
సాక్షి,విశాఖ: పచ్చ చొక్కాలు వేసుకున్న పోలీసుల బట్టలు ఊడదీస్తానంటే హోంమంత్రి అనిత ఉలిక్కిపడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రశ్నించారు.విశాఖలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణీ మీడియాతో మాట్లాడారు.
వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తట్టడానికి అనితకు హోంమంత్రి పదవి ఇచ్చారు. వైఎస్ జగన్‌పై విమర్శలు చేయడానికి సమయం ఉంటుంది. కానీ కామాంధులు చేతిలో బలైన బాధితులను పరామర్శించేందుకు సమయం ఉండదు.
సొంతం నియోజకవర్గంలో మహిళపై దాడులు జరిగితే హోం మంత్రి అరికట్ట లేకపోయారు.పచ్చ చొక్కాలు వేసుకున్న పోలీసుల బట్టలు ఊడదీస్తానంటే అనితకు ఉలికెందుకు. వైఎస్ జగన్‌కు భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. క్రిమినల్ అని ఎన్టీఆర్ ఎవరిని అన్నారో రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు.
ఐఏఎస్ అధికారులను పేరు పెట్టి తిట్టిన ఘనత చంద్రబాబు, లోకేష్, టీడీపీ నాయకులది. ఐపీఎస్ అధికారుల మీద తప్పుడు కేసులు పెట్టిన చరిత్ర టీడీపీ నేతలది. దళిత ఐఏఎస్ అధికారులను కూటమి ప్రభుత్వం వేధిస్తోంది.మహిళల రక్షణ గురించి మాట్లాడే అర్హత టీడీపీ నేతలకు లేదు. ఎమ్మెల్యే ఆదిమూలం, కిరణ్ రాయల్ మహిళలను వేధిస్తే మీరు ఏం చర్యలు తీసుకున్నారు’ అని కూటమి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు.
