సాక్షి, గజపతినగరం(విజయనగరం జిల్లా): సామాజిక న్యాయం అనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహరెడ్డి వల్లే సాధ్యమైందని వైఎస్సార్‌సీపీ నేతలు మరోసారి స్పష్టం చేశారు. సామాజిక సాధికారిత రెండోరోజు బస్సుయాత్రలో భాగంగా గజపతినగరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు ప్రసంగించారు.
ముందుగా గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య మాట్లాడుతూ.. ‘బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సముచిత స్థానం కల్పించింది సీఎం జగనే. సామాజిక న్యాయం సీఎం జగన్ వల్లే సాధ్యం. విశాఖ పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి ఎన్నో రకాల చర్యలు చేపట్టారు సీఎం జగన్. వెనుకబడిన ఉత్తరాంధ్రలో ట్రైబల్ యూనివర్శిటీని ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతోంది. కానీ చంద్రబాబు, ఎల్లో మీడియా ఏదో రకంగా విష ప్రచారం చేయడం దారుణం’ అని తెలిపారు.
డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ.. ‘నేను ఉన్నాను.. నేను విన్నాను అన్న నాయకుడు సీఎం జగన్. సీఎం జగన్ పాలనలో సామాజిక న్యాయం జరుగుతోంది. అన్ని కులాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించారు. అర్హులందరీకి అభివృద్ది, సంక్షేమ పలాలు అందిస్తున్నాం. కులం మతం తో సంబంధం లేకుండా మంత్రి పదవులు ఇచ్చారు. ప్రతి గ్రామం లో సచివాలయం ఏర్పాటు చేసి, నిరుద్యోగులను వాలంటర్ లు గా నియమించి ప్రభుత్వ సేవలు ఇస్తున్నాం. ప్రతి పేదవాడి మొహం లో చిరునవ్వు చూడాలని సామజిక న్యాయం చేస్తున్నాం’ అని స్పష్టం చేశారు.
డిప్యూటీ సీఎం రాజన్న దొర మాట్లాడుతూ.. ‘బీసీలకు, ఎస్సీలకు రాజ్యాధికారం ఇచ్చింది అంబేద్కర్, అంబేద్కర్ ఆశయాలను ఎవరూ అమలు చేయలేదు. జగన్ సీఎం అయ్యాక మనసు, మానవత్వంతో ఆలోచించి గిరిజనుడికి, దళితుడికి, బీసీలకు రాజ్యాధికారం అవకాశం ఇచ్చారు. కుల మతాలకు సంబంధం లేకుండా అవకాశాలు కల్పించింది వైఎస్సార్‌సీపీ.
మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. ‘ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారం ఇచ్చింది సీఎం జగన్. బీసీలు తోక కత్తిరిస్తామని, మీ అంతుచూస్తామని చంద్రబాబు మాట్లాడారు. మరి బీసీలను అవహేళన చేసిన చంద్రబాబును నమ్ముతామా. ఎస్సీ కులం లో పుట్టాలని ఎవరు అనుకుంటారని చంద్రబాబు ఎస్సీ లను అవమానించారు. చంద్రబాబు మోసాలను జనం గమనించాలి. 2014 ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి పోటీ చేసి 650 హామీలు ఇచ్చారు. ప్రమాణస్వీకారం రోజు 5 సంతకాలు చేసి రైతు రుణ మాఫీ చేయలేదు. చంద్రబాబు హామీలు నెరవేర్చకుండా చేతులెత్తేశాడు. అందుకే చిత్తుగా ఓడిపోయాడు.
మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ‘ ప్రజలు బ్యాంకుల్లో అప్పులు అయిపోయారు. నాకు ఓటు వేయండి అప్పులు తీర్చుతామని 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పాడు. అప్పులు తీర్చలేదు. మేం 5 ఏళ్ల క్రితం చంద్రబాబు మోసం చెప్పాం. అందుకే మీరు మాకు ఓటు వేశారు. మేం అధికారం లోకి వచ్చాక వారి బ్యాంకు ఖాతాల్లో మూడు విడుతలు డబ్బులు వేసి నాలుగో విడత వేయడానికి సిద్దం గా ఉన్నాం. ఇది కదా మాట నిలబెట్టుకోవడం.
చంద్రబాబు పాలన లో రైతులు రుణాలు తీర్చలేకపోతే బ్యాంకులు అవమానించాయి. జగన్ పాలన లో సక్రమం గా రైతు బరోసా ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఎన్నికల్లో మోసం చేసిన వాడికి ఓటు వేయవద్దు. రాజకీయాల్లో తప్పు చేసిన వాడికి ఓటు వేస్తే 5 సంవత్సరాలు నష్టపోతాం. ఒక్కసారి జగన్‌కి ఓటు వేస్తే 30లక్షల మందికి ఇళ్లు ఇచ్చారు. ఇలాంటి వారికి ఓటు వేయాలి కదా.
మా ప్రభుత్వం ఏనాడు మా పార్టీకి ఓటు వేయలేదని అడగలేదు. కానీ మేం అందరికి పథకాలు ఇచ్చాం. కరెంట్ బిల్ ఈ ఒక్క రాష్ట్రం లోనే పెరిగిందా. దేశం లో అన్ని రాష్ట్రాల్లో పెరిగింది. ప్రభుత్వం మీద విమర్శించడానికి ఏమీ లేక ధరల విషయంతో తికమక పెడుతున్నారు. అలాంటి వాళ్లని ఎదురు ప్రశ్నించండి. స్కూల్స్‌లో కార్పొరేట్ సదుపాయాలు కల్పించాం. పిల్లలకు సాక్స్ నుండి పుస్తకాలు, పౌష్టిక ఆహారం వరకు నాణ్యమైనవి ఇచ్చాం. పిల్లలకు ఓటు లేదని వాళ్లని వదిలేయలేదు. మంచి విద్యా అందిస్తున్నాం.
ఈ వేళ చాలా మార్పులు వచ్చాయి. ఈ మార్పుకి కారణం ఎవరు. 3లక్షల 30 వేల కోట్ల పేద వాళ్లకి జగన్ అందించారు. పేదలకి నేరుగా డబ్బులు ఇచ్చారు. మధ్య దళారీ లు లేరు. అవనీతి లేని పాలన జరుగుతుంది. గ్రామ సచివాలయాలు వచ్చాయి. మండల కేంద్రంకి వెళ్లాల్సిన పని లేకుండా అన్ని పనులు సచివాలయంలోనే జరుగుతున్నాయి. మంచి నాయకుడు, మంచి ప్రభుత్వం ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది.
స్కిల్ స్కాం కేసులో ప్రజల డబ్బు చంద్ర బాబు సొంతానికి వాడుకున్నాడని నిరూపణ అయింది. కేంద్ర సంస్థలు చెప్తే పోలీస్‌లు అరెస్ట్ చేశారు. దొంగతనం చేస్తే ప్రభుత్వం ఊరుకోదు. ప్రజా ధనం దోచుకుంటే శిక్ష తప్పదు’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment