
సాక్షి, విజయనగరం: టీడీపీని ప్రజలు ఎందుకు పక్కన పెట్టారో ఆ పార్టీ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. సోమవారం విజయనగరంలో మీడియా సమావేశంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకటరావు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అధికార పార్టీపై ఆరోపణలు చేయడం ద్వారా తన ఉనికి చాటుకొనే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సిగ్గుపడాల్సింది పోయి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
ఇసుకను సాకుగా చూపి టీడీపీ లబ్ధి పొందాలని చూస్తోందని మండిపడ్డారు. ‘ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారని టీడీపీ ఆరోపిస్తుందని.. కానీ టీడీపీకికి ప్రశ్నించే అర్హత లేదని’ దుయ్యబట్టారు. విజయనగరం జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ అఖండ విజయం సాధించిందని.. జిల్లాలో టీడీపీకి పాలించే అర్హత లేదని ప్రజలు స్పష్టంగా చెప్పారని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని, టీడీపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment