విజయనగరం టౌన్ : ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థల విద్యార్థులకు థియరీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. పార్వతీపురం జ్యోతీ ఐటీఐ, విజయనగరం. బొబ్బిలి కేంద్రాలలో ప్రశ్నపత్రాలు ఆలస్యంగా పంపిణీ చేయడంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. పార్వతీపురంలోని జ్యోతి ఐటీఐలో గంటకు పైగా ప్రశ్నాపత్రం రావడం ఆలస్యమైందని ప్రభుత్వ ఐటీఐల కన్వీనరు పరమేశ్వరరావు తెలిపారు.
తనకు సమాచారం అందగానే ఉన్నతాధికారులకు నివేదించామన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం ఎనిమిది కేంద్రా ల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. జిల్లా పరిశీలకులుగా జిల్లా ఆడిట్ అధికారి మల్లికాంబ వ్యవహరిస్తున్నారని చెప్పారు. జిల్లా కేంద్రంలోని జూనియర్ ఉపాధికల్పనాధికారి కుమారస్వామి విజి లెన్స్ అధికారిగా వ్యవహరిస్తారని తెలి పారు. తొలిరోజు ఉదయం రెండేళ్ల కోర్సు పార్ట్ -1, సెమిస్టర్-1 ట్రేడ్ థియరీ, ఎంప్లాయిబులిటీ స్కిల్స్‌పై పరీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం ఏడాది కోర్సు సెమ్-1, పార్ట్-1 ట్రేడ్ థియరీ పరీక్షలు జరిగాయి. మొత్తం 432 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్టు కన్వీనరు తెలిపారు.
ఐటీఐ పరీక్షలు ప్రారంభం
Published Fri, Jul 31 2015 1:58 AM | Last Updated on Sun, Sep 3 2017 6:27 AM
Advertisement
Advertisement