పచ్చని పల్లెల్లో చిచ్చు రేపుతున్నారు. ప్రశాంతంగా ఉండాల్సిన ఊళ్లల్లో విభేదాలు సృష్టిస్తున్నారు. ఐక్యతకు విఘాతం కలిగిస్తున్నారు. ఏకగ్రీవాలు జరగకూడదని కత్తిగట్టారు. ప్రతిచోటా పోటీ ఉండాలనీ... అవసరమైతే డబ్బు తామే ఇస్తామనీ... ఓడిపోతామని తెలిసినా ఉనికిని చాటుకోవాలనీ... పార్టీ రహితంగా జరగాల్సిన ఎన్నికల్లోనూ వర్గాలుగా విడగొడుతున్నారు. జిల్లాలో తెలుగుదేశం పారీ్టకి పెద్ద దిక్కు అని చెప్పుకుంటున్న ఓ నాయకుడు దీనికోసం విస్తృతంగా సమాలోచనలు చేస్తున్నారు.
సాక్షిప్రతినిధి, విజయనగరం: గ్రామ స్వరాజ్యానికి ఆయువుపట్టులాంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. సంగ్రామంలో ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రత్య ర్థులను చిత్తు చేయడానికి పోరాడటం వీరుల లక్షణం. కానీ అదే సంగ్రామంలో కుయుక్తులతో వెన్నుపోటుతో గెలవాలని ప్రయతి్నంచే వారూ ఉంటారు. అలాంటి ఓ వర్గం పంచాయ తీ ఎన్నికల్లోనూ కుట్ర రాజకీయాలకు తెరలేపింది. ప్రజాబలం లేని ఓ పార్టీ ఆర్థిక బలంతో దురాశను ఎరవేసి ఎన్నిక ల్లో లబి్ధపొందాలని భావిస్తోంది. చదవండి: గ్రామ కక్షలకు టీడీపీ కుట్ర..
రాజకీయ పార్టీలకు అతీతంగా, పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా జరగాల్సిన ఎన్నికల్లో దుష్ట సంప్రదాయాలను ప్రవేశపెడుతోంది. విజయనగరం జిల్లా రాజకీయ చరిత్రలో తమది ప్రత్యేక స్థానమని, తమ తరతరాల రాజకీయంలో నీతి తప్పింది లేదని గర్వంగా చెప్పుకుంటుంటారు. కానీ పంచాయతీ ఎన్నికల్లో అదే వ్యక్తి దురి్వనీతిని ప్రదర్శిస్తున్నారు. జిల్లా టీడీపీకి పెద్దదిక్కుగా చెలామణీ అవుతున్న ఆయన పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు గెలవరని తెలిసి కూడా ఏకగ్రీవాలు జరగకుండా అడ్డుపడుతున్నారు. అంతర్గత సమావేశాల ద్వారా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూనే, తనకున్న డబ్బును అడ్డుపెట్టుకుని ఉచిత ప్రకటనలు చేస్తూ, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చట్ట వ్యతిరేక చర్యలకు బీజం వేస్తున్నారు. చదవండి: అభ్యర్థుల కోసం టీడీపీ వెతుకులాట..
గతంలోనూ ఏకగ్రీవాలు
నిజానికి గతంలో జిల్లాలో చాలావరకూ ఏకగ్రీవాలు జరిగాయి. 2006 పంచాయతీ ఎన్నికల్లో అప్పటికున్న 921 పంచాయతీల్లో 77 పంచాయతీలు, 2013లో 127 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. 2006లో ఏకగ్రీవం అయిన ప్ర తి పంచాయతీకి రూ.5లక్షలు చొప్పున అప్పటి ప్రభుత్వం నజరానా అందిస్తే.... 2013లో జనాభా ప్రాతిపదికన రూ.7 లక్షల వరకూ ప్రోత్సాహక నగదు లభించింది. అప్పుడు జరిగిన ఏకగ్రీవాలను ఇప్పుడు అడ్డుకోవడానికి రాజకీయ ప్రయోజనాలే ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
ఏకగ్రీవాలతో ఎంతో మేలు
పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం అయితే కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షల్లో నజరానాను పెంచి ప్రకటించింది. రెండు వేల లోపు జనాభా ఉంటే ఆ పంచాయతీకి రూ.5లక్షలు, ఐదు వేల లోపు ఉంటే రూ.10లక్షలు, పది వేల లోపు ఉంటే రూ.15 లక్షలు, అంతకు మించి జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్, వార్డు మెంబర్లు ఏకగ్రీవం అయితే రూ.20లక్షల చొప్పున ప్రభు త్వం ఆర్థిక బహుమతిని అందిస్తుంది. కేవలం డబ్బు మాత్ర మే కాదు. గ్రామంలో ఎన్నికల వల్ల జరిగే అవాంఛనీయ సంఘటనలు వంటివి ఏకగ్రీవం వల్ల మటుమాయమవుతా యి.
ఓటర్లకు, అధికారులకు ఎలాంటి శ్రమ లేకుండా, వారి విలువైన సమయం ఆదా అవుతుంది. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలతో ఆ గ్రామం పూర్తి గా అభివృద్ధి చెందుతుంది.
ఐక్యతను అడ్డుకునేందుకు కుట్రలు
ఏకగ్రీవం జరిగితే మరో వర్గానికి మేలు చేకూరుతుందని భయ పడుతున్న ఆ నాయకుడి వర్గం ప్రజలకు, గ్రామానికి మంచి జరగకపోయినా పర్లేదుగానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలు జరగకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న పార్టీ నేతలతో తన నివాసంలో సమావేశం నిర్వహించి మరీ ఆర్థిక సాయాన్ని ఆయన ప్రకటించినట్లు తెలుస్తోంది. గ్రామాల్లో ఏకగ్రీవాలకు ఒప్పుకోకుండా ఎన్నికలు జరిగేలా చూస్తే దానికి తమ వర్గం అభ్యర్థులకు అయ్యే ఖర్చును తాను భరిస్తానని, అవసరమైతే నాయకులకు అదనంగా ఆర్ధిక ప్రయోజనాలు, భవిష్యత్‌లో పదవులు కల్పి స్తామని హామీలు కూడా గుప్పించినట్లు సమాచారం.
గుణపాఠం నేర్వని నాయకత్వం
నిజానికి గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోనే జిల్లాలో పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఘోర పరాజయాన్ని చవిచూశారు. తన భుజాలపై పెట్టుకుని విజయం వైపు నడిపించాల్సిన ఆయన పార్టీ అభ్యర్థులనే గాకుండా, తన కన్న కూతురిని, తనను కూడా గెలిపించుకోలేకపోయారు.
ఇప్పుడు ప్రజలకు చేకూరే ప్రయోజనాలను సైతం అడ్డుకోవాలని ప్రయత్నిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. సాక్షాత్తూ ఆ పార్టీ అధినేతే నిబంధనలకు విరుద్ధంగా పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేయగా లేనిది, తాము ఇలా చేస్తే తప్పేముందని అనుకుంటున్నట్టున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలోనూ వారు చేస్తున్న ప్రచారాలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేవిగానే ఉన్నాయి. పార్టీ రహిత ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులను పార్టీ అభ్యర్థులుగా ప్రకటిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి వాటికి అడ్డుకట్ట పడకపోవడం విడ్డూరంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment