
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేటీఆర్ పాదయాత్ర కాదు.. మోకాళ్ల యాత్ర చేసినా ఎవరూ బీఆర్‌ఎస్‌ను నమ్మరు అంటూ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఘాటు విమర్శలు చేశారు. అలాగే, దీపావళికి బజార్లలో బాంబులు పేలాయి కానీ పొంగులేటి చెప్పిన కుక్క తోక పటాకులు మాత్రం పేలలేదు అంటూ ఎద్దేవా చేశారు.
బీజేపీ ఎంపీ రఘునందన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఉందని అంటున్నారు. ఆయన తప్పుకుంటే వద్దు అనే వాళ్లు ఎవరూ లేరు. అధికారంలో ఉన్న పదేళ్లు కేటీఆర్‌కు ప్రజలను కలిసే సమయం దొరకలేదు. ఇప్పుడు పాదయాత్ర ఎందుకు?. కేటీఆర్ మోకాళ్ల యాత్ర చేసినా ఎవరూ పట్టించుకోరు. కేసీఆర్ పది నెలలుగా ఫామ్ హౌస్‌లో ఉన్నాడు. ఏమైనా నష్టం జరిగిందా?. కేటీఆర్ వచ్చింది ప్రజల కోసం కాదు ఆయన వచ్చింది డబ్బుల కోసం, అధికారం కోసం, ఫామ్ హౌస్ కోసం మాత్రమే. మీకు పది నెలల పాలనే విసుగొస్తే పదేళ్లు మిమ్మల్ని ఎలా భరించారు.
కేటీఆర్‌కు ఎవరి మీదా నమ్మకం లేదు. చివరకు తన కుటుంబ సభ్యులపై కూడా నమ్మకం లేదు. జన్వాడ ఫామ్‌హౌస్ కేసులో సీసీ టీవీ ఫుటేజ్‌ను బయటపెట్టాలి. అప్పుడే అక్కడ ఏం జరిగిందో అందరికీ తెలుస్తుంది. తెలంగాణలో ఆడవాళ్లు తాగుతారని కోరుట్ల ఎమ్మెల్యే అంటున్నారు. తెలంగాణలో ఎక్కడైనా ఆడవాళ్లు తాగుతారా?. దీపావళికి బజార్లలో బాంబులు పేలాయి కానీ మంత్రి పొంగులేటి చెప్పిన కుక్క తోక పటాకులు మాత్రం పేలలేదు’ అంటూ సెటైర్లు వేశారు.
Comments
Please login to add a commentAdd a comment