వచ్చే మున్సిపల్‌ ఎన్నికలూ కీలకమే... | YSRCP Leaders Meeting On Municipal Elections | Sakshi
Sakshi News home page

వచ్చే మున్సిపల్‌ ఎన్నికలూ కీలకమే...

Published Wed, Apr 24 2019 1:39 PM | Last Updated on Wed, Apr 24 2019 1:39 PM

YSRCP Leaders Meeting On Municipal Elections - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి

విజయనగరం మున్సిపాలిటీ: సార్వత్రిక ఎన్నికల కాకుండా.. రానున్న మున్సిపల్‌ ఎన్నికలూ  వైఎస్సార్‌ సీపీకి కీలకమేనని, రెండింట విజయం సాధించినపుడే విజయనగరం నియోజకవర్గం రానున్న ఐదేళ్లకాలంలో గణనీయ అభివృద్ధి సాధ్యపడుతుందని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్‌ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. దీనికోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే ఎన్నికల తరహా కష్టించి పని చేయాలని పిలుపునిచ్చారు. డక్కిన వీధిలోని పార్టీ కార్యాలయంలో 9 వార్డులకు చెందిన నాయకులు, కార్యకర్తలతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన కార్యకర్తలు, నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఐదేళ్ల చంద్రబాబు పరిపాలన ప్రజలు చూశారని, అధికారం లేకపోయినా ప్రజలకు వెన్నుదన్నుగా ఉంటూ ప్రజల తరఫున పోరాటం చేసిన జగన్‌మోహన్‌రెడ్డి పోరాట పటిమను గుర్తించారని, వీరిద్దరిని బేరీజు వేసుకుని ప్రజలు ఓటింగ్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు.

రాష్ట్రం యవాత్తు జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం కావాలని, రావాలని కోరుకుంటోందన్నారు. మే 23న జరిగే ఎన్నికల కౌంటింగ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని, అప్పటి నుంచి ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హమీని అమలు చేసేలా సమర్ధవంతమైన పాలమైన సాగిస్తామని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ జరిగేందుకు కొన్ని రోజులు ముందు నియోజకవర్గంలో ఓ పార్టీలో ఉంటూ మరో పార్టీకి ఓటు వేయాలంటూ రాజకీయ వ్యభిచారానికి తెరలేపిన వారికి తగిన బుద్ధిచెప్పాలని కోలగట్ల అన్నారు. పార్టీ నమ్ముకుని పని చేసిన ప్రతీ ఒక్కరికి రానున్న రోజుల్లో సముచిత స్థానం కల్పిస్తామని, రాజకీయ అభివృద్ధికి బాటలు వేస్తామన్నారు. పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి కంటుభక్తు తవిట రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు కేధారశెట్టి సీతారామమూర్తి, పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి కనకల ప్రసాదరావు, పార్టీ నాయకులు అవనాపు లక్ష్మణరావు, అవనాపు రాజు, 9 వార్డుల బూత్‌ కమిటీ కన్వీనర్లు, పార్టీ వార్డు ఇన్‌చార్జిలు, బూత్‌ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement