బీఆర్‌ఎస్‌పై తప్పుడు ప్రచారం.. వారికి కేటీఆర్‌ సీరియస్‌ వార్నింగ్‌ | Ex Minister KTR Serious Reaction On Social Media Over Fake Campaign On BRS And BJP Merger, Tweet Inside | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌పై తప్పుడు ప్రచారం.. వారికి కేటీఆర్‌ సీరియస్‌ వార్నింగ్‌

Published Wed, Aug 7 2024 3:29 PM | Last Updated on Wed, Aug 7 2024 4:13 PM

 Ex Minister KTR Serious On Social Media Over Fake Campaign

సాక్షి, హైదరాబాద్‌: సోషల్‌ మీడియా వేదికగా బీఆర్‌ఎస్‌పై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై కేటీఆర్‌ సీరియర్‌ అయ్యారు. బీఆర్‌ఎస్‌ పార్టీ విలీనం అంటూ ఫేక్‌ ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్‌ ఇచ్చారు.

బీఆర్ఎస్ పార్టీపైన నిరాధారమైన దుష్ప్రచారం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ విలీనం అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులు వెంటనే ప్రజలకు వివరణ ఇవ్వాలి. లేదంటే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.  24 సంవత్సరాలుగా ఇలాంటి అనేక కుట్రలు, కుతంత్రాలు, కుట్రదారులను ఎదుర్కొన్న పార్టీ మాది. ఇవన్నీ దాటుకొని 24 ఏళ్ల పాటు నిబద్ధతతో పట్టుదలతో అవిశ్రాంతంగా పోరాడి తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్‌ఎస్‌.

 

కొట్లాది సాధించుకున్న తెలంగాణను సగర్వంగా నిలబెట్టుకుని, అభివృద్ధిలో అగ్ర భాగంలో నిలిపాం. ఆత్మగౌరవం, అభివృద్ధిని పర్యాయపదాలుగా మార్చుకొని ఇతర రాష్ట్రాలకి ఆదర్శంగా ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాము. కోట్లాది గొంతుకలు, హృదయాలు తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ గుర్తింపు కోసం పోరాడుతున్నాయి కాబట్టే ఇది సాధ్యమైంది.  ఎప్పటి లాగానే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుంది.. పోరాడుతుంది. ఇప్పటికైనా అడ్డగోలు అసత్యాలను దుష్ప్రచారాలను మానుకోవాలి. పడతాం, లేస్తం, తెలంగాణ కోసమే పోరాడుతాం.. కానీ తలవంచం.. ఎన్నటికైనా ఎప్పటికైనా అంటూ కేటీఆర్‌ కామెంట్స్‌ చేశారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement