local body mlc elections
-
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా చిన్నప్పలనాయుడు పేరు ఖరారు
-
ఉత్తరాంధ్ర నేతల అభిప్రాయం ప్రకారమే బొత్స పేరు: వైవీ సుబ్బారెడ్డి:
సాక్షి, తాడేపల్లి : విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ప్రకటిస్తున్నట్లు వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర ఇంచార్జి, రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రాంత నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్.. వారి సూచనల ప్రకారం బొత్సను ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.ఫ్యాను గుర్తు మీద గెలిచిన వాళ్లు 620 మంది ఉన్నారని, టీడీపీ బలం కేవలం రెండు వందలేనని తెలిపారు. అధికార టీడీపీ నేతలు ప్రలోభాలు పెట్టడానికి ప్రయత్నిస్తారని అన్నారు. గతంలో కూడా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి బీసీ ఎమ్మెల్సీ ఓటమికి కారణమయ్యారని ప్రస్తావించారు. వీటిన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు బొత్స గెలుపునకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. -
5 ఎమ్మెల్సీ స్థానాల్లో వైఎస్సార్సీపీ ఏకగ్రీవం.. ఎన్నికైంది ఎవరెవరంటే?
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న 9 స్థానాల్లో ఐదింట్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ సోమవారం ముగిసింది. అనంతరం అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటరి్నంగ్ అధికారులు ప్రకటించి, విజేతలకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులతో పాటు టీడీపీ మద్దతుదారులు, పలువురు స్వతంత్రులు నామినేషన్లు సమరి్పంచారు. అయితే, వారి నామినేషన్ పత్రాలు సరిగా లేకపోవడం, ప్రతిపాదితుల సంతకాలు ఫోర్జరీవి కావడం తదితర కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి. దీంతో వైఎస్సార్సీపీ అభ్యర్థులు మాత్రమే రంగంలో మిగిలారు. పలువురు అభ్యర్థులు పోటీలో ఉండటంతో పశి్చమ గోదావరి జిల్లాలోని 2 స్థానాలు, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లోని మరో రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు వంకా రవీంద్రనా«థ్, కవురు శ్రీనివాస్, మరో ముగ్గురు పోటీలో ఉన్నారు. శ్రీకాకుళం బరిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి నర్తు రామారావు, ఓ స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు. కర్నూలు జిల్లా బరిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ ఎ.మధుసూదన్, ఇద్దరు స్వతంత్రులు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ బరిలో పలువురు అభ్యర్థులు 3 పట్టభద్రుల నియోజకవర్గాలు, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పలువురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో వైఎస్సార్సీపీ మద్దతిస్తున్న సీతంరాజు సుధాకర్, టీడీపీ మద్దతిస్తున్న డా.వి.చిరంజీవిరావు, బీజేపీ మద్దతుతో మాధవ్ సహా 37 మంది ఉన్నారు. ఉమ్మడి ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు పట్టభద్రుల స్థానంలో వైఎస్సార్సీపీ తరపున పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి, టీడీపీ తరపున కంచర్ల శ్రీకాంత్ చౌదరి సహా 22 మంది పోటీలో ఉన్నారు. పశి్చమ రాయలసీమ (ఉమ్మడి అనంతపురం, వైఎస్సార్, కర్నూలు జిల్లాలు) స్థానానికి వైఎస్సార్సీపీ తరపున వెన్నపూస రవీంద్రారెడ్డి, టీడీపీ నుంచి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి సహా 49 మంది రంగంలో ఉన్నారు. ఉమ్మడి ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో వైఎస్సార్సీపీ మద్దతిస్తున్న పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, పీడీఎఫ్ మద్దతుతో పొక్కిరెడ్డి బాబురెడ్డి సహా 8 మంది రంగంలో ఉన్నారు. పశి్చమ రాయలసీమ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి వైఎస్సార్సీపీ మద్దతిస్తున్న ఎం.వి.రామచంద్రారెడ్డితో పాటు ఒంటేరు శ్రీనివాసరెడ్డి, కత్తి నరసింహారెడ్డి సహా 12 మంది బరిలో ఉన్నారు. ఎన్నికలు జరిగే ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే నెల 13న పోలింగ్ జరుగుతుంది. 16న ఓట్లను లెక్కించి, విజేతలను ప్రకటిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన వైఎస్సార్సీపీ అభ్యర్థులు ► అనంతపురం జిల్లా – ఎస్.మంగమ్మ ► వైఎస్సార్ జిల్లా – పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి ► చిత్తూరు జిల్లా – సిపాయి సుబ్రమణ్యం ► శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా – మేరుగ మురళీధర్ ► తూర్పు గోదావరి జిల్లా – కుడిపూడి సూర్యనారాయణ -
MLC Elections: ఎంఐఎం ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీర్జా రహమత్ బేగ్
సాక్షి,హైదరాబాద్: నగర స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిగా మీర్జా రహమత్ బేగ్‌ను ఎంపిక చేసింది ఎంఐఎం పార్టీ. ఈ మేరకు మంగళవారం ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బేగ్ పేరును ఖరారు చేశారు పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ. ప్రస్తుత ఎమ్మెల్సీ అమీన్ ఉల్ హసన్ జాఫ్రీకి.. ఎంఐఎం మరో అవకాశం ఇవ్వలేదు. అయితే జాఫ్రీ ఇంతకాలం అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. భవిష్యత్తులోనూ ఆయన అనుభవాన్ని ఉపయోగించుకుంటామని ఓ ట్వీట్ చేశారు ఒవైసీ. ఇదిలా ఉంటే.. 2018లో రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు రహమత్ బేగ్. Happy to announce that Mirza Rahmath Baig @_MirzaRahmath will be @aimim_national’s MLC candidate. I’d also like to thank outgoing MLC Syed Amin Ul Hasan Jafri sb for his valuable services to AIMIM. Inshallah, we’ll continue to benefit from his experience & wisdom in future too — Asaduddin Owaisi (@asadowaisi) February 21, 2023 -
ఓటేసి వెళ్లి కన్యాదానం.. లండన్ నుంచి రాక
అమ్మ వస్తుంది... ఏడవకు ఉమ్మడి నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణంలోని పోలింగ్ కేంద్రానికి ఓ మహిళా ఓటరు తన కుమార్తెతో కలిసి వచ్చింది. ఆ చిన్నారిని ఓ మహిళా కానిస్టేబుల్ ఎత్తుకోగా బిగ్గరగా ఏడవడంతో.. ఆమెను బుజ్జగించేందుకు ఇద్దరు మహిళా పోలీసులు ప్రయత్నించారు. అయినా ఏడుపు ఆపకపోవడంతో ఆ చిన్నారిని తల్లితో పాటు పోలింగ్ కేంద్రంలోనికి అనుమతించారు. దీంతో ఆమె తన కూతురిని ఎత్తుకుని ఓటు వేసింది. ఒకరికి బదులు మరొకరు ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి టీఎన్జీఓ భవన్ పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ ఎంపీటీసీ కె.సునీతకు బదులు అదే పేరు ఉన్న మరో జెడ్పీటీసీ ఓటేయడం గందరగోళానికి దారితీసింది. ఆమె అధికారులతో వాగ్వాదాని కి దిగగా..వారు పొరపాటును గ్రహించి తప్పును సరిదిద్దడంతో వివాదం సద్దుమణిగింది. లండన్ నుంచి రాక ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి ఎంపీటీసీగా టీఆర్ఎస్ తరఫున గెలిచిన చిలుకూరి శ్యామల ఆ తర్వాత ఉన్నత చదువుల నిమిత్తం లండన్ వెళ్లారు. అయితే, పార్టీ తరఫున గెలిచిన వారంతా తప్పక ఓటు వేయాలని అధిష్టానం సూచించడంతో ఆమె కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌కు చేరుకున్నారు. శుక్రవారం అక్కడి నుంచి కల్లూరు ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని ఓటు వేశారు. పుట్టెడు శోకంలోనూ.. నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం బాలాజీనగర్‌కు చెందిన టీఆర్ఎస్ ఎంపీటీసీ సభ్యుడు మెఘావత్ బన్సీలాల్ కుమారుడు రమేష్ అనారోగ్యంతో గురువారం రాత్రి మృతి చెందాడు. శుక్రవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు. కాగా అంత్యక్రియలు ముగిసిన వెంటనే పుట్టెడు శోకాన్నీ దిగమింగుకుంటూ బన్సీలాల్ బంధువుల సాయంతో వచ్చి దేవరకొండలో ఓటు హక్కు వినియోగించుకున్నాడు. పోలింగ్ కేంద్రం వద్ద తోటి ఎంపీటీసీ సభ్యులను చూసి బోరున విలపించాడు. ఓటేసి వెళ్లి కన్యాదానం కూతురి పెళ్లి ఉన్నా బాధ్యత మరవకుండా ఓటేశాడు ఉమ్మ డి మెదక్ జిల్లా అందోలు మండల పరిధిలోని రాంసానిపల్లి ఎంపీటీసీ సభ్యుడు గజేందర్‌రెడ్డి. ఉదయం 8.30 గంటలకు ఓటేసిన ఆయన, జోగిపేటకు 30 కి.మీ దూరంలో ఉన్న సంగారెడ్డిలోని ఫంక్షన్ హాలుకు వెళ్లి కన్యాదానం చేశాడు. దుఃఖాన్ని దిగమింగుకుంటూ.. ఉమ్మడి మెదక్ జిల్లా కొల్చారం జెడ్పీటీసీ సభ్యురాలు మేఘమాల సోదరుడు మధుసూదన్ సంగారె డ్డిలో పోలీస్‌శాఖలో పనిచేస్తున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున ఆయన గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. తమ్ముడి మరణ వార్తతో కుప్పకూలిన మేఘమాల, దుఃఖాన్ని దిగమింగుకుంటూ, ఓటేసిన అనంతరం స్వగ్రామానికి వెళ్లారు. -
Ranga Reddy: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు..మళ్లీ ఆ ఇద్దరే
సాక్షి, రంగారెడ్డి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులను అధికార టీఆర్ఎస్ ఖరారు చేసింది. ఇప్పటికే మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్ రాజుకు మరోసారి అవకాశం కల్పించింది. మహబూబ్‌నగర్ నుంచి ఇదే జిల్లాకు చెందిన కసిరెడ్డి నారాయణరెడ్డికే మళ్లీ చాన్స్ ఇచ్చింది. వీరంతా సోమవారం నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నుంచి ఇప్పటి వరకు అభ్యర్థుల పేర్లను ప్రకటించ లేదు. ఆయా పార్టీలకు ఓట్లు తక్కువగా ఉండడమే ఇందుకు కారణంగా తెలిసింది. ఆయా పార్టీలు స్థానిక సంస్థల ఫోరం ప్రకటించిన ఉమ్మడి అభ్యర్థికి మద్దతిచ్చే అవకాశం ఉంది. ఇదీ లెక్క.. ► ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 1,179 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 627 మంది మహిళలు, 552 మంది పురుషులు ఉన్నారు. ► 310 మంది కార్పొరేటర్లు, 432 మంది కౌన్సిలర్లు, 384 మంది ఎంపీపీలు, 33 మంది జెడ్పీటీసీలు, 20 మంది ఎక్స్‌అఫీషియోలు ఉన్నారు. ► ఓటర్ల ముసాయిదా జాబితాపై అభ్యంతరాలను స్వీకరించి, వాటికి 21, 22 తేదీల్లో స్క్రూట్నీ నిర్వహించి 23న తుది జాబితా ప్రకటించనున్నారు. ► ఈ నెల 16 ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యింది. అదే రోజు నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరించి, 24న పరిశీలించి, 26న ఉపసంహరణకు అవకాశం కల్పించారు. ► ఎన్నికల కోసం రాజేంద్రనగర్, వికారాబాద్, తాండూరు, కీసర, మల్కాజిగిరి, ఇబ్రహీంపట్నం, కందుకూరు, చేవెళ్లలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ► డిసెంబర్ 10న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, 14న ఫలితాలు ప్రకటించనున్నారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్
సాక్షి, నిజామాబాద్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ కొనసాగుతోంది. మొత్తం పోలైన ఓట్లు 823 కావడంతో రెండు రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు. ఇందుకోసం ఆరు టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొదట పోలైన ఓట్లన్నింటిని కలిపేస్తారు. అందులో నుంచి చెల్లుబాటు కాని ఓట్లను తీసివేస్తారు. అ తర్వాత 25 ఓట్లకు ఒకటి చొప్పున కట్టలు కడతారు. మొదటి రౌండ్లో 600 ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆ తర్వాతి రౌండ్లో మిగిలిన 223 ఓట్లను లెక్కిస్తారు. ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయని లెక్కించిన అనంతరం ఫలితాన్ని ఎన్నికల సంఘానికి నివేదిస్తారు. అక్కడి నుంచి అనుమతి తీసుకున్న తర్వాత అభ్యర్థి గెలుపును ప్రకటిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు గెలుపు పత్రాన్ని అందజేస్తారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు డిపాజిట్లు రావాలంటే మొత్తం పోలైన ఓట్లలో ఆరో వంతు మొదటి ప్రాధాన్యత ఓట్లు రావాల్సి ఉంటుంది. అంటే 823 ఓట్లలో సుమారు 138 ఓట్లు వచ్చిన అభ్యర్థులకు డిపాజిట్లు దక్కుతాయి. లేనిపక్షంలో అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోవాల్సి వస్తుంది. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే.. పోలింగ్ సరళిని బట్టి చూస్తే మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఫలితం తేలిపోయే అవకాశముంది. ప్రాధాన్యత ఓటు విధానంలో జరిగిన ఈ ఎన్నికల్లో అభ్యర్థి గెలుపు ఓటములు తేలాలంటే పోలైన ఓట్లలో సగానికి కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చిన అభ్యర్థి విజయం సాధించినట్లు ప్రకటిస్తారు. అంటే పోలైన ఓట్ల సంఖ్యలో సగాని కంటే +1 అన్నమాట. మొత్తం 824 మంది ఓటర్లు ఉండగా, 823 ఓట్లు (రెండు పోస్టల్ ఓట్లతో కలిపి) పోలయ్యాయి. ఈ లెక్కన మ్యాజిక్ ఫిగర్ 413 మొదటి ప్రాధాన్యత ఓట్లు రావాల్సి ఉంటుంది. అయితే, ఎన్నికల సరళిని బట్టి చూస్తే మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఫలితం వచ్చే అవకాశాలున్నాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే మ్యాజిక్ ఫిగర్ వస్తే, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు నిర్వహించే అవకాశం లేదు. ఆరుగురు కౌంటింగ్ ఏజెంట్లు.. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు కౌంటింగ్ ఏజెంట్లకు అధికారులు పాసులు జారీ చేశారు. కౌంటింగ్ హాల్లోకి ఒక్కో అభ్యర్థికి ఆరుగురు కౌంటింగ్ ఏజెంట్లను అనుమతిస్తారు. వీరికి ప్రత్యేకంగా పాసులు జారీ చేశారు. అభ్యర్థి, పోలింగ్ ఏజెంట్‌ను కూడా కౌంటింగ్ హాల్లోకి అనుమతిస్తారు. పాలిటెక్నిక్ కళాశాల రెండో గేట్ నుంచి కౌంటింగ్హాల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. -
ఉప ఎన్నిక: కవిత ఉన్నత స్థాయికి వెళ్తారు!
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్‌లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అధికార యంత్రాంగం ఇందుకు సంబంధించి 50 కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఈ ఉప ఎన్నికలో పోటీ చేస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వి.సుభాష్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా పోతనకర్ లక్ష్మీనారాయణలు బరిలో ఉన్నారు. వార్ వన్ సైడ్: బాజిరెడ్డి నిజామాబాద్ జడ్పీ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ తొలి ఓటు వేశారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఆకుల లలిత, వీజీ గౌడ్, రాజేశ్వర్ తదితర 28 మంది టీఆర్ఎస్ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సాక్షి టీవీతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం టీఆర్ఎస్దేనని ధీమా వ్యక్తం చేశారు. వార్ వన్ సైడే ఉందని, కవిత గెలుపు ఖాయమన్నారు. ఆమె రాకతో రాజకీయాలు మారబోతున్నాయంటూ హర్షం వ్యక్తం చేశారు. కవిత ఉన్నత స్థాయికి వెళ్తారు: గణేష్ గుప్తా ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్నాయి. కవిత సునాయాసంగా విజయం సాధిస్తారు. ఉన్నత స్థాయిలోకి వెళ్తారు. నిజామాబాద్‌కు మళ్లీ మంచి రోజులు వస్తున్నాయి. - టీఆర్ఎస్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత కామారెడ్డికి చేరుకున్నారు. అక్కడి మున్సిపల్ కార్యాలయంలోని పోలింగ్ బూత్‌లో ఓటింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. అనంతరం బోధన్‌కు వెళ్లి, అక్కడి పరిస్థితులను పర్యవేక్షించనున్నారు. ఇదిలా ఉండగా.. ఓటు హక్కు వినయోగించుకునే క్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హైదరాబాద్ క్యాంప్ నుంచి నిజామాబాద్ చేరుకున్నారు. జిల్లా పరిషత్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు కార్పొరేటర్లంతా బయల్దేరి వెళ్లారు. ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, రాజేశ్వర్ అక్కడికి చేరుకున్నారు. 24 మందికి కరోనా పాజిటివ్ ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 824 మంది మొత్తం ఓటర్లు ఉండగా 24 మంది ఓటర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో కోవిడ్ బాధితులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రొటోకాల్‌ను అనుసరించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్కు స్పష్టమైన మెజార్టీ ఉండటంతో ఫలితాలు ఏకపక్షంగా వెలువడే అవకాశాలు ఉన్నప్పటికీ, తమ అభ్యర్థి భారీ మెజార్టీ సాధించడమే లక్ష్యంగా టీఆర్ఎస్ శ్రేణులు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. పార్టీల బలాబలాలు జిల్లాలో అన్ని స్థానిక సంస్థల్లో మొత్తం 824 మంది ఓటర్లు ఉండగా, 413 మంది ఓటర్ల మొదటి ప్రాధాన్యత ఓట్లు దక్కితే విజయం వరిస్తుంది. మొత్తం ఓటర్లు 824లో టీఆర్ఎస్కు చెందిన ప్రజాప్రతినిధులు 504 మంది ఉన్నారు. దీంతో మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువే టీఆర్ఎస్కు సొంత బలం ఉంది. దీనికి తోడు మిత్ర పక్షమైన ఎంఐఎం ప్రజాప్రతినిధులు 28 మంది కూడా టీఆర్ఎస్ అభ్యర్థి కవితకు మద్దతుగా ఓటేసే అవకాశాలు ఉన్నాయి. స్వతంత్రులు 66 మంది ఉండగా, ఇప్పటికే దాదాపు అందరూ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న వారే. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు 142 మంది ఉన్నారు. ఇందులో ఇప్పటికే 75 మంది కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో కాంగ్రెస్ బలం సుమారు 67కు తగ్గింది. అలాగే బీజేపీకి 85 మంది ప్రజాప్రతినిధులు ఉండగా.. ఇప్పటి వరకు 35 మందికి పైగా కారెక్కారు. టీఆర్ఎస్ సొంత బలం, ఎంఐఎం, స్వతంత్రులు, కాంగ్రెస్, బీజేపీల నుంచి వచ్చిన వారితో కలిపి తమకు సుమారు 700 మించి ఓట్లు దక్కే అవకాశాలు ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాలు అంచనా వేసుకుంటున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయం ఖాయమనే ధీమాతో గులాబీ శ్రేణులు ఉన్నాయి. -
నేడు నిజామాబాద్ ఎమ్మెల్సీ పోలింగ్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: శాసన మండలి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక శుక్రవారం జరగనుంది. ఇందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్కు స్పష్టమైన మెజార్టీ ఉండటంతో ఫలితాలు ఏకపక్షంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే తప్ప.. ఈ ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల కవితకే విజయావకాశాలు కనిపిస్తున్నాయి. మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ ఓటర్లు ఉండటంతో పాటు కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ప్రజాప్రతినిధుల చేరికలతో ఆ పార్టీ జోరు మీద ఉంది. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో ఇటీవల పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరికలు జరిగాయి. మరోవైపు వలసలతో ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు కుదేలయ్యాయి. దీంతో ఈ రెండు జాతీయ పార్టీలు డిపాజిట్లు దక్కించుకోవడం కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వి.సుభాష్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా పోతనకర్ లక్ష్మీనారాయణలు బరిలో ఉన్నారు. పార్టీల బలాబలాలు జిల్లాలో అన్ని స్థానిక సంస్థల్లో మొత్తం 824 మంది ఓటర్లు ఉండగా, 413 మంది ఓటర్ల మొదటి ప్రాధాన్యత ఓట్లు దక్కితే విజయం వరిస్తుంది. మొత్తం ఓటర్లు 824లో టీఆర్ఎస్కు చెందిన ప్రజాప్రతినిధులు 504 మంది ఉన్నారు. దీంతో మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువే టీఆర్ఎస్కు సొంత బలం ఉంది. దీనికి తోడు మిత్ర పక్షమైన ఎంఐఎం ప్రజాప్రతినిధులు 28 మంది కూడా టీఆర్ఎస్ అభ్యర్థి కవితకు మద్దతుగా ఓటేసే అవకాశాలు ఉన్నాయి. స్వతంత్రులు 66 మంది ఉండగా, ఇప్పటికే దాదాపు అందరూ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న వారే. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు 142 మంది ఉన్నారు. ఇందులో ఇప్పటికే 75 మంది కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో కాంగ్రెస్ బలం సుమారు 67కు తగ్గింది. అలాగే బీజేపీకి 85 మంది ప్రజాప్రతినిధులు ఉండగా.. ఇప్పటి వరకు 35 మందికి పైగా కారెక్కారు. టీఆర్ఎస్ సొంత బలం, ఎంఐఎం, స్వతంత్రులు, కాంగ్రెస్, బీజేపీల నుంచి వచ్చిన వారితో కలిపి తమకు సుమారు 700 మించి ఓట్లు దక్కే అవకాశాలు ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాలు అంచనా వేసుకుంటున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయం ఖాయమనే ధీమాతో గులాబీ శ్రేణులు ఉన్నాయి. క్రాస్ ఓటింగ్‌పైనా ఆందోళన భారీ వలసలతో కుదేలైన ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలకు క్రాస్ ఓటింగ్ భయం కూడా పట్టుకుంది. పోయిన వారు పోగా, మిగిలిన వారైనా తమ అభ్యర్థులకు ఓటేస్తారా.? లేదా క్రాస్ ఓటింగ్‌కు పాల్పడతారా..? అనే ఆందోళనలో ఆ రెండు పార్టీలు ఉన్నాయి. ఇలా క్రాస్ ఓటింగ్ కూడా జరిగితే ఈ రెండు పార్టీలకు ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కే అవకాశాలు లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
మెజార్టీ ఎందుకు తగ్గిందో అర్థంకావట్లేదు: కేఈ
అమరావతి: కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుకున్నంత మెజార్టీ రాలేదని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఆయన బుధవారం మీడియాతో చిట్‌చాట్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరకముందు ఎక్కువ మెజార్టీ సాధించామన్నారు. అయితే ఇప్పుడు ఎందుకు మెజార్టీ తగ్గిందో అర్థం కావడం లేదని డిప్యూటీ సీఎం అన్నారు. కాగా బలం లేకపోయినా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెగ్గడానికి టీడీపీ ఆంధ్రప్రదేశ్‌లోనూ ‘ఓటుకు కోట్లు’ తంత్రాన్ని విజయంతంగా అమలు చేసింది. అడ్డగోలుగా సంపాదించిన అవినీతి డబ్బును విచ్చలవిడిగా వెదజల్లి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డిపై టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి 62 ఓట్ల మెజారిటీతో గెలిచిన విషయం విదితమే. -
హైకోర్టులో టీడీపీకి చుక్కెదురు
-
హైకోర్టులో టీడీపీకి చుక్కెదురు
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీకి హైకోర్టులో చుక్కెదురు అయింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జమ్మలమడుగులో పదిమంది ఓటర్లుకు సహాయకుల కోసం (కంపానియన్ ఓటు) టీడీపీ కోర్టును ఆశ్రయించింది. అయితే టీడీపీ అభ్యర్థనను హైకోర్టు శుక్రవారం తిరస్కరించింది. గడువులోపుగా దరఖాస్తు చేసుకోలేనందున పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. కాగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మ్యాజిక్ ఫిగర్‌కు సరిపడా ఓట్లు లేవు అన్నది జగమెరిగిన సత్యం. అయినా సరే అధికారాన్ని అడ్డంపెట్టుకుని విజయం సాధించాలనే దిశగా టీడీపీ ఐదంచెల వ్యూహం పన్నింది. వివిధ దశల్లో ఆ వ్యూహాన్ని తెర తీసింది. ప్రధానంగా ప్రలోభాలకు గురిచేయడం, అప్పటికీ సాధ్యం కాకపోతే బెదిరింపులకు పాల్పడింది. అయినా కుదరకపోతే దౌర్జన్యాలకు దిగారు. ప్రత్యక్షంగా ఇలా తెరపై కన్పిస్తూనే ఇంకోవైపు అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. ఆపై చట్టంలో లొసుగులు ఆధారం చేసుకొని లబ్ధిపొందాలనే దిశగా ఎత్తుగడలు వేసింది. దశలవారీగా వ్యూహాలను అమలు చేసింది. దాంతో తెలుగు తమ్ముళ్లు దృష్టి కంపానియన్ ఓటుపై పడింది. (ఫారం 14ఏ ప్రకారం నిరక్షరాస్యులు, తీవ్ర అనారోగ్యవంతులు, అంధులు కంపానియన్ ఓటు పొందే అవకాశం ఉంది) ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకం లేకపోవడంతో పాటు, అభద్రతా అధికం కావడంతో టీడీపీ కంపానియన్ ఓటు కోసం విస్తృతంగా ప్రయత్నాలు చేసింది. దాదాపు 47మంది ఓటర్లకు కంపానియన్ ఓటు కావాలంటూ టీడీపీ నేతలు దరఖాస్తులు చేసింది. వ్యక్తగతంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా, గడువు ముగిసిన అనంతరం ఈమెయిల్ ద్వారా పంపించారు. ఓటర్ల పట్ల వ్యవహరించిన తీరు కారణంగా పోలింగ్ బూత్‌లోకి వెళితే ఓటు వేయరనే ఏకైక కారణంతోనే ఇలాంటి చీప్ ట్రిక్స్‌కు పాల్పడింది. అయితే టీడీపీ ఎత్తుగడలకు ఈసీ చెక్ పెట్టింది. వారు ఈ-మెయిల్ ద్వారా సమర్పించిన 47 దరఖాస్తులను తిరస్కరించింది. అయినప్పటికీ టీడీపీ నేతలు గురువారం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన 10మందికి అయినా కంపానియన్ ఓటు సౌకర్యం కల్పించాలని కోరారు. అయితే ఈసీ నిర్ణయాన్ని న్యాయస్థానం సమర్థిస్తూ టీడీపీ పిటిషన్ కొట్టేసింది. కాగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లాలో 841 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో కేవలం పదిమంది మాత్రమే నిరక్షరాస్యులు. -
కర్నూలులో ఎమ్మెల్సీ పోలింగ్ ప్రారంభం
-
రాజంపేటలో ఎమ్మెల్సీ పోలింగ్ ప్రారంభం
-
కసి ఉంటే నాపై తీర్చుకోండి
తమ పార్టీ ప్రజా ప్రతినిధుల జోలికొస్తే ఊరుకోబోమని వైఎస్ వివేకా హెచ్చరిక కడప అగ్రికల్చర్: టీడీపీ నాయకులు తనతో కానీ, తన కుటుంబంతో కానీ రాజకీయంగా ఎదుర్కొని తేల్చుకోవాలని వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డి సవాల్ చేశారు. అంత కసి ఉంటే తనపైన, తన కుటుంబంపైన తీర్చుకోవాలేగానీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై దాడులకు తెగబడటం నీచ రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. మంగళవారం వైఎస్సార్ జిల్లా కడపలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధుల కుటుంబాలను అంతమొందిస్తామని టీడీపీ నేతలు బెదిరించడం ప్రజాస్వామ్యంలో పనికి రాదన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే ఇలాంటి చర్యలకు దిగమని చెప్పినట్లు అనుమానం కలుగుతోందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి బలహీనవర్గాలకు చెందిన వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లపై నిత్యం దాడులకు తెగబడుతుండటం దుర్మార్గమన్నారు. ఈ దాడులను చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. జిల్లాలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగే పరిస్థితులు కనిపించడం లేదని, ప్రభుత్వమే దుర్మార్గాలకు పాల్పడుతుంటే ఎన్నికలు సజావుగా జరుగుతాయా? అని వివేకా అనుమానం వ్యక్తం చేశారు. జిల్లాలో అధికార పార్టీ కొనసాగిస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలు, దాడులపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి వీలుగా జిల్లాకు ఎన్నికల పరిశీలకుడిని పంపించాలని కోరతామన్నారు. -
ఏకగ్రీవమా? పోటీనా?
- స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ముగ్గురి నామినేషన్ - టీడీపీ తరఫున దీపక్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి - స్వతంత్ర అభ్యర్థిగా పైలా - పైలా నామినేషన్ ఉపసంహరించుకోకపోతే పోలింగ్ అనివార్యం అనంతపురం అర్బన్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని ఏకగ్రీవంగా దక్కించుకోవాలనుకున్న టీడీపీ ఆశలు అడియాసలయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. స్వతంత్ర అభ్యర్థిగా తాడిపత్రి పట్టణానికి చెందిన పైలా నరసింహయ్య నామినేషన్ దాఖలు చేయడం చర్చనీయాంశమైంది. ఒకవేళ ఆయన నామినేషన్‌ను ఉపసంహరించుకోకపోతే పోటీ అనివార్యం కానుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మంగళవారం ముగిసింది. చివరిరోజు టీడీపీ అభ్యర్థి గుణపాటి దీపక్‌రెడ్డి (మూడు సెట్లు), ఆయనకు సపోర్ట్‌గా ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి కుమారుడు జూటూరు అస్మిత్‌రెడ్డి (ఒక సెట్టు) నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే పైలా నరసింహయ్య స్వతంత్ర అభ్యర్థిగా(రెండు సెట్లు) నామినేషన్ వేశారు. వీరు తమ నామినేషన్ పత్రాలను కలెక్టరేట్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతంకు అందజేశారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు వైఎస్సార్సీపీ దూరంగా ఉంది. దీంతో ఎమ్మెల్సీ స్థానం ఏకగ్రీవంగా దక్కుతుందని టీడీపీ నాయకులు భావించారు. అయితే అనూహ్యంగా సీపీఐకి చెందిన పైలా నరసింహయ్య స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన ఫిబ్రవరి 21 నుంచి నుంచి 27వ తేదీ వరకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. చివరిరోజు మాత్రం ముగ్గురు వేశారు. టీడీపీ అభ్యర్థి దీపక్‌రెడ్డి ఒక్కరే నామినేషన్ వేసి ఉంటే ఎమ్మెల్సీ స్థానం ఏకగ్రీవమయ్యేది. పైలా కూడా నామినేషన్ వేయడంతో పోలింగ్ అనివార్యమయ్యేలా కన్పిస్తోంది. అయితే.. ఈ నెల మూడున నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉంది. దీపక్‌రెడ్డికి సపోర్ట్‌గా వేసిన జూటూరు అస్మిత్‌రెడ్డి నామినేషన్ ఉపసంహరించుకుంటారని టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఇక పైలా నరసింహయ్య తన నామినేషన్‌ను ఉపసంహరించుకోకపోతే టీడీపీ ‘ఏకగ్రీవ ఆశలు’ గల్లంతవుతాయి. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగా – పైలా నరసింహయ్య ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను విస్మరించి టీడీపీ సామాజిక న్యాయం పాటించడంలేదు. సరికదా ఎన్నికను ఏకగ్రీవం చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలని చూస్తోంది. ఇది జరగకూడదనే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశా. సామాజిక న్యాయాన్ని అనుసరించి టీడీపీ టికెట్ ఇచ్చి ఉంటే పోటీ చేసేవాడిని కాదు. తెలంగాణకు చెందిన దీపక్‌రెడ్డికి ఇక్కడ టికెట్ ఇవ్వడమేంటి? ఎన్నికల్లో పోటీ చేసేందుకు నా సమీకరణలు నాకున్నాయి. టీడీపీ అభ్యర్థిదే విజయం – మంత్రి కొల్లు రవీంద్ర స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దీపక్‌రెడ్డి విజయం సాధిస్తారని జిల్లా టీడీపీ ఇన్చార్జ్, మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. దీపక్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి ఆయనతో పాటు మంత్రి పల్లెరఘునాథ్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, విప్ యామినీబాల, జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బి.కె.పార్థసారథి, జెడ్పీ చైర్మన్ చమన్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. నామినేషన్ ప్రక్రియ అనంతరం విలేకరులతో మంత్రులు, ఇతర నాయకులు, అభ్యర్థి మాట్లాడారు. స్థానిక సంస్థల్లో పూర్తి మెజారిటీ ఉన్న టీడీపీ ఈ ఎన్నికల్లో గెలుస్తుందన్నారు. ఏకగ్రీవ ఎన్నికకు అందరూ సహకరించాలని కోరారు. నేడు నామినేషన్ల పరిశీలన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన బుధవారం నిర్వహిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు మూడో తేదీ ఆఖరు. 17న పోలింగ్, 20వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఓటర్లుగా ఉంటారు. మునిసిపాలిటీల్లో ఎక్స్ అఫిషియో సభ్యులు కాని ఎమ్మెల్యేలకు మాత్రం ఓటు హక్కు ఉండదు. ఉరవకొండ, రాప్తాడు, పెనుకొండ, శింగనమల నియోజకవర్గాల పరిధిలో మునిసిపాలిటీలు లేనందున ఈ నాలుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఓటు ఉండదు. ఈ ఎన్నికలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 1,278 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఎంపీటీసీ సభ్యులు 832 మంది, జెడ్పీటీసీ సభ్యుడు 63 మంది, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు 367 మంది, ఎమ్మెల్యేలు 10 మంది, ఎమ్మెల్సీలు నలుగురు, ఇద్దరు ఎంపీలు ఓటర్లుగా ఉన్నారు. -
ఎవరికి ఓటేశారో చెబితే నేరం
తెలంగాణ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎవరికి ఓటేశారో బయటకు చెబితే అది నేరం అవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ అన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాటుచేస్తున్నామని, సెల్ఫోన్లను గానీ, కెమెరాలను గానీ పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం నాడు ఈ ఎన్నికలకు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో, ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, ఈనెల 30వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందని చెప్పారు. మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాల్లో ఇప్పటికే ఆరు ఏకగ్రీవం కాగా, మిగిలిన ఆరింటికి ఆదివారం పోలింగ్ జరగనుంది. -
ఓట్లు మావే.. సీట్లూ మావే
* ‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటుతాం: ఎంపీటీసీల ఫోరం * మొత్తం 12 సీట్లలో ఎంపీటీసీ అభ్యర్థులను నిలుపుతాం * ఎంపీటీసీలకు కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా ఓడిస్తాం * జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లతో జేఏసీగా ఏర్పడతామని ప్రకటన సాక్షి, హైదరాబాద్: రానున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటాలని రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం ఉవ్విళ్లూరుతోంది. ప్రభుత్వం గత 17 నెలలుగా ఎంపీటీసీలకు ఎలాంటి నిధులు, విధులు అప్పగించకపోవడంపై ఉన్న వ్యతిరేకతను చూపేందుకు సన్నద్ధమవుతోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 12 సీట్లకు ఫోరం తరపున ఎంపీటీసీలనే ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నిలపాలని నిర్ణయించింది. ఏవైనా రాజకీయ పార్టీలు ఎమ్మెల్సీ టికెట్లను ఎంపీటీసీలకు కేటాయించిన పక్షంలో, ఆ అభ్యర్థులకు మాత్రం మద్దతు ఇవ్వాలని ఫోరం రాష్ట్ర కార్యవర్గం తీర్మానించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 80 శాతం ఓట్లున్న ఎంపీటీసీలకు కాకుండా ఇతరులకు టికెట్లు ఇచ్చి బరిలో నిలిపితే ఓడించి తీరతామని స్పష్టం చేసింది. గురువారం హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి సమావేశంలో ఫోరం రాష్ట్ర ప్రతినిధులు, వివిధ జిల్లాల అధ్యక్షులు ఈ మేరకు ప్రతినబూనారు. ఈ దఫా ఎన్నికల్లో ఓట్లు, సీట్లు తమవేనని నినదించారు. గత ఏడాదిన్నర కాలంగా ఎంపీటీసీలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి పట్టించుకున్న నాథుడే కరువయ్యాడని, ఈ నేపథ్యంలో ఎంపీటీసీలనే ఎమ్మెల్సీలుగా చట్టసభలకు పంపాల్సిన అవసరం ఏర్పడిందని వారు అంటున్నారు. ఎంపీటీసీల సమస్యలివే.. గ్రామ సర్పంచులతో సమానమైన అధికారాలు కల్పిస్తామంటూ గత ఆగస్టులో కరీంనగర్లో జరిగిన గ్రామజ్యోతి కార్యక్రమంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినా... అందుకు సంబంధించిన ఉత్తర్వులు ఇప్పటిదాకా వెలువడలేదని ఎంపీటీసీల ఫోరం ఆరోపిస్తోంది. ఎంపీటీసీల ద్వారా ఖర్చు చేయాల్సిన బీఆర్జీఎఫ్ నిధులను ఈ ఏడాది కేంద్రం నిలిపివేసిందని, 14వ ఆర్థిక సంఘం నిధులు కూడా కేంద్రం నేరుగా గ్రామ పంచాయతీలకే ఇస్తుండడంతో తమ పరిస్థితి ఉత్సవ విగ్రహాల మాదిరి తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన గ్రామజ్యోతి పథకంలోనైనా తమకు సముచిత స్థానం కల్పించడం లేదని అంటున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు టీచర్లను, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు గ్రాడ్యుయేట్లను అభ్యర్థులుగా నిలుపుతున్నపుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక ప్రజాప్రతినిధులైన ఎంపీటీసీలకు ఎందుకు అవకాశమివ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. 80 శాతం ఓట్లు మావే.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఓట్లలో 80 శాతం ఓట్లు ఎంపీటీసీలవేనని తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బోళ్ల కరుణాకర్ చెప్పారు. ఏడాదిన్నర కాలంగా ఎంపీటీసీలకు ఎలాంటి అధికారాలు, నిధులు, విధులనూ ప్రభుత్వం అప్పగించలేదన్నారు. ఎంపీటీసీల సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించేందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయడమే సరైన మార్గంగా భావిస్తున్నామన్నారు. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులుగా ఎంపీటీసీలకు టికెట్లిస్తే ఫోరం తరపున మద్దతు ఇస్తామని వెల్లడించారు. తమలాగే ఎలాంటి అధికారాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సెలర్లను కూడా కలుపుకొని స్థానిక ప్రజాప్రతినిధుల జేఏసీగా ఏర్పడాలని యోచన చేస్తున్నామన్నారు. నెలాఖరులోగా రాష్ట్ర స్థాయిలో భారీ సమావేశం నిర్వహించి తమ అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. ఈ సమావేశంలో ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాకయ్య, ఉపాధ్యక్షుడు పెండ్యాల గోవర్ధన్, కార్య నిర్వాహక కార్యదర్శి మనోహర్‌రెడ్డి, వివిధ జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.