సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండమైపోతుందని బీఆర్‌ఎస్ నేతలు అంటున్నారు. అదే జరిగితే కాంగ్రెస్ కార్యకర్తలెవరూ గాజులు తొడుక్కుని కూర్చోలేదన్నారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ సభ్యుల మధ్య వాడీవేడీ చర్చ నడుస్తోంది. ఈరోజు సమావేశాల్లో రైతుభరోసాపై చర్చ నడిచింది. దీంతో, బీఆర్‌ఎస్‌పై మంత్రులు సంచలన ఆరోపణలు చేశారు. ఇదే సమయంలో ఫార్ములా ఈ-కారు రేసు విషయంపై మంత్రి పొంగులేటి మాట్లాడారు. ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్‌పై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. రాష్ట్రంలో భూభారతి చట్టం బీఆర్‌ఎస్‌కు ఇష్టం లేదు. తెలంగాణ ప్రజలకు మంచి జరగడం బీఆర్‌ఎస్ నేతలకు నచ్చదు. కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని బీఆర్‌ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు. అల్లర్లు చేయాలని నియోజకవర్గానికి రూ.2కోట్లు పంపించారు. అల్లర్లు జరిగితే కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ గాజులు తొడుక్కుని కూర్చోలేదు. రాష్ట్రం అగ్నిగుండం అయితే చూస్తూ ఊరుకోం.
Comments
Please login to add a commentAdd a comment