EC: తెలంగాణ సహా 12 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు.. | Election Commission Notification Released 12 Rajya Sabha Seats ByPolls | Sakshi
Sakshi News home page

తెలంగాణ సహా 12 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ రిలీజ్‌

Published Wed, Aug 7 2024 3:05 PM | Last Updated on Wed, Aug 7 2024 3:28 PM

Election Commission Notification Released 12 Rajya Sabha Seats ByPolls

సాక్షి, ఢిల్లీ: రాజ్యసభ ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఖాళీగా ఉన్న 12 రాజ్యసభ స్థానాలకు సీఈసీ నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేసింది. ఇక, తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీ కేశవరావు రాజీనామా చేయడంతో  ఖాళీ అయిన స్థానానికి కూడా ఎన్నికలు జరగనున్నాయి.

షెడ్యూల్‌ ఇలా..

  • సెప్టెంబర్‌ మూడో తేదీన ఉప ఎన్నికలకు పోలింగ్. అదే సాయంత్రం ఐదు గంటల నుంచి కౌంటింగ్‌.

  • ఇక, నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 26, 27 చివరి తేదీ

అయితే, 12 రాజ్యసభ స్థానాల్లో 11 స్థానాలను ఎన్డీయే కూటమి దక్కించుకునే అవకాశమే ఉంది. తెలంగాణ నుంచి కాంగ్రెస్‌కు ఒక్క స్థానం వచ్చే అవకాశముంది. కాగా, తెలంగాణ నుంచి బీఆర్‌ఎస్‌ ఎంపీగా కేశవరావు పార్టీకి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికల జరుగుతోంది. అనంతరం, కేకే కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement