
సాక్షి, విజయవాడ: ఆధారాలతోనే నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశామని ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. జగన్‌ను విభేదించిన వారికి ఓటమి తప్పదన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘గతంలో 23 మంది ఎమ్మెల్యేలకు పట్టిన గతే వీళ్లకూ పడుతుంది. క్రాస్ ఓటింగ్ చేసిన వాళ్లకు సీట్లు లేవని సీఎం ముందే చెప్పారు. చంద్రబాబు క్యారెక్టర్ లేని వ్యక్తి. అనైతికంగా ఎమ్మెల్యేలను కొని ఎన్టీఆర్‌ని ఎలా దించేశారో అందరికీ తెలుసు’ అంటూ మిథున్‌రెడ్డి మండిపడ్డారు.
చదవండి: తప్పటడుగు వేసి అడ్డంగా దొరికిపోయారు..
‘‘సీటు ఇస్తే ఓటు వేస్తామని ఎమ్మెల్యేలు చెప్పారు. కానీ సీఎం జగన్ నిజాయితీగా సీటు ఇవ్వలేనని చెప్పేశారు. ఒక ఎమ్మెల్సీ కంటే సీఎం జగన్ వ్యక్తిత్వం ముఖ్యమనుకున్నారు’’ అని మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో పోటీ చేసే దమ్ము లోకేష్‌కు ఉందా? అంటూ ఎంపీ సవాల్ విసిరారు. మేం కచ్చితంగా 175 సీట్లు గెలవాలన్న టార్గెట్‌తోనే పనిచేస్తామని ఆయన అన్నారు.
చదవండి: జైలు తప్పదా బాబూ?
Comments
Please login to add a commentAdd a comment