Vijayanagam
-
ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారికి చేదు అనుభవం
సాక్షి, విజయనగరం జిల్లా: ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారికి చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల హామీ మేరకు తమ గ్రామానికి రోడ్డు వేయించాలంటూ వేపాడ మండలం ఆతవ గ్రామస్థులు చుట్టుముట్టారు. దీంతో సమాధానం చెప్పలేక కోళ్ల లలిత కుమారి కారు ఎక్కి వెళ్లిపోయారు. కారుకు అడ్డుపడి గ్రామస్తులు ఆందోళన చేశారు. గ్రామస్తులను చెదరగొట్టిన పోలీసులు ఎమ్మెల్యేను తప్పించారు. -
విజయనగరం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దు
సాక్షి, ఢిల్లీ: విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ఈసీ రద్దు చేసింది. హైకోర్టు ఆదేశాలతో ఉప ఎన్నికను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన క్రమంలో ఉపఎన్నిక నోటిఫికేషన్‌ను ఈసీ రద్దు చేసింది. -
మా సందేహాలు ఈసీ నివృత్తి చేయలేదు: వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, విజయనగరం: మా సందేహాలను ఎలక్షన్ కమిషన్ నివృత్తి చేయలేదని వైఎస్సార్సీపీ నేతలు బెల్లాన చంద్రశేఖర్, బొత్స అప్పల నర్సయ్య అన్నారు. మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మాక్ పోలింగ్ రీ-వెరిఫికేషన్ అనేది మా ఫిర్యాదు అంశం కాదు. పోలింగ్ నాటి బాటరీని వెరిఫికేషన్ చేయమని కోరాం. దాన్ని వెరిఫికేషన్ చేయడానికి ఈసీ ఆదేశాలు ఇవ్వలేదని జిల్లా కలెక్టర్ చెప్పారు’’ అని వారు పేర్కొన్నారు.ఫిర్యాదు చేసిన ఈవీఎంలో డేటాను తొలగించి డమ్మీ గుర్తులు లోడ్ చేశారు. విచారణలో వుండగా ఈవీఎం డేటాను డిలీట్ చేయడం నేరం. కోర్టుకు ఆధారాలు లేకుండా చేశారు. ఈసీ తీరుపై మేం కోర్టుకు న్యాయం కోసం వెళ్తాం. దేశమంతా ఈవీఎంలు టెంపర్ జరిగాయని అనుమానిస్తుంది. ఈ అనుమానాలను బీజేపీ ప్రభుత్వం నివృత్తి చేయాలి’’ అని బెల్లాన చంద్రశేఖర్, బొత్స అప్పల నర్సయ్య డిమాండ్ చేశారు.కాగా, విజయనగరం ఎంపీ నియోజకవర్గంలోని ఈవీఎంల రీ వెరిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోయింది.. ఈవీఎం బ్యాటరీ అంశంపై డిక్లరేషన్ ఇవ్వలేమన్న జిల్లా కలెక్టర్.. ఈసీ ఆదేశాల మేరకు మాక్ పోలింగ్ చేస్తామనన్నారు. తమ దరఖాస్తులో మాక్ పోలింగ్ కోరలేదని.. కోరకుండా మాక్ పోలింగ్ చేయడం ఏమిటని బెల్లాన చంద్రశేఖర్, బొత్స అప్పలనర్సయ్య ప్రశ్నించారు. ఈసీ, జిల్లా అధికారుల తీరుపై అనుమానాలు మరింత బలపడాయి. ఎన్నికల ఈవీఎంల అక్రమాలు బయటపడకుండా కుంటిసాకులు చెప్పి దరఖాస్తు చేసిన అభ్యర్ధులను జిల్లా యంత్రాంగం తప్పు దారి పట్టిస్తోంది. కోర్టు లేదా ఈసీ వద్ద తేల్చుకోండని వెరిఫికేషన్ కేంద్రం నుంచి కలెక్టర్ వెళ్లిపోయారు. -
టీడీపీకి ఓటు వేయకపోతే ఇళ్లు కూల్చేస్తారా?: బొత్స
సాక్షి, విజయనగరం: రాష్ట్రంలో టీడీపీ నాయకుల దౌర్జన్యాలకు అంతులేకుండా పోతుందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మారుమూల గ్రామానికి వెళ్లి విధ్వంసం చేయడమేంటి? నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడమేంటి? అంటూ మండిపడ్డారు. దన్నానపేటలో వెంకునాయుడు ఇంటిని కూల్చివేయడం సరికాదన్నారు.‘‘జిల్లాలో ఇటువంటి పరిస్థితులు ఎన్నడూ జరగలేదు. ప్రజాపత్రినిధులు అంటే ఇలాగేనా వ్యవహరించేది?. టీడీపీకి ఓటు వేయకపోతే ఇళ్లు కూల్చేస్తారా?. రిటైర్డ్ ఆర్మీ జవాన్‌పై ఎందుకింత కక్ష?. కక్ష సాధించడం కోసమేనా రాజకీయాల్లోకి వచ్చింది’’ అంటూ టీడీపీ నేతల తీరుపై బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు.ఇలాంటి ఘటన చూడలేదుతాను 1985 నుంచి క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నానన్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ.. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, రాజకీయాలు వీడలేదని.. అయితే ఇన్నేళ్లలో ఏనాడూ ఇలాంటి దురదృష్టకర ఘటన చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంస్కృతికి జిల్లాలో శ్రీకారం చుట్టారని ఆయన మండిపడ్డారు. అసలు దీని వల్ల ఏం లాభిస్తుందని, ఇది సమంజసమేనా అని టీడీపీ నేతలను సూటిగా ప్రశ్నించారు.ఇల్లు కూల్చివేత దారుణందేశం కోసం పోరాడిన ఓ మాజీ సైనికుడి ఇల్లు కూలిస్తే, అధికార పక్షం వారికి ఏం లాభిస్తుందని, అది కూడా ఎక్కడో మారుమూల ధన్నానపేట అనే గ్రామంలో ఇలాంటి చర్యకు పాల్పడడం అత్యంత హేయమని మాజీ మంత్రి బొత్స ఆక్షేపించారు. ఒక వేళ ఆ ఇంటి స్థలం, ప్రభుత్వానికి చెందింది అయితే, అక్కడ ఇల్లు కట్టుకున్న వారు అర్హులైతే పొజిషన్ సర్టిఫికెట్ ఇస్తే తప్పేమిటని ప్రశ్నించారు.మేము ఆ పని చేయలేదునిజానికి గత ఎన్నికల ఫలితాల నాటి నుంచే రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయని గుర్తు చేసిన మాజీ మంత్రి బొత్స, తమ జిల్లాలో ఈ రకమైన సంప్రదాయం రాకూడని బలంగా కోరుకున్నామని చెప్పారు. తాము అధికారంలో ఉన్నప్పుడు, ఈ తరహా ఫిర్యాదులు వచ్చినా, ఇంత దారుణంగా వ్యవహరించి, ఆస్తులు కూల్చివేయలేదని తెలిపారు.కలెక్టర్ పాత్ర ఆక్షేపణీయంఈ ఘటనలో జిల్లా కలెక్టర్ పాత్ర ఆక్షేపణీయమన్న మాజీ మంత్రి బొత్స, అసలు ఏ విధంగా ఒక మాజీ జవాన్ ఇల్లు కూల్చివేతకు ఆనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. ఫిర్యాదుపై స్వయంగా వెళ్లి పరిశీలించకుండా, ఏకంగా దాదాపు 50 మంది పోలీసులతో వెళ్లి ఇల్లు కూల్చడం ఏమిటని నిలదీశారు. ఇలాంటి వాటిలో మానవీయ కోణం అవసరమని అన్నారు.వైఖరి మార్చుకొండిఅధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదన్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, వాస్తవాలు గుర్తించి, ఇకనైనా ఈ తరహా చర్యలు వీడాలని, వైఖరి మార్చుకోవాలని అధికార పార్టీ నేతలకు సూచించారు.విజయనగరంలో మాజీ సైనికుడి ఇల్లును కూల్చివేయించిన @JaiTDP వైయస్ఆర్సీపీకి ఓటు వేశారనే కారణంతో మాజీ సైనికుడు పతివాడ వెంకునాయుడు కుటుంబాన్ని కొన్ని రోజులుగా వేధిస్తున్న టీడీపీ నాయకులుఇంటి కూల్చివేతకి గ్రామస్థులు అడ్డుపడటంతో 60 మంది పోలీసుల బలగంతో వచ్చిన రెవెన్యూ అధికారులు… pic.twitter.com/JqStGKfRvd— YSR Congress Party (@YSRCParty) July 27, 2024 విజయనగరం జిల్లాలో @JaiTDP దౌర్జన్యాలు ఎక్కువ అయ్యాయి! టీడీపీకి ఓటు వేయలేదని నెలిమర్ల మండలంలో మాజీ ఆర్మీ జవాన్ ఇంటిని కూల్చి వేయటం దారుణం.-బొత్స సత్యనారాయణ గారు, మాజీ మంత్రి pic.twitter.com/k9NIN0ygLA— YSR Congress Party (@YSRCParty) July 27, 2024ఆగని టీడీపీ శ్రేణుల దాష్టీకాలుకూటమి ప్రభుత్వం వచ్చినప్పటినుంచి రెచ్చిపోయి ప్రవర్తిస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తల దాష్టీకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అడ్డూఅదుపు లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఒంటరిగా ఉన్న మహిళ ఇంటిపైకి వెళ్లి అనుచితంగా ప్రవర్తించడమేగాక ప్రశ్నించినందుకు పలు వాహనాలను ధ్వంసం చేశారు. అన్యాయాన్ని ప్రశ్నించినందుకు వైఎస్సార్సీపీ నాయకుడిపై దాడిచేశారు. గ్రామ సచివాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రానికి పెయింట్ వేశారు. రైతుభరోసా కేంద్రం, సచివాలయం బోర్డులు తొలగించారు. వైఎస్సార్సీపీ జెండాపోల్‌ను ధ్వంసం చేశారు. పల్నాడు జిల్లా మర్సపెంట తండాలో టీడీపీకి చెందిన ఓ యువకుడు గురువారం అర్ధరాత్రి వైఎస్సార్సీపీకి చెందిన ఒక మహిళ ఇంటి తలుపు కొట్టాడు. ఒంటరిగా ఉన్న మహిళను దుర్భాషలాడాడు. ఈ విషయమై స్థానికులు టీడీపీ వారిని నిలదీశారు. దీంతో మరింత రెచ్చిపోయిన టీడీపీ వర్గీయులు రాళ్లు, కర్రలతో ఇళ్లముందున్న ఆటోలు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. ఒక్కసారిగా వారు గృహాలపై దాడులకు తెగబడినట్లు గ్రామ సర్పంచ్ రవీంద్రనాయక్ చెప్పారు. ఆ మహిళ శుక్రవారం వెల్దుర్తి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.ప్రకాశం జిల్లాలో మండల కేంద్రమైన లింగసముద్రంలో వైఎస్సార్సీపీ మండల జేసీఎస్ కన్వీనర్ వరికూటి కృష్ణారెడ్డిపై దాడిచేశారు. లింగసముద్రం గ్రామకంఠం సర్వే నంబర్ 79లో ఆర్యవైశ్యులకు 89 సెంట్ల స్థలం ఉంది. ఆ స్థలాన్ని 50 ఏళ్లుగా వారు ఉమ్మడిగా వినియోగించుకుంటున్నారు. తమ అవసరాల నిమిత్తం ఓ రేకుల షెడ్డు నిర్మించుకున్నారు. ఇది ప్రభుత్వస్థలం అంటూ శుక్రవారం టీడీపీ నాయకులు ఆ షెడ్డును పడగొట్టేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న ఆర్యవైశ్యులను పక్కకి నెట్టిపడేశారు. అదే సమయంలో వెళ్లిన వరికూటి కృష్ణారెడ్డిపై దాడిచేసి కొట్టారు. సమాచారం అంది వచ్చిన పోలీసులు వారిని చెదరగొట్టారు. కృష్ణారెడ్డిపై దాడిని వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూదన్‌యాదవ్, నేతలు ఖండించారు.అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం గంగాదేవిపల్లిలో పలువురు గడ్డపారలు, ఇతర పనిముట్లతో గ్రామ సచివాలయంలోకి చొరబడ్డారు. ఈ హఠాత్పరిణామంతో నివ్వెరపోయిన సచివాలయ ఉద్యోగులు భయంతో బయటకు పరుగుతీశారు. దుండగులు సచివాలయంపై ఉన్న జగన్ ఫొటోతో పాటు శిలాఫలకానికి పెయింట్ వేశారు. అక్కడ పికెట్‌లో ఉన్న పోలీసులు కనీసం అడ్డుకోలేదు. వైఎస్సార్సీపీ మద్దతుదారులు సమాచారం ఇవ్వడంతో తాడిపత్రి అప్‌గ్రేడ్ రూరల్ పోలీసుస్టేషన్ సీఐ లక్ష్మీకాంతరెడ్డి స్పందించి ఎస్ఐ సాగర్‌తో పాటు సిబ్బందిని గ్రామానికి పంపించారు. టీడీపీ మద్దతుదారుల చర్యలను పోలీసులు అడ్డుకుని హెచ్చరించి పంపేశారు. -
టీడీపీ విష సంస్కృతి.. ఇదేం దౌర్జన్యం: బొత్స
సాక్షి, విజయనగరం: ఎన్నికల తర్వాత దాడులు పెరిగాయని.. ప్రజాస్వామ్యంలో ఇటువంటివి ఉండకూడదని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 20 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బాధేస్తుందన్నారు.ప్రజాస్వామ్యంలో సామాన్య ప్రజలకు హక్కులున్నాయి. విజయనగరంలో మా పార్టీ ఆఫీసులోకి టీడీపీ నాయకులు చోరబడ్డారు. ఇటువంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదు. చట్టబద్ధంగా మా పార్టీ ఆఫీసులు నిర్మాణాలు జరుగుతున్నాయి. యూనివర్శిటీల వీసీలపై కూడా దౌర్జన్యానికి దిగుతున్నారు’’ అని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.‘విజయనగరం జిల్లా లో విష సంస్కృతి వచ్చింది. ప్రతిపక్ష వైస్సార్సీపీ పార్టీ కార్యాలయానికి వెళ్లి అధికార పార్టీ ఎమ్మెల్యే పరిశీలించడం ఏమిటి?. ఏదయిన పొరపాట్లు జరిగితే నోటీస్ ఇవ్వవచ్చు. ప్రభుత్వ కార్యాలయాలను పరిశీలించవచ్చు. యూనివర్సిటీల్లో వీసీలను నామినేట్ చేయడం ఒక విధానం. ఆ వీసీ కార్యాచరణ నచ్చకపోతే నోటీస్ ఇవ్వవచ్చు. వీసీ ఆఫీస్‌లకు వెళ్లి బెదిరించడం, తొలగించడం తప్పు. అవినీతి పై ఎంక్వయిరీ కోరడం తప్పు కాదు. అధికారం వాళ్ల చేతుల్లో వుంది. విద్యాశాఖ లో నాపై వచ్చిన ఆరోపణలు పై నో కామెంట్. ఫైల్స్ వాళ్ళ దగ్గర వున్నాయి. పరిశీలించుకోవాలి. కొందరు రిటైర్ అయిన అధికార్లు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడరు. అధికారం పోయాక వచ్చి చెప్తారు. అది ఎంత వరకు సమంజసం.’’ అంటూ బొత్స మండిపడ్డారు‘‘అనుభవం ఉన్న పార్టీ కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వాళ్లకు తెలుసు. పథకాలు ఇస్తారో ఇవ్వరో వాళ్లకే తెలియాలి. రేపు ఏప్రిల్ నెలలో రిటైర్మెంట్తో కలుపుకొని 6 వేలు టీచర్ ఖాళీలు ఉన్నాయని అంచనా. ఈ ప్రభుత్వం 50వేలు అంచనా వేసి 16వేలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. కేంద్రం పార్లమెంట్ లో 30వేలు పోస్ట్‌లు ఖాళీ ఉన్నాయని అన్నారు. 117జీవోని రద్దు చేస్తే ప్రభుత్వం ఆర్ధిక పరిస్థితిని బట్టి ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వవచ్చు’’ అని బొత్స పేర్కొన్నారు. -
చంద్రబాబు, పురందేశ్వరి స్కెచ్.. ‘కళా’ కుటుంబంలో కుంపటి
సాక్షి ప్రతినిధి, విజయనగరం: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావు కుటుంబంలో చంద్రబాబు చిచ్చు రగిల్చారు. సొంత పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆడుతున్న రాజకీయ ఆటలో కళా వెంకటరావు పావుగా మారారు. తూర్పు కాపు (బీసీ) సామాజికవర్గం నుంచి ఉత్తరాంధ్రలో వేగంగా ఎదిగిన ఆయన ఇప్పుడు టికెట్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడాల్సిన దుస్థితి. గంటా శ్రీనివాసరావు వద్దు వద్దంటున్న చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి వెళ్లాలని వెంకటరావుకు చంద్రబాబు ఆఫర్ ఇస్తూనే, మరోవైపు అక్కడ టీడీపీ జిల్లా అధ్యక్షుడి హోదాలో టికెట్‌పై ఆశలు పెట్టుకున్న కళా సోదరుడి కుమారుడైన కిమిడి నాగార్జున ఆశలపై నీళ్లు చల్లారు. విదేశాల్లో ఉద్యోగం వదులుకొని వచ్చి 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా, మళ్లీ చీపురుపల్లిలో పార్టీని బతికించేందుకు ఐదేళ్లుగా కృషి చేస్తే తుదకు కరివేపాకులా తీసిపారేస్తున్నారంటూ నాగార్జున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం లోక్‌సభ ఆశ చూపించి నియోజకవర్గాల పునర్విభజన తర్వాత కళా వెంకటరావు ఎచ్చెర్ల నియోజకవర్గాన్నే నమ్ముకున్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో టీడీపీ నుంచి గెలిచి మంత్రిగా పనిచేశారు. సహచర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ నారా లోకేశ్‌కు సన్నిహితుడిగా ఉత్తరాంధ్రలో చక్రం తిప్పారు. అయితే, ఆయన ఎచ్చెర్ల నియోజకవర్గంలో పనికిరాడంటూ టీడీపీ అధిష్ఠానమే ఇప్పుడు ముద్ర వేస్తోంది. ఇందుకు ఐవీఆర్ఎస్ సర్వే కారణం చూపిస్తోంది. చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అవకాశం కల్పిస్తారంటూ లీకులు ఇచ్చింది. అక్కడ వెంకటరావు సోదరుడు, ప్రస్తుత నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి కిమిడి నాగార్జున టికెట్ ఆశిస్తున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు చీపురుపల్లికి వెంకటరావును పేరును తేవడంతో కిమిడి కుటుంబంలో అగ్గిరాజుకుంది. తీవ్ర అసంతృప్తికి లోనైన నాగార్జున పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. నెల కిందటి వరకు నాగార్జున, మూడు రోజుల కిందటి వరకు గంటా శ్రీనివాసరావు, తాజాగా కళా వెంకటరావు.. ఇలా రోజుకో పేరును టీడీపీ అధిష్టానం తెరమీదకు తెస్తుండడంతో కార్యకర్తలు నిరాశలో ఉన్నారు. దీన్ని చక్కదిద్దడానికి కళా వెంకటరావు పేరు విజయనగరం ఎంపీ అభ్యర్థిగా పరిశీలిస్తున్నట్టు తాజాగా లీకులు ఇస్తున్నారు. ఫలించిన పురందేశ్వరి స్కెచ్ నడికుదిటి ఈశ్వరరావు (ఎన్ఈఆర్) ఇటీవలి వరకూ ఎచ్చెర్లలో గ్రామస్థాయి నాయకుడు. చంద్రబాబు సొంత సామాజికవర్గం నేత కావడంతో 2014–19 మధ్య కాస్త హవా చూపించారు. ఎచ్చెర్ల అసెంబ్లీ స్థానంపై కన్నేసిన ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకొని, పురందేశ్వరి పంచన చేరారు. ఆమె చలువతో విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షుడి పదవీ దక్కించుకున్నారు. ఇక్కడ బలమైన కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన రెడ్డి పావనిని తప్పించి మరీ ఈశ్వరరావుని జిల్లా అధ్యక్షుడిని చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో ఎచ్చెర్ల టికెట్ నేరుగా ఎన్‌ఈఆర్‌కు ప్రకటించకుండా నెమ్మదిగా స్కెచ్ అమలుచేశారు. తొలుత శ్రీకాకుళం అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ కోటాలో చూపించారు. అక్కడ గుండ లక్ష్మీదేవి కుటుంబం ఆందోళన చేయడంతో అది టీడీపీకే ఇచ్చేసి పొరుగున ఉన్న ఎచ్చెర్ల బీజేపీ కోటాలో వేసేశారు. తద్వారా ఎచ్చెర్ల టికెట్ తనదేనని ధీమాగా ఉన్న కిమిడి కళావెంకటరావు ఆశలపై నీళ్లు చల్లేశారు. ఇప్పుడు ఎన్ఈఆర్ను రంగంలోకి తెస్తున్నారు. బాబు పితలాటకంతో నాగార్జున బలి చంద్రబాబు, పురందేశ్వరి పెట్టిన పితలాటకంతో చీపురుపల్లి నియోజకవర్గ ఇన్చార్జి కిమిడి నాగార్జున బలవుతున్నారు. ఆయన తల్లి కిమిడి మృణాళిని 2014లో చీపురుపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. రెండేళ్లు మంత్రిగా కూడా పనిచేశారు. ఆ సమయంలో విదేశాల్లో ఉద్యోగం చేసుకుంటున్న నాగార్జున రాజకీయాలపై ఆసక్తితో ఇక్కడకు వచ్చి టీడీపీలో చేరారు. 2019లో ఓడిపోయారు. అయినప్పటికీ నాగార్జునకు భవిష్యత్ ఉందని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. తీరా ఎన్నికలు వచ్చే సరికి నాగార్జున పనికిరాడంటూ చంద్రబాబు ముద్ర వేసేశారు. -
రామలక్ష్మి సిగ్గుపడింది.. ఎందుకో?
పండక్కి తాతగారి ఊరికొచ్చిన రామలక్ష్మి పెరట్లో ఒక్కో పువ్వూ తెంచి వోనీలో వేసుకుంటోంది. చూడమ్మీ ముల్లు గుచ్ఛీగలవు అన్నాడు అప్పుడే వచ్చిన నాగరాజు. మీ ఊళ్ళో మందారాలకు కూడా ముళ్లుంతా యేటి అంది కొంటెగా చూస్తూ... చెస్.. గుంటకు పోత్రం తగ్గలేదు అని మనసులో అనుకుంటూనే ఎప్పుడొచ్చినారు... ఏటి సేత్తన్నావు అన్నాడు. బీఎస్సి నర్సింగ్ అయింది.. ఎసోదాలో చేస్తన్నా అంది.. మరి నన్నేం అడగవా అన్నాడు నాగరాజు.. అడగక్కర్లే మందారాలకు ముల్లుంతాయని అన్నావంతే నువ్వు బీకామ్ ఫిజిక్స్ అని అర్థమైంది అంది మళ్ళీ ... దీనికి ఐడ్రాబాడ్ ఎళ్ళింతర్వాత తెలివెక్కువైంది అనుకుంటుండగానే ఎవుల్తోనే మాటలూ అంటూ తల్లి నాగమణి వచ్చింది. ఎవులో తెలీదే అమ్మా అంది రామలక్ష్మి.. అంతలోనే నాగరాజును చూస్తూ... ఒరే నువ్వా నాగీ ఎలాగున్నావు.. యేటి సేత్తన్నావు అంది... దీంతో వీడికి కాస్త మద్దతు దొరికినట్లై.. బాప్పా బాగున్నా.. మొన్నే వచ్చినాం.. ఇజివాడలో ఉంతన్నాం ... నన్ను బీకామ్ సేసి రొయ్యల కంపినీలో మేనేజరుగా చేస్తన్ను అన్నాడు గర్వంగా.. ఇంతలో రామలక్ష్మి వచ్చి... అమ్మా ఎవరి అంది కళ్ళతోనే... చిన్నప్పుడు గొర్రిపిల్ల తగిలికొస్తే కోలగూట్లో దాగుందామని దూరిపోయి అందులో ఉన్న పిల్లల బేపికి దొరికిపోనాడని అప్పుడు చెప్పినాను కదా... ఆడే ఈడు అంది నాగమణి.. పాపం నాగరాజు మళ్ళీ దెబ్బతినేశాడు.. సెండాలం.. ఇంత సెండాలం ఇంట్రడక్షన్ ఏందీ అనుకుంటూనే రామలక్ష్మిని చూశాడు.. కళ్ళతోనే నవ్వింది.. సరే బాప్పా వెళ్తాను అని కదిలి ఆరేడు అడుగులు వేయగానే నాగీ అని పిలిచింది నాగమణి ... బప్పా అంటూ వెనక్కి తిరిగాడు వాడి చూపులు ఆవిడ భుజాలను దాటుకుంటూ వెనకాల నిలబడిన రామలక్ష్మిని చేరుకున్నాయి.. ఈలోపే.. నాగీ రేపు బోగీ నాడు అమ్మను నాన్నను రమ్మను మాట్లాడాలి అంది... సరే బాప్పా అంటూ వాడు కదిలాడు.. వాడి వెనకాలే రామలక్ష్మి చూపులు.. కూడా ఫాలో అయ్యాయి.. మర్నాడు నాగరాజు నాన్న నారాయణ తల్లి రాజ్యం వచ్చారు.. వస్తూనే... పలకరింపులు అయ్యాక నాగమణి మొదలెట్టింది.. మరేట్రా అన్నియ్యా మన రామలక్ష్మికి నాగరాజుకు సేసిద్ధుమా .. ఎలాగూ సిన్నప్పుటునుంచి ఒనేసిన సంబంధమే కదా.. కొత్తగా అనుకునేది ఏముందీ అంది.. నారాయణ అలాగేలేవే మణీ చూద్దుము అన్నాడు... రాజ్యం కాస్త మాటకారి.. ఎక్కడా మాటపడనివ్వదు .... తన భర్త నారాయణ అమాయకుడని.. ఆయన్ను ఎవరైనా మోసం చేసేయగలరని.. తానూ అలాకాదని.. బాగా తెలివైనదాన్నని,.. ఇంట్లో తనదే పెద్దరికం ఉండాలని కోరుకునే తత్త్వం.. అందుకే నారాయణ చూద్దుము లేవే అనగానే ఏటీ సూసేది... అప్పుడెప్పుడో అనుకున్నాం కదాని ఇప్పుడు సేసెత్తమా... మంచీ సెడ్డా ఉండవా అంది... నేను దిగితే సీన్ మొత్తం మారిపోద్ది అనే కమాండింగ్ ఆమె మాటల్లో స్పష్టమైంది. ఉంటాయుంటాయి ఎందుకుండవు వదినా మూడు లచ్చల కట్నం.. వీరో వోండా ఇస్తాం.. పిల్లడికి ఒక తులం సైను ... ఇక పెళ్లయ్యాక సారి సీరెలు ఉండనే ఉంతాయి కదా అంది నాగమణి.. ఉంటాయమ్మా ఎందుకుండవు.. అందరికీ ఉంటాయి.. ఎవరిళ్ళలో లేవూ అంటూ రాజ్యం మళ్ళీ లైన్లోకి వచ్చింది.. అమ్మ వాలకం చూస్తుంటే రామలక్ష్మిని మిస్సైపోతానేమోనని ఓ వైపు నాగరాజు కళ్ళలో చిన్న భయం.. మా అన్న కూతురు మంగ కూడా బీటెక్ చేసింది.. కట్నం ఐదు లచ్చలు ఇస్తామని కూడా వదిన మాట్లాడింది అంటూ రాజ్యం తమవాడి మార్కెట్ రేటు బయటపెట్టింది.. ఆమ్మో.. అంత ఇవ్వకపోతే రామలక్ష్మి దక్కదేమో అని నాగరాజు అందోళన... ఈలోపే రామలక్ష్మి వచ్చి.. పోన్లేమ్మా నా జీతం డబ్బులున్నాయి కదా కొంత సర్దుబాటు చేద్దాం అని చెప్పడం ద్వారా నాగరాజును మిస్ చేసుకునే ఉద్దేశ్యం లేదని తేల్చేసింది.. అమ్మనీ గుంటా తెలివైందే... . అని మనసులో అనుకుంటూనే కళ్ళతోనే రామలక్ష్మి కళ్ళకు దండం పెట్టేశాడు.. సరే ఐతే రేపిల్లుండి మంచిరోజు చూసి మాటనుకుందాం అన్నది రాజ్యం ధీమాగా .. మరి పండక్కి కొత్తకోడలికి కోక గట్రా పెడితే .... అంది నాగమణి కాస్త సందేహిస్తూ... ఆ చూద్దాంలే అని రాజ్యం అంటుండగానే అమ్మా నేను నీకు తెచ్చిన మూడు చీరల్లో ఆ అరిటాకు రంగు చీర ఇచ్చేయ్... రాముకు బావుంటుంది అనేశాడు ఆగలేక నాగరాజు.. బయటకు చెప్పకపోయినా రామలక్ష్మి మనసులోనే నాగరాజును వాటేసుకుని సిగ్గులమొగ్గయింది.. అమ్మనీ గుంటడా అప్పుడే ఇలా తయారయ్యావా అంది రాజ్యం.. పోన్లే వదినా .. పిల్లలకు ఇష్టమే కదా.. మరెందుకు మాటలూ అనేసింది.. నాగమణి.. మొత్తానికి పండక్కి వచ్చిన రెండు కుటుంబాలు ఇలా సంబంధం కుదుర్చుకున్నాయి.. ఇలాంటి సంఘటనలు.. సన్నివేశాలు.. ఎన్నో.. ఎన్నెన్నో.. వాటన్నిటికీ సంక్రాంతి ఒక వేదిక.. మధ్యతరగతి వాళ్లకు సంక్రాంతి ఒక వేడుక. -గాంధీ, విజయనగరం -
వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర.. 23వ రోజు షెడ్యూల్ ఇలా..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను సాధికారత దిశగా నడిపించిన వైనాన్ని, వారికి చేసిన మేలును వివరించడానికి వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర మంగళవారం విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల, ఏలూరు జిల్లాలో కైకలూరు నియోజకవర్గాల్లో జరుగుతుంది. ఏలూరు జిల్లా: కైకలూరులో ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బస్సు యాత్ర జరగనుంది. మధ్యాహం 12 గంటలకు సీతారాం ఫంక్షన్ హాలులో తటస్థులతో వైసీపీ నాయకుల సమావేశం కానున్నారు. 3 గంటలకు ఫంక్షన్ హాలు నుంచి బస్సుయాత్ర ప్రారంభం కానుంది. అనంతరం మార్కెట్ సెంటర్లో బహిరంగ సభ జరగనుంది. మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, విడదల రజిని, జోగి రమేష్, పినిపే విశ్వరూప్, ఎంపీ మోపిదేవి వెంకటరమణ తదితరులు హాజరుకానున్నారు. విజయనగరం జిల్లా: నెల్లిమర్లలో ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఆధ్వర్యంలో బస్సు యాత్ర జరగనుంది. ఉదయం 10:30 గంటలకు విజయనగరంలోని జగన్నాధ ఫంక్షన్ హాలులో వైసీపీ నేతల మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11:30 గంటలకు కొండవెలగడ గ్రామ సచివాలయాన్ని సందర్శించనున్నారు. అనంతరం నెల్లిమర్ల వరకు ర్యాలీ జరపనున్నారు. 3:00 గంటలకు నెల్లిమర్ల మొయిన్ జంక్షన్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. మంత్రులు సీదిరి అప్పలరాజు, రాజన్నదొర, బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి తదితరులు హాజరుకానున్నారు. -
రైలు ప్రమాద బాధితులకు చెక్కులు అందించిన మంత్రి బొత్స
సాక్షి, విజయనగరం: కంటకాపల్లి రైలు ప్రమాద బాధితులను మంత్రి బొత్స సత్యనారాయణ పరామర్శించారు. వారికి నష్ట పరిహారం చెక్కులను మంత్రి అందజేశారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి వద్దకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం కుదుట పడే వరకు ఆసుపత్రిలోనే చికిత్స పొందాలని సూచించారు. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, రైలు ప్రమాద ఘటనలో మృతి చెందిన 13 మందికి, 30 మంది గాయపడిన వారికి కలసి మొత్తం 43 మందికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2.59 కోట్లు పరిహారంగా అందజేస్తోందని మంత్రి బొత్స తెలిపారు. మంగళవారం 8 మందికి పరిహారం అందించామని, ఈ రోజు 12 మందికి పరిహారం అందజేశామని, రేపటిలోగా అందరికీ పరిహారం అందిస్తామని మంత్రి వెల్లడించారు. గాయాలపాలైన వారు జీవితాంతం బాధపడకుండా వారికి తోడ్పాటు అందించేందుకు ముఖ్యమంత్రి.. శాశ్వత అంగవైకల్యం పాలైన వారికి రూ.10 లక్షల సహాయం ప్రకటించారు. నెల రోజులకు మించి ఆసుపత్రిలో చికిత్స అవసరమయిన వారికి రూ.5 లక్షలు, నెల రోజుల్లోపు చికిత్స పూర్తయి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన వారికి రూ.2 లక్షలు సహాయం అందిస్తున్నామని మంత్రి బొత్స తెలిపారు. చదవండి: వేమూరి రాధాకృష్ణకు లక్ష్మీ పార్వతి చురకలు -
ఏపీలో ప్రతిధ్వనించిన సామాజిక సాధికారత
సాక్షి, అమరావతి/సాక్షి, తిరుపతి/సాక్షి, నరసాపురం/సాక్షి, విజయనగరం: సామాజిక సాధికారత రాష్ట్రమంతటా ప్రతిధ్వనిస్తోంది. రాష్ట్రంంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఫలితాలను ప్రజల స్పందన ప్రతిబింబిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర, సభలకు పేదలు వెల్లువెత్తుతున్నారు. జగన్ వెంటే తాము అంటూ నినదిస్తున్నారు. గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో సీఎం వైఎస్ జగన్ తమకు మంచి చేశారని ప్రశంసిస్తున్నారు. మళ్లీ జగనే రావాలి జగనే కావాలి అంటూ ఒకే గళమై నినదిస్తున్నారు. శుక్రవారం రెండో రోజు యాత్రలోనూ ఇదే చైతన్యం వెల్లువెత్తింది. రాష్ట్రంలో గత 53 నెలలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, అగ్రవర్ణ పేదలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మంచిని వివరించి.. పేదలందరినీ ఏకం చేయాలనే లక్ష్యంతో వైఎస్సార్సీపీ చేపట్టిన ఈ యాత్ర శుక్రవారం తిరుపతి, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గాల్లో జరిగింది. మూడు నియోజకవర్గాల్లోనూ యాత్ర సాగిన రహదారులు జనంతో కిటకిటలాడాయి. ‘సామాజిక న్యాయ నిర్మాత వర్ధిల్లాలి.. జై జగన్’ అన్న నినాదాలతో ప్రతిధ్వనించాయి. సీఎం వైఎస్ జగన్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను నేతలు వివరించిన ప్రతిసారీ ప్రజలు సీఎం జగన్‌కు జేజేలు పలికారు. మళ్లీ జగనే కావాలి అంటూ నినదించారు. సామాజిక సాధికార యాత్ర మూడో రోజున రాయలసీమలో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు, కోస్తాలో బాపట్ల జిల్లా బాపట్లలో, ఉత్తరాంధ్రలో విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గాల్లో జరుగుతుంది. తిరుపతిలో మహా పాదయాత్ర రాష్ట్రమంతటా సామాజిక సాధికార యాత్రను బస్సు ద్వారా నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ, తిరుపతిలో మహా పాదయాత్రలా మారింది. ఈ యాత్రకు ప్రజలు వెల్లువలా రావడంతో వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సూచనతో వైఎస్సార్సీపీ జైత్రయాత్రగా సాగింది. ముందుగా తిరుపతి నగరంలోని మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి వైఎస్సార్సీపీ నేతలు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అక్కడి నుంచి నగరంలోని 50 వార్డుల మీదుగా 17 కిలోమీటర్ల పొడవున పాదయాత్ర చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలు భారీ ఎత్తున కదలివచ్చారు. గ్రూప్ థియేటర్స్ ముందు ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం జన సముద్రంలా కనిపించింది. వైఎస్సార్సీపీని 175 స్థానాల్లో గెలిపిస్తాం.. వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎంగా చేసుకుంటాం అంటూ ప్రజలు నినదించారు. నరసాపురంలో జనమే జనం నరసాపురంలో జరిగిన సామాజిక సాధికార యాత్ర ప్రజలే నాయకత్వం వహించారా అన్నట్లుగా సాగింది. నరసాపురం నియోజకవర్గం మొగల్తూరు కాలువ గట్టు సెంటర్లో మంత్రులు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి రామన్నపేట మీదుగా నరసాపురం వరకు సాగిన ఈ యాత్రకు జనం ఉప్పెనలా తరలివచ్చారు. 17 కిలోమీటర్ల మేర 20 గ్రామాల మీదుగా యాత్ర సాగింది. అడుగడుగునా ప్రజలు సీఎం జగన్‌కు జేజేలు పలికారు. మంత్రులకు పూలమాలలతో స్వాగతం పలికారు. సాయంత్రం 6 గంటలకు నరసాపురం పట్టణంలో నిర్వహించిన సభకు జనం పోటెత్తారు. విజయనగరంలో బస్సు యాత్ర, బైక్ ర్యాలీ విజయనగరం జిల్లా కేంద్రంలో సామాజిక సాధికార బస్సు యాత్ర శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. నాయకులు ప్రయాణించిన బస్సును అనుసరిస్తూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. యాత్రకు అడుగడుగునా ప్రజలు సంఘీభావం ప్రకటించారు. విజయనగరం ఆర్టీసీ జంక్షన్, ఆర్ అండ్ బీ జంక్షన్, కలెక్టరేట్ జంక్షన్, గజపతినగరం నియోజకవర్గం గొట్లాం, గజపతినగరంలో బాణసంచా కాల్చుతూ ఘనంగా స్వాగతం పలికారు. పులివేషాలు, సంప్రదాయ నృత్యాలతో సందడి చేశారు. పార్టీ నేతలు గొట్లాం గ్రామంలో ప్రభుత్వం నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించారు. గజపతినగరంలోని మెంటాడ రోడ్డులో బహిరంగ సభ జన సంద్రాన్ని తలపించింది. -
మూడు నెలల్లో విశాఖ రాజధాని.. మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు
సాక్షి, విజయనగరం: మూడు నెలల్లో విశాఖపట్నం రాజధాని అవుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరంలో ఆదివారం ఆయన అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది సీఎం జగన్ మరింత మంచి పాలన అందిస్తారన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చదవండి: ప్రతి ఇల్లు ఆనందంగా ఉండాలి: సీఎం జగన్ -
గుంకలాం ప్రోగ్రెస్ రిపోర్ట్.. చక చకా నిర్మాణాలు..
-
యుద్ధ ప్రాతిపదికన ‘తారకరామతీర్థ’ పనులు
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్రలో అత్యంత కీలకమైన తారకరామతీర్థ సాగరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ప్రాజెక్టులో అంతర్భాగమైన కుమిలి రిజర్వాయర్‌లో మిగిలిన పనులను పూర్తి చేయడానికి రూ.150.24 కోట్లతో జలవనరుల శాఖ అధికారులు జ్యుడిషియల్ ప్రివ్యూకు ప్రతిపాదనలు పంపారు. చదవండి: మరిన్ని కొత్త ఫీచర్లతో సీఎం యాప్ జ్యుడిషియల్ ప్రివ్యూ ఆమోదించగానే టెండర్ నోటిఫికేషన్ జారీ చేసి, ఎంపికైన కాంట్రాక్టర్‌కు పనులు అప్పజెప్పి, యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే విజయనగరం జిల్లాలో పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం మండలాల్లోని 49 గ్రామాల్లోని 24,710 ఎకరాలకు సాగు నీరందుతుంది. ఆ గ్రామాల్లో తాగు నీటికి కూడా 0.162 టీఎంసీలు సరఫరా చేస్తారు. విజయనగరం కార్పొరేషన్‌కు తాగునీటి కోసం 0.48 టీఎంసీలను సరఫరా చేస్తారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జలయజ్ఞంలో భాగంగా తారకరామతీర్థ సాగరం ప్రాజెక్టు చేపట్టారు. ఈ ప్రాజెక్టులో భాగంగా విజయనగరం జిల్లా గుర్ల మండలం కోటగండ్రేడు వద్ద చంపావతి నదిపై 184 మీటర్ల పొడవున బ్యారేజ్ నిర్మిస్తారు. అక్కడి నుంచి 13.428 కిలోమీటర్ల కాలువ ద్వారా కుమిలిలో నిర్మించే రిజర్వాయర్‌కు 2.7 టీఎంసీల నీటిని తరలిస్తారు. దీని ద్వారా కుమిలి చానల్ సిస్టమ్ పరిధిలోని 8,172 ఎకరాలను స్థిరీకరించడంతోపాటు కొత్తగా 16,538 ఎకరాలకు నీళ్లందిస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో అంతర్భాగమైన బ్యారేజ్ నిర్మాణం దాదాపు పూర్తయింది. మళ్లింపు కాలువ, కుమిలి రిజర్వాయర్ పనులు వేగంగా జరుగుతున్నాయి. కుమిలి రిజర్వాయర్ డైక్–2, డైక్–3లలో 2.2 కిలోమీటర్ల మట్టికట్ట పనుల్లో రూ.150.24 కోట్ల పనులు మిగిలాయి. వాటిని చేపట్టిన కాంట్రాక్టర్ చేతులెత్తేశారు. దీంతో 60–సీ నిబంధన కింద కాంట్రాక్టర్‌ను తొలగించి, ఆ పనులను మరో కాంట్రాక్టర్‌కు అప్పగించడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఈమేరకు ప్రతిపాదనలను జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపారు వడివడిగా భూసేకరణ, పునరావాసం తారకరామతీర్థ సాగరం ప్రాజెక్టుకు అవసరమైన 3,446.97 ఎకరాల భూమికిగాను ఇప్పటికే 3,243.28 ఎకరాలను సేకరించారు. మిగతా 203.69 ఎకరాల సేకరణపై అధికారులు దృష్టి పెట్టారు. కుమిలి రిజర్వాయర్‌లో మూడు గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఇందులోని 2,219 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. భూసేకరణ, పునరావాసానికే రూ.209.88 కోట్లు అవసరం. ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలోగా నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. నిర్వాసితులకు పునరావాసం కల్పించాక చంపావతి నుంచి నీటిని మళ్లించి, ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు విజయనగరం కార్పొరేషన్‌కు తాగు నీరు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
ఆస్పత్రికి అశోక్ గజపతిరాజు కుటుంబం గజం భూమి ఇవ్వలేదు : కోలగట్ల
-
మొబైల్ మిస్సయ్యిందా..? జస్ట్ ఇలా చేస్తే చాలు.. మీ ఫోన్ సేఫ్!
విజయనగరం క్రైమ్: మొబైల్ మిస్సయిందా..? ఎక్కడ, ఎప్పుడు, ఎలా అనే విషయాలను వివరిస్తూ, వాటి ఐఎంఈఐ నంబర్లు, అడ్రస్, కాంటాక్టు నంబర్‌తో వెబ్‌పోర్టల్‌లో ఫిర్యాదుచేస్తే చాలు.. విజయనగరం జిల్లా సైబర్ పోలీసులు ట్రాక్చేస్తారు. ఆ మొబైల్స్‌ను ఎవరు వినియోగిస్తున్నారో తెలుసుకుని స్వాధీనం చేసుకుంటారు. రాష్ట్రంలో ప్రప్రథమంగా ఈ సదుపాయం విజయనగరం జిల్లా ప్రజలకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. చదవండి: డిలీట్.. డిలీట్.. డిలీట్... ఒకప్పటిలా ఆ కిక్కు ఇప్పుడు లేదు ఎస్పీ దీపికాఎం.పాటిల్ సూచనల మేరకు ఫిర్యాదుదారులు సులభంగా ఫిర్యాదు చేసుకునేలా విశాఖపట్నం దువ్వాడ విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ ఫర్ ఉమెన్ కళాశాలలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగానికి చెందిన విద్యార్థినులు రూపొందించిన ‘వీజెడ్‌ఎమ్‌మొబైల్‌ట్రాకర్ డాట్ ఇన్’ను ఎస్పీ గురువారం ఆవిష్కరించారు. రూ.16.54లక్షల విలువైన మొబైల్స్ స్వాధీనం.. జిల్లాలో పోగొట్టుకున్న మొబైల్స్‌ను ట్రేస్ చేసేందుకు గత నెలలో ఎస్పీ దీపిక వాట్సాప్ నంబర్ 89779 45606ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. దీనికి చాలామంది బాధితులు ఫిర్యాదు చేశారు. నెలల వ్యవధిలోనే రూ.16.54లక్షల విలువైన 103 ఫోన్లను సైబర్ పోలీసులు ట్రేస్ చేశారు. తెలంగాణ, ఛత్తీగఢ్, ఒడిశా, బీమార్, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలలో వినియోగిస్తున్న మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఎస్పీ కార్యాలయంలో బాధితులకు గురువారం అందజేశారు. మొబైల్స్ రికవరీ చేయడంలో శ్రమించిన సైబర్‌సెల్ ఎస్ఐలు ఎం.ప్రశాంత్‌కుమార్, నీలావతి, బి.వాసుదేవరావు, ఎం.శ్రీనివాసరావు, ఎన్.రాజేష్‌లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో విజయనగరం ఇన్చార్జి డీఎస్పీ టి.త్రినాథ్, ఎస్బీ సీఐ జి.రాంబాబు, సీహెచ్ రుద్రశేఖర్, వన్‌టౌన్ సీఐ బి.వెంకటరావు, టూటౌన్ సీఐ సీహెచ్.లక్ష్మణరావు, రూరల్ సీఐ టీవీ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదు చేయడం ఇలా.. మొబైల్ పోగొట్టుకున్న బాధితులకు వీజెడ్‌ఎమ్‌మొబైల్‌ట్రాకర్ డాట్ ఇన్ వెబ్‌పోర్టల్ ఓ వరం. వెబ్‌పోర్టల్‌ను ఓపెన్ చేశాక రిపోర్ట్ కంప్లైంట్ ఆప్షన్ క్లిక్ చేస్తే, లోపల రిపోర్ట్ కంప్లైంట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో పేరు, కాంటాక్టు నంబర్, ఐఎంఈఐ నంబర్లు, జిల్లా, గ్రామం, ఎక్కడ పోగొట్టుకున్నది, ఫోన్ మోడల్ తదితర వివరాలు నమోదుచేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. కొద్దిరోజుల తర్వాత ఫిర్యాదు స్టేటస్‌ను చెక్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. రికవరీ అయిన తర్వాత బాధితులిచ్చిన కాంటాక్టు నంబర్‌కు సమాచారం అందుతుంది. అందరికీ అందుబాటులో వెబ్‌పోర్టల్ వెబ్‌పోర్టల్ విజయనగరం వాసులందరికీ అందుబాటులో ఉండేలా రూపకల్పన చేశాం. ఎస్పీ ఎం.దీపిక ఆదేశాలతో సెల్‌ఫోన్ బాధితులు నేరుగా ఫిర్యాదుచేసేందుకు వెబ్‌పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చాం. పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా ఫిర్యాదు చేసుకోవచ్చు. – ప్రొఫెసర్ నేతాజీ, వెబ్‌పోర్టల్ ఇన్చార్జి, విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాల, దువ్వాడ చాలా ఆనందంగా ఉంది వెబ్‌పోర్టల్ రూపకల్పనలో భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉంది. వెబ్ రూపకల్పనకు విజ్ఞాన్ యాజమాన్యం అహరి్నశలు శ్రమించింది. ఎస్పీ ఎం.దీపిక ఆదేశాలతో చాలా తొందరగా వెబ్‌ను రూపొందించి, విజయనగరవాసులకు అందించగలిగాం. – అడారి దీపిక, ఐటీ విభాగం, విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాల -
తన సలహాలు ఎవరు తీసుకోవడం లేదు: కేఏ పాల్
విజయనగరం (పూల్‌బాగ్): రాష్ట్రాన్ని చంద్రబాబు నాశనం చేశాడని, ఆయన అధికారంలో ఉన్నప్పుడు రాజధాని కూడా కట్టలేకపోయాడని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. ఆదివారం విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్‌పై అలుపెరుగని పోరాటం చేస్తున్నానని చెప్పారు. తాను దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామంటే తనతో కలిసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. అవినీతిపరులపై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ, అమిత్ షాకు లేఖలు ఇచ్చినా.. తన సలహాలు ఎవరు తీసుకోవడం లేదన్నారు. చదవండి: ఎన్నికలకు రెండేళ్ల ముందే.. టీడీపీలో టిక్కెట్ల లొల్లి! -
కాబోయే భర్తే కదా అని దగ్గరైంది.. ఆ తర్వాత సీక్రెట్ ఫొటోలు..
శృంగవరపుకోట రూరల్: ప్రేమ పేరుతో సహోద్యోగినిని లోబరుచుకుని.. పెళ్లికి నిరాకరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విజయనగరం ఏఎస్పీ అనిల్ పులిపాటి వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్.కోట మండలం వేములాపల్లి గ్రామానికి చెందిన శీరెడ్డి నవీన్ మండలంలోని ముషిడిపల్లి గ్రామ సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇదే సచివాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినిని ప్రేమిస్తున్నానంటూ చెప్పి శారీరకంగా లొంగదీసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని బాధితురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులకు కూడా నవీన్ చెప్పాడు. కొన్నాళ్ల తర్వాత ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని బాధిత యువతి అడిగితే, ఇంటి నిర్మాణం జరుగుతోందని.. పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి తప్పించుకున్నాడు. అలాగే ఇంటి నిర్మాణానికి నగదు అవసరమని, కట్నం కావాలని యువతిని వేధించడం మొదలు పెట్టాడు. యువతి తండ్రి గట్టిగా నిలదీస్తే మొదట్లో మహిళా ఉద్యోగినితో తీసుకున్న అభ్యంతరకర ఫోటోలను అతని ఫోన్‌కు పంపించాడు. దీంతో నవీన్‌పై బాధిత యువతి ఎస్.కోట పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేసింది. పోలీసులు నవీన్‌ను అరెస్ట్ చేసి శనివారం కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారు. సీఐ ఎస్. సింహాద్రినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విలేకరుల సమావేశంలో ఎస్సైలు జె.తారకేశ్వరరావు, జి.లోవరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: విందు కోసం ఆహ్వానిస్తే.. ఆమె లవర్ ఎంత పని చేశాడు.. -
Rajanna Dora: ధ్యాసంతా గిరిజనంపైనే..
సాక్షి, విజయనగరం: గిరిజన బిడ్డగా, గిరిజన సహకార సంస్థ మాజీ అధికారిగా, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం సాలూరు నుంచి వరుసగా నాలుగు సార్లు గెలిచిన సీనియర్ నాయకుడిగా పీడిక రాజన్నదొరకు గుర్తింపు. ఇప్పుడు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా, రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా బుధవారం ఆయన విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి ప్రతినిధి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. చదవండి: ఆరోగ్యయజ్ఞంలో దివ్యౌషధమవుతా: మంత్రి విడదల రజిని సాక్షి: గిరిజన సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖతో పాటు ఉపముఖ్యమంత్రి బాధ్యతలు కూడా మీకు రావడంపై మీ అభిప్రాయం? రాజన్నదొర: సాలూరు నియోజకవర్గం నుంచి నాలుగు దఫాలుగా ఎమ్మెల్యే అయ్యాను. మహిళల కు ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వం మాది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలిసారి తన మంత్రివర్గంలో మహిళలకు ప్రాధాన్యం ఇచ్చారు. అలా గిరిజన, ఎస్సీ, బీసీ మహిళలకు ఉన్నత స్థానం కల్పించారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మార్పు చేస్తానని సీఎం అప్పుడే చెప్పారు. రెండో దఫాలో నాకు అవకాశం ఇస్తానని నాడే హామీ ఇచ్చారు. అలా ఇప్పుడు నాకు మంత్రి పదవి ఇచ్చారు. ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. గిరిజనుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు పదవి రావడానికి పార్టీ పెద్దలు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుతో పాటు విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, శ్రేయోభిలాషులు, ప్రజల ఆశీస్సులు కారణం. వారికి సర్వదా కృతజ్ఞుడిని. సాక్షి: గిరిజన బిడ్డగా, వారి కష్టసుఖాలు తెలిసిన మీరు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా వారి సంక్షేమం కోసం ఎలా పనిచేస్తారు? రాజన్నదొర: రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో 31 తెగల గిరిజనులు ఉన్నారు. వారి సంక్షేమానికి ముఖ్యమంత్రి పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తున్నారు. ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్లు కూడా కాలానుగుణ పరిస్థితులను బట్టి ప్రణాళికలను రచించారు. గతంలో అటవీ ఉత్పత్తులే గిరిజనులకు ఆధారం కాబట్టి వాటికి మార్కెటింగ్, గిట్టుబాటు ధరలు కల్పించడానికి ప్రణాళికలు అమలు చేసేవారు. ఇప్పుడు వ్యవసాయం, ఉద్యాన పంటలపై కూడా ఆధారపడుతున్నారు. విద్య ప్రాధాన్యం తెలుసుకున్నారు. ఇప్పుడీ పరిస్థితులకు తగినట్లుగా, ప్రాంతాలకు అనుగుణంగా గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, గిరిజన ఎమ్మెల్యేలమంతా చర్చించి ప్రణాళికలను సిద్ధం చేస్తాం. అందుబాటులోనున్న నిధులను సది్వనియోగం చేసుకుంటూ గిరిజనులకు తక్షణమే లబ్ధి కలిగేలా చూస్తాను. సాక్షి: ఉమ్మడి విజయనగరం జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా మీరు గుర్తించిన సమస్యలను ఏవిధంగా పరిష్కరిస్తారు? రాజన్నదొర: గిరిజనులకు విద్య, వైద్య సౌకర్యాలు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలోనే మెరుగుపడ్డాయి. వారికి నాణ్యమైన విద్యను అందేలా నా వంతు ప్రయత్నం చేస్తాను. నాడు–నేడు కార్యక్రమంలో పాఠశాలల రూపురేఖలు మారాయి. కొన్నిచోట్ల హాస్టళ్లకు సొంత భవనాలు లేవు. అవన్నీ సమకూర్చుతాం. వైద్యం విషయానికొస్తే పార్వతీపురంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి మంజూరైంది. నిర్మాణ పనులు వేగవంతం చేస్తాం. సీహెచ్‌సీల్లో వైద్య సౌకర్యాలు, మౌలిక వసతులు మెరుగుచేసే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. గిరిశిఖర గ్రామాలకు రోడ్ల నిర్మాణంపై దృష్టి పెడతాను. ఒడిశాలో రహదారుల నిర్మాణానికి అటవీ శాఖ అధికారులు ఎలాంటి అభ్యంతరాలు చెప్పట్లేదు. ఇక్కడ మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వాటన్నింటిపైనా ఆయా అధికారులతో చర్చించి రోడ్ల నిర్మాణ పనులు వేగవంతం చేస్తాం. సాక్షి: మంత్రి పదవితో మీ సేవలకు గుర్తింపు వచ్చిందని భావిస్తున్నారా? రాజన్నదొర: మహానాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంతో నాకు తొలి నుంచి సాన్నిహిత్యం ఉంది. దానితో పాటు నా కష్టం, పనితీరు, నిబద్ధత చూసే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఈ అవకాశాన్ని సది్వనియోగం చేసుకొని ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి, పారీ్టకి మంచిపేరు వచ్చేలా పనిచేస్తాను. సాక్షి: ఆంధ్రప్రదేశ్–ఒడిశా రాష్ట్రాల మధ్య దీర్ఘకాలంగానున్న కొటియా సమస్యపై ఏవిధంగా దృష్టి పెడతారు? రాజన్నదొర: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత నవంబర్ 9న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పటా్నయక్తో చర్చలు జరిపారు. అప్పటికే ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసింది. కొటియా ప్రజలు మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండాలని బలంగా కోరుకుంటున్నారు. ఒడిశాలో సామాజిక పింఛన్ రూ.500 మాత్రమే ఇస్తున్నారు. మన రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.2,500 చొప్పున ఇస్తోంది. అంతేకాదు ఇక్కడ అమలు జరుగుతున్నన్ని సంక్షేమ పథకాలు ఒడిశాలో లేవు. పేదలందరికీ ఇళ్లు, రైస్‌కార్డు, అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత, చేదోడు... నవరత్నాలన్నీ కొటియా గ్రామాల్లో అమలవుతున్నాయి. ఏదేమైనా అక్కడి ప్రజల మనోభావాలకు అనుగుణంగా సరిహద్దుపై నిర్ణయం తీసుకోవాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరతాను. -
విజయనగరంలో విషాదం.. గురుకులంలో పిల్లలను కాటేసిన పాము
సాక్షి, విజయనగరం: జిల్లాలోని కురుపాం బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో విషాదం నెలకొంది. నిద్రలో ఉన్న విద్యార్థుల్ని విష సర్పం ఒకటి కాటేసింది. ఈ ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందగా.. ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కురుపాం మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల బాలుర పాఠశాలలో గురువారం అర్ధరాత్రి దాటాక ఈ ఘోరం జరిగింది. నిద్రిస్తున్న విద్యార్థుల ముఖంపై పాము కాటేసింది. దీంతో పిల్లలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. విషయం తెలిసిన సిబ్బంది, స్థానికులు పామును అక్కడికక్కడే చంపేశారు. విద్యార్థుల్ని పార్వతీపురంలోని ఓ ఆస్పత్రికి తరలించి.. ఆపై మెరుగైన చికిత్స కోసం కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. ముగ్గురిలో రంజిత్ అనే చిన్నారి మృతి చెందాడు. మరో ఇద్దరిలో ఓ చిన్నారి వెంటిలేటర్‌పై ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన గురించి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొనగా.. రంజిత్ కుటుంబ సభ్యుల రోదనలతో ఆస్పత్రి ప్రాంగణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
ఇరవై పైసలకే కిలోమీటర్.. ఈ బండి చాలా మేలండి
విజయనగరం: రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్ ధరలు వాహనదారులకు భారంగా మారాయి. బండి బయటకు తీయాలంటేనే బెంబేలెత్తుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ వాహనాలు ఆశా కిరణంలా కనిపిస్తున్నాయి. వాటి నిర్వహణ వ్యయం తక్కువగా ఉండడంతో పాటు కాలుష్య నియంత్రణ సాధ్యమతోంది. వాటి వినియోగాన్ని పెంచితే ఖర్చు తగ్గడంతో పాటు భవిష్యత్తు తరాలకు మేలు చేకూరుతుందని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతుండగా..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉద్యోగులకు నెడ్‌క్యాప్ ద్వారా సులభ వాయిదాల్లో ఎలక్ట్రిక్ బైక్‌లు ఇప్పించే చర్యలు ప్రారంభించాయి. ఇరవై పైసలకే కిలోమీటరు నగరంలో ఇటీవల వ్యక్తిగత వాహనాల వినియోగం పెరిగింది. కోవిడ్ తర్వాత చాలా మంది ప్రజారవాణా కంటే సొంత వాహనాలపై వెళ్లేందుకే ఆసక్తి చూపుతున్నారు. సులభమైన వాయిదా పద్ధతులు ఇందుకు దోహదపడుతున్నాయి. ఫలితంగా రోడ్లు వాహనాలతో నిండిపోతున్నాయి. రద్దీ సమయాల్లో కొన్ని ముఖ్య కూడళ్లలో విపరీతమైన రద్దీ ఏర్పడుతుండగా..ఇవన్నీ పెట్రోల్, డీజిల్‌తో నడిచేవి కావడంతో కాలుష్యం పెరుగుతోంది. ఎలక్ట్రిక్ బైక్‌ల వినియోగం పెరిగితే.. కాలుష్యానికి అడ్డుకట్ట పడుతుంది. ప్రస్తుతం విజయనగరంలో పెట్రోల్ ధర లీటరు రూ.106గా ఉంది. ఈ లెక్కన పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనానికి కి.మీ.కు రూ.2.50 ఖర్చవుతుంది. అదే విద్యుత్తు బైక్‌కు కేవలం 20 పైసలు మాత్రమే. కేవలం 4 యాంప్ సాకెట్ ఉంటే ఇంట్లోనే చార్జింగ్ పెట్టుకోవచ్చు ఈ తరహా బండ్లకు చార్జింగ్ స్టేషన్లూ రానున్నాయి. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ వే వెంబడి అవి ఏర్పాటు కానున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్తు వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. జిల్లాలో పనిచేస్తున్న వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులతో పాటు.. ప్రభుత్వ ఉద్యోగులందరికీ వాటిని అందించేందుకు సన్నాహాలు ప్రారంభించాయి. నెడ్‌క్యాప్ ఆధ్వర్యంలో అందరికీ సులభ వాయిదాల్లో అందించనున్నారు. ఈ ద్విచక్ర వాహనాల వేగం 45 నుంచి 55 కి.మీ. ఉంటుంది. ఒకసారి పూర్తిగా చార్జింగ్ చేస్తే 80 నుంచి 100 కి.మీ. నడుస్తుంది. ఫుల్ చార్జింగ్కు మూడు యూనిట్ల విద్యుత్తు వినియోగమవుతుంది. వాహన మోడల్, ధరను బట్టి నెలకు రూ.2వేల నుంచి రూ.2,500 చొప్పున 60 నెలలు ఈఎంఐ చెల్లించే వెసులుబాటు ఇవ్వనున్నారు. రిజిస్ట్రేషన్, లైసెన్స్ అవసరం లేదు బ్యాటరీ వాహనాల కొనుగోలుపై యువత, విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. కోవిడ్ తర్వాత కొనుగోళ్లు పెరిగాయి. సెంట్రల్ మోటర్ వెహికల్ యాక్ట్ ప్రకారం 25కి.మీ కంటే తక్కువ వేగంతో వెళ్లే వాహనాలకు రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్సు, రోడ్ ట్యాక్స్ అవసరం లేదు. కొనుగోలు చేసిన బండిని వెంటనే వినియోగించవచ్చు. ప్రస్తుతం లిథియం బ్యాటరీలు వస్తున్నాయి. అవి ఎక్కువ కాలం మన్నుతాయి. 5గంటలు చార్జింగ్ పెడితే 80 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. – పి.శ్రీనివాసరావు, మెకానిక్, విజయనగరం -
‘మాన్సాస్’ అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధమా!
చీపురుపల్లి: మాన్సాస్ ట్రస్టు ముసుగులో ప్రజల ఆస్తులను దశాబ్దాల తరబడి అనుభవిస్తుండటమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు సాగిస్తున్న మాజీమంత్రి, టీడీపీ నేత అశోక్‌గజపతిరాజు బహిరంగచర్చకు రావాలని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సవాల్ విసిరారు. చీపురుపల్లిలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. మాన్సాస్ ట్రస్టు ఆస్తుల రికార్డులతో అశోక్‌గజపతిరాజు ప్రజావేదికకు రావాలని, అక్రమాలపై పూర్తి ఆధారాలతో తాము వస్తామని చెప్పారు. మాన్సాస్ ట్రస్టు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యంవల్ల ప్రజలకు నష్టం జరగదని, అశోక్‌గజప తిరాజు అక్రమాలకు నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు. ట్రస్టు భూముల్ని విక్రయించడానికి, తాకట్టు పెట్టడానికి చట్టం అనుమతించకపోయినా.. నిబంధనల్ని ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. బ్రిటిష్ పరిపాలన అనంతరం ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి జమిందారీ, రాజ వ్యవస్థలకు భూములు వచ్చాయన్నారు. ఆ భూములు ప్రజలకే చెందాలన్న ఆశయంతో 1948లో ఎస్టేట్ అబాలిష్ యాక్ట్, 1956లో టీనాం భూముల చట్టం ద్వారా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినట్టు చెప్పారు. అయినప్పటికీ రాజ వంశీయుల వద్దే వేలాది ఎకరాల భూములు ఉండిపోవడంతో 1972లో ఇందిరా గాంధీ ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి ఆ భూములు ప్రజలకు చెందాలని ఆదేశాలిచ్చారన్నారు. ఈ చట్టం ప్రకారం రాజ వంశీయులు 3 వేల ఎకరాలు ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉందన్నారు. అదే సమయంలో విజయనగరం రాజ వంశీయులు 8,850 ఎకరాల భూములు వారి వద్ద ఉన్నట్టు ప్రభుత్వానికి నివేదించారని గుర్తుచేశారు. అందులో నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి 3 వేల ఎకరాలు తిరిగి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆ భూములు ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకే 1973లో మాన్సాస్ ట్రస్టును స్థాపించారని ఆరోపించారు. అయినప్పటికీ రాజవంశీయులు దురుద్దేశంతో మాన్సాస్‌కు చెందిన 38వ నంబర్ రికార్డును ట్యాంపరింగ్ చేసి, 43వ నంబర్ రికార్డు సృష్టించి మాన్సాస్ వద్ద 14,450 ఎకరాలు ఉన్నట్టుగా తప్పుదోవ పట్టించారన్నారు. మెడికల్ కళాశాల పేరుతో మాన్సాస్ ట్రస్టు నుంచి 200 ఎకరాలు విక్రయించారని, ఆ నిధులు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల కోసమే ప్రభుత్వం మాన్సాస్ ట్రస్ట్‌పై విచారణ నిర్వహిస్తోందని ఎంపీ బెల్లాన పేర్కొన్నారు. -
పేదల ఇంటిపై టీడీపీ కడుపుమంట
‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం భారీ స్థాయిలో చేపట్టిన ఇళ్ల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కడుపుమంటతో అడ్డుతగులుతున్నారు. పేదల ఇంటి శంకుస్థాపన చేయడానికి వచ్చిన నేతలను, వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనను అడ్డుకుంటూ దాడులకు దిగుతున్నారు. ప్రభుత్వానికి మంచి పేరొస్తోందన్న అక్కసుతో జీర్ణించుకోలేని టీడీపీ శ్రేణులు ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నారని లబ్ధిదారులు మండిపడుతున్నారు. రామభద్రపురం/పెదకూరపాడు: విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం కొండకెంగువలో భూమిపూజకు వెళ్తున్న బొబ్బిలి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు వాహనాన్ని గ్రామ పొలిమేరల్లో టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అర్హులకు ఇళ్ల స్థలాలు మంజూరు కాలేదంటూ ఘెరావ్ చేశారు. సమస్య ఏదైనా ఉంటే గ్రామ రామమందిరంలో కూర్చొని మాట్లాడుకుందామని, అర్హులకు న్యాయం చేద్దామని ఆయన నచ్చజెప్పినా వినలేదు. స్థలం రాని వారు గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో మంజూరవుతుందని ఎమ్మెల్యే వివరించినా చెవికెక్కించుకోలేదు. టీడీపీ నేతలు గంటసేపు పెద్దగా కేకలు వేస్తూ రణరంగం సృష్టించారు. సీఐ స్పందించి ఎమ్మెల్యేను పోలీస్ వాహనంలో ఎక్కించి శంకుస్థాపన స్థలానికి తీసుకెళ్లే క్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు మరింత రెచ్చిపోయారు. ఎమ్మెల్యే వాహనంపై రాళ్లు రువ్వడంతోపాటు పోలీసులపైనా రాళ్ల దాడి చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో అల్లరిమూకలను పోలీసులు చెదరగొట్టారు. అప్పటికీ ఆగని కొంతమంది టీడీపీ కార్యకర్తలు శంకుస్థాపన కార్యక్రమం వద్ద టెంట్లు పీకేసి.. కుర్చీలు విసిరేశారు. మైక్సెట్లు, సౌండ్ బాక్సులను తన్నేశారు. టీడీపీ నేతలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎమ్మెల్యే మాత్రం శంకుస్థాపన పూర్తిచేసి వెనుదిరిగారు. కాగా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినవారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సర్పంచ్ నాగేశ్వరరావుపై దాడి గుంటూరు జిల్లా కంభంపాడులో వైఎస్సార్ జగనన్న కాలనీకి మౌలిక వసతులు కల్పించేందుకు శనివారం విద్యుత్, వాటర్ పైపులైన్ పనులు చేపట్టారు. టీడీపీ కార్యకర్త దుప్పటి లక్ష్మణ్ పొలం నుంచి విద్యుత్, వాటర్ పైపులైన్లు వేస్తుండగా అడ్డగించారు. పేదలకు ఇళ్లు నిర్మిస్తుంటే అడ్డుకోవడం తగదని సర్పంచ్ ఆర్తిమళ్ల నాగేశ్వరరావు హితవు పలికారు. దీంతో నాగేశ్వరరావుతో వాగ్వాదానికి దిగిన టీడీపీ కార్యకర్తలు దుప్పటి లక్ష్మణ్, శ్రీనివాసరావు, తిరుపతిరావు, నరసింహరావు, బాలకృష్ణ, వెంకటకృష్ణ, హరిబాబు, వెంకట్రావు దాడి చేశారు. నాగేశ్వరరావుకు రక్తగాయాలు కావడంతో పోలీసులు ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు 8 మందిపై కేసు నమోదు చేశారు. వారిలో ఆరుగురిని కోర్టులో హాజర్చగా, ఇద్దరు పరారీలో ఉన్నట్లు సీఐ గుంజి తిరుమలరావు తెలిపారు. -
‘ఆ భూములను చంద్రబాబు పప్పుబెల్లాల్లా పంచాడు’
సాక్షి, విజయనగరం: మాన్సాస్ ట్రస్ట్ విషయంలో జడ్జిమెంట్ పరిశీలించిన తర్వాత స్పందిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఛైర్మన్‌గా అశోక్‌గజపతిరాజు ఏం అభివృద్ధి చేశారని ఆయన ప్రశ్నించారు. పదవులు ముఖ్యం కాదు, అభివృద్ధి కూడా చూడాలన్నారు. ట్రస్ట్ విషయంలో ప్రభుత్వం ఎక్కడా జోక్యం చేసుకోలేదని.. హైకోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్తామని మంత్రి చెప్పారు. అన్యాక్రాంతమైన దేవాదాయ భూములను గుర్తిస్తున్నామని పేర్కొన్నారు. ఆక్రమణలపై ప్రభుత్వ చర్యలతో అందరికీ భయం పట్టుకుందన్నారు. దేవాదాయ భూములను చంద్రబాబు పప్పుబెల్లాల్లా పంచారని ధ్వజమెత్తారు. దేవాదాయ భూములను సంరక్షించడమే తమ ప్రభుత్వ ధ్యేయం అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. చదవండి: వరుసగా మూడో ఏడాది వైఎస్ఆర్ వాహనమిత్ర అమలు: సీఎం జగన్ ‘ఇమేజ్ పెంచుకోవడానికి అడ్డదారులుండవు బాబు’ -
రాజులమ్మతల్లి కలలో చెప్పిందని..
చీపురుపల్లి రూరల్: రాజులమ్మ తల్లి కలలో కనిపించి.. మీ భూముల్లో నేను విగ్రహాల రూపంలో ఉన్నాను.. తవ్వకాలు జరిపితే విగ్రహాలు లభ్యమవుతాయని చెప్పిందంటూ పుర్రేయవలస గ్రామానికి చెందిన కంది లక్ష్మి తవ్వకాలకు పూనుకున్నారు. గ్రామానికి సమీపంలోని చీపురుపల్లి–సుభద్రాపురం ప్రధాన రహదారి పక్కన 25 రోజులుగా తవ్వకాలు సాగిస్తున్నారు. వీటి కోసం రూ.లక్షా 50వేలు ఖర్చుచేశారు. ఆర్థిక భారం కావడంతో తవ్వకాలు మధ్యలో ఆపేశారు. అమ్మవారు కలలో కనిపించి మరో 50 అడుగుల లోతు తవ్వితే విగ్రహాలు కనిపిస్తాయని చెప్పడంతో మళ్లీ తవ్వకాలు ప్రారంభించినట్టు లక్ష్మి తో పాటు కుటుంబ సభ్యులు తెలిపారు. విగ్రహాలు లభిస్తే ఇళ్లు, భూమి అమ్మేసైనా సరే గుడి కడతామని చెబుతున్నారు. తవ్వకాలు చూసేందుకు ప్రతిరోజూ జనం క్యూ కడుతున్నారు. చదవండి: సాక్షి ఎఫెక్ట్: పల్లా ఆక్రమణలకు చెక్ నిత్య పెళ్లికూతురు కేసులో మరో మలుపు -
బాల్ సరిగా వెయ్.. కరోనా బాధితులతో జేసీ వాలీబాల్
బొబ్బిలి: కరోనా వైరస్ బాధితుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కిశోర్‌కుమార్ ముందడుగు వేశారు. కోవిడ్ కేర్ సెంటర్‌కు వెళ్లి వారితో కలిసి ఆటలాడి వారిలో ఆందోళన పోగొట్టారు. ఆయన బుధవారం బొబ్బిలి గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలోని కోవిడ్ కేర్ సెంటర్‌ను పరిశీలించారు. అక్కడున్న 123 మంది కరోనా వైరస్ బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వారు చెప్పిన చిన్నచిన్న సమస్యల పరిష్కారానికి అక్కడే ఉన్న తహసీల్దార్ ఆర్.సాయికృష్ణ, సీఎస్‌డీటీ బలివాడ గౌరీశంకర్‌లకు ఆదేశాలిచ్చారు. కరోనా వల్ల ఏం కాదని, జాగ్రత్తలు మాత్రం ముఖ్యమని చెబుతూ బాధితులతో కలిసి వాలీబాల్ ఆడారు. బాల్ సరిగా వెయ్.. అంటూ వారిని ఉత్సాహపరిచారు. దీంతో కోవిడ్ బాధితులు కూడా ఉత్సాహంగా ఆయనతో ఆడారు. రోజూ మూడు షిఫ్ట్‌ల్లో వైద్యులు, సిబ్బంది ఉండాలని, త్వరితగతిన రికవరీ అయ్యేలా వారిలో ధైర్యాన్ని నూరిపోయాలని జేసీ అధికారులకు సూచించారు. చదవండి: ‘జగనన్న ప్రాణవాయువు’ రథచక్రాలు ప్రారంభం ఆత్మ బంధువులు: మానవత్వమే ‘చివరి తోడు’ -
పల్లెల్లో చిచ్చు: టీడీపీ నయా కుయుక్తులు..
పచ్చని పల్లెల్లో చిచ్చు రేపుతున్నారు. ప్రశాంతంగా ఉండాల్సిన ఊళ్లల్లో విభేదాలు సృష్టిస్తున్నారు. ఐక్యతకు విఘాతం కలిగిస్తున్నారు. ఏకగ్రీవాలు జరగకూడదని కత్తిగట్టారు. ప్రతిచోటా పోటీ ఉండాలనీ... అవసరమైతే డబ్బు తామే ఇస్తామనీ... ఓడిపోతామని తెలిసినా ఉనికిని చాటుకోవాలనీ... పార్టీ రహితంగా జరగాల్సిన ఎన్నికల్లోనూ వర్గాలుగా విడగొడుతున్నారు. జిల్లాలో తెలుగుదేశం పారీ్టకి పెద్ద దిక్కు అని చెప్పుకుంటున్న ఓ నాయకుడు దీనికోసం విస్తృతంగా సమాలోచనలు చేస్తున్నారు. సాక్షిప్రతినిధి, విజయనగరం: గ్రామ స్వరాజ్యానికి ఆయువుపట్టులాంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. సంగ్రామంలో ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రత్య ర్థులను చిత్తు చేయడానికి పోరాడటం వీరుల లక్షణం. కానీ అదే సంగ్రామంలో కుయుక్తులతో వెన్నుపోటుతో గెలవాలని ప్రయతి్నంచే వారూ ఉంటారు. అలాంటి ఓ వర్గం పంచాయ తీ ఎన్నికల్లోనూ కుట్ర రాజకీయాలకు తెరలేపింది. ప్రజాబలం లేని ఓ పార్టీ ఆర్థిక బలంతో దురాశను ఎరవేసి ఎన్నిక ల్లో లబి్ధపొందాలని భావిస్తోంది. చదవండి: గ్రామ కక్షలకు టీడీపీ కుట్ర.. రాజకీయ పార్టీలకు అతీతంగా, పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా జరగాల్సిన ఎన్నికల్లో దుష్ట సంప్రదాయాలను ప్రవేశపెడుతోంది. విజయనగరం జిల్లా రాజకీయ చరిత్రలో తమది ప్రత్యేక స్థానమని, తమ తరతరాల రాజకీయంలో నీతి తప్పింది లేదని గర్వంగా చెప్పుకుంటుంటారు. కానీ పంచాయతీ ఎన్నికల్లో అదే వ్యక్తి దురి్వనీతిని ప్రదర్శిస్తున్నారు. జిల్లా టీడీపీకి పెద్దదిక్కుగా చెలామణీ అవుతున్న ఆయన పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు గెలవరని తెలిసి కూడా ఏకగ్రీవాలు జరగకుండా అడ్డుపడుతున్నారు. అంతర్గత సమావేశాల ద్వారా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూనే, తనకున్న డబ్బును అడ్డుపెట్టుకుని ఉచిత ప్రకటనలు చేస్తూ, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చట్ట వ్యతిరేక చర్యలకు బీజం వేస్తున్నారు. చదవండి: అభ్యర్థుల కోసం టీడీపీ వెతుకులాట.. గతంలోనూ ఏకగ్రీవాలు నిజానికి గతంలో జిల్లాలో చాలావరకూ ఏకగ్రీవాలు జరిగాయి. 2006 పంచాయతీ ఎన్నికల్లో అప్పటికున్న 921 పంచాయతీల్లో 77 పంచాయతీలు, 2013లో 127 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. 2006లో ఏకగ్రీవం అయిన ప్ర తి పంచాయతీకి రూ.5లక్షలు చొప్పున అప్పటి ప్రభుత్వం నజరానా అందిస్తే.... 2013లో జనాభా ప్రాతిపదికన రూ.7 లక్షల వరకూ ప్రోత్సాహక నగదు లభించింది. అప్పుడు జరిగిన ఏకగ్రీవాలను ఇప్పుడు అడ్డుకోవడానికి రాజకీయ ప్రయోజనాలే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఏకగ్రీవాలతో ఎంతో మేలు పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం అయితే కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షల్లో నజరానాను పెంచి ప్రకటించింది. రెండు వేల లోపు జనాభా ఉంటే ఆ పంచాయతీకి రూ.5లక్షలు, ఐదు వేల లోపు ఉంటే రూ.10లక్షలు, పది వేల లోపు ఉంటే రూ.15 లక్షలు, అంతకు మించి జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్, వార్డు మెంబర్లు ఏకగ్రీవం అయితే రూ.20లక్షల చొప్పున ప్రభు త్వం ఆర్థిక బహుమతిని అందిస్తుంది. కేవలం డబ్బు మాత్ర మే కాదు. గ్రామంలో ఎన్నికల వల్ల జరిగే అవాంఛనీయ సంఘటనలు వంటివి ఏకగ్రీవం వల్ల మటుమాయమవుతా యి. ఓటర్లకు, అధికారులకు ఎలాంటి శ్రమ లేకుండా, వారి విలువైన సమయం ఆదా అవుతుంది. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలతో ఆ గ్రామం పూర్తి గా అభివృద్ధి చెందుతుంది. ఐక్యతను అడ్డుకునేందుకు కుట్రలు ఏకగ్రీవం జరిగితే మరో వర్గానికి మేలు చేకూరుతుందని భయ పడుతున్న ఆ నాయకుడి వర్గం ప్రజలకు, గ్రామానికి మంచి జరగకపోయినా పర్లేదుగానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలు జరగకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న పార్టీ నేతలతో తన నివాసంలో సమావేశం నిర్వహించి మరీ ఆర్థిక సాయాన్ని ఆయన ప్రకటించినట్లు తెలుస్తోంది. గ్రామాల్లో ఏకగ్రీవాలకు ఒప్పుకోకుండా ఎన్నికలు జరిగేలా చూస్తే దానికి తమ వర్గం అభ్యర్థులకు అయ్యే ఖర్చును తాను భరిస్తానని, అవసరమైతే నాయకులకు అదనంగా ఆర్ధిక ప్రయోజనాలు, భవిష్యత్‌లో పదవులు కల్పి స్తామని హామీలు కూడా గుప్పించినట్లు సమాచారం. గుణపాఠం నేర్వని నాయకత్వం నిజానికి గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోనే జిల్లాలో పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఘోర పరాజయాన్ని చవిచూశారు. తన భుజాలపై పెట్టుకుని విజయం వైపు నడిపించాల్సిన ఆయన పార్టీ అభ్యర్థులనే గాకుండా, తన కన్న కూతురిని, తనను కూడా గెలిపించుకోలేకపోయారు. ఇప్పుడు ప్రజలకు చేకూరే ప్రయోజనాలను సైతం అడ్డుకోవాలని ప్రయత్నిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. సాక్షాత్తూ ఆ పార్టీ అధినేతే నిబంధనలకు విరుద్ధంగా పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేయగా లేనిది, తాము ఇలా చేస్తే తప్పేముందని అనుకుంటున్నట్టున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలోనూ వారు చేస్తున్న ప్రచారాలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేవిగానే ఉన్నాయి. పార్టీ రహిత ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులను పార్టీ అభ్యర్థులుగా ప్రకటిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి వాటికి అడ్డుకట్ట పడకపోవడం విడ్డూరంగా ఉంది. -
రామతీర్థంలో సెక్షన్ 30 అమలు
సాక్షి, విజయనగరం : రామతీర్థం ఆలయ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఆలయ సమీపంలో సభలు, సమావేశాలకు అనుమతిలేదని డీఎస్పీ సునీల్ తెలిపారు. రామతీర్థంలో సెక్షన్ 30 అమలుచేస్తున్నామని, ఎవరూ చట్టాలను అతిక్రమించవద్దని, చట్టాలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. విగ్రహం ధ్వంసం దర్యాప్తుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కోవిడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నిబంధనలు అమల్లో ఉన్నాయని తెలిపారు. రామతీర్థం వైపు ఎవరూ వెళ్లకుండా రాజపులోవ జంక్షన్లో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. మరోవైపు రామతీర్థంలో సీఐడీ విచారణ ప్రారంభమైంది. తొలుత సమాచారం వెలుగులోకి వచ్చిన విధానాన్ని సీఐడీ అధికారులు సేకరిస్తున్నారు. కాగా రామతీర్థం ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఐడీ విచారణకు ఆదేశించారని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు వెల్లడించిన విషయం తెలిసిందే. ఘటనలో కొందరు అనుమానితులను పోలీసులు గుర్తించారని, ఒకట్రెండు రోజుల్లో దోషులను పట్టుకునేలా విచారణ కొనసాగుతోందన్నారు. రామతీర్థం అంశం సున్నితంగా మారిన నేపథ్యంలో బీజేపీ, ఇతర పార్టీలు మంగళవారం తలపెట్టిన ర్యాలీని విరమించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఘటనలపై ఎవరైనా అభిప్రాయం చెప్పవచ్చని, సలహాలు, సూచనలు ఇవ్వొచ్చని, ఎలాంటి చర్యలకైనా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. -
పప్పునాయుడు సవాల్‌కు మేం రెడీ..
సాక్షి, విజయనగరం: రామతీర్థం కొండపై జరిగిన దుశ్చర్యకు చంద్రబాబు, లోకేష్, అశోక్‌గజపతిరాజే కారణమని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ జగన్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికే చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని దుయ్యబట్టారు. లోకేష్ విసిరిన సవాల్‌కు సిద్ధమన్న ఆయన.. తేదీ, సమయం చెప్తే సింహాద్రి అప్పన్న సన్నిధికి వస్తామని తెలిపారు. తిరుమలలో వెయ్యికాళ్ల మండపాన్ని, విజయవాడలో ఆలయాలను తొలగించిన దుర్మార్గుడు చంద్రబాబు అని మండిపడ్డారు. (చదవండి: విజయసాయిరెడ్డి కాన్వాయ్‌పై టీడీపీ శ్రేణుల దాడి) ఆలయాల్లో తాంత్రిక పూజలు, క్షుద్రపూజలు కూడా చంద్రబాబు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ వ్యవస్థను నిర్వీర్యం చేయడమే కాక.. సదావర్తి భూములను అమ్మిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు దేవుడి పట్ల భయం, భక్తి లేవన్నారు. ఓట్ల కోసం తప్ప.. విలువలతో కూడిన రాజకీయాలు చేయడం చంద్రబాబుకు రాదన్న ఆయన.. ప్రజల సొమ్మును ఎలా దోచుకోవాలన్నదే చంద్రబాబు దురాలోచనని మండిపడ్డారు.(చదవండి:అయ్యో... రామ‘చంద్ర’!) ‘‘చంద్రబాబు, కుట్రలు కవల పిల్లలు. సొంత మామ, తమ్ముడు, బావమరుదులను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు’’ అంటూ ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తప్పు చేసిన వారిని ఆ భగవంతుడు శిక్షిస్తాడు. రామతీర్థం ఆలయ అభివృద్ధికి ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతామని విజయసాయిరెడ్డి వెల్లడించారు. -
60 ఏళ్లుగా సైకిల్‌తో అనుబంధం..
ఆయనకు 16 ఏళ్ల వయసులో వివాహమైంది. తండ్రితో సైకిల్ కొనిపించారు. ఇప్పుడు ఆయన వయస్సు 76 ఏళ్లు. అప్పుడు కొనుగోలు చేసిన సైకిలే ఇప్పటికీ ఆయన ప్రయాణ రథం. 60 ఏళ్లుగా సైకిల్‌ను చక్కగా చూసుకుంటూ.. ప్రయాణాలకు వినియోగిస్తున్నారు. ఆయన బైస్కిల్ బంధం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆదర్శనీయంగా నిలుస్తోంది. బొబ్బిలి రూరల్ : బొబ్బిలి పట్టణం అగ్రహారం వీధికి చెందిన దామెర శ్రీరంగనాయకులు బాడంగి మండలం పాల్తేరు గ్రామానికి చెందిన వారు. తల్లిదండ్రులు వ్యవసాయదారులు కావడంతో ఆయన కూడా వ్యవసాయంపైనే దృష్టిసారించా రు. పెళ్లైన తరువాత బొబ్బిలి వచ్చి స్థిరపడ్డారు. ఆయనకు 16 ఏళ్ల వయసులో 1960 మే 12న వివాహం జరిగింది. మే 20న తండ్రితో మారాం చేసి హెర్క్యులస్ సైకిల్‌ను కొనిపించారు. అప్పట్లో సైకిల్ ధర 60 రూపాయలు. విజయనగరంలోని చెక్కా వెంకటరత్నం షాపులో కొనుగోలు చేశారు. నాటి నుంచి దానిపైనే బొబ్బిలికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాల్తేరుకు రోజూ రెండు మార్లువెళ్లి వస్తుండేవారు. ఈ సైకిల్‌పై బొబ్బిలి నుంచి పార్వతీపురం, సాలూరు, విజయనగరానికి సినిమా లకు, నాటకాలకు సైతం వెళ్లేవారు. సైకిల్‌పై 60 ఏళ్లుగా వేల కిలోమీటర్లు ప్రయాణం సాగించారు. సైకిల్ ఫ్రేమ్, హేండిల్బార్, మడ్గర్లు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఈయన ఇటీవల టూవీలర్ కొనుగోలు చేశారు. దానిపై ఆసక్తి లేకపోవడంతో కొనుగోలుచేసిన కొద్దిరోజులకే అమ్మేశారు. నాకెంతో ఆనందం నా హెర్క్యులస్ సైకిల్ అంటే నాకెంతో ఇష్టం. దీనిపై అప్పట్లో రోజుకు 120 కిలోమీటర్లు తొక్కి సరదాగా సినిమాలకు వెళ్లేవాడిని. 76 ఏళ్ల వయసులో ఆరోగ్యంగా ఉండేందుకు సైకిల్ తొక్కడమే కారణం. అప్పటి నుంచి ఇప్పటివరకు సైకిల్ చెక్కుచెదరలేదు. దానిపైనే ప్రతినిత్యం ప్రయాణం సాగిస్తున్నా. – దామెర శ్రీరంగనాయకులు, బొబ్బిలి -
ఊర్మిళ తీరు అహంకారపూరితం..
సాక్షి, విజయనగరం : ఉత్తరాంధ్ర కల్పవల్లి, విజయనగరం ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా చోటుచేసుకున్న వ్యవహారంపై మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్ కార్యాలయం ఓ లేఖను విడుదల చేసింది. సిరిమానోత్సవంలో ట్రస్ట్ చైర్‌పర్సన్‌కు ముందు వరుసలో సీటు కేటాయించడం ఆనవాయితీ అని వివరించింది. కొంతమంది ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నేరుగా వచ్చి ముందు వరుసలో కూర్చున్నారని పేర్కొంది. పుసపాటి అనంద గజపతిరాజు కుమార్తె ఊర్మిళ, ఆమె తల్లి సుధా గజపతి రాజు... ఈవో పక్కన కూర్చొని సిరిమాను ఉత్సవాన్ని వీక్షించారని వివరించింది. అయినప్పటికీ తమకు సీట్లు కేటాయించలేదని మీడియాకు చెప్పడం బాధాకరమని మాన్సాస్ కార్యాలయం లేఖలో విచారం వ్యక్తం చేసింది. వారిని మహారాణి, రాజ కుమార్తెలాగా చూడాలని కోరుకుంటున్నారని, కానీ సిరిమానోత్సవం ప్రజల పండుగని తెలిపింది. ప్రజాస్వామ్యంలో ఇంకా కొంతమంది రాజరికం కోరుకోవడం దురదృష్టకరమని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఊర్మిళ తల్లి, ఊర్మిళ ప్రవర్తించిన తీరు అహంకారపూరితమని మాన్సాస్ కార్యాలయం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా దసరా సందర్భంగా గత మంగళవారం అమ్మవారి సిరిమానోత్సం ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. సాంప్రదాయాలను పాటిస్తూ నిర్వహిస్తూ జరిపిన ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రముఖులు వీక్షించారు. అయితే మన్సాస్ ట్రస్ట్ చైర్మన్ కోసం ముందు వరుసలో ఏర్పాటు చేసిన కుర్చీలో ఊర్మిల, ఆమె తల్లీ కూర్చోవడంపై మన్సాస్ ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్ సంచయిత గజపతి రాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారి తీరును ఖండిస్తూ లేఖను విడుదల చేశారు. జాతర సంఘటనలో ప్రభుత్వ ప్రమేయం లేదు పైడితల్లి సిరిమానోత్సవం సందర్భంగా కోట బురుజుపై జరిగిన సంఘటనలో ప్రభుత్వ జోక్యం లేదని, సంచయిత వ్యక్తిగత ప్రమేయంతోనే జరిగిందని పూసపాటి ఆనంద గజపతిరాజు కుమార్తె పి.ఊర్మిళ గజపతిరాజు అన్నారు. తన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇంటి ఇలావేల్పు పైడితల్లి అమ్మవారి సిరుమాను ఉత్సవాన్ని ఏటా కోట బురుజుపై నుంచి తిలకిస్తామన్నారు. మమ్మల్ని ఎవరు అనుమతించారని చైర్పర్సన్ సిబ్బందిపై ఆగ్రహించడం తగదన్నారు. ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా నియమించినా ఇప్పటివరకు ప్రమాణ స్వీకారం చేయించలేదని ఆమె తెలిపారు. తమకున్న హక్కులు పలుమార్లు తెలిపామని, అధికారం శాశ్వతం కాదన్నారు. కార్యక్రమంలో ఆనందగజపతిరాజు సతీమణి సుధా గజపతిరాజు పాల్గొన్నారు. -
‘ప్రభుత్వాన్ని లాగటం భావ్యం కాదు’
సాక్షి, విజయనగరం: అశోక్ గజపతిరాజు మాన్సాస్ వ్యవహారంలో ప్రభుత్వాన్ని లాగటం భావ్యం కాదని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హితవు పలికారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కుటుంబ వ్యవహారాలు ఉంటే వారిలో వారు చక్కదిద్దుకోవాలన్నారు. మహారాజ కళాశాల వ్యవహారంలో మాన్సాస్ వలన విద్యార్థులకు, అధ్యాపకులకు నష్టం వాటిల్లుతుంటే తమ పరిధి మేరకు చర్యలు చేపడతామని మంత్రి బొత్స పేర్కొన్నారు. ఎంఆర్ విద్యాసంస్థలను అన్ ఎయిడెడ్ చేయమని గతంలో అశోక్ గజపతే ప్రభుత్వాన్ని కోరినట్టు మాన్సాస్ చైర్మన్ సంచయిత తెలిపారని ఆయన చెప్పారు. తామెప్పుడు మాన్సాస్ వ్యవహారంలో జోక్యం చేసుకోలేదని, ప్రజలకు నష్టం కలిగితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని ఆయన స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో పైడితల్లి అమ్మవారి ఉత్సవ నిర్వహణపై పట్టణానికి చెందిన ప్రముఖులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. (చదవండి: రాజకీయాలతో ముడిపెట్టొద్దు: బొత్స) -
ఆలయాలే వీరి టార్గెట్..
సాక్షి, విశాఖపట్నం: విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను విజయనగరం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా 27 ఆలయాల్లో ఇటీవల కాలంలో నేరాలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. మధురవాడ వాంబే కాలనీకి చెందిన మొగిలిపల్లి నాగార్జున... తోట వీరబాబు మరుపల్లి ధనరాజుతో సహా ఆరుగురు ముఠాగా ఏర్పడి ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. ముఠా సభ్యులు ఒకరికే ఆటో ఉండడంతో ఆటో పై సంచరిస్తూ నేరాలు చేయడం వీరికి అలవాటుగా మారింది. తాజాగా విజయనగరం జిల్లాలో వరుసగా ఆలయాల్లో హుండీలు పగలగొట్టిన ఈ నేరస్థులను విజయనగరం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. (చదవండి: వివాహేతర సంబంధం: మెడలో చెప్పులతో) అవాస్తవాలను నమ్మొద్దు:డీఐజీ ఇటీవల ఆలయాల్లో జరిగే సంఘటన ఆధారంగా కొందరు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విశాఖ రేంజ్ డీఐజీ కాళిదాసు రంగారావు పేర్కొన్నారు. ఇలాంటి అవాస్తవాలను నమ్మవద్దని ఆలయాల్లో చోరీలు జరిగితే ప్రజలు మత విద్వేషాలకు లోను కావొద్దని కోరారు. కొందరు నేరస్థులు చోరీలకు పాల్పడటానికి అలవాటు పడ్డారని నేరం జరిగినప్పుడు ప్రజలు పోలీస్ సహకారం తీసుకోవాలని, ఆందోళన వద్దని విశాఖ రేంజ్ డీఐజీ కాళిదాసు వెంకట రంగారావు సూచించారు. (చదవండి: బొగ్గు గనిలో ప్రమాదం, 16 మంది మృతి) -
గిరిపుత్రులకు భూ హక్కు
కురుపాం: దశాబ్దాలుగా వారు పోడు వ్యవసాయం చేస్తున్నారు. కానీ వాటిపై హక్కు మాత్రం పొందలేకపోతున్నారు. ఏదైనా ప్రకృతి విపత్తు వల్ల పంట నష్టపోతే వారికి ఏ విధమైన పరిహారమూ అందేది కాదు. దీనివల్ల ఏడాది పొడవునా వారు పడిన శ్రమ వృధా అవుతుండేది. ఈ సమస్యలన్నీ ప్రజాసంకల్పయాత్ర సందర్భంగా ఈ ప్రాంతానికి వచ్చిన వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తెలుసుకుని వారికి శాశ్వత ప్రాతిపదికన న్యాయం చేస్తానని ఆనాడే హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారంలోకి వచ్చిన తరువాత అడవుల్లో పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతులందరికీ భూమి హక్కు పత్రాలు(పట్టాలు) ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతులకు 50 వేల ఎకరాలు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టారు. నాడు రాజన్న... నేడు జగనన్న దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి రైతును రాజు చేయాలన్న సంకల్పంతో పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులందరికీ భూమి హక్కు పత్రాలిచ్చారు. ఆ తరువాత వచ్చిన పాలకులు మిగతా వారిగురించి పట్టించుకోలేదు. మళ్లీ ఆయన తనయుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అధికా రం చేపట్టిన తరువాత గిరిజనుల సమస్యపై దృష్టి పెట్టారు. అటవీశాఖ అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురవకుండా పోడు వ్యవసాయం చేస్తున్న రైతులందరికీ ఆర్ఓఎఫ్ఆర్ (రికార్డు ఆఫ్ ఫారెస్ట్ రైట్స్) కింద పట్టాలివ్వాలని ఆదేశించారు. పోడు భూముల్లో ఎవరు సాగు చేస్తే వారికే పట్టాలు ఇవ్వాలని, భూమి లేని వారికి కూడా భూమిని మంజూరు చేయాలని సూచించారు. ప్రభుత్వ సాయం పొందేందుకు అర్హత గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం నుంచి సాయం పొందేందుకు వీలవుతుంది. ప్రభుత్వం ఇప్పటికే రైతు భరోసా కార్యక్రమాన్ని చేపట్టి పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పొందిన రైతులు సైతం రైతు భరోసా పథకం ద్వారా లబి్ధపొందనున్నారు. బ్యాంకు రుణాలు పొందే అవకాశం ఉంది. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2,22,383.02 ఎకరాల భూమిని పంపిణీ చేయడం ద్వారా 88,991 మంది రైతులకు ప్రయోజనం కలిగింది. వారికి ఇప్పటివరకూ అటవీ అధికారుల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా వ్యవసా యం చేసుకోగలుగుతున్నారు. ఐటీడీఏ పరిధిలో 11,784 ఎకరాలు సిద్ధం పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని ఎనిమిది సబ్‌ప్లాన్ మండలాల్లో రెండవ ఫేజ్‌లో భూమి లేని వారిని గుర్తించారు. మొత్తం 8 సబ్‌ప్లాన్ మండలాల్లో 5,984 మందిని గుర్తించి వారికి 11,784 ఎకరాలను గాంధీజయంతి రోజైన అక్టోబర్ 2వ తేదీన పంపిణి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఐటీడీఏ పీఓ ఆర్.కూర్మనాథ్, రెవెన్యూ సిబ్బంది చురుగ్గా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే భూమిని గుర్తించటంతోపాటు ఆన్లైన్లో నమోదు చేసి, సరిహద్దుల వద్ద రాళ్లను కూడా పాతిపెట్టేందుకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టారు. చురుగ్గా చర్యలు ఉన్నతాధికారుల సూచనల మేరకు ఆర్ఓఎఫ్ఆర్ భూ పంపిణీకి చురుగ్గా చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే భూమి లేని వారిని గుర్తించి వివరాలను ఆన్లైన్లో నమోదు చేశాం. గుర్తించి ఆర్ఓఎఫ్ఆర్ భూముల వద్ద సరిహద్ధు రాళ్లను కూడా పాతిపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. అక్టోబర్ 2వ తేదీ నాటికి భూమి లేని గిరిజనులందరికీ భూ పట్టాలు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. – హెచ్.రమణారావు, ఇన్చార్జ్ తహసీల్దార్, కురుపాం కుటుంబానికి ఆసరా ప్రభుత్వం పంపిణీ చేయనున్న భూమి నా కుటుంబ పోషణకు ఆసరాగా నిలుస్తుంది. కురుపాం పంచాయతీ పరిధి టేకరఖండి గిరిజన గ్రామంలో లేని నాకు ఎకరా 27 సెంట్ల భూమి మంజూరు చేసినట్లు, భూ పట్టాలను కూడా పంపిణీ చేయనున్నట్టు రెవెన్యూ అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి రుణ పడి ఉంటాం. – ఆరిక రాము, కురుపాం గతంలో దరఖాస్తు చేసినా పట్టించుకోలేదు ఆర్ఓఎఫ్ఆర్ భూమి కోసం పలుమార్లు గత ప్రభుత్వం హయాంలో వినతులు సమర్పించినా ఎవరూ స్పందించలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నేరుగా భూమి లేని రైతులకు భూమిని మంజూరు చేయటమే కాకుండా వాటిపై రైతు భరోసా, రుణాలు సైతం వచ్చేలా చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉంది. – ఆరిక శ్రీనివాసరావు, టేకరఖండి, కురుపాం మండలం -
విద్యార్థులకు వరం.. ఏపీ కెరీర్ పోర్టల్
శృంగవరపుకోట రూరల్: సమైక్యాంధ్ర విభజన తర్వాత ఏపీ విద్యార్థులకు విద్య, ఉద్యోగ కల్పన కోర్సుల వివరాలను తెలియజేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపట్టారు. ‘ఏపీ కెరీర్ పోర్టల్.ఇన్’ను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. ఏపీఎస్సీఈఆర్టీ, యూనిసెఫ్, ఆస్మాన్ ఫౌండేషన్ సహకారంతో దీనిని అమలుచేస్తున్నారు. ఏపీలో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న సెకెండరీ స్థాయి విద్యార్థుల చదువులతో పాటు భవిష్యత్‌లో ఎంచుకోబోయే ఉపాధి కోర్సులను, వాటి ద్వారా పొందబోయే ఉద్యోగాల వివరాలను తెలియజేస్తున్నారు. రాష్ట్రంలోని 20 లక్షల మంది విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాటలు చూపిస్తున్నారు. శిక్షణ తరగతుల నిర్వహణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వాడ్రేపు చినవీరభద్రుడు, పాఠశాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.రాజశేఖర్, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జి.ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో యూనిసెఫ్, ఆస్మాన్ ఫౌండేషన్, ఎస్సీఈఆర్టీ ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. గత రెండు రోజులుగా వెబ్‌నార్‌లో రాష్ట్రంలోని కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, సెకెండరీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, 9, 10, ఇంటర్ విద్యార్థులు, తల్లిదండ్రులకు ఆన్లైన్లో శిక్షణ అందజేస్తున్నారు. కేరీర్ గైడెన్స్ ఇస్తున్నారు. కెరీర్ పోర్టల్‌లో నమోదు ఎలా?.. ‘ఏపీ కెరీర్ పోర్టల్.ఇన్’లో విద్యార్థి తమ చైల్డ్.ఇన్ఫో ద్వారా రిజిస్టర్ కావాలి. పాస్‌వర్డ్‌గా 123456 ఉంటుంది. నమోదు తొమ్మిది భాషల్లో చేసుకోవచ్చు. విద్యార్థి తమకు నచ్చిన భాషలో ఎంపిక చేసుకుని లాగిన్ అయ్యి.. డాష్‌కోడ్‌లో మై కెరీర్లో డెమోలో ప్రొఫైల్ నింపాలి. విద్యార్థి చదువు, కుటుంబ వివరాలు, ఫోన్ నంబర్‌తో సహా ఎంటర్ చేస్తే ఈ పోర్టల్‌లో నమోదు అయినట్లే. కోర్సుల సమాచారం ఇలా... 550 క్లస్టరర్లతో కూడిన 672 రకాల కోర్సులు, ఉపాధి, ఉద్యోగావకాశాల సమాచారం ఇందులో లభిస్తుంది. వ్యవసాయం/అందం/ఆరోగ్యం/వృత్తి నైపుణ్యం/64 కళలకు సంబంధించిన కోర్సులు/ బయలాజికల్, మెరైన్, రబ్బర్, ఆరి్టఫీషియల్, ఎనర్జీ, సో లార్ తదితర ఇంజినీరింగ్ కోర్సుల వివరాలు ఉంటాయి. ఒక్కో కోర్సుకు అయ్యే ఖర్చు, కోర్సు తర్వాత వాటి భవిష్యత్తు, జీతభత్యాలు, ఆంధ్రప్రదేశ్‌లోని కాలేజీలు, ఉపకార వేతనాలు పొందే వీలుంది. (ఉదాహరణకు సంతూర్, గ్లో అండ్ లవ్లీ, రమణ్‌కుమార్ ముంజల్, ఆర్కేఎం ఫౌండేషన్) వారి ఉపకార వేతనాలు ఆంధ్రప్రదేశ్ కెరీర్ పోర్టల్.ఇన్‌లో ఉంటాయి. కోర్సులు, పరీక్షల వివరాలు.. వివిధ రకాల నోటిఫికేషన్లు, ఫీజులు, పరీక్షలు, కోర్సుల వివరాలు, చివరి తేదీ, వాటికయ్యే ఖర్చు, జీతం, ఉపకార వేతనాలు తదితర వివరాలు ఆంధ్రప్రదేశ్ కెరీర్ పోర్టల్.ఇన్‌లో ఉంటాయి. విద్యార్థులకు సువర్ణవకాశం.. 9, 10 తరగతులు, ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు కెరీర్ గైడెన్స్, లైఫ్స్కిల్స్పై రూపొందించిన చక్కని కార్యక్రమం ఇది. ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 తరగతులు పూర్తిచేసిన విద్యార్థులకు ఉపయోగకరమయ్యే కోర్సుల వివరాలతో కార్యక్రమాన్ని చక్కగా రూపొందించారు. దీన్ని సది్వనియోగం చేసుకుంటే భవిష్యత్తు బంగారమే. – ఇందుకూరి అశోక్‌రాజు, జీవశాస్త్ర ఉపాధ్యాయుడు, భవానీనగర్, ఎస్.కోట మండలం ఉపాధి, ఉద్యోగావకాశాలు.. ఈ కెరీర్ పోర్టల్‌లో లైఫ్‌స్కిల్స్, కెరీర్ గైడెన్స్ అందుతుంది. సెకెండరీ స్థాయి విద్యార్థులు తమ భవిష్యత్‌ను తామే నిర్మించుకోవచ్చు. 672 రకాల ఉపాధి అవకాశాల్లో విద్యార్థులు నచ్చిన అవకాశం గురంచి పూర్తిస్థాయిలో తెలుసుకోవచ్చు. భవిష్యత్‌లో ఏం కాదల్చుకున్నామో విద్యార్థి దశలోనే గుర్తిస్తే ఉన్నత స్థానానికి ఎదగవచ్చు. – రహీం షేక్‌లాల్, సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు, జెడ్పీ హైసూ్కల్, ధర్మవరం -
షూటింగ్ బాల్.. కొత్త ఆట గురూ..!
కొత్తవలస: జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో షూటింగ్‌బాల్ క్రీడను పోత్రహించేందుకు ఆ అసోసియేషన్ నాయకులు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 100 మంది షూటింగ్ బాల్ క్రీడాకారులు ఉన్నారని, గతేడాది జిల్లా తరఫున రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నారని అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పులిబంటి ప్రసాద్ తెలిపారు. షూటింగ్ బాల్ అంటే.. షూటింగ్ బాల్ అంటే ఒక కంటితో గురి చూసి గన్‌తో కాల్చాలని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. వాలీబాల్‌ను పోలిన ఈ షూటింగ్ బాల్లో కూడా ప్రత్యర్థి కోర్టులోకి బంతిని టెక్నిక్‌గా కొట్టి పాయింట్లు సాధించడమే షూటింగ్ బాల్. చిత్తూరు జిల్లాలో ఆదరణ పొందుతున్న ఈ క్రీడ విజయనగరం జిల్లాలో కొత్త క్రీడగా అందరి ఆదరణ పొందుతూ వడివడిగా అడుగులు వేస్తోంది. 1976 నుంచి 39 సార్లు.. 1976 నుంచి ఇప్పటివరకూ ఈ క్రీడను జాతీయ స్థాయిలో 39 సార్లు నిర్వహించారు. మన రాష్ట్రం తొలిసారిగా 2018లో విజయవాడలో, 2019లో చిత్తూరు జిల్లా మదనపల్లిలో నిర్వహించారు. ఈ క్రీడను అభివృద్ధి చేసేందుకు షూటింగ్బాల్తో అనుబంధం ఉన్న వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడలను పోత్సహించే విద్యావేత్తలు కమిటీగా ఏర్పడి రాష్ట్ర అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పరశురామ్ ఆధ్వర్యంలో 13 జిల్లాలో అసోసియేషన్లు ఏర్పాటుచేశారు. విజయనగరం జిల్లా షూటింగ్‌బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శిగా పులిబంటి ప్రసాద్‌ను నియమించారు. ఇతని ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడిగా జే శివకృష్ణ, ఉపాధ్యక్షుడిగా సంతోష్, ట్రెజరర్‌గా పి.అచ్చియ్యమ్మ పనిచేస్తున్నారు. వాలీబాల్‌కు, షూటింగ్బాల్కు తేడాలు.. ♦వాలీబాల్‌లో 12 మంది క్రీడాకారులు ఉండగా ఆరుగురు ఆడుతూ ఆరుగురు స్టాండ్‌బైగా ఉంటారు. ♦షూటింగ్ బాల్లో 12 మంది ఉన్నప్పటికీ ఏడుగురు మాత్రమే కోర్టులో ఆడుతారు. ఐదుగురు స్టాండ్‌బైగా ఉంటారు. ♦వాలీబాల్‌లో 20 నుంచి 25 పాయింట్లు వస్తే విజేతగా ప్రకటిస్తారు. ♦షూటింగ్ బాల్లో కేవలం 15 పాయింట్లు మూడు సెట్లలో రెండు సెట్లు ఎవరు గెలిస్తే వారే విజేతగా ప్రకటిస్తారు. ♦వాలీబాల్‌లో బాల్ ఒకచేతి వేళ్లతోనే కొట్టి పాయింట్లు సాధిస్తే, షూటింగ్ బాల్లో బంతిని రెండుచేతులతో పాస్‌చేస్తూ వేళ్లు అరచేతులు తాకకుండా చూసుకోవాలి. ♦16 ఏళ్లు నిండిన వారిని సబ్జూనియర్స్గా, 19 ఏళ్లు నిండిన వారిని జూనియర్స్‌గా, ఆపై వారిని సీనియర్స్‌గా పరిగణిస్తారు. ♦వాలీబాల్ కంటే షూటింగ్ బాల్ ఆట సమయం పరిమితంగా ఉంటుంది. ♦వాలీబాల్ కంటే షూటింగ్ బాల్ కొద్దిగా చిన్నదిగా ఉంటుంది. రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నా వాలీబాల్కంటే షూటింగ్‌బాల్ చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. మా కళాశాలలో తొలిసారిగా ఆడించినప్పుడు బాల్ విసురుకోవడం ఏంటా అని అనుకున్నాను. గేమ్ నేర్చుకున్న తరువాత తెలిసింది దీని విలువ ఏంటో. గతేడాది మా కళాశాల నుంచి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నా చాలా సులువుగా నేర్చుకోవచ్చు. –కే గణేష్, షూటింగ్‌బాల్ క్రీడాకారుడు, ప్రగతి వ్యాయామ కళాశాల ఎంపీఈడీ విద్యార్థి, కొత్తవలస మండలం అవకాశాలు ఎక్కువ దేశంలో క్రీడామంత్రిత్వశాఖ గుర్తించిన అన్ని క్రీడలతో సమానంగా షూటింగ్బాల్కు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో దీనిపై శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. వ్యాయామ విద్యలో షూటింగ్బాల్ను భాగం చేయాలని ప్రభుత్వాన్ని మా పెద్దలు ఇప్పటికే కోరారు. –పి.ప్రసాద్, షూటింగ్‌బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి -
విషాదం: నాయనమ్మ వెంటే మనవడు..
ఎస్.కోట రూరల్: ఎస్.కోట పట్టణంలోని గౌరీశంకర్ కాలనీలో ఓ ఇంట విషాదం నెలకొంది. శుక్రవారం అర్థరాత్రి 12 గంటల సమయంలో కాలనీకి చెందిన వెదురుపల్లి కాసులమ్మ (90) అనే వృద్ధురాలు అనారోగ్యంతో మృతిచెందింది. ఆమె మనుమడు దివ్యాంగుడైన వెదురుపర్తి వీరాచారి (45) శుక్రవారం ఉదయం నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నాడు. శనివారం ఉదయం 6 గంటలకు ఆయన నిద్ర లేచేసరికి మీ నాయనమ్మ మృతిచెందిందని భార్య కామాక్షి తెలిపింది. అంతే.. ఆయన గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు విడిచారు. గంటల వ్యవధిలో ఒకే ఇంట్లో ఇద్దరు మరణించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. కరోనా భయంతో వీరిద్దరి మృతదేహాలను శ్మశానానికి తరలించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. పోలీసులకు సమాచారమిస్తే.. పంచాయతీ అధికారులు, పారిశుద్ధ్య సిబ్బందికి తెలియజేయాలని, పంచాయతీ వారికి తెలియజేస్తే కాంట్రాక్టు పారిశుద్ధ్య సిబ్బంది సమ్మెలో ఉన్నారని, పర్మినెంట్ సిబ్బందిలో ఏడుగురు మహిళలేనంటూ జవాబిచ్చినట్టు మృతుల కుటుంబ సభ్యులు వాపోయారు. చివరకు మృతుని బంధువుల్లో వైద్యశాఖలో పనిచేసే ఒక వ్యక్తి రెండు పీపీఈ కిట్లు తెప్పించి మృతదేహాలను బయటకు తీయించారు. ఇదే సమయంలో సమాచారం అందుకున్న తహసీల్దార్ ఎల్.రామారావు కాలనీకి చేరుకుని మృతుల కుటుంబాలను పరామర్శించారు. మృతదేహాలను తోపుడు రిక్షాలపై శ్మశాన వాటికకు తరలించారు. దగ్గరుండి దహనసంస్కారాలు పూర్తిచేయించారు. మృతుల కుటుంబ సభ్యులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించాలని సచివాలయ ఏఎన్ఎంను ఆదేశించారు. రోడ్డున పడిన కుటుంబం పుట్టుకతో మూగ, చెముడుతో బాధపడుతున్న వీరాచారి టైలర్ వృత్తిలో కొనసాగుతున్నాడు. ఆయనకు భార్య కామాక్షి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇంటి వద్దనే మహిళలకు ఫ్యాషన్ డ్రెస్సులు కుడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. తల్లి సంవత్సరం కిందటే మరణించింది. తండ్రి, తమ్ముడు ఆనంద్, వీరాచారి కుటుంబాలు ఒక ఇంట్లోనే నివసిస్తున్నాయి. వీరాచారి మరణంతో కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కును కోల్పోయామంటూ మృతుని భార్య కామాక్షి బోరున విలపిస్తోంది. -
ప్లాస్మాదానం.. నిలిచే ప్రాణదీపం
పార్వతీపురం టౌన్: కరోనా రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా... ఎక్కడో ఏదో చిన్న పొరపాటువల్ల కొందరికి అనూహ్యంగా సోకుతోంది. వారు సమయానుకూలంగా చికిత్స పొంది... కోలుకుంటే మరికొందరు రోగులు కోలుకోవడానికి తోడ్పడగలరని తెలుసా... అవును అక్షరాలా నిజం. కరోనానుంచి కోలుకున్నవారి నుంచి సేకరించిన ప్లాస్మా క్రిటికల్ కండిషన్లో ఉన్న కరోనా రోగులకు ప్రాణం పోస్తుంది. కొత్త జీవితాన్నిస్తుంది. దీనిపై విస్తృతంగా ప్రచారం ఊపందుకుంటోంది. ప్లాస్మా దానంపై అవగాహన పెరుగుతోంది. (ప్లాస్మా థెరపీపై ఎలాంటి అపోహలు వద్దు: ఆళ్ల నాని) ప్లాస్మా థెరపీ అంటే ఒక వ్యక్తి వైరస్ ఇన్ఫెక్షన్కు గురైనపుడు వ్యాధి నిరోధక వ్యవస్థలోని అంటే రక్తంలోని బిలింఫో సైట్స్ కణాలు కొన్ని యాంటీ బాడీలు కొన్ని రకాల ప్రోటీన్లను విడుదల చేస్తాయి. ఇవి వైరస్‌తో పోరాడి వైరస్‌ను నాశనం చేయడంతో సహాయ పడతాయి. ఆ రోగి కోలుకున్న తరువాత కూడా రక్తంలోని యాంటీబాడీలు వైరన్‌ను నియంత్రించడానికి సహాయ పడతాయి. వైరస్‌బారిన పడి కోలుకున్న వ్యక్తి నుంచి ప్లాస్మాను సేకరించి వైరస్‌తో బాధపడుతున్న వ్యక్తి శరీరంలోకి పంపడం ద్వారా వ్యాధిని తగ్గించే ప్రక్రియనే ప్లాస్మాథెరఫీ అంటారు. కోవిడ్–19నుంచి కోలుకుంటున్న వారు స్వచ్ఛందంగా ఫ్లాస్మా దానం చేసి మరొక ప్రాణం కాపాడాలని వైద్యులు కోరుతున్నారు. ప్లాస్మా దానం చేసినవారికి ప్రభుత్వం రూ.5వేలు ప్రోత్సాహకం కూడా అందస్తుండటంతో కరోనా పేషెంట్లు కోలుకుని ప్లాస్మా దాతలుగా మారుతున్నారు. తాము జీవిస్తూ మరి కొన్ని జీవితాలకు వెలుగునిస్తున్నారు. వెబ్సైట్ల ద్వారా కూడా ప్లాస్మా దానం కోలుకున్న పాజిటివ్ రోగులందరూ సానుకూల దృక్పథంతో ఓ మంచి పనికి శ్రీకారం చుట్టారు. కోలుకున్నవారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్లాస్మా డోనేట్ చేసేలా ఈ సైట్లో ఒక ప్రత్యేక సెక్షన్‌ని ప్రారంభించారు. ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత, ఫెండ్స్ 2 సపోర్ట్ ఫౌండర్ షేక్ షరీఫ్ తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. పాజిటివ్ రోగులందరూ ఈ వెబ్సైట్లో ప్లాస్మాదాతలుగా పేర్లు నమోదు చేసుకోవచ్చు. కొన్ని ప్రత్యేకమైన బ్లడ్ గ్రూపుల వారికి ప్లాస్మా దొరకడం చాలా కష్టమైన పని. ఈ సైట్లో కనుక పేరు నమోదు చేసుకుంటే పని సులభమవుతుంది. 2005లో షరీఫ్ ప్రారంభించిన ఈ సైట్ద్వారా కోవిడ్ రోగులకు ప్లాస్మా డోనేషన్ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. కోవిడ్ రోగులకు, బంధువులకు ప్లాస్మా దానం ఎవరు చేస్తారు. వారి వివరాలు ఎలా సేకరించాలి. అనేదానిపై అవగాహన ఉండదు. అటువంటి వారికి ఈ సైట్ సహాయకారిగా ఉంటుంది. ఈ వెబ్‌సైట్‌ను వారం రోజులపాటు ట్రయల్‌రన్ నిర్వహించారు. ప్రస్తుతం ఈ సైట్లో ఆరు దేశాల నుంచి 5లక్షల మంది సాధారణ రక్తదాతలు స్వచ్ఛందంగా తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ప్లాస్మా దానం చేయాలనుకున్నవారు ఆండ్రాయిడ్ యాప్ ద్వారా కాని, వెబ్సైట్ ద్వారాగాని నమోదు పేరు చేసుకోవచ్చు. అపోహలు వద్దు.. కరోనాను జయించిన వ్యక్తులు అపోహలు వీడి ప్లాస్మా దానం చేయడం వల్ల ఎటువంటి హానీ ఉండదు. వారు చేసే దానం వల్ల మరొకరికి కొత్త జీవితాన్ని ఇచ్చినవారవుతారు. కరోనాను జయించిన వారంతా ప్లాస్మా దానం చేయడం మంచిది. కరోనాతో తీవ్రస్థాయిలో బాధపడుతున్న వారికి మీరిచ్చిన ప్లాస్మా త్వరగా కోలుకునేందుకు తోడ్పడుతుంది. ఇది కూడా రక్తదానం లాంటిదే. – డా.బి.వాగ్దేవి, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్, పార్వతీపురం -
పండు రాలిపోయింది.. పాట మిగిలింది
స్విచ్ వేస్తే తీగలోకి విద్యుత్ ప్రవహించినట్టు.. ఆ పాట నరనరానా ఉత్తేజం నింపుతుందని రాచకొండ అన్నారు. అదిగో ఆ ఉత్తేజప్రసార వాగ్గేయకారుడు వంగపండు అకస్మాత్తుగా పాటను మనకొది లేసి వెలిపోయేడు. ఇపుడాయన గురించి వలపోతలు, తలపోతలు, జేజేలు, ఆహాలు, ఓహోలు... అన్నన్నాలు... యేమలగాలు.. చ్చొచ్చోలు.. వినబడుతున్నాయి. కొందరు వంగపండు పాటలో వసంతకాల గానాన్ని వెదకపూనుకున్నారు. మరి కొందరు–వసంతకాల మేఘఘర్జనలు ఇపుడా పాటగానిలో గానీ, పాటలో గానీ లేవనీ; ఏ ప్రజల కోసం ఆ పాట అంత శక్తివంతమయ్యిందో ఆ ప్రజలను వొదిలాక పాట శక్తిని కోల్పోయిందనీ, పాటగాడు వొంటరయ్యేడనీ... వొంటరిగా వెళిపోయాడని– విప్లవ కోర్టుపీఠాల మీంచి యే పీఠానికి ఆ పీఠం తీర్పుల ప్రకటనలిచ్చేశాయి. చాన్నాళ్ళకిందట ఒకాయన–అమాయక జానపద ఎర్రజెండా–వంగపండు అని వ్యాఖ్యానించేడు. అవును.. వంగపండు అమాయక జానపద ఎర్రజెండా! అమాయకుడుగాబట్టే–అప్పుడుకి సిలకల రెక్కలిరిగి, ఊపిర్లాగి నేలకొరిగినాయి, పిల్లుల వేటలో యెలకలు కొన్ని సనిపోయినాయి. మరికొన్నిబోనుల్ల బందీ ఐనాయి. ఆకు తెంపితే ఆదివాసీ నెత్తురు సుక్కలుసుక్కలుగా కారుతున్న రోజులవి. కోరన్న, మంగన్న నుంచి జరుగుబాటు కోసం తిరుగుబాటు నేర్పిన గురువులు దాకా యెందరో వొరి గిన సమయమది. జెండా పీలికలు పీలికలయ్యింది. యెవులే పీలికకి లీడరో? ఏ రోడ్ యెటు తీసకపోతాదో అంతా తికమక మకతికగ ఉన్న సమయాన తికమకలూ, మకతికల్లేకుండా–ఏమ్ పిలడో యెల్దుమొస్తవా, శికాకుళంలో సీమకొండకని పిలుస్తూ, శికాకుళం బయలెళ్ళిపోనాడు.. సుత్తీకొడవలి గురుతుగ ఉన్న ఎర్రని జెండాని పట్టుకొని! ఉడుపు మళ్ళల్లో వినిపించే ఉడుపుగత్తెల నోమీనోమన్నలు, పశుల కాపర్ల గొంతులు తెగే రాగాలు.. బాల్యం లోనే వంగపండు వొంటిని పట్టేయి. ఉపాధి కోసం ఐటీఐ చేసి విశాఖపట్నం చేరాడు. పల్లె రైతు బతుకు నుంచి పట్నపు కార్మిక బతుకులోకి వొచ్చేడు. అపుడు పుట్టిందే.. సుత్తీకొడవలి గురుతుగ ఉన్నా ఎర్రని జెండా పాట. కార్మిక గీతాలతో విశాఖలో మార్మోగిన వంగపండు గొంతు తొలిసారిగా పార్వతీపురంలో ‘వొత్తన్నాడొత్తన్నాడు.. ఆ భూములున్న బుగతోడు, పోలీసుల తోడుతోను, అడుగడుగో అటుసూడు..’ అని చేత చిరతలతో, కీచుగొంతుతో వేలాది జనానికి వినిపించేడు. వేలాది జనం ఆ రోజు మహాకవి శ్రీశ్రీ కోసం వచ్చేరు. జనం వంగపండు పాటకు వన్స్‌మోర్ కొట్టేరు. శ్రీశ్రీ– ఇప్పుడు కావాల్సిన కవిత్వమిదీ అని వంగపండుని పొగిడేరు. అమాయక జానపదుడు కాబట్టి శ్రీశ్రీలాగా.. ఇకముందు పాటని నేను నడుపుతాను. ఈ యుగం నాది అనన్లేదు. ఈ పాట జనానిది అనన్నాడు. ‘రండిరో... పండరి భజనకు’ అన్న భజన గీత బాణీని, భావాన్ని ప్రజల చైతన్య మార్గంలోకి మరల్చే పాటగా.. ‘రండిరో కూలన్నా.. సంఘం కడదామూ, ఈళ సంగతేదో సూద్దామూ..’ అని రాసేడు. పట్నం, పల్లె జీవితాల మీద పాటలు రాసేడు. మాలపేటని కళ్ళముందర పెట్టేడు. కూలోళ్ళపిల్లని లోకానికి చూపేడు. మడిలో బెడ్డలన్ని– నీ నెత్తురు గడ్డలూ, పండిన పంటలన్ని నీ సెమటా సుక్కలని రైతోడికి ఎరుక పరిస్తే; ఎంత్రమెట్టా నడుస్తు ఉందంటే... వోరన్నోలమ్మీ అని యంత్ర గమనాన్ని కార్మికునికి వినిపించేడు. వంగపండు విశిష్టతకు ఓ గొప్ప ఉదాహరణ – భూమి బాగోతం నృత్య నాటక రచన, ప్రదర్శన. తెలుగునేల అశేష పల్లెల్లో ఇంత విస్తృతంగా ప్రదర్శనలు పొందిన కళారూపం ఇటీవల మరొకటి లేదు. శ్రీకాకుళ పోరాటాన్ని శిక్కోలు యుద్ధం పేరుతో కంజరి కథ; కారా గారి ప్రసిధ్ధ కథ ‘యగ్యం’ కంజరి కథగా రాసి ప్రదర్శనలు ఇచ్చాడు. అపార కళాసంపదను లోకానికి అందించిన ఈ వాగ్గేయకారుడు అతిపేదగా జీవించి మరణించాడు. వ్యాసకర్త ప్రముఖ కథా, నవలా రచయిత ‘ఉరకవే’ అధ్యక్షుడు ‘ 94400 31961 -
‘ఏం పిల్లడో’ ఎల్లిపోయావా
సాక్షి, అమరావతి: ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవా’ అంటూ ఊరించి.. ఉరిమించి ఊరూవాడా ఏకం చేసి కవ్వించి.. కదం తొక్కించి..చెప్పకుండానే ఎల్లిపోయాడు..‘ఏం పిల్లడో ఎల్దమొస్తవా’.. అంటూ ప్రజలను చైతన్యం చేసిన ఉత్తరాంధ్ర జానపద శిఖరం, ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు (77) ఇకలేరు. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని వైకేఎం నగర్లో మంగళవారం వేకువజామున ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. వంగపండుకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. పదునైన పదాలకు సొంపైన బాణీలతో స్వయంగా కాలికి గజ్జె కట్టి ఆడి పాడే వంగపండు శ్రీకాకుళం గిరిజన, రైతాంగ పోరాటం నుంచి ఉద్భవించిన వాగ్గేయకారుడు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు సబ్ కలెక్టర్ ఎస్.వెంకటేశ్వరులు దగ్గరుండి ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా వంగపండు అంత్యక్రియలను పూర్తి చేశారు. విప్లవ గీతాలకు పెట్టింది పేరు 1943 జూన్‌లో పార్వతీపురం మండలం పెదబొండపల్లి గ్రామంలో జగన్నాథం, చినతల్లి దంపతులకు వంగపండు జన్మించారు. తన రచనలతో, పాటలతో ప్రజలను చైతన్యం చేశారు. 1972లో నాటి పీపుల్స్ వార్ సాంస్కృతిక విభాగమైన జన నాట్యమండలిని స్థాపించి 400కి పైగా జానపద గీతాలను రచించారు.అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో వంగపండు రచించిన గీతాలను ఆలపిస్తూ విప్లవ జ్యోతికి తుది వీడ్కోలు పలికారు. వంగపండు కుమార్తె ఉష వైఎస్సార్సీపీలో ఉన్నారు. రాష్ట్ర çసృజనాత్మక, సాంస్కృతిక కమిషన్ చైర్ పర్సన్ గా సేవలందిస్తున్నారు. తండ్రి మరణవార్త తెలియగానే హుటాహుటిన ఆమె పార్వతీపురం చేరుకున్నారు. తండ్రితో కలసి పలు ప్రదర్శనల్లో పాల్గొని విప్లవ గీతాలతో చైతన్యం రగిల్చారు. ఆ గుర్తులను తలచుకుని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. ఉత్తరాంధ్ర ఉద్యమానికి అక్షర సేనాధిపతి..: జగన్ ప్రజా గాయకుడు, కవి వంగపండు ప్రసాదరావు మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ‘వంగపండు ఇక లేరన్న వార్త ఎంతో బాధించింది. ఆయన వ్యక్తిగతంగా నాకు ఆప్తులు. జానపదాన్ని తన బాణీగా మార్చుకుని ‘‘పామును పొడిచిన చీమలు’’న్నాయంటూ ఉత్తరాంధ్ర ఉద్యమానికి అక్షర సేనాధిపతిగా మారారు. తెలుగువారి సాహిత్య, కళారంగాల చరిత్రలో ఆయన ఓ మహాశిఖరంగా నిలిచిపోతారు. వంగపండు కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా’’ అని సీఎం ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ సంతాపం సాక్షి, హైదరాబాద్: ప్రఖ్యాత జానపద వాగ్గేయకారుడు, గాయకుడు వంగపండు ప్రసాదరావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజల బాధలు, సమస్యలు, ప్రజా ఉద్యమాలే ఇతివృత్తంగా పాటలు రాసి, పాడి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి వంగపండు జీవితాంతం పాటుపడ్డారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
విజయా‘భివృద్ధి’మస్తు..
తరతరాల వెనుకబాటు తనాన్ని కూకటివేళ్లతో పెకిలించే గొప్ప నిర్ణయం... ఉత్తరాంధ్ర ప్రజల కష్టాలకు చరమగీతం పాడే చారిత్రక చట్టం... పురుడుపోసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన సాహసోపేత పాలనా వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోదం లభించింది. ఇకపై విశాఖపట్నం రాష్ట్ర పరిపాలనా రాజధానిగా మారనుంది. ఫలితంగా ఉత్తరాంధ్రలో విశాఖను ఆనుకుని ఉన్న విజయనగరం జిల్లాకే ప్రధానంగా ప్రయోజనం చేకూరనుంది. ఈ విషయం తెలిసి జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు, మేధావులు, ప్రజలు... ఒకరేమిటి... జిల్లా అభివృద్ధిని కాంక్షించే ప్రతిఒక్కరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఒకప్పుడు విజయనగర వైభవాన్ని చూసి ప్రపంచం మొత్తం నోరెళ్లబెట్టి చూసేది. ఇక్కడి విశేషాలను విని ఆశ్చర్యపడేది. ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారు, శ్రీరాముడు కొలువైన రామతీర్థం దేవస్థానం, తాటి పూడి రిజర్వాయర్, శంబర పోలమాంబ జాతర, విజయనగరం రాజకోట వంటి ఎన్నో అద్భుతాలు ఈ జిల్లాలో కొలువై ఉన్నాయి. గురజాడ అప్పారావు, ద్వారం వెంకటస్వామినాయుడు, ఆదిభట్ల నారాయణదాసు, కోడిరామ్మూర్తి, డి.వై. సంపత్‌కుమార్, సర్ విజ్జి, పి.సుశీల వంటి ప్రముఖులెందరికో జన్మనిచ్చిన నేల ఇది. కానీ కొన్ని దశాబ్దాలుగా జిల్లా వెనుకబాటుతనంతో వైభవాన్ని కోల్పోయింది. పాలకుల నిర్లక్ష్యం, ఉపాధి అవకాశాల కొరతతో ఎంతోమంది పేదరికంలో మగ్గిపోతున్నారు. ఉత్తరాంధ్రలో పరిపాలనా రాజధానిని ఏర్పాటు చేయడం వల్ల ఈ సమస్యలు రూపుమాపే అవకాశం లభించనుంది. విజయనగరం జిల్లాకు మరలా పూర్వవైభవం రానుంది. పరిమిత వనరులతోనే అద్భుతాలు తూర్పున శ్రీకాకుళం, దక్షిణం, పశ్చిమాన విశాఖపట్నం జిల్లాలు, వాయువ్యంలో ఒడిశా రాష్టం, ఆగ్నేయంలో బంగాళాఖాతం సరిహద్దులుగా 1979లో శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లోని కొంత ప్రాంతాన్ని కలుపుకుని విజయనగరం జిల్లా ఏర్పడింది. జిల్లా మొత్తం విస్తీర్ణం 6539 చదరపు కిలోమీటర్లు. 23.44 లక్షల మంది జనాభా ఉన్నారు. నేటికీ అక్షరాస్యత శాతం తక్కువగానే ఉంటోంది. ప్రస్తుతం అది 58.89 శాతం మాత్రమే. 68 శాతం వ్యవసాయాధారితమైన విజయనగరం జిలాలను విజయనగరం, బొబ్బిలి రెవెన్యూ డివిజన్లుగా విభజించారు. పార్వతీపురం డివిజన్ గిరిజన గ్రామాలతో కలిపి ఐటీడీఏలో ఉంది. జిల్లాలో మొత్తం 34 మండలాలు, 920 పంచాయతీలు, 1582 గ్రామాలు, విజయనగరం కార్పొరేషన్, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం పురపాలక సంఘాలు, నెల్లిమర్ల నగర పంచాయతీలున్నాయి. 51 బ్యాంకులు, 67 తపాలా కార్యాలయాలు, 66 కళాశాలలు, 16 మోడల్ స్కూళ్లు, 78 ఎన్జీఓలు, 103 హాస్పిటళ్లు ప్రజలకు సేవలందిస్తున్నాయి. గడచిన రెండేళ్లలో పోష¯ణ్ అభియాన్, గ్రామస్వరాజ్ అభియాన్, కృషి కళ్యాణ్ అభియాన్ జాతీయ అవార్డులను జిల్లా సొంతం చేసుకుంది. ఇటీవల మూడు స్కోచ్ అవార్డులను దక్కించుకుంది. పరిమిత వనరులతోనే ఇంతటి ఘనత సాధించిన జిల్లాకు మరింత ఆసరా లభిస్తే అద్భుతాలు సాధిస్తుంది. జంటనగరాలుగా విజయనగరం, విశాఖ ఉత్తరాంధ్ర అభివద్ధి కోసం విశాఖపట్నంలో పరిపాలనా రాజధానిని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభు త్వం సంకల్పించింది. ఈ ప్రక్రియ పూర్తవడంతో మొదటగా లాభపడుతున్నది మన విజయనగరం జిల్లానే. విశాఖ–విజయనగరం మధ్య దూరం చాలా తక్కువ. యాభై కిలోమీటర్లు నాన్‌స్టాప్ బస్సులో ప్రయాణిస్తే గంటంపావులో విశాఖలో ఉంటాం. ఇప్పటికే ఈ రెండు నగరాల మధ్య అనేక నిర్మాణాలు జరుగుతున్నాయి. విద్య, వ్యాపార సంస్థలు వెలిశాయి. రాజధాని వస్తే ఇవి మరింతగా పెరుగుతాయి. విశాఖ ప్రజల దాహార్తిని విజయనగరంలోని తాటిపూడి రిజర్వాయర్ తీరుస్తోంది. సీఎం క్యాంప్ ఆఫీసుతోపాటు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు విజయనగరం సరిహద్దులను ఆనుకుని ఉన్న రుషికొండ, భీమిలి, తరగపువలస, మధురవాడ ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే పలు రాష్ట్ర స్థాయి కార్యాలయాలను విజయనగరంలోనూ ఏర్పాటు చేసే అవకాశాలు లేకపోలేదు. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణం శరవేగంగా పూర్తవుతోంది. విశాఖ మెట్రోరైలును కూడా భోగాపురం వరకూ పొడిగించేందుకు కసరత్తు జరుగుతోంది. ఇవన్నీ జరిగితే విశాఖపట్నం –విజయనగరం జిల్లాలు జంటనగరాలుగా అవతరిస్తాయి. జాతీయ స్థాయి విద్యా, వ్యాపార సంస్థలు వస్తాయి. రాజధాని స్థాయి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి. ప్రజల జీవన ప్రమాణం, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఇప్పుడు ఇవే అంశాలు జిల్లా ప్రజలను ఆనందంలో ముంచెత్తుతున్నాయి. రాజధాని సమీప జిల్లా వాసులుగా మారుతున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్న జిల్లా ప్రజలు, ఇంతటి వరాన్ని తమకు అందించిన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి మనసారా కృతజ్ఞతలు చెబుతున్నారు. శ్రావణ శుక్రవారం రోజున మంచి కానుక మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో విశాఖపట్నంలో పరిపాలన రాజధాని వచ్చింది. ఉత్తరాంధ్ర ప్రజలకు శ్రావణ శుక్రవారం రోజున గవర్నర్ మంచి కానుక ఇచ్చారు. స్వాతంత్య్రం వచ్చిన దగ్గరనుంచీ నేటివరకూ వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంత రూపురేఖలు త్వరలో మారిపోతాయి. విశాఖపట్నంలో పరిపాలన రాజధాని పెట్టడం వల్ల ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ఎన్నో దశాబ్దాల తర్వాత ఈ ప్రాంత ప్రజలకు మంచి భరోసా లభించింది. గవర్నర్‌కు, ముఖ్యమంత్రి ఇక్కడి ప్రజల తరుపున కృతజ్ఞతలు చెబుతున్నాను. – బొత్స సత్యనారాయణ, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఉత్తరాంధ్రవాసుల అదృష్టం మూడు రాజధానుల ఆలోచన వచ్చిన వెంటనే అమలు చేయడానికి చర్యలు తీసుకోవడం ఉత్తరాంధ్ర ప్రజల అదృష్టం. ఇంతవరకు వచ్చిన నాయకులు వట్టిమాటలు చెప్పి ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ఉత్తరాంధ్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. హైదరాబాద్ నగరాన్నే అభివృద్ధి చేసి మిగిలిన ప్రాంతాలను వదిలేసిన నాయకులనే చూశాం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందేలా ముఖ్యమంత్రి నిర్ణయం ముదావహం. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటారు. – పాముల పుష్పశ్రీవాణి, డిప్యూటీ సీఎం అన్ని ప్రాంతాల అభివృద్ధికి అవకాశం... రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో మూడు రాజధానుల ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి జరగాలన్న ఉద్దేశంతో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్ ఆమోదించడం శుభపరిణామం. విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా ఉండటం వల్ల వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధికి అవకాశం ఉంటుంది. బోగాపురం ఎయిర్‌పోర్టు, ఫిషింగ్ హార్బర్, గిరిజన యూనివర్శిటీ రావడం వల్ల నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధికి కొదవుండదు. – బెల్లాన చంద్రశేఖర్, విజయనగరం ఎంపీ వెనుకబాటు ఉండదు విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని చేయడం ఉత్తరాంధ్ర ప్రజల పూర్వ జన్మసుకృతం. అత్యంత వెనకబడిన ప్రాంతంగా ఉన్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఇది గొప్ప వరం. పేదరికం, వలసలు ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్రలోనే ఉపాధి మెరుగవుతుంది. వలస బాధ ఉండదు. ఉత్తరాంధ్ర ప్రజల తరపున సీఎం జగన్మోహన్రెడ్డికి కృతజ్ణతలు. – శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, వైఎస్సార్సీపీ అరకు పార్లమెంటరీజిల్లా అధ్యక్షుడు -
అశోక్ గజపతిపై సంచయిత ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, విజయనగరం : అశోక్ గజపతిరాజుపై సింహాచలం దేవస్ధానం చైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవస్థానం అభివృద్ధి కంటే రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు. కేంద్రమంత్రిగా ఉండికూడా కనీసం అభివృద్ధి చేయడానికి ప్రయత్నించలేదని విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో నేషనల్ మిషన్ ఆన్ పిలిగ్రిమేజ్ రెజువినేషన్ అండ్ స్పిర్చువల్ అజ్‌మెంటేషన్ డ్రైవ్(ప్రసాద్) స్కీమ్‌కు తిరుపతి, శ్రీశైలం దేవస్థానాలను గుర్తించినా.. గతంలో సింహాచలం దేవస్థానాన్ని ఎందుకు ప్రతిపాదించలేనది నిలదీశారు. కేంద్రం, రాష్ట్రంలోనూ వారే అధికారంలో ఉన్నారని అయినా కూడా కనీస ప్రయత్నం చేయలేదని విమర్శించారు. అప్పటి ముఖ్యమంత్రిచంద్రబాబు, కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుకి నిజమైన ప్రేమ ఉంటే కేంద్రానికి ప్రతిపాదనలు పంపేవారు కదా అని వ్యాఖ్యానించారు. గురువారం మీడియాతో మాట్లాడిన సంచయిత.. మన్సాస్ అభివృద్ధిపై గత ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని తప్పుపట్టారు. (సంచయిత గజపతి రాజుకు కేంద్రం ప్రశంసలు) ప్రధాని, సీఎంకు కృతజ్ఞతలు.. నేషనల్ మిషన్ ఆన్ పిలిగ్రిమేజ్ రెజువినేషన్ అండ్ స్పిర్చువల్ అజ్‌మెంటేషన్ డ్రైవ్(ప్రసాద్) పథకానికి సింహాచలం దేవస్థానాన్ని ఎంపిక చేస్తున్నట్లు కేంద్రం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర పర్యాటక మంత్రి ప్రహ్లాద్ పటేల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్‌కు ప్రత్యేక కృతజ్ణతలు తెలిపారు. ‘దేవస్థానం భూముల్లో మొక్కల పెంపకంలో ఎకరానికి లక్ష రూపాయిలిచ్చే స్కీమ్‌ని కేంద్రం ప్రవేశపెట్టినా గత పాలకులు అప్పట్లో నిర్లక్ష్యం చేశారు. ప్రసాద్ స్కీమ్‌లో సింహాచలం దేవస్ధానాన్ని చేర్చాలని ఎందుకు ప్రతిపాదించలేదు. సింహాచలం దేవస్ధానంలో వృధాగా ఉన్న వేలాది ఎకరాలలో ఈ పధకం క్రింద అభివృద్ది చేసే అవకాశాన్ని అశోక్ గజపతిరాజు ఎందుకు పట్డించుకోలేదు. ఉత్తరాంద్రతో పాటు సింహాచలంపై చంద్రబాబు, అశోక్ గజపతిల కపటప్రేమ ఉత్తరాంధ్ర ప్రజలు గమనించాలి. అతి పురాతనమైన మోతీ మహల్‌ని రాత్రికి రాత్రే కూల్చేశారు. (అవకాశం వస్తే రాజకీయాల్లోకి: ఊర్మిళ) అన్ని విమర్శలకి సమాధానం చెబుతా మోతీ మహల్ లాంటి పురాతన కట్టడాల అభివృద్దికి కేంద్రం నిదులిచ్చే అవకాశం ఉన్నా కూడా ఎందుకు కూల్చేశారు. కేంద్ర, రాష్డ్ర ప్రభుత్వాల సహకారంతో సింహాచలం దేవస్ధానాన్ని పూర్తిగా అభివృద్ది చేస్తాను. ప్రసాద స్కీమ్ లో సింహాచలం దేవస్ధానం ఎంపికకావడం చాలా సంతోషం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపటం వల్లే కేంద్రం ఈ స్కీమ్ లో సింహాచలం దేవస్ధానానికి అవకాశం కల్పించింది. మార్చ్ నెలలో కేంద్ర పర్యాటక మంత్రిని కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలని ఫాలో అప్ చేశా. ఈ పధకంలో కేంద్రం ఇచ్చే నిధులతో భక్తులకి మెరుగైన సౌకర్యాలు కల్పించగలుగుతాం. గత చైర్మన్ అశోక్ గజపతిరాజు సింహాచలంపై భక్తులకి మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం నాకు చైర్ పర్సన్ గా అవకాశం ఇచ్చారు. సింహాచలం దేవస్ధానం అభివృద్ది చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నా. నా పనితీరు ద్వారానే నాపై విమర్శలు చేస్తున్న వారికి సమాధానం చెబుతాను. (మళ్లీ తెరపైకి విజయనగర సామ్రాజ్యం) -
శానిటైజర్ వాడుతున్నారా...
శృంగవరపుకోట రూరల్: కరోనా వైరస్ వ్యాప్తితో చేతుల పరిశుభ్రతకు ప్రాధాన్యం పెరిగింది. ఎక్కడికి వెళ్లినా శానిటైజర్ రాసుకోవడం, సబ్బు నీళ్లతో కడగడం షరా మామూలుగా మారింది. స్నేహితులు, సన్నిహితులను కలిసి రాగానే చేతులకు శానిటైజర్ రాసుకోవడం పరిపాటైంది. పిల్లల చేతులను సైతం శానిటైజర్‌తో శుభ్రం చేస్తున్నారు. వంట చేసే సమయంలోనూ శానిటైజర్‌ను రాసుకోవడం మానడం లేదు. అయితే.. శానిటైజర్‌తో ఎంత ప్రయోజనం ఉందో అంతే నష్టం కూడా ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని వైద్యులు చెబుతున్నారు. ప్రధానంగా గృహిణులు, పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. శానిటైజర్లు ఎందుకంటే.. బిజీగా ఉన్న జీవితంలో అన్ని పనులు త్వరత్వరగా చేస్తుంటాం. చేతులు శుభ్రం చేసుకోకుండా కొన్నిసార్లు ఆహార పదార్థాలు తింటూ ఉంటాం. ఇది మంచిది కాదు. ఎందుకంటే, ప్రతిరోజు మన చేతిలో ఒక మిలియన్ క్రిములు నిండిపోతాయి. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఎప్పుడూ సబ్బు నీటితో చేతులు కడుక్కోవడం సాధ్యం కాదు. కాబట్టి చాలామంది శానిటైజర్లను వాడుతుంటారు. ఇందులో మద్యం ఆధారిత హ్యాండ్ శానిటైజర్ల వినియోగం ఎక్కువగా ఉంది. ఈ హ్యాండ్ శానిటైజర్లని వాడితన తర్వాత నీరు అవసరం లేదు. సాధారణ సబ్బు, నీరు లేకుండానే.. చేతులని శుభ్రం చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల చేతుల్లోని క్రిములు చాలా వరకు నశిస్తాయి. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో వీటి వాడకం మరింత ఎక్కువైంది. మండే స్వభావం.. శానిటైజర్లలో 60–90శాతం ఆల్కహాలు కలిసి ఉంటాయి. అదే క్రిముల్ని సంహరిస్తుంది. ఈ మిశ్రమానికి వంద డిగ్రీల కంటే తక్కువ వేడిలో మండే స్వభావం ఉంటుంది. ఇది చేతికి రాసుకున్న వెంటనే వంట గదిలోకి వెళ్లి గ్యాస్ స్టవ్ వెలిగిస్తే నిప్పు అంటుకునే ప్రమాదం పొంచి ఉంది. అందువల్ల గృహిణులు చేతికి శానిటైజర్ రాసుకుని అది ఆరిన తర్వాతే వంట చేసే పనులు చేయడం మేలు. పిల్లల విషయంలో... శానిటైజర్ల వినియోగం ద్వారా సమస్యలు వస్తాయని అంతర్జాతీయ పరిశోధన సంస్థ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రి వెన్షన్ సెంటర్ నివేదికలు సూచిస్తున్నాయి. పదేళ్ల లోపు పిల్లలు వినియోగించే సమయంలో తగిన జా గ్రత్తలు తీసుకోవాలి. ఐదేళ్ల లోపు వారికి చర్మ సంబంధిత సమస్యలు వస్తున్నట్టు వైద్య నిపుణులు గుర్తించారు. ఎలాంటి శానిటైజర్లు మేలు.. జిగురు, నురుగు మాదిరి కంటే ద్రావణంగా ఉండే శానిటైజర్లే మంచిది. చేతుల్లో వేసుకుని రుద్దుకున్న తర్వాత ఒక నిమిషంలో అది ఆవిరవ్వాలి. అలా కాకుండా చేతులకు అంటుకుని ఉంటే చర్మ సంబంధమైన సమస్యలు వస్తాయి. శానిటైజర్లతో 60–90 శాతం ఆల్కహాల్ ఉండాలి. అంతకంటే తగ్గినా, ఎక్కువగా ఉన్నా ఆశించిన ఫలితం రాకపోగా కొత్త సమస్యలు వస్తాయి. కనీసం 20–30 సెకన్ల పాటు చేతులకు రుద్దుకోవాలి. సబ్బుతో కడుక్కుంటే మేలు.. శానిటైజర్ల వాడకంపై విస్తృతంగా ప్రచారం జరగడంతో పలు నాసిరకం శానిటైజర్లు మార్కెట్లోకి వచ్చాయి. వాటి గాఢత ఎక్కువ ఉండటంతో ఇబ్బందులు తలెత్తే ప్రమాదముంది. శానిటైజర్ల ధరలు సైతం ఎక్కువగానే ఉన్నాయి. సబ్బు అయితే తక్కువ ధరలో లభ్యమవుతుంది. చేతులు పూర్తిస్థాయిలో శుభ్రమవుతాయి. వైద్యులు సైతం సబ్బుతో చేతులు శుభ్రం చేసుకునేందుకు ప్రాధాన్యమివ్వాలని సూచిస్తున్నారు. -
అవకాశం వస్తే రాజకీయాల్లోకి: ఊర్మిళ
సాక్షి, విజయనగరం: తన తండ్రి మరణం అనంతరం అశోక గజపతిరాజు అనేక రాజకీయ కుట్రలకు ప్రయత్నించారని ఆనంద గజపతిరాజు, సుధా కూతురు ఊర్మిళా గజపతిరాజు విమర్శించారు. సింహాచలం దేవస్థానం, మాన్సాస్ ట్రస్ట్ విషయంలో మా బాబాయ్ రాజకీయం చేయడం తమను ఎంతో బాధించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మాన్సాస్ ట్రస్ట్ నుంచి తమను ఉద్దేశపూర్వకంగా దూరం చేయాలని అనేక ప్రయత్నాలు చేశారని అన్నారు. తన తండ్రి మరణం అనంతరం ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తున్నా అని, భవిష్యత్‌లో అవకాశం వస్తే తప్పనిసరిగా రాజకీయాల్లో దిగుతానని ఊర్మిళ తెలిపారు. అనంద గజపతి రాజు 70వ జన్మదినం సందర్భంగా ఆమె సాక్షి టీవీతో మాట్లాడారు. (సంచయితపై బాబు, అశోక్ రాజకీయ కుట్ర) ‘నాన్న ఆనంద గజపతిరాజు గారు నిత్యం ప్రజల కోసం ఆలోచించే వారు. ఆనంద గజపతిరాజు చాలా సాధారణ జీవితం గడిపారు. ఆయన ఎప్పుడూ పీవీజీ రాజు (తాత) ఆశయాలను కొనసాగించడం కోసమే పనిచేశారు. అందులో భాగంగానే ఇంజినీరింగ్ కాలేజీలు స్ధాపించడం, మాన్సాస్ ట్రస్ట్ బాగా నడిపించడం చేశారు. మెడికల్ కాలేజీ పెట్టాలి అనేది నాన్నగారి కల. ఆయన బ్రతికి ఉండి ఉంటే తప్పనిసరిగా మెడికల్ కాలేజీ నిర్మించేవారు. కుటుంబ సభ్యులను కాకుండా ఆయన దగ్గర పనిచేసే వారిని కూడా చాలా బాగా చూసుకునే వారు. మా నాన్న మరణించేటప్పటికి నా వయసు 16 సంవత్సరాలు. మా బాబాయ్ మా నాన్న మరణం తర్వాత ట్రస్ట్ బాధ్యతలు చేపట్టడానికి మాకు అర్హత లేదన్నారు. (చంద్రబాబుకు సంచయిత గట్టి కౌంటర్!) తాతగారు ఏ ఉద్దేశంతో ట్రస్ట్ పెట్టారో మా నాన్న ఆనంద గజపతిరాజు దాన్ని అలాగే కొనసాగించారు. దురదృష్టవశాత్తు నాన్న మరణం తర్వాత బాబాయి ఆ ఉద్దేశంతో ట్రస్ట్ కొనసాగించలేదు. అశోక్‌ను చైర్మన్‌గా టీడీపీ ప్రభుత్వం జీవో ఇచ్చిన సమయంలో కనీసం మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు. ప్రభుత్వం ఇచ్చిన జీవో మమ్మల్ని బాగా బాధ పెట్టింది. ఆ జీవోని ఉపయోగించుకుని మమ్మల్ని ట్రస్ట్‌కు దూరం చేశారు. నాన్న మరణం తర్వాత సింహాచలం దేవస్థానం వేడుకలకు ఆహ్వానించడం జరగలేదు. భవిష్యత్తులో మా నాన్న, మా తాత గారు లా ప్రజలకు సేవ చేస్తా. అవకాశం వస్తే తప్పనిసరిగా రాజకీయాల్లోకి వస్తా’ అంటూ తన మనసులోని మాటను చెప్పారు. -
సంచయితపై బాబు, అశోక్ రాజకీయ కుట్ర
సాక్షి, విజయనగరం : మరోసారి విజయనగరం రాజుల పోరు తెరపైకి వచ్చింది. వివాదంగా మారిన మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారాలపై చైర్ పర్సన్ సంచయిత జోక్యం చేసుకోవడాన్ని అశోక్ గజపతిరాజు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో చంద్రబాబుతో కలిసి తరచూ సంచయిత గజపతిరాజుపై ఎదురుదాడికి దిగుతూ విమర్శలు చేస్తున్నారు. అయితే తానే అసలైన వారసురాలినని, తనకు ప్రజా సేవే ముఖ్యమంటూ దూకుడుగా వెళ్తున్న సంచయితపై బురద జల్లేందుకు టీడీపీ శతవిధాల ప్రయత్నిస్తోంది. గత కొన్నినెలలుగా వివాదంలో నలుగుతున్న పేరు విజయనగరం మాన్సాస్ ట్రస్ట్. ఒకప్పుడు ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగిన ఈ ట్రస్ట్ గడిచిన అయిదారేళ్లగా పూర్తిగా అవినీతిలోనే కూరుకుపోయింది.. తాజాగా ఈ ట్రస్ట్ కి చైర్ పర్సన్‌గా దివంగత ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయిత గజపతిరాజు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అశోక్ గజపతిరాజు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గత కొన్ని నెలలుగా మాన్సాస్ లో జరిగిన అక్రమ వ్యవహారాలను వెలికి తీసేందుకు చైర్ పర్సన్ సంచయిత చేస్తున్న ప్రయత్నాలు ఆమె వ్యతిరేకులకి మింగుడుపడటంలేదు. (చంద్రబాబు టార్గెట్ చేస్తున్నారు: సంచయిత) చంద్రబాబుకు సంచయిత గట్టి కౌంటర్ ఇప్పటికే సంచయిత గజపతిరాజుకి చైర్ పర్సన్‌గా అర్హత లేదంటూ కోర్టుని ఆశ్రయించిన ఆమె బాబాయి అశోక్ గజపతిరాజు గత కొన్ని నెలలుగా చంద్రబాబుతో కలిసి కుట్ర రాజకీయాలకి పాల్పడుతున్నట్లు సంచయిత ఆరోపిస్తున్నారు. దీనికి నిదర్సనంగా రెండు రోజులక్రితం చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా చేసిన విమర్సలు అద్దం పడుతున్నాయి. ట్రావెన్ కోర్ మాదిరిగానే వారసులుకే మాన్సాస్ ట్రస్ట్ బాధ్యతలు అప్పగించాలంటూ చంద్రబాబు చేసిన ట్వీట్‌కు సంచయిత గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. పీవీజీ రాజు గారి అసలైన వారసులు తన తండ్రి ఆనంద గజపతిరాజు అయితే ఆయన అసలైన వారసురాలు తానేనని ఘాటుగా రీట్వీట్ చేశారు. ప్రభుత్వం మాన్సాస్ ట్రస్ట్ విషయంలో అసలైన వారసులనే నియమించిందంటూ చురకలు అంటించారు. ఇప్పటికైనా చంద్రబాబు మాన్సాస్ ట్రస్ట్ పై రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. (చంద్రబాబుకు సంచయిత గట్టి కౌంటర్!) అశోక్ గజపతిరాజు అసలైన కోణం వాస్తవానికి గత ఏడాది సింహాచలం దేవస్ధానంతో పాటు మాన్సాస్ ట్రస్ట్ బోర్డు చైర్ పర్సన్‌గా ఆనంద గజపతిరాజు వారసురాలిగా సంచయిత గజపతిరాజుకి నియామకం చేయడాన్ని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు జీర్ణించుకోలేకపోయారు. చిన్న వయస్సులో తన అన్న కూతురుకి ఆ అవకాశం రావడంపై హర్షించాల్సిన అశోక్ గజపతిరాజు తనలోని అసలైన కోణాన్ని బయటపెడుతూ వ్యతిరేకించారు. ఆమెకు తమ కుటుంబంతో సంబంధం లేనట్టుగా.. తామొక్కరే పీవీజీ రాజు వారసులిగా ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ విషయంలో మరో ముందడుగు వేసి న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. వాస్తవానికి సంచయిత గజపతిరాజు గత కొన్ని సంవత్సరాలుగా సన అనే స్వచ్చంద సంస్ధను స్ధాపించి విశాఖ, ఢిల్లీ తదితర ప్రాంతాలలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అప్పట్లో టీడీపీ మంత్రులు, ఎంపీలు సైతం ఈమె సేవా కార్యక్రమాలలో పాల్గొని అభినందించిన సంధర్బాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పటివరకు సేవా కార్యక్రమాలను ప్రశంసించిన నేతలే ఆమెపై తాజా ఎదురుదాడికి పాల్పడుతూ విమర్శలు చేయడం ఆశ్చర్యం కలిగించకమానదు. (బాబాయ్ భ్రష్టు పట్టించారు) తండ్రి చితిమంటలు పూర్తిగా ఆరకముందే అయితే ఆమె మాన్సాస్ ట్రస్ట్‌కి చైర్ పర్సన్‌గా నియమితులైన తర్వాతే టార్గెట్ చెస్తూ టీడీపీ విమర్శలకు దిగడం ప్రారంభించింది. ఇదే సమయంలో తరచూ తనపై చేస్తున్న కుట్రలు, ఆరోపణలపై చైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు అదే రీతిలో గట్టిగానే సమాధానాలు ఇచ్చేవారు. అయితే గత కొద్ది రోజులగా టీడీపీ తనపై ఉద్దేశ పూర్వకంగా విమర్శలు చేస్తోందని, ఎన్టీఆర్ మహిళలకి సమాన హక్కులు కల్పిస్తే చంద్రబాబు, అశోక్ గజపతిలు మాత్రం లింగ వివక్ష చూపుతున్నారని అన్నారు. ఇదే సమయంలో మాన్సాస్‌లో అక్రమాలు జరగకపోతే ఎందుకు భయపడుతున్నారని ఆమె ప్రశ్నించారు. తన తండ్రి చితిమంటలు పూర్తిగా ఆరకముందే అశోక్ గజపతి రాజుకి చైర్ పర్సన్ పదవి కట్టబెడుతూ రాత్రికి రాత్రే జీఓ ఇవ్వడం సమంజసమా అని ప్రశ్నించారు. చంద్రబాబు, తన బాబాయ్ అశోక్ గజపతిరాజులకి మాన్సాస్‌పై ప్రేమ కంటే అధికారంపై మక్కువన్నారు. నిజంగా చంద్రబాబుకి సింహాచలం దేవస్ధానంపై అభిమానం ఉంటే తన తండ్రి, తాతలా సంపాదించిన ఆస్తుల్లో 500 కోట్లు ఇవ్వగలరా అని ప్రశ్నించారు. సంచయిత గజపతిరాజు సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకి ఇచ్చిన కౌంటర్ తీవ్ర కలకలమే రేపుతోంది. ఊహించని విధంగా సంచయిత గజపతిరాజు నుంచి రీట్వీట్ ఎదురుకావడంతో చంద్రబాబు మాత్రం గప్ చుప్ అయ్యారు. -
గజపతి రాజు బిడ్డను నేను
-
చంద్రబాబు టార్గెట్ చేస్తున్నారు: సంచయిత
సాక్షి, విజయనగరం : మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్ధానం చైర్ పర్సన్‌గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ప్రతిపక్ష నేత చంద్రబాబును నాయుడు తనను టార్గెట్ చేస్తున్నారని సంచయిత గజపతిరాజు అన్నారు. చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు తరచూ ఎందుకు అసత్య ఆరోపణలు చేస్తున్నారో అర్థం కావడంలేదన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో మన్సాస్‌కు చేసిందేమీ లేదని విమర్శించారు. మాన్సాస్‌లో ఎటువంటి అక్రమాలు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. తన తండ్రి మరణించి (2016) నాలుగు రోజులు కూడా గడవకముందే చంద్రబాబు ప్రత్యేక జీఓ ఇచ్చి బాబాయ్ అశోక గజపతిరాజును చైర్మన్‌గా నియమించడం దారుణం కాదా అని నిలదీశారు. (మా కుటుంబం జోలికి రావొద్దు: సంచయిత) సంచయిత ఇప్పుడు ఎందుకు వ్యతిరేకమైంది టీడీపీ నేతల విమర్శల నేపథ్యంలో సంచయిత గురువారం ‘సాక్షి’ మీడియాతో మాట్లాడారు. ‘తమ కుంటుంబంపై చంద్రబాబు నాయుడతో సహా, అశోక గజపతిరాజు రాజకీయ కుట్రకు దిగుతున్నారు. మాపై వారికి ఏ మాత్రం అభిమానం ఉన్నా మా నాన్న చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులందరినీ సంప్రదించి చైర్మన్ పదవిపై నిర్ణయం తీసుకునేవారు. నా తండ్రి వయస్సున్న వారు నాపై తప్పుడు ప్రచారం చేయడం బాధగా ఉంది. సన ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన అనుభవం ఉంది. గతంలో టీడీపీ నేతలకి నచ్చిన సంచయిత ఇప్పుడు ఎందుకు వ్యతిరేకమైంది. పురాతన మోతీ మహల్‌ని పడగొట్టడానికి రాత్రికి రాత్రే టీడీపీ హయాంలో జిఓ ఇవ్వలేదా?. విజయనగరంలో మూడు లాంతర్లు అభివృద్ది చేసే సమయంలో మాత్రం తప్పుడు ప్రచారం చేయడం సమంజసమా. దేవస్ధానంలో రాజకీయాలు తీసుకురాకండి మహిళగా నాకు అవకాశం రావడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. మహిళకి అవకాశం రాకూడదని వారు కోరుకుంటున్నారు. ఎన్డీఆర్ హయాంలోనే పురుషులతో పాటు మహిళలకి సమాన అవకాశాలు కల్పించారు. ఆ విషయాన్ని చంద్రబాబు మరిచిపోయారేమో. ఎన్టీఆర్ వెన్నుపోటుపొడిచి వచ్చిన వారు ఆయన ఆశయాలు ఎలా కొనసాగిస్తారు. చంద్రబాబు, అశోక్ గజపతిరాజులు ప్రతీ విషయాన్ని రాజకీయం చేస్తున్నారు. మాన్సాస్ వ్యవహారాన్ని ట్రావెన్ కోర్తో ఎలా ముడిపెడతారు. మాన్సాస్, సింహాచలం దేవస్ధానంలో రాజకీయాలు తీసుకురాకండి. చైర్ పర్సన్‌గా ప్రజలకోసం పనిచేస్తాను. శుక్రవారం నా తండ్రి దివంగత ఆనంద గజపతిరాజు 70 వ పుట్టినరోజు...అది కూడా వారికి గుర్తుండకపోవచ్చు.’ అని పేర్కొన్నారు. -
సిరిమాను అధిరోహించిన పూజారి ఇకలేరు..
సాక్షి, విజయనగరం: ఎనిమిది సార్లు పైడితల్లి అమ్మవారి సిరిమానును అధిష్టించిన పూజారి తాళ్లపూడి భాస్కరరావు అనారోగ్యంతో కన్నుమూశారు. సిరిమాను అధిరోహించిన పూజారిగా ఆయన గుర్తింపు పొందారు. భాస్కరరావు మృతితో విజయనగరంలో విషాదం అలుముకుంది. 2009- 2016 మధ్య కాలంలో శ్రీపైడితల్లమ్మ సిరిమానును భాస్కరరావు అధిరోహించారు. సిరిమానుపై అధిరోహించిన పూజారిని భక్తులు అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు సంతాపం తెలిపారు. (సిరులిచ్చే తల్లి.. శ్రీపైడితల్లి) -
దేవుడి భూమిలో దోపిడీ పర్వం..!
విషాన్ని కంఠంలో దాచి లోకాన్ని కాపాడిన నీలకంఠుని భూములకే రక్షణ లేకుండా పోయింది. గతంలో ప్రజలు కట్టబెట్టిన అధికారంతో దశాబ్దాలుగా దేవుని ఆస్తిని అప్పనంగా అనుభవిస్తున్నాడు. మాజీ శాసన సభ్యుడి హోదాలో అధికారులను గద్దిస్తూ ఆలయ భూమిపై వచ్చే ఆదాయాన్ని మింగేస్తున్నా డు. ‘గద్దె’నెక్కిన నాటి నుంచి నేటికీ ఆ భూమిపై సొమ్ముజేసుకున్నది చాలక ఇప్పుడు ఏకంగా వాణిజ్య సముదాయం నిర్మాణాన్ని తలపెట్టా్టడు. రూ.కోట్లు సంపాదించాలనుకుంటున్న ఆ ‘బాబు’ భాగోతం అధికారులకు తెలిసి నోటీసులు జారీచేశారు. అప్పటికీ వినకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం–పాలకొండ ప్రధాన రోడ్డులో చీపురుపల్లి మెయిన్‌రోడ్‌ను ఆనుకుని, మూడు రోడ్ల కూడలి ఎదురుగా నీలకంఠేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన సర్వే నంబర్ 45/1లో 9 సెంట్లు స్థలం ఉంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెంటు ధర రూ.15 లక్షల పైబడి పలుకుతోంది. ఈ లెక్కన ఆ భూమి ఖరీదు రూ.1.5 కోట్లు వరకు ఉంటుందని అంచనా. మూడు, నాలు గు దశాబ్దాల కిందట ఈ స్థలంలో కొత్తకోట సరస్వతి, మా రోజు జగన్మోహిని అనే ఇద్దరు పేద మహిళలు దుకాణాలు పెట్టుకుని ఉండేవారు. ఆ తరువాత కాలంలో ఒక ప్రజాప్రతినిధి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నాడు. మూడు దశాబ్దాలుగా... ఆ స్థలంలో ఆ ప్రజాప్రతినిధికి చెందిన నటరాజ్ వైన్ షాప్ ఉండేది. దేవస్థానానికి ఆనుకుని ఉన్న ఈ స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణం నడిపేవారు. 2010లో ఈ స్థలంలో ఆక్రమణదారులను తొలగించేందుకు దేవాదాయశాఖ ప్రయతి్నంచింది. ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లింది. దేవాదాయశాఖకు ఆ స్థలాన్ని ట్రిబ్యునల్ ఖరారు చేసింది. ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ కొత్తకోట సరస్వతి, మారోజు జగన్మోహినిలు హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తు తానికి కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది. కేసు తేలనందున ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ఆ స్థలం దేవాదాయ శాఖకు చెందినదే. అయినప్పటికీ మాజీ ఎమ్మెల్యే అధికారం ముందు అధికారులు నిలువలేకపోయారు. ఎందుకంటే కోర్టులో పిటిషన్ వేసినవారి నుంచి మాజీ ఎమ్మెల్యే స్థలాన్ని తీసుకున్నారు. 2010 నుంచి ఇంతవరకు దేవాదాయశాఖకు కనీసం అద్దె కూడా చెల్లించలేదు. సుమారు రూ.4 లక్షలు అద్దె బకా యిలు కూడా అలానే ఉన్నాయి. అద్దెలోనూ పెత్తనమే.... గత ఏడాది కాలంగా ఈ స్థలంలో ఉన్న నటరాజ్ వైన్‌షాపు లో ప్రభుత్వ మద్యం దుకాణాన్ని ఎక్సైజ్ శాఖ నిర్వహించింది. దీనికి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ వారు నెలకు రూ. 21 వేలు అద్దె చెల్లించేవారు. తాజాగా ఆ ప్రజాప్రతినిధి తనకు నెలకు రూ.35 వేలు అద్దె కావాలని అడగడంతో ఇటీవల మద్యం దుకాణాన్ని ఎత్తేసి వేరేచోటకు తరలించారు. ఖాళీ అయిన ఆ తొమ్మిది సెంట్ల స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఆ పెద్దమనిషి పనులు ప్రారంభించారు. నిర్మాణం పూర్తయితే దుకాణాలకు గ్రౌండ్‌ఫ్లోర్‌లో అయితే నెలకు రూ.30 వేలు, పై ఫ్లోర్లో అయితే రూ.15 నుంచి 20 వేలు వరకు అద్దెలు వస్తాయి. నోటీసులు జారీ... అనుమతి లేకుండా దేవాశాఖ భూమిలో ప్రారంభమైన నిర్మాణాలను నిలిపివేయాల్సిందిగా ఆ శాఖ అధికారులు గతంలో కోర్టుకు వెళ్లిన వారికి నోటీసులు జారీ చేశారు. చిత్రంగా నోటీసులు అందుకున్న వారు తమకు ఆ స్థలంతో ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నారు. కానీ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.. అంటే పనులను ఆ మాజీ ఎమ్మెల్యే జరిపిస్తున్నట్టు సమాచారం. దీంతో దేవాదాయశాఖ అధికారులు చీపురుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆక్రమిత స్థలంలో అక్రమ నిర్మాణాన్ని నిలువరించి ఆలయ భూమిని కాపాడాల్సిందిగా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ భూమి కోర్టులో ఉన్న అంశం కావడంతో ఉన్నతాఅధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఎస్ఐ ఐ. దుర్గాప్రసాద్ తెలిపారు. ఆ స్థలంలో నివసించడం లేదు.. ఎప్పుడో 40 సంవత్సరాల కింట ఆ స్థలంలో మా నాన్న ఉన్నప్పుడు దుకాణాలు ఉండేవి. ఆ తరువాత ఆ స్థలాన్ని మా తమ్ముడికి మా నాన్న ఇచ్చారు. మా తమ్ముడు ఎవరికైనా అమ్మేసాడో లేక ఇచ్చేసాడో తెలియదు. ఎప్పుడూ మాకే నోటీసులు వస్తాయి. శనివారం కూ డా దేవాదాయశాఖ అధికారులు నోటీసులు పంపించారు. ఇప్పుడు మేము ఆ స్థలానికి పక్కన చిన్న బడ్డీలో అరటి పండ్లు, పూజ సామగ్రి వ్యాపారం చేసుకుంటున్నాం. మాకు ఆ స్థలంతోను, అక్కడ జరుగుతున్న నిర్మాణంతో ఎలాంటి సంబంధం లేదు. – కొత్తకోట సరస్వతి, దేవాదాయశాఖ నోటీసు అందుకున్న మహిళ, చీపురుపల్లి నోటీసులు ఇచ్చాం.. ఫిర్యాదు చేశాం: నీలకంఠేశ్వరస్వామి దేవస్థానం స్థలంలోని సర్వే నంబర్ 45/1లో కట్టడాలు నిలిపివేయాలని కొత్తకోట సరస్వతి, మారోజు జగన్మోహినిలకు ఈ నెల 4న నోటీసులు ఇచ్చాం. వారు గతంలో కోర్టును ఆశ్రయించారు. ఇంకా కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు రాలే దు. ఇంతలో ఆ స్థలంలో నిర్మాణాలు ఎలా జరుపుతా రని నోటీసులు ఇచ్చాం. 2010 నుంచి ఆ స్థలంకు సంబంధించిన అద్దె కూడా చెల్లించలేదు. నోటీసులు ఇచ్చినా కూడా పనులు నిర్వహిస్తున్నారు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం.‘ – కిషోర్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, నీలకంఠేశ్వరస్వామి దేవస్థానం -
‘ఖనిజం’లో కంత్రీలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాలో ఖనిజ సంపదకు లోటు లేదు. అపారమైన ఖనిజ సంపద మన జిల్లా సొంతం. కానీ ప్రభుత్వానికి ఆదాయం మాత్రం అంతంతే. జిల్లా వ్యాప్తంగా గరివిడి, దత్తిరాజేరు, బొబ్బిలి, రామభద్రపురం, కొత్తవలస, చీపురుపల్లి, మెరకముడిదాంతో పాటు పలు ప్రాంతాల్లో ఖనిజ సంపద ఉన్నా ప్రభుత్వానికి మాత్రం ఆశించిన స్థాయిలో ఆదాయం రావట్లేదు. మార్కెట్లో ఎంతో విలువున్న ఈ ఖనిజ సంపద తరలించేందుకు గత ప్రభుత్వాలు అమలు చేసిన గంపగుత్త విధానం ఒక కారణమైతే... అనధికార తవ్వకాలు.. అక్రమంగా తరలింపు రెండో కారణం. గనుల శాఖ లెక్కలను బట్టి జిల్లాలో గతేడాది కన్నా ఈ ఏడాది మరీ ఘోరంగా ఉత్పత్తులు తగ్గిపోయాయి. దీని వల్ల రవాణా కూడా తగ్గింది. ఇప్పుడు కరోనా కారణంగా అదికాస్తా మరింత దిగజారింది. అనుమతులు తక్కువ.. తవ్వకాలు ఎక్కువ... జిల్లాలో ఏడాదిన్నరగా ఖనిజ సంపద ఉన్నా తవ్వకాలు, రవాణాకు ఇబ్బందులు తలెత్తాయి. లేబర్ కొరతతో పాటు అనుమతులున్న కంపెనీలను మించిన అనధికార కంపెనీల నిర్వహణ ఒక కారణంగా ఉంది. జిల్లాలో ఉన్న క్వారీల్లో ఒకరి పేరున క్వారీ అనుమతులుంటే మరొకరు నిర్వహించడం సాధారణమయిపోయింది. దీనిని గతంలో అధికారులు గుర్తించినా... వారికి నామమాత్రపు జరిమానాలు వేసి ఆ తరువాత వారికే పేర్లు మార్చుకునే అవకాశాలు ఇచ్చారని తాజాగా బొబ్బిలి ప్రాంతంలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. తగ్గిన క్వార్ట్జ్, కలర్ గ్రానైట్ల తవ్వకాలు జిల్లాలో ఆరు రకాల క్వారీలుండగా అందులో కలర్ గ్రానైట్, క్వార్ట్జ్ల తవ్వకాలు తగ్గిపోయాయి. మరో పక్క మాంగనీస్, తదితర క్వారీల తవ్వకాల్లోనూ వృద్ధి కానరావడం లేదు. 2018–19 సంవత్సరంతో పోలి్చతే 19–20 సంవత్సరంలో భారీగా తవ్వకాలు పడిపోయాయి. ఈ ఏడాది నుంచి చూసుకుంటే గత ఆరు నెలలుగా తవ్వకాలు, ఉత్పత్తి నెమ్మదిగానే కనిపిస్తోంది. గంపగుత్త కాంట్రాక్టులతోనే అనధికారిక క్వారీలు గత ప్రభుత్వం ఎటువంటి అంచనాలు, రిపోర్టులు లేకుండా గంపగుత్తగా లైసెన్సులు జారీ చేసిందనీ, అందుకు కాంట్రాక్టర్లు(లైసెన్సుదారులు) తమకు ఇష్టం వచ్చిన రీతిలో తవ్వకాలు జరుపుకుని లబి్ధపొందారన్న ఆరోపణలు గతంలోనే వినిపించాయి. దీనికి తోడు ఒక క్వారీ దగ్గర తవ్వి మరో క్వారీ పేరున(లీజు కాలం అయిపోయినందున)రవాణా చేసుకుంటున్న దాఖలాలు కూడా ఉన్నాయి. అలా మైనింగ్ అధికారులు పలుమార్లు దాడులు నిర్వహించి జరిమానాలు తూతూమంత్రంగా వేసినట్టు ఇప్పటికీ పలువురు చెబుతుంటారు. కొత్తగా వేలం విధానం ప్రభుత్వం కొత్తగా క్వారీలను వేలం విధానంలో ఇచ్చేందుకు సన్నద్ధం అవుతోంది. జీఎస్ఐ(జియాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో కొన్ని చోట్ల సర్వే చేసి ఏ ప్రాంతంలో ఏ రకమైన ఖనిజం ఉన్నదో దానిని విలువ కట్టి, తవ్వకాలు, నిర్వహణలను బేరీజు వేసుకుని ధర నిర్ణయిస్తారు. దీనికి సంబంధించిన శాఖా పరమైన సిబ్బంది తక్కువ ఉండటంతో అన్ని చోట్లా ఈ విధానం అమలుకు వీలు పడదు. కాబటివ్ట కొన్ని చోట్ల థర్డ్ పార్టీ ద్వారా సర్వే చేయించి వేలం పద్ధతిలో కేటాయించే ఆలోచన చేస్తోంది. కొత్తవిధానానికి కసరత్తు చేస్తున్నాం జిల్లాలో కొత్త ఖనిజ తవ్వకాలకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అమలు పరిచేందుకు కసరత్తు చేస్తున్నాం. ఉన్న ఖనిజ సంపదను సక్రమ మార్గంలో రవాణా చేసి ప్రభుత్వాదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటాం. – పూర్ణ చంద్రరావు, డిప్యూటీ డైరెక్టర్, మైన్స్ అండ్ మినరల్స్, విశాఖపట్నం -
చిన్న పరిశ్రమలకు పెద్ద సాయం
విజయనగరం పూల్‌బాగ్: పరిశ్రమలు పచ్చగా ఉంటే దానినే నమ్ముకున్న కారి్మకుల బతుకు బాగుంటుంది. స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. దానిని కష్టాల్లోకి నెట్టేస్తే వేలాది కుటుంబాలపై దాని ప్రభావం పడుతుంది. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో పరిశ్రమల పరిస్థితి దయనీయంగా మారింది. కొత్త పరిశ్రమలు రాలేదు సరికదా... ఉన్నవి చాలావరకూ మూ తపడ్డాయి. ఫలితంగా జిల్లాలో నిరుద్యోగ సమస్య మరింత పెరిగింది. అటువంటి తరుణంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే పరిశ్రమల అభివృద్ధిపై దృష్టి సారించింది. పరిశ్రమలను ఆదుకునేందుకు కంకణం కట్టుకుంది. రీస్టార్ట్ ప్యాకేజీలో భాగంగా ఎంఎస్ఎంఈ (చిన్నపరిశ్రమ)లకు బకాయిలు చెల్లించేసింది. రెండు విడతలుగా 194 క్లెయిమ్‌లకు రూ.15.82కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఆయా కంపెనీల యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమల పురోగతికి ఊతం చిన్న పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సాయం అందించింది. రీస్టార్ట్ ప్యాకేజీ పేరుతో ఎంఎస్ఎమ్ఈలకు ఆర్థికసాయం అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ప్రారంభించారు. మొదటి విడతలో 44 యూనిట్లకు 64 క్లెయిమ్స్ మొ త్తం రూ.6.92 కోట్లను మంజూరు చేశారు. రెండో విడ తలో 59 యూనిట్లకు చెందిన 130 క్లయిమ్స్ మొత్తం రూ.8.90 కోట్లు విడుదల చేసింది. రెండు విడతల్లో మొత్తం 194 క్లెయిమ్‌లకు రూ.15.82 కోట్లు విడుద లైంది. ఈ సహాయంతో జిల్లాలోని పరిశ్రమలకు ప్రోత్సాహంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. గర్వంగా ఉంది... 15 ఏళ్లుగా కష్టాన్ని నమ్ముకుని అప్పు చేసి కంపెనీలు నడుపుతున్నాం. ఇటీవల కోవిడ్ వల్ల లాక్డౌన్లో ఇన్స్టాల్ మెంట్ చెల్లించలేని దుస్థితి దాపురించింది. బ్యాంకుకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉండేది. అటువంటి నాకు మొదటి విడతలో రూ.55 లక్షలు పెట్టుబడి రాయితీ లభించడం ఆశ్చర్యంతో పాటు ఆనందం కలిగింది. ఇప్పుడు గర్వంగా తలెత్తుకుని బ్యాంకుకు వెళ్తున్నాము. మాకు చేయూతనిచ్చి, మా పరువు నిలిపిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. చిన్న పరిశ్రమల వైపు ఇంతవరకు ఎవ్వరూ చూడలేదు. ఇకపై చిన్న పరిశ్రమలకు మంచిరోజులు వస్తున్నాయి. – మామిడి వాసుదేవరావు, యజమాని, బల్‌్కడ్రగ్స్ అండ్ ఫార్మాసూటికల్ బడ్జెట్ లేకపోయినా.... ఇండస్ట్రీ బడ్జెట్ లేకపోయినా ఎంఎస్ఎమ్ఈలకు బకాయిలు చెల్లించడంతో పరిశ్రమలు చక్కగా నడిపించుకోవటానికి, ఇంకా మరింత మందికి ఉపాధి కల్పించేందుకు ఇప్పుడు చాలా అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా ఎంఎస్ఎమ్ఈలకు ఊతం ఉంటేనే ఎకానమీ అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా లోకల్ మార్కెట్ బాగా డెవలప్ అయి నిత్యావసరాలు కావాల్సిన ఇంజినీర్ ప్రొడక్టులు గాని, దానికి సంబంధించిన సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. ఎంఎస్ఎంఈల వల్ల అత్యధికంగా ఉపాధి కలుగుతుంది. తద్వారా సేవారంగం, ట్రాన్స్‌పోర్టు రంగం కూడా పెరుగుతుంది. జిల్లా మరింత అభివృద్ధి చెందుతుంది. – కోట ప్రసాదరావు, జనరల్ మేనేజర్, జిల్లా పరిశ్రమల కేంద్రం, విజయనగరం -
స్మైల్ ప్లీజ్.. కరోనాతో క్లోజ్..!
కరోనా... ప్రపంచాన్నే కకావికలం చేస్తోంది. ఉద్యోగాలను ఊడదీస్తోంది. బతుకులను ఛిద్రం చేస్తోంది. జీవనాన్ని ప్రశ్నార్థకంగా మార్చుతోంది. కారి్మకులు, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారులు, రైతులపై ప్రభావం చూపిన కరోనా.. ఫొటో, వీడియో గ్రాఫర్లకూ పనిలేకుండా చేసింది. మూడు నెలలుగా కెమెరాకు ‘క్లిక్’ను దూరం చేసింది. వారి కుటుంబాల్లో ఆకలి కేకలు పుట్టిస్తోంది. స్మైల్ ప్లీజ్ అంటూ సందడిగా కనిపించే ఫొటో, వీడియో స్టూడియోలను కరోనా క్లోజ్ చేయించింది. ఫొటో, వీడియో గ్రాఫర్ల కష్టాలు.. వారి ఆవేదనకు ‘సాక్షి’ అక్షర రూపం. చీపురుపల్లి/ఎస్.కోట రూరల్: హలో మాస్టారు... ఏమండీ... ఒక్కసారి ఇటు చూడండి... స్మైల్ ప్లీజ్ అంటూ క్లిక్ మనిపిస్తూ పది కాలాలు పాటు గుర్తుండిపోయే జ్ఞాపకాలు అందించే ఫొటో, వీడియో గ్రాఫర్లకు కరోనా కోలుకోలేని దెబ్బతీసింది. వివాహం, రిసెప్షన్, జన్మదినోత్సవం, రజస్వల కార్యక్రమం, పదవీ విరమణ, పాఠశాల వార్షికోత్సవం, పండగ ఇలా ఏదైనా సరే ప్రస్తుత రోజుల్లో ఫొటోలు, వీడియో తప్పనిసరి. మార్కెట్లోకి మొబై ల్స్, చేతి కెమేరాలు అందుబాటులోకి వచ్చినా ఫొటోగ్రాఫర్లు, వీడియోలకు గిరాకీ తగ్గలేదు. అయితే, మార్చి నెలలో ప్రారంభమైన కరోనా మహమ్మారి వారి జీవితాలను దయనీయంగా మార్చింది. నాలుగు నెలలుగా శుభ కార్యాలు లేకపోవడంతో కెమేరాలకు పనికరువైంది. స్టూడియోల్లో పని చేస్తున్న వర్కర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్టూడియోల అద్దెలు, మంత్లీ వాయిదాలు, వర్కర్లకు జీతాలు చెల్లించలేక నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలో ఉన్న దాదాపు 7 వేల మంది ఫొటోగ్రాఫర్లు, మరో 5 వేల మంది వర్కర్లు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కరోనాతో కనీస ఆదాయం లేక అవస్థలు పడుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ రాష్ట్ర ఫొటో, వీడియో గ్రాఫర్ల సంక్షేమ సంఘం పిలుపు మేరకు సోమవారం రాష్ట్రంతో బాటు జిల్లా వ్యాప్తంగా శాంతి ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో 5 వేల స్టూడియోలు... జిల్లా కేంద్రమైన విజయనగరంతో పాటు మిగిలిన 33 మండలాల్లో ఫొటో, వీడియో గ్రాఫర్లు సంక్షేమ సంఘం లెక్కలు ప్రకారం 5 వేల స్టూడియోలు ఉన్నాయి. అందులో 7 వేల మంది ఫొటోగ్రాఫర్లు, మరో 5 వేల మంది వర్కర్లు పని చేస్తున్నట్టు సమాచారం. మార్చి 24 నుంచి ఏర్పడిన లాక్డౌన్ కారణంగా అంతవరకు జరగాల్సిన పెళ్లిల్లు తాత్కాలికంగా నిలిచిపోవడంతో ఉన్న బుకింగ్‌లు అన్నీ రద్దయ్యాయి. దీంతో వేలాది మందికి పని లేకపోవడంతో వారిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. అప్పటికే ఉన్న బుకింగ్‌లు రద్దవ్వడం, కొత్త కార్యక్రమాలు లేకపోవడం, దాదాపు నెలన్నర వరకు లాక్డౌన్ ఉండడంతో ఫొటో స్టూడియోలు తెరుచుకోని పరిస్థితి ఏర్పడింది. కరోనా కష్టాలు తెచ్చింది.. కరోనా వైరస్ పుణ్యమాని జిల్లాలో ఫొటో, వీడియో గ్రాఫర్లకు తీవ్ర కష్టాలు ఏర్పడ్డాయి. లాక్డౌన్ కారణంగా మొత్తం వ్యాపారం మూతపడింది. ఎప్పటికి కోలుకుంటుందో తెలియని పరిస్థితి. – అరవింద్, కార్యదర్శి, జిల్లా ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్, విజయనగరం ప్రభుత్వం సాయమందించాలి... ఫొటో, వీడియో గ్రాఫర్లకు పనులు లేక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. నాలుగు నెలలుగా స్టూడియో తెరుచుకోక, అవుట్డోర్ బుకింగ్‌లు లేక అవస్థలు ఎదుర్కొంటున్నాం. మాతో పాటు స్టూడియోల్లో పని చేస్తున్న వర్కర్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. – మల్లెంపూడి నర్శింగరావు, చందు ఫొటో స్టూడియో, చీపురుపలి కష్టాలు నుంచి గట్టెక్కించాలి.... లాక్‌డౌన్‌తో నాలుగు నెలలుగా పని లేదు. ఆర్థికంగా కుదేలయ్యాం. అద్దెలు చెల్లించలేక, వాయిదాలు కట్టలేక, ఇంటి నిర్వహణ భారమై చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇలాంటి విపత్కర పరిస్థితి ఎన్నడూ చూడలేదు. ప్రభుత్వం తమను ఆదుకోవాలి. – లాభాన శ్రీను, సీనియర్ ఫొటోగ్రాఫర్, గర్భాం, మెరకముడిదాం రూ.70 కోట్ల వ్యాపారం నష్టం సీజన్లో జరిగే వివాహాలు, గృహప్రవేశాలు, ప్రారం¿ోత్సవ కార్యక్రమాలకు ఫొటోలు, వీడియోలు, ఆల్బమ్‌ల ద్వారా జిల్లాలో రూ.70 కోట్ల వ్యాపారాన్ని స్టూడియో, ల్యాబ్ నిర్వాహకులు కోల్పోయారు. కరోనాతో కేవలం 50 మందితోనే వివాహ వేడుకలను జరుపుకోవాలనే నిబంధనలు విధించడంతో ఫొటోలు తీయించుకునేవారు కరువయ్యారు. విద్యాసంస్థలు పూర్తిగా మూతపడడంతో పాస్‌ఫొటోలు అడిగేవారు కనిపించడం లేదు. ప్రస్తుతం కొద్దిపాటి సడలింపులతో అక్కడక్కడ అతి తక్కువ మందితో వివాహాలు, ఇతర వేడుకలు జరుగుతున్నా ఫొటోగ్రాఫర్లు, హంగూఆర్భాటం లేకుండా తంతును జరిపించేస్తున్నారు. దీంతో స్టూడియోలకు అద్దెలు, కరెంట్ బిల్లులు సైతం కట్టలేని దుస్థితిలో ఫోటోగ్రాఫర్లు కాలం వెళ్లదీస్తున్నారు. -
ఏపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
సాక్షి, విజయనగరం : కరోనా వైరస్ ప్రతాపానికి ప్రజాప్రతినిధులు సైతం తలవంచక తప్పడంలేదు. తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు వైరస్ బారినపడ్డారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా శృంగవరపు కోట ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు కరోనా సోకింది. గత రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా సోమవారం ఒక్కరోజే జిల్లాలో 21 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 162కి చేరింది. తాజాగా రెవెన్యూ శాఖలోనూ వైరస్ ప్రవేశించింది. జిల్లాలోని ఓ డిప్యూటీ తహసీల్దార్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. కాగా తెలంగాణలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు వైరస్ బారినపడ్డ విషయం తెలిసిందే. -
విజయనగరంలో మంత్రుల సమీక్ష
సాక్షి, విజయనగరం: జిల్లా కలెక్టర్ కార్యాలయం లో మంత్రులు అళ్ల నాని, పుష్ప శ్రీ వాణి, బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. కరోనాపై అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునే విధంగా జిల్లాలో సమీక్ష చేయడం జరిగిందని మంత్రులు తెలిపారు. భవిష్యత్తులో జిల్లాలో కరోనా వ్యాప్తి చెందకుడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచించినట్లు చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ కరోనా వైరస్ పాజిటివ్ నుంచి నెగిటివ్ రాగానే ఆసుపత్రి నుంచి డిశార్జి చేసి ఇంటికి పంపిస్తున్నట్లు చెప్పారు. జిల్లా నుంచి శనివారం నాలుగు పాజిటివ్ కేసులు రావడం జరిగిందన్నారు.వీటిలో మూడు పాజిటివ్ కేసులు వలసకార్మికులు కావడం గమనార్హమన్నారు. (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం) అన్ని క్వారంటైన్ కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నమన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని పూర్తి స్థాయిలో గుర్తించి వారికి ముందుగానే పరీక్షలు చేసి హోం క్వారంటైన్ చేశామన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి పూర్తి స్థాయిలో మిమ్స్ కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామన్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. జిల్లాలోని 72 క్వారంటైన్ కేంద్రాల్లో పరిశుభ్రత పాటిస్తూ వారికి ఆహారం అందిస్తూ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.అలాగే కరోనా పాజిటివ్ వచ్చిన గ్రామాల్లో సైతం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అనుమానితులని వెంటనే గుర్తించి వారిని జిల్లా కేంద్ర ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రికి తరలించి, పరీక్షలు చేసి రిపోర్ట్ వచ్చేవరకు చికిత్స అందిస్తున్నామని చెప్పారు. మెరుగైన వైద్యం కోసం వైజాగ్ విమ్స్ లో కూడా చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. సిబ్బందికి , వైద్యులు కి అన్ని రకాల రక్షణ పరికరాలు అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో వెంటిలేటర్స్ని కూడా అదనంగా సిద్ధం చేశామన్నారు. వీటితో పాటు జిల్లాలో ఐదు ప్రైవేటు ఆసుపత్రులను కూడా కోవిడ్ ఆసుపత్రుల కింద సిద్ధం చేసినట్లు చెప్పారు. స్పెషాలిటీ సేవలుని కూడా అందుబాటులోకి తెచ్చి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నామని తెలిపారు. మిగతా జిల్లాలతో పోల్చుకుంటే విజయనగరం జిల్లా మెరుగుగానే ఉందన్నారు. (వైద్యం అందించటంపై దృష్టి పెట్టాలి: సీఎం జగన్) వైజాగ్‌లో కరోనా వైరస్‌తో శనివారం మృతిచెందిన బలిజిపేట , చిలకలపల్లి కి చెందిన 60 ఏళ్ల వృద్ధ మహిళకు సంబంధించిన 16 మంది కుటుంబ సబ్యులకు పరీక్షలు చేయగా అందరకీ కరోనా నెగటివ్ రావడం జరిగిందన్నారు. ఆ మహిళ కరోనాతో పాటు డయాలసిస్ పేషెంట్ అని కూడా తెలిపారు. చిలకలపల్లి గ్రామం తో పాటు చుట్టుప్రక్కల గ్రామాల్లో సర్వే చేసి అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలు అందరూ సామాజిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. అనవసర విషయాలకి బయటకి రావద్దు అని విజ్ఙప్తి చేశారు. లాక్డౌన్ నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలని కోరారు. (తెలుగువారిని తీసుకువచ్చేందుకు లైన్ క్లియర్) -
కోడలిపై మామ లైంగిక దాడి..
బొబ్బిలి: కుమార్తెలా సాకాల్సిన కోడలిని ఓ ప్రబుద్ధుడు తన కామవాంఛతో పాడు చేశాడు. తన అమాయకత్వాన్ని అలుసుగా చేసుకుని ఒకసారి కాదు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ వ్యవహారానికి సంబంధించి బొబ్బిలి సీఐ ఇ. కేశవరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పాత బొబ్బిలి ప్రసాద్‌నగర్ కాలనీలో ఇరవై ఏళ్ల ఎస్సీ వివాహిత భర్తతో కలసి నివాసముంటోంది. ఆదివారం తన భర్త పనికి వెళ్లడంతో ఆమె ఒక్కతే ఇంటి వద్ద ఉంది. దీంతో అదను చూసిన తన చినమామ ఇంటిలోకి ప్రవేశించి అత్యాచారానికి ప్రయత్నిస్తుండగా ఆమె కేకలు వేయబోయింది. అయితే కామాంధుడు ఆమె నోటిలో గుడ్డలు కుక్కి అఘాయిత్యం చేశాడు. అనంతరం కామాంధుడు పారిపోవడంతో ఆమె వణికిపోతూ బయటకు వచ్చింది. చెప్పుకునేందుకు ఎవరూ లేకపోవడంతో ఎదురుగా ఉన్న ఇంటి వద్దకెళ్లి వారికి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంది. గతంలో కూడా ఎవరూ లేని సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. వెంటనే వారు విషయాన్ని గ్రామస్తులకు చెప్పి పోలీసులకు సమాచారం అందజేశారు. అలాగే బాధితురాలి భర్తకు కూడా తెలియజేశారు. దీంతో బొబ్బిలి ఏఎస్పీ గౌతమీ శాలి, సీఐ కేశవరావు సిబ్బందితో కలసి గ్రామానికి వెళ్లి పరిస్థితులను పరిశీలించారు. నిందితుడు పరారు కావడంతో సోమవారం అతడ్ని పట్టుకుని కేసు నమోదు చేశారు. ఎస్పీ దృష్టికి తీసుకెళ్లాం.. ఇది చాలా దారుణమైన సంఘటన. కేసు వివరాలను ఎస్పీ గారి దృష్టిలో పెట్టాం. ఆలస్యం చేయకుండా కేసు నమోదు చేయాలన్నారు. అదేవిధంగా చార్జిషీటుతో రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడ్ని రిమాండ్‌కు తరలించాం. – గౌతమీ శాలి, ఏఎస్పీ,బొబ్బిలి -
దూసుకొస్తున్న బీఎస్-6
విజయనగరం: వాహన కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి బీఎస్–6 వాహనాలను మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించింది. మిగతా వాహనాలకు ఆ అవకాశం ఉండదు. వాహన కాలుష్యాన్ని నియంత్రించే ఉద్దేశంతో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే బీఎస్–6 వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. ఆయా కంపెనీలు కూడా ఈ స్థాయి వాహనాలను మాత్రమే తయారు చేస్తున్నాయి. మార్చి 31 తరువాత బీఎస్–3, బీఎస్–4 వాహనాల రిజిస్ట్రేషన్లను సైతం నిలిపి వేయనున్నారు. ఇలాంటి వాహనాలు కొనుగోలు చేసినవారు, ఇంకా శాశ్వత రిజిస్ట్రేషన్లు చేయించని వారు.. ఆ గడువులోగా చేయించుకోవాలని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. లేనిపక్షంలో ఎప్పటికీ అవి రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం ఉండదని స్పష్టం చేస్తున్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి బీఎస్–6 వాహనాలను మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఈ విషయమై ఇప్పటికే రవాణాశా ఖాధికారులు వాహనదారులు, వాహన విక్రయ షోరూమ్‌ల వారికి అవగాహన కల్పిస్తున్నారు. (ఆర్టీసీకి ‘బీఎస్–6’ గండం) విక్రయాలకు సిద్ధంగా బీఎస్–4 వాహనాలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి బీఎస్–4 మోడల్ మోటారు వాహనాలకు రిజిస్ట్రేషన్లు నిలిచిపోనున్నాయి. ఈలోగా వాటిని కొనుగోలు చేసిన చోదకులు మార్చి 31లోగా శాశ్వత రిజి్రస్టేషన్లు చేయించుకోవాలి. లేకుంటే ఆ వాహనాలకు ఇబ్బందులు తప్పవని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. వాహన డీలర్లు సైతం నిర్ణీత తేదీలోగా తమ షోరూంలో ఉన్న ఆ మోడల్ వాహనాలను విక్రయించడంతో పాటు, వాటికి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. కాలుష్య నియంత్రణ నిబంధనల్లో భాగంగా సుప్రీంకోర్టు ఏప్రిల్ ఒకటి నుంచి బీఎస్–6 వాహనాలను మాత్రమే విక్రయించాలని ఆదేశించింది. వాటికి మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలని ఇప్పటికే రవాణా శాఖకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆదేశాల అమలుకు రవాణా శాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. ఫ్యాన్సీ నంబర్ల కోసం జాప్యం బీఎస్–4 వాహనాలను కొనుగోలు చేసిన వారు పలు కారణాల వల్ల రిజిస్ట్రేషన్లు చేయించుకోలేదు. కావాల్సిన నంబర్ కోసమని, రెండో వాహనం ఉంటే ట్యాక్సు ఎక్కువ పడుతుందని, వాహనం వేరే పేరుమీద బదిలీ కాలేదని.. ఇలా పలు అంశాల వల్ల శాశ్వత రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా తాత్కాలిక రిజిస్ట్రేషన్‌తో తిరుగుతున్నారు. నంబర్ వచ్చినప్పుడు, పన్నులు కట్టినప్పుడు శాశ్వత రిజిస్ట్రేషన్లు చేసుకుంటామని చెప్పి చాలా మంది చోదకులు డీలర్ల నుంచి వాహనాలు కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. ఇలాంటి సమస్యలున్న వారు దాదాపు జిల్లాలో సుమారు 3వేల మంది వరకు ఉన్నారు. వీరంతా మార్చి 31లోగా శాశ్వత రిజి్రస్టే షన్లు చేసుకోవలసి ఉంది. ఏమిటీ బీఎస్–6? భారత్ స్టాండర్డ్‌కు సంక్షిప్త రూపమే బీఎస్. వాహనం నుంచి వెలువడే వాయు ఉద్గారాలను బట్టి ఈ స్థాయిని నిర్ణయిస్తారు. 2005లో మార్కెట్లోకి వచ్చిన బీఎస్–3 వాహనాలు 2010 నాటికి బాగా విస్తరించాయి. 2017లో బీఎస్–4 వాహనాలు వచ్చాయి. వాహన కాలుష్యం తగ్గించే దిశగా ప్రస్తుతం బీఎస్–6 వాహనాలు తెస్తున్నారు. బీఎస్–6 వాహనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ విజయనగరం ఫోర్ట్: ఏప్రిల్ 1 నుంచి బీఎస్–6 వాహనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ జరుగుతుందని వెహికల్ ఇనస్పెక్టర్ బుచ్చిరాజు చెప్పారు. రవాణా శాఖ కార్యాలయంలో షోరూం డీలర్లతో బుధవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఎస్–4 వాహనాల రిజి్రస్టేషన్ మార్చి 31వ తేదీ వరకు మాత్రమే జరుగుతుందన్నారు. మార్చి 31 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోను బీఎస్–4 వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయమన్నారు. మార్చి 31 లోగా వాహనాల అన్ని విక్రయించుకుని రిజి్రస్టేషన్ చేయించుకోవాలన్నారు. ఫ్యాన్సీ నంబర్ కోసం నిరీక్షిస్తున్నాం కాబట్టి మాకు రిజిస్ట్రేషన్ చేయండని మార్చి 31 తర్వాత వచ్చినా రిజి్రస్టేషన్ చేయమన్నారు. ఈవిషయాన్ని డీలర్లు, వాహనాల కొనుగోలుదారులు గమనించాలన్నారు. బీఎస్–6 వాహనాల విక్రయం పలు షోరూముల్లో ఇప్పటికే బీఎస్–6 వాహనాల విక్రయాలు ప్రారంభమయ్యాయి. వేగం, సామర్థ్యం పరంగా ఇవి మెరుగ్గా ఉండి, కాలుష్యాన్ని తగ్గిస్తాయి. తయారీదారులు సరికొత్త ఫీచర్లు, భద్రత ప్రమాణాలతో ఈ వాహనాలను మార్కెట్లోకి తెస్తున్నారు. వీటిలో మైలేజీ పరంగా 15 శాతం అధికంగా ఉన్నా, ట్యాంకులో కనీసం 2 నుంచి 3 లీటర్ల పెట్రోలు నిరంతరం నిల్వ ఉంచుకోవలసి ఉంటుంది. లేదంటే వాహనం నడవదని వాహన రంగ నిపుణులు చెబుతున్నారు. బీఎస్–4 వాహనాలైతే కనీస పరిమాణంలో ఇంధనం ఉన్నప్పటికీ వెళ్లిపోయే పరిస్థితి ఉండేది. బీఎస్–6 వాహనాల్లో అది లేదు. రాయితీలు ప్రకటిస్తున్న షోరూంలు జిల్లాలో ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలకు సంబంధించి సుమారు 40 షోరూమ్‌లు ఉన్నాయి. వీటిలో సుమారు బీఎస్–4కి సంబంధించి ద్విచక్ర వాహనాలు 7వేల వరకు, నాలుగు చక్రాల వాహనాలు 2వేల వరకు నిల్వ ఉన్నాయి. వీటిని మార్చి 31లోగా విక్రయించి, శాశ్వత రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం వాహన విక్రయాల మార్కెట్ చాలా నెమ్మదిగా ఉంది. దీంతో అప్పట్లోగా పూర్తి స్థాయిలో విక్రయాలు జరుగుతాయో లేవోనని పలువురు వాహన డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా విక్రయించాలనే ఉద్దేశంతో కొన్ని షోరూంలలో ధరలను తగ్గించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలపై రూ.5 వేలు, నాలుగు చక్రాల వాహనాలపై రూ.10 వేల వరకు తగ్గించి విక్రయించేందుకు నిర్ణయించుకున్నారు. మరికొన్ని షోరూముల్లో ఇప్పటికే బీఎస్–6 మోడల్ వాహనాలు రావడంతో, వాటినే విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రిజిస్ట్రేషన్లు తప్పనిసరి బీఎస్–4 వాహనాలను ఈ ఏడాది మార్చి 31లోగా చేయించుకోవాలి. ఆ తరువాత వీటిని రిజిస్ట్రేషన్ కుదరదు. దీనికి సంబంధించిన సైట్ లాక్ అవుతోంది. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేయించినా ఉపయోగం ఉండదు. శాశ్వత రిజిస్ట్రేషన్ ఉండాల్సిందే. ఆ తరువాత ఆయా వాహనాలు రహదారులపై తిరిగితే సీజ్ చేస్తాం. – రామ్‌కుమార్, ఇన్చార్జి ఆర్టీఓ, విజయనగరం. -
హాజరు పడితేగా...?
విజయనగరం ఫోర్ట్: బయోమెట్రిక్‌తో సిబ్బంది సమయపాలన పాటిస్తారని భావిస్తే ఆ పరికరాలు పనిచేయకపోవడం వారికి ఇప్పుడు అవకాశంగా మారింది. గత ప్రభుత్వం నాసిరకంగా పరికరాలు సమకూర్చడంతో అవి ఏడాది తిరగకుండానే మూలకు చేరి... దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా ఈఎస్ఐ డయోగ్నోస్టిక్ సెంటర్, డిస్పెన్సరీలో ఉద్యోగులు సమయపాలన పాటించేందుకు గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ పరికరం మూలకు చేరింది. నాసిరకం పరికరాలను అప్పటి ప్రభుత్వం సరఫరా చేయడంతో ఏర్పాటు చేసిన కొద్ది నెలలకే దిష్టి బొమ్మలా మారింది. పాడైన వెంటనే ఈఎస్ఐ అధికారులు పంపించినప్పటికీ నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ఒక్కో పరికరం రూ.16 వేలు విలువ చేస్తే రూ.72 వేలకు కొనుగోలు చేసినట్టు నివేదిక ఇచ్చారు. దీనిని బట్టి అప్పటి టీడీపీ పాలకులు ఎంత మేర అవినీతికి పాల్పడ్డారో అర్థమవుతోంది. ఏడాది తిరగకుండానే మూలకు.. ఈఎస్ఐ డయోగ్నోస్టిక్ సెంటర్లో బయోమెట్రిక్ పరికరం ఏర్పాటు చేసిన కొద్ది నెలలకే మూలకు చేరింది. 2018 జనవరి నెలలో ఇక్కడి వైద్య సిబ్బంది హాజరు నిమిత్తం వీటిని ఏర్పాటు చేశారు. 2018 నవంబర్ నెలలో అది మూలకు చేరింది. అప్పట్లోనే అధికారులు బాగు చేయించాల్సిందిగా ఈఎస్ఐ డైరెక్టర్‌కు పంపించారు. కాని అధికారులు ఇంతవరకు బాగు చేయించలేదు. వేలాది రుపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన వాటిని బాగు చేయించకుండా వదిలేశారు. సమయ పాలన గాలికి... బయోమెట్రిక్ లేకపోవడంతో వైద్య సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారు సమయపాలనకోసం ఏర్పాటు చేసిన పరికరాలు పనికిరాకుండా పోవడంతో వారిలో క్రమశిక్షణ లోపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వైద్యులు, సిబ్బంది ఉదయం 9గంటలనుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పనిచేయాల్సి ఉన్నా... 10 గంటలకు, 10:30 గంటలకు సిబ్బంది విధులకు హాజరు అవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై డయోగ్నోస్టిక్ సెంటర్ సూపరింటెండెంట్ అల్లం కృష్ణారావువద్ద సాక్షి ప్రస్తావించగా 2018 నవంబర్ నెలలో బయోమెట్రిక్ పాడైందనీ, దానిని బాగు చేయించాలని ఈఎస్ఐ డైరక్టర్ కార్యాలయానికి పంపించామనీ, కానీ ఇప్పటివరకూ రాలేదని తెలిపారు. -
అన్న ‘దీవెన’
విజయనగరం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘జగనన్న వసతి దీవెన’ పథకం విజయనగరంలో ప్రారంభించేందుకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి కనీవినీ ఎరుగని రీతిలో జిల్లా ప్రజలు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఇంటా చదువుల దీపాలు వెలిగిస్తేనే ఈ తరంతో పాటు, భావి తరాల తలరాతలు మారుతాయని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా అయోధ్య మైదానంలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లైనా పేద కుటుంబంలో ఉన్న వారు పేదరికం దాటి ముందుకు రాలేదని, ఈ పరిస్థితి మారాలని, పేద కుటుంబాల పిల్లలు కూడా గొప్ప చదువులు చదవాలని ఆయన ఆకాంక్షించారు. అందుకే దేశంలోనే ఎక్కడా లేని విధంగా చదువుల విప్లవానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వెల్లడించారు. పరేడ్ మైదానంలో ఘనస్వాగతం తాడేపల్లి నుంచి విశాఖపట్నం మీదుగా నేరుగా విజయనగరం చేరుకున్న సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఇక్కడి పోలీస్ బ్యారెక్స్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు హెలికాప్టర్లో చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి వాహన శ్రేణితో బయలు దేరి స్థానిక అయోధ్య మైదానంలో ఏర్పాటుచేసిన సభా ప్రాంగణానికి చేరుకున్నారు. హెలిప్యాడ్‌నుంచి అయోధ్య మైదానం వరకూ దారిపొడవునా వేలాదిగా జనం థాంక్యూసీఎం సార్ అంటూ చిత్రించిన ప్లకార్డులతో ఘన స్వాగతం పలికారు. అయోధ్య మైదానంలో ఏర్పాటుచేసిన వివిధ స్టాళ్లను సందర్శించారు. బహిరంగ సభలో ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని కంప్యూటర్లో కీ ప్రెస్ చేసి ప్రారంభించారు. అక్కడి నుంచి పోలీసు బ్యారెక్ గ్రౌండ్స్‌కు చేరుకున్న సీఎం అక్కడి దిశ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించారు. జన జాతరలా స్వాగతం తమ అభిమాననేత ముఖ్యమంత్రిగా బాధ్యత లు స్వీకరించిన తరువాత తొలిసారిగా జిల్లాకు వస్తున్నారని తెలుసుకున్న ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆయన వెళ్లే మార్గానికి ఇరువైపు లా బారులు తీరి ఘనంగా స్వాగతం పలికారు. ఉదయం పదిగంటలకే జిల్లాలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలి వచ్చారు. జిల్లా పోలీస్ పరేడ్ మైదానం నుంచి అయోధ్య మైదానం వరకు చేరేంతవరకూ అన్ని ప్రధాన జంక్షన్లు జనంతో కిటకిటలాడాయి. సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ప్రజలంతా మానవహారంగా ఏర్పడి చేతిలో ప్లకార్డులు పట్టుకుని జై జగన్ నినాదాలతో సందడి చేశారు. వసతి దీవెనకు విద్యల నగరం నుంచే శ్రీకారం విద్యలనగరంగా పేరుగడించిన విజయనగరం నుంచే జగనన్న వసతిదీవెనకు శ్రీకారం చుట్టడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఈ జిల్లాపై ఉన్న మమకారాన్ని తెలియజేస్తోంది. ఇప్పటికే విద్యాభివృద్ధి కోసం పలు పథకాలు అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ చదివే విద్యార్థుల వసతి, భోజన ఖర్చులక్సోం కోసం వసతి దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించడం ప్రాధాన్యం సంతరించుకుంది. వేదికపై నుంచి కంప్యూటర్లో బటన్ నొక్కి అర్హతగల విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి తొలి విడతగా రూ.10వేలు చొప్పున నగదును జమచేశారు. ఐడీ కార్డులు, చెక్కులను విద్యార్థులకు అందజేశారు. అనంతరం హరిత విజయనగరం సావనీర్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అంతకుముందు పలువురు ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల సమస్యలపై ముఖ్యమంత్రికి వినతిపత్రాలు అందజేశారు. దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభం: నగర పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి పోలీస్ పరేడ్ మైదానంలో నూతనంగా ఏర్పాటు చేసిన దిశ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించారు. అధునాతన టెక్నాలజీతో నిర్మించిన దిశ పోలీస్ స్టేషన్ మొత్తం పరిశీలించారు. కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, జిల్లా ఇన్చార్జి మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, మేకపాటి సుచరిత, తానేటి వనిత, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, శంకర నారాయణ, ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్, గొట్టేటి మాధవి, ఎం.వి.వి. సత్యనారాయణ, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, డీజీపీ గౌతమ్‌సవాంగ్, టెక్నికల్ సర్వీసెస్ డీఐజీ జి.పాలరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్, జిల్లా ఎస్పీ బి.రాజకుమారి, దిశ ప్రత్యేకాధికారి దీపికాపాటిల్, ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, బడ్డుకొండ అప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, పీడిక రాజన్నదొర, అలజంగి జోగారావు, శంబంగి వెంకటచినఅప్పలనాయుడు, కడుబండి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్షి్మ, పార్టీ పాలకమండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు, వైఎస్సార్సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, జాయింట్ కలెక్టర్ జేసీ కిషోర్‌కుమార్, జేసీ–2 ఆర్.కూర్మనాథ్, డీసీసీబీ ఛైర్పర్సన్ మరిశర్ల తులసి, డీసీఎంఎస్ చైర్మన్ ఎస్.వి.రమణరాజు, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వి.సూర్యనారాయణరాజు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి కోలగట్ల శ్రావణి, ఏఎంసీ ఛైర్మన్ నడిపేన శ్రీనివాసరావు, సబ్ కలెక్టర్ టిఎస్ చేతన్, అసిస్టెంట్ కలెక్టర్ కేతన్‌గార్గ్, విజయనగరం నగర పార్టీ అధ్యక్షుడు ఆశపు వేణు తదితరులు పాల్గొన్నారు. అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు విజయనగరం టౌన్: రాష్ట్రముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో స్ధానిక అయోధ్య మైదానంలో సోమవారం సభాప్రాంగణంలో ఏర్పాటుచేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. ముఖ్యమంత్రి సభాప్రాంగణానికి రాకముందు నుంచే విద్యార్థులను ఉత్తేజ పరుస్తూ చిన్నారులు చేసిన నృత్యప్రదర్శనలు ఆద్యంతం రక్తికట్టించాయి. రామవరం జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎమ్ వెలమల శ్రీనివాసరావు, యాంకర్ జుహిత(విశాఖ) అద్భుతమైన మాటలతో ఆకట్టుకున్నారు. భగవతీ నృత్యకళామందిర్ చిన్నారులు వినాయక స్తుతితో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం పద పద పోదాం సర్కారు బడికి అంటూ అమ్మఒడి పథకం గురించి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎమ్.హరిజవహర్‌లాల్ పాడిన ‘అమ్మలారా.. ఓ అయ్యలారా’, రాజాం కొండ మీద జానపదం వంటి పాటలకు నృత్య రూపకంలో వివరించారు. జామి, చీపురుపల్లి కేజీబీవీ విద్యార్థులు ‘రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న .. నీ వెంట జనం ప్రభంజనం చూడరన్న’ అంటూ చేసిన ప్రదర్శనలకు కరతాళ ధ్వనులు మిన్నంటాయి. చీపురుపల్లి కేజీబీవీ విద్యార్థులు ‘మనలో ఒక సైనికుడై మనలో ఒక సేవకుడై కదిలే జన నాయకుడై’ అంటూ చేసిన నృత్యం ఆలోచింప జేసింది. జామి కేజీబీవీ విద్యార్థులు ‘అమ్మఒడి పథకం చదువుకోలేని కుటుంబాల్లో వెలుగు నింపి కిరణమంటూ, నవరత్నాలు సిరివర్ణాలు కళ పండించే తొలి చిహ్నాలు అంటూ ముందుకు వచ్చారు. చీపురుపల్లి కేజీబీవీ విద్యార్థులు థింసా డ్యాన్స్‌తో కట్టిపడేశారు. విద్యా కార్యక్రమాలపై గెద్ద వరప్రసాద్ నేతృత్వంలో కళాకారులు అద్భుతంగా పాడారు. పోలీస్ సేవలు భేష్! విజయనగరం క్రైమ్: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేయడంలో విజయవంతమైంది. దారిపొడవునా ప్రజలందరూ ముఖ్యమంత్రి హోదాలో వచ్చిన తమ అభిమాన నాయకుడ్ని చూడడానికి బారులుతీరారు. వారిని కట్టడి చేయడంలో కీలకపాత్ర పోషించి పోలీసులు అందరి మన్ననలు పొందారు. హెలీప్యాడ్‌లో దిగినప్పటి నుంచి సభా ప్రాంగణం చేరుకునే వరకూ దారిపొడవునా పోలీసులు విస్తృతమైన తనిఖీలతో పాటు బాంబ్‌స్కా్వడ్, డాగ్ స్క్వాడ్, ఇంటెలిజెన్స్ విస్తృత తనిఖీలు చేపట్టాయి. జిల్లా ఎస్పీ బి.రాజకుమారి ప్రత్యేక ఆదేశాలతో అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేశారు. హెలీ ప్యాడ్ వద్ద అదనపు ఎస్పి ఎన్.శ్రీదేవీరావు, రూట్ బందోబస్తును పార్వతీపురం ఏఎస్పి డాక్టర్ సుమిత్ గరుడ్, సభాస్ధలం వద్ద బొబ్బిలి ఏఎస్పీ గౌతమీశాలీ, దిశ మహిళా పోలీసు స్టేషన్ వద్ద ఓఎస్డీ జె.రామ్మోహనరావు ప్రత్యేక పర్యవేక్షణ చేశారు. బందోబస్తు నిమిత్తం ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఇద్దరు ఏఎస్పీలు, 12 మంది డీఎస్పీలు, 31 మంది సీఐలు, 98 మంది ఎస్ఐలు, 192 మంది ఏఎస్ఐ,హెచ్‌సీలు, 600 మంది కానిస్టేబుళ్లు, 85 మంది మహిళా కానిస్టేబుళ్లు, 170 మంది హోంగార్డులు, ఐదు ప్లాటూన్ల ఆర్మ్డ్ రిజర్వు పోలీసు సిబ్బంది, ఐదు స్పెషల్ పార్టీ బృందాలు పాల్గొన్నాయి. ముఖ్యమంత్రి పర్యటించే అన్ని ప్రాంతాలు, రహదారులను డ్రోన్, సీసీ కెమెరాలతో పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సీఎం పర్యటనలో సిత్రాలు ►ఉదయం 10 గంటలకే అయోధ్య మైదానంలోని సభా ప్రాంగణంలోని అన్ని గ్యాలరీలు విద్యార్థులు, మహిళలు, యువతతో నిండిపోయాయి. ►ఉదయం 11.50 గంటలకు అయోధ్య మైదానానికి చేరుకున్న ముఖ్యమంత్రిని శాలువాతో సత్కరించేందుకు సిద్ధమైన రాజకీయ కురువృద్ధుడు పెనుమత్స సాంబశివరాజును అప్యాయంగా పలకరించిన జగన్మోహన్రెడ్డి ఆ శాలువతో సాంబశివరాజును సత్కరించారు. ► సభా వేదికపై జ్యోతి ప్రజ్వలన సమయంలో మహిళా మంత్రులచే జ్యోతి ప్రజ్వలన చేయించారు. ►నెల్లిమర్ల మండలం బొప్పడాం జిల్లా పరిషత్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న అభిమన్యు ఆంగ్లంలో చేసిన ప్రసంగం ఆద్యంతం కరతాళ ధ్వనులను అందుకుంది. ►ముఖ్యమంత్రి ప్రసంగం 19.58 నిమిషాలు సాగింది. ప్రసంగం ఆధ్యంతం విద్యాభివృద్ధికి ప్రభుత్వ ఇస్తున్న ప్రాధాన్యాన్ని వివరించారు. ► సభా ప్రాంగణం నిండిపోవటంతో మైదానం బయటినుంచే వేలాదిమంది గంటల తరబడి వీక్షించారు. ►ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో విజయనగరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగతం– సుస్వాగతం బ్యానర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
రేపు ‘జగనన్న వసతి దీవెన’కు శ్రీకారం
సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లాలో రేపు (సోమవారం) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. జిల్లా నుంచి ‘జగనన్న వసతి దీవెన’ పథకానికి ఆయన శ్రీకారం చుట్టనున్నారు. సోమవారం ఉదయం 9.10 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం బయలుదేరతారు. 11 గంటలకు విజయనగరం పోలీస్ ట్రైనింగ్ కళాశాలకు చేరుకుని.. అక్కడ నుంచి విజయనగరం అయోధ్య మైదానంలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించనున్నారు. 11.25 నిమిషాలకు వైఎస్సార్ జగనన్న వసతి దీవెన పథకాన్ని ప్రారంభించి.. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం అక్కడ నుంచి పోలీస్ బ్యారెక్స్ గ్రౌండ్స్‌కు చేరుకుని ‘దిశ’ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు కార్యక్రమాలు ముగించుకుని తిరిగి హెలికాఫ్టర్‌లో విశాఖపట్నం, అక్కడి నుంచి విమానంలో గన్నవరం వెళతారు. -
కూలీల బతుకులు ఛిద్రం
బొబ్బిలి రూరల్/దత్తిరాజేరు: రెక్కాడితే గాని డొక్కాడని కూలీలు వారు... ప్రతి రోజూ ఒకే ఊరి నుంచి 3, 4 ఆటోలలో 45 మంది వరకు కలిసి వేకువజామునే క్యారేజీలు కట్టుకుని వచ్చి రైల్వే పనులు చేస్తుంటారు. మరో 15 రోజులలో పండగ వస్తోందని ఆశతో అందరూ పనిచేసుకుపోతున్నారు. పనిచేసే ప్రదేశం వద్ద రైలు లేదా గూడ్స్ వచ్చే సమయంలో హెచ్చరికగా జెండాలు ఊపుతూ అంతా అప్రమత్తంగా ఉంటారు. రైలుబళ్లు కూడా వేగం తగ్గించి పని ప్రదేశంలో వెళ్తాయి. కాని గురువారం వారి ఆశలు ఆవిరయ్యాయి. రైలు బండి రూపంలో వారి బతుకులు ఛిద్రం అయ్యాయి...మండలంలోని పెంట రైల్వే బ్రిడ్జి వద్ద జరిగిన ప్రమాదంలో దత్తిరాజేరు మండలం కోరపు కృష్ణాపురం గ్రామానికి చెందిన దన్నాన సన్యాసిరావు(44) మృతి చెందగా, అదే గ్రామానికి చెందిన మృతుడికి వరుసకు సోదరుడయ్యే పతివాడ రాము కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే దన్నాన అన్నపూర్ణమ్మ భయంతో బ్రిడ్జిపై నుంచి దూకేయడంతో తీవ్రంగా గాయపడింది. అసలేం జరిగింది.....? స్థానికులు, బాధిత కుటుంబాల సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... కోరపు కృష్ణాపురం గ్రామానికి చెందిన 45 మంది సుమారు 30 సంవత్సరాలుగా రైల్వే కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నారు. విధుల్లో భాగంగా గురువారం ఉదయం పెంట బ్రిడ్జిపై పనులు చేపట్టారు. ట్రాక్ పనులు చేస్తుండగా ఉదయం 9.30 గంటల సమయంలో విశాఖ నుంచి రావాల్సిన విశాఖ–రాయఘడ డీఎంయూ గంట ఆలస్యంగా 10.30గంటలకు వచ్చింది. వేగంగా రైలు వస్తుండడంతో çపనులు జరుగుతున్నట్లు కార్మికులు హెచ్చరిక జెండా ఊపారు. అయినా రైలు వేగంగా వచ్చి దన్నాన సన్యాసిరావును ఢీ కొట్టింది. దీంతో అతని శరీరం ఛిద్రమై బ్రిడ్జి పిల్లర్ల మీద పడిపోయింది. ఈ సమయంలో అక్కడేపనిచేస్తూ పరుగుతీçస్తున్న పతివాడ రామును కూడా రైలు ఢీకొనడంతో తలకు తీవ్రగాయమైంది. ఈ ఘటనలో భయబ్రాంతులకు గురైన దన్నాన అన్నపూర్ణమ్మ బ్రిడ్జిపై నుంచి దూకేయడంతో సుమారు 25 నుంచి 30 అడుగుల ఎత్తునుంచి కిందపడడంతో ఆమె కాలుకు తీవ్రగాయమైంది. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను 108 వాహనంలో బొబ్బిలి సీహెచ్‌సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వారిని విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. భార్య కళ్లెదుటే... మృతుడు సన్యాసిరావుకు భార్య రమణమ్మ, కుమార్తెలు దివ్య, ఉష ఉన్నారు. రమణమ్మ కూడా గురువారం భర్తతో పాటే పనిచేస్తోంది. తన కళ్లెదుటే భర్త చనిపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపించింది. ఇద్దరు కుమార్తెల్లో ఒకరు టెన్త్, మరొకరు ఇంటర్ చదువుతున్నారు. తీవ్రంగా గాయపడిన పతివాడ రాముకు భార్య చిన్నమ్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. తీవ్రంగా గాయపడిన అన్నపూర్ణమ్మ భర్త గతంలో మృతి చెందగా ఆమెకు పార్వతి అనే ఒక కుమార్తె ఉంది. వీరంతా గ్రామానికి చెందిన ఎస్.బంగారునాయుడు ఆధ్వర్యంలో రైల్వే పనులు చేస్తున్నారు. సన్యాసిరావు మృతదేహాన్ని అతికష్టం మీద బ్రిడ్జి పిల్లర్ల మీద నుంచి తీసి రైల్వే ఇన్స్పెక్టర్ ఎంకే మీనా, ఎస్సై జీపీ రాజు, ఏఎస్సై వీఆర్ రెడ్డి, ఎస్హెచ్ఓ ఈ.కేశవరావు, వీఆర్ఓ రవి, అప్పారావుల సమక్షంలో శవపంచనామా చేసి బొబ్బిలి సీహెచ్‌సీకి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మిన్నంటిన ఆర్తనాదాలు... ప్రమాదం జరిగిన ప్రదేశంలో కోరపు కృష్ణాపురం గ్రామస్తులతో పాటు మృతుడు సన్యాసిరావు కుటుంబ సభ్యులు హృదయ విదారకంగా రోదించడంతో ఆర్తనాదాలు మిన్నంటాయి. ఎప్పుడూ ట్రాక్‌లపై పనిచేసే తాము ప్రమాదాలను పసిగడతామని... 30 కిలోమీటర్ల స్పీడ్‌తో వెళ్లాల్సిన ట్రైన్ 120 కిలోమీటర్ల స్పీడ్‌తో వెళ్లడంతోనే ప్రమాదం జరిగిందని కార్మికులు చెబుతున్నారు. మృతుని కుటుంబ సభ్యులకు, క్షతగాత్రులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని వైఎస్సార్సీపీ నాయకుడు సుమన శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే దిగ్భ్రాంతి.... సంఘటన జరిగిన విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటన దురదృష్టకరమని, బాధితులను ఆదుకోవాలని ఆయన కోరారు. -
ఇప్పుడొద్దులే.!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లాలో అడుగుపెట్టడానికి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ధైర్యం చాలడం లేదా.?రాజధాని విషయంలో తన పార్టీ నేతల్లోనే బిన్న స్వరాలు వినిపిస్తున్న తరుణంలో ఉత్తరాంధ్ర వచ్చేందుకు చంద్రబాబు సంకోచిస్తున్నారా.? అందుకే విజయనగరం పర్యటన రద్దయ్యిందా.? అంటే అవుననే సమాధానం వస్తోంది. అభివృద్ధికి దూరంగా... వెనకబాటుతనంలో మగ్గిపోతున్న విజయనగరం జిల్లాకు అధికారంలో ఉన్నన్నాళ్లూ చంద్రబాబుగానీ, ఆ పార్టీ నేతలు ఏమాత్రం న్యాయం చేయలేదు. దాని పర్యవసానంగానే గత ఎన్నికల్లో జిల్లా ప్రజలు టీడీపీకి చావుదెబ్బ కొట్టారు. జిల్లాలో ని తొమ్మిది అసెంబ్లీ స్థానాలతో పాట విజయనగరం, విశాఖ, అరకు పార్లమెంట్ స్థానాలను సైతం వైఎస్సార్సీపీకి కట్టబెట్టారు. టీడీపీలో మహామహులుగా చెప్పుకునే కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు తాను ఓడిపోవడంతో పాటు తన కుమార్తెను కూడా గెలిపించుకోలేకపోయారు. కిశోర్ చంద్రదేవ్, ఆర్పి భంజ్‌దేవ్ లాంటివారు మట్టికరిచారు. శత్రుచర్ల విజయరామరాజు వ్యూహాలు చతికిలపడ్డాయి. బొబ్బిలి రాజులు ఘోర పరాజయాన్ని చవిచూశారు. దీంతో ఎన్నికల తర్వాత జిల్లావైపు చంద్రబాబు కన్నెత్తి చూడలేకపోయారు. ఒక్కసారి కూడా అడుగుపెట్టలేకపోయారు. ఆ పార్టీ నేతలు కూడా జనంలోకి రాలేక సొంత వ్యవహారాలకే పరిమితమైపోయారు. వికేంద్రీకరణవైపే ఉత్తరాంధ్ర టీడీపీ నేతల మొగ్గు కానీ ఎంతకాలం ఇలా జననానికి ముఖం చాటేస్తారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. కనీసం పార్టీ ఉందోలేదో చూసుకోవాలి. దానిలో భాగంగానే జిల్లా సమన్వయకమిటీ సమావేశాలను జనవరి 3, 4 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి జిల్లాలోనూ ఈ సమావేశాలకు చంద్రబాబు హాజరవుతున్నారు. విజయనగరం కూడా ఆయన వస్తారని పార్టీ నేతలు కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ఇంతలో రాజధాని వికేంద్రీకరణ అంశం తెరపైకి వచ్చింది. దీనికి వ్యతిరేకంగా ఓవైపు అమరావతిలో రైతుల పేరుతో ఆందోళనలు చేయిస్తున్న టీడీపీలో తాజాగా చీలిక వచ్చింది. టీడీపీ ఉత్తరాంధ్ర నేతలంగా విశాఖలో ఎగ్జిక్యూటివ్(పరిపాలన) రాజధాని ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఈ మేరకు టీడీపీ ఉత్తరాంధ్ర నేతలు విశాఖలో సమావేశమై ఒక తీర్మానం కూడా చేశారు. దానిని చంద్రబాబుకు అందించాలని నిర్ణయించారు. ఇలాంటి సమయంలో ఉత్తరాంధ్రలో పర్యటించడం, అందులోనూ తమ పార్టీకి ఒక్క సీటు కూడా రాని విజయనగరంలో అడుగుపెట్టడం మంచిది కాదని చంద్రబాబు భావించి తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు చర్చ జరుగుతోంది. విశాఖలో పరిపాలన రాజధాని రావడంతో పాటు భోగాపురం విమానాశ్రయానికి కూడా త్వరలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్టు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించినప్పటి నుంచీ జిల్లా ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు. స్థానిక టీడీపీ నేతలు కూడా తమ ప్రాంతం అభివృద్ధిని వ్యతిరేకిస్తే జనంలో చులకనైపోతామని భయపడుతున్నారు. అందుకే అధినేత పర్యటనలో తాము మనస్పూర్తిగా పాల్గొనలేమనే సంకేతాన్ని ఇప్పటికే అధిష్టానానికి పంపడంతో చంద్రబాబు పర్యటన అర్ధంతరంగా ఆగిపోయింది. -
వినపడలేదా...ప్రసవ వేదన?
విజయనగరం ఫోర్ట్: రౌండ్‌ది క్లాక్ పనిచేసే పీహెచ్‌సీల్లో ప్రసవాలు అరకొరగానే సాగుతున్నాయి. నిర్దేశించిన లక్ష్యంలో కనీసం సగం కూడా చేయలేకపోతున్నారు. జిల్లాలో నాలుగైదు పీహెచ్‌సీలు మినహా మిగతా చోట్ల ప్రసవాల సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. జిల్లాలో 24 గంటలు పనిచేసే పీహెచ్‌సీలు 44 ఉన్నాయి. వీటిలో ఒక పీహెచ్సీ మాత్రం లక్ష్యానికి చేరుకోగా... రెండు పీహెచ్‌సీలు లక్ష్యానికి చేరువగా ఉన్నాయి. నెలకు ఒక్కో పీహెచ్‌సీల్లో 25 ప్రసవాలు జరిగాలి. ఏప్రిల్ నుంచి ఆక్టోబర్ నెలాఖరు నాటికి ఒక్కో పీహెచ్సీలో 175 ప్రసవాలు జరగాలి. కానీ చాలా చోట్ల రెండంకెలకు చేరుకోవడమే గగనంగా కనిపిస్తోంది. ఏ పీహెచ్‌సీల్లో ఎన్నెన్ని? ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్ నెలాఖరునాటికి ఏడు నెలల్లో ప్రతి పీహెచ్సీలో 175 ప్రసవాలు జరగాల్సి ఉన్నా మొండెంఖల్లులో 248, బాగువలసలో 126, గురునాయుడు పేటలో 166 ప్రసవాలు, రామభద్రపురంలో 104 మాత్రమే జరిగాయి. ఇక నెలకు 10 ప్రసవాలు కూడ చేయని పీహెచ్‌సీలు ఉన్నాయి. తెర్లాంలో 64, తాడికొండలో 47, గోవిందపురంలో 47, మోపాడలో 62, పిరిడిలో 35, సీతానగరంలో 28, గర్భాంలో 42, గరివిడిలో 20, కర్లాంలో 10, గరుగుబిల్లిలో 36 , జియ్యమ్మవలసలో 58, రావాడ రామభద్రపురంలో 26, బొండపల్లిలో 11, చల్లపేటలో 21, దత్తిరాజేరులో 34, మెంటాడలో 52, మాదలింగిలో 20, గుర్లలో 17, బందలుప్పిలో 6, డోకశిలలో 52, కొమరాడలో 26, పి.బొండపల్లిలో 7, అలమండలో 31, జామిలో 37, కొత్తవలసలో 45, ఎల్.కోటలో 22, పెదమజ్జిపాలేంలో 26, వేపాడలో 18, వియ్యంపేటలో 35 ప్రసవాలు నిర్వహించారు. రిఫరల్స్కే అధిక ప్రాధాన్యం పీహెచ్‌సీలకు ప్రసవాలకోసం వచ్చే గర్భిణులను జిల్లా ఆస్పత్రికిగాని కేజీహెచ్‌కు గాని ప్రసవాలకోసం రిఫర్ చేసేస్తున్నారు. దీనివల్ల ఆశించిన స్థాయిలో పీహెచ్‌సీల్లో ప్రసవాలు జరగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేగాదు... నిరుపేదలు సైతం సుదూరంలోని ఆస్పత్రికి వెళ్లలేక సతమతం అవుతున్నారు. వైద్యాధికారులను హెచ్చరిస్తున్నాం.. కొన్ని పీహెచ్‌సీల్లో నిర్దే«శించిన లక్ష్యం కంటే ఎక్కువగానే ప్రసవాలు జరుగుతుండగా మరి కొన్ని చోట్ల లక్ష్యానికి దగ్గరగా అవుతున్నాయి. తక్కువ ప్రసవాలు జరుగుతున్న వాటిల్లో లక్ష్యానికి అనుగుణంగా ప్రసవాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం. వీటిపై పదే, పదే వైద్యాధికారులను హెచ్చరిస్తున్నాం. – డాక్టర్ ఎస్.వి.రమణకుమారి, డీఎంహెచ్ఓ -
14 వందల కేజీల గంజాయి స్వాధీనం
సాక్షి, విజయనగరం: భోగాపురం మండలంలోని లింగాలవలస జాతీయ రహదారిపై లారీలో తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్నస్మగ్లర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆదివారం ఎస్పీ రాజకుమారి మీడియాకు వివరాలు వెల్లడించారు.14 వందల కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని..దీని విలువ సుమారు కోటి యాభై లక్షలు ఉంటుందని తెలిపారు. విశాఖ జిల్లా పెందుర్తి నుంచి ఢిల్లీకి సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు. పెందుర్తిలో ఓ రెస్టారెంట్ యజమాని సుఖ్‌దేవి నుంచి స్మగ్లర్లు గంజాయిని తీసుకున్నారని చెప్పారు. సుఖ్‌దేవి పరారీలో ఉందన్నారు. కేసు నమోదు చేసి గంజాయి రవాణాపై లోతైన దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ వెల్లడించారు. -
కొంపముంచిన అలవాటు
విజయనగరం క్రైం: నిద్రలో నడిచే అలవాటు వల్ల ఓ వ్యక్తి ప్రాణాలు పోయాయి. ఈ సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకోగా.. వన్‌టౌన్ పోలీసులు శనివారం అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక చైతన్య పబ్లిక్ స్కూల్ దగ్గరలో ఉన్న రత్నం మోజో అపార్ట్మెంట్ ఐదో ఫ్లోర్లో జి.పవన్‌కుమార్ (25) నివాసముంటున్నాడు. ఇతనికి నిద్రలో నడిచే అలవాటు ఉంది. శుక్రవారం రాత్రి అపార్ట్మెంట్లో పడుకున్న ఈయన అర్ధరాత్రి తర్వాత నిద్రలోనే పెద్దగా కేకలు వేసుకుంటూ ఐదో ఫ్లోర్ నుంచి కిందకు పడి సంఘటనా స్థలంలోనే కన్నుమూశాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఏఎస్సై వి. శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విషం పండిస్తున్నామా...?
జిల్లాలో పంటలు విస్తారంగా పండిస్తున్నారు. వాటి దిగుబడి పెరగడానికి లక్షలాది బస్తాల రసాయనిక ఎరువులు కుమ్మరిస్తున్నారు. తెగుళ్లు ఆశించకుండా ఇబ్బడి ముబ్బడిగా పురుగుమందులు స్ప్రే చేస్తున్నారు. ఇలా పండించే పంట కాస్తా విషతుల్యం చేస్తున్నారు. సేంద్రియంపై ఎంతగా అవగాహన కల్పిస్తున్నా... ఎందుకో మారలేకపోతున్నారు. విజయనగరం ఫోర్ట్: రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం పెరుగుతోంది. సేంద్రియ ఎరువుల వాడకం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ రైతులు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించడం లేదు. సాగువిస్తీర్ణానికి సరి సమాన స్థాయిలో రసాయనిక ఎరువులు, పురుగుమందులు వినియోగిస్తున్నారు. చిన్న సమస్యకూ రసాయనిక మందులే విరుగుడుగా భావిస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు కాస్త ఆలస్యంగా పడటం వల్ల కొన్ని ప్రాంతాల్లో నాట్లు ఆలస్యంగా వేశారు. దీనివల్ల పంట ఎదుగుదల కోసం రైతులు ఎరువులను అధికంగా వినియోగించారు. పంటలకు తెగుళ్లు ఆశించడంతో పురుగుమందులను అధికంగా వినియోగించారు. ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లాలో లక్ష 90 వేల హెక్టార్లలో వరి, మొక్కజొన్న, వేరుశనగ, చెరకు తదితర పంటలు సాగు చేశారు. వాటికి 12.39 లక్షల బస్తాల ఎరువులను రైతులు వినియోగించారు. అంతేగాదు... 1.60 లక్షల లీటర్ల పురుగుమందులను వాడారు. తెగుళ్ల నివారణకు పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణం, వేప కషాయం, వేపనూనె వంటి వాటితో తక్కువ ఖర్చుతో నివారించవచ్చు. కాని చాలా మంది రైతులు అవగాహన లేక రసాయనిక ఎరువులు, పురుగు మందులనే వినియోగిస్తున్నారు. రైతులు పంట దిగుబడి పెంచేందుకు పోటీపడి నారుమడి నుంచి పంటకోత దశ వరకు ఎకరానికి 4 నుంచి 5 బస్తాల వరకు రసాయనిక ఎరువులు, 2 లీటర్ల వరకు పురుగు మందులు వాడుతున్నారు. ఇలా మొత్తం ఎరువులు, పురుగుమందులకోసం దాదాపు రూ.150 కోట్లు వరకు వెచ్చించారు. సేంద్రియంపై పెరగని ఆసక్తి.. రైతాంగంలో ఒకప్పుడు ఉండే సహనం... ఆసక్తి ఇప్పుడు సన్నగిల్లుతోంది. ఒకప్పుడు పూర్తిగా గెత్తం వంటివాటికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవా రు. కానీ సునాయాసంగా మార్కెట్లో లభ్యమ య్యే ఎరువులను కొనుగోలు చేసి వేసేస్తున్నారు. తక్కువ ఖర్చుతో తయారయ్యే సేంద్రియ ఎరువులుగానీ... తెగుళ్ల నివారణకోసం తయారయ్యే ద్రావణాల జోలికి పోవడం లేదు. దీనికి కాస్తంత శ్రమపడాల్సి రావడమే కారణం. వాస్తవానికి ర సాయనిక ఎరువుల వినియోగంవల్ల ఏడాదికేడాదికీ భూసారం తగ్గిపోతోంది. దిగుబడిపై దాని ప్రభావం చూపుతోంది. అయినా రైతాంగం మా త్రం రసాయనికంపైనే ఆసక్తి కనబరుస్తున్నారు. సేంద్రియమే మేలు.. పంటలకు ఆశించే తెగుళ్లు, పురుగులను సేంద్రియ ఎరువుల ద్వారా కూడ నివారించవచ్చు. ప్రకృతిలో దొరికే వేపగింజలతో చేసే వేపకషాయం, పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణం, వేపనూనె తయారీకి అతి తక్కువ ఖర్చు వుతుంది. వీటిని వినియోగించి తెగుళ్లను సమర్థంగా నివారించవచ్చు. వర్మీకంపోస్టు, అజొల్లా వంటివి వేసి కూడా పంటలను పండించవచ్చు. దీనివల్ల పంటలు ఆరోగ్యకరంగా ఉంటాయి. వాటి ఉత్పత్తులకు మంచి డి మాండ్ ఉంటుంది. – టి.ఎస్.ఎస్.కె.పాత్రో, వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి -
ఆశ చూపారు..అంతా మాయ చేశారు..
‘ఇస్తామంటే ఆశ... కొడతామంటే భయం...’ ఇది మానవ సహజం. ఇక్కడ ఇస్తామని ఆశ పెట్టిన గత ప్రభుత్వం లేనిపోని కారణాలతో అందనీయకుండా మాయ చేసింది. ఏదో వస్తుందన్న ఆశతో దరఖాస్తులు... ఇతర ధ్రువపత్రాలకోసం వేలాదిరూపాయలు ఖర్చుచేసిన లబ్ధిదారులు ఇప్పుడు లబోదిబో మంటున్నారు. విజయనగరం పూల్‌బాగ్: గత ప్రభుత్వం 2018–19 ఆర్థిక సంవత్సరానికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ. 26.96కోట్లతో 1783 యూనిట్లు రుణాలుగా అందిస్తామని ఆర్భాటంగా ప్రకటించింది. కానీ అందులో 883 మందికి సబ్సిడీ రిలీజ్ కాగా, 408 యూనిట్లు మాత్రమే గ్రౌండింగ్ పూర్తి చేసింది. మిగిలినవారికి రిక్తహస్తంచూపింది.2018–19 సంవత్సరం లో 8745 మంది ఎస్సీ లబ్ధిదారులు ఎంతో ప్రయాసలకోర్చి మీసేవ, ఈ –సేవా నెట్ సెంటర్లలో రుణాల కోసం ధ్రువపత్రాలు ఆన్లైన్ చేయించుకున్నారు. ఇందుకోసం తలకుమించి ఖర్చుచేశారు. చెప్పులు అరిగేలా అనేకసార్లు వివిధ కార్యాలయాల చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిరిగారు. సరిగ్గా రుణాలు మంజూరు చేసేసమయానికి ఎన్నికల కోడ్ పేరుతో అప్పటి ప్రభుత్వం రుణాల మంజూరు నిలిపివేసింది. ఇక ఏం చేయాలో తెలీక దరఖాస్తులుదారులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడారు. 8745 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 1783 యూనిట్లు మంజూరయినట్టు చెప్పి... కేవలం 883 మందికే సబ్సిడీ రిలీజ్ చేశారు. తీరా రూ.13.62కోట్లతో 408 యూనిట్లు గ్రౌండింగ్ చేశా రు. మిగిలినవారి పరిస్థితి అగమ్యగోచరం చేశారు. అయితే కొత్త ప్రభుత్వ ఏర్పాటయ్యాక... నాడు దరఖాస్తు చేసుకున్నవారి పరిస్థితిని గుర్తించి మళ్లీ ఈ ఏడాది దరఖాస్తు చేసుకోనక్కర లేకుండా తాజా సంవత్సరానికి వాటిని బదలాయించారు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి 1355 యూ నిట్లు మంజూరుకాగా వాటి కోసం రూ.23.25 కోట్లు మంజూరయ్యాయి.వాటి కో సం 8151 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా రుణా ల కోసం దరఖాస్తు చేసుకోవటానికి ఈ నెల 31వ తేదీ వరకు గడువు పెంచినట్లు అధికారులు చెబుతున్నారు. పాతవారికి మరో ఛాన్స్.. 2018–19 ఆర్థిక సంవత్సరంలో స్వయం ఉపాధి రు ణాలకోసం దరఖాస్తు చేసు కుని రుణాలు మంజూరు కాని 900 దరఖాస్తులను ఈ ఏడాదికి బదలాయించాం. వారు తిరిగి దరఖాస్తు చేసుకోనక్కర్లేదు. ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. – సాధు జగన్నాథం, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్, విజయనగరం -
పేదోళ్లకు పెద్ద కష్టం
ఆ ఇంట్లో గత 15 ఏళ్ల నుంచి ఓ మహిళ, ముగ్గురు బాలికలు నివాసం ఉంటున్నారు. భర్త అనారోగ్యంతో చనిపోవడంతో పాచి పనులు చేస్తూ ఒకటిన్నర దశాబ్ద కాలంగా ముగ్గురు బిడ్డలను ఆ తల్లే పోషిస్తోంది. బిడ్డలను ఉన్నత చదువులు చదివించాలని ఆశపడింది. ముగ్గురినీ పదో తరగతి పైగానే చదివించింది. ఓవైపు పెళ్లీడుకొచ్చిన బిడ్డలు, మరోవైపు వారి చదువులు.. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ముగ్గురూ చదువులు మానాల్సిన దుస్థితి ఏర్పడింది. ఒక్కొక్కరికైనా పెళ్లి చేసేందుకు నలుగురూ పనులకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ, ఇంతలోనే విధి వెక్కిరించింది. వారి జీవితాలను ఓ కుదుపుకుదిపేస్తోంది. తినడానికి సరైన తిండి లేక ‘ఆకలి’ ఆ ఇంట్లో తల్లీకూతురిని మంచాన పడేసింది. మండల కేంద్రం మెంటాడ దిగువ వీధిలోని ఓ నిరుపేద కుటుంబం దీనావస్థ ఇది. సాక్షి మెంటాడ: మెంటాడ దిగువ వీధిలో అరసాడ సత్యవమ్మ, తిరుపతిరావు కాపురం ఉంటుండే వారు. వీరికి ముగ్గురు కుమార్తెల సంతానం. అయితే సత్యవతమ్మ భర్త తిరుపతిరావు సుమారు 15 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో పిల్లలను పోషించేందుకు, వారిని చదివించడానికి సత్యవతమ్మ.. ఉపాధి, ఎంపీడీఓ, వెలుగు కార్యాలయాల్లో పాచి పనులు చేసేది. ఈ పనులు చేస్తూనే పెద్ద కుమార్తె లక్ష్మిని 10వ తరగతి, రెండో కుమార్తె రామకృష్ణమ్మను డైట్, మూడో కుమార్తె రాజేశ్వరిని ఇంటర్మీడియట్ వరకు చదివించింది. ఒక్క మహిళ సంపాదనతో నలుగురి పోషణ, ముగ్గురి చదువు భరించే ఆర్థిక స్తోమత లేకపోవడంతో మధ్యలోనే వారి చదువులు ఆగిపోయాయి. గంజి కూడా కాచుకోలేని దుస్థితి.. ముగ్గురు కూతుర్లూ, తాను ఏవో ఒక పనులు చేసుకోవాలని నిర్ణయించుకోగా, అంతలోనే సత్యవతమ్మకు వెన్ను, భుజం పక్క భాగంలో తీవ్రమైన నొప్పి రాసాగింది. దీంతో నెల్లిమర్ల మిమ్స్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోగా, పరిస్థితి బట్టి వైద్యులు ఆమెకు అక్కడే ఆపరేషన్ చేశారు. కానీ మందులు కొనుగోలుకు, మూడు పూటలా కాస్తా గంజి నీళ్లు తాగేందుకు కూడా వారి వద్ద డబ్బు లేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సరైన తిండి లేక సత్యవతమ్మ, ఆమె రెండో కుమార్తె అరసాడ రామకృష్ణమ్మ ఏకంగా మచ్చం పట్టారు. రామకృష్ణమ్మ కీళ్ల సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. తన పరిస్థితి ఇలా ఉండగా, కూతురు కూడా మంచాన పడటంతో సత్యవతమ్మ మరింత కుంగిపోయి పూర్తిగా మంచం పట్టింది. సాయం కోసం ఎదురుచూపులు.. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబానికి ఇంతటి కష్టం వచ్చిపడటంతో ఇంట్లో అందరూ బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. మెరుగైన వైద్యం సంగతి పక్కనపెడితే.. కనీసం తిండి కూడా లేకపోవడంతో ఇంటిళ్లపాదీ ఆందోళన చెందుతున్నారు. ఎవరైనా దాతలు ముందుకొచ్చి తమ ప్రాణాలు కాపాడేందుకు సహకరిస్తారని వారు ఎదురు చూస్తున్నారు. తమకు సాయం చేయాలనుకునే వారు 9491769356 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని వారు అభ్యర్థిస్తున్నారు. వలంటీర్ పోస్ట్ కోసం కాళ్లు పట్టుకున్నా.. మా ఇంట్లో ఆర్థిక పరిస్థితి గురించి గ్రామస్తులకు, అధికారులకు తెలుసు. కనీసం గ్రామ వలంటీర్ పోస్టు ఇవ్వాలని గ్రామంలో ఉన్న అందరి కాళ్లు పట్టుకున్నాను. చివరకు ఎంపీడీఓకూ మా పరిస్థితి వివరించాను. ఏ ఒక్కరూ మా కుటుంబంపై కనికరం చూపించలేదు. ఇప్పటికైనా మమ్మల్ని ఆదుకోవాలని వేడుకుంటున్నా. – అరసాడ రామకృష్ణమ్మ (డైట్ , మెంటాడ ) -
నరకానికి కేరాఫ్..
సాక్షి ప్రతినిధి విజయనగరం: విజయనగరంలోని జేఎన్టీయూకే క్యాంపస్‌లో సమస్యలు తిష్ట వేశాయి. వందల మంది చదువుతున్న ఈ యూనివర్సిటీలో సగానికి పైగా విద్యార్థులు వసతి గృహాల్లోనే ఉంటూ కాలేజ్ మెస్‌లోనే తింటున్నారు. కానీ కొన్ని నెలలుగా ఈ మెస్ సరిగ్గా నడవడం లేదు. కనీసం తాగునీరు కూడా లేకపోవడంతో విద్యార్థులు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరానికి వచ్చి భోజనం చేయాల్సి వస్తోంది. లేదా పస్తులుండాలి. మరో వైపు కళాశాలలో పరిశోధన శాల అభివృద్ధికి వచ్చిన నిధులు కూడా నిరుపయోగంగా పడి ఉన్నాయి. విద్యార్థులకు అవసరమైన స్టేషనరీ కూడా అందుబాటులో ఉండటం లేదు. ఇంత జరుగుతున్నా నిర్వాహకులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దీనిపై రెండు రోజులుగా పగలు, రాత్రి అన్న తేడా లేకుండా విద్యార్థులు ఆందోళనల చేపడుతున్నారు. ప్రిన్సిపల్ ఆధిపత్యం.. కళాశాలలో మొత్తం 1670 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో దాదాపు 1430 మంది వసతి గృహంలోనే ఉంటున్నారు. స్టూడెంట్ మెస్‌లు నడుపుతూ విద్యార్ధులకు భోజన వసతి కల్పిస్తున్నారు. అయితే స్టూడెంట్స్ మేనేజ్మెంట్ నిర్వహణలో భోజన వసతి వ్యవహారంలో స్టూడెంట్స్‌కి స్వేచ్ఛ ఇవ్వడం లేదు. ప్రిన్సిపల్ ఆధిపత్యం వల్ల మెస్ చార్జీలు భారీగా పెరుగుతున్నాయి. కాంట్రాక్ట్ పద్ధతి మెస్ నిర్వహణలో రూ.3 వేలు వరకు వచ్చిన బిల్లును స్టూడెంట్ మేనేజ్మెంట్ నిర్వహణ ద్వారా రూ.1400 కి తీసుకొచ్చారు. కానీ ప్రిన్సిపాల్ ఆధిపత్యంలో మెస్ నిర్వహణ వచ్చినప్పటి నుంచి రూ.1900 కి మెస్ బిల్లు చేరింది. దాదాపు నెలన్నరగా విద్యార్ధుల చేత నడిపించే మెస్‌లకు నీటి సౌకర్యం ఆగిపోయింది. విద్యార్థులు యాజమాన్యానికి సమాచారం అందించినా ప్రిన్సిపల్ పట్టించుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో విద్యార్థులు విజయనగరం వచ్చి భోజనం చేస్తున్నారు. రెండేళ్లుగా కళాశాల ప్రాంగణానికి ఇంటర్నెట్ సౌకర్యం లేదు. ప్రయోగశాల అభివృద్ధికి సంబంధించిన నిధులు ఉన్నప్పటికీ రెండేళ్లుగా వాటి ఏర్పాటుకు సంబంధించిన టెండర్లను పిలిచి డిపార్ట్మెంట్లకు అందజేయడం లేదు. నిధులున్నా విద్యార్థులకు ప్రయోగశాల నైపుణ్యాలను అప్‌గ్రేడ్ చేయలేదు. హాస్టల్లో మౌలిక సౌకర్యాల కొరత ఉంది. క్రీడాప్రాంగణం కళాశాల క్రీడలు ఆడుకునే స్థాయిలో లేదు. వీటిపై విద్యార్థులెవరైనా వ్యక్తిగతంగా నిలదీసినా, ప్రశ్నించినా వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నా రు. మార్కులు తగ్గించేస్తామంటూ బెదిరిస్తున్నారని విద్యార్థులు అంటున్నారు. ఈ నేప థ్యంలో మూకుమ్మడిగా విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. మిడ్ ఎగ్జామ్స్‌కి దూరమైనా కూడా నిరసనలో పాల్గొంటున్నారు. దిగివచ్చిన రిజిస్ట్రార్.. జేఎన్టీయూ వీసీ వస్తేగానీ నిరసన విరమించేది లేదంటూ మంగళ వారం అర్ధరాత్రి దాటిన తరువాత కూడా విద్యార్థులు ఆందో ళన కొనసాగించారు. రాత్రి వేళ చీకట్లోనూ కళాశాల గేటు వద్ద బైఠాయించారు. చేసేది లేక జేఎన్టీయూ కాకినాడ యూనివర్శిటీ రిజస్ట్రార్ సుబ్బారావు బుధవారం విజయనగరం వచ్చారు. తొలుత కళాశాల ప్రిన్సిపాల్, వైస్‌ప్రిన్సిపాల్, వివిధ విభాగాల అధిపతులు, ఫ్యాకల్టీలతో సమస్యలపై సమీక్షించారు. అనంత రం విద్యార్థుల వద్దకు వచ్చివారి సమస్యలను తెలుసుకున్నారు. కళాశాల నిర్వహణలో లోపాలున్నట్లు ఆయన గుర్తించారు. అకడమిక్కి నష్టం కలగకుండా వాటిని సరిదిద్దుకుందామని వారికి హామీ ఇచ్చారు. సమస్యలు చెప్పే వారిపై పరోక్షంగా ఫ్యాకల్టీ శిక్షలు వేస్తున్నారని విద్యార్థులు రిజిస్ట్రార్ ముందు ఏకరుపు పెట్టడంతో అక్కడున్న కళాశాల ఫ్యాకలీ, ఇతర సిబ్బందిని రిజస్ట్రార్ కళాశాల లోపలికి పంపారు. అనంతరం విద్యార్థులు చెప్పిన సమస్యల్లో ప్రధానంగా కళాశాల గ్రంథాలయ సౌకర్యాన్ని వారం రోజుల్లో పూర్తి స్థాయిలో కల్పిస్తామని హామీ ఇచ్చారు. రూ.లక్షలోపు నిధులను విడుదల చేసే అర్హత తనకు ఉందని ప్రస్తుతం సెమిస్టర్‌కి అవసరమైన తక్షణ మెటీరియల్‌ని తెప్పిస్తామని చెప్పారు. గ్రంథాలయంలో కంప్యూటర్ల సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచాలన్న డిమాండ్‌పై స్పష్టమైన హామీ ఇచ్చారు. వసతి గృహంలోని మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలిస్తాన్నారు. ఎప్పటిలాగే మెస్‌బిల్లును తగ్గించుకోవడానికి మెస్ నిర్వాహణలో ఫ్యాకల్టీ ఆధిపత్యం లేకుండా చేయాలని విద్యార్థులు కోరారు. స్టూడెంట్ మేనేజ్ మెంట్ పద్ధతిలో జరుగుతున్న మెస్ నిర్వహణలో పూర్తిగా విద్యార్థులకే స్వేచ్ఛ ఇస్తామని హామీ ఇచ్చారు. వీసీ రావాల్సిందే... రిజిస్ట్రార్ ఇచ్చిన హామీలపై విద్యార్థులు సంతృప్తి చెందలేదు. రిజస్ట్రార్ సుబ్బారావు విద్యార్థుల సమస్యలు ఒక్కొక్కటిగా వింటూ పరిష్కార మార్గాలు చెపుతూ విద్యార్థులకు హామీలిచ్చారు. దాదాపు నాలుగు అంశాల తరువాత బాలికల హాస్టల్ సమస్యలు చర్చలోకి వచ్చాయి. ఫ్యాకల్టీ, హాస్టల్ ఇతర సిబ్బంది వారిపై చేస్తున్న అసభ్యకర చర్యలను బాలికలు చెపుతున్న సమయంలో పరిష్కార మార్గాలు చెప్పకుండా మధ్యలో రిజిస్ట్రార్ కళాశాలలోపలికి వెళ్లిపోయారు. చాలా సేపటి వరకూ బయటకు రాకపోవడంతో విద్యార్థులు నిరసనలు కొనసాగించారు. రాత్రి 9.30 గంటల సమయంలో రిజిస్ట్రార్ మరలా విద్యార్థుల దగ్గరకు వచ్చారు. వీసీ వస్తేనే తాము ఆందోళన విరమిస్తామని విద్యార్థులు పట్టుబట్టి కూర్చున్నారు. రాత్రి 10 గంటలకు కూడా చర్చలు కొనసాగుతున్నాయి. -
వృద్ధుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం..
సాక్షి, విజయనగరం: వయో వృద్ధుల సంక్షేమానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి అన్నారు. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా మంగళవారం విజయనగరం జిల్లా ఏరియా ఆసుపత్రిలో వృద్ధుల వార్డును డిప్యూటీ సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వృద్ధులకు అన్ని విధాలుగా చేయూతనందించే దిశగా చర్యలను చేపట్టామని తెలిపారు. గత ప్రభుత్వం ఇస్తున్న పింఛను మొత్తాలను పెంచడంతో పాటుగా.. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రత్యేక వైద్యసేవలను అందించనున్నామని వెల్లడించారు. పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో 60 ఏళ్లు దాటిన వృద్ధుల కోసం 10 పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ వార్డులో వయో వృద్ధులకు ప్రత్యేకంగా పడకలను కేటాయించి అవసరమైన చికిత్సలను అందిస్తామని తెలిపారు. సేవలను సీనియర్ సిటిజన్లు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, అధికారులు పాల్గొన్నారు -
సిరిమానోత్సవ ఏర్పాట్లపై మంత్రి బొత్స సమీక్ష
సాక్షి, విజయనగరం: పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ ఏర్పాట్లపై విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్ష జరిపారు. విజయనగర సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉత్సవాలు నిర్వహించాలన్నారు. అక్టోబర్ 12 నుంచి 14 వరకు మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో సాంస్కృతిక, సాహిత్య,క్రీడా కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. అన్నిశాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, బడుకొండ అప్పలనాయుడు పాల్గొన్నారు. చంద్రబాబుకు మతి భ్రమించింది.. చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఆయన ఆదివారం విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ.. గ్రామ సచివాలయం, వాలంటీర్ల ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా నిర్వహించామన్నారు. గోదావరి బోటు ప్రమాదం గురించి ప్రస్తావిస్తూ..బోటు 300 అడుగుల లోతులో ఉండటం వలన వెలికితీత కష్టంగా మారిందని.. జరిగిన దురదృష్ట ఘటనను చంద్రబాబు రాజకీయాలకు వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై అనేక మంది ఇతర పార్టీ నేతలు వైఎస్సార్సీపీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. -
ఆట లేదు వానే..!
సాక్షి ప్రతినిధి విజయనగరం: బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్–దక్షిణాఫ్రికా జట్ల మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుతగిలాడు. గురువారం జల్లులతో ప్రారంభమైన వర్షం చాలాసేపు పడటంతో తొలి రోజు ఆటను నిర్వాహకులు పూర్తిగా రద్దు చేశారు. విజయనగరం సమీపంలోని డా. పీవీజీ రాజు ఏసీఏ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మైదానం వేదికైన ఈ మ్యాచ్‌లో కనీసం టాస్ కూడా పడలేదు. వాతావరణ ప్రభావంతో మైదానాన్ని పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. ఉదయం 8 గంటలకే చేరుకున్న ఇరు జట్ల క్రీడాకారులు చాలాసేపు వేచి చూశారు. చివరకు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత విశాఖపట్నం తిరుగు ప్రయాణమయ్యారు. అంతర్జాతీయ స్థాయి క్రికెటర్ల ఆటను దగ్గరగా చూసేందుకు వచ్చిన అభిమానులు నిరాశగా వెనుదిరిగారు. అంతకుముందు ఉదయం 9.30 సమయంలో వరుణుడు కాస్త తెరపినివ్వడంతో ఆట ప్రారంభించే యత్నాలు చేశారు. అంతలోనే మళ్లీ వాన మొదలైంది. శుక్రవారం సైతం వర్షం కురిసే అవకాశం ఉంది. -
అమ్మ జాతర ఆరంభం
సాక్షి, విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి జాతరకు శనివారం అంకురార్పణ చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛరణాల మధ్య వేకువజాము నుంచి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు జరిపారు. ముందుగా అమ్మవారి మండల దీక్షలను శాస్త్రోక్తంగా చేపట్టారు. అనంతరం ఉదయం 9.30 గంటలకు అమ్మవారి చదురుగుడి వద్ద పందిరిరాట వేశారు. 10.30 గంటలకు రైల్వేస్టేషన్ వద్ద ఉన్న వనంగుడి వద్ద పందిరిరాట వేసి జాతర మహోత్సవాలను ప్రారంభించారు. పైడితల్లి అమ్మవారి సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు ప్రత్యేకపూజలు చేసి, ఉత్సవానికి నాం దిపలికారు. సుమారు 200 మంది దీక్షాపరులు మాలధారణ చేశారు. రామవరంలో సాక్షాత్కరించిన సిరిమాను.. గంట్యాడ మండలం రామవరం గ్రామంలోని భవిరి వారి కల్లాల్లో పైడితల్లి అమ్మవారి సిరిమాను సాక్షాత్కరించింది. ఈ మేరకు పైడితల్లి అమ్మవారి దేవస్థానం అధికారులు, సిరిమా ను పూజారితో కలిసి ఆ ప్రదేశానికి వెళ్లారు. సిరిమాను, ఇరుసుమానుకు ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా సిరిమాను పూజారి వెంకటరావు మాట్లాడుతూ రామవరం గ్రామంలో భవిరి అప్పారావు, ముత్యాలు, శ్రీనివాసరావు కలాల్లో తల్లి సాక్షాత్కరించిందన్నారు. తమ గ్రామంలో సిరిమానును తల్లికోరుకుందని తెలుసుకున్న గ్రామస్తులు ఆ ప్రాంతానికి చేరుకునిచేరుకుని సిరిమాను, ఇరుసుమాను (చింతచెట్టు)లకు పూజలు చేశారు. పసుపు, కుంకుమలను సమర్పించారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. తొలిరోజే ఎస్పీ రాజకుమారి స్వీయపర్యవేక్షణ.. గతంలో ఎన్నడూలేని విధంగా ఎస్పీ బి.రాజకుమారి శనివారం రాత్రి సిరిమాను తిరిగే హు కుం పేట నుంచి కోట జంక్షన్ వరకు తమ సిబ్బందితో కలిసి దాదాపు మూడు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ స్వీయ పర్యవేక్షణ చేశారు. సిరిమాను తిరిగే ప్రదేశాల్లో ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉంటాయో, వాటిని ఎలా అధిగమించాలో సంబంధిత అధికారులతోనడుస్తూనే సమీక్షించారు. ఈ సందర్భం గా ఆమె కోట జంక్షన్ వద్ద మాట్లాడుతూ అమ్మపండగను అందరూ ఎంతో ప్రశాం తమైన వాతావరణంలో నిర్వహించుకో వాలని, అందుకు జిల్లా పోలీస్‌శాఖ తొలి రోజు నుంచే కసరత్తు ప్రారంభించిందన్నారు. కొత్తగా జిల్లాకు వచ్చిన అధికా రులందరికీ అవగాహన కోసం ప్రతీ స్పాట్‌ను క్షుణ్ణంగా పరిశీలించామని, పూజారి వెంకటరావుని, ఆలయ అధికారులను అడిగి వివరాలు సేకరించామన్నారు. ఆమె వెంట అదనపు ఎస్పీ ఎన్.శ్రీదేవీరావు, ఓఎస్డీ రామ్మోహనరావు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పాల్గొన్నారు. అమ్మ సాక్షాత్కారం మా అదృష్టం.. పైడితల్లి మా కల్లాల్లో సాక్షాత్కరించడం మా గ్రామ అదృష్టంగా భావిస్తున్నాం. ఏటా క్రమం తప్పకుండా అమ్మను కుటుంబ సమేతంగా దర్శించుకుంటాం. పసుపు, కుంకుమలు సమర్పిస్తాం. గ్రామస్తులందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. పెద్దఎత్తున మా గ్రామంలో పండగ చేసుకుంటాం. – బవిరి అప్పారావు, తోట యజమాని 18 ఏళ్ల తర్వాత మరలా మాకు అదృష్టం.. పైడితల్లి అమ్మవారు 18 ఏళ్ల తర్వాత మరలా మా గ్రామంలో ఉన్న సిరిమానును కోరుకోవడం మా అదృష్టం. అప్పట్లో సరికోలు వారి కలాల్లో అమ్మ కోరుకుంది. మరలా ఇప్పుడు మా ఇంటికి పక్కనే బవిరి వారి కల్లాల్లో వెలిసిన మానును అమ్మ కోరుకుంది. మాకు ఇక రోజూ పండగే. ఈ ఏడాది అంగరంగ వైభవంగా తల్లి పండగను నిర్వహించుకుంటాం. – రొంగలి, సత్యవతి, ఈశ్వరమ్మ, గ్రామస్తులు -
ఉల్లి.. లొల్లి...!
ఉల్లి చేసిన మేలు తల్లి చేయదనేది నానుడు. ఉల్లి గొప్పతనాన్ని కవులు ఎంతగానో పొగడారు. దీనివెనుక ఉల్లి ఆవశ్యకత అంత. ఉల్లి లేనిది వంటకాలు రుచి తగలడం కష్టమే. దాదాపు అన్ని రకాల కూరలు, ఇతర వంటల్లో ఉల్లి వినియోగించాల్సిందే. కాబట్టే ఉల్లికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అయితే పంట సరిపడినంత ఉన్నంత కాలం ఇబ్బంది ఉండదు. సరుకు దొరకడంతో పాటు ధరలు స్వల్పంగా మాత్రమే పెరుగుదల, తగ్గుదల ఉంటాయి. అయితే సరుకు కొరత ఏమాత్రం తక్కువగా ఉన్న ధరలు అమాంతంగా పెరిగిపోవడం ఖాయం. ప్రస్తుతం అదే జరిగింది. విజయనగరం గంటస్తంభం: ఏటా ఏదో ఒక సమయంలో ఉల్లి ధరలు లొల్లి సృష్టించడం ఆనవాయితీగా మారిపోయింది. ఈ ఏడాది ప్రస్తుత మార్కెట్లో ఉల్లి ధరలు మళ్లీ అమాంతం పెరిగి కొనుగోలుదారులను కంటనీరు పెట్టిస్తున్నాయి. నెలరోజుల వ్యవధిలో సగానికి పైగా ధర పెరిగింది. దీంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఇదే అదునుగా వ్యాపారులు కృత్రిమ డిమాండ్ సృష్టించి మరింత ధర పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా రానున్న రోజుల్లో మరింత పెరుగుతాయని ప్రచారం చేస్తున్నారు. ఫలితంగా ఉల్లి ధరలు దసరా, అమ్మవారి పండగ నాటికి ఎంతకు చేరుతాయోనని కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు. పెరిగిన ఉల్లి ధర.. ఉల్లి ధర నెల రోజుల్లో వంతుకు వంతు పెరిగింది. సెప్టెంబరు ఒకటో తేదీ నాటికి తెలుపు(పెద్ద) ఉల్లి బహిరంగ మార్కెట్లో కేజీ రూ.20 ఉండగా ప్రస్తుతం రూ.40కు పెరిగింది. కనీసం నాలుగైదు రూపాయిలు తేడా ఉండే రైతు బజారులో కూడా బుధవారం రూ.35 ఉంది. ఇక జిల్లాలో అంతగా వినియోగించని కర్నూలు ఉల్లి ధర కూడా ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కేజీ రూ.35 ఉంటే రైతుబజారులో రూ.32 ఉంది. దీని ధర కూడా 20రోజుల్లో వంతుకు వంతు పెరగడం విశేషం. సరుకు కొరత కారణం.. ఉల్లి ధరలు భారీగా పెరగడానికి సరుకు కొరత కారణం. జిల్లాకు మహారాష్ట్ర నుంచి సరుకు వస్తుంది. కర్నూలు నుంచి కొంత సరుకు వస్తుంది. అక్కడ ప్రస్తుతం సరుకు తక్కువగా ఉంది. వర్షాలు పడుతుండడంతో పంట తీసే పరిస్థితి లేక కొరత ఏర్పడింది. ఫలితంగా ఇక్కడ వ్యాపారులు ధరలు పెంచేస్తున్నారు. మళ్లీ అక్కడ సరుకు ఎక్కువగా దొరికే వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. ధరలు పెరుగుతాయని ప్రచారం.. ఇదిలా ఉండగా వ్యాపారులు ధరలు మరింత పెరుగుతాయని ప్రచారం చేస్తున్నారు. సాధారణంగా ఉల్లి ధర కాస్తా పెరిగినపుడు వ్యాపారులు మరింత డిమాండ్ సృష్టించడం జిల్లాలో పరిపాటి. సరుకు రావడం లేదని, తక్కువ సరుకు ఉందని చెప్పి రోజురోజుకు ధర పెంచుతూ వెళ్తారు. వాస్తవానికి ఉల్లి కుళ్లిపోయే సరుకు కావున కొనుగోలు ఆపేస్తే ధర తగ్గుతుంది. కానీ రోజువారీ అవసరాలకు ఉల్లి తప్పనిసరి కావడంతో జనాలు కొనుగోలు చేయకతప్పని పరిస్థితి. దీంతో చిల్లర వర్తకులు వద్ద హోల్‌సేల్ వ్యాపారులు ధరలు పెంచి అమ్ముతుంటారు. ఈ భారం చివరికి వినియోగదారులపైనే పడుతుంది. ప్రస్తుతం ఉన్న సరుకు కొరత, డిమాండ్‌ను అడ్డం పెట్టుకునే ధరలు పెరుగుతాయని ముందే ప్రచారం చేస్తున్నారు. దీంతో వినియోగదారులు మానసికంగా సిద్ధమై పెంచినా కొంటారని వ్యాపారులు ఆలోచన. ఇదిలా ఉండగా ధరలు పెరుగుతాయని వ్యాపారులు చెప్పడంతో వినియోగదారులు మరింత ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు ఉన్న ధరతో సర్దుకుంటున్నామని, మరింత పెరిగితే ఇబ్బందేనని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కృత్రిమ డిమాండ్ రాకుండా అధికారులు దృష్టి సారించాల్సిన పరిస్థితి ఉంది. సరుకు లేకే... ఉల్లి ధర రోజుకు రూపాయి, రెండు పెరుగుతోంది. మహరాష్ట్రలో జనవరి, ఫిబ్రవరిలో పండే సరుకు చివరి దశకు చేరడంతో దొరకడం లేదు. ఈ సీజన్లో కర్నూలు నుంచి ఉల్లి వస్తుంది. కానీ వర్షాలు వల్ల రాకపోవడంతో కొరత ఉంది. దీంతో ధర పెరుగుతుంది. – ఎస్.వి.వి.లక్ష్మీనారాయణ, వ్యాపారి దృష్టి పెడతాం... ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. సరుకు తక్కువగా రావడం వల్ల అక్కడే పెరగడం వల్ల ఇక్కడ మార్కెట్లో పెరగక తప్పదు. ఇప్పటివరకు కృత్రిమ కొరత, డిమాండ్ వ్యాపారులు సృష్టిస్తున్నట్లు సమాచారం లేదు. కానీ మున్ముందు ధర పెరిగే అవకాశం ఉన్నందున సరుకు లభ్యతపై దృష్టి పెడతాం. – శ్యామ్‌కుమార్, ఏడీ మార్కెట్ శాఖ -
క్రీడలకు వైఎస్ జగన్ సర్కార్ అధిక ప్రాధాన్యత
సాక్షి, విజయనగరం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో రాష్ట్ర్రస్థాయి సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడలపై విద్యార్థుల్లో ఆసక్తి పెంపొందించాలని పిలుపునిచ్చారు. క్రీడల పట్ల తల్లిదండ్రులు కూడా అవగాహన కలిగి ఉండాలన్నారు. విజయనగరంలో కబడ్డీ అకాడమీ ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పారు. క్రీడాకారులు మంచి ఫలితాలు సాధించాలి: బొత్స పట్టణ నడిబొడ్డున ఉన్న రాజీవ్ స్టేడియంలో ఏర్పాటు చేసిన వసతులను వినియోగించుకుని.. క్రీడాకారులు మంచి ఫలితాలు సాధించాలని మంత్రి బొత్స సత్యనారాయణ ఆకాంక్షించారు. ఈ స్టేడియానికి అవసరమైన అన్నీ మౌలిక వసతులను కల్పిస్తామన్నారు. పట్టణంలో ఖాళీ స్థలాలు ఉన్న అన్ని పార్కుల్లోనూ ఆటస్థలాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. విద్యార్థులు ఉత్సాహంగా వుండాలంటే.. విద్యతో పాటు వ్యాయామం అవసరమన్నారు. పీవీ సింధును ఆదర్శంగా తీసుకోవాలి: పుష్పశ్రీవాణి రాష్ట్రంలోని క్రీడాకారులంతా బ్యాడ్మింటన్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన సింధును ఆదర్శంగా తీసుకోవాలని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి పిలుపునిచ్చారు. ఓటమికి నిరుత్సాహపడి కృంగిపోకుండా విజయం సాధించే వరకూ ప్రయత్నించాలన్నారు. రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నగదు బహుమతులు అందజేస్తోందని వెల్లడించారు. -
సచివాలయ పరీక్షలకు సై..
సాక్షి, విజయనగరం గంటస్తంభం: గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి నడుం బిగించారు. ఇందులో భాగంగా గాంధీజీ కలలు సాకారం చేసేందుకు అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గ్రామస్థాయి నుంచి వ్యవస్థను పటిష్టపరిచేందుకు సచివాలయ ఉద్యోగుల నియామకానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం పరీక్షల నిర్వహణకు తేదీలు ఖరారు చేసింది. కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ నెల 1 నుంచి 8వ తేదీవరకు నిర్వహించే పరీక్షలకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎస్పీ, జాయింట్ కలెక్టర్ వారిని వైస్ చైర్మన్‌గా, జెడ్పీ సీఈవో మెంబర్ కన్వీనర్‌గా, జాయింట్ కలెక్టర్ –2, మరో 13 మంది జిల్లా అధికారులను సభ్యులుగా కమిటీ వేశారు. పరీక్షల నిర్వహణ బాధ్యతను కమిటీ పర్యవేక్షిస్తోంది. విజయనగరం జిల్లాలో భర్తీ చేసే పోస్టులు: 5,915 -దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు: 1,00,783 మంది -జిల్లాలో పరీక్షా కేంద్రాలు: 198 -పరీక్షలను నిర్వహించేందుకు రూటు ఆఫీసర్లు: 61మంది -ఫ్లయింగ్ స్క్వాడ్లు: 20 బృందాలు -చీఫ్ సూపరింటెండెంట్లు: 272 మంది, -అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లు: 128 మంది -సెంటర్ స్పెషల్ ఆఫీసర్లు: 198 మంది -హాల్ సూపరింటెండెట్లు : 1082 మంది -వెన్యూ కో– ఆర్డినేటర్లు: 97 మంది -ఇన్విజిలేటర్లు: 3,042 మంది -పోలీసు బందోబస్తు: 600 మంది రేపటి నుంచి పరీక్షలు.. విజయనగరం జిల్లాలో సెప్టెంబర్ 1 నుంచి 8వ తేదీ వరకు పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం 14 పరీక్షల్లో 10 పరీక్షలు ఇంగ్లిష్, తెలుగు భాషల్లోను, 4 పరీక్షలు కేవలం ఇంగ్లిష్‌లో జరుగుతాయి. -సెప్టెంబర్ 1వ తేదీ ఉదయం 198 పరీక్ష కేంద్రాల్లో 58,812 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారు. ఆ రోజు మధ్యాహ్నం విజయనగరం జిల్లా కేంద్రంలో 22 పరీక్ష కేంద్రాల్లోను, పార్వతీపురంలో 12 పరీక్ష కేంద్రాలను కలిపి 34 కేంద్రాల్లో 11,139 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారు. -సెప్టెంబర్ 3 నుంచి 8వ తేదీ వరకు విజయనగరం జిల్లా కేంద్రంలో మాత్రమే పరీక్షలు జరుగుతాయి. విజయనగరానికి సంబంధించి 47 కేంద్రాల మ్యాపులను తయారుచేసి హెల్ప్‌డెస్క్‌ల ద్వారా ఆటో డ్రైవర్లకు పంపిణీ చేశారు. అభ్యర్థులను సమయానికి పరీక్ష కేంద్రాలకు తరలించేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. - సెప్టెంబర్ 3వ తేదీ ఉదయం 19 పరీక్ష కేంద్రాలలో 6,655 మంది అభ్యర్థులు, మధ్యాహ్నం 10 పరీక్ష కేంద్రాల్లో 4,383 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. -సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం 3 పరీక్ష కేంద్రాల్లో 1336 మంది అభ్యర్థులు, మధ్యాహ్నం 2 పరీక్ష కేంద్రాల్లో 739 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. - సెప్టెంబర్ 6వ తేదీ ఉదయం రెండు పరీక్ష కేంద్రాల్లో 1178 మంది అభ్యర్థులు, మధ్యాహ్నం ఒక పరీక్ష కేంద్రంలో 560 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారు. -సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం 13 పరీక్ష కేంద్రాల్లో 6,858 మంది అభ్యర్థులు మధ్యాహ్నం ఒక పరీక్ష కేంద్రంలో 134 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారు. -సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 3 పరీక్ష కేంద్రాలలో 2,574 మంది అభ్యర్థులు మధ్యాహ్నం 16 పరీక్ష కేంద్రాలలో 6,424 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి.. పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 198 పరీక్ష కేంద్రాల్లో 13 పరీక్ష కేంద్రాలలో దివ్యాంగులు పరీక్షలకు హాజరవుతున్నట్లు గుర్తించారు. వారిక పరీక్ష కేంద్రం నుంచి వారి స్థానం వరకు గ్రామ వలంటీర్ల సహాయంతో తీసుకుని వెళ్లేందుకు వీల్ చైర్లు ఏర్పాటు చేశారు. పరీక్షలకు హాజరవుతున్న అంధులైన అభ్యర్థులకు పదవ తరగతి విద్యార్థులను సహాయకులుగా నియమించారు. విజయనగరంలో 47 కేంద్రాలు గూగుల్ మ్యాప్, కేంద్రాల జాబితా డీటీసీతో ఆటో యూనియన్ల వారికి, పత్రిక విలేకరులకు అందించేందుకు ఏర్పాటు చేశారు. మండల కేంద్రాల్లోని బస్టాండులో రైల్వేస్టేషన్లు, కలెక్టరేట్ సర్కిల్లో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పోలీసు శాఖ భద్రతతో పాటు అంగన్వాడీ, ఆశ వర్కర్లను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. పరీక్ష పత్రాలు ఇప్పటికే మండల పరిషత్ కార్యాలయాల్లో స్ట్రాంగ్‌రూమ్‌లకు చేరుకున్నాయి. అక్కడ పటిష్ట పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. నియమనిబంధనలు ఇలా... -పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు. ఉదయం 10గంటలు, మధ్యాహ్నం 2.30 గంటల లోపు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. -ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుతించబడవు. -పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు ఏదైనా ఐడెంటిటీ కార్డుతో హాజరుకావాలి. -రాష్త్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా, పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తున్నందున అభ్యర్థులు ఎటువంటి ప్రలోభాలకు లోనుకావద్దని, మధ్యవర్తుల మాటలు నమ్మవద్దని, ప్రతిభ ఆధారంగానే ఎంపిక జరుగుతుందని సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, అధికారులు ఇప్పటికే ప్రకటించారు. -ప్రతి పరీక్ష కేంద్రంలో పరీక్ష జరుగుతున్న విధానాన్ని కెమేరాల ద్వారా పర్యవేక్షిస్తారు. పార్వతీపురం, సాలూరు, గజపతినగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, ఎస్.కోట, విజయనగరం క్లస్టర్లుగా విభజించి అన్ని విభాగాలను సమన్వయ పరిచి అధికారులు పర్యవేక్షిస్తారు. బస్సు సర్వీసులు ఇలా... విజయనగరం అర్బన్: వరుస సెలవులు, మరోవైపు సచివాలయ పరీక్షలతో జిల్లాలో వారం రోజుల పాటు ప్రయాణికుల రద్దీ పెరగనుంది. ఆర్టీసీకి పండగ వాతావరణం వచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి 8వ తేదీ వరకు జిల్లాలో నిర్వహిస్తున్న సచివాలయ కార్యదర్శి పోస్టులకు జిల్లాలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో పోస్టులు భారీగా ఉండడంతో అభ్యర్థులు అధికమంది దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులకు వీలుగా జిల్లా వ్యాప్తంగా 140 బస్సులను ఆర్టీసీ ప్రత్యేకంగా కేటాయించింది. ఈ మేరకు ప్రత్యేక సర్వీసుల వివరాలను ఆర్టీసీ నార్త్ ఈస్ట్ కోస్ట్ ఆర్ఎం ఎ.అప్పలరాజు విడుదల చేశారు. -గుమ్మలక్ష్మీపురం, కురుపాం, పార్వతీపురం, సీతానగరం, బొబ్బిలి ప్రాంతాలకు 5 బస్సులు -కురుపాం, పార్వతీపురం, సీతానగరం, బొబ్బిలి ప్రాంతాలకు 5 బస్సులు -గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం, సీతానగరం, బొబ్బిలి ప్రాంతాలకు 6 బస్సులు -కొమరాడ, పార్వతీపురం, సీతానగరం బొబ్బిలి ప్రాంతాలకు 5 బస్సులు -గరుగుబిల్లి, పార్వతీపురం, సీతానగరం బొబ్బిలి ప్రాంతాలకు 5 బస్సులు -పార్వతీపురం, బొబ్బిలి, బలిజిపేట ప్రాంతాలకు 3 బస్సులు -పార్వతీపురం, బొబ్బిలి, రామభద్రపురం, గజపతినగరం, బొండపల్లి, విజయనగరం ప్రాంతాలకు 10 బస్సులు -సాలూరు, మక్కువ, సీతానగరం, పార్వతీపురం ప్రాంతాలకు 3 బస్సులు -సాలూరు– మక్కువల మధ్య రెండు, సాలూరు–పాచిపెంటల మధ్య మూడు, సాలూరు–విజయనగరం మధ్య 6 ప్రత్యేక సర్వీసులు -సాలూరు, రామభద్రపురం, బలిజిపేట మధ్య 2 బస్సులు -సాలూరు, రామభద్రపురం, బాడంగి, తెర్లాం ప్రాంతాలకు 4 సర్వీసులు -సాలూరు, రామభద్రపురం, పార్వతీపురం ప్రాంతాలకు 3 సర్వీసులు -సాలూరు, బాడంగి, ఉత్తరావిల్లి, గరివిడి, నెల్లిమర్ల, విజయనగరం, భోగాపురం ప్రాంతాలకు కలిపేందుకు 2 బస్సులు -సాలూరు, బాడంగి, ఉత్తరావిల్లి, గరివిడి, నెల్లిమర్ల, విజయనగరం, పూసపాటిరేగ ప్రాంతాలకు రెండు బస్సులు -సాలూరు, తెర్లాం, ఉత్తరావిల్లి, గరివిడి, నెల్లిమర్ల, విజయనగరం, భోగాపురం ప్రాంతాలకు 6 సర్వీసులు -సాలూరు, తెర్లాం, ఉత్తరావిల్లి, గరివిడి, నెల్లిమర్ల, విజయనగరం, పూసపాటిరేగ ప్రాంతాలకు 6 బస్సులు -భోగాపురం, డెంకాడ, విజయనగరం, నెల్లిమర్ల, గుర్ల, గరివిడి, చీపురుపల్లి 5 బస్సులు, అలాగే పూసపాటిరేగ, డెంకాడ, విజయనగరం, నెల్లిమర్ల, గుర్ల, గరివిడి, చీపురుపల్లి వైపుగా 5 బస్సులు వేశారు. -దత్తిరాజేరు, గజపతినగరం, విజయనగరం కలిపేందుకు 6, విజయనగరం, గజపతినగరం, మెంటాడ మధ్య 5, ఎస్.కోట, జామి, విజయనగరం మధ్య 6, విజయనగరం, జామి, ఎస్.కోట మద్య రెండు బçస్సులు నడపనున్నారు. -విజయనగరం, చీపురుపల్లి, విజయనగరం, డెంకాడ మద్య 6, విజయనగరం, భోగాపురం మధ్య 5, విజయనగరం, పూసపాటిరేగ మధ్య 5 బస్సులు వేశారు. -కొత్తవలస, విజయనగరం మధ్య రెండు, ఎస్.కోట, ఎల్.కోట, కొత్తవలస మధ్య 4 బస్సులు వేశారు. అలాగే, వేపాడ, ఎస్.కోట, జామి, విజయనగరం మధ్య నాలుగు, ఎస్.కోట, గంట్యాడ మధ్య 6 బస్సులు వేశారు. -ఇవి కాకుండా మండల అభివృద్ధి అధికారుల అత్యవసర అవసరాలను దృష్టిలో పెట్టుకొని అందుబాటులో మరిన్ని ఉంచామని ఆర్ఎం అప్పలరాజు తెలిపారు. -
కనుల పండువ... స్వాతంత్య్ర వేడుక...
జిల్లా వ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. వీధి వీధినా... స్వాతంత్య్రవేడుకలు అత్యంత ఉత్సాహవంతంగా సాగాయి. జిల్లా కేంద్రంలోని పోలీస్‌పరేడ్ మైదానంలో కనుల పండువగా సాగిన ఉత్సవంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి పతాకావిష్కరణ గావించారు. జిల్లాస్థాయి ఉన్నతాధికారులు... నాయకులు హాజరైన ఈ ఉత్సవంలో చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖలు ప్రగతిని తెలియజేస్తూ ప్రదర్శించిన శకటాలు అలరించాయి. విజయనగరం గంటస్తంభం: జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ మైదానంలో 73వ స్వాతంత్య్ర వేడుకలు గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి ముఖ్య అతిథిగా జెండా ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి ప్రజలనుద్దేశించి ప్రసగించారు. ఉత్తమ సేవలందించిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. కలెక్టర్ ఎం. హరి జవహర్లాల్, జిల్లా పోలీసు సూపరిండెంట్ రాజకుమారితో కలిసి సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించారు. ప్రభుత్వ పథకాల గురించి తెలియజేసే శకటాలను తిలకించి, స్టాల్స్‌ను సందర్శించి పేదలకు ఆస్తులు పంపిణీ చేశారు. పతాకావిష్కరణతో ఉత్సవాలు ప్రారంభం.. పోలీసు పరేడ్ మైదానంలో ఉదయం 9గంటలకు వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి జెండా ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం ఆమెకు పోలీసులు, ఇతర రక్షకభటులు గౌరవ వందనం చేశారు. అనంతరం శాంతికి సూచికగా పావురాలు ఎగురవేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం మూడు నెలల్లో చేసిన కార్యక్రమాలు, రానున్న ఏడాది కాలంలో చేపట్టే కార్యక్రమాల గురించి ఆమె సుదీర్ఘంగా ప్రసంగించారు. పనితీరుకు ప్రశంస.. స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ఉత్తమ సేవలందించిన అధికారులు, సిబ్బంది, స్వచ్చంద సంస్థలకు ప్రశంసా పత్రాలు ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన వారికి ఉప ముఖ్యమంత్రి వాటిని అందజేశారు. జిల్లాలో 87 శాఖలు, వివిధ విభాగాలకు చెందిన 430మంది ప్రశంసా పత్రాలు అందికున్నవారిలో ఉన్నారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన వినతుల పరిష్కారంలో మంచి ప్రగతి కనపరిచిన వారికి, పారిశుద్ధ్య కార్యక్రమాలు బాగా చేసిన వారికి, వివిధ శాఖల్లో విధుల్లో మంచి పనితీరు కనపరిచిన వారికి ఈ ప్రశంస దక్కింది. అదరహో అనిపించిన సాంస్కృతిక ప్రదర్శనలు.. వేడుకల్లో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఎనిమిది పాఠశాలలకు చెందిన పిల్లలు దేశభక్తి పెంపొందించే గీతాలకు నృత్య ప్రదర్శన చేశారు. ఎవరికి వారే పోటీ, ఎవరికి వారే సాటి అన్న రీతిలో సాగిన ప్రదర్శనలు ఆహూతులను అలరించా యి. భారత దేశ సంస్కృతీ, సంప్రదాయాలు, స్వా తంత్య్ర సమరయోధుల పోరాటం, దేశ గొప్పతనం, ప్రజాస్వామ్యం విశిష్టత చాటిచెబుతూ రచించిన గే యాలకు విద్యార్థులు చూడ ముచ్చటగా నృత్యాలను ప్రదర్శించడం విశేషం. ముందుగా వివిధ పాఠశాల విద్యార్థుల మాస్ డ్రిల్‌తో కార్యక్రమం మొదలైంది. తర్వాత విజయనగరం గరŠల్స్ హైస్కూల్ విద్యార్థినులు వందేమాతరం గేయానికి స్థానికంగా ప్రాచుర్యం పొందిన కర్ర, కత్తి సాములు జోడించి ప్రదర్శన ఇచ్చారు. ఫోర్ట్ సిటీ విద్యార్థులు ఐ యామ్ ఇండియన్ గేయానికి, కేజీబీవీ విద్యార్థినులు ఒకే ఒక్క ఓంకారం అన్న గీతానికి, సెయింట్ మేరీస్ విద్యార్థులు దేశభక్తి గీతానికి, ద్వారకా తిరుమల అంధుల పాఠశాల విద్యార్థులు మేరా భారత్, జిల్లా పోలీసు వెల్ఫేర్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ విద్యార్థులు మేమే ఇండియన్స్, కొత్తవలస ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు పుణ్యభూమి ఈ భరతదేశం, బాడంగి ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు ఇండియా వాలా గేయాలకు నృత్య ప్రదర్శన అందించారు. ఇందులో ద్వారకామయి అంధుల పాఠశాల విద్యార్థులు, ఏపీ మోడ ల్ స్కూల్ విద్యార్థులు, కేజీబీవీ విద్యార్థుల ప్రదర్శనలకు వరుసగా ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు లభించాయి. బాడంగి ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రత్యేక బహుమతి గెల్చుకున్నారు. రూ.336.86కోట్ల ఆస్తులు పంపిణీ.. ఉత్సవంలో భాగంగా పేదలకు రుణాలు, ఆస్తులు పంపిణీ చేపట్టారు. ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి, కలెక్టర్ హరి జవహర్లాల్, ఎస్పీ రాజకుమారి తదితరులు వాటిని అందజేశారు. మైదానంలో మొత్తం 18శాఖలు తమ ప్రగతిని, పథకాలను తెలియజేస్తూ స్టాల్స్ ఏర్పాటు చేశాయి. ఇందులో ఆరుశాఖలు పేదల కు రూ.336.85కోట్ల ఆస్తులు, రుణాలు పంపిణీ చేశా యి. డీఆర్డీఏ–వెలుగు అధికారులు 8642 సంఘాల కు రూ.298.55కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు, 4087 మందికి రూ.19.47కోట్ల స్త్రీనిధి రుణాలు అందజేశారు. వైఎస్సార్ బీమా కింద 456 మందికి రూ.8.36కోట్లు సాయం అందజేశారు.252 రైతు సంఘాలకు రూ.1.26 కోట్లు రుణాలు ఇప్పించారు. విభిన్న ప్రతిభావంతులశాఖ ద్వారా 8మందికి రూ.50వేలు వంతున, బీసీ కార్పొరేషన్ ద్వారా 34మందికి రూ.41.04కోట్లు, కెనరాబ్యాంకు, డీసీసీబీ 9మందికి రూ.15లక్షలు, డీపీవో ద్వారా 2289మందికి రూ.4.65కోట్లు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 68మందికి రూ.2కోట్లు విలువ గల ఆస్తులు, రుణాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో విజయనగరం, నెల్లిమర్ల ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, బడ్డుకొండ అప్పలనాయుడు, అసిస్టెంట్ కలెక్టర్ కేతన్ గార్గ్, ఇన్చార్జి జేసీ–2 సాల్మన్‌రాజ్, డీఆర్వో జె.వెంకటరావు, విజయనగరం ఆర్డీవో జె.వి.మురళి, ఇతర అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, మజ్జిశ్రీనివాసరావు, పెనుమత్స సురేష్‌బాబు, సూర్యనారాయణరాజు పాల్గొన్నారు. -
పేదల భూములపై పెద్దల కన్ను..!
అవి పేద గిరిజనులకు ప్రభుత్వం ఫలసాయం కోసం ఇచ్చిన ఢీ పట్టా భూములు. క్రయవిక్రయాలు జరిపేందుకు అవకాశం లేదు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా నేరం. ఆ భూములను కొందరు పెద్దలు గద్దల్లా తన్నుకుపోవాలని స్కెచ్ వేశారు. కబ్జా చేసేందుకు ఏడునెలల కిందట పావులు కదిపారు. దీనిని పసిగట్టిన స్థానిక ప్రజాప్రతినిధి రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. భూములను రక్షించారు. మళ్లీ అవే భూములను సొంతం చేసుకునేందుకు విశాఖపట్నం జిల్లాకు చెందిన ఓ మహిళ స్థానికులకు సొమ్ములు ఎరవేసి, అధికారుల కళ్లుగప్పే ప్రయత్నాలు చేస్తున్న అంశం మెంటాడ మండలంలోని కొండలింగాలవలసలో అలజడి రేపుతోంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: మెంటాడ మండలంలోని కొండలింగాలవలస రెవెన్యూ పరిధిలో రెడ్డివానివలస–కొండమామిడివలస మధ్యన సర్వే నంబర్ 269లో 25.14 ఎకరాలు , 267/3లో 3.72 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిని కాజేసుం దుకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కొందరు పెద్దలు రంగంలోకి దిగారు. అయితే, ఈ భూమిని గతంలో సమీప గ్రామాల గిరిజనులు సాగు చేసుకుని జీవించేందుకు ప్రభుత్వం ఢీ పట్టాలు మంజూరు చేసింది. సుమారు పదిమంది రైతులు ఆ భూమిని సాగుచేసేవారు. వారిలో ఇబ్బరు మినహా మిగిలినవారు చనిపోయారు. వారి వారుసులెవరూ ఆ భూములను సాగుచేయడంలేదు. ఈ ప్రాంతంలో ఎకరా భూమి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల మధ్య రేటు పలుకుతోంది. ఈ విషయాన్ని పసిగట్టిన విశాఖకు చెందిన ఓ మహిళ రంగంలోకి దిగారు. ఆ ఇద్దరి నుంచి భూమిని కొనుగోలు చేయడంతో పాటు మిగిలిన భూమినంతటినీ దక్కించుకోవాలని పథకం వేశారు. ఈ ఏడాది జనవరిలో ఆ భూమిలో బోర్లు కూడా వేసి, చుట్టూ ఇనుప కంచె వేయడానికి సన్నాహాలు చేశారు. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు విశాఖ మహిళ దుశ్చర్యలను స్థానిక గిరిజనులతో కలిసి అడ్డుకున్నారు. అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. భూములు తమవిగా చెబుతున్న వారు సాగు చేస్తున్నట్లు ఆధారాలు ఉంటే తీసుకొని రావాలని అప్పటి తహసీల్దార్ రొంగలి ఎర్రినాయుడు వారికి నోటీసులు జారీ చేశారు. రెవెన్యూ అధికారులు మొత్తం భూమిని సర్వే చేశారు. 269,67/3 సర్వేనెంబర్లలో గల భూమిని ప్రభుత్వం భూమిగా గుర్తించారు. ఎవరూ ఆ భూముల జోలికి వెళ్లరాదని, నిబంధనలు అతిక్రమించి భూముల్లో ప్రవేశిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అప్పటి తహసీల్దార్ రొంగలి ఎర్రినాయుడు ఆధ్వర్యంలో హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. భూమిని చదును చేసిన జేసీబీని కూడా స్వాధీనం చేసుకొని ఆండ్ర పోలీసులకు అప్పగించించారు. మళ్లీ కథ మొదలు.. ఏడు నెలల పాటు ఈ భూముల గురించి పట్టించుకోని విశాఖ మహిళ మరలా తన ప్రయత్నాలను మొదలుపెట్టారు. స్థానిక ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకున్నారు. ఇదే సమయంలో తహసీల్దార్ ఎర్రినాయుడికి బదిలీకావడంతో ఆయన స్థానంలో కొత్త తహసీల్దార్‌గా నెల్లూరి మంగరాజు గత నెల 24న వచ్చారు. ఆయనకు విషయం తెలిసి, అర్ధమయ్యేలోగా భూములు పూర్తిగా సొంతం చేసుకోవాలని ప్రయత్నించారు. దీనికోసం కొందరు స్థానిక వ్యక్తులతో ఒప్పందం చేసుకున్నారు. వారికి కొంత సొమ్ము కూడా ఆ మహిళ ముట్టజెప్పారు. అయితే, ఆ సొమ్ములు పంచుకోవడంలో ఆ వ్యక్తుల మధ్య విభేదాలు తలెత్తడం వల్ల కొత్త వివాదం మొదలైంది. డబ్బుల కోసం ఆ మహిళను వారిలో కొందరు వేధించడం ప్రారంభించారు. చివరికి పోలీస్ స్టేషన్ వరకు వారి పంచాయితీ చేరింది. ఈ నేపధ్యంలో కొత్త తహసీల్దార్‌కు ఈ వివాదం గురించి తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో ఆయన ఈ భూములపై మరోసారి సర్వేయర్‌తో సర్వే చేయించడానికి సిద్ధమవుతున్నారు. చూస్తూ ఊరుకోం.. ప్రభుత్వ భూములను కాపాడడం తహసీల్దార్‌గా నా బాధ్యత. కొండలింగాలవలస రెవెన్యూ పరిధిలో కొన్ని భూములకు సంబంధించి వివాదాలున్నట్టు నా దృష్టికి వచ్చింది. గత తహసీల్దార్ వాటిని సర్వే చేయించి ప్రభుత్వ భూములుగా గుర్తించి బోర్డులు పెట్టించారని తెలిసింది. నేను కొత్తగా వచ్చినందున కొంత అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా రెండు రోజుల్లో భూములను సర్వే చేయిస్తాం. రికార్డులు పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటాం. ప్రభుత్వ భూములు తన్నుకుపోతుంటే మాత్రం చూస్తూ ఊరుకోం. – నెల్లూరి మంగరాజు, తహసీల్దార్, కొండలింగాలవలస -
అన్నా క్యాంటీన్ల మూసివేతపై మంత్రి బొత్స..
సాక్షి, విజయనగరం: అన్నా క్యాంటీన్లను తాత్కాలికంగా మాత్రమే మూసివేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. క్యాంటీన్లను నిలిపివేయడం తమకు కూడా బాధగానే ఉందని, కానీ గత ప్రభుత్వం అనవసరమయిన చోట క్యాంటీన్లను నిర్మించిందని అన్నారు. శుక్రవారం ఆయన విజయనగరంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అన్నా క్యాంటీన్ల కోసం గత ప్రభుత్వం లక్షల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. త్వరలోనే ప్రభుత్వ క్యాంటీన్లు నిర్మిస్తామని, రద్దీ ప్రాంతాల్లో అవసరమయితే మొబైల్ క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. జిల్లా పర్యటనలో భాగంగా పట్టణ పరిధిలోని పేదల కోసం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఎన్టీఆర్ గృహ నిర్మాణాలను మంత్రి పరిశీలించారు. గత ప్రభుత్వం అధిక ధరలకు టెండర్లను పిలిచి నిర్మాణాలను చేపట్టిందని మంత్రి విమర్శించారు. తక్కువ ధరలకు పేదలకు ఇళ్ల నిర్మాణాలను కేటాయించాలనేదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణలపై ధరలను తగ్గించుకోవాలని కాంట్రాక్టర్లను కోరినట్లు మంత్రి తెలిపారు. ఇసుక కొరతపై భవన నిర్మాణ కార్మికులు చింతించాల్సిన అవసరం లేదని, ప్రజలకు నిర్మాణాల కోసం అవసరమైన ఇసుకను కేటాయించాలని, కొత్తగా రీచ్ లను తెరిపించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి వెల్లడించారు. -
యువతిపై అత్యాచారం..
సాక్షి, గుర్ల(విజయనగరం) : మూగజీవాలను మేతకు తోలుకెళ్లిన యువతిపై ఇద్దరు కామాంధులు కాటువేశారు. నిర్మానుష్య ప్రదేశాన్ని అనువుగా చేసుకుని అత్యాచారానికి ఒడిగట్టారు. చిత్రహింసలకు గురిచేశారు. తమవద్ద ఉన్న సెల్ఫోన్లతో యువతి నగ్నచిత్రాలను చిత్రీకరించారు. వాటితోనే వారం రోజులుగా బెదిరిస్తున్నారు. నిలదీసిన కుటుంబ సభ్యులపై దాడికి దిగారు. పెద్దలు కుదిర్చిన రాజీకి వెరవకుండా వెకిలిచేష్టలకు దిగారు. బాధితురాలు, కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మానవ మృగాలను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన గుర్ల మండలం దేవునికణపాకలో ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. మండలంలోని దేవుని కణపాకకు చెందిన 21 ఏళ్ల యువతిపై అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు అత్యాచారం చేసినట్లు పోలీసులకు సోమవారం ఫిర్యాదు అందింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన బాధిత యువతి, మరో ఇద్దరు యువకులు ఈ నెల 18న గ్రామ సమీపంలోని గడిగెడ్డ రిజర్వాయర్ సమీపంలో ఆవులు, మేకలు మేపుతున్నారు. ఇంతలో ఒక్కసారిగా ఇద్దరు యువకులు కొర్నాన ఆనంద్, కొర్నాన నాగరాజు యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. అలాగే సెల్ఫోన్లో బాధిత యువతి నగ్న చిత్రాలు తీశారు. ఈ విషయాన్ని బాధిత యువతి కుటుంబ సభ్యులకు చెప్పగా వారు గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. దీంతో గ్రామపెద్దలు కొంత నగదు ముట్టజెప్పాలని యువకులను ఆదేశించారు. అయితే నిర్ణీత సమయానికి డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితురాలు, కుటుంబ సభ్యులు సోమవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ డి. రమేష్, ఎస్సైతో కలిసి గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాధితురాలికి వైద్యపరీక్షలు చేయిస్తున్నామని.. నివేదిక వచ్చిన తర్వాత కోర్టుకు అందిస్తామన్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. -
ఎమ్మెల్సీ పదవికి కోలగట్ల రాజీనామా
సాక్షి, అమరావతి : శాసనమండలి సభ్యత్వానికి వైఎస్సార్సీపీ నేత కోలగట్ల వీరభద్రస్వామి రాజీనామా చేశారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో తన ఎమ్మెల్సీ పదవికి కోలగట్ల రాజీనామా చేశారు. గురువారం మధ్యాహ్నం శాసనసభ కార్యదర్శి కె సత్య నారాయణ రావుకి తన రాజీనామా లేఖను సమర్పించారు. -
బాబు స్వార్ధం కోసం ఏపీ హోదాను కేంద్ర వద్ద తాకట్టు పెట్టారు