సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో మరోసారి వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం ఖాయమని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పార్టీ విజయం కోసం కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయని తెలిపారు. అందరం కలిసికట్టుగా పనిచేసి వైఎస్సార్‌సీపీని గెలిపిస్తామని చెప్పారు. విశాఖలోని భీమిలి నుంచి ఈనెల 27వ తేదీన సీఎం జగన్ ఎన్నికల శంఖారావాన్నిపూరిస్తారని తెలిపారు
విజయవాడలోని సింగ్ నగర్‌లో సింగ్ నగర్ఎలో గురువారం మ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ కార్యాలయ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. 175 స్థానాలు గెలవాలనే లక్ష్యంలో భాగంగానే సీట్ల మార్పు జరుగుతుందని తెలిపారు. మల్లాది విష్ణుకు మరింత ఉన్నతమైన బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. ఎన్నికలకు ముందే మల్లాది చట్టసభల్లోకి వెళతారన్నారు.
మల్లాది విష్ణు సారధ్యంలోనే వెలంపల్లి సెంట్రల్ నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు సజ్జల చంద్రబాబుకు ఆత్రం ఎక్కువ అని విమర్శించారు. ఓడిపోయిన రెండు నెలలకే ఎన్నికలని హడావిడి మొదలు పెట్టాడని దుయ్యబట్టారు. బాబు కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నాడని, అన్నిచోట్లా స్లీపర్ సెల్స్‌ను ఏర్పాటు చేసుకున్నాడని మండిపడ్డారు. విజయవాడను బాబు అభివృద్ధి చేయలేకపోయాడని, జగన్ వచ్చాకే అభివృద్ధి చెందుతోందని చెప్పారు.
చదవండి: KP Port: అదంతా ఎల్లో మీడియా సృష్టే: మంత్రి కాకాణి ఫైర్
సీఎం జగన్ పేద ప్రజల పక్షపాతి అని సజ్జల పేర్కొన్నారు. అధికారం అంటే బాధ్యతగా భావించిన నాయకుడు వైఎస్ జగన్ అని కొనియాడారు. వైఎస్సార్‌సీపీలో అందరూ కార్యకర్తలేనన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు గెలవడమే తమ లక్ష్యమని తెలిపారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా.. పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందించామని చెప్పారు. అవినీతికి తావులేకుండా లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమచేస్తున్నాయన్నారు.. ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసిన నాయకుడు జగన్ అని తెలిపారు.
‘ప్రజలతో సీఎం జగన్ బంధాన్ని ఎవరూ విడదీయలేరు. ఫ్లై ఓవర్లు.. రిటైనింగ్ వాల్ పూర్తయ్యాయి. సచివాలయ వ్యవస్థ. ఒక అద్భుతం. బటన్ నొక్కడాన్ని విమర్శిస్తున్నారు. కానీ బటన్ నొక్కడం అంత ఈజీ కాదు. గతంలో వీధి వ్యాపారుల గురించి ఎవరూ పట్టించుకోలేదు. వైఎస్ జగన్ ఒక్కరే వీధి వ్యాపారస్తులకు అండగా నిలిచారు. రాజకీయ ప్రమేయం లేకుండా కోటి 47 లక్షల కుటుంబాలు నేరుగా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందాయి 2 లక్షల30 వేల ఉద్యోగాలిచ్చాం. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుంది.
అమరావతి పేరుతో చంద్రబాబు చేసిన కుట్రకు రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి పోయింది. సీఎం జగన్ వికేంద్రీకరణకు ముందుకెళుతుంటే కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నాడు. 14 ఏళ్లలో ఏమి చేయలేనోడు. ఇప్పుడు అధికారం ఇస్తే ఏం చేస్తాడు. కుప్పం మనం ఎప్పుడో గెలిచాం. ఈసారీ గెలుస్తాం. అందుకే చంద్రబాబు పక్క చూపులు చూస్తున్నాడు. ఇది ఎన్నికల సమయం...వార్‌ను వార్‌గానే చూడాలి. సీఎం చేస్తున్న యజ్ఞంలో మనమంతా భాగస్వామ్యం కావాలి.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎంపీ కేశినేని నాని,జూపూడి ప్రభాకర్, పశ్చిమ నియోజకవర్గం ఇంఛార్జి షేక్ ఆసిఫ్, తూర్పు నియోజకవర్గం ఇంఛార్జి దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ రుహుల్లా, మేయర్ రాయన భాగ్యలక్ష్మి,డిప్యూటీ మేయర్లు ,సెంట్రల్ నియోజకవర్గ కార్పొరేటర్లు,కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యాలయ ప్రారంభోత్సవానికి కార్యకర్తలు ర్యాలీగా తరలివచ్చారు.
చదవండి: గంటా రాజీనామా ఆమోదం.. టీడీపీలో కొత్త టెన్షన్!
Comments
Please login to add a commentAdd a comment