kolagatla veerabhadra swamy
-
వైఎస్సార్సీపీదే గెలుపు ఖాయం
-
కోలగట్ల ఎన్నికల ప్రచారం
-
మేము వేసిన రోడ్లమీదే మేము మళ్ళీ వచ్చి ఓట్లు అడుగుతుంటే చాలా ఆనందంగా ఉంది
-
ప్రజల ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా పాలన: డిప్యూటీ స్పీకర్
-
బాలయ్యకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి
-
అసెంబ్లీలో టీడీపీ నేతల వ్యవహారశైలిపై డిప్యూటీ స్పీకర్ ఫైర్
-
గంటపాటు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి జలాసనాలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: గంట పాటు నీటిపై తేలియాడుతూ..పలు యోగాసనాలు వేసి రాష్ట్ర శాసన సభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి(64) అందరినీ ఆకట్టుకున్నారు. జాతీయ స్విమ్మింగ్ పూల్ డేను పురస్కరించుకుని క్రీడారంగ విశిష్టత, స్విమ్మింగ్ సాధన, యోగాసనాల వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించడానికి విజయనగరంలోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న ఆక్వా స్విమ్మింగ్ పూల్‌లో మంగళవారం ఆయన కార్యక్రమం చేపట్టారు. ఈ ప్రదర్శనను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తదితరులు ప్రారంభించారు. నిర్విఘ్నంగా గంట పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం దేశ త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తూ ముగించారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కోలగట్లను సత్కరించారు. చదవండి: బాబు, సోనియా ఏపీకి అన్యాయం చేశారా? ఇదిగో ఇలా బయటపడింది..! -
64 ఏళ్ల వయసులో... డిప్యూటీ స్పీకర్ సాహసం! గంట పాటు నీటిపై తేలియాడుతూ..
సాక్షి, విజయనగరం: స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర శాసన సభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి వయసును సైతం లెక్క చేయకుండా సాహసం చేశారు. గంట పాటు నీటిపై తేలియాడుతూ యోగ సాధన చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. క్రీడా రంగ విశిష్టతను, క్రీడల ప్రాధాన్యతను యువతరానికి తెలియజేయాలనే సంకల్పంతో ఆయన చేపట్టిన కార్యక్రమం విజయవంతంగా సాగింది. జాతీయ స్విమ్మింగ్ పూల్ డే సందర్భంగా మంగళవారం స్థానిక ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో డిప్యూటీ స్పీకర్ జలాసన ప్రక్రియ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్రీడల ఆవశ్యకతను తెలుపుతూ డిప్యూటీ స్పీకర్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం భావితర క్రీడాకారుల్లో తప్పకుండా స్ఫూర్తి నింపుతుందని.. చైతన్యం తీసుకొస్తుందని అభిప్రాయపడ్డారు. సామాజిక చైతన్యానికి, ప్రజల ఆరోగ్యానికి ఇలాంటి ప్రక్రియలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. డిప్యూటీ స్పీకర్ చేపట్టిన సాహసాన్ని ఈ సందర్భంగా అభినందించారు. అట్టహాసంగా కార్యక్రమం కాగా వందలాది మంది ప్రజలు, ఆయన అభిమానులు విచ్చేసి వీక్షించారు. కరతాళ ధ్వనులతో అభినందనలు తెలిపారు. స్థానిక ప్రజలు, అభిమానుల సౌకర్యార్థం ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్సు ఆవరణలో, నగరంలో పలు చోట్ల ఎల్.ఈ.డి. స్క్రీన్లు ఏర్పాటు చేశారు. క్రీడల ప్రాధాన్యతను తెలియజేయాలన్నదే నా ఉద్దేశం జలాసనం వేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి క్రీడల ప్రాధాన్యతను నేటి యువతరానికి తెలియజేయాలన్నదే తన ముఖ్య ఉద్దేశమని అందుకే ఈ వయసులో కూడా ఇలాంటి సాహసాన్ని చేశానని పేర్కొన్నారు. సెల్ ఫోన్లు, టీవీల మోజులో పడి యువత క్రీడలకు దూరం అవుతున్నారని వాటి ఆవశ్యకతను తెలుసుకొని క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రయోజనకర నిర్ణయాలు తీసుకుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తన వంతుగా నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని వివరించారు. మహిళల కోసం ప్రత్యేకంగా పార్కును నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ప్రజలు కూడా వారి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ నిత్యం క్రీడా సాధన చేయాలని డిప్యూటీ స్పీకర్ హితవు పలికారు. వయసుతో సంబంధం లేని క్రీడ.. స్విమ్మింగ్ అని దీనిని రోజూ సాధనం చేయటం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం రాజన్నదొర, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాసు, జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ సురేష్ బాబు, ఎమ్మెల్యేలు శంబంగి చిన వెంకట అప్పలనాయుడు, బొత్స అప్పలనరసయ్య, నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, జిల్లా ఎస్పీ ఎం. దీపికా, స్థానిక కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ హయాంలో భూ కబ్జాలపై విచారణ జరపాలి
సాక్షి, అమరావతి: శాసన సభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా చివరి రోజు శుక్రవారం ‘జీరో’అవర్ సుదీర్ఘంగా సాగింది. రెండున్నర గంటలకు పైగా 46 మంది శాసన సభ్యులు వారి నియోజకవర్గాల సమస్యలపై మాట్లాడారు. జీరో అవర్‌ను ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి నడిపించారు. తెలుగుదేశం పార్టీ పాలనలో జరిగిన భూకబ్జాలపై విచారణ జరపాలని పలువురు సభ్యులు డిమాండ్ చేశారు. చంద్రబాబు, లోకేశ్ వారి పర్యటనల్లో అధికార పక్ష నాయకులపై భూ కబ్జా ఆరోపణలు చేయడంపై మండిపడ్డారు. టీడీపీ హయాం నుంచి ఎంత ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందో సమగ్ర విచారణ చేయించాలి కోరారు. దీనిపై ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి స్పందిస్తూ.. ‘నేను ఇప్పు డు చైర్లో కూర్చున్నా. లేకుంటే శాసన సభ్యుడినే కదా. రెండు నెలల కిందట చంద్రబాబు విజయనగరంలో నాపైనా ఆరోపణలు చేశారు. ఏ భూములైతే ఆక్రమించానని ఆరోపిస్తున్నారో.. ఆ భూముల్లో చంద్రబాబు కూర్చుని ఆందోళన చేస్తే ప్రజలకు బాగా అర్థమవుతుందని చెప్పాను. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఆరోపణలపై విచారణకు ఆదేశించమని ప్రభుత్వాన్ని కోరుతున్నా’ అని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమణల నుంచి వి డిపించి అర్హులైన పేదలకు ఇవ్వాలని సభ్యులు విజ్ఞప్తి చేశారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను త్వరితంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. లోకేశ్ కబ్జా ఆరోపణలపై విచారణ చేయించాలి: ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పీలేరులో టీడీపీ నేత లోకేశ్ చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కోరారు. రూ.250 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని తాను, మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి ఆక్రమించుకున్నామని లోకేశ్ ఆరోపించారన్నారు. గతంలో తమ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఎన్ని ఎకరాలు కబ్జాకు గురైంది, 2014–19 మధ్య ఎంత భూమి మింగేశారు, వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చి న తర్వాత ఎంత కబ్జాకు గురైందో సీఐడీ, విజిలెన్స్ ద్వారా విచారణ జరిపించి వాస్తవాలను నిగ్గుతేల్చాలని కోరారు. తాను ఏనాడూ ప్రభుత్వ భూముల విషయంలో జోక్యం చేసుకోలేదని చెప్పారు. పేజ్‌కు భూ కేటాయింపులపై వాస్తవాలు నిగ్గు తేల్చాలి టీడీపీ ప్రభుత్వంలో లోకేశ్ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండగా పేజ్ ఇండస్ట్రీకి 28 ఎకరాలు కారు చౌకగా ఎకరం రూ.10 లక్షలకు కేటాయించడంపై విచారణ జరపాలని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. అక్కడ ఎకరం రూ.4 కోట్లు ఉంటుందని, రూ.110 కోట్ల విలువైన స్థలాన్ని రూ.2.80 కోట్లకే రిజిస్టర్ చేశారని చెప్పారు. మూడేళ్ల తర్వాత భూమిని విక్రయించుకోవచ్చని జీవో కూడా ఇచ్చారన్నారు. 2016లో భూమి ఇస్తే 2019 వరకు ఆసంస్థ కార్యకలాపాలు ప్రారంభించలేదన్నారు. దీనిపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణ జరిపించాలని కోరారు. టీడీపీ హయాంలో రామగిరిలో రూ.1000 కోట్ల విలువైన గ్రానైట్‌ను ఎటువంటి రాయల్టీలు చెల్లించకుండా తరలించారని అన్నారు. ఆన్లైన్ విధానంలో భూ యాజమాన్య మార్పులు చేసే వెసులుబాటుతో అనంతపురం రూరల్, రాప్తాడు నియోజకవర్గంలో వందల కోట్లు విలువ చేసే భూముల్లో బినామీల పేర్లతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారని, ఇలాంటి దోపిడీల్లో ప్రభుత్వం వాస్తవాలను నిగ్గుతేల్చాలని కోరారు. బుడగ జంగాలకు కుల ధ్రువీకరణ చేపట్టాలి సరైన గుర్తింపు లేని బుడగ జంగాలకు కుల ధ్రువీకరణ చేపట్టి ప్రభుత్వ పథకాలు అందించాలని కొందరు సభ్యులు కోరారు. దీనిపై రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ఇది రాష్ట్ర పరిధిలోని అంశం కాదని.. కేంద్ర కేబినెట్ ఆమోదంతో పార్లమెంట్ చట్ట సవరణ ద్వారా చేయాల్సి ఉంటుందన్నారు. బుడగ జంగాలు ఏ వర్గంలోకి వెళ్లాలనుకుంటున్నారో సంబంధిత కమిషన్‌కు విజ్ఞప్తి చేయాలని సూచించారు. -
Vizianagaram: అభాగ్యుల ఆకలి తీర్చుతున్న ఫుడ్‌బ్యాంకులు
అన్నం పరబ్రహ్మ స్వరూపం.. ఆకలితో అలమటించేవారికి పట్టెడన్నం పెడితే వారిలో కలిగే సంతోషం వెలకట్టలేనిది. విజయనగరం పట్టణంలో ఏడాదిన్నరగా వేలాదిమంది పేదల ఆకలితీర్చే బృహత్క్రతువు నిరాటంకంగా కొనసాగుతోంది. స్వచ్ఛంద సంస్థలు, దాతలు, నాయకులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ఉద్యోగులు, హోటళ్ల నిర్వాహకులు ఇలా.. మనసున్న ప్రతి ఒక్కరూ ఫుడ్‌బ్యాంకుల నిర్వహణను భుజానకెత్తుకున్నారు. నిర్భాగ్యులకు రుచికరమైన భోజనం వడ్డిస్తున్నారు. వృథాగా పారబోసే ప్రతి మెతుకుతో మరొకరి ఆకలి తీర్చాలన్న ప్రధాన ఆశయంతో ముందుకు సాగుతున్నారు. – పైడి చిన్నఅప్పలనాయుడు, విజయనగరం డెస్క్ ఫొటోలు: డి.సత్యనారాయణమూర్తి, సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం విజయనగరం పట్టణానికి వచ్చిన పేదలు... స్థానికంగా ఉంటున్న అభాగ్యులు, అనాథల ఆకలి తీర్చాలన్న ఆశయం నుంచి ఏర్పడినవే ఫుడ్ బ్యాంకులు. జిల్లా కేంద్రానికి ఏ దారిలో వచ్చిన వారికైనా ఫుడ్‌బ్యాంకులు తారసపడతాయి. ప్రస్తుతం నలువైపులా నాలుగు ఫుడ్ బ్యాంకులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలైతే చాలు... ఇక్కడ భోజనాల వడ్డింపు కార్యక్రమం ఆరంభమవుతుంది. మధ్యాహ్నం 2.30 గంటల వరకు నిరాటంకంగా కొనసాగుతుంది. వివిధ పనులపై వచ్చేవారు, కూలీలు, ఆటోడ్రైవర్లు, యాచకులు, అనాథలు, వృద్ధులు ఇలా.. అన్నం కోసం ఎదురుచూసేవారందరికీ ఫుడ్‌బ్యాంకులు అన్నంకుండలా మారుతున్నాయి. వారి ఆకలి తీర్చుతున్నాయి. ఒక్కో ఫుడ్‌బ్యాంకులో రోజుకు 100 నుంచి 150 మందికి భోజనం వడ్డిస్తున్నారు. నడవలేని, లేవలేని కొందరు వృద్ధులకు క్యారేజీలతో అందిస్తున్నారు. వీటి నిర్వహణలో స్వచ్ఛంద సంస్థలు, ఆలయాలు, హోటళ్ల నిర్వాహకులు, నాయకులు, యువత, కార్పొరేషన్ ఉద్యోగులు భాగస్వాములయ్యారు. ఏ శుభ, అశుభ కార్యమైనా... ఇంటిలో ఎలాంటి శుభ, అశుభ కార్యం జరిగినా పేదలకు అన్నం పెట్టాలనుకునేవారు ఫుడ్‌బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. వారి స్థాయిని బట్టి అన్నదానం చేస్తున్నారు. కొందరు నాలుగు ఫుడ్‌బ్యాంకులలో ఒక రోజు వడ్డించేందుకు సరిపడా ఆహారపదార్థాలను సరఫరా చేస్తుండగా, మరికొందరు ఒక ఫుడ్‌బ్యాంకుకు సరిపడా ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. పేదలకు స్వయంగా వడ్డించి, వారి ఆకలితీర్చి ఆత్మ సంతృప్తిపొందుతున్నారు. ప్రస్తుతం విజయనగరంతో పాటు పరిసర గ్రామాల్లో పుట్టినరోజులు, జయంతి, వివాహాది శుభకార్యాలు, పండగల సమయంలో ముందుగా ఫుడ్ బ్యాంకులకు ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. అందుకే... అన్నదాన ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతోందని నిర్వాహకులు చెబుతున్నారు. దాతల సాయంబట్టి రాత్రి పూట కూడా భోజనం వడ్డిస్తున్నామని పేర్కొంటున్నారు. ఫుడ్ బ్యాంకుల నిర్వహణ ఇలా... ► ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న ఫుడ్‌బ్యాంకు దాతలతో పాటు కన్యకాపరమేశ్వరి ఆలయం సహకారంతో కొనసాగుతోంది. ► కోటకూడలిలోని ఫుడ్‌బ్యాంకు హోటళ్ల నిర్వాహకులు, దాతలు సాయంతో సాగుతోంది. ► ఎన్సీఎస్ థియేటర్ ఎదురుగా ఉన్న అన్నదాన కేంద్రం దాతలు, కార్పొరేషన్, గౌరీ సేవాసంఘం సహకారంతో నడుస్తోంది. ► పోలీస్ బ్యారెక్స్ వద్ద ఉన్న కేంద్రం దాతలు, కార్పొరేషన్, పంచముఖ ఆంజనేయస్వామి ఆలయ ఆధ్వర్యంలో కొనసాగుతోంది. వడ్డించే పదార్థాలు అన్నం, సాంబారు, ఒక కూర, పులిహోర, చక్రపొంగలి (దాతలు సమకూర్చితే అరటిపండు, స్వీటు, ఇతర పదార్థాలు) ఫుడ్‌బ్యాంకులలో అన్నదానం ఇలా... ► ప్రతిరోజు ఒక ఫుడ్‌బ్యాంకులో 100 నుంచి 150 మంది చొప్పున నాలుగు ఫుడ్‌బ్యాంకులలో 400 నుంచి 600 మందికి భోజనం వడ్డిస్తున్నారు. ► ఈ ప్రక్రియ ఆగస్టు 13, 2021 నుంచి నిరంతరాయంగా సాగుతోంది. నెలకు 12,000 నుంచి 18,000 మంది ఆకలిని ఫుడ్‌బ్యాంకులు తీర్చుతున్నాయి. కోట వద్ద ఉన్న ఫుడ్ బ్యాంకులో రాత్రి సమయంలో కూడా అన్నదానం చేస్తుండగా, మిగిలిన చోట్ల దాతల సాయం బట్టి రాత్రిపూట భోజనం వడ్డిస్తున్నారు. పేదవాని ఆకలి తీర్చడమే ధ్యేయం పేదవాడి ఆకలి తీర్చాలని, సామాన్యులకు మేలు చేయాలన్న మంచి సంకల్పంతో ప్రారంభించినవే ఫుడ్ బ్యాంకులు. విజయనగరంలో ఏర్పాటుచేసిన 4 ఫుడ్‌బ్యాంక్‌లు పేదలు, అనాథల ఆకలి తీర్చుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో అన్నా క్యాంటీన్ల పేరుతో రూ.5కే భోజనం పెట్టించామని గొప్పలు చెప్పుకునేవారు. తప్పుడు లెక్కలతో ఖజానా ఖాళీచేసేవారు. ఇప్పుడు కార్పొరేషన్ పరిధిలో నిర్వహిస్తున్న ఫుడ్‌బ్యాంకులకు దాతలే సహకరిస్తూ వేలాదిమంది కడుపునింపుతున్నారు. త్వరలో కొత్తపేట నీళ్ల ట్యాంకు వద్ద మరో ఫుడ్‌బ్యాంక్ ఏర్పాటు చేస్తాం. – కోలగట్ల వీరభద్రస్వామి, శాసనసభ డిప్యూటీ స్పీకర్, విజయనగరం ఎమ్మెల్యే మంచి కార్యక్రమం ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలైతే చాలు.. అన్నం కోసం చాలామంది పేదలు ఇక్కడకు వస్తారు. దాతలు సమకూర్చిన అన్నం వృథా కాకుండా వడ్డిస్తున్నాం. కొన్నిసార్లు సంఖ్య పెరిగితే అప్పటికప్పుడు స్థానిక కార్పొరేటర్లు, దాతలు సహకరించి ఆహారపదార్థాలు సమకూర్చుతున్నారు. వివాహాది శుభకార్యాల సమయంలో మిగిలిన ఆహారపదార్థాలను అందిస్తే రాత్రి సమయంలోనూ పేదలకు వడ్డిస్తున్నాం. – రమణమూర్తి, ఫుడ్‌బ్యాంకు సూపర్వైజర్ మిగిలిపోయిన ఆహారం వృథా కాకుండా... వివాహాలు, వేడుకలు, విందుల సమయంలో మిగిలిపోయిన ఆహారపదార్థాలను ఫుడ్ బ్యాంకులకు చేర్చుతున్నారు. వీటిని ఫుడ్‌బ్యాంకులలో ఉన్న ఫ్రిజ్‌లలో నిర్వాహకులు భద్రపరుస్తున్నారు. పేదల కడుపు నింపుతున్నారు. దాతల భాగస్వామ్యంతో.. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఫుడ్ బ్యాంక్‌లు ఏర్పాటు చేశాం. వాటి ద్వారా ప్రతిరోజు వందలాది మంది నిరుపేదల ఆకలి తీరుస్తున్నాం. ఈ ప్రక్రియంలో దాతల భాగస్వామ్యం శుభపరిణామం. జిల్లా కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం ప్రతి రోజు వేలాది మంది వచ్చిపోతుంటారు. అందులో చాలా మంది ఆర్థిక స్థోమత లేక ఆకలితో ఇంటికి వెళ్తుంటారు. అటువంటి వారికి ఫుడ్‌బ్యాంక్‌ల సేవలు ఉపయుక్తంగా మారాయి. ప్రతి రోజు రుచి, శుచితో కూడిన భోజానాన్ని అందించగలుగుతున్నాం. – రెడ్డి శ్రీరాములనాయుడు, కమిషనర్, విజయనగరం కార్పొరేషన్ ఆనందంగా ఉంది ఫుడ్‌బ్యాంకుల నిర్వహణ నిరాటంకంగా సాగుతోంది. ఉద్యోగిగా ఫుడ్‌బ్యాంకు నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నా... ఆకలితో వచ్చే పేదలకు వడ్డించడంలో ఉన్న ఆనందమే వేరు. అన్నదానం చేసిన దాతలకు చేతులెత్తిదండం పెట్టాలి. వారి దయవల్లే పేదల ఆకలి తీరుతోంది. ఫుడ్‌బ్యాంకుల నిర్వహణ ఆలోచన గొప్పది. – జె.రవితేజ, ఫుడ్‌బ్యాంకు సూపర్వైజర్ క్యారేజీ అవసరంలేదు.. విజయనగరం పట్టణానికి చెట్లు కొట్టేందుకు వస్తాను. పట్టణ పరిధిలో ఎక్కడ పని ఉన్నా క్యారేజీ తెచ్చుకోను. ఫుడ్ బ్యాంకు వద్దకు వచ్చి భోజనం చేస్తాను. మా లాంటి కూలిపనివారికి కడుపునిండా భోజనం పెడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. – రీసు పైడితల్లి, గొట్లాం ఆకలితీర్చుతోందయ్యా.. నేను కాగితాలు, ప్లాస్టిక్ కవర్లు ఏరుతూ జీవిస్తున్నాను. ఎక్కడ ఉన్నా పోలీస్ బ్యారెక్ వద్ద ఉన్న ఫుడ్‌బ్యాంకు వద్దకు సమయానికి చేరుకుంటాను. కడుపునిండా భోజనం చేస్తున్నారు. మాలాంటి పేదలకు అన్నంపెడుతున్న దాతలు నూరేళ్లపాటు చల్లగా ఉండాలి. – రాముపైడమ్మ, గాజులరేగ, విజయనగరం మంచి కార్యక్రమం ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలైతే చాలు.. అన్నం కోసం చాలామంది పేదలు ఇక్కడకు వస్తారు. దాతలు సమకూర్చిన అన్నం వృథా కాకుండా వడ్డిస్తున్నాం. కొన్నిసార్లు సంఖ్య పెరిగితే అప్పటికప్పుడు స్థానిక కార్పొరేటర్లు, దాతలు సహకరించి ఆహారపదార్థాలు సమకూర్చుతున్నారు. వివాహాది శుభకార్యాల సమయంలో మిగిలిన ఆహారపదార్థాలను అందిస్తే రాత్రి సమయంలోనూ పేదలకు వడ్డిస్తున్నాం. – రమణమూర్తి, ఫుడ్‌బ్యాంకు సూపర్వైజర్ -
అశోక్ బంగ్లా వేదికగా మరో కుట్ర
సాక్షి, విశాఖపట్నం/విజయనగరం: టీడీపీ నేత అశోక్ గజపతిరాజు బంగ్లా నుంచే 1995లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు వ్యూహాన్ని చంద్రబాబు రచించారని, మళ్లీ ఇప్పుడు ఆ బంగ్లా వేదికగా మరో కుట్రకు తెర లేపారని శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. త్వరలోనే ఆ కుట్ర బట్టబయలవుతుందని చెప్పారు. ఆదివారం ఆయన విశాఖ సర్క్యూట్ హౌస్‌లో, విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న చంద్రబాబుకు మానసిక స్థితి బాగోలేదన్నారు. అనని మాటలను పట్టుకొని చంద్రబాబు ఏడవడంతోనే ఆయన మానసిక ధైర్యాన్ని కోల్పోయారని చెప్పారు. ‘బాదుడే బాదుడు’ అట్టర్ ఫ్లాప్ కావడంతో పేరు మార్చి ‘ఇదేమి ఖర్మ’ అంటూ ప్రజల్లోకి వెళ్లగా.. చంద్రబాబు వల్లే రాష్ట్రానికి ఖర్మ పట్టుకుందని జనం అనుకుంటున్నారన్నారు. చంద్రబాబు సభలకు డబ్బులిచ్చి మరీ జనాన్ని రప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆ పార్టీ వాళ్లే చర్చించుకుంటున్నారని చెప్పారు. ఒక్కసారి కూడా గెలవని, ఒక్క సీటు లేని జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌కు చంద్రబాబు దాసోహమయ్యాడన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీకి తూట్లు పొడుస్తున్నారన్నారు. బీసీలంటే ఎప్పుడూ చంద్రబాబుకు చులకన భావమేనని, బీసీ మహిళా అధ్యక్షురాలు ఫొటో దిగడానికి వస్తే.. అశోక్ కుమార్తె అడ్డుకుంటే చూస్తూ మిన్నకుండిపోవడం అవమానించడం కాదా అని ప్రశ్నించారు. కుప్పంలో మీ సంగతి చూసుకోండి విజయనగరం ఎమ్మెల్యేగా ఉన్న తాను, మంత్రి బొత్స సత్యనారాయణ ఓడిపోతామని చెబుతున్న చంద్రబాబు.. ముందు ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో ఎలా గెలవాలో చూసుకోవాలని కోలగట్ల హితవు పలికారు. బొబ్బిలి, రాజాం, విజయనగరం నియోజకవర్గాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో సైకిల్ పోవాలంటూ ఆయన చెప్పడం ద్వారా నిజాన్ని ఒప్పుకున్నారన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు తథ్యమని చెప్పారు. -
‘సైకిల్ పోవాలని చెప్పడమే చంద్రబాబు మానసిక పరిస్థితికి నిదర్శనం’
విశాఖ: చంద్రబాబు నాయుడు మానసిక పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోందని ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి మండిపడ్డారు. ఇందుకు ఉదాహరణే సైకిల్ పోవాలని చంద్రబాబు చెప్పడమేనని వీరభద్రస్వామి స్పష్టం చేశారు. చంద్రబాబు డబ్బులిచ్చి సభలకు జనాన్ని రప్పిస్తున్నారని, బాదుడే బాదుడు అట్టర్ ప్లాప్ కావడంతో పేరు మార్చి ఇదేమి ఖర్మ కార్యక్రమం చేపట్టారని,చంద్రబాబు వల్లనే రాష్ట్రానికి కర్మ పట్టుకుందని ప్రజలు అనుకుంటున్నారని విమర్శించారు వీరభద్రస్వామి. -
చంద్రబాబుపై ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆగ్రహం
-
జగనన్న కాలనీలపై జనసేన ఓవర్ యాక్షన్ చేస్తోంది : డిప్యూటీ స్పీకర్ కోలగట్ల
-
విజయవాడలో ఆర్యవైశ్యుల సమ్మేళనం
-
లేనిది ఉన్నట్టు ఎల్లో డప్పులు...
-
ఆస్పత్రికి అశోక్ గజపతిరాజు కుటుంబం గజం భూమి ఇవ్వలేదు : కోలగట్ల
-
Vizianagaram: గంటస్తంభానికి కొత్త సొబగులు
విజయనగరం: చారిత్రక నేపథ్యం కలిగిన విజయనగరం గంటస్తంభం కొత్త సొబగులు అద్దుకుంటోంది. సుమారు రెండు శతాబ్దాల కిందట నగరం నడిబొడ్డున నిర్మించిన గంటస్తంభం... ఆధునీకరణ పనులతో మరింత ఆకర్షణీయంగా దర్శనమివ్వనుంది. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి నేతృత్వంలో జరుగుతున్న ఆధునీకరణ పనులు తుదిదశకు చేరుకోగా... వచ్చే నెల 5న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నారు. పనుల ప్రగతిని డిప్యూటీ స్పీకర్ క్షేత్రస్థాయిలో శుక్రవారం పరిశీలించారు. గంట స్తంభం చరిత ఇది... 25 అడుగుల కైవారం, రూ.4,680 వ్యయంతో 8 కుంభుజాలతో 18వ శతాబ్దంలో గంటస్తంభాన్ని నిర్మించారు. గంటస్తంభానికి నలువైపులా నాలుగు పెద్ద గడియారాలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు, మధ్యాహ్నం 12, రాత్రి 8 గంటలకు పెద్ద శబ్దంతో అలారం మోగేది. కాలక్రమేణా గంటస్తంభం చెక్కు చెదరనప్పటికీ దానికి అమర్చిన గడియారాలు పాడైనప్పుడు సాంకేతిక నిపుణులను రప్పించి మరమ్మతు చేయించేవారు. ప్రస్తుతం వాటి స్థానంలో అధునాతన గడియారాలు ఏర్పాటు చేయడంతో పాటు కట్టడంలో ఉన్న కిటికీలను మార్పు చేశారు. అలనాటి వైభవం దెబ్బతినకుండా కట్టడానికి పుట్టీపెట్టించి నూతనంగా రంగులతో కొత్త సొబగులు అద్దారు. గంటస్తంభం చుట్టూరా విద్యుత్ దీపాలంకరణతో వాటర్ ఫౌంటౌన్ నిర్మించారు. ఈ పనులతో రాత్రి వేళ చూసేవారికి ఆకర్షణీయంగా కనిపించనుంది. మొత్తం ఆధునీకరణ పనులను దాతల సహకారంతో చేపట్టగా.. రూ.25 నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చు చేసినట్టు అంచనా. పనులను పరిశీలించిన కోలగట్ల... గంటస్తంభం ఆధునికీకరణ పనులను అధికారులతో కలిసి కోలగ్ల వీరభద్రస్వామి పరిశీలించారు. త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తిచేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. గంటస్తంభం చుట్టూ కలియతిరిగి ఆక్రమణల తొలగింపుపై టౌన్ ప్లానింగ్ అధికారులకు తగుసూచనలిచ్చారు. విజయనగర వైశిష్ట్యం ప్రతిబింబించేలా అలరారుతున్న గంటస్తంభాన్ని ఆధునీకరించి మరింత ఆకర్షణగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే పూర్తయిన పనులతో మరింత శోభాయమానంగా అలరారబోతోందని చెప్పారు. నగరాన్ని కార్పొరేషన్ స్థాయిలో అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ప్రయత్నిస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే ప్రధాన కూడళ్లను ఇప్పటికే అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కేదారశెట్టి సీతారామమూర్తి, 4వ డివిజన్ కార్పొరేటర్ మరోజు శ్రీనివాసరావు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి కాళ్ల సూరిబాబు, ఏసీపీ మధుసూదన్‌రావు, డీఈ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
Kolagatla Veerabhadra Swamy: కార్యకర్త నుంచి డిప్యూటీ స్పీకర్ వరకు...
విజయనగరం: సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కోలగట్ల వీరభధ్రస్వామి డిప్యూటీ స్పీకర్ హోదా వరకు వ్యక్తిగతంగా ఎదిగారు. పాలన లో తనదైన ముద్రవేస్తూ.. ప్రశంసలు అందుకుంటున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యే, రెండు సార్లు ఎమ్మె ల్సీగా ఎన్నికైన ఆయనకు సీఎం జగన్మోహన్రెడ్డి డిప్యూటీ స్పీకర్‌గా అవకాశం కల్పించడంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలో భాగంగా కొద్ది నెలల కిందట డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల పేరును సీఎం ప్రకటించారు. ప్రస్తు తం జరుగుతున్న శాసనసభా సమావేశాల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. సీఎంతో పాటు స్పీకర్ తమ్మినేని సీతారాం, రాష్ట్ర మంత్రివర్గం సమక్షంలో ఆయన డిప్యూటీ స్పీకర్ పీఠాన్ని సోమవారం అధిరోహించారు. కోలగట్ల 1983లో కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం 1985లో కోపరేటివ్ బ్యాంకు డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు. 1987లో మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికకాగా, 1989లో కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. 1989, 1994, 1999 సంవత్సరాల్లో విజయనగరం శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. మళ్లీ 2004 సంవత్సరం ఎన్నికల్లో విజయనగరం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజుపై విజయం సాధించారు. 2013 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2014 సంవత్సరంలో ఎమ్మెల్సీ పదవితోపాటు ఆ పార్టీకి రాజీనామాచేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉంది. అదే ఏడాది విజయనగరం శాసనసభా నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందగా... వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం విజయనగరం ఎమ్మెల్యేగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ గా కొనసాగుతున్నారు. ప్రత్యేక గుర్తింపు.. విజయనగరానికి చెందిన పూసపాటి వంశీయులపై రాజకీయంగా పోరాడి విజయం సాధించడంతో ఎమ్మెల్యే కోలగట్లకు ప్రత్యేక గుర్తింపు లభించింది. సుమారు 7 మార్లు ఎమ్మెల్యేగా, పలు శాఖల రాష్ట్ర మంత్రిగా, కేంద్రమంత్రిగా పదవులు అధిరోహించిన పూసపాటి అశోక్‌గజపతిరాజుపై స్వతంత్య్ర అభ్యరి్థగా ఒకసారి, వైఎస్సార్సీపీ తరఫున మరో సారి పోటీచేసి తన సత్తాను నిరూపించుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. కార్పొరేషన్ హోదా దక్కించుకున్న విజయనగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా సాగుతున్నారు. అభినందనల జల్లు.. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన కోలగట్లవీరభధ్రస్వామికి అభినందనలు వెల్లువెత్తాయి. విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్సయ్య, శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, కడుబండి శ్రీనివాసరావు, అలజంగి జోగారావు,, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్, చనమల్లు వెంకటరమణ, రాష్ట్ర పర్యాటకశాఖ డైరెక్టర్ రేగాన శ్రీనివాసరావు, ఆర్యవైశ్య సంఘం నాయకులు కుప్పం ప్రసాద్ ద్వారకానాథ్, గుబ్బ చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. డిప్యూటీ స్పీకర్‌గా అవకాశం కలి్పంచిన సీఎంకు తాడేపల్లిలోని ఆయన నివాసంలో కలిసి కోలగట్ల వీరభద్రస్వామి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సార్ ఇటువైపు చూడండి.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన కోలగట్ల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి సోమవారం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు నుంచి నాకు రాజకీయ పార్టీలతో సంబంధం ఉండొద్దని కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే సభలో ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరిస్తానని సభా ముఖంగా తెలియజేశారు. అయితే మేము ఈ స్థాయికి వచ్చామంటే వైఎస్సార్సీపీ తరపున ఎమ్మెల్యేగా నిలిచి గెలవడమే కారణం. సభలో నిష్పక్షపాతంగా వ్యవహరించినా.. బయట మాత్రం రాజకీయవేత్తగా కొనసాగుతానని తెలిపారు. ఇకపోతే మీరు ఎడమవైపు (తెలుగుదేశం సభ్యులు కూర్చున్న వైపు) చూడమంటున్నారు.. అయితే నేనలా చేయాలంటే మీరు సభలో కూర్చోవాలని.. మీ స్థానాల్లో మీరు లేకపోతే నేనెలా చూడగలను అంటూ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల చమత్కరించారు. దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. చదవండి: (ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపుపై సుప్రీంలో పిటిషన్) -
ఎమ్మెల్యే కోలగట్లకు కరోనా
విజయనగరం: విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభధ్రస్వామి కరోనా బారిన పడ్డారు. శనివారం ఆయన కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. రెండు రోజులుగా తనను కలిసిన వ్యక్తులు కూడా పరీక్షించుకోవాలని కోలగట్ల కోరారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. చదవండి: ‘గ్రామీణ వికాసం’లో ఏపీ భేష్ రికవరీలో ఏపీ బెస్ట్ -
'ఆర్టీవో కార్యాలయాన్ని అమ్ముకుంది ఎవరు?'
సాక్షి, విజయనగరం : చంద్రబాబుకు రాజ్యసభ ఎన్నికల ద్వారా మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. విజయనగరం జెడ్పీ గెస్ట్ హౌస్‌లో ఆయనతో పాటు ఎమ్మెల్యేలు రాజన్నదొర, అప్పల నరసయ్య, కంబాల జోగులు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ.. ' 23 మంది ఎమ్మెల్యే లు ఉంటే కేవలం17 ఓట్లు మాత్రమే రావడం సొంత పార్టీలో ఉన్న వ్యతిరేకత తేటతెల్లం అవుతుంది. రాష్ట్ర ప్రజలంతా వైఎస్ జగన్మోహన్రెడ్డి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. విజయనగరం భోగాపురం ఎయిర్ పోర్ట్‌కు భూ సేకరణ చేసింది ఎవరు.. ఏం చేద్దామని అవసరానికి మించి భుమిని టీడీపి ప్రభుత్వం సేకరించింది.. వైసీపీ నాయకుల భూములను బలవంతంగా లాక్కుంది మీరు కాదా? భూములు అమ్ముకునే సంస్కృతి మా నాయకులకు లేదు. గతంలో మయూరి సెంటర్లో ఉన్న ఆర్డీవో కార్యాలయాన్ని మీరు అమ్ముకో లేదా.. మాది నీతి గల ప్రభుత్వం... సంక్షేమ పథకాలు మా ప్రభుత్వంలో విసృతంగా జరుగుతున్నాయి.. నిధులు ఎక్కడ నుంచి వస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు కానీ గతంలో డబ్బులన్ని మంత్రులు, మిగతా నాయకుల జేబుల్లోకి వెళ్లేవి. కాని ఇప్పుడు మాత్రం నేరుగా ప్రజలకు అందుతుంది' అంటూ తెలిపారు. ఎమ్మెల్యే రాజన్న దొర మాట్లాడుతూ.. ఎన్నడూ లేని విధంగా ఒక్క సాలూరు నియోజకవర్గానికే సంక్షేమ పథకాలకు ప్రభుత్వం రూ. 110 కోట్లు ఖర్చు చేసిందన్నారు. దీనిని బట్టే రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో అర్థం చేసుకోవాలన్నారు. జీవో నెంబర్ మూడు గిరిజన చట్టంపై న్యాయస్థాన్ని ఆశ్రయిస్తామని వెల్లడించారు. -
ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: కోలగట్ల
-
‘అందుకే బాబును ప్రజలు ఇంటికి పంపారు’
సాక్షి, విజయనగరం: ప్రజా చైతన్యం ఉండబట్టే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఇక ప్రజా చైతన్య యాత్ర దేని కోసం నిర్వహిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామీ పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మాజీ హోం మంత్రి చిన రాజప్ప లేనిపోని ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ఇక సీఎం జగన్ పర్యటన జయప్రదంగా ముగిసిందని, ప్రజలకు ఎక్కడా అసౌకర్యం కలగలేదన్నారు. ఉగాది రోజున ఇల్లు లేని వాళ్లందరికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని, కుల, మతాలు చూడకుండా ఇళ్ల పట్టాలు అందిస్తామన్నారు. పాలనలో దేశంలోనే ఆదర్శ సీఎం జగన్ అన్నారు. అర్హత కలిగిన వాళ్లందరికి పెన్షన్లు పునరుద్ధరణ చేశామని ఆయన తెలిపారు. మద్య నిషేధ అమలులో భాగంగా బెల్ట్ షాప్‌లను లేకుండా చేశామని తెలిపారు. ఆనాడు మద్యం సిండికేట్‌లో ప్రతికపక్ష నాయకులను అరెస్టు చేయిస్తామని చంద్రబాబు బెదిరించారన్నారు. మూడు రాజధానులు కొత్తేమీ కాదని, ఆనాడు మద్రాస్ నుంచి కర్నూలుకి మర్చలేదా, హైదరాబాద్ నుంచి అమరావతికి మార్చలేదా అని పేర్కొన్నారు. టీడీపీ హాయంలో పారిశ్రామిక వేత్తల సదస్సును అమరావతిలో కాకుండా.. విశాఖలో ఎందుకు పెట్టారని, అక్కడ అభివృద్ధి ఏమి లేదని అందరికి తెలిసిపోతుందనా? అని ప్రశ్నించారు. టీడీపీ హాయాంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోవడం వల్లనే బాబుని ప్రజలు ఇంటికి పంపించారని విమర్శించారు. చంద్రబాబు చేపట్టే ప్రజా చైతన్య యాత్రకి ప్రజలు ఎవరూ రారని, మద్దతు ఇవ్వరని ఆయన పేర్కొన్నారు. -
ఇంటింటికీ రైస్‌కార్డులు
సాక్షి, విజయనగరం: రైస్‌కార్డులు పంపిణీ కార్యక్రమం జిల్లాలో ప్రారంభమైంది. నియోజకవర్గానికి ఒక సచివాలయంలో ముందుగా పంపిణీ చేస్తున్నారు. దశల వారీగా వారం పదిరోజుల్లో అన్ని సచివాలయాల్లో పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు ఇప్పటికే కొన్ని కుటుంబాలను అర్హులుగా గుర్తించగా మరికొన్ని కుటుంబాలు పరిశీలనలో ఉన్నాయి. అన్ని అర్హత గల కుటుంబాలకు రైస్‌కార్డులు అందించే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. రేషన్‌కార్డే అన్ని పథకాలకు అర్హతగా గుర్తించడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ పథకాలు కూడా పక్కదారి పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పాలనలో ప్రక్షాళన, పారదర్శకత ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఏ పథకానికి సంబంధించి వారికి ఆ కార్డు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రేషన్‌డిపోల ద్వారా ఇంటింటికీ సరకుల పంపిణీకి రైస్‌కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. నవంబర్, డిసెంబర్ నెలలో జరిపిన సర్వేలో లబి్ధదారులను ఎంపిక చేశారు. ఈ మేరకు అర్హులుగా తేలిన వారికి ఈ నెల 15వ తేదీ నుంచి రైస్‌కార్డులు పంపిణీ చేస్తామని ప్రకటించి ఆమేరకు పనులు ప్రారంభించారు. ప్రారంభమైన కొత్త రేషన్‌కార్డులు పంపిణీ ప్రభుత్వం అనుకున్నట్లు శనివారం నుంచి రైస్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. నవశకం సర్వేలో గుర్తించిన లబి్ధదారుల పేరున కొత్తగా కార్డులు ముద్రించి పంపిణీ చేస్తున్నారు. సాంకేతిక కారణాల రీత్యా అన్ని సచివాలయాల్లో అన్ని కుటుంబాలకు కార్డులు ఒకేరోజు పంపిణీ చేయడం సాధ్యం కాకపోవడంతో దశలవారీగా అందజేస్తున్నారు. శనివారం నియోజకవర్గానికి ఒక సచివాలయంలో రేషన్‌డిపోలో ఈ కార్యక్రమం స్థానిక మంత్రి, ఎమ్మెల్యేలతో ప్రారంభించారు. వారు అందుబాటులో లేని చోట అధికారులు ప్రారంభించారు. కార్డులు కూడా జిల్లాకు వస్తున్నాయి. వాటిని కూడా సచివాలయాలకు పంపించి వలంటీర్ల ద్వారా అందజేసే ఏర్పాటు చేస్తున్నామని జాయింట్ కలెక్టర్ కిశోర్‌కుమార్ అధికారికంగా ప్రకటించారు. అర్హత గల ప్రతి కుటుంబానికి కార్డులు జిల్లాలో అర్హతకలిగిన ప్రతి కుటుంబానికి రైస్‌కార్డు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందుకే ఈ కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా మార్చి సచివాలయాల ద్వారా ఎప్పుడూ పంపిణీ చేసేలా కార్యక్రమాన్ని రూపకల్పన చేసింది. జిల్లాలో ఇంతవరకు 7,10,554 రేషన్‌కార్డులు ఉన్నాయి. వాస్తవానికి వీరందరికీ రైస్‌కార్డులు అవసరం లేదు. కోటా బియ్యం తినే కుటుంబాలు ఇందులో చాలా వరకూ లేవు. కానీ విద్య, వైద్యం నిమిత్తం రేషన్‌కార్డులు పొందారు. ఇప్పుడు రైస్‌కార్డులు కేవలం సరుకులకు మాత్రమే ఉపయోగ పడనుండడంతో రైస్‌కార్డుల సంఖ్య తగ్గుతుంది. ఇప్పటికి అందిన సమాచారం ప్రకారం జిల్లాలో 6,46,171 కుటుంబాలను సర్వేలో వలంటీర్లు అర్హులుగా గుర్తించారు. ప్రజాసాధికార సర్వేలో కూడా వీరు అర్హులుగా తేలారు. మరో 30,403 కుటుంబాలు అర్హులుగా వలంటీర్లు గుర్తించినా భూమి, విద్యుత్ వినియోగం, నాలుగు చక్రాల వాహనాలు, అధిక ఆదాయం కారణంగా వీరిని పక్కన పెట్టారు. ఇందులో కొందరు నిజమైన అర్హులని అధికారుల పరిశీలనలో తేలడంతో ప్రభుత్వం మళ్లీమళ్లీ విచారణ చేసి అర్హులందరికీ కార్డులు ఇవ్వాలని ఆదేశించింది. ఇలా విచారణ చేయగా 22వేల కుటుంబాలు అర్హులుగా తేలారు. వీరికి ఇవ్వాల్సిన రేషన్‌కార్డులు కూడా ముద్రిస్తున్నారు. ఈ నెల 22వ తేదీలోగా వీరందరికీ కార్డులు వచ్చేస్తాయి. అయితే మరో 33,980 వరకు కార్డులున్నా వారి నివాసాలపై స్పష్టత లేదు. కార్డులున్నా కుటుంబాలు ఎక్కడో నివాసం ఉంటున్నాయి. వీరి విషయంలో కూడా విచారణ చేసి అర్హతను గుర్తిస్తారు. ఇందులో అర్హులకు వారు ఎక్కడ కోరుకుంటే అక్కడ కార్డులు అందజేస్తారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.