సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి సర్కార్‌కు పేదలంటే ఎందుకు అంత చులకన అని ప్రశ్నించారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. సంక్షోభం నుంచి అవినీతి ఎలా చేస్తారో చంద్రబాబు చేసి చూపించారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వరద బాధితులను నిండా ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి వెల్లంపల్లి బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘విజయవాడ వరదల సమయంలో చంద్రబాబు ఎన్ని విన్యాసాలు చేసినా బాధితులకు ఓదార్పు కలగలేదు. వరద బాధితుల కోసమని చిన్నపిల్లలు కూడా వారు దాచుకున్బ డబ్బు ప్రభుత్వానికి ఇచ్చారు. వరదల వలన లక్ష నుండి రెండు లక్షల వరకు ఒక్కో ఇంటికి నష్టం వచ్చింది. బాధితులకు ఐదు రోజులపాటు ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయలేదు. రూ.368 కోట్లు భోజనాల పేరుతో దోచుకున్నారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయకుండానే కోట్లు ఖర్చు పెట్టినట్లు లెక్కలు చెప్పారు. రూ.26 కోట్లతో వాటర్ బాటిల్స్ ఇచ్చారంట. కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు రూ.23 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు.
అలాగే, 412 డ్రోన్లతో ఆహారం అందించామని తప్పుడు లెక్కలు చెప్పారు. బాధితులకు సహాయం చేయకుండానే చేసినట్టు ఎందుకు లెక్కలు చెప్తున్నారు? పేదలంటే ఎందుకు అంత చులకనా?. కేంద్రం ఇచ్చిన నిధులు, విరాళాలు ఏం చేసినట్టు?. విజయవాడ బ్రాండ్ ఇమేజ్‌ని చంద్రబాబు డ్యామేజ్ చేశారు. బాధితులు సహాయం కోసం రోడ్డు మీదకు వస్తే పోలీసులతో లాఠీ ఛార్జ్ చేయించారు. ఇదేనా ప్రభుత్వ విధానం?. వరద బాధితుల పేరుతో కూడా దోచుకోవటం ఇప్పుడే చూస్తున్నాం. పదో తేదీన వరద బాధితుల కోసం ధర్నా చేయబోతున్నాం. ప్రభుత్వం స్పందించి బాధితులను ఆదుకోవాలి. ప్రభుత్వం చేయలేని పని మేము చేశాం. మా పార్టీ తరఫున బాధితులను సహాయం అందించాం. ప్రభుత్వం అడ్డుకున్నా నడుచుకుంటూ వెళ్లి సాయం చేశాం. వరద బాధితులను నిలువునా ముంచారు. వరద బాధితుల ప్రాంతాల్లో టీడీపీ నేతలు పోలీసులు లేకుండా తిరిగే ధైర్యముందా?. ఒకసారి జనంలోకి వస్తే బాధితులే సమాధానం చెబుతారు.
దసరా నవ రాత్రులు జరుగుతున్న తీరు బాధాకరం. మేయర్ భాగ్యలక్ష్మిని రోడ్డుమీద ఆపేశారు. కాదంబరీ జత్వానీని పోలీసు ఎస్కార్టుతో పంపటం దారుణం. గతంలో ఎప్పుడూ ఇలాంటి దారుణాలు చూడలేదు. ఉచిత బస్సుల్లో వృద్దులను ఎక్కించుకోవటం లేదు. పవన్ కళ్యాణ్ వెళ్తే సాధారణ భక్తులను గంటల తరపడి ఆపేశారు’ అంటూ కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: మేము గుడ్‌బుక్ కూడా రాసుకోవడం మొదలుపెట్టాం: వైఎస్ జగన్
Comments
Please login to add a commentAdd a comment