే ఉన్నారు. అయితే ముగ్గురు స్వతంత్రులతో పాటు ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థి హర్‡్ష మహాజన్‌కు ఓటేశారు. దాంతో కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి అనుహ్య ఓటమి చవిచూశారు. అభ్యర్థులిద్దరికీ సమానంగా చెరో 34 ఓట్లు రావడంతో టాస్ ద్వారా హర్‡్షను విజేతను తేల్చారు. ఇక యూపీలో హైడ్రామా చోటుచేసుకుంది. ఓవైపు పోలింగ్ జరుగుతుండగానే సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ మనోజ్ పాండే పార్టీ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ నిర్వహించిన సమావేశానికి ఆయనతో పాటు మరో ఏడుగురు ఎస్పీ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. వీరిలో కనీసం ఏడుగురు బీజేపీకి అనుకూలంగా ఓటేసినట్టు తేలింది. ఒక బీఎస్పీ ఎమ్మెల్యే కూడా బీజేపీకి ఓటేశారు. దాంతో ఆ పార్టీ అభ్యర్థులు ఆర్పీఎన్ సింగ్, తేజ్‌వీర్‌సింగ్, అమర్‌పాల్ మౌర్య, సంగీతా బల్వంత్, సుధాన్షు త్రివేది, సాధనాసింగ్, నవీన్ జైన్, సంజయ్ సేథ్ విజయం సాధించారు. సమాజ్‌వాదీ నుంచి జయాబచ్చన్, రాంజీలాల్ సుమన్ నెగ్గగా అలోక్ రంజన్ ఓటమి పాలయ్యారు. కర్ణాటకలో మాత్రం ఊహించిన ఫలితాలే దక్కాయి. కాంగ్రెస్ అభ్యర్థులు అజయ్ మాకెన్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, జీసీ చంద్రశేఖర్, బీజేపీ అభ్యర్థి నారాయణ కె.బాండే గెలుపొందగా జేడీ(యూ) అభ్యర్థి కుపేంద్రరెడ్డి ఓటమి చవిచూశారు. అయితే యశవంతపుర బీజేపీ ఎమ్మెల్యే ఎస్.టి.సోమశేఖర్ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేయగా యల్లాపుర బీజేపీ ఎమ్మెల్యే శివరాం హెబ్బార్ పోలింగ్‌కు దూరంగా ఉన్నారు! వారిద్దరూ కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. వారిపై చర్యలకు బీజేపీ సిద్ధమైంది. క్రాస్ ఓటింగ్ నేపథ్యంలో హిమాచల్‌లో సుఖ్విందర్ సింగ్ సుఖు సర్కారు మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వాలను కూల్చేయడం మోదీ సర్కారుకు అలవాటుగా మారిందంటూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నిప్పులు చెరిగారు. -
క్రాస్ ఓటింగ్ గుబులు!
తాండూరు: జిల్లాలోనే తాండూరు సెగ్మెంట్ ఫలితం ఉత్కంఠ భరితంగా మారింది. ఈ ఎన్నికలో అభ్యర్థుల వెంట నడిచిన వారే క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా అధికార బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి శిబిరంలో క్రాస్ ఓటింగ్ దడ పుట్టిస్తోంది. 2018లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించిన పైలెట్ ఆ తర్వాత కారెక్కారు. దీంతో అప్పట్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలంతా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఫలితంగా రెండు నెలల క్రితం వరకు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి కేడర్ కనిపించలేదు. అధికార పార్టీ నుంచి పరిగి టికెట్ ఆశించిన డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ తరఫున తాండూరు బరిలో నిలిచారు. బీఆర్ఎస్లో ఉన్న పాత కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను తిరిగి పార్టీలోకి చేర్చుకోవడంతో పాటు బీఆర్ఎస్కు చెందిన పలువురు నాయకులను సైతం తనవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. నియోజవర్గంలో బలమైన నేతగా ఎదిగిన రోహిత్‌రెడ్డి ప్రభుత్వ పథకాలతో పాటు తనను నమ్మి నడుస్తున్న వారితో వ్యూహాత్మకంగా ముందుకు సాగారు. నేను తాండూరు బిడ్డను నన్ను ఆశీర్వదించండి కష్టసుఖాల్లో మీకు తోడుగా ఉంటానని ఓటర్లను అభ్యర్థించారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్లోనే కొనసాగుతున్న కొంతమంది నేతలు ఆయనకు వ్యతిరేకంగా ఓట్లు వేశారనే ప్రచారం సాగుతోంది. మరోవైపు కాంగ్రెస్‌లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. హస్తం పార్టీలో కొనసాగుతున్న పలువురు కార్యకర్తలు, నాయకులు బీఆర్ఎస్కు ఓట్లు వేయించారనే చర్చ కూడా సాగుతోంది. ఎమ్మెల్యేలకు ఎర కేసుల బీజేపీ జాతీయ నేతలను ఇరకాటంలో పెట్టారనే ఉద్దేశంతో ఆ పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలు, నాయకులు రోహిత్‌రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లు వేశారనే ప్రచారం కూడా ఉంది. ఇలా జరిగిన క్రాస్ ఓటింగ్ ఎవరికి అనుకూలిస్తుందో... ఎవరి పుట్టి ముంచుతుందో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. సైలెంట్ ఓటింగ్.. టఫ్ ఫైటింగ్ తాండూరు రూరల్: పోలింగ్ పూర్తయింది మొదలు ఓటరు నాడీ పట్టేందుకు నేతలు తంటాలు పడుతున్నారు. పల్లెల్లో జరిగిన సైలెంట్ ఓటింగ్ ఎవరికి అనుకూలం.. ఎవరికి ప్రతికూలంగా మారిందనేది అనేది అంతుచిక్కడం లేదు. ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలన కారుకు కలిసొస్తుందా..? లేక కాంగ్రెస్‌వైపు మొగ్గు చూపారా అనే చర్చలు సాగుతున్నాయి. ఎవరికి ‘మేజర్’ పంచాయతీ మండల పరిధిలోని కరన్‌కోట్ మేజర్ పంచాయతీ. ఇక్కడ దాదాపు 6వేల పైచిలుకు ఓట్లుండగా 4వేల ఓట్లు పోలయ్యాయి. దాదాపు 60శాతం పోలింగ్ జరగ్గా కాంగ్రెస్, కారు పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. స్థానికంగా సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీ ఉండడంతో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు ఓటు హక్కును కలిగియున్నారు. ఆ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారనేది నాయకులకు అంతుచిక్కడం లేదు. -
అసెంబ్లీ ఆవరణలో ఆనాడు చెప్పిన ముచ్చట్లు మరిచారా? ఈనాడు రామోజీ!
ఆంద్రప్రదేశ్‌లో రాజకీయాలు ఎంత ఘోరంగా తయారవుతున్నాయో చూడండి. ఇక మీడియా పరిస్థితి అయితే నానాటికి నాసిరకంగా మారుతోంది. ఒకప్పుడు ఎవరైనా ఎమ్మెల్యే ఓటు అమ్ముకుంటే, అమ్ముకున్నవారిపై పుంఖానుపుంఖాలుగా కథనాలు వచ్చేవి. చివరికి ఓటును విక్రయించారన్న ఆరోపణలు ఎదుర్కునేవారు సిగ్గుతో తలవంచుకునే విధంగా వార్తా కథనాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఏమి జరుగుతోందో గమనించండి. ఓటు అమ్ముకున్నవారికి మద్దతుగా పేజీలకు, పేజీల వార్తలు వండి వార్చుతున్నారు. అబ్బో.. తాము విలువలకు కట్టుబడి ఉన్నామని పోజులిచ్చిన రామోజీరావుకు చెందిన ఈనాడు మీడియా అయితే మరీ అరాచకంగా తయారైంది. ప్లేట్ పిరాయించిన ఈనాడు జర్నలిజాన్ని గాలికి వదలివేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఎలాగోలా వ్యతిరేకత పెంచాలన్న నీచ మనస్తత్వంలో ఉన్న ఈనాడు పత్రిక పూర్తిగా దిగజారిపోయినట్లు ఎప్పటికప్పుడు రుజువు చేసుకుంటోంది. ఏపీలో ఎమ్మెల్యేల కోటా నుంచి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో నలుగురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన విషయాన్ని ఆ పత్రికే కథనాలుగా ఇచ్చింది. దానిపై డబ్బు చేతులు మారాయన్న ఆరోపణలు పెద్ద ఎత్తున రావడంతో తెలుగుదేశం పార్టీ ఇరుకునపడింది. అంతే .. ఈనాడు కూడా ప్లేట్ పిరాయించేసింది. తాము వైఎస్సార్సీపీకే ఓటు వేశామని ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు చెబితే దానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వార్తలు ఇచ్చారు. అంతేకాక ఆ ఎమ్మెల్యేలు నలుగురు ప్రభుత్వాన్ని, పార్టీని తీవ్రంగా విమర్శిస్తే దానిని పటం కట్టి ప్రచురించారు. అంతే తప్ప.. ఆ నలుగురు ఎమ్మెల్యేలపై వచ్చిన ఆరోపణలలో నిజం ఉందా? లేదా? అన్నదానిపై వార్తలు ఇవ్వలేకపోయింది. రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా, భూతద్దంలో వెదికి రాసే ఈనాడుకు ఇంత పెద్ద డీల్ గురించి తెలియకపోవడం అంటే వారి అసమర్దత అనుకోవాలా? లేక అవినీతిని సమర్ధించడం అనాలా? తనకు కూడా టీడీపీ డబ్బు ఆఫర్ ఇచ్చిందని, తాను ఒప్పుకుంటే పది కోట్లు వచ్చి ఉండేవని, తనకు సిగ్గు,శరం ఉన్నాయి కాబట్టి ఆ పని చేయలేదని చెప్పిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చేసిన ప్రకటనను మాత్రం ఒక చిన్నపేరాగా ఎక్కడో లోపల పేజీలో కనబడి, కనబడనట్లుగా ప్రచురించారు. దీనిని బట్టి ఈనాడు అవినీతిపరుల వైపు నిలబడడానికి కంకణం కట్టుకుందని తేలడం లేదా! పాఠకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు.. వైఎస్సార్సీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేల వాదన ఇవ్వదలిస్తే ఇవ్వండి.. తప్పు లేదు. కాని అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యేల కొనుగోలు బేరం గురించి మరో ఎమ్మెల్యే చేసిన ప్రకటనకు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలి కదా! అలాగే వాస్తవం ఏమిటో పాఠకులకు తెలియచేయాలి కదా! తను భుజాన వేసుకున్న తెలుగుదేశం పార్టీ ఇలాంటి అరాచకాలకు పాల్పడితే అది ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమర్దతగా, చాతుర్యంగా అభివర్ణించే అధమస్థాయి ఈనాడు, ఆంద్రజ్యోతి ,టీవీ 5వంటి మీడియా సంస్థలు రావడం అత్యంత హేయంగా కనిపిస్తుంది. అదే పని కనుక మరే పార్టీ అయినా చేసి ఉంటే ఈ పాటికి చంద్రబాబు కాని, ఆయనకు మద్దతు ఇచ్చే ఈ ఎల్లో మీడియా కాని గగ్గోలుగా ప్రచారం చేసి ఉండేవారు. తమకు పదహారు మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని టీడీపీ నాయకత్వం చెబితే అది గొప్ప విషయంగా ఈ మీడియా భావించింది. అంతే తప్ప.. అదేమిటి? అలాంటివాటిని ఎందుకు ప్రోత్సహిస్తారు.. అని ప్రశ్నించలేదు. గతంలో 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి గబ్బు పట్టిన తెలుగుదేశానికి ఇంకా గుణపాఠం రాకపోవడంపై ఆ మీడియా ప్రశ్నించలేదు. పైగా బలం లేకపోయినా టిడిపి అభ్యర్ది గెలిచారంటూ చంకలు గుద్దుకుంటూ ఈ మీడియా సంబరపడిపోయింది. సుద్దులు చెప్పి.. ఇప్పుడేంటి ఇంత దారుణంగా.. రామోజీరావు విలువల గురించి ఎన్ని సుద్దులు చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఏకంగా అసెంబ్లీ ఆవరణలో జరిగిన ఒక సమావేశంలో ఎమ్మెల్యేల తీరుతెన్నుల గురించి ధర్మోపన్యాసం చేసిన రామోజీరావు ఇప్పుడు ఎమ్మెల్యేల బేరసారాలకు మద్దతు ఇచ్చే పరిస్థితికి చేరుకున్నారు. మరో మీడియా అధినేత గురించి చెప్పుకోవడం అనవసరం. ఎందుకంటే ఇలాంటి బ్రోకర్ పనులు చేయడంలో ఆయన ఆరితేరారని ఎప్పటి నుంచో ప్రజలలో ఉన్నదే. ఈసారి కూడా ఆయన తన వంతు పాత్ర పోషించారని ప్రచారం జరుగుతోంది. ఆయనను పెద్దగా సీరియస్‌గా తీసుకోనవసరం లేదు. కాని ఈనాడు మీడియా మోసపూరిత విధానాలపై మాత్రం మాట్లాడుకోక తప్పదు. సస్పెండైన ఎమ్మెల్యేలు ఆనం నారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖరరెడ్డిలు నలుగురు కూడా తాము వైఎస్సార్సీపీ సూచించిన అభ్యర్దులకే ఓటు వేశామని చెబుతుండడం విశేషం. దానికి కారణం లేకపోలేదు. మీడియా ముందు తాము తెలుగుదేశం పార్టీకి ఓటు వేశామని చెబితే వారిపై అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది. పైగా వీరు డబ్బుకు అమ్ముడుపోయారన్నది నిర్ధారణగా మారి ప్రజలు మరింత ఈసడించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే తాము అమ్ముడుపోలేదని చెప్పుకుంటూనే వైఎస్సార్సీపీని విమర్శిస్తూ మీడియా ముందు మాట్లాడుతున్నారు. నిజంగానే వీరు పార్టీకి ద్రోహం చేయకుండా ఉన్నట్లయితే , తాము ఎక్కడా పొరపాటు చేయలేదని, పార్టీ తమను అన్యాయంగా సస్పెండ్ చేసిందని చెప్పేవారు. కాని వారిలో ఆ ధైర్యం కొరవడింది. అపరాధ భావనను కప్పిపుచ్చుకోవడానికి నానా తంటాలు పడ్డారు. అయినా ఆనం రామనారాయణరెడ్డి తనకున్న రాజకీయ అనుభవంతో బాగానే నటించగలిగారు. ఆయన మొన్నటిదాకా సీఎం జగన్‌ను ఎలా మెచ్చుకున్నారు? ఇప్పుడు ఎంత ఘోరంగా విమర్శిస్తున్నారు? 2014లో రామనారాయణరెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంలో పోటీచేసి డిపాజిట్ పోగొట్టుకున్నారు. ఆ తర్వాత టీడీపీ అధికారంలో ఉండడంతో ఆ వైపునకు వెళ్లి, ఆ పార్టీ పరిస్థితి బాగోలేదని తెలుసుకున్నారేమో తెలియదు కాని, 2019 ఎన్నికల నాటికి వైఎస్ జగన్‌ను ఆశ్రయించి వెంకటగిరి టిక్కెట్ పొందారు. ఆ కృతజ్ఞతను కూడా ఆనం మిగుల్చుకోకపోవడం విషాదం. తండ్రి దారిలోనే ఆనం... ఆనం ఇంతవరకు మూడుసార్లు టీడీపీలోకి ,రెండుసార్లు కాంగ్రెస్, వైఎస్సార్సీపీలోకి మారారు. తమకు ఎంతో చరిత్ర ఉందని ఆయన చెబుతున్నారు. నిజమే..ఆయన తండ్రి ఆనం వెంకటరెడ్డికి కూడా ఇలాగే ఫిరాయింపులు చేసిన చరిత్ర ఉంది. దానిని రామనారాయణ కూడా అనుసరిస్తున్నట్లుగా ఉంది. వచ్చేసారి బీజేపీ, జనసేన, టీడీపీ లలో ఏదో ఒక పార్టీలో చేరవచ్చన్న సంకేతాలను ఆయన ఇస్తున్నారు. ఇక కొత్తగా రాజకీయాలలోకి వచ్చిన ఉండవల్లి శ్రీదేవి అసెంబ్లీలో కాని, బయటకాని ముఖ్యమంత్రిని ఉద్దేశించి జగనన్న అంటూ ఎన్ని కబుర్లు చెప్పారు. ఇప్పుడు ఏమి మాట్లాడుతున్నారో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అమరావతి రాజధాని గురించి ఇంతకాలం ఏమి మాట్లాడింది.. ఇప్పుడు ఏమి మాట్లాడుతోంది.. వింటే నరం లేని నాలుక ఎటైనా తిరుగుతుందంటే ఇదేనేమో అనిపిస్తుంది. సంబంధిత వీడియోలు సోషల్ మీడియాలో విస్తారంగా వెలుగులోకి వచ్చాయి. ఈమె తన ఓటును టిడిపికి వేయడానికి ముందుగా ఎవరెవరి ద్వారా రాయబారాలు సాగించారన్న అంశంపై కొందరు నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పటికే బయటపడిపోయినందున ఆయన ఏమన్నా పట్టించుకోనవసరం లేదు. మేకపాటి చంద్రశేఖరరెడ్డిపై ఇటీవలికాలంలో వచ్చిన ఆరోపణలు, దానికి ఆయన ఆత్మరక్షణలో పడిన తీరు మొదలైనవి చూసిన తర్వాత ఇప్పుడు ఆయన ఏమి చెప్పినా, జనం నమ్మే పరిస్థితి లేదు. వీరంతా ఒక వైపు తాము వైసిపికే ఓటువేశామని చెబుతూనే , మరో వైపు వైసిపిని విమర్శిస్తున్న వైనాన్ని బట్టి వీరు ఏమి చేసింది అర్ధం చేసుకోవడం కష్టం కాదు. రాజకీయ నేతలు విలువలు పాటించడం లేదని సంపాదకీయాలు రాసే ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి మీడియా సంస్థలు సైతం అంతకన్నా ఘోరంగా , చివరికి అమ్ముడుపోయారన్న ఆరోపణలు ఎదుర్కుంటున్న ఎమ్మెల్యేలకు మద్దతు ఇవ్వడం జర్నలిజం విలువలను నిలువెత్తు గోతిలో పాతిపెట్టడమే.రాపాక వరప్రసాద్ చెబుతున్నట్లు ఈ మీడియా కూడా సిగ్గు,శరం వదలివేశాయని అనుకుంటే తప్పేముంటుంది? -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్ -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బేరసారాలు నిజమే!
సఖినేటిపల్లి/మలికిపురం: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయాలంటూ ఆ పార్టీ నుంచి తనకు భారీ ఆఫర్ అందినట్లు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు శాసనసభ్యుడు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వెల్లడించారు. సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీనిపై ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. నీతి, నిజాయితీతో పని చేయాలని, అవినీతికి పాల్పడకూడదని కార్యకర్తలకు తాను సూచించినట్లు చెప్పారు. తాను అక్రమాలకు పాల్పడాలనుకుంటే, తప్పుగా ఓటు వేస్తే కనీసం రూ.10 కోట్లు వచ్చేవని చెప్పానన్నారు. ‘నాకు టీడీపీ నుంచి ఆఫర్ వచ్చింది. పా ర్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని, ఫైనాన్షియల్ మేటర్ మాట్లాడదామని ఉండి ఎమ్మెల్యే రామరాజు నాతో చెప్పారు. నేను వెంటనే తిరస్కరించా. క్రాస్ ఓటు చేయబోనని చెప్పాను. దాని గురించి నాతో మాట్లాడవద్దని స్పష్టం చేశా. అంతకుముందు రోజు నా స్నేహితుడు, వైఎస్సార్ సీపీ నాయకుడు కేఎస్ఎన్ రాజుతో కూడా ఆయన ఇదే విషయం ప్రస్తావించారు. మీ ఎమ్మెల్యే మాకు అనుకూలంగా ఓటేస్తే మేం అన్ని రకాలుగా చూసుకుంటామని చెప్పారు. అయితే కేఎస్ఎన్ రాజు.. ఈ విషయం మా ఎమ్మెల్యే(రాపాక)తో చెప్పబోనని, ఇలాంటి వాటికి ఆయన ఒప్పుకోరని స్పష్టం చేశారు. తరువాత రామరాజు నన్ను నేరుగా అప్రోచ్ కావడంతో క్రాస్ ఓటు చేయబోనని తేల్చి చెప్పా’ అని ఎమ్మెల్యే రాపాక వెల్లడించారు. -
స్వప్రయోజనాల కోసం దిగజారే బాబు వల్లే శ్రీదేవికి హాని
సాక్షి, అమరావతి: ‘క్రాస్ ఓటింగ్ చేయలేదని, ప్రమాణానికి సిద్ధమని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సవాల్ చేశారు. ఆమె సవాల్‌ను స్వీకరిస్తున్నా. శ్రీదేవి ఓటు అమ్ముకున్నారనేది వాస్తవం. ఆమె అమ్ముడుపోయి టీడీపీకి ఓటు వేశారని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా’ అని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేశ్ చెప్పారు. మహిళలను గౌరవించే పార్టీ వైఎస్సార్సీపీ అని.. తమ వల్ల ఆమెకు ఎలాంటి నష్టం జరగదన్నారు. స్వప్రయోజనాల కోసం ఎంతవరకైనా దిగజారే చంద్రబాబు వల్లే ఆమెకు హాని పొంచి ఉంటుందన్నారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నందిగం సురేశ్ మీడియాతో మాట్లాడారు. ‘నిజంగా తప్పు చేయకపోతే.. ధైర్యంగా నిలబడొచ్చు కదా? మూడు రోజుల తర్వాత హైదరాబాద్‌లో ఎందుకు మాట్లాడారు? టీడీపీ స్క్రిప్ట్ ఇప్పుడే అందిందా?’ అని ఉండవల్లి శ్రీదేవిని సురేశ్ ప్రశ్నిం చారు. సీఎం జగన్ చాలా గొప్ప వ్యక్తి అని మీడియాతో చెప్పారు కదా.. మరి అలాంటి వ్యక్తిని మోసం చేయాలన్న ఆలోచన ఎలా వచి్చంది? అని మండిపడ్డారు. చేసిన తప్పు పనికి, కులానికి సంబంధమేంటని ప్రశ్నిం చారు. ఓటు అమ్ముకోమని అంబేడ్కర్ ఏమైనా చెప్పారా? అని నిలదీశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆమె ఓటు అమ్ముకోవడం వాస్తవమని.. ఎవరితో ఎక్కడ, ఎలా రాయబారాలు చేసిందో తమకు తెలుసన్నారు. తనకు ఏదైనా జరిగితే అందుకు సజ్జల రామకృష్ణారెడ్డి బాధ్యత వహించాలంటూ శ్రీదేవి ఆరోపించడం దారుణమని మండిపడ్డారు. ఆమెకు ప్రమాదం పొంచి ఉందంటే.. అది కచ్చితంగా టీడీపీ వల్లే అని చెప్పారు. అందుకే శ్రీదేవికి పటిష్ట భద్రత కల్పించాలని కోరుతూ డీజీపీకి లేఖ రాస్తానని తెలిపారు. జగన్ ప్రభుత్వం వల్లే దళితులకు ఎంతో మేలు.. సీఎం జగన్ పాలనలో దళితులకు ఎంత మేలు జరుగుతోందో అందరికీ తెలుసని ఎంపీ నందిగం సురేశ్ చెప్పారు. చంద్రబాబు హయాంలో ఎప్పుడైనా ఎస్సీలకు ప్రాధాన్యం కలిగిన మంత్రి పదవులు ఇచ్చారా? దళితులను హోం మంత్రి చేశారా? అని ప్రశ్నిం చారు. అమరావతిలో ఏదో అన్యాయం జరిగిపోయిందని ఇప్పుడు మాట్లాడుతున్న శ్రీదేవి.. గతంలో అమరావతి అంశం గురించి ఏం మాట్లాడారో గుర్తు చేసుకోవాలని సూచించారు. అలాగే మిమ్మల్ని ఉద్దేశించి టీడీపీ వాళ్లు ఏమన్నారో కూడా గుర్తు చేసుకోవాలన్నారు. మీదంతా మేకప్.. ప్యాకప్.. మీరెప్పుడూ బ్యూటీ పార్లర్లలో ఉంటారంటూ టీడీపీ వాళ్లు దిగజారి చేసిన మాటలు గుర్తున్నాయా? అని ప్రశ్నిం చారు. గతంలో చంద్రబాబును నమ్మి వెళ్లిన 23 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎక్కడున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. అలాగే ఇప్పుడు వెళ్లిన ఆ నలుగురు కూడా సరిగ్గా అక్కడే, అలాగే ఉంటారని చెప్పారు. స్కామ్‌లంటూ శ్రీదేవి ఆరోపిస్తున్న వాటిపై చర్చకు తాను సిద్ధమని చెప్పారు. -
ఆధారాలతోనే నలుగురు ఎమ్మెల్యేలను సస్సెండ్ చేశాం: ఎంపీ మిథున్‌రెడ్డి
సాక్షి, విజయవాడ: ఆధారాలతోనే నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశామని ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. జగన్‌ను విభేదించిన వారికి ఓటమి తప్పదన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘గతంలో 23 మంది ఎమ్మెల్యేలకు పట్టిన గతే వీళ్లకూ పడుతుంది. క్రాస్ ఓటింగ్ చేసిన వాళ్లకు సీట్లు లేవని సీఎం ముందే చెప్పారు. చంద్రబాబు క్యారెక్టర్ లేని వ్యక్తి. అనైతికంగా ఎమ్మెల్యేలను కొని ఎన్టీఆర్‌ని ఎలా దించేశారో అందరికీ తెలుసు’ అంటూ మిథున్‌రెడ్డి మండిపడ్డారు. చదవండి: తప్పటడుగు వేసి అడ్డంగా దొరికిపోయారు.. ‘‘సీటు ఇస్తే ఓటు వేస్తామని ఎమ్మెల్యేలు చెప్పారు. కానీ సీఎం జగన్ నిజాయితీగా సీటు ఇవ్వలేనని చెప్పేశారు. ఒక ఎమ్మెల్సీ కంటే సీఎం జగన్ వ్యక్తిత్వం ముఖ్యమనుకున్నారు’’ అని మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో పోటీ చేసే దమ్ము లోకేష్‌కు ఉందా? అంటూ ఎంపీ సవాల్ విసిరారు. మేం కచ్చితంగా 175 సీట్లు గెలవాలన్న టార్గెట్‌తోనే పనిచేస్తామని ఆయన అన్నారు. చదవండి: జైలు తప్పదా బాబూ? -
తప్పటడుగు వేసి అడ్డంగా దొరికిపోయారు..
మార్చి 23, 2023. గురువారం రోజున ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు జరిగింది. ఏడు స్థానాలకు గాను ఆరు ఎమ్మెల్సీలను వైఎస్సార్ కాంగ్రెస్ గెలుచుకుంది. ఒక స్థానాన్ని తెలుగుదేశం గెలిచింది. ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే.. బలం లేకున్నా తెలుగుదేశం గెలవడం. ఓటుకు కోట్లు గుమ్మరించడంలో బహుశా దేశ రాజకీయాల్లోనే అత్యంత నిష్ణాతుడయిన చంద్రబాబు.. గతానుభవాలతో పాటు తగు జాగ్రత్తలు తీసుకుని నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు వల వేసినట్టు స్పష్టమయింది. ఓటుకు కోట్ల వెనక 40 ఇయర్స్ చంద్రబాబు చేసింది సిగ్గు మాలిన పని అని తెలిసినా ఎల్లో మీడియా మాత్రం భలేగా డప్పు కొట్టింది. మా బాబుకు తెలిసిన విద్యలు మరెవరికి తెలియదని, ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కాబట్టే బలం లేకున్నా తమ అభ్యర్థిని గెలిపించుకున్నాడని ఘనకీర్తిని అందుకున్నాయి ఎల్లోమీడియా. ఇక్కడ ఒక అడుగు ముందుకేసి కప్పదాటు వేసిన నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేల తరపునా సానుభూతి రాగం వినిపించింది ఎల్లో మీడియా. కనీసం సంజాయిషీ అడగకుండా వేటు ఎలా వేస్తారంటూ తన అజ్ఞానాన్ని బయటపెట్టుకుంది. క్రాస్ ఓటింగ్ ఎలా కనిపెట్టవచ్చు? నిజానికి రాజకీయాల్లో ఇలాంటి ఎన్నికలు కొత్తేమీ కాదు. గతంలోనూ జరిగాయి. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. చంద్రబాబు లాంటి రాజకీయ బేహారులు వచ్చిన తర్వాత ఎన్నికలేవైనా ఓటుకు కోట్లు దెబ్బకు భ్రష్టు పడుతున్నాయి కాబట్టి పార్టీలు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అందుకే వైఎస్సార్సిపి కూడా పూర్తి అవగాహనతో వ్యవహరించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేలున్నారు. అందరూ ఓటేశారు. వైఎస్సార్సిపికి 151 మంది ఉన్నారు. ఎన్నిక జరిగింది 7 సీట్లకు కాగా.. పోటీలో ఉన్నది 8 మంది. కాబట్టి.. తన దగ్గర ఉన్న 151 మంది ఎమ్మెల్యేలను 7 టీంలుగా విభజించింది. అంటే ప్రతీ ఎమ్మెల్యే తన తొలి ప్రాధాన్యతగా ఎవరిని ఎంచుకోవాలో ముందే స్పష్టంగా సూచించారు. ఉదాహారణకు వైఎస్సార్సిపి ఎమ్మెల్సీ అభ్యర్థులు A, B, C, D, E, F & G అనుకుందాం. ప్రతి ఎమ్మెల్యేకు కింద ఇచ్చినట్టుగా ఓటు వేయమని చెబుతారు. అలాగే రెండో, మూడో ప్రాధాన్యతకు సంబంధించిన ఆప్షన్లు కూడా ఇస్తారు. అంటే ప్రతీ ఒక్కరికి ఒక యూనిక్ కాంబినేషన్ ఉంటుంది. ఏ ఒక్కరిది కూడా మరొకరితో కలవదు. రెండో, మూడో ప్రాధాన్యత చూడగానే కాంబినేషన్లో ఎక్కడ తేడా వచ్చిందో అర్థమవుతుంది. దీన్ని బట్టి క్రాస్ ఓటింగ్ చేసిన ఎమ్మెల్యేను క్షణాల్లో గుర్తించేస్తారు. ముందుగానే యునిక్ సీక్వెన్స్ ఇవ్వడంతో అమ్ముడుపోయిన ఎమ్మెల్యేల గుట్టు రట్టయింది. విషయం బయటపడడంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలను వైఎస్ఆర్ సీపీ అధిష్టానం వెంటనే సస్పెండ్ చేసింది. నమ్మక ద్రోహులను ఉపేక్షించేదిలేదని ఓ స్పష్టమైన సందేశాన్ని పంపింది. ఎల్లో మీడియా కక్కుర్తి రాతలు ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మొత్తం సీట్లు 58. ప్రస్తుతం అధికార పక్షం వైఎస్సార్సిపికి సభలో 44 మంది సభ్యులున్నారు. తెలుగుదేశం పార్టీ కేవలం 10 స్థానాలకు పరిమితమయింది. ఇద్దరు స్వతంత్రులు కాగా, మరో ఇద్దరు పీడీఎఫ్. సభలో ఏ రకంగా చూసినా వైఎస్సార్‌సిపిదే శక్తిమంతమైన పార్టీ. పైగా ఎమ్మెల్సీ పదవుల కోసం వైఎస్సార్సిపి ఎప్పుడూ ఆరాటపడలేదు. చదవండి: బాబు బ్రోకర్లకు టైం వచ్చింది..! బీజేపీలోని పచ్చ నేతల ప్లాన్ ఏంటి? తమకున్న బలానికి ఎన్ని పదవులు వస్తాయో.. అంత వరకే ఆశించారు. నియోజకవర్గాల్లో పని తీరు సరిగాలేని ఉండవల్లి శ్రీదేవి ,మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలకు కూడా పార్టీ అధిష్టానం స్పష్టంగా తమ ఉద్దేశాన్ని ముందే చెప్పేసింది. మళ్లీ టికెట్ ఇస్తామని కూడా తప్పుడు హామీ ఇవ్వలేదు. ఇవన్నీ తెలిసినా.. నిజాలు దాచిపెట్టిన ఎల్లో మీడియా.. మా బాబు మహా గొప్పోడు, చాణక్యుడి కంటే సమర్థుడంటూ డప్పేసుకుంటోంది. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
నలుగురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
సాక్షి, అమరావతి: ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో.. విప్ ఉల్లంఘించినందుకు నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది వైఎస్సార్సీపీ. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ నుంచి శుక్రవారం సాయంత్రం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్ ఉల్లంఘించినందుకుగానూ, క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినందుకుగానూ నలుగురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ విధిస్తున్నట్లు ప్రకటించారాయన. ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, కోటం శ్రీధర్‌రెడ్డిపై వేటు వేస్తున్నట్లు తెలిపారు. ఈ నలుగురు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు పార్టీ గుర్తించిందని చెప్పారు సజ్జల. క్రాస్ ఓటింగ్‌పై అంతర్గత విచారణ జరిపాం. దర్యాప్తు తర్వాతే నలుగురిపై చర్యలు తీసుకున్నాం. చంద్రబాబు ఎమ్మెల్యేలను కొన్నారు. మాకున్న సమాచారం మేరకు.. డబ్బులు చేతులు మారినట్లు పార్టీ విశ్వసిస్తోంది. ఒక్కోక్కొరికి రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్లకు చంద్రబాబు ఆఫర్ చేశారు. క్రాస్ ఓటింగ్ చేసినవాళ్లకు టికెట్ కూడా ఇస్తామని టీడీపీ చెప్పి ఉండవచ్చు అని సజ్జల మీడియాకు వివరించారు. ఇదీ చదవండి: సీఎం జగన్‌ను ఎవరు వ్యతిరేకించినా వారికే నష్టం! -
MLA Quota MLC: అధికార పక్షానికి 6
సాక్షి, అమరావతి: ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయిన ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఆరు స్థానాలను సాధించింది. టీడీపీ ఒక స్థానాన్ని దక్కించుకుంది. శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 175 కాగా వైఎస్సార్సీపీకి 151 మంది ఎమ్మెల్యేల బలముంది. టీడీపీ నుంచి 23 మంది గెలుపొందినా చంద్రబాబు పోకడలు నచ్చక నలుగురు సభ్యులు ఆదిలోనే ఆ పార్టీకి దూరమయ్యారు. పవన్ కళ్యాణ్ వ్యవహార శైలితో ఆ పార్టీకి ఉన్న ఒకే ఒక సభ్యుడూ జనసేనకు దూరమయ్యారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే టీడీపీకీ సాంకేతికంగా 19 మంది సభ్యులే ఉన్నట్లు స్పష్టమవుతోంది. టీడీపీకి దూరమైన నలుగురు ఎమ్మెల్యేలు, జనసేనకు దూరమైన ఒక ఎమ్మెల్యే వైఎస్సార్సీపీ వెంట నడుస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానాన్ని దక్కించుకోవాలంటే 22 మంది ఎమ్మెల్యేల మొదటి ప్రాధాన్యత ఓట్లు అవసరం. వైఎస్సార్ సీపీకి శాసనసభలో స్పష్టమైన ఆధిక్యత ఉండటంతో ఏడు స్థానాలకూ అభ్యర్థులను పోటీకి పెట్టింది. తమకు సంఖ్యాబలం లేకపోయినప్పటికీ ప్రలోభాలకు తెర తీస్తూ ఒక స్థానం నుంచి అభ్యర్థిని చంద్రబాబు బరిలోకి దింపారు. 175 ఓట్లు చెల్లుబాటు ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయిన ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ శాసనసభ కమిటీ హాల్ నెంబర్–1లో పోలింగ్ నిర్వహించారు. 175 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటలకు ఎన్నికల పరిశీలకుడు ఎంటీ కృష్ణబాబు పర్యవేక్షణలో రిటర్నింగ్ అధికారి పీవీ సుబ్బారెడ్డి ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. పోలైన 175 ఓట్లు నిబంధనల మేరకు ఉండటంతో అన్నీ చెల్లుతాయని రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఆరుగురు విజయం.. తొలుత మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించగా వైఎస్సార్సీపీ అభ్యర్థులు పెన్మత్స వీవీ సూర్యనారాయణరాజు, పోతుల సునీత, బొమ్మి ఇజ్రాయెల్, చంద్రగిరి ఏసురత్నం, మర్రి రాజశేఖర్‌లకు 22 ఓట్లు చొప్పున వచ్చాయి. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు 23 ఓట్లు లభించాయి. దీంతో వారు మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. మరో ఇద్దరు వైఎస్సార్సీపీ అభ్యర్థులు జయమంగళ వెంకటరమణ, కోలా గురువులకు 21 చొప్పున మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. వారిద్దరికీ మొదటి ప్రాధాన్యత ఓట్లు సమానంగా రావడంతో ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. ఈ క్రమంలో ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు అత్యధికంగా వచ్చిన జయమంగళ వెంకటరమణ గెలుపొందినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ప్రలోభాల రాజకీయాలకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ తెలంగాణ శాసనమండలికి 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంఖ్యాబలం లేకపోయినా టీడీపీ అభ్యర్థిని బరిలోకి దించిన చంద్రబాబు ఓటుకు కోట్లను వెదజల్లి సాక్ష్యాధారాలతో 2015 మే 31న తెలంగాణ ఏసీబీ విభాగానికి దొరికిపోయారు. ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణ సర్కార్‌కు తాకట్టు పెట్టి రాత్రికి రాత్రే హైదరాబాద్ నుంచి పరారై కృష్ణా కరకట్టపై ఉన్న అక్రమ కట్టడంలోకి చేరుకున్నారు. 2014 నుంచి 2019 మధ్య టీడీపీ అధికారంలో ఉండగా వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేశారు. 1995లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకోవడంలోనూ ప్రలోభాలనే చంద్రబాబు ఎంచుకున్నారు. చంద్రబాబు కేవలం ప్రలోభాల రాజకీయాలు మాత్రమే చేస్తారని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. రాజకీయాల్లో ప్రలోభాలకు చంద్రబాబును బ్రాండ్ అంబాసిడర్‌గా అభివర్ణిస్తున్నారు. గడప గడపకూ విఫలమైన వారే లక్ష్యంగా.. నిర్విఘ్నంగా కొనసాగుతున్న సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్ల ప్రజాదరణ నానాటికీ పెరుగుతోంది. 2019 ఎన్నికల తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు తిరుపతి లోక్‌సభ, బద్వేలు, ఆత్మకూరు శాసనసభ స్థానాల ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ రికార్డు మెజార్టీతో విజయం సాధించడమే అందుకు తార్కాణం. మూడేళ్లుగా చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాలు, అందిస్తున్న సుపరిపాలనను ప్రతి ఇంటికీ వివరిస్తూ ప్రజల ఆశీస్సులు కోరేందుకు 2022 మే 11న గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడే మనం పాలకులం కాదు.. ప్రజలకు సేవకులమని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారితో మమేకమై సమస్యలు పరిష్కరిస్తూ ఆశీస్సులు పొందాలని ఆదిలోనే ఎమ్మెల్యేలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఎప్పటికప్పుడు వర్క్ షాప్‌లు నిర్వహిస్తూ మరింత ప్రభావవంతంగా నిర్వహించేలా ఎమ్మెల్యేలకు సూచనలు చేస్తున్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించడంలో వెనుకబడ్డ ఎమ్మెల్యేలను పనితీరు మెరుగుపర్చుకోవాలని సూచిస్తున్నారు. ఆ మేరకు గడప గడపకూ సమర్థంగా నిర్వహించలేక.. ప్రజలతో మమేకమవ్వలేక వైఎస్సార్సీపీకి దూరమైన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డికి తోడు మరో ఇద్దరు ఎమ్మెల్యేలను రూ.కోట్లు వెదజల్లి సంతలో పశువుల్లా కొనుగోలు చేసి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొడ్డిదారిన విజయం సాధించాలని చంద్రబాబు వ్యూహం రచించారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో విఫలమైన వారితోపాటు వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ టికెట్ దక్కదనే సంకేతాలున్న ఎమ్మెల్యేలే లక్ష్యంగా ప్రలోభాలకు చంద్రబాబు తెరతీశారు. ఈ క్రమంలో ఇద్దరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి టీడీపీ అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ చేయించారు. దీంతో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు 23 ఓట్లు వచ్చాయి. -
ద్రౌపది ముర్ము: విపక్షాలే దగ్గరుండి గెలిపించాయ్!
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కీలకంగా మారడం ఇప్పుడు పెద్ద చర్చకే దారి తీసింది. రాష్ట్రపతి ఎన్నికల్లో విప్ చెల్లదు. అంటే.. క్రాస్ ఓటింగ్‌కు లైన్ క్లియర్ అన్నమాట. అయితే ఆత్మప్రభోధానుసారం ఓటేయాలన్న పిలుపును సీరియస్‌గా తీసుకున్న చాలామంది ప్రజాప్రతినిధులు.. గిరిజన బిడ్డ ద్రౌపది ముర్ము(64)ను గెలిపించుకోవడం గమనార్హం. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలకు గట్టి దెబ్బే తగిలింది. యశ్వంత్ సిన్హాకే ఓటేయాలన్న ఆయా పార్టీల అధిష్టానాల పిలుపును లైట్ తీసుకుని.. ద్రౌపది ముర్ముకే ఓటేశారు చాలా మంది. మొత్తం ఎంపీల ఓట్లలో 540 (72.19 శాతం) ముర్ముకే పడ్డాయి. సిన్హాకు 208 మంది మాత్రమే ఓటేశారు. అలాగే అస్సాం, జార్ఖండ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీల నుంచి భారీగా క్రాస్ ఓట్లు ముర్ముకు పోలయ్యాయి. ముర్ముకు విపక్షాలకు చెందిన పలువురు గిరిజన, ఎస్సీ ప్రజాప్రతినిధులు కూడా జైకొట్టారు. సుమారు 17 మంది ఎంపీలతో పాటు దాదాపు 104 మందికి పైగా విపక్ష ఎమ్మెల్యేలు ముర్ముకు ఓటేసినట్టు తెలుస్తోంది. బీజేపీ ఏమో ఆ సంఖ్యను 18 రాష్ట్రాల నుంచి 126 ఎమ్మెల్యేలుగా చెబుతోంది. మొత్తం ఎలక్టోరల్ కాలేజీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేల ఓట్ల ద్వారా ముర్ముకు మద్దతుగా 64 శాతం ఓట్లు పోలయ్యాయి. గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి ఆమెకు మద్దతు లభించడం గమనార్హం. While President-elect #DroupadiMurmu got a vote in all states, Opposition's Presidential candidate Yashwant Sinha drew a blank in Andhra Pradesh, Nagaland, & Sikkim. pic.twitter.com/QTVtiRqBYS — ANI (@ANI) July 21, 2022 అస్సాంలో 22 మంది ఎమ్మెల్యేలు, మధ్యప్రదేశ్‌లో 20, మహారాష్ట్రలో 16, గుజరాత్లో 10, జార్ఖండ్‌లో 10, బిహార్‌లో 6,, ఛత్తీస్‌గఢ్‌లో 6, గోవాలో నలుగురు చొప్పున విపక్ష ఎమ్మెల్యేలు ముర్ముకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేశారు. మరోవైపు యూపీ, మహారాష్ట్ర అసెంబ్లీల నుంచి ద్రౌపది ముర్ముకు గరిష్ఠంగా ఓట్లు వచ్చాయి. అలాగే యశ్వంత్ సిన్హాకు పశ్చిమ బెంగాల్, తమిళనాడు నుంచి భారీ మద్దతు లభించింది. राष्ट्रपति पद के लिए मध्यप्रदेश से श्रीमती द्रौपदी मुर्मू जी को भारतीय जनता पार्टी के अतिरिक्त भी वोट मिले हैं। मैं अन्य दलों के उन विधायक साथियों को, जिन्होंने अंतरात्मा की आवाज पर श्रीमती द्रौपदी मुर्मू जी को राष्ट्रपति बनाने के लिए वोट किया है, उनको हृदय से धन्यवाद देता हूं। pic.twitter.com/pEWiY4O50Y — Shivraj Singh Chouhan (@ChouhanShivraj) July 21, 2022 మధ్యప్రదేశ్ సీఎం కృతజ్ఞతలు గిరిజన వర్గానికి చెందిన సోదరి విజయంలో భాగస్వామ్యులైనందుకు కృతజ్ఞతలంటూ విపక్షాల ప్రజాప్రతినిధులకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని ఆయన విడుదల చేయడం గమనార్హం. స్వతంత్రం అనంతరం పుట్టి.. రాష్ట్రపతి హోదాకు ఎన్నికైన అతిచిన్న వయస్కురాలిగా ద్రౌపది ముర్ము సరికొత్త చరిత్ర సృష్టించారు. జులై 25వ తేదీన ఆమె రాష్ట్రపతిగా ప్రమాణం చేయనున్నారు. ఇదీ చదవండి: ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. విపక్షాలకు షాక్ -
కాంగ్రెస్ సీనియర్ నేతకు బిగ్ షాక్
న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల్లో 16 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. ఐతే మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానాలో బీజేపీ విజయకేతనం ఎగురవేయగా.. రాజస్థాన్‌లో కాంగ్రెస్ మూడు స్థానాల్లో విజయం సాధించింది. కానీ కాంగ్రెస్‌కి హర్యానాలో ఊహించని షాక్ తగిలింది. హర్యానాలో రెండు స్థానాలకు ఎన్నికలకు జరగగా.. బీజేపీ నుంచి కృష్ణలాల్ పన్వార్ విజయం సాధించగా.. స్వతంత్ర అభ్యర్థి కార్తికేయ శర్మ గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి అజయ్ మాకెన్ ఓటమిని ఎదుర్కొన్నారు. ఐతే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణాయ్ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. ఆయన శర్మకు ఓటేయడంతో ఆ ఓటును అనర్హతగా ప్రకటించారు. కుల్దీప్ వేసిన ఎత్తుగడ అజయ్ మాకెన్ ఓటమికి దారి తీయడంతో పార్టీ ఆగ్రహానికి గురయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ప్రస్తుతం ఉన్న అన్ని పార్టీ పదవుల నుంచి తక్షణమే బహిష్కరించింది. (చదవండి: బీజేపీ ఎమ్మెల్యేపై వేటు పడింది.. ఎందుకో తెలుసా..?) -
బీజేపీ ఎమ్మెల్యే సస్పెండ్.. ఎందుకో తెలుసా..?
నాలుగు రాష్ట్రాల్లో 16 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు బీజేపీకి మరింత బలానిచ్చాయి. 16 స్థానాల్లో బీజేపీ 8 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యే, జేడీఎస్ ఎమ్మెల్యే క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. ఇదిలా ఉండగా.. రాజస్తాన్ రాజ్యసభ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి షాక్ తగిలింది. రెండు స్థానాల్లో బీజేపీ పోటీ చేయగా కేవలం ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది. కాగా, ధోల్పూర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే శోభారాణి కుశ్వాహా క్రాస్ ఓటింగ్‌కు పాల్పడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ ఎమ్మెల్యే అయిన శోభారాణి.. కాంగ్రెస్ అభ్యర్థి ప్రమోద్ తివారీకి ఓటు వేశారు. దీంతో తివారీ విజయాన్ని అందుకున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం శోభారాణిని సస్పెండ్ చేస్తూ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. క్రాస్ ఓటింగ్ సంబంధించి తనపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. మరోవైపు.. 2020లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కూడా శోభారాణి ఇలాగే క్రాస్ ఓటు వేశారు. ఆ సమయంలో పొరపాటున ఓటు వేసినట్టు చెప్పడంతో బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ, ఈసారి కూడా క్రాస్ ఓటు వేయడంతో వేటు పడింది. ఇక, రాజస్తాన్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు రన్‌దీప్ సుర్జేవాలా, ముకుల్ వాస్నిక్, ప్రమోద్ తివారీ విజయం సాధించారు. The disciplinary committee of the BJP has suspended Rajasthan MLA Shobha Rani for cross-voting in favour of Congress candidate Pramod Tiwari in Rajya Sabha elections and sought her reply for defying the party's whip. #RajyaSabhaElections2022 #RajyaSabha #RajyaSabhaElection pic.twitter.com/8s1dej3vvH — First India (@thefirstindia) June 11, 2022 ఇది కూడా చదవండి: కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ -
హైడ్రామా.. కాంగ్రెస్ కొంప ముంచిన ఎమ్మెల్యేలు
అస్సాంలో రాజ్యసభ ఎన్నికల్లో అసలైన రాజకీయం కనిపించింది. ఉన్న రెండు రాజ్యసభ సీటులను బీజేపీ, దాని మిత్రపక్షాలు కైవసం చేసుకున్నాయి. ఓ ఎమ్మెల్యే చేసిన పనితో కాంగ్రెస్ కొంప నిండా మునిగింది. దీంతో ఆ ఎమ్మెల్యేపై తక్షణ చర్యలు తీసుకుంది పార్టీ. ఇంతకీ ఆయన ఏం చేశాడో తెలుసా? గురువారం అస్సాం శాసనసభలో.. రెండు రాజ్యసభ సీట్ల కోసం ఓటింగ్ జరిగింది. ఒక సీటును బీజేపీ అభ్యర్థి పవిత్ర మార్గేరీటా ఏకపక్షంగా దక్కించుకోగా.. రెండో సీటు రసవత్తరమైన రాజకీయం నడిచింది. రూపిన్ బోరా(కాంగ్రెస్ తరపున), బీజేపీ అభ్యర్థి నర్జారీ(యూపీపీఎల్ అభ్యర్థి) రెండో సీటు కోసం పోటీ పడ్డారు. ఈ పోటీలో ఏఐయూడీఎఫ్(ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్) బోరాకు మద్ధతు ఇచ్చింది. ఈ సీటు గెలవాలంటే.. అభ్యర్థికి 43 సీట్లు వస్తే సరిపోతుంది. మొత్తం ఓట్లలో.. అధికార బీజేపీ దాని మిత్రపక్షాల కూటమికి 83 ఓట్లు ఉన్నాయి. ఇందులో పవిత్ర మార్గరీటా కోసం సరిపడా ఓట్లు బీజేపీకి అప్పటికే ఉన్నాయి. అయితే నర్జారీ కోసం మాత్రం మూడు ఓట్లు తక్కువ అయ్యాయి. ఇక ప్రత్యర్థి కూటమికి 44 ఓట్లు ఉన్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే తన ఓటును వేస్ట్ చేశాడు. ఓటు వేయడానికి క్యూలో నిల్చున్న సీఎం హిమంత బిస్వా శర్మ(కుడి నుంచి నాలుగో వ్యక్తి) ఓటింగ్ టైంలో బ్యాలెట్ పేపర్ మీద One అని రాయకుండా 1 అని నెంబర్ వేశాడు. దీంతో ఆ ఓటు పనికి రాకుండా పోయింది. ఈ చర్యకు ప్రతిగా విప్ ఉల్లంఘించినందుకు కాంగ్రెస్ పార్టీ అతన్ని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే తానేమీ ద్రోహం చేయలేదని, ఈ విషయంపై హైకమాండ్‌ను కలిసి వివరణ ఇస్తానని అంటున్నారు సదరు ఎమ్మెల్యే. ఆయన ఎవరో కాదు.. మాజీ మంత్రి, కరీమ్గంజ్(సౌత్) ఎమ్మెల్యే సిద్ధిఖీ అహ్మద్. Assam has reposed its faith in PM Sri @narendramodi ji by electing two NDA candidates to the Rajya Sabha by huge margins - BJP's Sri Pabitra Margherita (won by 11 votes) & UPPL's Sri Rwngwra Narzary (won by 9 votes). My compliments to winners @AmitShah @JPNadda @blsanthosh pic.twitter.com/Lozn8hkNGg — Himanta Biswa Sarma (@himantabiswa) March 31, 2022 మరోవైపు ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడడంతో నర్జారీ గెలపు నల్లేరు మీద నడకే అయ్యింది. నర్జారీకి 44 ఓట్లురాగా, బోరాకు 35 ఓట్లు వచ్చాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ.. గతంలో కాంగ్రెస్ నేత. 2015లో ఆయన బీజేపీలో చేరారు. ఈ కారణంగా.. పాత పరిచయాలను ఆసరాగా చేసుకుని ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు ప్రతిపక్ష కూటమి ఆరోపిస్తోంది. ఈ విషయమై ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలపై వేటు వేసింది కాంగ్రెస్. -
కొంపముంచే ‘క్రాస్ ఓటింగ్’
సాక్షి, భైంసా : నేరుగా అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపే క్రాస్ ఓటింగ్ ఒక్కోసారి సత్ఫలితాలనిచ్చినా.. కొంప ముంచే అవకాశాలే ఎక్కువ! నచ్చిన నాయకున్ని గెలిపించాలనే తాపత్రయంలో లెక్క గానీ తప్పితే.. ఆ నాయకుడు మరో ఐదేళ్ల దాకా పశ్చాత్తాపంతో కుమిలిపోవాల్సిందే! 2009 ఎన్నికలప్పుడు ముథోల్ నియోజకవర్గంలో ఈ విషయమే తేటతెల్లమైంది! 2009 ఎన్నికల్లో ముథోల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా వేణుగోపాలాచారి, కాంగ్రెస్ అభ్యర్థిగా బోస్లే నారాయణరావు పటేల్, ప్రజారాజ్యం అభ్యర్థిగా విఠల్‌రెడ్డి శాసనసభ బరిలో దిగారు. అప్పుడు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగడంతో లోక్‌సభ స్థానం టీడీపీ అభ్యర్థిగా రాథోడ్ రమేశ్, ప్రజారాజ్యం అభ్యర్థిగా నాగోరావు పోటీలో ఉన్నారు. అయితే, టీడీపీ నుంచి పోటీ చేసిన రాథోడ్ రమేశ్ సామాజికవర్గీయుల్లో చాలా మంది విఠల్‌రెడ్డి మద్దతుదారులు. విఠల్‌రెడ్డికి కాంగ్రెస్ టికెట్టు రాకపోవడంతో అంతా కలిసి ప్రజారాజ్యం పార్టీలో చేరిపోయారు. అప్పుడు తన సామాజికవర్గం ఓట్ల కోసం రాథోడ్ రమేశ్ ప్రజారాజ్యం పార్టీలో చేరిన విఠల్‌రెడ్డి మద్దతుదారుల సాయం కోసం అభ్యర్థించారు. ఇందులో భాగంగా వారిని ఎమ్మెల్యే స్థానానికి ఎవరికి ఓటేసినా.. ఎంపీ స్థానానికి మాత్రం తనకే ఓటేయాలని మాట తీసుకున్నట్లు సమాచారం! దీంతో టీడీపీ నుంచి ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసిన సముద్రాల వేణుగోపాలాచారికి కష్టమొచ్చింది. రాథోడ్ రమేశ్ కూడా అంతా సాఫీగానే జరుగుంతుందని అనుకున్నారు. కానీ, క్రాస్ ఓటింగ్ జరుగుతుందని ఎవరూ ఊహించలేకపోయారు. తమ సామాజికవర్గ నాయకుడిని ఎంపీగా గెలిపించాలన్న ఆలోచనలో ఓటు వేసేటప్పుడు చాలా మంది ఓటర్లు పొరపాటుపడ్డారు. ఎమ్మెల్యే అభ్యర్థి విఠల్‌రెడ్డికి అనుకుని వేసిన ఓటు ఎంపీ అభ్యర్థి నాగోరావుకు.. ఎంపీ అభ్యర్థి రాథోడ్ రమేశ్‌కు అనుకున్న ఓటు ఎమ్మెల్యే అభ్యర్థి వేణుగోపాలాచారికి పడ్డాయి. ఫలితాలు వచ్చే వరకు ఈ విషయం ఎవరికీ తెలియరాలేదు. గెలుపు తమదేనని ప్రజారాజ్యం పార్టీ అప్పట్లో ధీమాగా ఉంది. కానీ, కౌంటింగ్ రోజున అసలు విషయం తేలిపోయింది. 16 మే 2014న ఆదిలాబాద్‌లో ఓట్ల లెక్కింపు జరిగింది. ఆ ఎన్నికల్లో ఊహించని పరిణామాలు జరిగాయి. ముథోల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన విఠల్‌రెడ్డి 183 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ముథోల్ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి నాగోరావుకు 6,114 ఓట్లు ఎమ్మెల్యే అభ్యర్థి కంటే ఎక్కువగా వచ్చాయి. దీంతో ఒకరు గెలుస్తారనుకుంటే ఇంకొకరు గెలిచారు. ఇలా క్రాస్ ఓటింగ్ ఆనాడు తీవ్ర ప్రభావం చూపింది. -
ప్రతీకారం తీర్చుకున్న అమిత్ షా
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఉత్తరప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. తొమ్మిదో అభ్యర్థిని బరిలోదింపి ప్రత్యర్థి ఎత్తులను చిత్తుచేస్తూ తన అభ్యర్థిని గెలిపించుకుంది. భారీగా క్రాస్ ఓటింగ్ జరగటంతోపాటు ద్వితీయ ప్రాధాన్య ఓట్లతో ఎస్పీ, బీఎస్పీ ఉమ్మడి అభ్యర్థి విజయానికి గండికొట్టింది. మొన్నటి గోరఖ్‌పూర్, ఫూల్పూర్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. మిగిలిన ఆరు రాష్ట్రాల్లోనూ అక్కడ అధికారంలో ఉన్న పార్టీలు మెజారిటీ స్థానాలు గెలుచుకున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ 3, బీజేపీ ఒక స్థానంలో, పశ్చిమబెంగాల్లో 4 స్థానాల్లో తృణమూల్, కాంగ్రెస్ ఒక సీటును, ఛత్తీస్‌గఢ్‌లోని ఏకైక స్థానాన్ని బీజేపీ గెలుచుకుంది. కేరళలో ఎల్డీఎఫ్ మద్దతుతో జేడీయూ అభ్యర్థి విజయం సాధించారు. తెలంగాణలోని మూడుసీట్లను టీఆర్ఎ‹స్ గెల్చుకుంది. తాజా ఫలితాలతో రాజ్యసభలో ఎన్డీయే బలం 104కు చేరగా ఇందులో బీజేపీ ఖాతాలో 86 సీట్లున్నాయి. ఏప్రిల్ 2న ఖాళీ కానున్న మొత్తం 59 స్థానాలుకు నోటిఫికేషన్ వెలువడగా.. ఇందులో 33 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో బీజేపీ 16 స్థానాలు గెలుచుకుంది. ఎన్నికలు జరిగిన 26 స్థానాల్లో బీజేపీ 12 చోట్ల గెలిచింది. యూపీలో బీజేపీ జోరు ఉత్తరప్రదేశ్‌లోని 10 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 9 స్థానాలను కైవసం చేసుకోగా.. ఎస్పీ ఒక స్థానంలో గెలిచింది. ఎస్పీ మద్దతుతో బరిలో నిలిచిన బీఎస్పీ ఓటమిపాలైంది. ఎనిమిది మంది సభ్యులను గెలిపించుకునేందుకు అవసరమైన బలమే ఉన్నప్పటికీ.. విపక్షకూటమిని చీల్చేందుకు బీజేపీ 9వ అభ్యర్థిని బరిలోకి దించింది. దీంతో బీఎస్పీ, బీజేపీ 9వ అభ్యర్థి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఓటింగ్ పూర్తయిన తర్వాత.. కౌంటింగ్ ముందు ఇద్దరు సభ్యుల తీరుపై ఎస్పీ, బీఎస్పీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. దీనిపై విచారణ జరిపిన ఈసీ.. ఓ బీఎస్పీ, ఓ బీజేపీ ఎమ్మెల్యేల ఓట్లు చెల్లవని స్పష్టం చేసింది. ఒక్కోక్కటిగా ఫలితాలు వెలువడగా.. బీజేపీ అభ్యర్థులు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు సహా 8 మంది విజయం సాధిచారు. ఎస్పీ తరపున జయాబచ్చన్ గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. అందరి అ‘టెన్షన్’! పదో అభ్యర్థి కౌంటింగ్ ఉత్కంఠను పెంచింది. బీజేపీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి అనిల్ కుమార్ అగర్వాల్, బీఎస్పీ అభ్యర్థి అంబేడ్కర్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగింది. తొలి ప్రాధాన్య ఓట్లలో ఇద్దరు సభ్యులకూ సరిపోయేంత మెజారిటీ (37 ఓట్లు) రాకపోవటంతో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించాలని అధికారులు నిర్ణయించారు. అయితే వ్యూహాత్మకంగా తొలి 8 మంది అభ్యర్థులకు 39 మంది ఎమ్మెల్యేల చొప్పున ఓట్లను బీజేపీ వేయించింది. రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించాల్సి వచ్చినపుడు 8 మంది అభ్యర్థులకు అదనంగా పడిన తొలి ప్రాధాన్య ఓట్లను పరిగణనలోకి తీసుకోవటంతోపాటు.. రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించటంతో బీజేపీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించారు. కమలానికి ఛత్తీస్‘గఢ్’ ఛత్తీస్‌గఢ్‌లోని ఏకైక రాజ్యసభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీ అభ్యర్థి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సరోజ్ పాండే సునాయాసంగా విజయం సాధించారు. 90 మంది ఎమ్మెల్యేలున్న అసెంబ్లీలో 87 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 49 మంది బీజేపీ, ఒక స్వతంత్ర అభ్యర్థి, మరో బీఎస్పీ అభ్యర్థి సరోజ్ పాండేకు ఓటేశారు. జార్ఖండ్‌లో చెరొకటి జార్ఖండ్‌లో రెండు సీట్లకు ఎన్నికలు జరగగా ఒక సీటును బీజేపీ, మరో సీటును కాంగ్రెస్ గెలుచుకున్నాయి. 82 మంది ఎమ్మెల్యేలున్న అసెంబ్లీలో ఎన్డీయే కూటమికి 47 మంది మద్దతుంది. ఇక్కడ ఒక రాజ్యసభ సీటు గెలిచేందుకు 28 మంది సభ్యుల మద్దతు అవసరం. దీంతో బీజేపీ ఒక సీటును సునాయాసంగా గెలుచుకోగా.. రెండో స్థానానికి పోటీ చేసి ఓడిపోయింది. మమతకే పశ్చిమబెంగాల్ జై పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో బలమైన పార్టీగా ఉన్న తృణమూల్ తాజా రాజ్యసభ ఎన్నికల్లో నాలుగు సీట్లను సునాయాసంగా గెలుచుకుంది. సరైన బలం లేకున్నా తృణమూల్ మద్దతుతో ఐదో అభ్యర్థిగా బరిలోకి దిగిన కాంగ్రెస్ (అభిషేక్ సింఘ్వీ) ఓ స్థానాన్ని కైవసం చేసుకుంది. 294 మంది ఎమ్మెల్యేలున్న అసెంబ్లీలో ఒక్కో రాజ్యసభ సభ్యుడు గెలిచేందుకు 49 ఓట్లు అవసరం. 42 మంది సభ్యులున్న కాంగ్రెస్‌కు మిగిలిన తృణమూల్ సభ్యులు మద్దతు తెలిపారు. కేరళ జేడీయూదే.. రాజ్యసభకు కేరళనుంచి ఒక అభ్యర్థిని మాత్రమే పంపే అవకాశం ఉండగా.. ఇందుకు అధికార ఎల్డీఎఫ్, ప్రతిపక్ష యూడీఎఫ్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఎల్డీఎఫ్ నేరుగా తమ అభ్యర్థిని బరిలో దించనప్పటికీ.. జేడీయూ (శరద్‌యాదవ్ వర్గం) రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర కుమార్‌కు సంపూర్ణ మద్దతు తెలిపింది. 140 మంది ఎమ్మెల్యేలున్న రాష్ట్ర అసెంబ్లీ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యేందుకు 71 సభ్యుల మద్దతు అవసరం. అయితే అధికార వామపక్ష కూటమి మద్దతుతో వీరేంద్ర కుమార్ 89 ఓట్లు సంపాదించారు. కర్ణాటకలో కాంగ్రెస్ హవా.. రాష్ట్రంలోని నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు స్థానాల్లో, బీజేపీ ఒక స్థానంలో గెలుపొందింది. జేడీఎస్ ఎన్నికల బరి నుంచి తప్పుకోవడంతో ఆ పార్టీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. మొత్తం 224 ఎమ్మెల్యేల్లో 188 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒక్కో అభ్యర్థి విజయానికి 46 సీట్లు అవసరం కాగా.. బీజేపీ అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖర్ 50 ఓట్లతో గెలిచారు. కాంగ్రెస్ మొదటి అభ్యర్థి ఎల్.హనుమంతయ్య 44 ఓట్లతో, రెండో అభ్యర్థి జేసీ చంద్రశేఖర్ 46 ఓట్లతో గెలుపొందగా, మూడో అభ్యర్థి నాసీర్ అహ్మద్ 42 ఓట్లతో గెలుపొందారు. -
అభ్యర్ధుల్లో క్రాస్ ఓటింగ్ భయం
-
‘క్రాస్’ ఓటు.. టీడీపీకి చేటు!
అమలాపురం, న్యూస్‌లైన్ : ‘క్రాస్ ఓటింగ్..’- జిల్లాలో రాజకీయవర్గాల్లో చర్చంతా ఇప్పుడు దీనిపైనే. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బుధవారం జరిగిన పోలింగ్‌లో దీని ప్రభావం ఎక్కువగా ఉందని ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు, రాజకీయ విశ్లేషకులు గట్టిగా చెబుతున్నారు. జిల్లాలో ఏజెన్సీ, మెట్ట, మైదానం, కోనసీమ అనే తేడా లేకుండా ప్రతి నియోజకవర్గంలో క్రాస్ ఓటింగ్ అంచనాలకు మించి ఉందని అంచనా వేస్తున్నారు. పార్లమెంట్ అభ్యర్థులు కొన్నిచోట్ల, అసెంబ్లీ అభ్యర్థులు మరికొన్ని చోట్ల పనిగట్టుకుని క్రాస్ ఓటింగ్‌ను ప్రోత్సహించారని సమాచారం. ఈ ధోరణి ఎక్కువగా తెలుగుదేశం పార్టీలో కనిపించిందంటున్నారు. ఈ కారణంగా ఆ పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థులనే క్రాస్ ఓటింగ్ గుబులు ఎక్కువగా పట్టి పీడిస్తోంది. ఆ పార్టీకి ఎంతో కొంత ఆధిక్యత వస్తుందనుకున్న ప్రాంతాల్లో జరిగిన క్రాస్ ఓటింగ్ వల్ల తమ కొంప కొల్లేరవుతుందని ఆ పార్టీ అభ్యర్థులు, నాయకులు ఆందోళనకు గురవుతున్నారు. టీడీపీ పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థులు కేవలం తమ ఒక్కరికీ ఓటు వేస్తే చాలని, రెండో ఓటు మీకు నచ్చినవారికి వేసుకోండని బహిరంగంగా నిర్వహించిన ప్రచారం ఆ పార్టీ గెలుపు అవకాశాలను దెబ్బ తీసింది. పార్టీకి ఎంతో కొంత ఓటింగ్ పడే చోట కూడా రెండు ఓట్లు పార్టీకి వేయాలని కోరిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఒకరిద్దరు మాత్రమే కావడం గమనార్హం. ఎక్కడికక్కడ చీలిన టీడీపీ ఓట్లు.. క్రాస్ ఓటింగ్ ప్రభావం ప్రధానంగా అమలాపురం నియోజకవర్గంలో కనిపించింది. ఇక్కడ నుంచి పార్లమెంట్ బరిలో నిలిచిన పండుల రవీంద్రబాబు నామినేషన్ వేసే వరకు స్థానికంగా ఎవరికీ తెలియనే తెలియరు. దీనికి తోడు ఆయనను బరిలో నిలపడం వల్ల ఈ స్థానం ఆశించిన గొల్లపల్లి సూర్యారావు అవకాశం కోల్పోయి రాజోలు అసెంబ్లీ బరిలో నిలవాల్సి వచ్చింది. దీనితో అమలాపురం అసెంబ్లీ పరిధిలోని గొల్లపల్లి అభిమానులు క్రాస్ ఓటింగ్ చేశారని తెలుస్తోంది. అమలాపురం పట్టణంలో టీడీపీ ఆధిక్యత ఉన్న వార్డుల్లో సైతం ఆ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి పండులకు ఆశించిన స్థాయిలో ఓట్లు పడలేదని టీడీపీ నాయకులే అంగీకరిస్తున్నారు. ఉప్పలగుప్తం మండలంలో ఆ పార్టీ అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు సొంత గ్రామమైన ఎస్.యానాం, దాని చుట్టుపక్కల గ్రామాల్లో సైతం ఆ పార్టీ నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు పార్లమెంట్ అభ్యర్థికి మొండిచేయి చూపినట్టు తెలుస్తోంది. మండపేట, పి.గన్నవరం, రాజోలు, కొత్తపేట, మండపేటల్లో టీడీపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో కొన్నిచోట్ల పార్లమెంట్‌కు, మరికొన్ని చోట్ల అసెంబ్లీ అభ్యర్థులకు క్రాస్ ఓటింగ్ పడినట్టు ఆ పార్టీ నాయకులు గుర్తించారు. కాకినాడ పార్లమెంట్ పరిధిలో తుని, జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురాల్లో సైతం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులు కేవలం తమ విజయం పైనే దృష్టి పెట్టారు. దీనితో పార్టీకి గంపగుత్తగా పడాల్సిన ఓటింగ్‌లో కూడా చీలిక కనిపించిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడ టీడీపీ నుంచి పార్లమెంట్‌కు పోటీ చేస్తున్న తోట నరసింహానికి అసెంబ్లీ అభ్యర్థులతో సమానంగా ఓట్లు పడలేదని చెబుతున్నారు. తనకు ఎంతో కొంత బలం ఉన్న చోట నరసింహం కూడా తనకు పడే ఓట్ల పైనే దృష్టి పెట్టడం ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థులను కలవరానికి గురి చేస్తోంది. రాజమండ్రిలో టీడీపీకి బలమైన ఓటింగ్ ఉన్న ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల గెలుపుపై తొలి నుంచీ పెద్దగా నమ్మకం లేని పార్లమెంట్ అభ్యర్థి మురళీమోహన్ తనకు పడే ఓట్ల పైనే దృష్టి కేంద్రీకరించడం ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తోంది. అసలే ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెస్‌కు అంచనాలకు మించి ఓటింగ్ పడడం, మరోవైపు సొంత పార్టీలోనే అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులు క్రాస్ ఓటింగ్‌ను ప్రోత్సహించడం టీడీపీలో మినుకుమినుకుమంటున్న గెలుపు ఆశను కూడా ఆరిపోయేలా చేస్తోంది. -
‘అందోల్’ పైనే ఆందోళన
క్రాస్ ఓటింగ్ ఎవరి పుట్టి ముంచుతుందోనని నేతల గుండెల్లో గుబులు! జోగిపేట, న్యూస్‌లైన్: అందోల్ అసెంబ్లీ నియోజకవర్గంలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు ప్రచారం జరుగుతుండంతో అభ్యర్థుల్లో గుండెల్లో గుబులు పుడుతోంది. ఎన్నికల్లో ఓటర్లు చతురత చూపారు. ఒకేపార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు కాకుండా వేర్వేరు పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఓటరు ఏ పార్టీవైపు మొగ్గు చూపాడో తేల్చుకోలేక అభ్యర్ధులు ఆందోళన చెందుతున్నారు. జహీరాబాద్ లోక్‌సభ నియోజకవ ర్గంలో టీడీపీ అభ్యర్థికి కొంతమంది పార్టీ నాయకులు బహిరంగంగా మద్దతు ఇచ్చినా ఎమ్మెల్యే విషయానికి వచ్చే సరికి ఎవరికి వారు క్రాస్ ఓటింగ్ పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందోల్‌లో టీఆర్ఎస్, కాంగ్రెస్, అభ్యర్థికి, పుల్కల్లో కాంగ్రెస్ అభ్యర్థికి, అల్లాదుర్గం, మునిపల్లి, రాయికోడ్‌లలో కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులకు, టేక్మాల్‌లో టీఆర్ఎస్ అభ్యర్థికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు సమాచారం. టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పోటీలో ఉన్నప్పటికీ ఎమ్మెల్యే విషయంలో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు అనుమానిస్తున్నారు. మాజీ మంత్రి బాబూమోహన్ టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని కేడర్ అంతా ఆయన వెంట వచ్చినా పుల్కల్, అల్లాదుర్గం, అందోల్‌లో కొంత మంది నాయకులు టీడీపీలోనే ఉండిపోయారు. మిగతా వారు టీఆర్ఎస్కు ఏకపక్షంగా ఓటువేశారు. టీఆర్ఎస్లో చేరని టీడీపీ నాయకులకు టీడీపీ ఎంపీ అభ్యర్థి నియోజకవర్గ ప్రచార బాధ్యతలను అప్పగించారు. నియోజకవర్గం కేంద్రంలో ఒక సామాజిక వర్గానికి చెందిన వారు టీడీపీ ఎంపీ అభ్యర్థికి బహిరంగంగా మద్దతు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో పార్టీలకతీతంగా ఓట్లు క్రాస్ అయినట్లు భావిస్తున్నారు. అభ్యర్థుల గుణ గణాలు, సామాజిక నేపథ్యం, పార్టీ వ్యవహరశైలిపై ఒక అంచనాకు వచ్చిన మెజార్టీ ఓటర్లు ఒకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు కాకుండా వేర్వేరు అభ్యర్థులకు ఓట్లు వేశారని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామం అభ్యర్థులను కలవరపరుస్తోంది. క్రాస్ ఓటింగ్ ఏ మేరకు జరిగిందనే అంశంపైనే అభ్యర్థుల విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. మండలాలు, గ్రామాల వారీగా ఓటింగ్ సరళిపై సమాచారం సేకరించిన ఆయా పార్టీల అభ్యర్థులు క్రాస్ ఓటింగ్‌పై బూత్‌ల వారీగా ఆరా తీస్తున్నారు. ఓటర్ల వ్యవహర శైలి లోక్‌సభ అభ్యర్థుల్లో గుబులు రేపుతుంది. ఎమ్మెల్యే అభ్యర్థికి మొగ్గు చూపిన ఓటర్లు ఎంపీ విషయంలో మరో పార్టీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసినట్లు తెలుస్తోంది. ఈసారి ఎన్నికల్లో బహుముఖ పోటీ ఉండడంతో ఓటర్లు తమకు ఇష్టం వచ్చిన అభ్యర్థికి వారికి ఓటు వేశారు. నియోజకవర్గంలో క్రాస్ ఓటింగ్ ఎవరికి లాభం..ఎవరికి నష్టం కల్గిస్తుందో 16వ తేదీ వరకు వేచి చూడాల్సి ఉంది. -
ఎంపీకి ఇటు.. అసెంబ్లీకి అటు!
* తెలంగాణలో భారీగా క్రాస్ ఓటింగ్‌కు అవకాశం * మిత్రపక్షాల వాళ్లు ఎక్కడ పాతుకుపోతారేమోనన్న భయం * పొత్తులు, స్థానిక పరిస్థితులతో అధిక ప్రభావం * ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలకు క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుంది. ఉద్యమ నేపథ్యం, స్థానిక పరిస్థితులు, బలహీన అభ్యర్థులు బరిలో ఉండడం, పొత్తులతో బరిలో ఉన్న మిత్రపక్షాల అభ్యర్థులు ఎక్కడ పాతుకుపోతారేమోనన్న సందేహం... ఇలాంటివన్నీ క్రాస్ ఓటింగ్ ఆందోళనను మరింత రేకెత్తిస్తున్నాయి. దీనికితోడు పలు చోట్ల స్వయంగా పార్టీలు, అభ్యర్థులే క్రాస్ ఓటింగ్‌ను ప్రోత్సహించడం ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారుతోంది. దీంతో పాటు ఎంపీ అభ్యర్థులు బలహీనంగా ఉన్న చోట.. ఆ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులు, అసెంబ్లీ అభ్యర్థులు బలహీనంగా ఉన్న చోట ఎంపీ అభ్యర్థులు క్రాస్ ఓటింగ్‌ను ప్రొత్సహిస్తుండడం.. అందులోనూ సొంత పార్టీలు, పార్టీ నేతలే ఈ పని చేస్తుండడం గమనార్హం. దీంతో క్రాస్ ఓటింగ్ భారీగా ఉండవచ్చని అంచనా. దీని వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనే విషయమై పార్టీలు ఒక స్పష్టతకు రాలేకపోతున్నాయి. అన్ని పార్టీలకూ సెగ: టీఆర్ఎస్ తెలంగాణలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. పొత్తులో భాగంగా మిత్రపక్షం బీజేపీకి టీడీపీ అధిక స్థానాలను వదిలి పెట్టింది. దీంతో పొత్తులో సీట్లు కోల్పోయిన నేతలు ఆగ్రహంతో ఉన్నారు. మిత్రపక్ష అభ్యర్థి గెలిస్తే పాతుకుపోతాడేమోనన్న భయంతో సదరు అభ్యర్థికి ఓటేయొద్దంటూ శ్రేణులను ఆదేశిస్తున్నారు. టీడీపీ అభ్యర్థులు పోటీలో లేని ప్రాంతాల్లో ఆ పార్టీ క్యాడర్ పక్క పార్టీలవైపు మొగ్గుచూపుతున్నారు. అలాంటి చోట్ల్ల ఈ క్యాడర్ ప్రభావంతోనే గెలుపోటములు మారిపోయే పరిస్థితి ఉంది. బీజేపీ పోటీలో లేని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. పార్టీలు, అభ్యర్థులు కూడా: కొన్ని ప్రాంతాల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులే క్రాస్ ఓటింగ్‌కు కారణమవుతున్నారు. ఏదైనా పార్లమెంట్ స్థానంలో పార్టీ అభ్యర్థి బలంగా లేకపోతే.. దాని పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులు తమ గెలుపు కోసం కష్టపడాల్సి వస్తున్నది. అలాంటి ప్రాంతాల్లో ‘అసెంబ్లీకి మాకు ఓటు వేయండి.. పార్లమెంట్‌కు మీ ఇష్టం’ అనే విధంగా ప్రచారం చేశారు. ఇక పార్లమెంట్ స్థానంలో గట్టి అభ్యర్థి ఉండి.. అసెంబ్లీ అభ్యర్థులపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నచోట మరోలా క్రాస్ ఓటింగ్‌ను ప్రొత్సహిస్తున్నారు. ఉదాహరణకు నిజామాబాద్ లోక్‌సభ స్థానాన్ని తీసుకుంటే.. పొత్తులో భాగంగా ఇక్కడ బీజేపీ అభ్యర్థి పోటీలో ఉన్నారు. ఇక్కడ భారీగా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ స్థానాలకు ఒక పార్టీ అభ్యర్థికి ఓట్లు వేసి, పార్లమెంట్‌కు వచ్చేసరికి మరో పార్టీ అభ్యర్థికి ఓట్లు వేసే అవకాశం కనిపిస్తోంది. ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ ఆదివాసీ గిరిజన వర్గానికి చెందిన అభ్యర్థి వైపు ఆ వర్గ ప్రజలు మొగ్గు చూపుతున్నారు. కానీ, అసెంబ్లీ విషయానికి వచ్చే సరికి ఆయా పార్టీ అభ్యర్థులను బట్టి ఓట్లు పడే పరిస్థితి ఉంది. ఇక మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానం పరిధిలోనూ ‘ఎమ్మెల్యేకు ఎవరికైనా వేయండి.. ఎంపీగా మాత్రం నాకు ఓటేయండి..’ అంటూ ప్రచారం చేస్తున్నారు. మల్కాజిగిరిలో మరీ ఎక్కువ: హైదరాబాద్‌లోని మల్కాజిగిరి లోక్‌సభ స్థానం పరిధిలో కూడా భారీగా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఇక్కడ ప్రధాన పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థికి, ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. పైగా ఎంపీకి ఓటు వే యాలని అడిగితే.. తమకు కూడా ఓటేసే పరిస్థితి లేదని అంచనా వేసిన సదరు అసెంబ్లీ అభ్యర్థులు ‘ఎంపీకి మీ ఇష్టం.. అసెంబ్లీకి మాత్రం మాకే ఓటేయండి..’ అంటూ ప్రచారాన్ని నిర్వహించారు. అలాగే ఇక్కడ మరో ప్రధాన పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్నా.. ఆ పార్టీయే పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం లేదు. ఈ మేరకు పార్టీ క్యాడర్‌కు కూడా సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. -
క్రాస్ ఓటింగ్