పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో ఓట్ల కొనుగోలు చేసేందుకు రూ.30కోట్ల పంపిణీపై చర్యలు తీసుకోవాలి
ఓట్ల కొనుగోలు ప్రయత్నాలకు సంబంధించిన ఆధారాలు, బ్యాంక్ వివరాలు అందజేశాం
ఎన్నికల ప్రధానాధికారికి బీజేపీ నేత రఘునందన్‌రావు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఓట్లు కొనుగోలు చేసినందుకు బీఆర్‌ఎస్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధా నాధికారికి బీజేపీ నేత రఘునందన్‌రావు విజ్ఞప్తి చేశారు. నల్లగొండ–వరంగల్–ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో విచ్చలవిడిగా డబ్బు ఖర్చుచేసి అక్రమాలకు పాల్పడిందని ఆరో ³ంచారు. మంగళవారం ఈ మేరకు సీఈఓను కలిసి రాతపూర్వకంగా ఫిర్యాదు పత్రం అంద జేశా రు. ఈ సందర్భంగా రఘునందన్‌రావు మీడియా తో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ బ్యాంక్ ద్వారా డబ్బు పంపించిన అకౌంట్, పాన్ కార్డు వివరాలు అందజేసినట్టు తెలిపారు.
వాటి ఆధారంగా వెంటనే చర్యలు తీసుకోవాలని, ఆ పార్టీ గుర్తింపు రద్దుచేయాలని కోరినట్టు తెలిపారు. రాజకీయ కార్యకలాపాలకు సంబంధించి ఆదాయపన్ను మినహాయింపు పొందిన బీఆర్‌ఎస్ బ్యాంక్ ఖాతా ద్వారా రూ.30 కోట్లు పలువురు నాయకులకు బదిలీ చేసి ఎన్నికల అక్రమాలకు పాల్పడిందన్నారు. డబ్బు పంచి ఓట్ల కొనుగోలుతో ఎన్నికల్లో గెలిచేందుకు బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, ఎమ్మె ల్యేలపై చర్యలతోపాటు బీఆర్‌ఎస్ గుర్తింపును రద్దు చేయాలని బీజేపీ తరఫున కోరినట్టు తెలిపారు. ఏ బ్యాంక్ ఖాతా ద్వారా ప్రజల నుంచి విరాళాలు సేకరించారో, తిరిగి ఓట్లు కొనుగోలుకు ప్రయత్నించారో ఆ అకౌంట్ వివరాలు సీఈఓకు అందజేశామ న్నారు. తాను అందజేసిన వివరాలు, సమాచారాని కి అనుగుణంగా చర్యలు తీసుకోక పోతే ఢిల్లీ వెళ్లి చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను కలిసి బీఆర్‌ఎస్ అకౌంట్ డిటైల్స్, ఆదాయపు పన్ను మినహాయింపు పొందిన ఆ పార్టీ పాన్ కార్డు వివరాలు అందజేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment