
ఎమ్మెల్సీకి కోలగట్ల రాజీనామా
విజయనగరం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి తన శాసనమండలి పదవికి మంగళవారం రాజీనామా చేశారు. విజయనగరం పట్టణంలోని ఓ హోటల్‌లో రోటరీ క్లబ్, చాంబర్ ఆఫ్ కామర్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కోలగట్ల వారి సమక్షంలోనే రాజీనామా పత్రంపై సంతకం చేసి శాసనమండలి కార్యాలయానికి ఫ్యాక్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నపుడు తనకు ఆ పదవి వచ్చిందని, ఆ పార్టీని వీడడంతో పదవి కూడా వద్దనుకుని రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు.