జగన్‌తోనే స్వర్ణయుగం | Golden Days Only with Jagan | Sakshi
Sakshi News home page

జగన్‌తోనే స్వర్ణయుగం

Published Fri, Jun 1 2018 1:18 PM | Last Updated on Mon, Aug 20 2018 6:07 PM

Golden Days Only with Jagan - Sakshi

ఎమ్మెల్సీ కోలగట్లకు అభినందనలు తెలుపుతున్న నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు 

విజయనగరం మున్సిపాలిటీ : నాయీ బ్రాహ్మణుల సమస్యల పరిష్కారం జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌ సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్‌ కోలగట్ల వీరభధ్రస్వామి పేర్కొన్నారు. గురువారం విజయనగరం నియోజకవర్గ నాయీ బ్రాహ్మణ సంఘం సభ్యులు కోలగట్లను కలిసి కృజ్ఞతలు తెలిపి పుష్పగుచ్ఛం అందించారు.

ఇటీవల ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కృష్ణా జిల్లా ముదినేపల్లి వద్ద నాయీ బ్రాహ్మణులు కలిసి తమ సమస్యలు జగన్‌మోహన్‌రెడ్డికి వివరిచగా స్పందించిన ప్రతిపక్ష నేత వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే నాయీ బ్రాహ్మణుల సమస్యలు తక్షణమే పరిష్కరిస్తామని ఇచ్చిన హామీ అభినందనీయమన్నారు.

నాయీ బ్రాహ్మణులంతా వైఎస్‌ జగన్‌కు అండగా ఉంటారని కోలగట్లకు తెలిపారు. ఈ సందర్బంగా కోలగట్ల వారితో మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి మాట తప్పని, మడమ తిప్పని నాయకుడని, అధికారంలోకి వచ్చిన వెంటనే నాయీ బ్రాహ్మణుల ఫెడరేషన్‌కి కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తారని తెలిపారు.

ప్రతీ నెలా 250 యూనిట్ల వరకు సెలూన్‌ షాపునకు ఉచిత విద్యుత్‌ అందిస్తామని వివరించారు. కోలగట్లను కలిసిన వారిలో జిల్లా నాయీ బ్రాహ్మణుల సంఘం అధ్యక్షుడు రామేశరపు రామారావు, పట్టణ, మండల అధ్యక్షులు ఉప్పడి సత్యనారాయణ, దిమిలి పైడిరాజు, జిల్లా గౌరవాధ్యక్షుడు పండూరి సత్యం, జిల్లా కోశాధికారి రామేశ్వరపు అప్పారావు, సంఘం సభ్యులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ పార్టీ నగర అధ్యక్షుడు ఆశపు వేణు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు సంగంరెడ్డి బంగారునాయుడు, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు అల్లు చాణుక్య, రైతు విభాగం అధ్యక్షుడు రెడ్డి గురుమూర్తి తదితరులున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement