ఈడీ విచారణకు కేటీఆర్.. ఎమ్మెల్యే రాజాసింగ్‌ సెటైరికల్‌ ట్వీట్‌ | Bjp Mla Raja Singh Tweets On Ktr Ed Investigation | Sakshi
Sakshi News home page

ఈడీ విచారణకు కేటీఆర్.. ఎమ్మెల్యే రాజాసింగ్‌ సెటైరికల్‌ ట్వీట్‌

Published Thu, Jan 16 2025 4:42 PM | Last Updated on Thu, Jan 16 2025 4:53 PM

Bjp Mla Raja Singh Tweets On Ktr Ed Investigation

కర్మ ఎవరినీ వదిలిపెట్టదంటూ.. కేటీఆర్‌ ఈడీ విచారణ నేపథ్యంలో బీజేపీ

సాక్షి, హైదరాబాద్‌: కర్మ ఎవరినీ వదిలిపెట్టదంటూ.. కేటీఆర్‌ ఈడీ విచారణ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఎక్స్‌ వేదికగా సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. ‘‘జైలుకు వెళ్లడానికి కేటీఆర్‌ సిద్ధమవ్వాలి. 4 జతల డ్రెస్‌లు, టవల్‌, బ్లాంకెట్‌, హ్యాండ్‌ కర్చీఫ్‌. సోప్‌, అవకాయ, స్వెటర్‌ దగ్గర పెట్టుకోవాలి. అధికారం ఉందని ఏది పడితే అది చేస్తే తిరిగి కర్మ రూపంలో మనం అనుభవించాల్సి వస్తుంది’’ అంటూ రాజాసింగ్‌ వ్యాఖ్యానించారు.

జైలుకు వెళ్లే ముందు 4 జతల బట్టలు (కటకటాల వెనుక కూడా ఫ్యాషన్ కీలకం), ఒక హాయిగా ఉండే వెచ్చని దుప్పటి, టవల్ (జైలులో కూడా పరిశుభ్రత ముఖ్యం), కర్చీఫ్(భావోద్వేగాలు అదుపు తప్పినప్పుడు), సబ్బులు(ఆ "క్లీన్ ఇమేజ్"ని కొనసాగించడానికి), ఒక ప్యాకెట్ ఊరగాయ(ఎందుకంటే జైలు భోజనం ఫైవ్ స్టార్ కాదు) తీసుకెళ్లండి.. స్వెటర్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు అంటూ కేటీఆర్‌కు రాజా సింగ్‌ చురకలు అంటించారు.

ఇదీ చదవండి: ఫార్ములా కేసులో ఈడీ ముందుకు కేటీఆర్‌.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement