
ఎమ్మెల్సీ పదవికి వైఎస్సార్‌సీపీ నేత కోలగట్ల వీరభద్రస్వామి రాజీనామా చేశారు.
సాక్షి, అమరావతి : శాసనమండలి సభ్యత్వానికి వైఎస్సార్‌సీపీ నేత కోలగట్ల వీరభద్రస్వామి రాజీనామా చేశారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో తన ఎమ్మెల్సీ పదవికి కోలగట్ల రాజీనామా చేశారు. గురువారం మధ్యాహ్నం శాసనసభ కార్యదర్శి కె సత్య నారాయణ రావుకి తన రాజీనామా లేఖను సమర్పించారు.