సాక్షి, అనకాపల్లి జిల్లా: ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వ్యక్తి వైఎస్ జగన్ అని.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ వ్యాఖ్యానించారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. మంగళవారం ఆయన నర్సీపట్న నియోజకవర్గ ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో మాజీ మంత్రులు బూడి ముత్యాల నాయుడు, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు ధర్మశ్రీ, ఉమా శంకర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీకి 600 పైగా సభ్యుల బలం ఉందని.. కూటమికి 200 మంది సభ్యుల బలం మాత్రమే ఉందని బొత్స అన్నారు. రెండు పార్టీల మధ్య 400 ఓట్లు తేడా ఉందన్నారు. ‘‘ఎంపీటీసీ జెడ్పీటీసీల గౌరవాన్ని కాపాడే బాధ్యత మాది. డబ్బుతో ఓట్లు కొనాలని చంద్రబాబు చూస్తున్నారు. ఓట్లు కొనడం ప్రజా స్వామ్యంలో మంచి పద్దతి కాదు. గతంలో టీడీపీ కంటే 50 ఓట్లు తక్కువగా ఉంటే పోటీ నుంచి తప్పుకున్నాము’’ అని బొత్స పేర్కొన్నారు.
‘‘సంపద సృష్టస్తానని చంద్రబాబు చెప్పారు.. ఎన్నికల తరువాత రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని చెపుతున్నారు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ఎన్నికలకు ముందు చంద్రబాబుకు తెలియదా?’’ అంటూ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment