
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ బండారం బయటపడిందని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ఎంఐఎంను గెలిపించేందుకే లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్ పార్టీ దూరం ఉందని ఆరోపించారు. భాగ్యనగర్‌ను మజ్లిస్‌కు అప్పగించేందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయంటూ వ్యాఖ్యానించారు.
ఈ మూడు పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందని రాజాసింగ్ ఆరోపణలు గుప్పించారు. భాగ్యనగర్‌లో బీఆర్ఎస్‌ను పాతరేస్తాం. మజ్లిస్‌ను గెలిపిస్తే మీ రాజకీయ భవిష్యత్తు ఖతమైనట్లేనంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఉద్దేశించి అన్నారు. ఓటింగ్‌లో పాల్గొనకపోవడమంటే ప్రజాస్వామ్యాన్ని ధిక్కరించినట్లే.. అంతరాత్మ ప్రబోధానుసారం ఓటేయండి అంటూ రాజాసింగ్ చెప్పుకొచ్చారు.
కాగా, హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికను బాయ్‌కట్ చేస్తున్నామని.. ఓటింగ్‌కు దూరంగా ఉండాలంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. విప్ ధిక్కరిస్తే పార్టీ నుంచి బహిష్కరణ తప్పదని హెచ్చరించారు.