gajapati nagaram
-
YSRCP Bus Yatra: ఇది కదా మాట నిలబెట్టుకోవడం అంటే..
సాక్షి, గజపతినగరం(విజయనగరం జిల్లా): సామాజిక న్యాయం అనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహరెడ్డి వల్లే సాధ్యమైందని వైఎస్సార్సీపీ నేతలు మరోసారి స్పష్టం చేశారు. సామాజిక సాధికారిత రెండోరోజు బస్సుయాత్రలో భాగంగా గజపతినగరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పలువురు వైఎస్సార్సీపీ నేతలు ప్రసంగించారు. ముందుగా గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య మాట్లాడుతూ.. ‘బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సముచిత స్థానం కల్పించింది సీఎం జగనే. సామాజిక న్యాయం సీఎం జగన్ వల్లే సాధ్యం. విశాఖ పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి ఎన్నో రకాల చర్యలు చేపట్టారు సీఎం జగన్. వెనుకబడిన ఉత్తరాంధ్రలో ట్రైబల్ యూనివర్శిటీని ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతోంది. కానీ చంద్రబాబు, ఎల్లో మీడియా ఏదో రకంగా విష ప్రచారం చేయడం దారుణం’ అని తెలిపారు. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ.. ‘నేను ఉన్నాను.. నేను విన్నాను అన్న నాయకుడు సీఎం జగన్. సీఎం జగన్ పాలనలో సామాజిక న్యాయం జరుగుతోంది. అన్ని కులాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించారు. అర్హులందరీకి అభివృద్ది, సంక్షేమ పలాలు అందిస్తున్నాం. కులం మతం తో సంబంధం లేకుండా మంత్రి పదవులు ఇచ్చారు. ప్రతి గ్రామం లో సచివాలయం ఏర్పాటు చేసి, నిరుద్యోగులను వాలంటర్ లు గా నియమించి ప్రభుత్వ సేవలు ఇస్తున్నాం. ప్రతి పేదవాడి మొహం లో చిరునవ్వు చూడాలని సామజిక న్యాయం చేస్తున్నాం’ అని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం రాజన్న దొర మాట్లాడుతూ.. ‘బీసీలకు, ఎస్సీలకు రాజ్యాధికారం ఇచ్చింది అంబేద్కర్, అంబేద్కర్ ఆశయాలను ఎవరూ అమలు చేయలేదు. జగన్ సీఎం అయ్యాక మనసు, మానవత్వంతో ఆలోచించి గిరిజనుడికి, దళితుడికి, బీసీలకు రాజ్యాధికారం అవకాశం ఇచ్చారు. కుల మతాలకు సంబంధం లేకుండా అవకాశాలు కల్పించింది వైఎస్సార్సీపీ. మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. ‘ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారం ఇచ్చింది సీఎం జగన్. బీసీలు తోక కత్తిరిస్తామని, మీ అంతుచూస్తామని చంద్రబాబు మాట్లాడారు. మరి బీసీలను అవహేళన చేసిన చంద్రబాబును నమ్ముతామా. ఎస్సీ కులం లో పుట్టాలని ఎవరు అనుకుంటారని చంద్రబాబు ఎస్సీ లను అవమానించారు. చంద్రబాబు మోసాలను జనం గమనించాలి. 2014 ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి పోటీ చేసి 650 హామీలు ఇచ్చారు. ప్రమాణస్వీకారం రోజు 5 సంతకాలు చేసి రైతు రుణ మాఫీ చేయలేదు. చంద్రబాబు హామీలు నెరవేర్చకుండా చేతులెత్తేశాడు. అందుకే చిత్తుగా ఓడిపోయాడు. మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ‘ ప్రజలు బ్యాంకుల్లో అప్పులు అయిపోయారు. నాకు ఓటు వేయండి అప్పులు తీర్చుతామని 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పాడు. అప్పులు తీర్చలేదు. మేం 5 ఏళ్ల క్రితం చంద్రబాబు మోసం చెప్పాం. అందుకే మీరు మాకు ఓటు వేశారు. మేం అధికారం లోకి వచ్చాక వారి బ్యాంకు ఖాతాల్లో మూడు విడుతలు డబ్బులు వేసి నాలుగో విడత వేయడానికి సిద్దం గా ఉన్నాం. ఇది కదా మాట నిలబెట్టుకోవడం. చంద్రబాబు పాలన లో రైతులు రుణాలు తీర్చలేకపోతే బ్యాంకులు అవమానించాయి. జగన్ పాలన లో సక్రమం గా రైతు బరోసా ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఎన్నికల్లో మోసం చేసిన వాడికి ఓటు వేయవద్దు. రాజకీయాల్లో తప్పు చేసిన వాడికి ఓటు వేస్తే 5 సంవత్సరాలు నష్టపోతాం. ఒక్కసారి జగన్‌కి ఓటు వేస్తే 30లక్షల మందికి ఇళ్లు ఇచ్చారు. ఇలాంటి వారికి ఓటు వేయాలి కదా. మా ప్రభుత్వం ఏనాడు మా పార్టీకి ఓటు వేయలేదని అడగలేదు. కానీ మేం అందరికి పథకాలు ఇచ్చాం. కరెంట్ బిల్ ఈ ఒక్క రాష్ట్రం లోనే పెరిగిందా. దేశం లో అన్ని రాష్ట్రాల్లో పెరిగింది. ప్రభుత్వం మీద విమర్శించడానికి ఏమీ లేక ధరల విషయంతో తికమక పెడుతున్నారు. అలాంటి వాళ్లని ఎదురు ప్రశ్నించండి. స్కూల్స్‌లో కార్పొరేట్ సదుపాయాలు కల్పించాం. పిల్లలకు సాక్స్ నుండి పుస్తకాలు, పౌష్టిక ఆహారం వరకు నాణ్యమైనవి ఇచ్చాం. పిల్లలకు ఓటు లేదని వాళ్లని వదిలేయలేదు. మంచి విద్యా అందిస్తున్నాం. ఈ వేళ చాలా మార్పులు వచ్చాయి. ఈ మార్పుకి కారణం ఎవరు. 3లక్షల 30 వేల కోట్ల పేద వాళ్లకి జగన్ అందించారు. పేదలకి నేరుగా డబ్బులు ఇచ్చారు. మధ్య దళారీ లు లేరు. అవనీతి లేని పాలన జరుగుతుంది. గ్రామ సచివాలయాలు వచ్చాయి. మండల కేంద్రంకి వెళ్లాల్సిన పని లేకుండా అన్ని పనులు సచివాలయంలోనే జరుగుతున్నాయి. మంచి నాయకుడు, మంచి ప్రభుత్వం ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది. స్కిల్ స్కాం కేసులో ప్రజల డబ్బు చంద్ర బాబు సొంతానికి వాడుకున్నాడని నిరూపణ అయింది. కేంద్ర సంస్థలు చెప్తే పోలీస్‌లు అరెస్ట్ చేశారు. దొంగతనం చేస్తే ప్రభుత్వం ఊరుకోదు. ప్రజా ధనం దోచుకుంటే శిక్ష తప్పదు’ అని అన్నారు. -
‘తోటపల్లి’కి సంపూర్ణంగా సాగునీరు
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల సమగ్రాభివృద్ధికి చుక్కానిలా నిలిచే తోటపల్లి బ్యారేజీ మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తోటపల్లి బ్యారేజీ కింద పాత ఆయకట్టు 64 వేల ఎకరాలను స్థిరీకరించడంతోపాటు కొత్తగా 1.20 లక్షల ఎకరాలు, గజపతినగరం బ్రాంచ్ కెనాల్ కింద 15 వేల ఎకరాలు వెరసి 1.99 లక్షల ఎకరాలకు నీళ్లందించేందుకు జలవనరుల శాఖ సన్నద్ధమైంది. శిథిలావస్థలో రెగ్యులేటర్.. విజయనగరం జిల్లాలో గరుగుబిల్లి మండలం తోటపల్లి వద్ద నాగావళిపై 1908లో ఆంగ్లేయుల హయాంలో రెగ్యులేటర్ నిర్మించారు. శిథిలావస్థకు చేరుకున్న ఈ రెగ్యులేటర్‌పై ఆధారపడి 64 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. నాగావళి వరద జలాలను గరిష్టంగా వినియోగించుకుని, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో 2004లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పాత రెగ్యులేటర్‌కు ఎగువన 2.509 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ బ్యారేజీ ద్వారా పాత ఆయకట్టు 64 వేల ఎకరాలను స్థిరీకరించడంతోపాటు కొత్తగా కుడికాలువ ద్వారా 1.20 లక్షల ఎకరాలు, కుడి కాలువలో 97.7 కిలోమీటర్ల నుంచి 25 కిలోమీటర్ల మేర గజపతినగరం బ్రాంచ్ కాలువ తవ్వడం ద్వారా 15 వేల ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించారు. భూ సేకరణ సమస్య పరిష్కారం.. తోటపల్లి బ్యారేజీ పనులు 2009 నాటికే పూర్తయ్యాయి. అయితే కుడి కాలువలో మిగిలిన పనులు పూర్తి కాకపోవడంతో 40 వేల ఎకరాలకు నీళ్లందని దుస్థితి నెలకొంది. రెండు ప్యాకేజీల కాంట్రాక్టర్లు పనులు చేయకుండా పదేళ్లుగా మొండికేస్తుండటంతో కొత్త కాంట్రాక్టర్లకు అప్పగించారు. ప్రధాన కాలువతోపాటు డిస్ట్రిబ్యూటరీల్లో మిగిలిన పనులు పూర్తి చేయడానికి 72.335 ఎకరాల భూసేకరణ సమస్యను ఇటీవలే ప్రభుత్వం పరిష్కరించింది. దీంతో మిగిలిన పనులను రూ.124.23 కోట్లతో వేగంగా పూర్తి చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. వేగంగా గజపతినగరం బ్రాంచ్ కెనాల్ పనులు గజపతినగరం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా వేగవంతమయ్యాయి. మిగిలిపోయిన 13,42,558 క్యూబిక్ మీటర్ల మట్టి పని, 30 వరకు బ్రిడ్జిలు, అండర్ టన్నెళ్లు లాంటి నిర్మాణాలు, 12,583 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను వేగంగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. కెనాల్ పూర్తయ్యేలోగా ఆయకట్టుకు నీళ్లందించే డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేసే దిశగా పనులను వేగవంతం చేశారు. -
చంద్రబాబు.. కేసీఆర్‌ను ఓడించమంటాడేంటి?
సాక్షి, హైదరాబాద్ : ‘కుట్రలు, కుతంత్రాలతో జగన్ బాబుపై అక్రమ కేసులు బనాయించి... నానా ఇబ్బందులు పెట్టి, జైలుకు పంపించినప్పుడే నా బిడ్డ భయపడలేదు. నా కొడుకు ఎవరికీ భయపడడు, ఎవరి కాళ్లు మొక్కడు. ఎవరితో పొత్తు పెట్టుకోడు. ప్రజలతోనే అనుబంధం...మీతోనే నా బిడ్డ పొత్తు పెట్టుకుంటాడు.’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం విజయనగరం జిల్లా గజపతి నగరం రోడ్ షోలో చంద్రబాబు నాయుడును ఆమె తూర్పారబట్టారు. ‘తాను అనుకున్నది సాధించడానికి చంద్రబాబు ఏమైనా చేస్తాడు. ఎంతకైనా తెగిస్తాడు. బెదిరిస్తాడు. మాట వినకుంటే ఏదైనా చేస్తాడు. అలాంటిది ‘మీ భవిష్యత్ నా బాధ్యత’ ’ అని చెబుతున్న చంద్రబాబు మిమ్మల్ని ఏవిధంగా కాపాడతాడు. 17 కేసుల్లో స్టే తెచ్చుకుని మేనేజ్ చేస్తున్న ఆయన...జగన్ బాబుపై 31 కేసులు ఉన్నాయంటూ ఆరోపణలు చేస్తున్నారు. నేను అడుగుతున్నా ఆ కేసులు పెట్టింది ఎవరు? మీరు కాదా?. జగన్ బాబు తనపై పెట్టిన అక్రమ కేసులపై పోరాడుతున్నాడు. మీరే చెప్పండి ఎవరికి నిజాయితీ ఉంది. తమ్ముళ్లు నన్ను రక్షించండి.. నా చుట్టు ఉండండి... ‘మీ భవిష్యత్ నా బాధ్యత’ అని చెప్పుకుంటున్న చంద్రబాబుకు భయం పట్టుకుంది. అందుకే తాను చేసిన అభివృద్ధి గురించి చెప్పకుండా...ప్రతిపక్షంతో పాటు ఎదుటి వ్యక్తులపై బురద చల్లుతున్నాడు. కేసీఆర్‌కు మనకు ఏంటి సంబంధం.. మన రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏం సంబంధం. ఆయన ఏమైనా ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా? లేక వైఎస్సార్ సీపీ ఏమైనా పొత్తు పెట్టుకుందా?. మరి ఎందుకు కేసీఆర్‌ను ఓడించండి అంటూ చంద్రాబాబు ఇక్కడ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. తన స్వలాభం కోసం చంద్రబాబు ఇంతగా దిగజారిపోవాలా?. ఆయన బీజేపీలో ఉన్నప్పుడు తల్లి కాంగ్రెస్-పిల్ల కాంగ్రెస్ అన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ పక్షాన చేరి...బీజేపీ, టీఆర్ఎస్తో వైఎస్సార్ సీపీ పొత్తు పెట్టుకుందని మాట్లాడుతున్నాడు. జగన్ ఎవరితో పొత్తు పెట్టుకోడు. ఎవరి కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం లేదు. జగన్ ప్రజలతోనే అనుబంధం పెట్టుకుంటాడు. ఈ విజయనగరం జిల్లా అంటే రాజశేఖర్ రెడ్డి గారికి విపరీతమైన ప్రేమ.. ఎందుకంటే ఇది కూడా రాయలసీమలా వెనుకబడిన ప్రాంతం... తోటపల్లి నీరు పూర్తిగా రైతులకు అందడం లేదని, జంఝావతి రబ్బరు డ్యాం కట్టి రైతులకు త్వరగా నీరిచ్చే ప్రయత్నం చేశారు. తన తండ్రిలాగానే రాజశేఖర్ రెడ్డిలాగేనే జగన్ కూడా ప్రజలకు మంచి పాలన అందిస్తాడు. మళ్లీ రాజన్న రాజ్యం తెచ్చేందుకు ‘నవరత్నాలు’ పథకాన్ని ప్రతి ఇంటికి అందేలా జగన్ చేస్తాడు. మీరు గొప్పగా చెప్పుకునేలా పని చేస్తాడు. మరి చంద్రబాబు ఈ అయిదేళ్ల పాలనలో ఏం చేశారు. విజయనగరం మెడికల్ కాలేజీ వచ్చిందా?. గజపతినగరం నూరు పడకల ఆసుపత్రి వచ్చిందా?. గోస్తని, చంపావతి నదుల అనుసంధానం చేస్తామన్నారు... చేశారా?. మరి మీ నియోజకవర్గంలో చంద్రబాబు ఏం చేశారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?. చంద్రబాబు తరహాలోనే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కేఎ నాయుడు ఇసుక దోచుకున్నారు. ఉద్యోగాలు కూడా అమ్ముకుంటున్నారు. నాకు అనుభవం ఉందని చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు. ఆరువందలు హామీలు ఇచ్చారు. ఒక్కటైనా మవనెరవేర్చలేదు. రాజశేఖర్ రెడ్డి అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందిస్తే, చంద్రబాబు వాళ్ల కార్యకర్తల సంక్షేమం తప్ప మరేదీ చూడలేదు.’ అంటూ వైఎస్ విజయమ్మ తీవ్రస్థాయిలో చంద్రబాబుపై ధ్వజమెత్తారు. వైఎస్సార్ పాలన మళ్లీ వచ్చేందుకు ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని వైఎస్ విజయమ్మకోరారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి బొత్స అప్పలనరసయ్య, ఎంపీ అభ్యర్ధి బెల్లాన చంద్రశేఖర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. -
చంద్రబాబు ఎంతకైనా తెగిస్తాడు