సింగరేణి సంస్థలో పనిచేసి ఆ తర్వాత చట్టసభలకు ఎన్నికై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాష్ట్ర మంత్రులుగా ఎదిగిన వారెందరో ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన కార్మికులు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించారు. నేరుగా బొగ్గు గనుల్లోకి దిగి పనిచేసిన కా ర్మికులు కొందరైతే, క్లరికల్ ఉద్యోగం చేస్తూ చట్టసభలకు ఎంపికైనవారు మరికొందరున్నారు. – గోదావరిఖని
కొప్పుల ఈశ్వర్..
కొప్పుల ఈశ్వర్ 1976లో కా ర్మిక జీవితాన్ని ప్రారంభించారు.తొలిసారిగా 1994లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి మేడిపల్లి ఓసీపీలో 8 ఏళ్ల పాటు పనిచేశారు. ఈశ్వర్ ఆ తర్వాత వరుసగా జరిగిన 2004 నుంచి టీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. ప్రస్తుత కేసీఆర్ కేబినెట్‌లో మంత్రి.
మాలెం మల్లేశం
1974లో కోల్‌ఫిల్లర్‌గా జీడీకే–2ఏ గనిలో కా ర్మికుడిగా చేరిన మల్లేశం..1985లో క్లర్క్‌గా పదోన్నతి పొందారు. 1985లో టీడీపీ అభ్యరి్థగా పోటీ చేసి గెలుపొందారు. 1994లో ఇండిపెండెంట్‌గా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
కోదాటి రాయమల్లు..
పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన కోదాటి రాయమల్లు బెల్లంపల్లి ఏరియాలో గనుల్లో క్లర్క్‌గా పనిచేశారు. చెన్నూరి నుంచి 1952లో మొదటి సారిగా ప్రజాసోషలిస్ట్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1957 నుంచి 1972 వరకు వరసగా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1980లో పెద్దపల్లి ఎంపీగా విజయం సాధించారు. 1972 నుంచి 1978 వరకు ఆరోగ్యశాఖమంత్రిగా పనిచేసి
దాసరి నర్సయ్య..
బెల్లంపల్లి పట్టణానికి చెందిన నర్సయ్య బెల్లంపల్లి ఏరియాలో వివిధ గనుల్లో సర్వే మజ్దూర్‌గా, మైనింగ్ సర్దార్‌గా 1974 నుంచి 1978 వరకు పనిచేశారు. ఉద్యోగానికి రాజీనామా చేసి 1978లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆసిఫాబాద్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 1989లో కూడా గెలిచారు.
ఎస్.సంజీవరావు..
కరీంనగర్ జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామానికి చెందిన సొత్కు సంజీవరావు మందమర్రి ఏరియాలోని గనిలో 1978 నుంచి 1981 వరకు పనిచేశారు. 1983లో చెన్నూరు నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు.
సంభాని చంద్రశేఖర్..
చంద్రశేఖర్ కొత్తగూడెం ఏరియాలో క్లర్క్‌గా పనిచేశారు. 1985లో పాలేరు నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2004లో వైఎస్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు.
బోడ జనార్దన్..
1977–1982 వరకు శ్రీరాంపూర్ ఏరియాలో ఆర్కే–5లో గనిలో సర్వే డిపార్ట్‌మెంట్‌లో పనిచేశారు. టీడీపీ నుంచి 1985, 1989, 1994, 1999లో వరుసగా చెన్నూరు ఎమ్మెల్యేగా గెలుపొంది ఎన్టీఆర్ హయాంలో ఓ దఫా కా ర్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం బీఎల్‌ఎఫ్ కూటమి నుంచి చెన్నూరు అభ్యరి్థగా బరిలో ఉన్నారు.
పాటి సుభద్ర..
పాటి సుభద్ర సొంతగ్రామం ఖమ్మం జిల్లా కొత్తగూడెం. 1978లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన సుభద్ర 1981 నుంచి సింగరేణి ప్రాంతంలోని బెల్లంపల్లి, సీసీసీ, శ్రీరాంపూర్, గోదావరిఖని, ఆస్పత్రుల్లో పనిచేశారు. 1999లో ఆసిఫాబాద్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
బి.వెంకట్రావ్
ఖమ్మం జిల్లా బూర్గంపాడ్‌కు చెందిన వెంకట్రావ్ ఐఎన్‌టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 2009 నుంచి 2015 వరకు ఎమ్మెల్సీగా పనిచేశారు. ప్రస్తుతం టీబీజీకేఎస్ యూనియన్ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు.
కోరుకంటి చందర్
రామగుండం ఏరియాకు చెందిన కోరుకంటి చందర్ సింగరేణి కా ర్మికుని బిడ్డ. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆలిండియా ఫార్వర్డ్‌బ్లాక్ నుండి పోటీ చేసి 26 వేల మెజార్టీతో గెలుపొందారు.
Comments
Please login to add a commentAdd a comment