సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు కుట్రలు చేస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, విశాఖ ఉక్కు ఆంధ్రుల సెంటిమెంట్. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కోసం వేల ఎకరాల భూములను రైతులు త్యాగం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు కుట్రలు చేస్తున్నారని బొత్స ధ్వజమ్తెతారు.
‘‘విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్‌సీపీ వ్యతిరేకమని ప్రధాని మోదీకి వైఎస్ జగన్ చెప్పారు. స్టీల్‌ప్లాంట్ కార్మికులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది. గత 15 రోజులుగా స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు నిరసన చేస్తున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై కూటమి ప్రభుత్వం వైఖరీ చెప్పాలి’’ అని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.
‘‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో స్టీల్ ప్లాంట్ ఏర్పడింది. 32 మంది త్యాగ ఫలంతో ఏర్పడింది. 32 వేల ఎకరాలు స్టీల్ ప్లాంట్ కోసం ఇచ్చారు.. వైఎస్ హయాంలో స్టీల్ ప్లాంట్ విస్తరణ కోసం11 వేల కోట్ల ఖర్చు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కష్టాలు ప్రారంభమయ్యాయి. ప్రధాని మోదీ విశాఖ వచ్చిన సందర్భంలో విశాఖను స్టీల్ ప్లాంట్ పైవేటికరణ చేయొద్దని వైఎస్ జగన్ అడిగారు. ప్రధానికి రెండు సార్లు లేఖలు రాశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే టీడీపీ నేతలు రాజీనామాలు చేస్తామంటున్నారు. ఎంపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు వలన ఒరిగేది లేదు.
ఇదీ చదవండి: చంద్రబాబూ.. ప్రభుత్వ సంస్థలంటే అంత అసహ్యమెందుకు?: వైఎస్ జగన్
..కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణకు అనుకూలమా వ్యతిరేకమా చెప్పాలి. ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. స్టీల్ ప్లాంట్‌పై టీడీపీ విధానం ఏమిటో చెప్పాలి. కేంద్ర మంత్రి కుమారస్వామి వచ్చారు.. రెండవ బ్లాస్ట్ ఫర్నిచర్ మూసివేశారు. మా పార్టీ విధానమే ప్లాన్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకం. స్టీల్ ప్లాంట్ అనేది ప్రజల సెంటిమెంట్. మేము వ్యతిరేకించాము కాబట్టే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది’’ అని బొత్స సత్యనారాయణ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment