నాలుగు రాష్ట్రాల్లో 16 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు బీజేపీకి మరింత బలానిచ్చాయి. 16 స్థానాల్లో బీజేపీ 8 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యే, జేడీఎస్ ఎమ్మెల్యే క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు.
ఇదిలా ఉండగా.. రాజస్తాన్ రాజ్యసభ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి షాక్ తగిలింది. రెండు స్థానాల్లో బీజేపీ పోటీ చేయగా కేవలం ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది. కాగా, ధోల్పూర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే శోభారాణి కుశ్వాహా క్రాస్ ఓటింగ్‌కు పాల్పడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ ఎమ్మెల్యే అయిన శోభారాణి.. కాంగ్రెస్ అభ్యర్థి ప్రమోద్ తివారీకి ఓటు వేశారు. దీంతో తివారీ విజయాన్ని అందుకున్నారు.
ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం శోభారాణిని సస్పెండ్ చేస్తూ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. క్రాస్ ఓటింగ్ సంబంధించి తనపై ఎందుకు చర‍్యలు తీసుకోకూడదో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. మరోవైపు.. 2020లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కూడా శోభారాణి ఇలాగే క్రాస్ ఓటు వేశారు. ఆ సమయంలో పొరపాటున ఓటు వేసినట్టు చెప్పడంతో బీజేపీ ఎలాంటి చర‍్యలు తీసుకోలేదు. కానీ, ఈసారి కూడా క్రాస్ ఓటు వేయడంతో వేటు పడింది. ఇక, రాజస్తాన్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు రన్‌దీప్ సుర్జేవాలా, ముకుల్ వాస్నిక్, ప్రమోద్ తివారీ విజయం సాధించారు.
The disciplinary committee of the BJP has suspended Rajasthan MLA Shobha Rani for cross-voting in favour of Congress candidate Pramod Tiwari in Rajya Sabha elections and sought her reply for defying the party's whip.
— First India (@thefirstindia) June 11, 2022
#RajyaSabhaElections2022 #RajyaSabha #RajyaSabhaElection pic.twitter.com/8s1dej3vvH
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్
Comments
Please login to add a commentAdd a comment