'వారిని అనాగరికంగా మంత్రులను చేశారు' | kolagatla veerabhadra swamy, vellampalli srinivas slams chandrababu | Sakshi
Sakshi News home page

'వారిని అనాగరికంగా మంత్రులను చేశారు'

Published Tue, Aug 1 2017 7:31 PM | Last Updated on Fri, Oct 19 2018 8:10 PM

'వారిని అనాగరికంగా మంత్రులను చేశారు' - Sakshi

'వారిని అనాగరికంగా మంత్రులను చేశారు'

చంద్రబాబు పాలనలో ఆర్యవైశ్యులపై దాడులు పెరిగాయని వైఎస్సార్‌ సీపీ నాయకులు కోలగట్ల వీరభద్రస్వామి, వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు.

నంద్యాల: చంద్రబాబు పాలనలో ఆర్యవైశ్యులపై దాడులు పెరిగాయని వైఎస్సార్‌ సీపీ నాయకులు కోలగట్ల వీరభద్రస్వామి, వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. అభివృద్ధి పేరుతో చిరువ్యాపారుల పొట్టకొడుతున్నారని విమర్శించారు. ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులతో వైఎస్సార్‌ సీపీ నేతలు మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... చంద్రబాబుకు ఇప్పుడే నంద్యాల అభివృద్ధి గుర్తుకొచ్చిందా అని ప్రశ్నించారు. ఇంతకాలం నంద్యాల అభివృద్ధి ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు.

వర్తకులు ఇబ్బందులు పడుతున్నా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్యవైశ్య నేత విజయ్‌కుమార్‌పై భూమా నాగిరెడ్డి దాడి చేసినా చంద్రబాబు కనీసం స్పందించలేదని గుర్తుచేశారు. అన్నికులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని, ఆర్యవైశ్యులకు మాత్రం మొండిచేయి చూపారని ఆరోపించారు. ఆర్యవైశ్యులకు న్యాయం జరగాలన్నా, రౌడీయిజానికి అడ్డుకట్ట పడాలన్నా నంద్యాల ఉప ఎన్నికలో శిల్పా మోహన్‌రెడ్డిని గెలిపించాలని కోలగట్ల వీరభద్రస్వామి, వెల్లంపల్లి శ్రీనివాస్ కోరారు.

వైఎస్సార్‌ సీపీ నుంచి అన్యాయంగా 21 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నారని, వారిలో నలుగురిని అనాగరికంగా మంత్రులను చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబు చేస్తున్న అనైతిక రాజకీయాలను రాష్ట్ర  ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement