సాక్షి, తాడేపల్లి : విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ప్రకటిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర ఇంచార్జి, రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రాంత నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్.. వారి సూచనల ప్రకారం బొత్సను ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
ఫ్యాను గుర్తు మీద గెలిచిన వాళ్లు 620 మంది ఉన్నారని, టీడీపీ బలం కేవలం రెండు వందలేనని తెలిపారు. అధికార టీడీపీ నేతలు ప్రలోభాలు పెట్టడానికి ప్రయత్నిస్తారని అన్నారు. గతంలో కూడా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి బీసీ ఎమ్మెల్సీ ఓటమికి కారణమయ్యారని ప్రస్తావించారు. వీటిన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు బొత్స గెలుపునకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment