‘కుట్రలు, కుతంత్రాలతో జగన్ బాబుపై అక్రమ కేసులు బనాయించి... నానా ఇబ్బందులు పెట్టి, జైలుకు పంపించినప్పుడే నా బిడ్డ భయపడలేదు. నా కొడుకు ఎవరికీ భయపడడు, ఎవరి కాళ్లు మొక్కడు. ఎవరితో పొత్తు పెట్టుకోడు. ప్రజలతోనే అనుబంధం...మీతోనే నా బిడ్డ పొత్తు పెట్టుకుంటాడు.’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె బుధవారం విజయనగరం జిల్లా గజపతి నగరంలో బహిరంగ సభలో మాట్లాడారు. వైఎస్ విజయమ్మ ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడును తూర్పారబట్టారు.