Conspiracies
-
అమెరికా కార్చిచ్చు పెద్ద కుట్ర..?
-
వైఎస్సార్సీపీ పోరుబాటపై బాబు సర్కార్ కుట్రలు
సాక్షి, అనంతపురం: కూటమి ప్రభుత్వం పెంచిన కరెంటు చార్జీల బాదుడుపై వైఎస్సార్సీపీ పోరుబాట పట్టింది. వేల కోట్లు దండుకుంటున్న కూటమి సర్కార్‌పై నిరసన స్వరం వినిపించేందుకు సమాయత్తమవుతోంది. దీంతో వైఎస్సార్సీపీ పోరుబాటపై కూటమి సర్కార్ కుట్రలకు తెరలేపింది.విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా రేపు(శుక్రవారం) వైఎస్సార్సీపీ నిరసన ప్రదర్శనలు చేపట్టనుండగా.. పోలీస్ స్టేషన్‌కు రావాలంటూ పోలీసులు హుకుం జారీ చేశారు. ఉరవకొండ నియోజకవర్గం కూడేరు ఎంపీపీ నారాయణరెడ్డి సహా వైఎస్సార్ సీపీ నేతలను పీఎస్‌కు పోలీసులు పిలిపించారు.వైఎస్సార్ సీపీ పోరుబాటకు వెళ్లకుండా బైండోవర్ చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. పోలీసుల తీరును వైఎస్సార్సీపీ నేత, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఖండించారు. వైఎస్సార్సీపీ పోరుబాటకు ప్రజలు రాకుండా అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయంటూ విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని విద్యుత్ శాఖ కార్యాలయాల ఎదుట వైఎస్సార్సీపీ నాయకులు ప్రజల తరుపున నిరసన తెలిపి, కరెంటు చార్జీలు తగ్గించాలని అధికారులకు వినతిపత్రాలు ఇవ్వనున్నారు.ఇదీ చదవండి: కార్డులు చెల్లవ్.. కాసుల వైద్యమే! -
రిజర్వేషన్ల రద్దుకు ‘యువరాజు’ కుట్రలు: మోదీ
దేవగఢ్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ లక్ష్యంగా ప్రధాని మోదీ ఆరోపణలు గుప్పించారు. దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయడానికి కాంగ్రెస్ యువరాజు కుట్రలు సాగిస్తున్నాడని మండిపడ్డారు. స్వార్థ రాజకీయాలే పరమావధిగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను బలహీనపర్చడం కోసం రిజర్వేషన్లు అంతం చేయడానికి ప్రయతి్నస్తున్నాడని చెప్పారు. బుధవారం జార్ఖండ్‌లో రెండు ఎన్నికల ప్రచార సభల్లో మోదీ మాట్లాడారు. రాష్ట్రంలో జేఎంఎం ప్రభుత్వం అక్రమ వలసదార్లను ప్రోత్సహించిందని, సర్కారు అండతో వారంతా శాశ్వత నివాసితులుగా మారిపోయారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల విషయంలో కాంగ్రెస్ ఉద్దేశాలు ప్రమాదకరంగా ఉన్నాయన్నారు. యువ రాజు తండ్రి(రాజీవ్ గాం«దీ)రిజర్వేషన్లను వ్యతిరేకించారని గుర్తుచేశారు. -
విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై ‘కూటమి’ కుట్ర: బొత్స
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు కుట్రలు చేస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, విశాఖ ఉక్కు ఆంధ్రుల సెంటిమెంట్. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కోసం వేల ఎకరాల భూములను రైతులు త్యాగం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు కుట్రలు చేస్తున్నారని బొత్స ధ్వజమ్తెతారు.‘‘విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్సీపీ వ్యతిరేకమని ప్రధాని మోదీకి వైఎస్ జగన్ చెప్పారు. స్టీల్‌ప్లాంట్ కార్మికులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. గత 15 రోజులుగా స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు నిరసన చేస్తున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై కూటమి ప్రభుత్వం వైఖరీ చెప్పాలి’’ అని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.‘‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో స్టీల్ ప్లాంట్ ఏర్పడింది. 32 మంది త్యాగ ఫలంతో ఏర్పడింది. 32 వేల ఎకరాలు స్టీల్ ప్లాంట్ కోసం ఇచ్చారు.. వైఎస్ హయాంలో స్టీల్ ప్లాంట్ విస్తరణ కోసం11 వేల కోట్ల ఖర్చు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కష్టాలు ప్రారంభమయ్యాయి. ప్రధాని మోదీ విశాఖ వచ్చిన సందర్భంలో విశాఖను స్టీల్ ప్లాంట్ పైవేటికరణ చేయొద్దని వైఎస్ జగన్ అడిగారు. ప్రధానికి రెండు సార్లు లేఖలు రాశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే టీడీపీ నేతలు రాజీనామాలు చేస్తామంటున్నారు. ఎంపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు వలన ఒరిగేది లేదు. ఇదీ చదవండి: చంద్రబాబూ.. ప్రభుత్వ సంస్థలంటే అంత అసహ్యమెందుకు?: వైఎస్ జగన్..కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణకు అనుకూలమా వ్యతిరేకమా చెప్పాలి. ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. స్టీల్ ప్లాంట్‌పై టీడీపీ విధానం ఏమిటో చెప్పాలి. కేంద్ర మంత్రి కుమారస్వామి వచ్చారు.. రెండవ బ్లాస్ట్ ఫర్నిచర్ మూసివేశారు. మా పార్టీ విధానమే ప్లాన్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకం. స్టీల్ ప్లాంట్ అనేది ప్రజల సెంటిమెంట్. మేము వ్యతిరేకించాము కాబట్టే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది’’ అని బొత్స సత్యనారాయణ చెప్పారు. -
దళితులపై కారంచేడు తరహా దాడులకు టీడీపీ కుట్ర
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ మెజార్టీ సాధించిన తర్వాత దళితులపై తెలుగుదేశం పార్టీ నాయకులు దాడులకు పాల్పడేందుకు కుట్రలు పన్నుతున్నారని మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసి జయప్రకాష్ కెనడీ విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ హయాంలో దళితులు, మైనార్టీలు, బీసీల సంక్షేమం జరిగిందని, అందువల్లనే ఈ ఎన్నికల్లో ఆయా వర్గాలన్నీ వైఎస్సార్సీపీకే మద్దతుగా నిలిచాయని చెప్పారు. పోలింగ్ జరుగుతున్న రోజే ఈ విషయాన్ని గుర్తించిన టీడీపీ నాయకులు పలు జిల్లాల్లో దళితులపై దాడులకు పాల్పడ్డారని విమర్శించారు. రాష్ట్రంలో దళితులు, మైనార్టీలు, బీసీలకు సీఎం జగన్ సంక్షేమ పథకాలతో మేలు చేశారని, అందుకు కృతజ్ఞతగా ఈ ఎన్నికల్లో దళితులు, మైనార్టీలు, బీసీలు ఆయనకు అండగా ఉన్నారని తెలిపారు. అది సహించలేని టీడీపీ.. దళితులపై దాడులు చేయాలనే ఆలోచనల్లో ఉన్నట్లుగా తమకు సమాచారం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 30 ఏళ్ల కిందటి కారంచేడు వంటి ఘటనలు పునరావృతం చేయడానికి టీడీపీ నాయకులు కుట్రలు పన్నుతున్నారని జయప్రకాష్ కెనడీ ఆరోపించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఇచ్చిన ఓటు హక్కును స్వేచ్ఛగా ఉపయోగించుకునే హక్కు దళితులకు లేదా అని ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత దళితులపై దాడులు జరగకుండా ఎలక్షన్ కమిషన్, డీజీపీ పూర్తిస్థాయిలో రక్షణ చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర జేఏసీ కన్వీనర్ మేదర సురేష్ మాట్లాడుతూ టీడీపీ నేతలు పోలింగ్ రోజున దళితులపై దాడులకు తెగబడుతున్నా ఎలక్షన్ కమిషన్ ప్రేక్షకపాత్ర వహించిందని విమర్శించారు. ఎన్నికల ఫలితాల తర్వాత దళితులపై దాడులు జరిగితే దానికి ఎలక్షన్ కమిషన్, డీజీపీలే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సమావేశంలో విజయవాడ మాలమహానాడు నగర అధ్యక్షుడు చేపూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
PM Narendra Modi: మతం ఆధారంగా బడ్జెట్ కేటాయింపులా?
నాసిక్: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో 15 శాతం నిధులను మైనారీ్టలకే కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. మతం ఆధారంగా బడ్జెట్ కేటాయింపులను తాము అనుమతించే ప్రసక్తే లేదని తేలి్చచెప్పారు. అలాగే విద్య, ఉద్యోగాల్లో మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని స్పష్టంచేశారు. 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు బడ్జెట్లో 15 శాతం నిధులను వారికి ప్రీతిపాత్రమైన ఓటు బ్యాంక్‌కు కట్టబెట్టడానికి ప్రయతి్నంచిందని చెప్పారు. అప్పట్లో బీజేపీ గట్టిగా ప్రతిఘటించడంతో కాంగ్రెస్ వెనక్కి తగ్గిందని పేర్కొన్నారు. ఆ సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న తాను కాంగ్రెస్ ప్రతిపాదనను వ్యతిరేకించానని తెలిపారు.కానీ, మైనారీ్టలకు 15 శాతం నిధుల ఆలోచనను కాంగ్రెస్ ఇప్పటికీ విరమించుకోలేదని, ఒకవేళ కేంద్రంలో అధికారంలోకి వస్తే అమలు చేయాలని యోచిస్తోందని విమర్శించారు. బుధవారం మహారాష్ట్రలోని పింపాల్‌గావ్ బస్వంత్, థానే పట్టణాల్లో లోక్‌సభ ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. మతం ఆధారంగా బడ్జెట్ కేటాయింపులు అనేది చాలా ప్రమాదకరమైన ఆలోచన అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మత ఆధారంగా దేశాన్ని ఇప్పటికే ఒకసారి విభజించిందని, మరో సారి అలాంటి పథకమే రచిస్తోందని ధ్వజమెత్తారు. తాము మతాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. గత పదేళ్లలో తమ ప్రభుత్వం సాధించిన ఘనతలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఇప్పుడు జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు కేవలం ఎంపీలను ఎన్నుకోవడం కోసం కాదని అన్నారు. దేశం కోసం బలమైన నిర్ణయాలు తీసుకొనే సామర్థ్యం గల ప్రధానమంత్రిని ఎన్నుకోవడానికి జరుగుతున్నాయని ఉద్ఘాటించారు. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని వివరించారు. గత పదేళ్లలో తన పని తీరును ప్రజలు గమనించారని. వికసిత్ భారత్ కోసం తనను మూడోసారి గెలిపించాలని కోరారు. -
డీబీటీ లబ్ధిదారులతో టీడీపీ ముఠా చెలగాటం
సాక్షి, విజయవాడ: డీబీటీ లబ్ధిదారులతో టీడీపీ ముఠా చెలగాటమాడుతోంది. లబ్ధిదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయనీయకుండా ఈసీపై ఒత్తిళ్లు చేస్తోంది. ఈసీ ఉత్తర్వులను ఇవాళ్టి వరుకూ నిలుపుదల చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. నిన్న అర్థరాత్రి హైకోర్టు తీర్పు ఉత్తర్వులు అందుబాటులోకి వచ్చాయి.హైకోర్టు తీర్పు కాపీతో ఈసీని అధికారులు సంప్రదించారు. క్లారిఫికేషన్ కోసం ఈసీని అధికారులు కోరగా, ఇప్పటివరకూ ఈసీ ఎలాంటి క్లారిఫికేషన్ ఇవ్వలేదు. ఎన్నికల సంఘం పరిధిలో పనిచేస్తున్నందున ఎన్నికల కమిషన్ క్లారిఫికేషన్ ఇస్తే తప్ప ముందుకు వెళ్లలేమని అధికారులు అంటున్నారు. ఈసీ క్లారిఫికేషన్ ఆలస్యమైతే హైకోర్టు ఇచ్చిన గడువు ముగిపోతోందని లబ్ధిదారుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.హైకోర్టు ఉత్తర్వులను అడ్డుకునేందుకు మరో వైపు కోర్టులో టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. నవతరం పార్టీ తరఫున పరోక్షంగా కోర్టులో టీడీపీ అప్పీల్ వేసింది. తమకు ఫిర్యాదులు వచ్చినందునే పథకాలను నిలిపేశామని ఈసీ పేర్కొనగా, దీంతో టీడీపీ బాగోతం బయటపడింది. -
చంద్రబాబు పగ.. ఫస్టొచ్చింది.. పెన్షన్ రాలేదు
ప్రతినెలా ఫస్ట్ తేదీ రాగానే పలకరిస్తూ చేతిలో కరెన్సీ నోట్లు పట్టుకుని పెద్దమ్మా బాగున్నావా.. తాతా బాగున్నావా అని పలకరించే వాలంటీర్ రాలేదు... అయన వచ్చి డబ్బులిస్తే మందులు... పప్పు ఉప్పు...సరుకులు కొనుక్కుందాం అనుకున్నాను.. వాలంటీర్ రాలేదు... చేతిలోకి పైసలు పడలేదు... ఈ ఎండల్లో ఆటోల్లో పక్కూరు వెళ్లి బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకోవాలట. ఈ మండుటెండలో ఎలా వెళ్లాలో ఏమో అంటూ వృద్ధులు.. వికలాంగులు ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు వేసిన ఎత్తులు, కుట్రల వల్ల వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారు.అసలు బ్యాంకులకు వెళ్లి డబ్బులు తెచ్చుకోవడం మనకు అవుతుందా ? ఆ బ్యాంకుల్లో క్యూలైన్లు.. నిలబడడం.. ఆ ఫారాలు నింపడం.. ఇదంతా పెద్ద సమస్య.. దానికితోడు కొన్ని బ్యాంకులు తమ ఖాతాల్లో కనీస నిల్వ (మినిమమ్ బ్యాలెన్స్ )లేకపోతె కొంత పెనాల్టీ విధిస్తాయి. కొన్నాళ్లపాటు ఆ ఖాతా యాక్టివ్‌గా లేకపోతే ఆ ఖాతాలను బ్యాంకులు మూసేస్తాయి. ఈ పేదల ఖాతాల్లో నిత్యం మినిమమ్ బ్యాలెన్స్ ఉంటుందా అనేది సందేహమే... అలా వాళ్ళు బ్యాలెన్స్ ఉంచకపోతే పాపం వీళ్ళ ఖాతాల్లోకి వచ్చిన మూడు వేలలో కొంత కోత విధిస్తే అది తమకు నష్టం అని వారు ఆందోళన చెందుతున్నారు. ఇదంతా చంద్రబాబు చేసిన కుట్ర అని, వాలంటీర్లు ఇల్లిల్లూ తిరిగి పెన్షన్లు పంచడాన్ని అయన భరించలేక ... సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మంచిపేరు రావడాన్ని సహించలేక ఇలాంటి కుట్రలకు దిగారని, రేపు ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతామని అంటున్నారు..మగ నంగనాచి చంద్రబాబు..ఊళ్లలో కొంతమంది నంగనాచి లేడీస్ ఉంటారు.. వాళ్ళో గదిలో మొగుణ్ణి చావచితక్కొట్టి మళ్ళీ వీధుల్లోకి వచ్చి.. అయ్యో నా మొగుడు నన్ను చంపేసినాడమ్మో... నా మొగుడు.. కొట్టీసినాడమ్మో అంటూ వీధిలోకి వచ్చి వీరంగం వేస్తారు... ఇప్పుడు చంద్రబాబు సైతం మగ నంగనాచి పాత్రలో జీవిస్తున్నారు... మార్చి వరకూ ప్రతి ఇంటికీ వెళ్లి పెన్షన్షన్లు అందించే వాలంటీర్లను కోర్టు ద్వారా అడ్డుకున్న చంద్రబాబు ఇప్పుడు అయ్యో వృద్ధులు అంటూ కన్నీళ్లు కారుస్తున్నారు.వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్లు ఇస్తే అది సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే అంశం అవుతుంది కాబట్టి.. ఆ డోర్ డెలివరీకి ఆపాలంటూ కోర్టులు, ఎన్నికల కమిషన్ ద్వారా అడ్డుకున్న చంద్రబాబుకు వెనువెంటనే విషయం అర్థమైంది. ఏప్రిల్‌లో ఇలాగే ఎండల్లో లబ్ధిదారులు బ్యాంకులు.. సచివాలయాలు వద్దకు వెళ్లి పెన్షన్లను తీసుకుంటూ... చంద్రబాబును తిట్టడం మొదలు పెట్టారు.. దీంతో ఇదేదో తనకు వ్యతిరేకత అయ్యేలా ఉందని గుర్తించిన చంద్రబాబు ఇప్పుడు ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. ఇదంతా జగన్ కుట్ర అని, పెన్షన్లు ఎగ్గొట్టేందుకే ఇవన్నీ చేస్తున్నారని ఎదురు విమర్శిస్తున్నారు. వాస్తవానికి ఈ మేలో కూడా మరింత మండుతున్న ఎండల్లో వృద్ధులు మళ్ళీ బ్యాంకులవద్ద పడిగాపులు కాయడం.. దీనికి చంద్రబాబే కారణం అని వాళ్ళు గుర్తించి ఆయన్ను తిడుతుండడంతో ఏమి చేయాలో తెలియక చంద్రబాబు కొత్త నాటకాలకు తెరతీస్తున్నారు..-సిమ్మాదిరప్పన్న -
ఏపీలో వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు
సాక్షి, విజయవాడ: ఏపీలో సంక్షేమ పథకాలకు వాలంటీర్లతో డబ్బు పంపిణీ చేయవద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్ ముగిసేవరకు వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లు, పరికరాలు స్వాధీనం చేసుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులపై చంద్రబాబు కుట్రలు ఏపీలో ప్రభుత్వం పథకాల లబ్ధిదారులపై చంద్రబాబు కుట్రలకు తెరలేపారు. అవ్వాతాతాలపై కసి తీర్చుకుంటున్న చంద్రబాబు.. నిమ్మగడ్డ రమేష్ ద్వారా వాలంటీర్లపై ఫిర్యాదు చేయిచారు. చంద్రబాబు కుట్రలతో వాలంటీర్ల సేవలకు ఈసీ బ్రేక్ వేసింది. వాలంటీర్లు పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలు ఇవ్వకూడదంటూ నిమ్మగడ్డ ఫిర్యాదుతో వాలంటీర్లపై ఈసీ ఆంక్షలు పెట్టింది. పెన్షన్లు వాలంటీర్లు ఇవ్వకూడదంటూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఫోన్లు, ట్యాబ్‌లు ఉన్నతాధికారులకు అందించాలని ఆదేశించింది. కోడ్ ముగిసేవరకు పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాల పంపిణీకి ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని ఎన్నికల సంఘం పేర్కొంది. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో క్షేత్రస్థాయిలో పైరవీలు, అవినీతి అన్న వాటికి తావేలేకుండా.. కుల, మత, ప్రాంత, వర్గ తారతమ్యాలకు అతీతంగా.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలను అందజేయడంలో కీలకంగా పనిచేస్తున్న వలంటీర్లపై కుట్రకు ఎల్లో బ్యాచ్ బరితెగించింది. -
టీడీపీ దొంగ ఓట్ల కుట్రలపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, విశాఖపట్నం: మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. తెలంగాణలో ఓటు వేసినవారితో కూడా ఏపీలో కూడా ఓటు వేయించేందుకు చంద్రబాబు కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. డబల్ ఎంట్రీ ఓట్లను తొలగించాలంటూ విశాఖ జిల్లా కలెక్టర్లకు వైఎస్సార్సీపీ నేతలు వినతి పత్రం సమర్పించారు. డబుల్ ఎంట్రీ ఓట్లపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. -
Rajasthan Elections 2023: ఐదేళ్లుగా పరస్పరం రనౌట్‌కు కుట్రలు
జైపూర్: దేశమంతటా ఎక్కడ చూసినా క్రికెట్ ప్రపంచకప్ ముచ్చట్లే. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్తాన్‌లో కాంగ్రెస్ పార్టీ తీరును క్రికెట్ టీమ్‌తో పోల్చారు. రాజస్తాన్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒకరినొకరు రనౌట్ చేసుకొనేందుకు గత ఐదేళ్లుగా కుట్రలు పన్నుతున్నారని చెప్పారు. తద్వారా ఆ పారీ్టలో నేతల మధ్య రగులుతున్న అంతర్గత విభేదాలను, సీఎం అశోక్ గహ్లోత్, సీనియర్ నాయకుడు సచిన్ పైలట్ మధ్య ఆధిపత్య పోరును ప్రస్తావించారు. వారు పరుగులు చేయడానికి బదులు, సొంత టీమ్‌లోని ప్రత్యర్థులను పడగొట్టాలని చూశారని చెప్పారు. వారి టీమ్ సరిగ్గా లేనప్పుడు ఇక ప్రజల కోసం ఏం చేస్తారని ప్రశ్నించారు. ఆదివారం రాజస్తాన్‌లోని చురు జిల్లాలోని ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని మండిపడ్డారు. అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలు అనే సంప్రదాయాన్ని కాంగ్రెస్ అభివృద్ధి చేసిందని, దాని వల్ల దేశం భారీగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తీరు వల్ల దేశంలో యువతకు ఎదిగే అవకాశాలు రాలేదని చెప్పారు. పేపర్ లీక్ మాఫియాపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తాం.. రాజస్తాన్‌లో బీజేపీకి అధికారం అప్పగిస్తే అవినీతిపరుల భరతం పడతామని, వేగవంతమైన అభివృద్ధికి శ్రీకారం చుడతామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌కు ఎంత దూరంగా ఉంటే రాజస్తాన్‌కు అంత మేలు జరుగుతుందని, భవిష్యత్తుకు భరోసా లభిస్తుందని ప్రజలకు సూచించారు. వెలుతురికి, చీకటికి మధ్య ఉన్న సంబంధం లాంటిదే మంచికి, కాంగ్రెస్‌కు మధ్య కూడా ఉందని అన్నారు. రాష్ట్రంలో జల జీవన్ మిషన్‌లో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ప్రజలకు తాగునీరు సరఫరా చేయడానికి ఉద్దేశించిన పథకంలోనూ నిధులు కొల్లగొట్టారని దుయ్యబట్టారు. కాంగ్రెస్, అభివృద్ధి అనేవి పరస్పరం శత్రువులని, ఆ శత్రుత్వం ఎప్పటికీ కొనసాగుతుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పేపర్ లీక్ మాఫియా యువత భవిష్యత్తును లక్షలాది రూపాయలకు అమ్మేసిందని ధ్వజమెత్తారు. ఎరువుల కుంభకోణంతో రైతులను విచ్చలవిడిగా లూటీ చేసిందని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే పేపర్ లీక్ మాఫియాపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. అక్రమార్కులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కఠినంగా శిక్షిస్తామని తేలి్చచెప్పారు. 2047 నాటికి ‘అభివృద్ధి చెందిన భారత్’ రాజస్తాన్‌లో కాంగ్రెస్ పాలనలో ధరలు భారీగా పెరిగిపోయానని మోదీ గుర్తుచేశారు. హరియాణా, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.13 అధికంగా ఉందన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే ధరలను సమీక్షిస్తామని, ప్రజలకు ఊరట కలి్పస్తామని వెల్లడించారు. కొన్నేళ్లలో అన్ని రంగాల్లోనూ భారత్ అద్భుతాలు చేసిందన్నారు. ఎటు చూసినా నూతనోత్సాహం, ఆత్మవిశ్వాసం కనిపిస్తున్నాయని, 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. -
పండుగపై పడగ!
సాక్షి, అమరావతి: అంతటా పండుగ సంతోషాలు, సంబరాలు వెల్లివిరుస్తున్న శుభవేళ ప్రతిపక్ష టీడీపీ మాత్రం వికృత రాజకీయాలకు తెగబడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు, అలజడులు, విధ్వంసాలు సృష్టించేందుకు కుట్రలు పన్నుతోంది. స్కిల్ కుంభకోణంలో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి రాశారంటూ ఓ నకిలీ లేఖను ప్రచారంలోకి తేవడంతోపాటు సోమవారం సాయంత్రం ‘జగనాసుర దహనం’ అనే కార్యక్రమానికి నారా లోకేశ్ పిలుపునివ్వడం ద్వారా పార్టీ శ్రేణులు, రౌడీమూకలను అల్లర్లకు పురిగొల్పుతున్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యమంత్రి దిష్టి బొమ్మలను దహనం చేయడంతోపాటు రాజకీయ ప్రత్యర్థులపై దాడులు, దుకాణాలపై దాడులు, లూటీలు చేయాలన్నది టీడీపీ లోపాయికారీ కుట్రగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా వీధుల్లోకి వచ్చి సామాన్యులను భయభ్రాంతులకు గురిచేసి అల్లకల్లోలం సృష్టించాలని పథకం వేశారు. మత కలహాలు, వర్గ వైషమ్యాలు సృష్టించేందుకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. విపక్షం కుట్ర రాజకీయాల పట్ల అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన ‘నారా’సురుడు చంద్రబాబే అసలైన నరకాసురుడని వ్యాఖ్యానిస్తున్నారు. అటువంటి వ్యక్తి జైల్లో ఉండటమే ప్రజలకు అసలైన దసరా అని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. పోలీసు యంత్రాంగం అప్రమత్తం తాజా పరిణామాలతో పోలీసు యంత్రాంగం రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తమైంది. ఎక్కడా శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించింది. ప్రజలు సామరస్య పూర్వకంగా ఆనందోత్సాహాలతో దసరా పండుగ నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. అసాంఘిక శక్తులను ఏమాత్రం ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. -
PM Modi: కర్ణాటకను వేరు చేసే కుట్ర
శివమొగ్గ/బనశంకరి: భారతదేశం నుంచి కర్ణాటకను వేరు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతోందని, అందుకోసం బహిరంగంగానే పిలుపునిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. ‘తుక్డే తుక్డే గ్యాంగ్’ వ్యాధి ఆ పార్టీలో టాప్ లెవల్‌కు చేరిందని అన్నారు. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేసే విషయంలో కాంగ్రెస్ ‘రాజ కుటుంబం’ ముందంజలో ఉంటుందని ఆరోపించారు. తన మనసులో చాలా బాధ ఉందని అన్నారు. ఆ రాజ కుటుంబం మన దేశంలో విదేశీ శక్తుల జోక్యాన్ని ప్రోత్సహిస్తోందని పరోక్షంగా సోనియా గాంధీ కుటుంబంపై మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు ఆటలను దేశం ఎప్పటికీ క్షమించబోదని తేల్చిచెప్పారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ఆదివారం మైసూరు జిల్లాలోని నంజనగూడులో బహిరంగ సభలో మాట్లాడారు. భారత్‌ను ద్వేషించే విదేశీ ప్రతినిధులతో కాంగ్రెస్ పార్టీ రహస్యంగా సమావేశమవుతోందని, మన దేశ సార్వభౌమత్వాన్ని కించపర్చే చర్యలకు తరచుగా పాల్పడుతోందని, అందుకు ఆ పార్టీ ఏమాత్రం సిగ్గుపడడం లేదని దుయ్యబట్టారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పరివారం అన్ని పరిమితులు దాటేసిందని, కర్ణాటక సార్వభౌమత్వాన్ని కాపాడతామని చెబుతోందని, తద్వారా దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తోందని విమర్శించారు. అసలు కర్ణాటక సార్వభౌమత్వం అంటే ఏమిటో చెప్పాలని నిలదీశారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుతామని రాజ్యాంగంపై ప్రమాణం చేసి, ఇలాంటి మాటలు చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. కర్ణాటక భారతదేశంలో లేదని కాంగ్రెస్ భావిస్తోందా? అని అనుమానం వ్యక్తం చేశారు. దేశంలో కర్ణాటక అంతర్భాగమని మోదీ ఉద్ఘాటించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలని, బీజేపీ భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. నంజనగూడులో ప్రచారం తర్వాత ప్రధానమంత్రి శ్రీకంఠేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. నంజుండేశ్వర స్వామి వెండి ప్రతిమను బీజేపీ నేతలు ప్రధానికి బహూకరించారు. ప్రజల మద్దతు మాకే.. కర్ణాటకలో తాము ఎక్కడికి వెళ్లినా ప్రజల మద్దతు సంపూర్ణంగా లభిస్తోందని, వారు తమను ఆశీర్వదిస్తున్నారని, రాష్ట్రంలో తాము మరోసారి అధికారంలోకి వస్తామన్న పూర్తి విశ్వాసం ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆదివారం శివమొగ్గ సమీపంలోని ఆయనూరులో భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సుమారు 30 లక్షల ఉద్యోగాలను కల్పించిందని చెప్పారు. మారుమూల ప్రాంతాల్లోనూ అభివృద్ధి జరిగిందని అన్నారు. అధికారం కోసం ఎదురు చూస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు తప్పుడు హామీలు ఇస్తోందని, అబద్ధాలను చెబుతోందని దుయ్యబట్టారు. కర్ణాటకలో కాంగ్రెస్ చెబుతున్న అబద్ధాలను ప్రజలు నమ్మడం లేదని, ఆ పార్టీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే ప్రచారం కోసం సోనియా గాంధీని రప్పించారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అబద్ధాల గాలి బుడగను ప్రజలు పగులగొట్టడం ఖాయమని తేల్చిచెప్పారు. -
విచ్ఛిన్న శక్తులను ఎదిరిద్దాం
కేవాడియా: భారతదేశ ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు శత్రువులు కుట్రలు పన్నుతున్నారని, అలాంటి కుయుక్తులకు వ్యతిరేకంగా దేశ ప్రజలంతా కలిసికట్టుగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. విచ్ఛిన్నకర శక్తులను ఎదిరించాలని అన్నారు. దేశ తొలి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ సోమవారం ఘనంగా నివాళులర్పించారు. గుజరాత్‌లోని కేవాడియాలో ఐక్యతా ప్రతిమ (స్టాచ్యూ ఆఫ్ యూనిటీ) వద్ద ‘రాష్ట్రీయ ఏక్తా దివస్’ కార్యక్రమంలో ప్రసంగించారు. ‘‘మోర్బీ వంతెన దుర్ఘటనలో మృతిచెందిన వారి పట్ల నా మనసంతా ఆవేదనతో నిండిపోయింది. అయినా విధి, బాధ్యత నన్నిక్కడి తీసుకొచ్చాయి’’ అన్నారు. ఐక్యతా ప్రతిమ వద్ద సాంస్కృతిక నృత్యాలను ప్రమాదం దృష్ట్యా రద్దు చేశారు. ‘‘పటేల్ లాంటి నాయకుడు లేకపోతే ఇండియా పరిస్థితి ఏమిటో ఊహించుకోవడమే కష్టంగా ఉంది. ఐక్యత అనేది మనకు నిర్బంధం, బలవంతం కాదు. అదే మన విశిష్టత. గతంలో వెదజల్లిన విషం తాలూకూ దుష్పరిణామాలు ఇప్పుడూ కనిపిస్తున్నాయి. విదేశీ శక్తులు మనకు చేటు చేసేందుకు చేయాల్సిందంతా చేస్తూనే ఉన్నాయి. వారికి గుణపాఠం చెబుదాం’’ అన్నారు. పటేల్ ప్రధాని అయ్యుంటే... జయంతి వేడుకలో అమిత్ షా వ్యాఖ్యలు న్యూఢిల్లీ: సర్దార్ పటేల్ భారత తొలి ప్రధాని అయితే ప్రస్తుతం దేశానికి కొన్ని సమస్యలుండేవి కాదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. పటేల్ 147వ జయంతి సందర్భంగా ఢిల్లీలో సర్దార్‌పటేల్ పాఠశాల విద్యార్థులనుద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘లక్షద్వీప్, జోధ్‌పూర్, జునాగఢ్, హైదరాబాద్, కశ్మీర్ వంటి కీలక సంస్థానాలను పటేలే దేశంలో విలీనం చేశారు. కాంగ్రెస్ వర్కింట్ కమిటీలో అత్యధిక ఓట్లు సాధించినా ప్రధాని పదవిని త్యాగం చేయాల్సి వచ్చింది. అందుకే ఇప్పుడు దేశాన్ని కొన్ని అంశాలు వేధిస్తున్నాయి’’ అని అన్నారు. సర్దార్ పటేల్‌కు మోదీ సెల్యూట్ -
ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కడానికి ట్రంప్ కుట్రలు
వాషింగ్టన్: అమెరికాలో ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కడానికి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన మద్దతుదారులు కుట్రలు పన్నుతున్నారని అధ్యక్షుడు జో బైడెన్ ఆరోపించారు. అధికారం దక్కించుకోవడానికి దుర్బుద్ధితో రాజకీయ హింసను ఎగదోస్తున్న వారికి గట్టిగా బుద్ధి చెప్పాలని, తగిన గుణపాఠం నేర్పాలని అమెరికా ప్రజలకు పిలుపునిచ్చారు. ‘తీవ్రవాదులను’ కచ్చితంగా ఎదిరించాలని చెప్పారు. ఫిలడెల్ఫియాలోని ప్రఖ్యాత ఇండిపెండెన్స్ హాల్లో బైడెన్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతిపక్ష రిపబ్లికన్లపై విరుచుకుపడ్డారు. ట్రంప్ మద్దతుదారుల అజెండా అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పేనని తేల్చిచెప్పారు. వారి దుశ్చర్యల వల్ల సమానత్వం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతున్నాయని పేర్కొన్నారు. వారికి రాజ్యాంగంపై నమ్మకం లేదని, అధికారమే పరమావధిగా భావిస్తున్నారని ధ్వజమెత్తారు. డొనాల్డ్ ట్రంప్, ఆయన అనుచరుల ఆటలు సాగవని హెచ్చరించారు. నాయకుడి పట్ల గుడ్డిగా విధేయత ప్రకటించడం, రాజకీయ హింసలో పాల్గొనడం వంటివి ప్రజాస్వామ్యానికి చేటు కలిగిస్తాయన్న సత్యాన్ని చరిత్ర మనకు నేర్పుతోందని బైడెన్ ఉద్ఘాటించారు. -
AP: ‘బల్క్’ కుట్ర బహిర్గతం.. టీడీపీ పన్నాగం బట్టబయలు
మరీ ఇంత దిక్కుమాలిన రాజకీయాలా? పొరుగు రాష్ట్రం తెలంగాణ.. బల్‌్కడ్రగ్ పార్కు తమకివ్వకపోవటం అన్యాయమంటోంది. వివక్ష చూపిందంటూ కేంద్రాన్ని నిందిస్తోంది. ఇక స్వరాష్ట్రం గుజరాత్‌పై ప్రత్యేక అభిమానంతో ప్రధాని దీన్ని కేటాయించారంటూ ప్రశంసాపూర్వక నిందలు కొన్ని పక్షాల నుంచి వినిపిస్తున్నాయి. అలాంటి పార్కు ఏపీకి వస్తే.. ఇక్కడి ప్రతిపక్షం మాత్రం ఇక్కడ పెట్టవద్దంటోంది. దీన్ని నిలిపేయాలంటూ లేఖలపై లేఖలు రాసి... రాద్ధాంతానికి రెడీ అంటోంది. రాష్ట్రానికి పారి శ్రామికవేత్తలు రావటం లేదని విమర్శలు చేసేదీ వీరే!! అభివృద్ధి లేదనే ఆరోపణలూ వీరివే. తీరా భారీ ఎత్తున ఉపాధి కల్పించే బల్క్ డ్రగ్ పార్కును సాధిస్తే.. దాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నదీ వీరే!! ఇదీ ఇక్కడి ప్రతిపక్ష టీడీపీ.. దాంతో అంటకాగుతున్న మీడియా తీరు. సాక్షి, అమరావతి: చేతనైతే ఊరికి ఉపకారం చేయాలి.. అపకారం మాత్రం తలపెట్టకూడదు! మాజీ మంత్రి యనమల మాత్రం పురిటిగడ్డకే ద్రోహం తలపెడుతున్నారు! వేల మంది స్థానిక యువతకు ఉపాధి కల్పించే పరిశ్రమలకు అడ్డుపుల్లలు వేస్తున్నారు. రాష్ట్రాభివృద్ధిని అడుగడుగునా అడ్టుకుంటున్న విపక్ష టీడీపీ క్షుద్ర రాజకీయాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఔషధాల దిగుమతి తగ్గించుకొని ఫార్మా రంగంలో స్వయం సమృద్ధి సాధించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మూడు రాష్ట్రాల్లో బల్క్ డ్రగ్ పార్క్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. తీవ్ర పోటీ నెలకొన్న ఈ పార్క్‌ల కోసం ఆంధ్రప్రదేశ్‌తోపాటు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎంపికయ్యాయి. 16 రాష్ట్రాలతో పోటీ పడి మరీ మన రాష్ట్రం దీన్ని సాధించుకుంటే ఆంధ్రపదేశ్‌కు రాకుండా అడ్డుకునేందుకు ప్రతిపక్ష టీడీపీ మూడు నెలల క్రితమే ప్రయత్నాలు ప్రారంభించినట్లు వెల్లడైంది. రూ.వేల కోట్ల పెట్టుబడులతో పాటు వేల మందికి ఉపాధి కల్పించే ప్రతిష్టాత్మక పార్క్‌ను రాష్ట్రానికి రాకుండా నిరోధించేందుకు టీడీపీ పన్నిన కుట్రలు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కేంద్రానికి, ఎన్జీటీకి రాసిన లేఖల ద్వారా వెలుగులోకి వచ్చాయి. ఆపాలంటూ యనమల లేఖలు కాకినాడ సమీపంలో ఫార్మా రంగ పరిశ్రమల ఏర్పాటుతో రైతులు, మత్స్యకారుల జీవనోపాధి దెబ్బ తింటుందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బల్క్ డ్రగ్ పార్కు వల్ల తీవ్ర పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని, దీన్ని రద్దు చేయాలంటూ తాజాగా కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖకు రాసిన లేఖలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఇవే అంశాలను గత జూలై 16న లేఖ ద్వారా ఢిల్లీలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ ఆదర్శ్‌కుమార్ గోయెల్, చెన్నైలోని ఎన్జీటీ సదరన్ జోనల్ కార్యాలయానికి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి దృష్టికి తెచ్చినట్లు తెలిపారు. తక్షణమే కేంద్రం జోక్యం చేసుకుని ఈ ప్రాంతంలో ఫార్మా పరిశ్రమల ఏర్పాటును నిలిపివేయాలని కోరారు. చదవండి: ‘కాకినాడ’లో.. బల్క్ డ్రగ్ పార్క్ అక్కడ స్వాగతం.. ఇక్కడ దుర్బుద్ధి తెలంగాణ, తమిళనాడు, కర్నాటక లాంటి దక్షిణాది రాష్ట్రాల నుంచి గట్టిపోటీ ఎదురైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం బల్క్ డ్రగ్ పార్కును దక్కించుకుంది. దీంతో ఈ పార్కును రద్దు చేయాలంటూ యనమల మరోసారి కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సంయుక్త కార్యదర్శికి లేఖ రాయడం టీడీపీ దుర్బుద్ధిని బయటపెట్టిందంటూ ఫార్మా నిపుణులు, పారిశ్రామికవేత్తలు విమర్శిస్తున్నారు. ఒకపక్క ప్రధాని మోదీ సొంత రాష్ట్రానికి బల్క్ డ్రగ్ పార్కు కేటాయించడాన్ని రాజకీయాలకు అతీతంగా అక్కడ ప్రతిపక్ష పార్టీలన్నీ స్వాగతిస్తూ భారీ ప్రకటనలు జారీ చేయగా మన రాష్ట్రంలో మాత్రం ఆ పార్కునే రద్దు చేయాలంటూ టీడీపీ పదేపదే లేఖలు రాయడంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. తెలంగాణ, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో రాజకీయంగా ఎన్ని విభేదాలున్నా అభివృద్ధి విషయంలో కలిసి పనిచేస్తుంటాయని, ఇక్కడ టీడీపీ మాత్రం ప్రతిష్టాత్మక బల్క్ డ్రగ్ పార్కును మన రాష్ట్రం దక్కించుకుంటే అభినందనలు తెలపకపోగా రద్దు చేయాలంటూ కేంద్రానికి లేఖ రాయడం దారుణమని ఫార్మా రంగ నిపుణులు పేర్కొంటున్నారు. స్థానిక యువత ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తూ రూ.వేల కోట్ల పెట్టుబడులు రాకుండా అడ్డుకునే కుట్రలపై మండిపడుతున్నారు. యూఎస్ ఎఫ్‌డీఏ అనుమతించిన కంపెనీలే.. ఫార్మా కంపెనీల వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని, అందుకే బల్క్ డ్రగ్ పార్క్‌ను వ్యతిరేకిస్తున్నామంటూ యనమల పేర్కొనటంపై సోషల్ మీడియా వేదికగా పలువురు విరుచుకుపడుతున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ అంటే ఏమిటి? అక్కడ వ్యర్థాలను శుద్ధి చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అనే అంశాలపై కనీస అవగాహన లేకుండా దుగ్ధతో లేఖలు రాయటాన్ని తప్పుబడుతున్నారు. యూఎస్ ఎఫ్‌డీఏ అనుమతి ఉన్న కంపెనీలు మాత్రమే బల్క్ డ్రగ్ పార్కులో ఏర్పాటవుతాయని, ఒక్క చుక్క వ్యర్థం బయటకు వచ్చినా వాటి అనుమతులే రద్దు అవుతాయని స్పష్టం చేస్తున్నారు. అందువల్లే ఈ విషయంలో ఫార్మా కంపెనీలు చాలా జాగ్రత్తలు తీసుకుంటాయని ఫార్మా రంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు. కట్టుదిట్టంగా ట్రీట్మెంట్ ప్లాంట్స్ బల్క్ డ్రగ్ పార్కులో ఏర్పాటయ్యే కంపెనీల నుంచి వచ్చే ఘన, ద్రవవ్యర్థాలను శుద్ధిచేసేందుకు ట్రీట్ మెంట్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తారు కాబట్టి వ్యర్థాలు బయటకువెళ్లే అవకాశం ఉండదని నిపుణులు పే ర్కొంటున్నారు. ఇప్పటికే పలు ఫార్మా కంపెనీలున్న హైదరాబాద్‌లో లేని కాలుష్యం కాకినాడకు ఎక్కడి నుంచి వస్తుందంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఒకపక్క రాష్ట్రానికి పరిశ్ర మలు రావడంలేదంటూ దుష్ప్రచారం చేస్తూ మరోపక్క దాదాపు రూ.15 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే బల్క్‌డ్రగ్ పార్కును ఎందు కు అడ్డుకుంటున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. పార్కుకు అడ్డుపడటం ద్వారా తుని నియోజకవర్గంలో యువతకు ఉపాధి దొరకకుండా యనమల వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. గుజరాత్లో స్వాగతిస్తారు రాష్ట్రానికి బల్క్ డ్రగ్ పార్క్ రావడం స్వాగతించాల్సిన విషయం. ఇప్పుడు నూతన టెక్నాలజీ ద్వారా పరిశ్రమల వ్యర్థాలను 99 శాతం రీ సైకిల్ చేస్తున్నారు. వ్యర్థాల నియంత్రణకు జీరో లిక్విడ్ డిజార్డ్ (జెడ్‌ఎల్‌డీ) విధానం అందుబాటులో ఉంది. సముద్రంలో 35 వేల పీపీఎం సాల్ట్ ఉంటుంది. దాన్ని రివర్స్ ఆస్మాసిస్ ద్వారా 3 పీపీఎంకి తగ్గిస్తున్నామంటే టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు. దేశంలో ఉన్న అసలైన పొల్యూషన్ పేదరికం, నిరుద్యోగం లాంటివి పోగొట్టాలంటే పరిశ్రమలను పెంచాల్సిందే. గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో పరిశ్రమలు వస్తే స్వాగతిస్తారు. – ప్రొఫెసర్ మురళీకృష్ణ, జేఎన్టీయూకే, సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ మాజీ సభ్యుడు ఉమ్మడి వ్యర్థ నియంత్రణ వ్యవస్థ బల్క్ డ్రగ్ పార్కులో ఏర్పాటయ్యే ఫార్మా కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాలను శుద్ధి చేసేందుకు ఉమ్మడి వ్యర్థ నియంత్రణ వ్యవస్థ ఉంటుంది. దీంతో ఫార్మా కంపెనీలు సొంతంగా వ్యర్థ నియంత్రణ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో తక్కువ రేటుకే వ్యర్థాల శుద్ధి అందుబాటులోకి తేవడం కంపెనీలకు కలిసొచ్చే అంశం. – ఈశ్వర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, బల్క్ డ్రగ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఎఫ్‌డీఏ అనుమతులున్నవే దేశంలో ఏర్పాటయ్యే బహుళజాతి ఫార్మా కంపెనీలు యూఎస్ ఎఫ్‌డీఏ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. మన దేశ నిబంధనలతో పోలిస్తే ఇవి చాలా కఠినంగా ఉంటాయి. యూఎస్ ఎఫ్‌డీఏ నిబంధనల ప్రకారం ఉంటేనే ఆ కంపెనీలు ఉత్పత్తి చేయడానికి అనుమతిస్తాయి. ఈ విషయం తెలుసుకోకుండా ఫార్మా కంపెనీల ద్వారా కాలుష్యం ఏర్పడుతుందంటూ యనమల నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. – లంకా శ్రీధర్, రాష్ట్ర పెట్టుబడుల సలహాదారు యువతకు ఉపాధి తీర ప్రాంతంలో పరిశ్రమలు రావడం వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు అవకాశం ఏర్పడుతుంది. – గంగిరి నాగేంద్ర, కొత్త పెరుమాళ్లపురం, తొండంగి మండలం -
గుజరాత్‌పై కుట్రలు
భుజ్: గుజరాత్ వరుస ప్రాకృతిక విపత్తులతో అల్లాడుతున్న సమయంలో రాష్ట్రాన్ని దేశంలోనే గాక అంతర్జాతీయంగా కూడా అప్రతిష్టపాలు చేసి పెట్టుబడులు రాకుండా చేసేందుకు చాలా కుట్రలు జరిగాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ వాటన్నింటినీ అధిగమించి పారిశ్రామికంగా, ఇతరత్రా కూడా రాష్ట్రం అద్భుతంగా పురోగమించిందని కొనియాడారు. రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా ఆదివారం కచ్ జిల్లాలో రూ.4,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. అనంతరం ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు. ‘‘2001 కచ్ భూకంపం మాటకందని విషాదం. ఆ విలయాన్ని అవకాశంగా మార్చుకుని కచ్‌ను పునర్నిర్మించుకుంటామని అప్పుడే చెప్పాను. దాన్నిప్పుడు సాధించి చూపించాం. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద టెక్స్టైల్ ప్లాంట్, ఆసియాలో తొలి సెజ్ తదితరాలకు కచ్ వేదికైంది. దేశ రవాణాలో 30 శాతం ఇక్కడి కాండ్లాం, ముంద్రా పోర్టుల గుండానే జరుగుతోంది. దేశానికి కావాల్సిన ఉప్పు 30 శాతం కచ్‌లోనే తయారవుతోంది’’ అని మోదీ చెప్పారు. ‘‘భూకంపం వచ్చినప్పుడు నేను గుజరాత్ సీఎంను కాను. సాధారణ బీజేపీ కార్యకర్తను. రెండో రోజే కచ్ చేరుకుని సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నా’’ అని గుర్తు చేసుకున్నారు. భూకంపానికి బలైన 13 వేల మందికి స్మృత్యర్థం నిర్మించిన రెండు స్మారకాలను ప్రారంభించారు. ఆ సమయంలో అనేక భావాలు తనను ముప్పిరిగొన్నాయని చెప్పారు. స్మృతి వన్ స్మారకాన్ని అమెరికా ట్విన్ టవర్స్ స్మారకం, జపాన్‌లోని హిరోషిమా స్మారకంతో పోల్చారు. ఇలాంటి అనుభవాల నేపథ్యంలో విపత్తు నిర్వహణ చట్టం తెచ్చిన తొలి రాష్ట్రంగా గుజరాత్ నిలిచిందని చెప్పారు. దాని స్ఫూర్తితోనే కేంద్ర స్థాయిలో అలాంటి చట్టం వచ్చిందన్నారు. అవగాహన పెరగాలి పౌష్టికాహార లోపాన్ని రూపుమాపాలని, నీటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన మరింత పెరగాలని మోదీ అన్నారు. ఈ దిశగా పోషన్ అభియాన్, జల్ జీవన్ మిషన్ బాగా పని చేస్తున్నాయని చెప్పారు. సెప్టెంబర్‌ను పౌష్టికాహార నెలగా జరుపుకుంటున్నట్టు గుర్తు చేశారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. 2023ను అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా జరుపుకోవాలన్న భారత ప్రతిపాదనకు ఐరాస అంగీకరించడాన్ని గుర్తు చేశారు. ‘‘ఏళ్లుగా విదేశీ అతిథులకు మన తృణధాన్యపు వంటకాలను రుచి చూపిస్తూ వస్తున్నా. వారంతా వాటి రుచిని ఎంతో ఆస్వాదించారు. ముడి ధాన్యం అనాది కాలం నుంచి మన సాగులో, సంస్కృతితో, నాగరికతలో భాగం’’ అన్నారు. ఈసారి పంద్రాగస్టు ఉత్సవాలను దేశ ప్రజలంతా గొప్ప జోష్‌తో జరుపుకున్నారంటూ హర్షం వెలిబుచ్చారు. లెక్కలేనన్ని వైరుధ్యాలు, వైవిధ్యాలున్న ఇంత పెద్ద దేశం తాలూకు సమష్టి శక్తి ఎంత బలవత్తరమైనదో ప్రపంచానికి చూపారన్నారు. స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ దేశంలో మూలమూలలా అమృత ధార పారుతోందన్నారు. ఈశాన్య భారతం వంటి మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ వ్యాప్తి కొత్త వెలుగులు తెచ్చిందని చెప్పారు. ‘‘డిజిటల్ ఇండియా ద్వారా వాటికి అభివృద్ధి ద్వారాలు తెరుచుకున్నాయి. ఒకప్పుడు పెద్ద నగరాలకే పరిమితమైన సదుపాయాలు ప్రతి గ్రామానికీ చేరాయి. ఫలితంగా డిజిటల్ పారిశ్రామికవేత్తలు పుట్టుకొస్తున్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని అత్యంత మారుమూల జోర్సింగ్ గ్రామానికి పంద్రాగస్టు నుంచే 4జీ సేవలందుతున్నాయి’’ అంటూ పలు ఉదాహరణలను ప్రస్తావించారు. సమర యోధుల త్యాగాలను కళ్లముందుంచే స్వరాజ్ సీరియల్‌ను దూరదర్శన్‌లో ప్రజలంతా చూడాలన్నారు. 2047కల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా రూపొందుతుందని తనకు పూర్తి నమ్మకముందని పునరుద్ఘాటించారు. -
సీఎం జగన్‌కు వ్యతిరేకంగా గత పదేళ్లుగా కుట్రలు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా గత పదేళ్లుగా కుట్రలు జరుగుతూనే ఉన్నాయని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఆనాడు వైఎస్ జగన్‌పై కేసులు పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ఓటుకు కోట్లు కేసు వ్యవహారం వెలుగు చూశాకే, వైఎస్ జగన్‌పై దాదాపు 30 కేసులు బనాయించారన్నారు. కాగా, టీడీపీ నేతలపై ఉన్న కేసులను నాటి చంద్రబాబు ప్రభుత్వం కొట్టేసిందని, వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని సజ్జల పేర్కొన్నారు. ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 ఛానల్లు విషప్రచారానికి అలవాటు పడ్డాయని, ఇందులో భాగంగానే పదే పదే కేసులు వేస్తూ ప్రభుత్వ పనితీరుకు ఆటంకం కలిగిస్తున్నాయని ఆరోపించారు. పెట్రో ధరలు ఎవరు పెంచారో చెప్పకుండా వార్తలు రాస్తున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. ఏపీ, తెలంగాణల మధ్య నీటి వాటాల పంపకంపై ఆయన మాట్లాడుతూ.. పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలే కోరుకుంటున్నామని, కేటాయించిన దాని కంటే ఒక్క చుక్క నీరు కూడా ఎక్కువ తీసుకోవడం లేదని వెల్లడించారు. కేటాయింపులకు అనుగుణంగానే ఏపీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయని, మొత్తంగా రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని పేర్కొన్నారు. పరీక్షల విషయమై స్పందిస్తూ.. విద్యార్థుల భవిష్యత్ కోసమే పరీక్షలు నిర్వహించాలనుకుంటున్నామని తెలిపారు. -
దుబ్బాక.. ఇక్కడ చెప్పబాక!
ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి నిచ్చెనేసినట్టుంది బీజేపీ పరిస్థితి. దుబ్బాక ఫలితాన్ని బలంగా భావించి స్థానిక సంస్థల ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది. అది బలుపు కాదు వాపని తెలిసొచ్చింది. ఇప్పుడు తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో మళ్లీ సత్తా చాటుతామంటూ అతివిశ్వాసం వ్యక్తం చేస్తోంది. దుష్పచారాలు చేస్తూ లబ్ధిపొందాలనే ఎత్తుగడ వేస్తోంది. తోక పార్టీని వెంటబెట్టుకుని పేట్రేగిపోతోంది. ప్రజానాడిని పక్కనబెట్టి వైఎస్సార్సీపీపై కుట్రలకు తెరదీయడం విమర్శలకు తావిస్తోంది. సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘మా బలం పెరిగింది. తెలంగాణలోని దుబ్బాక విజయమే దీనికి నిదర్శనంగా నిలిచింది. ఆంధ్రాలోనూ తమ పార్టీ సత్తాచాటేందుకు సిద్ధంగా ఉంది’ అంటూ బీజేపీ నేతలు ఊకదంపుడు ప్రసంగాలతో ప్రజలను మభ్యపెట్టారు. ఒకింత ఇది నిజమేననే భ్రమలోకి నెట్టారు. పంచాయతీ, పురపాలక ఎన్నికల్లో అడ్రస్ గల్లంతవడంతో నోటికి తాళం వేశారు. మళ్లీ ఇప్పుడు తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో తమదే విజయం.. అంటూ కుట్రలు, కుయుక్తులు, ఎత్తులు, పొత్తులకు తెరదీస్తున్నారు. దీనిపై విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు. పట్టు.. ప్రజాదరణ ఏదీ? తిరుపతి పార్లమెంటు పరిధిలో బీజేపీ–జనసేన బలం చాలా స్వల్పం. ఈ రెండు పార్టీలకు కలిపి 2014 ఎన్నికల్లో 24 వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. కార్పొరేషన్ ఎన్నికల్లో 22 డివిజన్లు ఏకగ్రీవం కాగా, 27 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించారు. అందులో 8 డివిజన్లలో మాత్రమే బీజేపీ పోటీ చేయగలిగింది. అంటే తక్కిన 21 డివిజన్లలో బీజేపీకి అభ్యర్థులు కూడా లేరన్నమాట. పోటీచేసిన 8 డివిజన్లలో బీజేపీ సాధించిన మొత్తం ఓట్లు 2,546 మాత్రమే. జనసేన 2 డివిజన్లకు పరిమితమైంది. ఆ రెండుచోట్లా కలిపి ఆ పార్టీకి లభించిన ఓట్లు 231 మాత్రమే. క్షేత్ర స్థాయిలో అటు బీజేపీ, ఇటు జనసేన పట్టు, ప్రజాదరణ ఏపాటిదో ఇట్టే అర్థమవుతోంది. అలాంటి చోట సత్తా చాటుతాం.. దుబ్బాక ఫలితం రిపీట్ అవుతుంది.. అంటూ అదరగొట్టే స్పీచ్‌లు, స్టేట్మెంట్లు తిరుపతి పార్లమెంటు వాసులకు నవ్వు తెప్పిస్తున్నాయి. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి, సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాలిటీల్లో కూడా బీజేపీ మరీ అధ్వానమైన స్థితిలో ఓట్లు సాధించింది. మూడు చోట్లా కలిపి వెయ్యికి లోపే ఓట్లు దక్కించుకుంది. ఇలాంటి పరిస్థితిలో రాష్ట్రంలో బీజేపీది బలుపు కాదు, వాపు మాత్రమేనని స్పష్టంగా తెలుస్తోంది. అదే ధీమా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ తమదేనని వైఎస్సార్సీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మునుపటి ఫలితాలకంటే అధిక మెజారిటీ లభిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణాలను కూడా వివరిస్తున్నారు. సంక్షేమ పాలన, ఇటీవల వరుసగా ఎన్నికల ఫలితాలు అందుకు నిరద్శనమని చెబుతున్నారు. పైగా వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి తిరుపతి వాసులుకు సుపరిచితుడు కావడం, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో గెలుపు అతి సునాయసమన్న ధీమాతో ఆ పార్టీ నేతలు ఉన్నారు. పైగా దేశవ్యాప్తంగా అందరి చూపు తిరుపతి ఫలితం వైపు ఉండేలా మెజారిటీ సాధించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేయడంతో మరింత ఉత్సాహంగా వైఎస్సార్సీపీ శ్రేణులు పనిచేస్తాయని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. టీడీపీ బుజ్జగింపుల పర్వం తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికలు ఒక్కో పార్టీకి ఒక్కో విపత్కర పరిస్థితి తెచ్చిపెట్టింది. బీజేపీ–జనసేన ఉమ్మడి అభ్యర్థిని ఇప్పటికీ వెల్లడించకపోగా, మూన్నెళ్లకు ముందే అభ్యర్థిని ప్రకటించిన టీడీపీ భంగపాటుకు గురవుతోంది. మాజీ ఎంపీ పనబాకలక్ష్మి పేరును అభ్యర్థిగా ప్రకటించింది. ఇష్టం లేకపోయినా అభ్యరి్థత్వానికి ఎంపిక చేయడంపై ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. పోటీ చేసేందుకు ససేమిరా అంటున్నా, టీడీపీ నేతలు బుజ్జగింపు చర్యల్లో నిమగ్నమైనట్టు ఆ పార్టీ కార్యకర్తలే చెబుతున్నారు. ప్రకటించిన అభ్యర్థి పోటీ నుంచి విరమిస్తే, పార్టీ పరువు పోతుందని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి ఆమె ఎదుట ఆవేదన చెందినట్లు సమాచారం. చదవండి: స్టేలు తెచ్చుకోవడంలో బాబుది గిన్నిస్ రికార్డ్ నగ్నంగా నామినేషన్ వేసేందుకు వచ్చి.. -
తిరుపతి ఉప పోరు: ‘ఆ ది’శగా అరాచకాలకు కుట్ర!
పరువు కోసం టీడీపీ, బీజేపీ నేతలు పాకులాడుతున్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ద్వితీయ స్థానాన్ని అయినా దక్కించుకోవాలని ఆ రెండు పార్టీల అధినేతలు ఉవ్విళ్లూరుతున్నారు. అందులో భాగంగానే తమ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఒకరు కేంద్ర ప్రభుత్వ అండదండలతో రెచ్చిపోతే.. మరొకరు ద్వితీయ శ్రేణి నేతలను రెచ్చగొట్టే పనిలో నిమగ్నమయ్యారు. అరాచకాలు సృష్టించి, మత విద్వేషాలకు బీజం వేయాలని నిర్ణయించారు. ఆ నెపం అధికార పార్టీపై నెట్టే కుట్రకు ప్రణాళిక రచించారు. అందుకోసమే కొందరికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. సాక్షి, తిరుపతి: పంచాయతీ, మునిసిపల్ ఫలితాలతో మంచి ఊపు మీదున్న వైఎస్సార్సీపీని ఢీకొట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు అస్త్రశ్రస్తాలను సిద్ధం చేస్తున్నాయి. తిరుపతి పార్లమెంట్ ఉప పోరులో పరువైనా దక్కించుకోవాలని మల్లగుల్లాలు పడుతున్నాయి. అందులో భాగంగానే విద్వేషాలు రెచ్చగొట్టాలని నిశ్చయించాయి. కమలనాథులు ఒకడుగు ముందుకేసి పూర్తి బాధ్యతలను మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డికి అప్పగించారు. బుజ్జగించి..మద్దతు ఎంచి! తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలవ్వక ముందు నుంచే టీడీపీ అభ్యర్థిని పనబాకలక్ష్మి ముఖం చాటేశారు. కొంత కాలంగా ఆమె ఆ పార్టీ కార్యక్రమాల్లో అంటీఅంటనట్టుగానే వ్యవహరిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దూతలను పంపి ఆమె ను బలవంతంగా ఒప్పించినట్టు ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. అందులో భాగంగానే గురువారం నిర్వహించిన సమావేశానికి ఆమె అతికష్టం మీద హాజరయ్యారు. సమావేశంలో టీడీపీ కార్యకర్తలు నాయకత్వ లోపంపై ఫిర్యాదు చేసినా అధినేత పట్టించుకోలేదు. ‘మనకు జనసేన సపోర్ట్ ఉంటుంది. ఆ పార్టీ కార్యకర్తలతో మంచిగా మెలగండి’ అని టీడీపీ అధినేత తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ముఖ్య నాయకులకు ఫోన్లో చెప్పినట్టు సమాచారం. అరాచకాల బాధ్యత నీదే! తిరుపతి ఉప ఎన్నికల్లో కనీసం ద్వితీయ స్థానం దక్కేలా కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పార్టీ శ్రేణులకు గట్టిగా చెప్పినట్లు సమాచారం. తిరుపతిలో శుక్రవారం ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తనకు బాధ్యతలు అప్పగిస్తే సాయశక్తులా కృషి చేస్తానని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సోమవీర్రాజును కోరినట్లు తెలిసింది. తాను చెప్పినప్పుడు కేంద్ర మంత్రులను తిరుపతిలో ప్రచారానికి పంపాలని సూచించారు. అరాచకాలు, మత విద్వేషాలు సృష్టించేందుకు ప్రత్యేకంగా కొందరిని ఎంపిక చేసినట్లు సమాచారం. వైఎస్సార్ కడప జిల్లాలో చేసిన అరాచకాలకు మించి చేయాలంటే తనకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ఆ సమయంలో కేసులు, అరెస్టులు లేకుండా చూసుకునే బాధ్యత బీజేపీ పెద్దలు చూసుకోవాలని డిమాండ్ చేసినట్టు తెలిసింది. చదవండి: నమ్మించి నట్టేట ముంచారు.. టీడీపీ ఎమ్మెల్యేపై గుస్సా పిట్టకథలు, జోస్యం చెప్పుకోవచ్చు -
పచ్చనేతల కొత్త ఎత్తుగడ!
సాక్షిప్రతినిధి, విజయనగరం: ‘ఆడలేక మద్దెల ఓడు’ అన్న సామెత జిల్లా టీడీపీ నాయకులకు అచ్చంగా సరిపోతుంది. ప్రజాబలం కోల్పోయి... అన్ని ఎన్నికల్లో ఓటమి చవిచూసిన వారికి ఏం చేయాలో తెలియక ఫలితాలపై వక్రభాష్యం చెబుతున్నారు. అంతటితో ఆగకుండా... జనాన్ని తప్పుదారి పట్టించేందుకు సరికొత్త ఎత్తుగడలు మొదలుపెట్టారు. జనంలో తమకు ఏ మాత్రం ఆదరణ లేదని తెలిసినా, తప్పుడు ప్రచారంతో సానుభూతి కోసం తహతహలాడుతున్నారు. పెయిడ్ ఆర్టిస్టులతో తప్పుడు ప్రచారం చేసుకోవడంలో ఆరితేరిన నాయకత్వాన్ని పుణికిపుచ్చుకున్నారేమో... ఇక్కడ ఏకంగా వారే రంగంలోకి దిగి నాటకాలకు తెరతీశారు. స్థానిక ఎన్నికల్లో ఘోర పరాజయం జిల్లాలో మూడు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 955 స్థానాలకు 759 చోట్ల వైఎస్సార్సీపీ మద్దతుదారులే సర్పంచ్ పీఠాన్ని దక్కించుకున్నారు. టీడీపీ కేవలం 149 సీట్లకే పరిమితమైంది. ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి సొంత గ్రామం కవిరిపల్లిలో వైఎస్సార్సీపీ మద్దతుదారు అలమంద సుధమ్మ 647 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. కేంద్ర మాజీ మంత్రి కిశోర్‌చంద్రదేవ్, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు మూకుమ్మడిగా కురుపాంలో తాడంగి గౌరిని టీడీపీ తరపున మద్దతిచ్చి ఎన్నికల్లో నిలిపారు. కానీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, పా ర్టీ అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు మద్దతుతో పోటీలో నిలిచిన గార్ల సుజాత 92 ఓట్లతో విజయం సాధించారు. మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు సొంత గ్రామం చినమేరంగిలోనూ భంగపాటు తప్పలేదు. అక్కడ వైఎస్సార్సీపీ మద్దతుదారు అల్లు రవణమ్మ 119 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. మాజీ మంత్రి కిమిడి మృణాళిని సొంత ఊరైన చీపురుపల్లి మేజర్ పంచాయతీలో వైఎస్సార్సీపీ మద్దతుదారు మంగళగిరి సుధారాణి విజయం సాధించారు. పూసపాటిరేగ మండలం చల్లవానితోట పంచాయతీలో టీడీపీ మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి నాయుడి మనుమడు తారకరామానాయుడిపై వైఎస్సార్సీపీ మద్దతుదారైన పతివాడ వరలక్ష్మి గెలుపొందారు. పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు సొంతగ్రామమైన కృష్ణపల్లి పంచాయతీలో గందరగోళం సృష్టించినా ఎమ్మెల్యే అలజంగి జోగారావు అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ మద్దతుతో పోటీచేసిన బోనురామినాయుడు 174 ఓట్లతో విజయం సాధించారు. గంట్యాడలో మాజీ ఎమ్మెల్యే కె.ఎ.నాయుడికీ భంగపాటు తప్పలేదు. అక్కడ కూడా వైఎస్సార్సీపీ జెండా ఎగిరింది. కత్తులు దూసి... కుట్రలు చేసి... ఓటమిని తట్టుకోలేక పలు చోట్ల ఉద్రిక్తతలు సృష్టించేందుకు టీడీపీ మద్దతుదారులు యత్నించారు. అడ్డాపుశిల పంచాయతీలో ఓటమిని జీరి్ణంచుకోలేక అరకు ఎంపీ గొట్టేటి మాధవి బంధువైన ఎం.పాల నాయుడుపై మాజీ సర్పంచ్ బంటు దాసు మారణాయుధంతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. పూసపాటిరేగ మండలం చౌడవాడ పోలింగ్ స్టేషన్లో కుర్చీలు పగులగొట్టి భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఆందోళనలు, వాగ్వివాదాల నేపథ్యంలో కొన్ని చోట్ల రీ కౌంటింగ్ జరిగింది. ఆ సమయంలోనూ వైఎస్సార్సీపీకే విజయం వరించింది. కొత్తవలసలో నయా నాటకం కొత్తవలస మేజర్ పంచాయతీలో వైఎస్సార్సీపీ విజయాన్ని అడ్డుకోవాలని పోలింగ్ బూత్ వద్ద హడావుడి చేసి ఉద్రిక్తలు సృష్టించారు. రీ కౌంటింగ్‌కు అవకాశం లేకపోయినా మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తన అనుచరులతో కలిసి గందరగోళం సృష్టించారు. అయినప్పటికీ ఎన్నికల అధికారి నిబంధనల ప్రకారం వైఎస్సార్సీపీ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అధికారులను అడ్డుపెట్టుకుని తమ గెలుపును దక్కకుండా చేశారంటూ గొంతు చించుకున్నారు. కానీ జనం పట్టించుకోలేదు. ఇక చేసేదిలేక ఆత్మహత్యాయత్నం అంటూ కొత్త డ్రామాకు తెరలేపారు. రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సానుభూతి సాధించాలనే కుతంత్రంతో టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థిని ఉసిగొలిపి నాటకం ఆడించారు. అదీ బెడిసి కొట్టింది. చివరికి ఆత్మహత్యానేరంపై ఆమెపైనా, టీడీపీ నేతలపైనా కేసు నమోదైంది. తాము తీసుకున్న గోతి లో తామే పడ్డామని ఇప్పుడు వారు తలలుపట్టుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామాలను గమనిస్తున్న జిల్లాలోని మిగతా టీడీపీ అభ్యర్ధులు మున్సిపల్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీపై పునరాలోచనలో పడ్డారు. పోటీ చేసి ఉన్న పరువును, డబ్బును అనవసరంగా పోగొట్టుకోవడం ఎందుకనే నిర్ణయానికి ఇప్పటికే వచ్చి కొందరు నామినేషన్ల ఉపసంహరణకు సిద్ధమవుతున్నారు. మరి కొందరు ‘బంగ్లా’ పెద్దల బలవంతంపై బరిలో నిలిచినప్పటికీ నామ మాత్రంగానే నడుచుకోవాలని భావిస్తున్నారు. చదవండి: ‘కేశినేని నాని.. పెద్ద గజదొంగ’ పాపాల పుట్టలు పగులుతున్నాయ్ -
పల్లెల్లో చిచ్చు: టీడీపీ నయా కుయుక్తులు..
పచ్చని పల్లెల్లో చిచ్చు రేపుతున్నారు. ప్రశాంతంగా ఉండాల్సిన ఊళ్లల్లో విభేదాలు సృష్టిస్తున్నారు. ఐక్యతకు విఘాతం కలిగిస్తున్నారు. ఏకగ్రీవాలు జరగకూడదని కత్తిగట్టారు. ప్రతిచోటా పోటీ ఉండాలనీ... అవసరమైతే డబ్బు తామే ఇస్తామనీ... ఓడిపోతామని తెలిసినా ఉనికిని చాటుకోవాలనీ... పార్టీ రహితంగా జరగాల్సిన ఎన్నికల్లోనూ వర్గాలుగా విడగొడుతున్నారు. జిల్లాలో తెలుగుదేశం పారీ్టకి పెద్ద దిక్కు అని చెప్పుకుంటున్న ఓ నాయకుడు దీనికోసం విస్తృతంగా సమాలోచనలు చేస్తున్నారు. సాక్షిప్రతినిధి, విజయనగరం: గ్రామ స్వరాజ్యానికి ఆయువుపట్టులాంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. సంగ్రామంలో ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రత్య ర్థులను చిత్తు చేయడానికి పోరాడటం వీరుల లక్షణం. కానీ అదే సంగ్రామంలో కుయుక్తులతో వెన్నుపోటుతో గెలవాలని ప్రయతి్నంచే వారూ ఉంటారు. అలాంటి ఓ వర్గం పంచాయ తీ ఎన్నికల్లోనూ కుట్ర రాజకీయాలకు తెరలేపింది. ప్రజాబలం లేని ఓ పార్టీ ఆర్థిక బలంతో దురాశను ఎరవేసి ఎన్నిక ల్లో లబి్ధపొందాలని భావిస్తోంది. చదవండి: గ్రామ కక్షలకు టీడీపీ కుట్ర.. రాజకీయ పార్టీలకు అతీతంగా, పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా జరగాల్సిన ఎన్నికల్లో దుష్ట సంప్రదాయాలను ప్రవేశపెడుతోంది. విజయనగరం జిల్లా రాజకీయ చరిత్రలో తమది ప్రత్యేక స్థానమని, తమ తరతరాల రాజకీయంలో నీతి తప్పింది లేదని గర్వంగా చెప్పుకుంటుంటారు. కానీ పంచాయతీ ఎన్నికల్లో అదే వ్యక్తి దురి్వనీతిని ప్రదర్శిస్తున్నారు. జిల్లా టీడీపీకి పెద్దదిక్కుగా చెలామణీ అవుతున్న ఆయన పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు గెలవరని తెలిసి కూడా ఏకగ్రీవాలు జరగకుండా అడ్డుపడుతున్నారు. అంతర్గత సమావేశాల ద్వారా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూనే, తనకున్న డబ్బును అడ్డుపెట్టుకుని ఉచిత ప్రకటనలు చేస్తూ, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చట్ట వ్యతిరేక చర్యలకు బీజం వేస్తున్నారు. చదవండి: అభ్యర్థుల కోసం టీడీపీ వెతుకులాట.. గతంలోనూ ఏకగ్రీవాలు నిజానికి గతంలో జిల్లాలో చాలావరకూ ఏకగ్రీవాలు జరిగాయి. 2006 పంచాయతీ ఎన్నికల్లో అప్పటికున్న 921 పంచాయతీల్లో 77 పంచాయతీలు, 2013లో 127 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. 2006లో ఏకగ్రీవం అయిన ప్ర తి పంచాయతీకి రూ.5లక్షలు చొప్పున అప్పటి ప్రభుత్వం నజరానా అందిస్తే.... 2013లో జనాభా ప్రాతిపదికన రూ.7 లక్షల వరకూ ప్రోత్సాహక నగదు లభించింది. అప్పుడు జరిగిన ఏకగ్రీవాలను ఇప్పుడు అడ్డుకోవడానికి రాజకీయ ప్రయోజనాలే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఏకగ్రీవాలతో ఎంతో మేలు పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం అయితే కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షల్లో నజరానాను పెంచి ప్రకటించింది. రెండు వేల లోపు జనాభా ఉంటే ఆ పంచాయతీకి రూ.5లక్షలు, ఐదు వేల లోపు ఉంటే రూ.10లక్షలు, పది వేల లోపు ఉంటే రూ.15 లక్షలు, అంతకు మించి జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్, వార్డు మెంబర్లు ఏకగ్రీవం అయితే రూ.20లక్షల చొప్పున ప్రభు త్వం ఆర్థిక బహుమతిని అందిస్తుంది. కేవలం డబ్బు మాత్ర మే కాదు. గ్రామంలో ఎన్నికల వల్ల జరిగే అవాంఛనీయ సంఘటనలు వంటివి ఏకగ్రీవం వల్ల మటుమాయమవుతా యి. ఓటర్లకు, అధికారులకు ఎలాంటి శ్రమ లేకుండా, వారి విలువైన సమయం ఆదా అవుతుంది. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలతో ఆ గ్రామం పూర్తి గా అభివృద్ధి చెందుతుంది. ఐక్యతను అడ్డుకునేందుకు కుట్రలు ఏకగ్రీవం జరిగితే మరో వర్గానికి మేలు చేకూరుతుందని భయ పడుతున్న ఆ నాయకుడి వర్గం ప్రజలకు, గ్రామానికి మంచి జరగకపోయినా పర్లేదుగానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలు జరగకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న పార్టీ నేతలతో తన నివాసంలో సమావేశం నిర్వహించి మరీ ఆర్థిక సాయాన్ని ఆయన ప్రకటించినట్లు తెలుస్తోంది. గ్రామాల్లో ఏకగ్రీవాలకు ఒప్పుకోకుండా ఎన్నికలు జరిగేలా చూస్తే దానికి తమ వర్గం అభ్యర్థులకు అయ్యే ఖర్చును తాను భరిస్తానని, అవసరమైతే నాయకులకు అదనంగా ఆర్ధిక ప్రయోజనాలు, భవిష్యత్‌లో పదవులు కల్పి స్తామని హామీలు కూడా గుప్పించినట్లు సమాచారం. గుణపాఠం నేర్వని నాయకత్వం నిజానికి గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోనే జిల్లాలో పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఘోర పరాజయాన్ని చవిచూశారు. తన భుజాలపై పెట్టుకుని విజయం వైపు నడిపించాల్సిన ఆయన పార్టీ అభ్యర్థులనే గాకుండా, తన కన్న కూతురిని, తనను కూడా గెలిపించుకోలేకపోయారు. ఇప్పుడు ప్రజలకు చేకూరే ప్రయోజనాలను సైతం అడ్డుకోవాలని ప్రయత్నిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. సాక్షాత్తూ ఆ పార్టీ అధినేతే నిబంధనలకు విరుద్ధంగా పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేయగా లేనిది, తాము ఇలా చేస్తే తప్పేముందని అనుకుంటున్నట్టున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలోనూ వారు చేస్తున్న ప్రచారాలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేవిగానే ఉన్నాయి. పార్టీ రహిత ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులను పార్టీ అభ్యర్థులుగా ప్రకటిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి వాటికి అడ్డుకట్ట పడకపోవడం విడ్డూరంగా ఉంది. -
గ్రామ కక్షలకు టీడీపీ కుట్ర..
సాక్షి, ప్రతినిధి కడప: గ్రామపంచాయతీ ఎన్నికలు వేదికగా గ్రామాల్లో చిచ్చు రేపేందుకు ప్రతిపక్ష టీడీపీ వ్యూహరచన చేస్తోంది. బలం సంగతి దేవుడెరుగు కేడర్ లేకున్నా నామినేషన్లు వేయించి వర్గ విబేధాలను మరింత పెంచి తద్వారా గ్రామాల్లో గొడవలు పెట్టేందుకు సిద్ధమైంది. పల్లెలు అభివృద్ధికి నోచుకోకూడదన్న లక్ష్యంతో ఆ పార్టీ వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 807 గ్రామపంచాయతీలు ఉన్నాయి. కోర్టు స్టే ఉత్తర్వుల కారణంగా 14 పంచాయతీల్లో ఎన్నికలు నిలిచి పోయాయి. చదవండి: నిమ్మగడ్డ లేఖ.. లక్ష్మణ రేఖ దాటిందా ప్రస్తుతం 793 గ్రామపంచాయతీల్లో 7,762 వార్డులకు నాలుగు విడతలుగా ఎన్నికలు జరిపేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మొదటి విడతలో బద్వేలు, మైదుకూరు,ప్రొద్దుటూరు నియోజక వర్గాల్లోని 206 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. శుక్రవారం నుంచే ఇక్కడ నామినేషన్లు ప్రక్రియ మొదలైంది. ఏకగ్రీవం చేసుకొనేందుకు ఆయా పంచాయతీల ప్రజలు సిద్ధమయ్యారు.ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహక నిధులు పొంది పంచాయతీలు అభివృద్ధి చేసుకోవాలని వారు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. తద్వారా గ్రామ కక్షలకు ఆస్కారం లేకుండా చేసుకోవాలన్నది లక్ష్యం. అయితే ఏకగ్రీవాలను అడ్డుకునేందుకు ప్రతిపక్ష టీడీపీ కుట్రలకు దిగింది. చదవండి: కోడ్ పేరిట పేదల పథకానికి బ్రేక్ కార్యకర్తలు లేకున్నా పోటీ అంటూ నామినేషన్లు పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను అడ్డుకోవడమే లక్ష్యంగా టీడీపీ కుట్రలకు దిగింది. ఇందులో భాగంగా ప్రతి పంచాయతీలో పోటీ ఉండేలా చూడాలని ఆ పార్టీ అధినేత కింది స్థాయినేతలకు ఆల్టిమేట్టం జారీ చేశారు. దీంతో కార్యకర్తలు లేక పోయినా ఎవరో ఒకరిని బతిమలాడో, ప్రలోభపెట్టో పోటీ చేయించేందుకు ఆ పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. కొని చోట్ల నామినేషన్ వేస్తే చాలు డబ్బులు ముట్ట జెపుతామంటూ బేరాలు పెడుతున్నారు.ఒకరిద్దరు కార్యకర్తలు ఉన్నచోట సైతం పోటీ చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. అన్ని గ్రామ పంచాయతీల్లో పోటీలు పెట్టించకపోతే భవిష్యత్తులో మిమ్మల్ని గుర్తించేది లేదంటూ నియోజకవర్గ స్థాయి నేతలకు టీడీపీ అధినేత వారి్నంగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మండల స్థాయి నేతలు పంచాయతీ స్థాయి నేతల పై ఒత్తిడి పెంచారు.పైనుంచి కింద వరకూ ప్రతిపక్ష పార్టీ నేతలు నామినేషన్ల వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారు.ఎట్టి పరిస్థితిలో ఏకగ్రీవం కాకుండా ఎన్నికలు జరిగేలా చూడాలన్న దురుద్దేశంతో టీడీపీ పావులు కదుపుతోంది. తద్వారా పచ్చని పల్లెల్లో కక్షలు రాజేస్తోంది.çప్రోత్సాహకం రూపంలో నిధులు రాకుండా అడ్డుకోవాలని చూస్తున్నారు. తద్వారా పల్లెసీమల అభివృద్దికి అడ్డంకిగా మారుతున్నారు. ప్రతిపక్ష పార్టీ దిగజారుడు రాజకీయాలతో పల్లెల్లో గొడవలు జరిగే పరిస్థితులు ఉత్పన్న మౌతున్నాయని, అభివృద్దికి ఆటంకం ఏర్పడుతోందని ప్రజలు వాపోతున్నారు. కనిపించని ఉనికి.. జిల్లాలో నామమాత్రపు పంచాయతీల్లో కూడా ప్రస్తుతం టీడీపీకి కేడర్ లేకుండా పోయింది. గత అయిదేళ్ల పాలనలో ఆ పార్టీ అధికారంలో ఉన్నా జిల్లా అభివృద్ధి గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. కరువు జిల్లాలో సాగు, తాగునీటి కష్టాలు తీర్చే ప్రయత్నం చేసిన పాపాన పోలేదు. ఆ పార్టీ జిల్లా నేతలు సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చారు. అభివృద్ధికి మంగళం పాడారు. దీంతో టీడీపీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబికింది. పర్యవసానంగా గత సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో ఘోర పరాజయం పాలైంది. పది అసెంబ్లీ,రెండు పార్లమెంట్ స్థానాల్లో ఒక్కటి కూడా ఆ పార్టీ దక్కించు కోలేక పోయింది. ఎన్నికల తరువాత టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేసిన వారు,ఇన్చార్జిలు పత్తా లేకుండా పోయారు. నియోజకవర్గాల వైపు తొంగిచూసిన పాపాన పోలేదు. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు,నేతలు చాలామటుకు అధికారపార్టీలో చేరిపోయారు. నామమాత్రంగా మిగిలినవారు పార్టీ కార్యక్రమాలకు దూరమై మిన్నకుండి పోయారు. దీంతో జిల్లాలో చాలా పంచాయతీలలో ప్రతిపక్ష టీడీపీ పోటీ చేసే పరిస్థితి లేకుండా పోయింది. -
భారత్ పై పాక్ మరోసారి తీవ్ర ఆరోపణలు
కరాచీ : అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్‌పై భారత్ కుట్రలు పన్నుతోందని పాకిస్తాన్ మరోసారి తీవ్ర ఆరోపణలు గుప్పించింది. 57బిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును ఆపేందుకు ఆఫ్ఘనిస్తాన్‌ను భారత్ పావుగా ఉపయోగించుకుంటోందని పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖా మంత్రి అషాన్ ఇక్బాల్ ఆరోపించారు. సీపీఈసీ ప్రాజెక్ట్‌ను నీరుగార్చేందుకు పాకిస్తాన్ శత్రువులంతా కుట్రలు పన్నుతున్నారని ఆయన అన్నారు. ‘సీపీఈసీ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా భారత్ అన్ని రకాల కుట్రలు చేస్తోంది.. అయితే ప్రజల నమ్మకం, సహకారం, మద్దతుతో పాకిస్తాన్ ప్రభుత్వం ముందుకు నడుస్తోంద’ని ఆయన అన్నారు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా భారత్ కుట్రలకు తెరతీస్తోందని ఆయన ఆరోపణలు గుప్పించారు. ఇదిలావుండగా.. ప్రతిష్టాత్మక సీపీఈసీ ప్రాజెక్ట్‌ను ఆఫ్ఘనిస్తాన్‌కు విస్తరించాలని చైనా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగం నుంచి సీపీఈసీ ప్రాజెక్ట్ వెళ్లడంపై భారత్ మొదట నుంచి తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. త్యాగాలను గుర్తించండి! పాకిస్తాన్‌ను లక్ష్యంగా చేసుకుని మాటలు దాడులు చేయడం మంచిది కాదని ఆయన అమెరికాకు సూచించారు. ఉగ్రవాదంపై పోరులో పాకిస్తాన్ చేసిన త్యాగాలను అమెరికా ఇప్పటికైనా గుర్తించాలని ఆయన చెప్పారు. -
దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చే కుట్ర
ఆర్ఎస్ఎస్, బీజేపీ.. దేశాన్ని ముక్కలు చేస్తున్నాయి : తమ్మినేని సాక్షి ప్రతినిధి, నల్లగొండ: దేశాన్ని హిందూత్వ రాష్ట్రంగా, మతరాజ్యంగా మార్చేందుకు, మతపరంగా విభజించేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. హైదరాబాద్‌లోని జేఎన్టీయూ విద్యార్థి రోహిత్ వేముల మృతిపై పార్లమెంట్లో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలు అబద్ధమన్నారు. శనివారం నల్లగొండలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పార్లమెంటు సాక్షిగా స్మృతి ఇరానీ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని, రోహిత్ మృతి సందర్భంగా జరిగిన ఘటనలకు తామే ప్రత్యక్ష సాక్షులమన్నారు.