
న్యూఢిల్లీ: ఏప్రిల్ 16న ఉత్తారఖండ్ మసూరీలో పెళ్లి. 19న హర్యానాలోని కర్నాల్‌లో రిసెప్షన్. ఏప్రిల్ 21న కశ్మీర్‌లో హనీమూన్. ఏప్రిల్ 23న కర్నాల్‌లో అంత్యక్రియలు. ఇండియన్ నేవి లెఫ్టినెంట్ కల్నల్ వినయ్ నర్వాల్ జీవితం ఇలా ముగిసింది.
ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన త్రీవవాదుల దాడిలో 26 మంది మరణించారు. వారిలో నేవి అధికారి వినయ్ నార్వాల్ ఒకరు. పహల్గాంలో టెర్రరిస్టుల దాడికి కొద్ది నిమిషాల ముందు వినయ్ నార్వాల్, ఆయన సతీమణి హిమాన్షి సరదగా గడిపిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియోలు చూసిన నెటిజన్లు సైతం విచారం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.
We're safe. A recent video was misused by some pages, falsely claiming it was the last video of late Vinay narwal and his wife. They have clarified that this video is not theirs. #Pahalgam #Kashmir #pahalgamattack pic.twitter.com/aAdlnTarNf
— Shaheen khan (@shaheenkhan09) April 24, 2025
ఆ వీడియో మాదే
కానీ,ఆ వీడియోలో ఉన్నది వినయ్ నార్వాల్ దంపతులు కాదని, ఆ వీడియోలో ఉన్నది తామేనంటూ ఆశిష్ శరావత్, యాషికా శర్మ దంపతులు సోషల్ మీడియాలో ఓ వీడియోని పోస్టు చేశారు. ఆ వీడియోలో.. ‘పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్, అతని భార్య చివరి హనీమూన్ వీడియో అంటూ మా వీడియోని షేర్ చేస్తున్నారు. నేవి అధికారి వినయ్ నర్వాల్ దంపతుల పేరిట వైరల్ అవుతున్న వీడియో మాదే. దుర్ఘటన జరిగే సమయంలో మేం అక్కడలేము.
మేం బ్రతికే ఉన్నాం..
కశ్మీర్ టూర్‌లో ఉండగా ఏప్రిల్ 14న రికార్డ్ చేసిన వీడియోని ఏప్రిల్ 22న సోషల్ మీడియాలో షేర్ చేశాం. అయితే అదే రోజు పహల్గాం దాడి జరగడం. మేం పోస్టు చేసిన వీడియోకి నెగిటీవ్ కామెంట్లు వచ్చాయి. వెంటనే వాటిని డిలీట్ చేశాం. కానీ అప్పటికే నేవి అధికారి వినయ్ నర్వాల్ దంపతుల పేరిట వీడియోని షేర్ చేశారని స్పష్టత ఇచ్చారు. యాషికా, ఆశిష్‌లు స్పందిస్తూ.. మేం బ్రతికే ఉన్నాం. మేం షేర్ చేసిన వీడియో ఇలా ఒక విషాద ఘటనకు లింక్ చేయడం మాకు బాధ కలిగింది. మేము లెఫ్టినెంట్ నర్వాల్ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. దయచేసి ఈ వీడియోను షేర్ చేయొద్దని కోరారు.
తప్పుడు ప్రచారం మమ్మల్ని మరింత బాధిస్తున్నాయి
పహల్గాంలో వినయ్ నర్వాల్ దంపతులు సంతోషంగా గడిపిన చివరి క్షణం ఇదేనంటూ 19సెకన్ల వీడియోను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. ఆ వీడియోపై వినయ్ నర్వాల్ సోదరి స్రిష్టి నర్వాల్ స్పందించారు. ఆ వీడియోలో ఉన్నది తన సోదరుడు వినయ్, వదిన హిమాన్షి కాదని తెలిపారు. ఇలా తప్పుడు ప్రచారం చేస్తూ వినయ్‌ను అగౌర పరచొద్దని కోరారు. వినయ్ గురించి కుటుంబసభ్యులు సమాచారం ఇస్తారని అన్నారు. మేం ఇప్పటికే తీవ్ర దుఃఖంలో ఉన్నాం. ఇలాంటి పుకార్లు మమ్మల్ని మరింత బాధపెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.