Vizianagaram Assembly Constituency
-
మంత్రి బొత్స జిల్లా పర్యటన నేడు, రేపు
విజయనగరం అర్బన్: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ నెల 3, 4 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్సార్ ఆసరా 4వ విడత సంబరాల్లో పాల్గొనడంతో పాటు చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. 3న ఉదయం 10 గంటలకు గరివిడి ఫుట్‌బాల్ మైదానంలో వైఎస్సార్ ఆసరా సంబరాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.15 గంటలకు గెడ్డపువలసలో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 4 గంటలకు కొండదాడిలో గ్రామ సచివాలయం, రైతుభరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ భవనాలను ప్రారంభిస్తారు. సాయంత్రానికి విజయనగరంలోని తన నివాసానికి చేరుకుంటారు. 4న ఉదయం 10.30 గంటల నుంచి మెరకముడిదాం మండలం గర్బాంలో జరిగే వైఎస్సార్ ఆసరా సంబరాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు చీపురుపల్లిలో పాలిటెక్నిక్ కళాశాలలో నూతన భవనాలను ప్రారంభిస్తారు. 3.15 గంటలకు పేరిపిలో గ్రామ సచివాలయం, రైతుభరోసా కేంద్రం, వెల్నెస్ కేంద్ర భవనాలను ప్రారంభించి, సాయంత్రం 5 గంటలకు విశాఖ మీదుగా రాత్రికి విజయవాడ చేరుకుంటారు. -
అందరి చూపు వైఎస్సార్సీపీ వైపే..
చీపురుపల్లి(గరివిడి): జిల్లాలో అందరి చూపు వైఎస్సార్ సీపీవైపే. ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి పాలన అందిస్తుండడంతో టీడీపీ శ్రేణులు పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరుతున్నాయి. అర్హతే కొలమానంగా సంక్షేమ పథకాలు అందజేయడం, ప్రతి కుటుంబానికి ఆర్థిక లబ్ధికలగడం, జనబలం మెండుగా ఉండడంతో వైఎస్సార్సీపీలో చేరి ప్రజలకు సేవచేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇదే కోవలో గరివిడి మండలం వెదుళ్లవలస గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మన్నెపురి లక్ష్మణరావు ఆధ్వర్యంలో బద్రి పాపినాయుడు, మందాడి రాంబాబు, బద్రి లక్ష్మీనారాయణ, కిరాల రాము, పిసిని భవాని, బెల్లాన లక్ష్మిలకు చెందిన 100 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలో శుక్రవారం చేరాయి. గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో వీరికి జెడ్పీ చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌లు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ ఐదేళ్లకోసారి ఎన్నికలు వచ్చినప్పుడే టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రజల గుర్తుకొస్తారని, అనంతరం వారివైపు కన్నెత్తి కూడా చూడరని విమర్శించారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల కష్ట, సుఖాలను పంచుకోవడం సీఎం జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు నైజమన్నారు. టీడీపీ నాయకులు ఈ రాష్ట్రానికి, జిల్లాకు, నియోజకవర్గానికి ఏం చేశారో ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గతంలో 600 హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక్క హామీను నెరవేర్చకుండా, మళ్లీ ఆరు గ్యారంటీలు పేరుతో ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నాడని, అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలనతో కొత్త చరిత్ర సృష్టించారన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాకు ప్రభుత్వ వైద్యకళాశాల, భోగాపురం ఎయిర్‌పోర్టు, గిరిజన వర్సిటీ, గిరిజన ఇంజినీరింగ్, జేఎన్టీయూ వర్సిటీ మంజూరు చేసి ప్రజల చిరకాల కలను సీఎం సాకారం చేశారన్నారు. కార్యక్రమంలో పలాస నియోజకవర్గ పరిశీలకుడు కె.వి.సూర్యనారాయణరాజు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎస్.వి.రమణరాజు, చీపురుపల్లి మండల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు ఇప్పిలి అనంతం, గరివిడి మండల నాయకులు మీసాల విశ్వేశ్వరరావు, వైస్ ఎంపీపీలు గుడివాడ శ్రీరాములునాయుడు, సర్పంచ్ తమ్మినాయుడు, బార్నాల సూర్యనారాయణ, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పార్టీలో జోరుగా చేరికలు టీడీపీని వీడుతున్న శ్రేణులు వైఎస్సార్సీపీలో చేరిన వెదుళ్లవలస టీడీపీ నాయకులు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించిన జెడ్పీచైర్మన్, ఎంపీ -
వైఎస్సార్ ఆసరా సంబరాలు సందడిగా సాగాయి
చీపురుపల్లి, తెర్లాంలో సోమవారం నిర్వహించిన వైఎస్సార్ ఆసరా సంబరాలు సందడిగా సాగాయి. మహిళలు వేలాదిగా పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కలిగిన ఆర్థిక ప్రయోజనాలను తెలియజేశారు. థాంక్యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. మహిళలకు అండగా నిలుస్తూ, ఆర్థిక సంక్షేమానికి కృషిచేస్తున్న జగనన్నను వచ్చే ఎన్నికల్లో గెలిపించుకుంటామంటూ చేతులెత్తి చెప్పారు. జగనన్న పాలనకు జేజేలు పలికారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సాగిస్తున్న సంక్షేమ పాలన, మహిళలకు చేసిన మేలును మంత్రి బొత్స సత్యనారాయణ, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు వివరించారు. పొదుపు మహిళలకు చీపురుపల్లిలో రూ.11.5కోట్లు, తెర్లాంలో రూ.5.89కోట్ల చెక్కులను అందజేశారు. ఎన్నికల వేళ మాయమాటలతో మోసంచేసేందుకు వస్తున్న టీడీపీ నాయకులపై అప్రమత్తంగా ఉండాలని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని హితవుపలికారు. అతివలకు ఆర్థిక ఆసరా కల్పిస్తున్న ఘనత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వందేనని స్పష్టంచేశారు. – చీపురుపల్లి/తెర్లాం -
దమ్ముంటే నాపై పోటీ చెయ్ : కేశినేని నాని
గంపలగూడెం(తిరువూరు): చంద్రబాబునాయుడికి దమ్ము, ధైర్యం ఉంటే విజయవాడ ఎంపీ స్థానం నుంచి తనపై నిలబడి గెలవాలని వైఎస్సార్ సీపీ విజయవాడ పార్టీమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి కేశినేని నాని సవాల్ విసిరారు. చంద్రబాబు కుప్పంలో కూడా ఓడిపోవడం ఖాయమన్నారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం తోటమూల మ్యాంగో మార్కెట్లో ఆదివారం నిర్వహించిన వైఎస్సార్ సీపీ మండల ఆత్మియ సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి చివరివని జోస్యం చెప్పారు. పేదల కోసం పనిచేసే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అయితే, పేదలకు వ్యతిరేకంగా పాలన చేసిన ఘనుడు నారా చంద్రబాబునాయుడని అన్నారు. తన పుత్రరత్నం లోకేశ్‌ను ముఖ్యమంత్రిని చేయాలన్న ఏకైక అజెండాతో చంద్రబాబు ముందుకు పోతున్నారని విమర్శించారు. సుదీర్ఘ రాజకీయం ఉన్న వ్యక్తినని చెప్పుకొనే చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్‌లో కనీసం ఇల్లు కూడా లేదని ఎద్దేవా చేశారు. అమరావతి పేరిట ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు నష్టం తెచ్చారన్నారు. రూ.2.60 లక్షల కోట్ల మేర సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేసిన ఘనత దేశంలో ఒక్క జగన్మోహన్రెడ్డికి మాత్రమే ఉందని పేర్కొన్నారు. అభ్యర్థుల డబ్బు చూసి చంద్రబాబు టికెట్లు కేటాయిస్తున్నారని విమర్శించారు. మండలంలో ప్రధాన సమస్య అయిన కట్టెలేరు వంతెన నిర్మాణానికి వచ్చే నెల 3వ తేదీన శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. తిరువూరు నియోజకవర్గంలో 10వేల మెజారిటీతో పార్టీ అభ్యర్ధులను గెలిపించాల్సిన బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలన్నారు. ఓటు అడిగేహక్కు వైఎస్సార్ సీపీకి మాత్రమే ఉంది రాష్ట్ర ప్రజలకు 57 నెలలుగా మెరుగైన పాలన అందించిన వైఎస్సార్ సీపీకి మాత్రమే రోబోయే సాధారణ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఉందని రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి అన్నారు. పార్టీ మేనిఫెస్టోను 99 శాతం అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాత్రమే దక్కుతుందని పేర్కొన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రజలకు చేసిన మంచిని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. తిరువూరు అభ్యర్థి ఎంపిక కోసం తలపట్టుకొంటున్నారు తనను వైఎస్సార్ సీపీ తిరువూరు నియోజకవర్గ ఇన్చార్జిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నియమించిన తర్వాత తెలుగుదేశంపార్టీ అభ్యర్ధి కోసం వెతుకులాట ప్రారంభించిందని స్వామిదాసు అన్నారు. తనపై జగనన్న ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొని పనిచేస్తానని చెప్పారు. ముందుగా అయోధ్యరామిరెడ్డి, కేశినేని నాని, స్వామిదాసు తోటమూలలో అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్, వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. వినగడప పేరంటాళ్ళ గుట్ట వద్ద అచ్చం పేరంటాళ్ళకు పూజలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఎన్.సుధారాణి, ఎంపీపీ జి.శ్రీలక్ష్మీ, జెడ్పీటీసీ సభ్యులు కోట శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. -
డబ్బు సంచులు తెచ్చినోళ్ళు ముందుకు రండి!
సీనియర్లు పక్కకు వెళ్ళిపోండి.. డబ్బు సంచులు తెచ్చినోళ్ళు ముందుకు రండి. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు చేస్తున్న రాజకీయం ఇదే. ఎన్నికలు ముంచుకొస్తుండటంతో చంద్రబాబు వక్రబుద్ధి మరోసారి బయటపెట్టుకుంటున్నారు. జిల్లా ఏదైనా, నియోజకవర్గం ఏదైనా డబ్బుతో వచ్చేవారికే టిక్కెట్ అని తేల్చి చెప్పేస్తున్నారు. పార్టీ పుట్టినప్పటినుంచీ ఉన్నవారిని, వారి వారసుల్ని కాదని కొత్తవారి కోసం వెతుకుతున్నారు. దీంతో ఉత్తరాంధ్రలోని ఓ జిల్లా సీనియర్లంతా చంద్రబాబుపై మండిపడుతున్నారు. ఆ జిల్లా ఏదో.. ఆ నేతలెవరో చూద్దాం. తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి విజయనగరం జిల్లాలో పచ్చ జెండా ఎగురుతోంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆవిర్భావం తర్వాత ఫ్యాన్ స్పీడ్‌కు సైకిల్ అడ్రస్ గల్లంతయింది. జిల్లాలోని కొన్ని రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు టీడీపీ పుట్టినప్పటినుంచి ఆ పార్టీ జెండాను మోసాయి. మూడు కుటుంబాలు టీడీపీలో సుదీర్ఘకాలం ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా వెలిగారు. అయితే మారుతున్న రాజకీయ పరిణామాల వల్ల ఆ కుటుంబాలు ఆర్థికంగా వెనకబడ్డాయి. దీంతో సీనియర్ నేతల కుటుంబాలకు ఈసారి టిక్కెట్లు ఇచ్చేది లేదని పచ్చ పార్టీ బాస్ చంద్రబాబు తెగేసి చెబుతున్నారు. డబ్బు గుమ్మరించే వారిని తీసుకురండి అని చెబుతున్నారు. అటువంటి వారు కనిపిస్తే వారికే టిక్కెట్ అని హామీలిచ్చేస్తున్నారు. ఆక్..పాక్..కరివేపాక్..అంటూ చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుతో సీనియర్ నేతలంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్.కోట నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేత కోళ్ల అప్పలనాయుడు కోడలు లలితకుమారికి ఈసారి టిక్కెట్ లేదని చెప్పేశారు. టీడీపీ ఏర్పడకముందు ఇండిపెండెంట్‌గా గెలిచిన కోళ్ల అప్పలనాయుడు టీడీపీ వచ్చాక ఆ పార్టీ తరపున 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తర్వాత అప్పలనాయుడు కోడలు లలిత కుమారి రెండు సార్లు టిడిపి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎస్.కోట టీడీపీలో ఈ కుటుంబానిది తిరుగులేని నాయకత్వం. కానీ ఈ ఎన్నికల్లో లలిత కుమారికి టికెట్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇటీవలే రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన NRI పారిశ్రామిక వేత్త గొంప కృష్ణకు చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇస్తున్నారు. రాజకీయ నేపధ్యం లేకపోయినా బాగా డబ్బున్న వ్యక్తి కావడం అనే కారణంతో కోళ్ల కుటుంబాన్ని పక్కన పెట్టి గొంప కృష్ణకు ఎస్.కోట టికెట్ ఇవ్వబోతున్నారనే చర్చ పార్టీలో సాగుతోంది. నెల్లిమర్ల నియోజకవర్గంలో పతివాడ నారాయణస్వామి 7 సార్లు టిడిపి తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా ఈయన అనుభవం అపారం. అయితే వృద్దాప్యం కారణంగా వారసులుకి అవకాశం కల్పించాలని ఆయన చంద్రబాబును కోరారు. కానీ ధనికులకే టికెట్ అనే కాన్సెప్ట్ తీసుకువచ్చిన చంద్రబాబు.. పతివాడ నారాయణస్వామి కుటుంబం విన్నపాన్ని విస్మరించారు. ఎయిర్పోర్ట్ వస్తున్న భోగాపురం పరిసరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భారీగా సంపాదించిన కర్రోతు బంగార్రాజుకు నెల్లిమర్ల నియోజకవర్గం ఇన్ చార్జిగా బాధ్యతలు అప్పగించారు. ఇదిలా ఉండగా ఇంజనీరింగ్ కాలేజీలు, సాఫ్ట్వేర్ కంపెనీల యజమాని అయిన లోకం మాధవి జనసేన తరపున టికెట్ రేసులోకి వచ్చారు. బంగార్రాజు కంటే ఈమె దగ్గర ఇంకా ఎక్కువ డబ్బులు ఉన్నాయని తెలియడంతో నెల్లిమర్ల సీటును టీడీపీ తరపున లోకం మాధవికి ఇస్తామని హింట్ ఇచ్చారు. దీంతో రియల్టర్ బంగార్రాజు ఖంగు తిన్నారు. పార్వతీపురం నియోజకవర్గంలో బొబ్బిలి చిరంజీవి మాస్టర్ టిడిపి తరపున మూడు సార్లు పోటీ చేసి ఒకసారి గెలిచారు. ఈ ఎన్నికల్లో ఆయనను పక్కన పెడతారనే ప్రచారం సాగుతోంది. బోనెల విజయచంద్ర అనే వ్యాపారవేత్తను పార్వతీపురం రాజకీయ తెరమీదకు తీసుకుచ్చారు. ఇది ఎస్సీ నియోజకవర్గం అయినా చంద్రబాబు విడిచి పెట్టలేదు. డబ్బు బాగా ఖర్చు పెట్టగలవారికే టికెట్ అని తేల్చి చెప్పేశారు. విజయచంద్రకు రాజకీయ నేపధ్యం లేకపోయినా పార్వతీపురం టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉందని నియోజకవర్గం టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. బలమైన కేడర్, పార్టీతో లాంగ్ జర్నీ, ఆపద కాలంలో పార్టీని నిలబెట్టారు అనే సెంటిమెంట్, ఎమోషన్ ఏ మాత్రం లేకుండా డబ్బున్నోడు కనబడగానే సీనియర్లను పూచిక పుల్లల్లా తీసి పక్కన పడేస్తున్నారు పచ్చ పార్టీ అధినేత చంద్రబాబు. చంద్రబాబు నైజం తెలుసుకుంటున్న జిల్లా సీనియర్లు ఆయనపై మండిపడుతున్నారు. -
షర్మిలకు మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, విజయవాడ: ఎవరో వచ్చి ఏదో చెబితే నమ్మడానికి జనం పిచ్చోళ్లు కాదన్నారు మంత్రి ఆర్కే రోజా. తమతో ఉంటున్నదెవరో.. తమ సమస్యల కోసం పోరాడిందెవరు.. అధికారంలోకి వచ్చాక పరిష్కరించిందెవరో ప్రజలకు తెలుసు. ఇచ్చిన హమీలు నెరవేర్చిన నేతలు వైఎస్సార్, వైఎస్ జగన్ అని రోజా పేర్కొన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘ఇక్కడే పుట్టి.. ఇక్కడే పెరిగి.. ఇక్కడే ఓటు.. ఇక్కడే ఇల్లు కట్టుకుని ప్రజల మధ్య ఉంటున్న ప్రజా నాయకుడు జగనన్న’’ అని ఆమె కొనియాడారు. ‘‘రాజన్న రాజ్యం తెస్తానని పావురాల గుట్టలో జగనన్న తన తండ్రికి ప్రామిస్ చేశారు. ఎన్ని కష్టాలు ఎదురైనా.. కేసులు పెట్టి జైల్లో పెట్టినా.. ఏరోజు తలొగ్గలేదు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదు. ఏ పార్టీలో విలీనం చేయలేదు. అదీ నాయకుడి లక్షణం. పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టి.. ప్రజలు ఛీ కొడితే.. ఇక్కడకొచ్చి కాంగ్రెస్‌లో చేరి మాట్లాడితే ప్రజలు నమ్మరు’’ అంటూ రోజా దుయ్యబట్టారు. ‘‘కాంగ్రెస్‌కు ఏపీలో ఓటు అడిగే అర్హత లేదు. బాగున్న రాష్ట్రాన్ని ముక్కలు చేసిన పార్టీ కాంగ్రెస్. రెండు సార్లు కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన వైఎస్సార్ పేరును ఆయన చనిపోయాక ఎఫ్ఆఐర్‌లో పెట్టి అవమానించిన పార్టీ కాంగ్రెస్. వైఎస్సార్ లేని సమయం చూసి ఆయన కుటుంబాన్ని రోడ్డుకీడ్చింది కాంగ్రెస్. ఆ పార్టీలోకి వచ్చి ఎవరు విమర్శలు చేసినా జీరోలే అవుతారు. సామాన్య కార్యకర్తను కూడా తన కుటుంబ సభ్యుడిగా చూసే వ్యక్తి సీఎం జగన్. ఇష్టానుసారంగా మాట్లాడే నోర్లకు 2024 సమాధానం చెబుతుంది’’ అని మంత్రి రోజా పేర్కొన్నారు. ఇదీ చదవండి: షర్మిల అబద్ధాలు.. ఇవీ అసలు నిజాలు -
తుప్పు వ్యాపారం చేసే వాడికి ఇంత డబ్బు ఎలా వచ్చింది?: వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: చంద్రబాబు తోకలు ఎవరూ గెలవరంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. శుక్రవారం ఆయన సెంట్రల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, అందరి జీవితాలు బాగుండాలంటే సీఎం జగన్‌కే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఐదేళ్లు ప్రజల వద్ద బోండా ఉమా లేడని.. బైక్ రేసులు, భూ కబ్జాలు, దొంగతనాలు, గుండాయిజం, కాల్ మనీలు చేసింది టీడీపీ నేతలేనని దుయ్యబట్టారు. ‘‘తుప్పు వ్యాపారం చేసే వాడికి ఇంత డబ్బు ఎలా వచ్చింది. బోండా ఉమా ఆఫీసు ఉన్న ప్రాంతంలోనే ఉమాకి మెజార్టీ రాదు. సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా గెలవడం కలే. బోండా ఉమాకు సెంట్రల్ నియోజకవర్గంలో నిలబడే అర్హత లేదని వెల్లంపల్లి మండిపడ్డారు. షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి ఇలా మాట్లాడటం దారుణం. ఆమె అంటే మాకు గౌరవం. గతంలో వివేకానందరెడ్డిని కాంగ్రెస్ పార్టీ మోసం చేసినట్లు ఇప్పుడు షర్మిలమ్మను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఓటు, సీటు లేదు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి, అప్పుల పాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. దివంగత సీఎం వైఎస్సార్ పేరును కాంగ్రెస్.. ఎఫ్ఐఆర్లో నమోదు చేయించడం దారుణం. సోనియా గాంధీకి తెలియకుండానే వైస్సార్ మీద కేసు పెట్టారా?. 16 నెలలు సీఎం జగన్‌ను జైల్లో పెట్టింది వాస్తవం కాదా?. అలాంటి పార్టీలో షర్మిలమ్మ ఎలా చేరారు?’’ అంటూ వెల్లంపల్లి ప్రశ్నించారు. ఇదీ చదవండి: సీఎం జగన్, చంద్రబాబు మధ్య తేడా ఇదే -
రేపు వైఎస్సార్సీపీ ఎన్నికల శంఖారావం
-
టార్గెట్ 175.. వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయం: సజ్జల
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో మరోసారి వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పార్టీ విజయం కోసం కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయని తెలిపారు. అందరం కలిసికట్టుగా పనిచేసి వైఎస్సార్సీపీని గెలిపిస్తామని చెప్పారు. విశాఖలోని భీమిలి నుంచి ఈనెల 27వ తేదీన సీఎం జగన్ ఎన్నికల శంఖారావాన్నిపూరిస్తారని తెలిపారు విజయవాడలోని సింగ్ నగర్లో సింగ్ నగర్ఎలో గురువారం మ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గం వైఎస్సార్సీపీ కార్యాలయ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. 175 స్థానాలు గెలవాలనే లక్ష్యంలో భాగంగానే సీట్ల మార్పు జరుగుతుందని తెలిపారు. మల్లాది విష్ణుకు మరింత ఉన్నతమైన బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. ఎన్నికలకు ముందే మల్లాది చట్టసభల్లోకి వెళతారన్నారు. మల్లాది విష్ణు సారధ్యంలోనే వెలంపల్లి సెంట్రల్ నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు సజ్జల చంద్రబాబుకు ఆత్రం ఎక్కువ అని విమర్శించారు. ఓడిపోయిన రెండు నెలలకే ఎన్నికలని హడావిడి మొదలు పెట్టాడని దుయ్యబట్టారు. బాబు కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నాడని, అన్నిచోట్లా స్లీపర్ సెల్స్‌ను ఏర్పాటు చేసుకున్నాడని మండిపడ్డారు. విజయవాడను బాబు అభివృద్ధి చేయలేకపోయాడని, జగన్ వచ్చాకే అభివృద్ధి చెందుతోందని చెప్పారు. చదవండి: KP Port: అదంతా ఎల్లో మీడియా సృష్టే: మంత్రి కాకాణి ఫైర్ సీఎం జగన్ పేద ప్రజల పక్షపాతి అని సజ్జల పేర్కొన్నారు. అధికారం అంటే బాధ్యతగా భావించిన నాయకుడు వైఎస్ జగన్ అని కొనియాడారు. వైఎస్సార్సీపీలో అందరూ కార్యకర్తలేనన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు గెలవడమే తమ లక్ష్యమని తెలిపారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా.. పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందించామని చెప్పారు. అవినీతికి తావులేకుండా లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమచేస్తున్నాయన్నారు.. ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసిన నాయకుడు జగన్ అని తెలిపారు. ‘ప్రజలతో సీఎం జగన్ బంధాన్ని ఎవరూ విడదీయలేరు. ఫ్లై ఓవర్లు.. రిటైనింగ్ వాల్ పూర్తయ్యాయి. సచివాలయ వ్యవస్థ. ఒక అద్భుతం. బటన్ నొక్కడాన్ని విమర్శిస్తున్నారు. కానీ బటన్ నొక్కడం అంత ఈజీ కాదు. గతంలో వీధి వ్యాపారుల గురించి ఎవరూ పట్టించుకోలేదు. వైఎస్ జగన్ ఒక్కరే వీధి వ్యాపారస్తులకు అండగా నిలిచారు. రాజకీయ ప్రమేయం లేకుండా కోటి 47 లక్షల కుటుంబాలు నేరుగా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందాయి 2 లక్షల30 వేల ఉద్యోగాలిచ్చాం. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుంది. అమరావతి పేరుతో చంద్రబాబు చేసిన కుట్రకు రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి పోయింది. సీఎం జగన్ వికేంద్రీకరణకు ముందుకెళుతుంటే కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నాడు. 14 ఏళ్లలో ఏమి చేయలేనోడు. ఇప్పుడు అధికారం ఇస్తే ఏం చేస్తాడు. కుప్పం మనం ఎప్పుడో గెలిచాం. ఈసారీ గెలుస్తాం. అందుకే చంద్రబాబు పక్క చూపులు చూస్తున్నాడు. ఇది ఎన్నికల సమయం...వార్‌ను వార్‌గానే చూడాలి. సీఎం చేస్తున్న యజ్ఞంలో మనమంతా భాగస్వామ్యం కావాలి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎంపీ కేశినేని నాని,జూపూడి ప్రభాకర్, పశ్చిమ నియోజకవర్గం ఇంఛార్జి షేక్ ఆసిఫ్, తూర్పు నియోజకవర్గం ఇంఛార్జి దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ రుహుల్లా, మేయర్ రాయన భాగ్యలక్ష్మి,డిప్యూటీ మేయర్లు ,సెంట్రల్ నియోజకవర్గ కార్పొరేటర్లు,కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యాలయ ప్రారంభోత్సవానికి కార్యకర్తలు ర్యాలీగా తరలివచ్చారు. చదవండి: గంటా రాజీనామా ఆమోదం.. టీడీపీలో కొత్త టెన్షన్! -
అగ్నికి ఆజ్యంపోస్తున్న జనసేన
సాక్షి ప్రతినిధి, విజయనగరం: గిరిజన ముద్దుబిడ్డ పీడిక రాజన్నదొర కష్టం, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో సాలూరు నియోజకవర్గం వైఎస్సార్సీపీకి కంచుకో టగా మారింది. నాలుగు దఫాలుగా తిరుగులేని విజయాలతో రాజన్నదొర సాలూరును తన అడ్డాగా మార్చుకున్నారు. మళ్లీ అక్కడ ఎలాగైనా టీడీపీ ఉనికి చాటుకోవడానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఏకంగా రాజన్నదొరపై పసలేని ఆరోపణలను ఇటీవల అరకు సభలో సంధించినా గిరిజనం నుంచి పెద్దగా స్పందన లేదు. గాలిలో దీపం మాదిరిగా పరిస్థితి తారుమారు అయినా టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు మాత్రం తారస్థాయిలోనే జరుగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌దేవ్, మాజీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పొత్తులో భాగంగా జతకట్టిన జనసేన నాయకులు ఇప్పుడు ఆ అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. శంబర జాతర సందర్భంగా సాలూరు, మక్కువ మండలాల్లో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు ఆ కుమ్ములాటకు అద్దంపట్టాయి. ‘వీళ్లు మారరురా’ అంటూ టీడీపీ కార్యకర్తలే నొచ్చుకుంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆర్పీ భంజ్‌దేవ్, గుమ్మడి సంధ్యారాణి వర్గాల మధ్య అంతర్గత కుమ్ములాటల పంచాయితీ సాక్షా త్తూ చంద్రబాబు సమక్షంలోనే జరిగినా క్షేత్రస్థాయిలో ఏమీ మార్పు కనిపించట్లేదు. తమను టార్గెట్ చేసుకొని సంధ్యారాణి అనుచరులు పనిచేస్తున్నారని, పార్టీలో కలుపుకెళ్లే ప్రయత్నాలేవీ చేయట్లేదని భంజ్‌దేవ్ వర్గీయులు గళమెత్తుతున్నారు. వెనుకే ఉంటూ మోసం చేసే నాయకులను ముందుగానే దూరంపెట్టే పని సంధ్యారాణి చేస్తున్నారని ఆమె వర్గీయులు చెబుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో మెసేజ్‌లు, లేఖలతో మొదలైన యుద్ధం పోలీసు స్టేషన్లలో ఫిర్యాదుల వరకూ వెళ్లింది. ఇది ఇప్పుడు ఫ్లెక్సీల యుద్ధంతో తారస్థాయికి చేరింది. సంధ్యారాణి తీరుతో విసిగిపోయామని, ఆమెకు టికెట్ ఇస్తే ఏమాత్రం సహకరించబోమని భంజ్‌దేవ్ వర్గీయులు బహిరంగంగానే చెప్పేస్తున్నారు. తెరపైకి తేజోవతి... సాలూరు టీడీపీ టికెట్ తనదేనని గుమ్మడి సంధ్యారాణి ధీమాగా చెబుతున్నప్పటికీ చంద్రబాబు ఇంకా స్పష్టంగా చెప్పకపోవడంతో ఆమె వర్గీయుల్లో సందేహం నెలకుంది. దీనికితోడు తేజోవతి రంగప్రవేశంతో ఇది మరింత పెరిగింది. ఇటీవల నూతన సంవత్సర వేడుకల్లో ఆమె భంజ్‌దేవ్ ఇంటి వద్ద ప్రత్యక్షమవ్వడం సంధ్యారాణి వర్గీయులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఈ పరిస్థితితో భంజ్‌దేవ్ వర్గీయులు నిరాశ వదిలేసి కొత్త ఉత్సాహంతో పార్టీలో క్రియాశీలకమయ్యారు. తేజోవతి సాలూరు గడ్డపై కాలుపెట్టడం వెనుక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చన్నాయుడి ప్రోత్సాహం ఉందని, ఆమెకు బొబ్బిలి నాయకుడు బేబీనాయన ఆశీస్సులు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఇటీవల బొబ్బిలిలో జరిగిన సభలోనే ఆమెకు టీడీపీ కండువా వేసి చంద్రబాబు పార్టీలోకి చేర్చుకోవడం వారి వాదనలకు బలం చేకూరుస్తోంది. అగ్నికి ఆజ్యంపోస్తున్న జనసేన తేజోవతికి మద్దతుగా ఉన్న భంజ్‌దేవ్ వర్గీయులను టార్గెట్ చేస్తూ ఇన్నాళ్లూ సంధ్యారాణి వర్గీయులు చేసినదాన్ని కన్నా అంతకుమించి జనసేన నాయకులు లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో సంధ్యారాణి, భంజ్‌దేవ్ వర్గాల మధ్య అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. తనను దూషిస్తూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్టుచేసిన జనసేన కార్యకర్త త్రిపురనేని విజయ్ చౌదరిపై సాలూరు టౌన్ పోలీసుస్టేషన్లో భంజ్‌దేవ్ ఫిర్యాదు చేశారు. ఇలాంటి కేసులకు తాను భయపడనని సదరు జనసేన కార్యకర్త మరో వీడియో పోస్టు చేయడం గమనార్హం. ఫ్లెక్సీలతో యుద్ధం శంబర జాతర సందర్భంగా భక్తులకు శుభాకాంక్షలు తెలుపుతూ సాలూరు, మామిడిపల్లి, శంబర ప్రాంతాల్లో తేజోవతి వర్గీయులు ఫ్లెక్సీలను పెట్టించారు. ఆ ఫ్లెక్సీల్లో తేజోవతి ముఖాన్ని ఎవరో చింపేశారు. కొన్నిచోట్ల ముఖం కనపడకుండా ఆమె ఫొటోపై సంధ్యారాణి ఫొటోలను అతికించారు. మరోవైపు శంబరలో పెట్టిన ఫ్లెక్సీలో సంధ్యారాణి ముఖం కనిపించకుండా పసుపు రాసేశారు. గెలిచే అవకాశం లేనిచోట నాయకుల కొట్లాటను చూసి జనం నవ్వుకుంటున్నారు. -
టీడీపీలో తమ్ముళ్ల కుమ్ములాట
సాక్షి, పార్వతిపురం మన్యం: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య వర్గ విభేదాలు బహిర్గతమవుతున్నాయి. తాజాగా సాలూరు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు కుమ్ములాటకు దిగారు. ఫ్లెక్సీలు చించుకోవటంతో టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సాలూరు టౌన్లో సాలూరు మండలం మామిడిపల్లి గ్రామం ఇందుకు వేదికైంది. స్థానిక శంబర జాతరకు సందర్భంగా టీడీపీ నేత తేజోవతి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే వాటిని తెలుగుదేశంలోని కొందరు నేతలు చించేయడంతోపాటు మరోనేత సంధ్యారాణి ఫ్లెక్సీలు అతికించారు. దీంతో మామిడిపల్లి గ్రామం మీదుగా వెళ్లే ప్రజలు ఆ ఫ్లెక్సీలను చూసి టీడీపీ రోజురోజుకు దిగజారిపోయిందని అనుకుంటున్నారు. టీడీపీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు ఫోటోలను ఒకరి వర్గం ఒకరు చించుకున్నారు. వాటి స్థానంలో తమ నాయకురాలు ఫొటో పెట్టిన నేపథ్యంలో టీడీపీలో వర్గ విభేదాలపై ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. దీనిపై స్థానికంగా పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. చదవండి: AP: ESMSపై కొనసాగుతున్న శిక్షణ కార్యక్రమం -
సీనియర్లకు టీడీపీ అధినేత ఝలక్
అవసరానికి వాడుకోవడం.. అవసరం తీరాక మోహంచాటేయడం.. మాట విననివారికి వెన్నుపోటు పొడవడం వంటివి చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య!. ఓటర్లు, నాయకులు, సొంత బంధువులపైనా ఆయనది అదే ధోరణి!. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార దాహంతో రగిలిపోతున్నారు. దీనికోసం పార్టీకి దశాబ్దాల తరబడి సేవలందించిన సీనియర్ నాయకులను కాదని డబ్బున్నోళ్లకే సీట్లు కేటాయించేందుకు రెడీ అవుతుండడంతో ఆ పార్టీ వర్గాల్లో కలకలం రేగుతోంది. చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును కొన్ని వర్గాలవారు బహిరంగంగానే విమర్శిస్తుండగా, మరికొందరు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: వారంతా ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన వారు కాదు... సుదీర్ఘ కాలంగా తెలుగుదేశంపార్టీలో విశేషమైన సేవలు అందించినవారు... అందులోనూ ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రధాన సామాజిక వర్గానికి చెందిన నాయకులు కూడా! టీడీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా సరే ఆ పార్టీను, అధినేత చంద్రబాబును నమ్ముకునే ఇన్నాళ్లూ ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర వైఫల్యం చెందినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబును ప్రజలు ఛీదరించుకున్నప్పటికీ ఆయన వెన్నంటే ఉంటూ నియోజకవర్గంలో టీడీపీ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వచ్చారు. తీరా 2014 ఎన్ని కలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నో దశాబ్దాలుగా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వారి కష్టాన్ని గుర్తించకుండా వారి దగ్గర డబ్బు సంచులు లేవనే నెపంతో ఇప్పుడు వారిని పక్కనపెట్టేసి కోట్లకు పడగలెత్తిన ప్రవాస భారతీయులను, పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి టిక్కెట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. దీంతో చంద్రబాబు నాయకులు ఎవరైనా సరే అవసరానికి వాడుకొని కరివేపాకులా పక్కనపడేస్తారన్న చర్చ ఆ పార్టీ వర్గాల్లోనే జోరుగా సాగుతోంది. బీసీ జపం చేసే చంద్రబాబు ఆచరణలోకి వచ్చేసరికి గెలుపుగుర్రాల పేరుతో ధనబలం ఉన్న వారివైపే మొగ్గు చూపిస్తున్నారని జిల్లాలో బలమైన సామాజిక వర్గాలకు చెందిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీరి నాయకత్వానికి తిలోదకాలు! ప్రస్తుతం ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ఎస్.కోట, నెల్లిమర్ల, పార్వతీపురం నియోజకవర్గాల్లో టీడీపీ పేరు చెబితే ఠక్కున గుర్తొచ్చే నాయకులు కోళ్ల అప్పలనాయుడి కోడలు కోళ్ల లలితకుమారి, పతివాడ నారాయణస్వామినాయుడు, బొబ్బిలి చిరంజీవులు. ఈ ముగ్గురు నాయకులు టీడీపీలో సుదీర్ఘ కాలంగా సేవలు అందిస్తున్నావారే. కానీ ప్రస్తుతం వారి ముగ్గురి పరిస్థితి త్రిశంకుస్వర్గంలా మారింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ టిక్కెట్ దక్కే అవకాశాలు దాదాపుగా లేవనే చర్చలు సాగుతున్నాయి. ఆ ముగ్గురు సీనియర్ నాయకులు జిల్లాలోని ప్రధాన సామాజిక వర్గాలైన కొప్పలవెలమ, తూర్పుకాపు, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందినవారే కావడం గమనార్హం. 45 ఏళ్ల సీనియార్టీకి చిక్కులు ఎస్.కోట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి కుటుంబానికి 45 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది. ఆమె మామ కోళ్ల అప్పలనాయులు ఏడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అందులో ఆరు సార్లు టీడీపీ నుంచే కావడం గమనార్హం. ఒకసారి మాత్రమే స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఆయన రాజకీయ వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన కోడలు లలిత కుమారి రెండుసార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. గత ఐదేళ్లూ ప్రతిపక్షంలో సైతం టీడీపీ అండగా ఉన్నారు. అయితే, ఆమె దగ్గర ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి రూ.కోట్లలో డబ్బులు లేవని, ఉన్నా ఖర్చు చేయరనే ఒకేఒక్క సందేహంతో చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో ఆమెను పక్కనపెట్టేస్తున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవలే రాజకీయ తెరంగేట్రం చేసిన ప్రవాస భారతీయుడు గొంప కృష్ణకు చంద్రబాబు ప్రాధాన్యం ఇవ్వడం అందుకు ఊతమిస్తోంది. వేపాడ మండలానికి చెందిన ఆయనకు రాజకీయ నేపథ్యం లేకున్నా డబ్బులు బాగానే ఉన్నాయని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. పార్టీలో తనకు జరిగిన అవమానంపై లలితకుమారి కొన్నాళ్లుగా అగ్గి మీద గుగ్గిలం మాదిరిగా రగిలిపోయినా చంద్రబాబు ఏమి మంత్రం వేశారో కానీ తర్వాత చల్లబడిపోయారు. లోకేశ్‌తో డీల్... చిరంజీవులుకు ఎసరు! పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ టిక్కెట్ బోనెల విజయచంద్రకేనని చంద్రబాబు విస్పష్టంగా చెప్పేశారు. ప్రవాస భారతీయుడైన ఆయనకు ఏమాత్రం రాజకీయ అనుభవం లేకపోయినా కేవలం ధనబలం ఉందన్న కారణంతోనే టిక్కెట్ ఇస్తున్నారనే విమర్శలు ఆ పార్టీలోనే వస్తున్నాయి. నేరుగా నారా లోకేశ్‌తో డీల్ కుదుర్చుకొని వచ్చి ఇంతవరకు ఆ పార్టీ బాధ్యతలు చూసుకున్న మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు టిక్కెట్‌కు ఎసరు పెట్టారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పతివాడకు తీవ్ర పరాభవం... నెల్లిమర్ల నియోజకవర్గంలో టీడీపీ వింత ఆచారానికి తెరతీసింది. నలభై సంవత్సరాలుగా టీడీపీలో ఎనలేని సేవలు అందిస్తూ ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపొందిన పతివాడ నారాయణస్వామినాయుడిది ఒక రికార్డు. ప్రోటెం స్పీకర్‌గా, చక్కెర, వాణిజ్యశాఖా మంత్రిగా కూడా పనిచేశారు. కానీ ఇప్పుడు ఆ పార్టీ అధిష్టానం ఆయనను, ఆయన వారసులను కనీసం పట్టించుకోవడం లేదు. వారిని పక్కనబెట్టి తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన కర్రోతు బంగార్రాజును ఏడాది కిందట టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా చంద్రబాబు నియమించారు. కానీ ఇప్పుడు టీడీపీ–జనసేన పొత్తులో భాగంగా నెల్లిమర్ల టీడీపీ టిక్కెట్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన లోకం మాధవికి కేటాయించడానికి తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో బంగార్రాజు వర్గం కంగుతింది. విజయనగరానికి చెందిన ఆమె, ఆమె భర్త మిరాకిల్ ఇంజినీరింగ్ కాలేజీ, మిరాకిల్ సాఫ్ట్వేర్ కంపెనీలకు అధిపతులు. కోట్లాది రూపాయల సంపద ఉన్న వారి ముందు పతివాడ 40 ఏళ్ల అనుభవం, కర్రోతు బంగార్రాజు సామాజిక బలం చంద్రబాబుకు కనిపించకుండాపోయాయనే చర్చ సాగుతోంది. ఎక్కువ కాలం విదేశాల్లోనే ఉన్న మాధవి జనసేన పార్టీ తరఫున నెల్లిమర్ల టిక్కెట్ తనకే వస్తుందన్న ధీమాలో ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరోవైపు గంటా శ్రీనివాసరావు పేరు కూడా తెరపైకి వచ్చింది. ఐదేళ్లకోసారి నియోజకవర్గం మార్చేసే ఆయన ఈసారి నెల్లిమర్ల నుంచి టీడీపీ టిక్కెట్‌తో బరిలోకి దిగుతారనే వాదనలు వినిపిస్తున్నాయి. ధన బలం ఉన్న లోకం మాధవి, గంటా శ్రీనివాసరావుల పేరు తప్ప పతివాడ కుటుంబం పేరు ఎక్కడా టీడీపీ–జనసేనలో వినిపించలేదు. కనిపించట్లేదు! -
నెల్లిమర్ల టీడీపీలో అంతర్గత కుమ్ములాట
పూసపాటిరేగ: నెల్లిమర్ల నియోజకవర్గం టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. సంక్రాంతి వేళ డెంకాడ మండలంలోని సేరిపొలంటీడీపీ నేత వెంపడాపు సూర్యనారాయణ కుమారుడు రమేష్‌నాయుడు పేరిట ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటయ్యాయి. ఫ్లెక్సీలో పూసపాటిరేగ మండలానికి చెందిన టీడీపీ నేతల ఫొటోలు అనుమతి లేకుండా వేయడంతో మండల టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పూసపాటిరేగ మండలం, చల్లవానితోటలో మాజీ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి ఇంటి వద్ద ఆదివారం ఉదయం జరిగిన ఓ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఎం.చిన్నంనాయుడు, ఎం.శంకరరావు, పి.సన్యాసినాయుడు, విక్రం జగన్నాథం తదితర టీడీపీ నేతలు ఫ్లెక్సీల ఏర్పాటుపై అసహనం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని సన్యాసినాయుడు అన్నారు. పార్టీ కార్యక్రమాల్లో వెంపడాపు రమేష్‌నాయుడును ఎప్పుడూ చూడలేదని, దొడ్డిదారిన రాజకీయాలు చేయడమేంటని అన్నారు. ఫ్లెక్సీల ఏర్పాటు వెనుక టీడీపీలో కీలకనేతలు ఎవరైనా ఉన్నారనే చర్చ జోరుగా జరుగుతోంది. ఏది ఏమైనా నియోజకవర్గ టీడీపీలో రెండు గ్రూపుల మధ్య ఎంతోకాలంగా ఉన్న విబేధాలు ఫ్లెక్సీ ఏర్పాటుతో చెలరేగిన గొడవలో బహిర్గతమయ్యాయని అంతా అనుకుంటున్నారు. -
బొబ్బిలి సీటు బీసీలకు ఇచ్చే దమ్ముందా?
రామభద్రపురం: బీసీ సామాజికవర్గం తన ఆత్మీయులని ప్రేమ ఒలకబోస్తున్న చంద్రబాబు నాయుడికి బొబ్బిలి ఎమ్మెల్యే సీటును బీసీలకు కేటాయించే దమ్ము, ధైర్యం ఉందా? అని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు ప్రశ్నించారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ స్థానిక కార్యాలయంలో ఎంపీపీ చొక్కాపు లక్ష్మణరావుతో కలిసి బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీల మీద అంతప్రేమ ఉన్న వ్యక్తి బొబ్బిలిలో రాజులకెందుకు పెత్తనం అప్పగిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయని చంద్రబాబు అధికారంలోకి వస్తే రైతులు, మహిళలకు ఏదేదో చేస్తానని వాగ్దానాలు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 40 ఏళ్లు రాజకీయ అనుభవం, పధ్నాలుగేళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు దిగజారుడుతనంతో మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. వైఎస్సార్సీపీ ఓట్లతో గెలిచి, టీడీపీలోకి వచ్చి మంత్రి పదవి పొంది నియోజకవర్గంలో అభివృద్ధి చేయకుండా అవినీతి, కబ్జాలకు పాల్పడిన వారిని పక్కనే పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మత్రులు, ఎమ్మెల్యేలపై చంద్రబాబు నోరుపారేసుకోవడం విచారకరమన్నారు. పేదల పక్షాన జగన్ తెలుగుదేశం, దాని తోక పార్టీలు ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎన్ని ఆరోపణలు చేసినా వైఎస్సార్సీపీ ప్రభంజనాన్ని అడ్డుకోలేరని, అది బొబ్బిలితోనే ఆరంభమవుతుందన్నారు. రాష్ట్రంలో పెత్తందారులు, పేదల మధ్య జరుగుతున్న యుద్ధంలో పేదల పక్షాన నిలిచిన సీఎం వైస్ జగన్మోహన్రెడ్డిని మరోసారి ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ చొక్కాపు లక్ష్మణరావు, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు అప్పికొండ లక్ష్మునాయుడు, మండల జేసీఎస్ కన్వీనర్ సింహాచలం నాయుడు, వైస్ ఎంపీపీ బెల్లాన ప్రసాద్, మండల యూత్ ప్రెసిడెంట్ పత్తిగుళ్ల ఏక్నాథ్, మండల ఉపాధ్యక్షుడు డర్రు పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. -
తెలుగువాళ్లు నా వల్లే బాగుపడ్డారు
సాక్షి ప్రతినిధి, విజయనగరం/సాక్షి ప్రతినిధి, కాకినాడ/తుని: తెలుగువాళ్లు తన వల్లే బాగుపడ్డారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చెప్పుకొన్నారు. టెక్నాలజీకి ప్రాముఖ్యత కల్పించి ముందుగా తాను తీసుకున్న నిర్ణయం వల్లే ప్రపంచమంతా తెలుగువారు రాణిస్తున్నారని అన్నారు. తాను ఆరోజు కష్టపడితేనే ఈరోజు ప్రజలు అనుభవిస్తున్నారన్నారు. ఈరోజు హైదరాబాద్‌పై తన ప్రగాఢ ముద్ర కనపడుతోందని అన్నారు. రా కదలి రా పేరుతో బుధవారం విజయనగరం జిల్లా బొబ్బిలి, కాకినాడ జిల్లా తునిలో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. అబద్ధాలు, ప్రగల్భాలు పలుకుతూ ప్రజలను అడిగి మరీ చప్పట్లు కొట్టించుకున్నారు. ఇటీవల తనకు కష్టం వస్తే ఎనభై తొంభై దేశాల్లో సంఘీభావం ప్రకటించారని, అదీ తన సత్తా అని చెప్పారు. ఐదేళ్లుగా మన రాష్ట్రం వెనుకబడిపోయిందని, తామొస్తే ప్రజల భవిష్యత్తు బంగారం చేస్తానని అన్నారు. యువతకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, కరెంటు చార్జీలు తగ్గిస్తాం అంటూ పలు హామీలు గుప్పించారు. తాను చంద్రన్న బీమా, పెళ్లి కానుక, విదేశీ విద్య ఇచ్చానని చెప్పుకొచ్చారు. ఇప్పుడున్నది రద్దుల ప్రభుత్వమని, పేదవాడి వ్యతిరేక ప్రభుత్వమని ఆరోపించారు. నోటికొచ్చినట్లు... ‘పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ ఫొటో పెడతారా? ఆయనో ఏసుప్రభువు. ఎక్కడకు పోతున్నారు? ఆయన పంపించారా ఏసు ప్రభువని? సర్వే రాళ్లపై ఆయన ఫొటో ఏంటి? భూ రక్షణ కాదు. భూ భక్షణ చట్టం. ఇది అమలయితే మీ ఇల్లు మీది కాదు. మీ భూమి మీది కాదు. కబ్జా అయితే నేరుగా హైకోర్టుకు పోవాలి. మీ రికార్డులు తారుమారు చేస్తున్నాడు జగన్. దీనికి మద్దతు ఇవ్వం’ అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. బొత్సపై నోరు పారేసుకున్న బాబు ‘ఉత్తరాంధ్రలో బొత్స ఉన్నాడు. మనిషి లావు. ఆయనేం చెబుతాడో మనకు అర్థం కాదు. విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి వచ్చారు. బొత్స మాట్లాడడు. పెత్తందార్లకు పెత్తనం’ అంటూ దుర్భాషలాడారు. దేశంలో ధనిక ముఖ్యమంత్రుల్లో నంబర్ వన్ పెత్తందారు జగన్ అన్నారు. తునిలో మంత్రి రాజా చెక్ పోస్టులలో వసూళ్లు. మామూళ్ల దెబ్బకు జనం పారిపోతున్నారన్నారు. బియ్యం మాఫియాకు కర్త, కర్మ, క్రియ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడినే అని ఆరోపించారు. కార్యకర్తలపైనే చులకన మాటలు ఈ సభల్లో కార్యకర్తలపైనే చంద్రబాబు చులకనగా మాట్లాడారు. ‘మా తమ్ముళ్లు మందు బాబులు. సాయంత్రం క్వార్టర్ వేసుకుని నిద్రపోదామనుకుంటారు. మీ బలహీనత ముఖ్యమంత్రికి అర్థమైపోయింది. అందుకే బాదుడే బాదుడు. 50 రూపాయల బాటిల్ ఇప్పుడు రూ.200కు అమ్ముతున్నారు. మద్యం ధరలు పెంచి కాపురాల్లో చిచ్చు పెడుతున్నారు’ అంటూ ఆరోపించారు. ‘టీడీపీ, జనసేన జెండాలు పట్టుకుని ఇంటింటికీ వెళ్లండి. గ్లాసు కూడా తీసుకెళ్లండి. నీళ్లు తాగడానికి పనికొస్తుంది’ అని వ్యాఖ్యానించారు. పోతాం.. మేమెళ్లిపోతాం.. ‘రా కదిలి రా’ అంటూ టీడీపీ నిర్వహించిన ఈ సభలకు టీడీపీ నేతలు రూ.300ల నుంచి రూ.500 నగదు, క్వార్టర్ మందు, పలావు ప్యాకెట్ ఇచ్చి జనాన్ని అయితే తీసుకు వచ్చారు కానీ, చంద్రబాబు ప్రసంగం అయ్యే వరకు వారిని ఆపలేకపోయారు. పార్టీ కేడర్ ఎంత ప్రయత్నించినా జనం వెళ్లిపోయారు. చంద్రబాబు ప్రసంగం మొదలైన కొద్ది సేపటికే సగం కుర్చీలు ఖాళీ అయిపోయాయి. ముఖ్యంగా మహిళలు మూకుమ్మడిగా లేచి వెళ్లిపోవడంతో పార్టీ కేడర్ చేతులెత్తేసింది. కుర్చీలు ఖాళీ అయిపోయినా, చంద్రబాబు మాత్రం ఎక్కడా ఆపకుండా రెండు సభల్లోనూ గంటకు పైగా ఏకబిగిన ప్రసంగించారు. బొబ్బిలి సభకు పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు, మాజీ ఎమ్మెల్యే మీసాల గీత గైర్హాజరయ్యారు. -
చైతన్యం వెల్లివిరిసిన నెల్లిమర్ల
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లా నెల్లిమర్లలో సామాజిక చైతన్యం వెల్లివిరిసింది. సీఎం వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలను సాధికారత దిశగా నడిపించిన వైనాన్ని వివరిస్తూ బడుగు, బలహీన వర్గాల ప్రజలు నియోజకవర్గంలో భారీ సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు సీఎం వైఎస్ జగన్ తమకు చేసిన మేలును వివరించారు. యువత బైక్‌లతో ర్యాలీ చేశారు. నెల్లిమర్ల డైట్ కాలేజీ మీదుగా కొండవెలగాడ, జర్జాపుపేట వరకూ యాత్ర సాగింది. కొండవెలగాడలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను ప్రజాప్రతినిధులు సందర్శించారు. సాయంత్రం 4 గంటలకు నెల్లిమర్ల మొయిదా జంక్షన్ వద్ద భారీ బహిరంగ సభ జరిగింది. వేలాదిగా తరలివచ్చిన ప్రజలతో సభా ప్రాంగణం జనసంద్రాన్ని తలపించింది. జై జగన్ – జైజై జగన్, జగనే కావాలి – జగనే రావాలి నినాదాలు సభలో హోరెత్తాయి. పేదల పెన్నిధి సీఎం జగన్ : ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర సీఎం వైఎస్ జగన్ పేదల పెన్నిధి అని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర చెప్పారు. చంద్రబాబు సీఎంగా ఉండగా గిరిజనులు, ముస్లింలకు ఒక్క మంత్రి పదవీ ఇవ్వలేదన్నారు. సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్ని రంగాల్లో అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. మంత్రి పదవుల నుంచి నామినేటెడ్ పదవుల వరకు అన్నింటా పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు. గిరిజనుడైన తాను ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నానంటే జగన్ వల్లే నని అన్నారు. 2014 ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం ఇలా 600 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అందర్నీ మోసం చేశారన్నారు. వ్యవస్థల్లో సమూల మార్పులు: మంత్రి ధర్మాన ప్రసాదరావు మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వ్యవస్థల్లో సమూల మార్పులు తెచ్చారని తెలిపారు. పేదల కోసం విద్య, వైద్య రంగాలను సమూలంగా ప్రక్షాళన చేసి, అధునాతనంగా తీర్చిదిద్దారని అన్నారు. ఇప్పుడు ప్రతి పేద కుటుంబం మంచి విద్యను, మంచి వైద్యాన్ని పైసా ఖర్చు లేకుండా అందుకుంటున్నాయని తెలిపారు. విభజన తర్వాత పదేళ్ల వరకూ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ వదిలేసి వచ్చిన చంద్రబాబు కొత్త రాజధానిని రాజ్యాంగం, చట్టం ప్రకారం గాకుండా వ్యాపారంగా మార్చేశారన్నారు. రాష్ట్రంలో పెద్ద పట్టణం, అన్ని హంగులూ ఉన్న విశాఖని కాదని, తన అనుయాయులతో భూములు కొనిపించిన ప్రాంతంలో అర్ధరాత్రి రాజధానిని ప్రకటించిన పాపం చంద్రబాబుదేనన్నారు. సీఎం జగన్‌ది సుపరిపాలన: మంత్రి సీదిరి అప్పలరాజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్ని వర్గాలకూ సంక్షేమాన్ని అందిస్తూ సుపరిపాలన చేస్తున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలను అక్కున చేర్చుకొని, సాధికారత దిశగా నడిపించారని తెలిపారు. ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను అవమానించిన చంద్రబాబును అందరూ సమష్టిగా మరోసారి ఓడించాలని పిలుపునిచ్చారు. భోగాపురంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి: మంత్రి అమర్నాథ్ నెల్లిమర్ల నియోజకవర్గంలో సీఎం జగన్ ఇటీవల భూమిపూజ చేసిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం వేగంగా జరుగుతోందని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. రూ.4,750 కోట్లతో నిర్మిస్తున్న ఈ విమానాశ్రయంతో 50 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. సారిపల్లి ఇండ ్రస్టియల్ పార్కు అప్‌గ్రేడ్ పనులకు సీఎం త్వరలో శంకుస్థాపన చేయబోతున్నారని తెలిపారు. నెల్లిమర్లలో రూ.1172 కోట్ల సంక్షేమం: ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు నెల్లిమర్ల నియోజకవర్గంలో నాలుగున్నరేళ్లలో రూ.1,172 కోట్లు సంక్షేమ కార్యక్రమాల కోసం సీఎం వైఎస్ జగన్ వెచ్చించారని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు చెప్పారు. రామతీర్థంలో విధ్వంసాన్ని టీడీపీ రాజకీయం చేస్తే, సీఎం జగన్ మాత్రం రూ.4.5 కోట్లతో ఆలయాన్ని పునర్నిర్మించారని తెలిపారు. వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్‌బాబు, ఎమ్మెల్యేలు శంబంగి అప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, కంబాల జోగులు, కడుబండి శ్రీనివాసరావు, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ శోభా స్వాతిరాణి, నవరత్నాల వైస్ చైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి పాల్గొన్నారు. -
గెలిచేది వైఎస్సార్సీపీ జెండా.. నిలిచేది జగన్ అజెండా
సాక్షి విజయనగరం: జిల్లా బొబ్బిలి గడ్డపై వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర గర్జించింది. అశేష జనవాహిని స్వాగత నినాదాల మద్య వైఎస్సార్ సీపీ సామాజిక సాదికార బస్సు యాత్ర బొబ్బిలిలో అడుగుపెట్టింది. ఈ సందర్బంగా స్థానికులు అపూర్వ స్వాగతం పలికారు. బొబ్బిలి నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులతో వైఎస్ఆర్ సీపీ నేతలు, ప్రజా ప్రతినిదులుముచ్చటించారు. అనంతరం బొబ్బిలి జంక్షన్ వద్ద జరిగిన బహిరంగ సభకు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు శంబంగి చిన అప్పలనాయుడు, పుష్పశ్రీ వాణి, బొత్స అప్పలనర్సయ్య తదితరులు హాజరయ్యారు. రుణాల మాపీపై బాబు పంగనామాలు పెట్టాడు, జగన్ టీడీపీ వదిలిన అప్పులు తీర్చారు - డిప్యూటీ సీఎం బూడి ఈ సందర్బంగా జరిగిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని గత పాలకులు ఎంతలా విస్మరించారో, యువనేత జగన్ సీఎం అయ్యాక ఎలా ప్రజల కలలను సాకారం చేసారో ప్రజలు గమనిoచాలన్నారు. బొబ్బిలి కేంద్రంగా రెవిన్యూ డివిజన్ ఏర్పాటు విషయంలో చంద్రబాబు హామీ ఇచ్చి మోసం చేస్తే, జగన్ అధికారంలోకి రాగానే ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చారని వివరించారు. ఎస్టీ మహిళ అయిన పుష్ప శ్రీవాణి, ఎస్టీ నేత అయిన పీడిక రాజన్నదొర, బీసీ వర్గానికి చెందిన తాను ఉప ముఖ్యమంత్రులుగా ముఖ్యమంత్రి జగన్ పక్కన కూర్చొని పాలన సాగించడమే సామాజిక సాధికారతకు నిదర్శనమన్నారు. 25 మంది కేబినెట్ మంత్రులు ఉండగా, వారిలో 17 మంది బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ వర్గాలకే కేటాయించారని గుర్తు చేసారు. గడిచిన ఎన్నికలలో ఎవరు ఏ పార్టీకి ఓటు వేసారనే లెక్క లేకుండా అర్హులైన వారందరికీ లబ్ధి చేకూర్చిన ముఖ్యమంత్రి దేశంలో జగన్ ఒక్కరేనన్నారు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ విషయంలో చంద్రబాబు పంగనామాలు పెట్టి మోసం చేస్తే, జగన్ సీఎం కాగానే బాబు ఎగ్గొట్టిన అప్పులన్నీ తీరుస్తున్నారన్నారు. వచ్చే జనవరి నుంచి అవ్వా తాతలకు పింఛన్ రూ. 3 వేలు చేయబోతున్నారని, ఎప్పుడూ రెండు వేళ్లు చూపే టీడీపీ నేతలకు పండగ నుంచి మూడు వేలు తీసుకుని వారికి మూడు వేళ్లు చూపాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ స్థాయి సంపన్నుల పిల్లలు ఎలా చదువుకుంటారో, పేదల పిల్లలు కూడా అలానే అభ్యసించాలని ప్రభుత్వ స్కూల్స్ ను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మార్చారని వివరించారు. పేద విద్యార్థుల ఉజ్వల భవిత కోసం జగన్ ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడితే అనేక అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసారని, బొబ్బిలి రాజుల పిల్లలే ఆంగ్లంలో చదువుకోవాలా, ఎస్సీ, బీసీ, ఎస్టీ పిల్లలు చదువుకోకూడదా అని జగన్ నాడు - నాడు ద్వారా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారన్నారు. 2024 ఎన్నికల్లో బొబ్బిలిలో శంబంగి చిన అప్పల నాయుడును, రాష్ట్రంలో జగన్ ను మరోసారి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ముత్యాల నాయుడు ఉద్గాటించారు. జగన్ ఆశీస్సులతో 11,500 ఎకరాలకు సాగునీరిచ్చాం. బొబ్బిలి రాజులు సొంత ఆస్తులు పెంచుకున్నారు - ఎమ్మెల్యే శంబంగి బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడు మాట్లాడుతూ, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనూ, ఇప్పుడు వైఎస్ జగన్ సారథ్యంలో బొబ్బిలి నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో రైతాంగానికి నాలుగున్నరేళ్లలో 11,500 ఎకరాలకు కొత్తగా సాగు నీరు అందించామని, మరో 4,500 ఎకరాలను అందించాల్సిన అవసరం ఉందన్నారు. అవినీతి లేని పాలనను దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అందిస్తున్నారని వివరించారు. మాట తప్పని, మడమ తిప్పని ఖ్యాతి జాతీయ స్థాయిలో జగన్ కు మాత్రమే ఉందని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 606 హామీలిచ్చి కనీసం ఆరు హామీలు కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. అర్హతలే ప్రతిపాదికగా తీసుకుని సంక్షేమ పథకాలు లబ్ధి చేకూరుస్తున్నారని, కుల, మతాలకు, రాజకీయాలకు తావు లేకుండా అమలు చేస్తున్నారని వెల్లడించారు. బొబ్బిలి రాజులను నమ్ముకుంటే సొంత డబ్బుతోనైనా ఆదుకుంటారని ప్రచారం చేసుకుంటే, ప్రజల నమ్మి గెలిపిస్తే సొంత ఆస్తులే పెంచుకుని ఓటర్లను వంచించారని విమర్శించారు. గెలిచేది వైఎస్సార్ సీపీ జెండా... నిలిచేది జగన్ అజెండా - కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీ వాణి మాట్లాడుతూ, బొబ్బిలి అడ్డా.. జగన్ అన్న అడ్డాగా నిలిపి బొబ్బిలి కోటపై వైఎస్సార్ సీపీ జెండా ఎగుర వేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ఎప్పుడూ గెలిచేది వైెఎస్సార్ సీపీ జెండానే అని, ఎన్నడూ నిలిచేది జగన్ అజెండానే అని అభివర్ణించారు. జగన్ ను విమర్శించే టీడీపీ నాయకులకు తాను సవాల్ చేస్తున్నానని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అత్యథికంగా మేలు చేసినట్లు చెప్పే ధైర్యం తమకు ఉందని, అలా చెప్పే దమ్ము తెలుగు తమ్ముళ్లకు ఉందా అని సవాల్ విసిరారు. జగన్ ప్రభుత్వంలో మేలు జరిగిందో, చంద్రబాబు ప్రభుత్వంలో మేలు జరిగిందో తేల్చుకుందాం రావాలని సవాల్ విసిరారు. ఇది దళితుల, ఎస్టీల, బీసీల ప్రభుత్వమని, పేదల కోసం పాటుపడుతోందని వివరించారు. ఓట్ల కోసం ఇంటికి వచ్చే టీడీపీ నేతలను గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేసారో, ఎన్ని హామీలు నెరవేర్చారో చెప్పాలని నిలదీయాలని పిలుపునిచ్చారు. చెరకు రైతులను టీడీపీ మోసం చేస్తే, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ. 35 కోట్లు యాజమాన్యం నుంచి వసూలు చేసి చెల్లించింది - జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, బొబ్బిలిలో సామాజిక సాధికార యాత్రకు వచ్చిన ప్రజానీకాన్ని చస్తుంటే జన సునామీని తలపిస్తోందన్నారు. ఈ ప్రాంతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయకుండా మోసం చేసి ఇప్పుడు మళ్లీ ఓట్లు కోసం వస్తున్నారని, వారిని చెప్పే మాయ మాటలను నమ్మవద్దని హితవు పలికారు. చెరకు రైతులను షుగర్ ఫ్యాక్టరీ నిలువునా ముంచేసి మోసం చేస్తే వైెఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రూ. 35 కోట్లు యాజమాన్యం నుంచి ముక్కుపిండి వసూలు చేసి రైతులకు అందించామన్నారు. విజయనగరం జిల్లాతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాల రూపు రేఖలు మారుస్తున్న ఘనత జగన్ దేనని కొనియాడారు. వెనుకబడిన వర్గాలన్నీ జగన్ సారథ్యంలో అథికారం అనుభవిస్తున్నామని, టీడీపీ అధికారంలోకి వస్తే మళ్లీ పనుల కోసం బొబ్బిలి రాజుల గేటు వద్ద కాపలా కాయాలని వివరించారు. తోటపల్లి, మడ్డువలస వంటి ప్రాజెక్టులను తీసుకువచ్చి రైతులను ఆదుకున్నామని, చెరకు రైతుల సమస్యలను పరిష్కరించి వారికి కూడా అండగా ఉంటామన్నారు. విద్య,వైద్యం, వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు జగన్ కే సాధ్యం - ఎంపీ బెల్లాన విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి పేదలకు చేరువ చేస్తున్నారన్నారు. సంక్షేమం ఓ వైపు, అభివృద్ధి మరోవైపున చేస్తూ జగన్ జనరంజక పాలన చేస్తున్నారన్నారు. సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చి పాలనను ప్రజల చెంతకు తీసుకువచ్చి గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసిన ఏకైక నేత ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు. -
సంబరంలా పార్వతీపురం సాధికార యాత్ర
సాక్షి ప్రతినిధి, విజయనగరం/ పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగిన సామాజిక సాధికార యాత్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సాధించిన సాధికారతకు సూచికగా ఓ సంబరంలా సాగింది. జిల్లాలోని సీతానగరం మండలం లచ్చయ్యపేటలో ఆరంభమైన బస్సు యాత్ర పార్వతీపురం పట్టణంలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రవేశించింది. మోటారు బైకు ర్యాలీతో వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు యాత్రలో పాల్గొన్నారు. మహిళల కోలాటం, తప్పిటగుళ్ల కళాకారుల ప్రదర్శనలు, తీన్మార్ వాయిద్యాల నడుమ యాత్ర ముందుకు సాగింది. జై జగన్ నినాదాలతో పార్వతీపురం పట్టణం హోరెత్తింది. పార్వతీపురం బస్టాండ్ వద్ద జరిగిన సభలో రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలు వంగపండు ఉష ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటాపాట అందరినీ అలరించింది. సభకు తరలివచ్చిన జనంతో పార్వతీపురం పట్టణంలోని అంతర్రాష్ట్ర రహదారి కిక్కిరిసిపోయింది. ఎమ్మెల్యే అలజంగి జోగారావు అధ్యక్షతన జరిగిన సభలో పలువురు మంత్రులు, నేతలు ప్రసంగించారు. రాజ్యాంగం ఆశయాలు ఇన్నాళ్లకు సాకారమయ్యాయి: మంత్రి ధర్మాన భారత రాజ్యాంగ ఆశయాలను స్వాతంత్య్రం వచ్చి న ఇన్నాళ్లకు దేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ సాకారం చేశారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. సామాజిక సాధికార సభలో ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రకారం అర్హత ప్రాతిపదికన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్నారన్నారు. దీనివల్ల పేదవారు సైతం పిల్లలను ఉన్నత చదువులు చదివించుకోవడానికి, ఉచిత వైద్యం పొందడానికి, సొంత ఇంటిలో ఉండటానికి, స్వేచ్ఛగా జీవించడానికి అవకాశం లభించిందన్నారు. ధనిక వర్గాలకే పరిమితమైన ఆంగ్ల విద్యను అందరికీ అందిస్తున్న ఘనత సీఎం జగన్‌దేనని చెప్పారు. జగన్‌తోనే బడుగులకు మేలు: మంత్రి రాజన్నదొర రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు సీఎం జగన్‌తోనే మేలు జరిగిందని ఉప ముఖ్యమంత్రి, గిరిజన శాఖ మంత్రి పీడిక రాజన్నదొర చెప్పారు. ఎస్సీల కోసం టీడీపీ ప్రభుత్వం రూ.30 వేల కోట్లు ఖర్చు చేస్తే, సీఎం జగన్ రూ.61 వేల కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. పోడు, బంజరు భూములను గిరిజనులకు పంపిణీ చేసిన ఘనత జగన్‌దేనన్నారు. దశాబ్దాల సమస్యలు పరిష్కారం : ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఈ ప్రాంతంలో దశాబ్దాల కాలంనాటి సమస్యలను సీఎం జగన్ ప్రత్యక శ్రద్ధతో పరిష్కరిస్తున్నారని ఎమ్మెల్యే అలజంగి జోగారావు చెప్పారు. అరి్టకల్ 11, 17, 1 5(సి)ని పూర్తిగా అమలు చేస్తున్న ఘనత సీఎం జగన్‌దేనని అన్నారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, వైఎస్సార్సీపీ రిజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యేలు శంబంగి వెంకట చిన్నఅప్పలనాయుడు, కంబాల జోగులు, పుష్పశ్రీవాణి, విశ్వాసరాయి కళావతి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, పార్టీ విజయనగరం, పారీ్వతీపురం మన్యం జిల్లాల అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, నవరత్నాల కమిటీ ఉపాధ్యక్షుడు నారాయణమూర్తి పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీలో 300 మంది టీడీపీ కార్యకర్తల చేరిక
లక్కవరపుకోట/జామి/వేపాడ: విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం వేపాడ మండలానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు సుమారు 300 మంది వైఎస్సార్సీపీలో చేరారు. శనివారం సామాజిక సాధికార బస్సు యాత్ర జమ్మాదేవిపేటకు చేరుకున్న వేళ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు సమక్షంలో పార్టీలో చేరిన నాయకులకు రాష్ట్ర విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి బూడి ముత్యాలనాయుడు, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వై.వి.సుబ్బారెడ్డి, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో వేపాడ మండలం మాజీ ఎంపీపీ దొగ్గ శ్రీదేవి, కుమ్మపల్లి కోఆపరేటివ్ సొసైటీ మాజీ అధ్యక్షుడు దొగ్గ సూరిదేముడు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు దొగ్గ శ్రీనివాసరావు, కుమ్మపల్లి మాజీ సర్పంచ్ దొగ్గ లక్ష్మి తదితరులు ఉన్నారు. -
బొబ్బిలి టీడీపీ సీటు బీసీలకు ఇచ్చే దమ్ముందా!
టీడీపీ అధినేత చంద్రబాబుకు బీసీలపై నిజమైన ప్రేమ ఉంటే బొబ్బిలి టీడీపీ ఎమ్మెల్యే సీటు బీసీలకు ఇచ్చే దుమ్మందా అని గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య సవాల్ విసిరారు. టీడీపీ ఐదేళ్ల కాలంలో బీసీలకు ఎటువంటి న్యాయం చేయలేదన్నారు. వారి పాలనలో ప్రజల సొమ్మును తెలుగుదేశం నాయకులు దోచుకుని దాచుకున్నారని ఆరోపించారు. అభివృద్ధి అంటే టీడీపీ నాయకులకు తెలియదని ఎద్దేవా చేసారు. భూకబ్జా చేసానని ఆరోపణలు చేస్తున్న టీడీపీ నాయకులు వాటిని నిరూపించే దమ్ముందా అని చాలెంజ్ విసిరారు. 2001లో రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి అవినీతి లేని పాలన అందిస్తున్నానని తెలిపారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న దివంగత నేత వైఎస్సార్ చెప్పిన మాట ప్రకారం ఒదిగా ఉన్నానని తెలిపారు. – బొత్స అప్పలనరసయ్య, ఎమ్మెల్యే ● -
YSRCP Bus Yatra: ఇది కదా మాట నిలబెట్టుకోవడం అంటే..
సాక్షి, గజపతినగరం(విజయనగరం జిల్లా): సామాజిక న్యాయం అనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహరెడ్డి వల్లే సాధ్యమైందని వైఎస్సార్సీపీ నేతలు మరోసారి స్పష్టం చేశారు. సామాజిక సాధికారిత రెండోరోజు బస్సుయాత్రలో భాగంగా గజపతినగరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పలువురు వైఎస్సార్సీపీ నేతలు ప్రసంగించారు. ముందుగా గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య మాట్లాడుతూ.. ‘బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సముచిత స్థానం కల్పించింది సీఎం జగనే. సామాజిక న్యాయం సీఎం జగన్ వల్లే సాధ్యం. విశాఖ పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి ఎన్నో రకాల చర్యలు చేపట్టారు సీఎం జగన్. వెనుకబడిన ఉత్తరాంధ్రలో ట్రైబల్ యూనివర్శిటీని ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతోంది. కానీ చంద్రబాబు, ఎల్లో మీడియా ఏదో రకంగా విష ప్రచారం చేయడం దారుణం’ అని తెలిపారు. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ.. ‘నేను ఉన్నాను.. నేను విన్నాను అన్న నాయకుడు సీఎం జగన్. సీఎం జగన్ పాలనలో సామాజిక న్యాయం జరుగుతోంది. అన్ని కులాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించారు. అర్హులందరీకి అభివృద్ది, సంక్షేమ పలాలు అందిస్తున్నాం. కులం మతం తో సంబంధం లేకుండా మంత్రి పదవులు ఇచ్చారు. ప్రతి గ్రామం లో సచివాలయం ఏర్పాటు చేసి, నిరుద్యోగులను వాలంటర్ లు గా నియమించి ప్రభుత్వ సేవలు ఇస్తున్నాం. ప్రతి పేదవాడి మొహం లో చిరునవ్వు చూడాలని సామజిక న్యాయం చేస్తున్నాం’ అని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం రాజన్న దొర మాట్లాడుతూ.. ‘బీసీలకు, ఎస్సీలకు రాజ్యాధికారం ఇచ్చింది అంబేద్కర్, అంబేద్కర్ ఆశయాలను ఎవరూ అమలు చేయలేదు. జగన్ సీఎం అయ్యాక మనసు, మానవత్వంతో ఆలోచించి గిరిజనుడికి, దళితుడికి, బీసీలకు రాజ్యాధికారం అవకాశం ఇచ్చారు. కుల మతాలకు సంబంధం లేకుండా అవకాశాలు కల్పించింది వైఎస్సార్సీపీ. మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. ‘ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారం ఇచ్చింది సీఎం జగన్. బీసీలు తోక కత్తిరిస్తామని, మీ అంతుచూస్తామని చంద్రబాబు మాట్లాడారు. మరి బీసీలను అవహేళన చేసిన చంద్రబాబును నమ్ముతామా. ఎస్సీ కులం లో పుట్టాలని ఎవరు అనుకుంటారని చంద్రబాబు ఎస్సీ లను అవమానించారు. చంద్రబాబు మోసాలను జనం గమనించాలి. 2014 ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి పోటీ చేసి 650 హామీలు ఇచ్చారు. ప్రమాణస్వీకారం రోజు 5 సంతకాలు చేసి రైతు రుణ మాఫీ చేయలేదు. చంద్రబాబు హామీలు నెరవేర్చకుండా చేతులెత్తేశాడు. అందుకే చిత్తుగా ఓడిపోయాడు. మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ‘ ప్రజలు బ్యాంకుల్లో అప్పులు అయిపోయారు. నాకు ఓటు వేయండి అప్పులు తీర్చుతామని 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పాడు. అప్పులు తీర్చలేదు. మేం 5 ఏళ్ల క్రితం చంద్రబాబు మోసం చెప్పాం. అందుకే మీరు మాకు ఓటు వేశారు. మేం అధికారం లోకి వచ్చాక వారి బ్యాంకు ఖాతాల్లో మూడు విడుతలు డబ్బులు వేసి నాలుగో విడత వేయడానికి సిద్దం గా ఉన్నాం. ఇది కదా మాట నిలబెట్టుకోవడం. చంద్రబాబు పాలన లో రైతులు రుణాలు తీర్చలేకపోతే బ్యాంకులు అవమానించాయి. జగన్ పాలన లో సక్రమం గా రైతు బరోసా ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఎన్నికల్లో మోసం చేసిన వాడికి ఓటు వేయవద్దు. రాజకీయాల్లో తప్పు చేసిన వాడికి ఓటు వేస్తే 5 సంవత్సరాలు నష్టపోతాం. ఒక్కసారి జగన్‌కి ఓటు వేస్తే 30లక్షల మందికి ఇళ్లు ఇచ్చారు. ఇలాంటి వారికి ఓటు వేయాలి కదా. మా ప్రభుత్వం ఏనాడు మా పార్టీకి ఓటు వేయలేదని అడగలేదు. కానీ మేం అందరికి పథకాలు ఇచ్చాం. కరెంట్ బిల్ ఈ ఒక్క రాష్ట్రం లోనే పెరిగిందా. దేశం లో అన్ని రాష్ట్రాల్లో పెరిగింది. ప్రభుత్వం మీద విమర్శించడానికి ఏమీ లేక ధరల విషయంతో తికమక పెడుతున్నారు. అలాంటి వాళ్లని ఎదురు ప్రశ్నించండి. స్కూల్స్‌లో కార్పొరేట్ సదుపాయాలు కల్పించాం. పిల్లలకు సాక్స్ నుండి పుస్తకాలు, పౌష్టిక ఆహారం వరకు నాణ్యమైనవి ఇచ్చాం. పిల్లలకు ఓటు లేదని వాళ్లని వదిలేయలేదు. మంచి విద్యా అందిస్తున్నాం. ఈ వేళ చాలా మార్పులు వచ్చాయి. ఈ మార్పుకి కారణం ఎవరు. 3లక్షల 30 వేల కోట్ల పేద వాళ్లకి జగన్ అందించారు. పేదలకి నేరుగా డబ్బులు ఇచ్చారు. మధ్య దళారీ లు లేరు. అవనీతి లేని పాలన జరుగుతుంది. గ్రామ సచివాలయాలు వచ్చాయి. మండల కేంద్రంకి వెళ్లాల్సిన పని లేకుండా అన్ని పనులు సచివాలయంలోనే జరుగుతున్నాయి. మంచి నాయకుడు, మంచి ప్రభుత్వం ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది. స్కిల్ స్కాం కేసులో ప్రజల డబ్బు చంద్ర బాబు సొంతానికి వాడుకున్నాడని నిరూపణ అయింది. కేంద్ర సంస్థలు చెప్తే పోలీస్‌లు అరెస్ట్ చేశారు. దొంగతనం చేస్తే ప్రభుత్వం ఊరుకోదు. ప్రజా ధనం దోచుకుంటే శిక్ష తప్పదు’ అని అన్నారు. -
వెల్లివిరిసిన సామాజిక చైతన్యం
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలు.. రాష్ట్రంలో నేడు ఏ రంగంలో చూసినా వీరిదే అగ్రస్థానం. ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాధించిన సామాజిక న్యాయం. అదే ఇప్పుడు రాష్ట్రమంతటా చైతన్యాన్ని రగిలించింది. జగన్నినాదమై మార్మోగుతోంది. సామాజిక సాధికారతై వెలుగులీనుతోంది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన వైఎస్సార్సీపీ ‘సామాజిక సాధికార’ బస్సు యాత్ర ప్రజల్లోకి చొచ్చుకెళ్లింది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలో ఏకకాలంలో ప్రారంభమైన ఈ బస్సు యాత్ర రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన సామాజిక విప్లవాన్ని ప్రజల్లోకి విజయవంతంగా తీసుకెళ్తోంది. పార్టీకి చెందిన కోఆర్డినేటర్లు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతల ఆధ్వర్యంలో సాగుతున్న యాత్రకు ప్రజలు అడగడుగునా ఘన స్వాగతం పలుకుతున్నారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో తమకు పట్టం కట్టిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మద్దతుగా నిలవడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు ఏకమై కదలివచ్చారు. తమకు జరిగిన సామాజిక న్యాయాన్ని ప్రతిధ్వనించారు. రాష్ట్రంలో గత 53 నెలలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ చేస్తున్న సామాజిక న్యాయాన్ని.. 2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఆ వర్గాలకు చేసిన ద్రోహాన్ని వివరించి.. ఆ వర్గాలను ఏకం చేయడం ద్వారా 2024 ఎన్నికల్లో 175కు 175 స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రను చేపట్టింది. ఈ యాత్ర గురువారం ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, కోస్తాలో గుంటూరు జిల్లా తెనాలి, రాయలసీమలో అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గాల నుంచి ప్రారంభమైంది. ఇచ్ఛాపురంలో ఆ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త పిరియా సాయిరాజ్, తెనాలిలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, శింగనమలలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఈ యాత్రకు నేతృత్వం వహించారు. ఇచ్ఛాపురం, తెనాలి, శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రంలో బహిరంగ సభలు జరిగాయి. మూడు ప్రాంతాల్లో బస్సు యాత్ర, సభలకు ప్రజలు పోటెత్తారు. సీఎం వైఎస్ జగన్ చేసిన సామాజిక న్యాయానికి నీరాజనాలు పలికారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మేలును మంత్రులు, నేతలు వివరించారు. ఆ ప్రసంగాలను ప్రజలు ఆసక్తిగా విన్నారు. ప్రసంగాల్లో నేతలు సీఎం వైఎస్ జగన్ పేరు ఎత్తగానే.. ‘మా నమ్మకం నువ్వే జగన్’.. ‘జగనన్నే మా భవిష్యత్తు’.. ‘జగనే రావాలి – జగనే కావాలి’ అంటూ జనం ప్రతిస్పందించారు. సామాజిక సాధికార యాత్ర రెండో రోజు శుక్రవారం ఉత్తరాంధ్రలో గజపతినగరం, కోస్తాలో నరసాపురం, రాయలసీమలో తిరుపతిలో జరగనుంది. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం వద్ద సామాజిక సాధికార యాత్రకు స్వాగతం పలుకుతున్న జనసందోహానికి అభివాదం చేస్తున్న మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు వెల్లువలా అభిమానం శ్రీకాకుళంలో ప్రారంభమైన బస్సు యాత్రకు నరసన్నపేట నియోజకవర్గం మడపాం, కోట బొమ్మాళి వద్ద ఘన స్వాగతం లభించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు, మహళలు వెల్లువలా తరలివచ్చారు. మడపాం వద్ద బాణసంచాతో స్వాగతం పలికారు. యాత్రలో భాగంగా మంత్రుల బృందం కంచిలి మండలం బూరగాం సచివాలయాన్ని సందర్శించి, అక్కడి సిబ్బందితో మాట్లాడారు. స్థానికులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలు తెలుసుకున్నారు. మద్యపానం మానుకోవాలని హితవు పలికారు. పలాస టి.కె.ఆర్.కల్యాణ మండపంలో మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో మేధావుల సదస్సు నిర్వహించారు. ఇచ్ఛాపురంలో జరిగిన సభలో ప్రసంగించిన నేతలు జగన్ పేరు చెప్పిన ప్రతిసారీ ప్రజలు జయజయధ్వానాలు చేశారు. బడుగు జన కెరటం.. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో రూరల్ మండలం కొలకలూరులో ప్రారంభమైన బస్సు యాత్రకు, తెనాలిలో జరిగిన సభకు బడుగు జనులు కెరటంలా తరలివచ్చారు. సాయంత్రం 6.32 గంటలకు సభా ప్రాంగణానికి యాత్ర చేరగానే జనం జయజయధ్వానాలు చేశారు. అందరికీ అభివాదం చేస్తూ దళిత, ముస్లిం, బడుగు బలహీనవర్గాల ప్రజాప్రతినిధులు వేదికపైకి చేరుకున్నారు. సభకు ఎమ్మెల్యే శివకుమార్ అధ్యక్షత వహించారు. రాష్ట్ర మంత్రి జోగి రమేష్ ‘జగనన్న రథచక్రాలు రాష్ట్రంలో దూసుకెళుతున్నాయి’ అనగానే జై జగన్.. జైజై జగన్ అంటూ జనం నినదించారు. ‘నిజం నిగ్గు తేలినందునే బాబు బొక్కలోకి వెళ్లాడు..’ అనగానే జనం ‘నిజం...నిజం’ అంటూ కేకలు పెట్టారు. ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించినపుడు కరతాళధ్వనులు మిన్నుముట్టాయి. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో ట్రాక్టర్లు, బైక్ ర్యాలీతో సామాజిక సాధికార యాత్రకు స్వాగతం పలుకుతున్న ప్రజలు జన సంతసం.. జగన్నినాదం అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికారత బస్సు యాత్ర, బుక్కరాయసముద్రంలో జరిగిన సభ జన సంద్రాన్ని తలపించాయి. బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఈ కార్యక్రమాలకు భారీగా తరలివచ్చారు. నియోజకవర్గ కేంద్రమైన శింగనమలలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో బస్సు యాత్ర ప్రారంభమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు డా. బీఆర్ అంబేడ్కర్, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ‘నాడు–నేడు’ పనుల ఫొటోలను పరిశీలించారు. అక్కడి వచ్చిన ప్రజలతో మాట్లాడారు. అనంతరం బస్సు యాత్ర ప్రారంభించారు. బస్సు ముందు వైఎస్సార్సీపీ శ్రేణులు బైక్ ర్యాలీ చేశాయి. రోటరీపురం గ్రామం వద్ద ప్రజలు పూల వర్షం కురిపించారు. బుక్కరాయసముద్రం వద్ద యాత్రకు ప్రజలు స్వాగతం పలికారు. ఇక్కడ జరిగిన సభలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మాట్లాడారు. సీఎం జగన్ ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీలకు అందించిన సంక్షేమ పథకాలను వివరించిన సందర్భంలో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. జాతీయ నేతలకు నివాళులు వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికారత బస్సు యాత్రలో భాగంగా జరుగుతున్న సభల్లో పాల్గొన్న మంత్రులు, ప్రజా ప్రతినిధులు, నేతలు ముందుగా జాతీయ నేతలకు నివాళులర్పించారు. ప్రతి సభలో వేదికపై భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జ్యోతిరావు పూలే, బాబు జగజ్జీవన్‌రామ్, అల్లూరి సీతారామరాజు, భారతరత్న అబ్దుల్ కలాం చిత్రపటాలను, మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మంత్రులు, ఇతర నేతలు ఈ చిత్రపటాల వద్ద పుష్పాలు ఉంచి, నేతలకు నివాళులర్పించారు. అనంతరం సభ ప్రారంభించారు. -
జగన్ అంటే నమ్మకం..చంద్రబాబు ఒక అబద్ధం
చీపురుపల్లి: ప్రజల కోసం మాట ఇస్తే ఎన్ని కష్టాలు ఎదురైనా నిలబెట్టుకుంటాడనే నమ్మకం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై ప్రజలకు ఉంటే..మాట చెబితే అది అబద్ధమే తప్ప ఎన్నటికీ ఆచరణలోకి రాదనే అభిప్రాయం ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడిపై ప్రజలకు ఉందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు చీపురుపల్లి పట్టణంలోని లావేరురోడ్‌లో గల వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి 2019 మే 30న నవరత్నాలు సంక్షేమ పథకాల ఫైలుపై తొలి సంతకం చేశారని, నాలుగేళ్లుగా సంక్షేమ పాలన దిగ్విజయంగా కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 2019 ఎన్నికల్లో వైఎస్.జగన్మోహన్రెడ్డిపై నమ్మకంతో రాష్ట్రంలో 151 అసెంబ్లీ స్థానాలు, విజయనగరం జిల్లాలో 9 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాల్లో ప్రజలు గెలిపించారన్నారు. అదే నమ్మకంతో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిరంతరం ప్రజల కోసమే ఆలోచిస్తున్నారని చెప్పారు. సంక్షేమం, పెట్టుబడులు, ఉపాధి కల్పన, సాగునీటి వనరులు, మౌలిక వసతులు అభివృద్ధితో బాటు పేదలు అభ్యున్నతి కోసం కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలు అమలు చేశారని చెప్పారు. పేదలకు సంక్షేమ పథకాలు మాత్రమే కాకుండా ఫ్యామిలీ డాక్టర్ పేరుతో నేరుగా ఇంటికే వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలు నివసిస్తున్న ప్రాంతంలోనే అన్ని సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, మూలపేట పోర్టు నిర్మాణానికి సీఎం జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారని మరో మూడేళ్లలో వాటి సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు. విశాఖపట్నంలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసి రూ.13.5 లక్షలు కోట్లు పెట్టుబడులను ఆకర్షించిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి హయాంలో అవినీతి రహిత, పారదర్శక పరిపాలనకు ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా డీబీటీ విధానం ద్వారా 2.5 లక్షల కుటుంబాల ఖాతాల్లో సంక్షేమ పథకాల డబ్బులు జమ చేయడం నిదర్శనంగా నిలుస్తుందన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకుల త్యాగాలతో 2024లో 175 స్థానాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మళ్లీ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు.. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా చంద్రబాబు పరిస్థితి తయారైందని ఎద్దేవా చేశారు. నాలుగేళ్లుగా ఒక్క రూపాయి అవినీతి లేకుండా సీఎం జగన్మోహన్రెడ్డి పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తుంటే విమర్శలు చేసిన చంద్రబాబునాయుడు అధికార దాహంతో టీడీపీ మహానాడులో అన్నీ ఉచితమే అంటూ ఆల్ ఫ్రీ బాబుగా మారిపోయాడన్నారు. చంద్రబాబు అబద్ధపు హామీలపై ఇటు ప్రజలు, అటు సొంత పార్టీ నేతలతో బాటు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోందని స్పష్టం చేశారు. 2019 నుంచి ఇంతవరకు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో కులం, పార్టీ, మతం, జెండా చూడకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకం అందించారని, ఈ విషయంలో టీడీపీ కార్యకర్తలు గుండెలపై చేయి వేసుకుని నిర్థారణ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పలాస నియోకవర్గ వైఎస్సాన్సీపీ పరిశీలకుడు కేవీ.సూర్యనారాయణరాజు, మేజర్ పంచాయతీ సర్పంచ్ మంగళగిరి సుధారాణి, చీపురుపల్లి, మెరకముడిదాం, గుర్ల మండలాల నాయకులు ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, కోట్ల వెంకటరావు, తాడ్డి వేణు, పొట్నూరు సన్యాసప్పలనాయుడు, బెల్లాన బంగారునాయుడు, తోట తిరుపతిరావు, పతివాడ రాజారావు, కరిమజ్జి శ్రీనివాసరావు, ఇప్పిలి గోవింద, బాణాన శ్రీనివాసరావు, బాణాన రమణ తదితరులు పాల్గొన్నారు. నాలుగేళ్లలో 98.5 శాతం హమీలు అమలు చేసిన సీఎం జగన్ ప్రతిపక్ష నేతపై ప్రజల్లో లేని విశ్వసనీయత అధికారం కోసం ఆల్ ఫ్రీ బాబుగా మార్పు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు -
అంతా గందరగోళం..!
జిల్లాలో టీచర్ల సర్దుబాటు ప్రక్రియ గందరగోళంగా మారింది. సర్దుబాటులో రేషనలైజేషన్ జీఓలు అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. దీని వల్ల జిల్లాలో భారీగా టీచర్ పోస్టులు రద్దయ్యే పరిస్థితి ఏర్పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని మిగులు పోస్టులున్నాయి, వాటిని ఎలా సర్దుబాటు చేస్తారన్న విషయంపై విద్యాశాఖ స్పష్టత ఇవ్వకపోవ డంతో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. విజయనగరం అర్బన్ : పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీర్చడానికి ప్రభుత్వం చేపడుతున్న సర్దుబాటు ప్రక్రియ జిల్లాలో గందరగోళంగా మా రింది. ఈ ప్రక్రియకు రేషనలైజేషన్ (హేతుబద్ధీకరణ) జీఓలను జోడించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఉపాధ్యాయుల కొరత లేకుండా తాత్కాలిక పద్ధతిపై సర్దుబాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పాఠశాలల్లో ఉపాధ్యాయుల మిగులు, కొరతను గుర్తించడానికి గతంలో జారీ చేసిన రేషనలైజేషన్ (జీఓ 55, జీఓ 61) జీఓలను అమలు చేస్తోంది. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ఆధారంగా కాకుండా రేషనలైజేషన్ జీఓల ప్రకారం ఉపాధ్యాయుల సర్దుబాటు చేపడితే జిల్లాలో బదిలీలు కోరే ఉపాధ్యాయులకు స్థానాలు దొరికే పరిస్థితి ఉండదు. పదోన్నతుల వల్ల ఖాళీ అయిన స్థానాలను తప్పనిసరిగా డీఎస్సీ నియామకాల ద్వారా భ ర్తీ చేయాలి, అంతవరకూ ఈ పోస్టులను ఖాళీగానే ఉం చాలి. విద్యార్థులు లేని కారణంగా ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేయాల్సి ఉంటుంది. ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య భారీగా తగ్గే పరిస్థితి ఏర్పడుతుంది. అదే సర్దుబాటు ప్రక్రియ ద్వారా అయితే ఈ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు. డీఎస్సీ పోస్టులను భర్తీ చేసే వరకు ఆయా స్థానాలలో సర్దుబాటు ఉపాధ్యాయులుంటారు. కానీ పాఠశాలల్లో ఉపాధ్యాయుల మిగులు, కొరత వంటి వివరాలు సేకరించినప్పుడు రేషనలైజేషన్ విధానాన్నే పాటించాలని ఉన్నత విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. ఆ మేరకే ఎంఈఓలు నివేదికలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతి రేకిస్తున్నాయి. మిగులు ఉపాధ్యాయులను ఏవిధంగా సర్దుబాటు చేస్తారో స్పష్టత ఇవ్వకుండా విద్యాశాఖ గోప్యంగా ఉంచుతోంది. దీనివల్ల సర్దు బాబు ప్రక్రియ ముందడుగు వేస్తుందా లేదా అన్న అనుమానాలు నెలకొన్నాయి. ఈ ప్రక్రియ కౌన్సెలింగ్ ద్వారా నిర్వహిస్తారా..? లేదా సీనియార్టీ జాబితా ఆధారంగా అవసరమైన చోటకు తాత్కాలికంగా నియామకాలు జరుగుతాయా అనే అంశంపై ఉపాధ్యాయుల్లో చర్చ జరుగుతోంది. ఉపాధ్యాయులను రేషనలైజేషన్‌లో సర్దుబాబు చేసేందుకు సీనియార్టీ జాబితాలను తయారు చేయాల్సి ఉంది. జిల్లాలో ఇంతవరకు ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. విద్యాహక్కు చట్టానికి పొంతనలేని జీఓ నంబర్ 55 విద్యాహక్కు చట్టం ప్రకారం 19 మంది విద్యార్థులకు ఒక టీచర్, 35 మంది విద్యార్థులుంటే ఇద్దరు టీచర్లు ఉండాలన్నది నిబంధన. ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి నుంచి 40 మందికి ఒక సెక్షన్ చొప్పున ఒక టీచర్‌ను ఇవ్వాలన్న నిబంధన కూడా ఉంది. 40 మంది కంటే అధికంగా పిల్లలు ఉంటే మరో సెక్షన్‌ను మంజూరు చేసి మరో టీచర్‌ను ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇందుకు విరుద్ధంగా 2011 ఏప్రిల్‌లో ప్రభుత్వం జీఓ 55ను విడుదల చేసింది. ఈ జీఓ ప్రకారం ఉన్నత పాఠశాలలో ఆయా తరగతుల విద్యార్థుల సంఖ్యను కాకుండా పాఠశాలలో మొత్తం ఉన్న విద్యార్థుల సంఖ్యను ఆధారంగా చేసుకుని ఉపాధ్యాయులను కేటాయించాలనే నిబంధన విధిం చింది. విద్యాహక్కు చట్టానికి, జీఓ న ంబర్ 55కు పొంతన లేకపోవడంతో ప్రస్తుతం సర్దుబాటు ప్రక్రియ సందిగ్ధంలో పడింది. జిల్లాలో నాలుగేళ్ల క్రితం రేషనలైజేషన్ ప్రక్రియతో బదిలీలు జరిగాయి. విద్యాహక్కు చట్టానికి పొంతనలేని రేషన లైజేషన్ జీఓలు అమలు చేయడం వల్ల అప్పటిలో 150 పోస్టుల వరకు రద్దయ్యాయి. ఇప్పుడూ అలాగే చేస్తే మరిన్ని పోస్టులు రద్దయ్యే ప్రమాదం ఉందని ఉపాధ్యా య వర్గాలు ఆందోళన పడుతున్నాయి. -
ఎమ్మెల్సీకి కోలగట్ల రాజీనామా
విజయనగరం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి తన శాసనమండలి పదవికి మంగళవారం రాజీనామా చేశారు. విజయనగరం పట్టణంలోని ఓ హోటల్లో రోటరీ క్లబ్, చాంబర్ ఆఫ్ కామర్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కోలగట్ల వారి సమక్షంలోనే రాజీనామా పత్రంపై సంతకం చేసి శాసనమండలి కార్యాలయానికి ఫ్యాక్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నపుడు తనకు ఆ పదవి వచ్చిందని, ఆ పార్టీని వీడడంతో పదవి కూడా వద్దనుకుని రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు.