YSRCP Bus Yatra
-
పెల్లుబికిన అభిమానం.. కదం తొక్కిన జనం (ఫోటోలు)
-
ప్రచార జోరు..
-
అభిమానం పూలవర్షమై.. జైత్రయాత్రకు నీరా‘జనం’ (ఫొటోలు)
-
మేమంతా సిద్ధం: సీఎం జగన్ రాకతో దద్దరిల్లిన మదనపల్లె సభ (ఫొటోలు)
-
గుండెల నిండా ప్రేమతో సీఎం జగన్ కోసం.. (ఫొటోలు)
-
ఆప్యాయంగా జగనన్న.. అన్నమయ్యలో ఆరో రోజు మేమంతా సిద్ధం(ఫొటోలు)
-
సీఎం జగన్ బస్సుయాత్ర.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
-
మంచి చేసేది జగనన్నే.. మళ్లీ వచ్చేది జగనన్నే (మేమంతా సిద్ధం@డే5- ఫొటోలు)
-
జగనన్న మీ బిడ్డ.. ఆప్యాయత ఇలాగే ఉంటుంది మరి! (మేమంతా సిద్ధం డే 4 ఫొటోలు)
-
Proddatur Sabha Photos: జగనన్నా.. మీ వెంటే మేము (ఫొటోలు)
-
మోసాలు, నేరాలే వారి చరిత్ర: సీఎం వైఎస్ జగన్
విప్లవాత్మక మార్పులకు మారుపేరుగా ఎక్కడా లంచాలు, వివక్షకు తావు లేకుండా ప్రజల అజెండానే జెండాగా వైఎస్సార్సీపీ ముందుకెళుతోంది. ఈ జెండా మరో జెండాతో జత కట్టలేదు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మాకు మద్దతుగా సిద్ధం అని ఈ జెండా తలెత్తుకుంది. ప్రజల అజెండాగా రెపరెపలాడుతోంది. పేద ప్రజల అభివృద్ధి కోసం 130 సార్లు బటన్ నొక్కాను. మీరు మే 13వ తేదిన ఫ్యాన్ గుర్తుపై రెండు మార్లు బటన్ నొక్కడంతోపాటు మరో వంద మందికి మన ప్రభుత్వం చేసిన మంచిని వివరించి ఓటు వేసేలా చైతన్యం తీసుకురావాలి. 48 రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో అబద్ధాలు చెప్పేవాళ్లు, మోసం చేసేవాళ్లు మనకు ప్రత్యర్థులు. పేదల వ్యతిరేకులని ఓడించేందుకు మీరంతా సిద్ధమా.. (సిద్ధం అని జనం నినాదాలు) అబద్దాలు, మోసాలు, కుట్రల కూటమిపై గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం. ప్రజలకు మంచి చేయని చంద్రబాబు బృందాన్ని నమ్మితే నట్టేట ముంచడం ఖాయం. ప్రభుత్వ ప్రయోజనాలు అందుకున్న ప్రతి కుటుంబం స్టార్ క్యాంపెయినర్‌గా బయటికి రావాలి. వారంతా మరో వంద మందికి చెప్పి మీ బిడ్డకు తోడుగా నిలవాలి. 2024 ఎన్నికల్లో ‘మన కోసం మనం’ ప్రతి ఒక్కరూ రెండుసార్లు ఫ్యాన్ గుర్తుపై నొక్కాలి. అలా నొక్కితేనే చంద్రముఖి బెడద ఉండదు. పొరపాటు జరిగితే చంద్రముఖి లక లక లక అంటూ సైకిల్‌పై వచ్చి టీ గ్లాస్ పట్టుకుని మీ ఇంటిలో రక్తం తాగుతుంది. చంద్రబాబుకు ఓటు వేయడమంటే మన పథకాలు మనమే రద్దు చేసుకోవడం. ఆయన్ను నమ్మడం అంటే మోసం, అబద్ధం, వెన్నుపోటును నమ్మడమే. – సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, కడప: మోసాలు చేయడం, అబద్ధాలు చెప్పడం, వెన్నుపోటు పొడవడం, కుట్రలు చేయడంలో చంద్రబాబుకు 45 సంవత్సరాల అనుభవం ఉందని.. చేయాల్సిన నేరాలన్నీ చేసేసి నెపం వైఎస్సార్‌సీపీపైకి తోయడంలో ఆయనకు ఎవరూ సాటిలేరని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. తన చిన్నాన్న వివేకానందరెడ్డిని ఎవరు చంపారో, ఎందుకు చంపించారో.. వారితో ఇప్పుడెవరు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారో అందరికీ తెలుసని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో పట్టుబడిన డ్రగ్స్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరీ, చంద్రబాబు బంధువులవని తేలినా, ఎల్లో మీడియా సహకారంతో ఆ నెపాన్ని మనపై నెట్టేందుకు క్షణాల్లో రెడీ అయ్యారని మండిపడ్డారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడంలో, గోబెల్స్ ప్రచారంలో, కుటుంబాలను చీల్చడంలోనూ చంద్రబాబు అనుభవాన్ని చూస్తున్నామని ధ్వజమెత్తారు. బుధవారం ఇడుపులపాయలో ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టిన సీఎం వైఎస్ జగన్.. ప్రొద్దుటూరులో నిర్వహించిన బహిరంగ సభలో అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ‘వివేకానందరెడ్డిని అత్యంత దారుణంగా చంపానని హేయంగా చెప్పుకుని తిరుగుతున్నా ఆ హంతకుడికి మద్దతు ఇస్తూ నేరుగా నెత్తిన పెట్టుకుంటున్నారు చంద్రబాబు, ఎల్లో మీడియా. ఈ హంతకుడికి రాజకీయ కాంక్షతో ఒకరిద్దరు నా వాళ్లు కూడా మద్దతిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిన్నాన్నను ఓడించిన వారితో చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారు. వివేకం చిన్నాన్న బతికున్నంత వరకు చంద్రబాబును శత్రువుగా భావించారు. చనిపోయిన తర్వాత శవ రాజకీయాలతో కుట్రలు చేస్తున్నారు. ఎన్టీఆర్ బతికున్నప్పుడు వెన్నుపోటు పొడిచి, చనిపోయిన తర్వాత శవాన్ని లాక్కొని ఊరూరా విగ్రహాలు పెడుతూ దండలు వేస్తున్నారు. నైతిక విలువలు ఎంత దయనీయంగా ఉన్నాయో ప్రజలు ఆలోచించాలి. నన్ను దెబ్బ తీసేందుకే కుట్రలు చేస్తున్నారు. ఇది కలియుగం కాక మరేమిటి? ఎవరెన్ని కుట్రలు పన్నినా నేను మాత్రం ప్రజల పక్షమే. ఆ దేవుడు, ప్రజల్నే నమ్ముకున్నా. ధర్మం, న్యాయాన్ని నమ్ముకున్నా. ప్రజలకు మంచి చేసిన చరిత్ర మనది. వారిలా వంచించిన చరిత్ర మనకు లేదు. మేనిఫెస్టోలో పది శాతం వాగ్దానాలు కూడా చంద్రబాబు నెరవేర్చలేదు. ఎన్నికల మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతలుగా భావించి, త్రికరణ శుద్ధిగా 99 శాతం వాగ్దానాలను అమలు చేసి నిలబెట్టుకున్న చరిత్ర మన ప్రభుత్వానిది. ఈ తేడాను ప్రజలందరూ గమనించాలి’ అని చెప్పారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. వారు చంద్రబాబు వదినమ్మ బంధువులు ► బ్రెజిల్ నుంచి చంద్రబాబు వదిన గారి చుట్టం డ్రై ఈస్ట్ పేరుతో డ్రగ్స్‌ను దిగుమతి చేసుకుంటూ విశాఖపట్నంలో సీబీఐ దాడుల్లో అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, చంద్రబాబు బంధువులు దొరికితే చివరికి ఎల్లో మీడియా సహకారంతో ఆ నెపాన్ని మనపైన నెట్టేందుకు శక్తివంచన లేకుండా కష్టపడుతున్నారు. చంద్రబాబు వదినమ్మ, ఆమె కొడుకు, వియ్యంకుడు తదితరులు డైరెక్టర్లుగా వ్యవహరించిన కంపెనీకి సంబంధించిన ఈ వ్యవహారంలో బుకాయిస్తూ మనపై బురదజల్లుతున్నారు. ► 45 సంవత్సరాలుగా క్షుద్ర రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు బంధువులు అడ్డంగా దొరికితే.. వైఎస్సార్సీపీ వాళ్లని నీచ రాజకీయాలు చేస్తున్న వాళ్లకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 ఎల్లో మీడియా వంత పాడుతోంది. ఈనాడు పత్రికను చదువుతుంటే ఛీ ఇదొక పేపరా అనిపిస్తోంది. కేంద్రం నుంచి ఒక పార్టీని పరోక్షంగా, మరొక పార్టీని ప్రత్యక్షంగా తెచ్చుకుని అందరూ కలిసి ఒక్క జగన్‌తో యుద్ధం చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్, జనసేన, టీడీపీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, నా ఇద్దరు చెల్లెళ్లు కలిసి నాపై యుద్ధానికి సిద్దమయ్యారు. మంచి చేసి చూపించాడు మీ బిడ్డ ► రాష్ట్రంలో గతంలో ఎన్నడూ జరగని విధంగా సంక్షేమం, అభివృద్ధిని 58 నెలల కాలంలో మీ బిడ్డ చేసి చూపించాడు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు ఏ గ్రామంలో నాలుగు అడుగులు వేసినా సచివాలయ వ్యవస్థ కనిపిస్తోంది. అందులో మన పిల్లలు పది మంది ఉద్యోగం చేస్తుండడం కనిపిస్తోంది. 1వ తేదీ ఇంటి వద్దకు చిక్కటి చిరునవ్వుతో అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులకు వారి మనవళ్లు విచ్చేసి సెలవు దినమైనప్పటికీ పింఛన్ అందజేస్తుండటమూ కనిపిస్తోంది. ► రూ.3 వేలు పింఛన్ ఇస్తున్న రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేదు. సంవత్సరానికి రూ.24 వేల కోట్లు పింఛన్లకు ఖర్చు చేస్తున్నాం. మన తర్వాతి స్థానంలో తెలంగాణ రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. మిగతా రాష్ట్రాలు రూ.8, 6, 4 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. లంచాలు, వివక్షకు ప్రతిరూపాలైన జన్మభూమి కమిటీలు లేనటువంటి వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశాం. ఓటు వేయని వారికి కూడా పథకాలు అందిస్తున్నది మీ బిడ్డ పాలనలోనే సాధ్యమైంది. ► మీ బిడ్డ డీబీటీ ద్వారా బటన్ నొక్కడంతో అక్కాచెల్లెమ్మల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ అవుతోంది. రూ.2.70 లక్షల కోట్లు ఖాతాల్లో నేరుగా జమ అయింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ, ఐబీ వంటి అంతర్జాతీయ స్థాయి బోధన, ట్యాబ్‌లు, ఐఎఫ్బీ, డిజిటల్ బోధన వంటివి ఒక్కసారి పాఠశాలలో కూర్చొని చూస్తే గుర్తుకు వచ్చేది వైఎస్ జగన్, వైఎస్సార్పీపీ ప్రభుత్వమే. రైతన్నకు తోడుగా నిలిచింది, రైతన్నకు సాయంగా రైతు భరోసా సొమ్మును అందించడం, రైతన్నకు తోడుగా అసైన్డ్ భూములు, 22ఏ భూములపై శాశ్వత భూ హక్కులు అందించడంలో అడుగులు వేగంగా పడ్డాయి. ► ప్రొద్దుటూరు గడ్డపై లక్షల సంఖ్యలో ఉన్న సింహాల గర్జన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇంతటి గొప్ప సభ గతంలో ఇక్కడ ఎప్పుడూ లేదు. జనసంద్రం కని్పస్తోంది. దుష్ట చతుష్టయాన్ని నిలువరించడమే లక్ష్యంగా ఎన్నికల సమరంలో పోరాడేందుకు గాండీవంతో అర్జునుడిగా నేను సిద్ధం.. శ్రీకృష్ణులుగా మీరు పాంచజన్యం పూరించేందుకు సిద్దమా? (ముక్తకంఠంతో మేమంతా సిద్ధమేనని జనం బదులిచ్చారు). సామాజిక న్యాయానికి పెద్దపీట ► నిరుపేదలకు తోడుగా సామాజిక న్యాయాన్ని చేతల్లో అమలు చేసి చూపిస్తున్న ప్రభుత్వం మనదే. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేదలందరికీ కులం, మతం, రాజకీయం చూడకుండా సామాజిక న్యాయం అమలు చేసి చూపెట్టాం. ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి ఎస్సీలను తూలనాడితే వారు ఎలా బతుకుతారు? మైనార్టీల నాలుగు శాతం రిజర్వేషన్లపై చెలగాటమాడితే వారంతా ఎక్కడికి వెళ్లాలి? ► స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో నాలుగు లక్షల ఉద్యోగాలు భర్తీ కాగా, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం. ఈ ఉద్యోగాల్లో 80 శాతం నా.. నా.. నా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలే ఉద్యోగాలు పొందడం సామాజిక న్యాయం కాదా? రాష్ట్రంలో 31 లక్షల ఇళ్లను అక్కాచెల్లెమ్మల పేరుమీద ఇచ్చాం. ఇందులో 22 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. ఒక్క ప్రొద్దుటూరులోనే 24 వేల ఇళ్ల పట్టాలు ఇచ్చింది మీ బిడ్డ వైఎస్ జగనే. ప్రతి అక్క, చెల్లెమ్మకు రూ.5–20 లక్షల వరకు ఆస్తిని ఇంటి రూపంలో ఇస్తోంది వైఎస్సార్సీసీ ప్రభుత్వమే. ► అక్కచెల్లెమ్మలకు 50 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా చట్టం చేసి సామాజిక న్యాయం అమలు చేశాం. అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం తదితర పథకాలన్నీ మహిళా సాధికారతను తీసుకు వచ్చాయి. అక్కాచెల్లెమ్మలు ధైర్యంగా బయటికి వస్తే దిశ యాప్ ఉంది. రక్షణ కోసం గ్రామాల్లో మహిళా పోలీసులను ఏర్పాటు చేశాం. ► గ్రామాల్లో నాలుగు అడుగులు వేయగానే విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది. ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష కార్యక్రమాలతో అందరికీ ఉచితంగా పరీక్షలు, మందుల పంపిణీ సాధ్యమైంది. 104, 108 కొత్త అంబులెన్స్‌లు కుయ్... కుయ్ మంటూ సేవలు అందిస్తున్నాయి. దివంగత మహానేత డాక్టర్ వైఎస్సార్ పేద ప్రజల కోసం ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంటు పథకాలు తీసుకు రాగా, ఆయన తనయుడిగా మీ బిడ్డ ఆరోగ్యశ్రీని మరింత ఉన్నతీకరించి రూ. 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందేలా చేశారు. రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కళాశాలల ఏర్పాటు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తున్నాం. 10 షిప్పింగ్ హార్బర్లు నిర్మాణంలో ఉన్నాయి. ఎయిర్‌పోర్టుల విస్తరణపై దృష్టి సారించాం. పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా పక్కనే ఉన్న బద్వేలులో సెంచురీ ఫ్లై బోర్డ్ పరిశ్రమను ప్రారంభించాం. రాష్ట్రంలో పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్నాయి. కోవిడ్ ఉన్నా ఎక్కడా తగ్గకుండా, సాకులు చెప్పకుండా మీ అవసరం రాష్ట్ర అవసరంగా భావించి 58 నెలల కాలంలో 130 సార్లు బటన్ నొక్కాను. విలువలకు అండగా నిలవాలి ► 2014లో మోదీ, దత్తపుత్రుడితో కలిసి చంద్రబాబు ఎన్నికలకు వెళ్లారు. ఎన్నికల సమయంలో వారు రూపొందించిన అబద్ధాల పాంప్లేట్ ప్రతి ఇంటికి పంపారు. టీవీలు, పేపర్లలో యాడ్స్ వేశారు. రైతులకు రుణమాఫీ, పొదుపు సంఘాలకు రుణమాఫీ, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు, ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి, రూ.10 వేల కోట్ల బీసీ సబ్ ప్లాన్, సింగపూర్‌ను మించిన రాజధాని, ప్రతి జిల్లాకు హైటెక్ నగరం, మూడు సెంట్ల భూమి వంటి హామీలు ఇచ్చారు. వీటిలో ఒక్కటైనా అమలయ్యాయా? ప్రత్యేక హోదా ఇచ్చారా? (లేదు.. లేదని ప్రజల నినాదాలు) ► మళ్లీ ఇదే బ్యాచ్ ఎన్నికల్లో ఇప్పుడు ప్రజల ముందుకు వస్తోంది. వీరు కొత్త మేనిఫెస్టోలో కిలో బంగారం, బెంజ్ కారు, సూపర్ సిక్స్, సెవెన్ అంటూ మరోసారి మోసం చేసేందుకు రెడీ అయ్యారు. దేశ చరిత్రలో ఇలాంటి రాజకీయాలు ఎక్కడా లేవు. విశ్వసనీయత, విలువలకు ప్రతీకగా నిలుస్తున్న మీ బిడ్డ నోటిలో నుంచి ఒక్కమాట వస్తే దానిని అమలు చేసిన తర్వాతే ఓటు అడుగుతున్నాం. విలువల రాజకీయానికి, పొత్తుల రాజకీయానికి మధ్య జరుగుతున్న పోరులో విలువలకు అండగా నిలవాలి. ► ఫ్యాన్ ఇంట్లో ఉండాలి.. సైకిల్ ఇంటి బయట ఉండాలి.. తాగిన టీ గ్లాస్ సింక్‌లో ఉండాలి. జరుగుతున్న ఎన్నికలు పేదల భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలు. పొరపాటు జరిగితే పేదల బతుకులు అంధకారమవుతాయి. ప్రతి ఇంటికి సంక్షేమం, అభివృద్ధిని కాంక్షిస్తూ పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరు సిద్దమా? (సిద్ధమే అని సెల్లో టార్చ్ ఆన్ చేసి చేతులు పైకెత్తారు.) ► 175 ఎమ్మెల్యే స్థానాలు, 25 ఎంపీ స్థానాలు సాధించడమే మనందరి లక్ష్యం. పేదవాడికి మంచి చేయడంలో ఎక్కడా తగ్గలేదు. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ స్థానం కూడా తగ్గడానికి వీలు లేదు. ► ఒకే ఒక్కడి మీదకు ఒంటరిగా వచ్చే ధైర్యం ఎవరికీ లేకపోవడానికి కారణం దేవుడి దయ, కోట్లాది మంది ప్రజల గుండెల్లో చోటు ఉండడమే. 75 సంవత్సరాల చంద్రబాబు అధికారం దక్కిన వెంటనే మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేస్తారు. మళ్లీ ఎన్నికల సమయానికి కొత్త మేనిఫెస్టో, కొత్త వాగ్దానాలతో రొటీన్‌గా వంచన చేస్తారు. ఎన్నికల్లో తిట్టిన పార్టీలతోనే ఏమాత్రం సిగ్గు లేకుండా జత కడతారు. ఢిల్లీ దాక వెళ్లి కాళ్లయినా పట్టుకుంటారు. విశ్వసనీయత, విలువలు లేని వీళ్ల రాజకీయాలు ఎవరికి స్ఫూర్తినిస్తాయి? మన మంచిని ప్రతి ఇంటా చెప్పాలి మన ప్రభుత్వం పరిపాలనలో కొత్త ఒరవడిని తీసుకొచ్చిందని, మనం చేసిన మంచిని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. అమ్మ ఒడి, చేయూత, సున్నా వడ్డీ పథకం, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, రైతు భరోసా, వాహనమిత్ర మొదలు నేతన్న నేస్తం వరకు మనం అందించే పథకాల ద్వారా లబ్ధి పొందిన విషయాలను ఇంటింటికి తీసుకువెళ్లండి. ఈ పథకాలన్నీ అమలు కావాలన్నా, అవ్వాతాతలకు పెన్షన్లు సకాలంలో రావాలన్నా, మెరుగైన రేషన్ ఇంటికి రావాలన్నా, నాణ్యమైన విద్య, విదేశీ విద్య, వంద శాతం ఫీజు రీయింబర్స్మెంట్, పేదవాడికి మెరుగైన వైద్యం, ఆర్బీకేలు, రైతు భరోసా, తొమ్మిది గంటల ఉచిత విద్యుత్, ఇన్‌ఫుట్ సబ్సిడీ తదితర పథకాలన్నీ కొనసాగాలంటే ‘జగన్ రావాలి...వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రావాలి’ అని తెలియజేయాలి. ఆత్మీయంగా అభ్యర్థుల పరిచయం ‘కడప పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న నా తమ్ముడు వైఎస్ అవినాష్‌రెడ్డి, ప్రొద్దుటూరు నుంచి పోటీ చేస్తున్న సోదరుడు ప్రసాద్‌రెడ్డి, కమలాపురం నుంచి మామ పి.రవీంద్రనాథ్‌రెడ్డి, బద్వేలు నుంచి పోటీ చేస్తున్న సోదరి డాక్టర్ సుధమ్మ, జమ్మలమడుగు నుంచి పోటీ చేస్తున్న సోదరుడు సుధీర్‌రెడ్డి, కడప నుంచి పోటీ చేస్తున్న నవాబ్ సాబ్ అంజద్‌బాష, మైదుకూరు నుంచి పోటీ చేస్తున్న పితృ సమానులైన ఎస్.రఘురామిరెడ్డి, పులివెందుల నుంచి పోటీ చేస్తున్న నాపై మీ అందరి చల్లని ఆశీస్సులు ఉంచాలి’ అని సీఎం జగన్ కోరారు. అనంతరం వేదికపై ఉన్న నాయకులను పేరుపేరునా పలకరిస్తూ యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అందరి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా పాలన ప్రజల ఆత్మగౌరవాన్ని నిలిపేలా జగనన్న పరిపాలన కొనసాగుతోంది. ఈ ఐదేళ్లలో ఆయన ఆలోచనలతో విప్లవాత్మక మార్పులు సాకారమయ్యాయి. సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ హెల్త్ క్లినిక్స్ మన కళ్లెదుటే కనిపిస్తున్నాయి. పరిపాలనను గ్రామ స్థాయికి, ప్రభుత్వ సేవలను ఇంటివద్దకే చేర్చారు. ఇవాళ ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు. పెన్షన్లు, ఇళ్ల కోసం ఏ ఒక్కరి దగ్గరికీ వెళ్లి చేయి చాచాల్సిన పనిలేదు. రెండేళ్లు కోవిడ్‌తో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ప్రతి వాగ్దానాన్ని జగనన్న నిలబెట్టుకున్నారు. ప్రొద్దుటూరులో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వ స్థలం అందుబాటులో లేకపోవడంతో జగనన్న ప్రభుత్వం రూ.200 కోట్లను వెచ్చించి స్థలం కొనుగోలు చేసి 25 వేల మందికి ఇళ్ల పట్టాలిచ్చింది. ఇవాళ గండికోటలో 27 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోగలుగుతున్నాం. జగనన్న ప్రభుత్వం రాకముందు కనీసం ఐదు టీఎంసీలు కూడా అక్కడ నిల్వ చేయలేని దుస్థితి. దాదాపు రూ.900 కోట్లు ఖర్చు చేసి ఇవాళ అక్కడ 27 టీఎంసీల నీటిని స్టోరేజీ చేసుకుంటున్నాం. సీబీఆర్‌లో 10 టీఎంసీల నీటిని నిల్వ చేశాం. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో నింపుతున్నాం. ప్రభుత్వాన్ని వేలెత్తి చూపే పరిస్థితి లేకపోవడంతో విపక్షాలు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాయి. చంద్రబాబుకు బలం, ధైర్యం లేవు కాబట్టే జనసేన, బీజేపీని తోడు తెచ్చుకున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా కాంగ్రెస్‌తో కూడా పొత్తు పెట్టుకున్నారు. ఎంతమంది పొత్తులు పెట్టుకున్నా సరే జగనన్నకు తిరుగులేదు. – వైఎస్ అవినాష్‌రెడ్డి, కడప ఎంపీ మళ్లీ మీరే సీఎం.. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో సీఎం జగన్ తొలి సభను నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నియోజకవర్గంలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ.1,700 కోట్లను అక్కచెల్లెమ్మలకు సీఎం జగన్ అందించారు. దాదాపు రూ.1,300 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టగా, 24 వేల ఇళ్ల పట్టాలు ఇచ్చి పేదల సొంతింటి కలను నెరవేర్చారు. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో వైఎస్ జగన్ మరోమారు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయం. ఉమ్మడి కడప జిల్లాలో అన్ని స్థానాలను గెలుచుకుంటాం. – రాచమల్లు శివప్రసాదరెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే -
Proddatur Meeting Photos: దద్దరిల్లిన ప్రొద్దుటూరు.. విపక్షాలకు వణుకు పుట్టేలా..(ఫొటోలు)
-
తరగని అభిమానం.. చెదరని ప్రేమ.. ఇది కేవలం జగనన్నకు మాత్రమే సాధ్యం (ఫొటోలు)
-
CM Jagan Bus Yatra Photos: బస్సు యాత్రలో జననేత జగనన్నకు సాదర స్వాగతం (ఫొటోలు)
-
‘మేమంతా సిద్ధం’ వైఎస్సార్ ఆశీస్సులు తీసుకున్న సీఎం జగన్ (ఫొటోలు)
-
అందరి బాగు కోసం రెండు బటన్లు నొక్కండి: సీఎం జగన్
Memantha Siddham Bus Yatra Updates పేదల భవిష్యత్ ఈ ఎన్నికలపై ఆధారపడి ఉంది: సీఎం జగన్ 2014లోనూ ఈ కూటమి మోసపూరిత హామీలిచ్చాయి. రైతు రుణమాఫీ అన్నాడు.. మోసం చేశాడు పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానన్నాడు.. చేశాడా? పేదల ఖాతాల్లో బాబు ఒక్క రూపాయి అయినా వేశారా? నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు.. ఇచ్చాడా? మూడు సెంట్లు స్థలం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా? ఇదే బ్యాచ్.. మళ్లీ ఇప్పుడు ఒక్కటయ్యారు ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి.. సైకిల్‌ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ సింకులోనే ఉండాలి ప్రతి ఇంటికి సంక్షేమం అందాలంటే మళ్లీ మీ జగనే రావాలి ప్రతి ఇంటికి రేషన్ రావాలంటే మళ్లీ జగనన్నే రావాలి పేదల భవిష్యత్ బాగుండాలంటే మళ్లీ మీ జగనన్నే రావాలి మీరే నాకు స్టార్ క్యాంపెయినర్లు ప్రతి ఇంటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని చెప్పాలి గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగుపడాలన్నా మళ్లీ జగన్‌ను గెలిపించండి జగనన్న ముఖ్యమంత్రి అయితేనే రైతన్న ముఖంలో సంతోషం నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నగదు పడాలన్నా జగన్ననే ముఖ్యమంత్రి అవ్వాలి చంద్రముఖి చెడద పోవాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటేయాలి చంద్రబాబు చేసేది శవ రాజకీయాలు, కుట్రలు: సీఎం జగన్ ఈనాడు పేపర్‌ను చూస్తే.. ఛీ ఇదీ ఒక పేపరేనా అనిపిస్తోంది చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ, నా ఇద్దరు చెల్లెలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 కలిసి ఒకే ఒక్కడిపై యుద్ధం చేస్తున్నారు. వీరెవరికి ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదు నాకు దేవుడు, ప్రజలు అండగా ఉన్నారు అధికారం కోసం చంద్రబాబు అందరికి కాళ్లు పట్టుకుంటున్నారు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ప్రతి గ్రామంలోనూ అభివృద్ధి, సంక్షేమాన్ని చేసి చూపించాం ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తున్నాం రూ.3 వేలు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం, దేశంలోనే ఎక్కడా లేదు పెన్షన్ కోసం ప్రతి ఏడాది రూ.24 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం సీఎం జగన్ ప్రసంగం@ ప్రొద్దుటూరు బహిరంగ సభ నా విజయాలకు కారణమైన మీ అందరికీ కృతజ్ఞతలు: సీఎం జగన్ 58 నెలల పాలనలో ప్రతి రంగంలోనూ మార్పులు తీసుకొచ్చాం రూ.2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో జమ చేశాం వైఎస్సార్ జిల్లా నేలమీద.. ఈ పొద్దుటూరు గడ్డమీద.. నన్ను మీ బిడ్డగా భావించి నిరంతరం కాపాడుకుని ఎవరు ఎన్ని కష్టాలు పెట్టినా.. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఎన్ని సమస్యలు సృష్టించినా నన్ను కాపాడుకున్న మీకు పేరు పేరునా కృతజ్ఞతలు ఈ రోజు నా ముందు కనిపిస్తున్న స్థాయిలో ఈ జిల్లాలో ఎప్పుడూ సమావేశం జరిగి ఉండదు. ఓ మహా సముద్రం కనిపిస్తోంది. మంచికి మద్దతు పలికే ఇంతటి మహా ప్రజా సైన్యం మధ్య మన ప్రజా జైత్రయాత్రకు ముందు వరసలో మన వైఎస్సార్సీపీ పార్టీ జెండా తలెత్తుకుని ఎగురుతోంది ఇక్కడే అధికారాన్ని పేదల భవిష్యత్తు కోసం రైతులు, అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, భావితరాలు, మన గ్రామాలు, ఇంటింటి అభివృద్ధి, సంక్షేమం కోసం ఒక బాధ్యతగా ఈ 58 నెలల పాలనలో ప్రతి రంగంలోనూ విప్లవానికి మారుపేరుగా మార్పులు తీసుకొచ్చాం. ఎప్పుడూ జరగని విధంగా.. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా రూ.2.70 లక్షల కోట్ల రూపాయలు లంచాలు, వివక్ష అనేవి లేకుండా నేరుగా ప్రజల చేతుల్లో ఉంచి ప్రజా ప్రభుత్వ అజెండా.. ఇక్కడ కనిపిస్తున్న మన జెండా కాబట్టే చెబుతున్నా ఈ జెండా తలెత్తుకుని ఎగురుతోంది అని.. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా, చూసినా కోట్ల గుండెలు, మన పార్టీకి, ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ 2024 ఎన్నికల సమరానికి సిద్ధం అంటున్నాయి! కాబట్టే ఈ జెండా మరే ఇతర జెండాతోనూ జతకట్టడం లేదు.. లక్షల సింహాల గర్జన... చరిత్రలో చిరస్థాయిగా గుర్తుండి పోతుంది. గట్టిగా గర్జించండి.. మేమంతా సిద్ధమేనని! పేదల ఇంటింటి అభివృద్ధికి అడ్డుపడుతున్నా ఈ దుష్ట చతుష్టయాన్ని చిత్తుగా ఓడించేందుకు పాంచజన్యం పూరించేందుకు శ్రీకృష్ణుడిలా మీరంతా సిద్ధమేనా? మీ అర్జునుడు సిద్ధంగానే ఉన్నాడు! మే 13న ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేసి మరో వంద మందికి చెప్పి ఓట్లు వేయించి మనందరి పార్టీని గెలిపించేందుకు, అభివృద్ధి నిరోధకులను పేదల వ్యతిరేకులను ఓడించేందుకు మీరంతా సిద్ధమేనా? 2024 ఎన్నికల సమరానికి సిద్ధంగా ఉన్నాం నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబు 45 ఏళ్ల అనుభవం ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబుకు మేనిఫెస్టో గుర్తుకొస్తుంది ఎన్నికలయ్యాక బాబు ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తాడు వైఎస్ వివేకాను ఎవరు చంపారో అందరికి తెలుసు హంతకుడికి నా వాళ్లు మద్దతిస్తున్నారు పేదల భవిష్యత్తుకు అడ్డుపడుతున్న దుష్ట చతుష్టయాన్ని ఓడించాలి దుష్టచతుష్టయాన్ని ఓడించేందుకు మీ అర్జునుడు సిద్ధం నేను దేవుడు, ప్రజలనే నమ్ముకున్నా చంద్రబాబు మేనిఫెస్టోలోని 10 శాతం హామీలను కూడా నెరవేర్చలేదు మన మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చిన ఘనత మనది చంద్రబాబు వదిన గారి చుట్టం కంపెనీకి బ్రెజిల్ నుంచి డ్రగ్ వచ్చాయి తప్పు చేసేది వారు.. నెపం నెట్టేది మనపై ప్రొద్దుటూరులో వైఎస్సార్సీపీ భారీ బహిరంగ సభ పేదల సొంతింటి కలను సీఎం జగన్ నెరవేర్చారు: రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి 175కు 175 సీట్లు గెలవడమే మన టార్గెట్ సీఎం జగన్‌కు అండగా మేమంతా సిద్ధం: వైఎస్ అవినాష్‌రెడ్డి ఇచ్చిన ప్రతీ హామీని సీఎం జగన్ నెరవేర్చారు ప్రొద్దుటూరుకి చేరుకున్న సీఎం జగన్ ప్రొద్దుటూరు లోకి ప్రవేశించిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర సీఎం జగన్‌కు సాదర స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు, అభిమానులు మరికాసేపట్లో బహిరంగ సభ ప్రాంగణంకు చేరుకోనున్న సీఎం జగన్ ఎర్రగుంట్ల రోడ్డులోని రెడ్డి కల్యాణ మండపం వద్ద సీఎం జగన్‌కు స్వాగతం పలికేందుకు ఎదురు చూస్తున్న ప్రొద్దుటూరు ఎమ్మేల్యే రాచమల్లు శివప్రసాద్ బస్సుయాత్రకు జనం జైత్ర యాత్ర అశేషంగా కదలివచ్చిన ప్రజలు పల్లెపల్లెల నుంచి కదం తొక్కిన జనం జనంతో కిక్కిరిసిన వేంపల్లె ప్రధాన రహదారి బస్సు యాత్రకు ఘనస్వాగతం పలికేందుకు మారుమూల గ్రామాల నుంచి ప్రధాన రహదారికి తరలివచ్చిన పల్లె ప్రజల జగన్‌ను చూసేందుకు సుదీర్ఘ నిరీక్షణ.. టెంట్లు వేసుకుని, భోజనాలు ఏర్పాటు చేసుకుంటూ దారిపొడవునా సీఎం జగన్ కోసం నిరీక్షణ రోడ్‌షోలో జగన్‌ను చూసిన వెంటనే హర్షధ్యానాలు, కేరింతలతో స్వాగతం పలికిన జనం అడుగడుగునా పూలతో సీఎం జగన్‌కు ఆత్మీయ స్వాగతం పలికిన ప్రజలు వెల్లువెత్తిన జనంతో అనుకున్న సమయం కన్నా ఆలస్యంగా నడుస్తున్న బస్సుయాత్ర జనసంద్రంగా మారిన ఎర్రగుంట్ల మెయిన్ రోడ్డు ఎర్రగుంట్లలో రోడ్డుకిరువైపులా కిక్కిరిసిన జనం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అపూర్వస్వాగతం ప్రొద్దుటూరులో జయహో జగన్ జయహో జగన్ నినాదాలతో మారుమోగుతున్న ప్రొద్దుటూరు సభా ప్రాంగణం కాసేపట్లో ప్రొద్దుటూరుకు చేరుకోనున్న మేమంతా సిద్ధం యాత్ర బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించనున్న సీఎం జగన్ ఎండను సైతం లెక్క చేయకుండా.. జనసంద్రంగా యర్రగుంట్ల రోడ్లు మధ్యాహ్నం 2గంటల నుండి రోడ్ల మీద బారులు తీరిన ప్రజలు సీఎం జగన్ రాక కోసం వేచి ఎదురుచూపులు సాయంత్రానికి భారీగా వచ్చిన జనం కాసేపట్లో ప్రొద్దుటూరు బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం జగన్ ► యర్రగుంట్ల మండల పెద్దనపాడు దాటిన బస్సు యాత్ర ► మేమంతా సిద్ధం మొదటి రోజు.. వీరపనాయనిపల్లి మండలంలో ముగిసిన సీఎం జగన్ బస్సు యాత్ర జగనన్న సాయ గుణం మరువడు ఎన్నికల వేళ.. జన క్షేత్రంలోకి సీఎం జగన్ మేమంతా సిద్ధం ప్రచార యాత్ర ప్రారంభం దారి పొడవునా స్వాగతం పలుకుతున్న జనం ప్రచారంలోనూ సాయ గుణం మరువని జగన్ తనను కలిసి సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారి నుంచి వినతిపత్రాలు స్వీకరించిన సీఎం వైఎస్ జగన్ ప్రొద్దుటూరులో బహిరంగ సభ కాసేపట్లో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభ సభకు భారీగా తరలివస్తున్న పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అభిమాన నాయకుడ్ని చూసేందుకు పోటెత్తుతున్న అబిమాన గణం కాసేపట్లో సభా వేదిక వద్దకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా చేరుకోనున్న సీఎం జగన్ రేపటి మేమంతా సిద్ధం యాత్ర షెడ్యూల్ రెండోరోజు.. రేపు కర్నూల్, నంద్యాలలో సీఎం జగన్ ప్రచార యాత్ర ఉదయం 9గం.30ని. ఆళ్లగడ్డ నుంచి బయల్దేరనున్న సీఎం జగన్ 10గం.30ని.కి ఎర్రగుంట్లకు చేరిక గంటపాటు ఎర్రగుంట్లలో ప్రజలతో మమేకం 11గం.30ని. ఎర్రగుంట్ల వేదిక నుంచి బయల్దేరనున్న సీఎం జగన్ వెంకటపురం, గోవిందపల్లి నుంచి రైతునగరం క్రాస్‌కు చేరిక రైతునగరం క్రాస్ వద్ద భోజన విరామం రైతు నగరం క్రాస్ నుంచి నూనెపల్లి, ఎస్పీజీ గ్రౌండ్స్ మీదుగా నంద్యాల చేరిక నంద్యాలలో బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్ సాయంత్రం నంద్యాల సభా వేదిక నుంచి పాణ్యం, కల్వబుగ్గ, ఓర్వకల్, కర్నూల్ క్రాస్, పెద్దటేకురు మీదుగా నాగలపురం చేరిక రాత్రికి నాగలపురంలోనే బస ప్రొద్దుటూరులో సభాస్థలి వద్ద దృశ్యాలు ప్రొద్దుటూరు లో జరుగనున్న మేమంతా సిద్ధం బహిరంగ సభకు తరలి వస్తున్న అశేష జనవాహిని కమలాపురం నియోజకవర్గంలో కొనసాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర వీరపునాయుని పల్లెలో సీఎం జగన్ బస్సు యాత్ర కోసం వేచి ఉన్న ప్రజలు కాసేపట్లో ప్రొద్దుటూరుకు.. కొనసాగుతున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కాసేపట్లో ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభ కడప పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం తొలి బహిరంగ సభ లక్షల మంది హాజరవుతారనే అంచనా ప్రొద్దుటూరు క్రాస్ వద్దకు చేరుకున్న బస్సు యాత్ర సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రొద్దుటూరు క్రాస్ వద్దకు చేరుకుంది వేంపల్లి హనుమాన్ జంక్షన్ వద్ద ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం జగన్ వేంపల్లి హనుమాన్ జంక్షన్ వద్ద బారులు తీరిన జనం వేంపల్లెలో సీఎం జగన్ వేంపల్లె నాలుగు రోడ్ల కూడలికి చేరుకున్న సీఎం జగన్ బస్సు యాత్ర భారీగా జన సందోహం కడప పార్లమెంట్ స్థానాల పరిధిలో సాగుతున్న ప్రచార యాత్ర సాయంత్రం ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభ కాసేపట్లో వీరపునాయునిపల్లె, యర్రగుంట్ల మీదగా పొద్దుటూరు చేరుకోనున్న బస్సు యాత్ర కుమ్మరాంపల్లె వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు స్వాగతం పలికిన ప్రజలు. జగనన్నకు స్వాగతం పలికేందుకు.. సీఎం జగన్ బస్సు యాత్రకు స్వాగతం పలికేందుకు తరలిన ప్రజానీకం మేమంతా సిద్ధం పేరుతో జనంలోకి సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర వీరపనాయనిపల్లి మండలంలోని తంగేడు పల్లి క్రాస్ రోడ్డు వద్ద ఎదురు చూస్తున్న మహిళలు ప్రారంభమైన సీఎం జగన్ బస్సు యాత్ర ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన మేమంతా సిద్ధం యాత్ర ఎన్నికల ప్రచారం ప్రారంభించిన సీఎం జగన్ వైఎస్సార్ ఘాట్ ప్రాంగణం నుంచి కదిలిన ‘మేమంతా సిద్ధం’ జగన్నాథ రథచక్రాలు ఇవాళ కడప పార్లమెంట్ స్థానాల పరిధిలో సాగనున్న ప్రచార యాత్ర సాయంత్రం ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభ వైఎస్సార్ ఘాట్ వద్ద అభిమానుతో సీఎం జగన్ సెల్ఫీ అన్న తో సెల్ఫీ కాదు.. అన్నే తీసిన సెల్ఫీ! వైఎస్సార్ ఘాట్ వద్ద మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభానికి ముందు అభిమానుల ఉత్సాహం సెల్ఫీ కోసం యత్నించిన యువకుల ఫోన్ తీసుకుని తానే సెల్ఫీ దించిన సీఎం జగన్ సీఎం జగన్ సర్వమత ప్రార్థనలు వైఎస్సార్ ఘాట్ వద్ద సర్వమత ప్రార్థనల్లో పాల్గొంటున్న సీఎం జగన్ మూడు మతాల పెద్దల నుంచి ఆశీర్వాదం తీసుకున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం.. తొలిరోజు ఇలా.. ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ నుంచి మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభం వేంపల్లి మీదుగా.. కమలాపురం నియోజకవర్గం వీఎన్ పల్లి మీదుగా.. జమ్మలమడుగు నియోజకవర్గం, యెర్రగుంట్ల ప్రొద్దుటూరు జంక్షన్ మీదుగా.. జమ్మలమడుగు నియోజకవర్గం పొట్లదుట్టి మీదుగా.. ప్రొద్దుటూరు నియోజకవర్గం ప్రొద్దుటూరు టౌన్‌కు చేరిక సాయంత్రం ప్రొద్దుటూర్ టౌన్లో సిద్ధం సభ ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ వైఎస్సార్ విగ్రహానికి పూలతో నివాళులు అర్పించిన సీఎం జగన్ మరికాసేపట్లో బస్సు యాత్ర ప్రారంభం మరికాసేపట్లో సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం వైఎస్సార్ ఘాట్ వద్ద ముగిసిన ప్రార్థనలు మరికాసేపట్లో మేమంతా సిద్ధం బస్సు యాత్ర మొదలుపెట్టనున్న సీఎం జగన్ ఎన్నికల ప్రచార భేరికి శ్రీకారం చుట్టనున్న సీఎం జగన్ మహానేత వైఎస్సార్‌కు నివాళులర్పించి..ఆశీస్సులు తీసుకున్న సీఎం జగన్ వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులు ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద తండ్రి, దివంగత మహానేత వైఎస్సార్‌కు నివాళులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న సీఎం జగన్ ప్రార్థనల్లో సీఎం జగన్ తల్లి విజయమ్మ, పార్టీ నేతలు దివంగత వైఎస్సార్, తల్లి విజయమ్మ ఆశీస్సులతో యాత్ర ప్రారంభించనున్న సీఎం జగన్ మేమంతా సిద్దం పేరుతో రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర.. బహిరంగ సభలు 21 రోజుల పాటు క్షేత్రస్థాయిలోనే ఉండనున్న సీఎం జగన్ వైఎస్ఆర్ ఘాట్ వద్ద సీఎం జగన్ తల్లి విజయమ్మతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్న సీఎం జగన్ వైఎస్సార్ ఘాట్ వద్ద.. ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభం ప్రార్థనల్లో వైఎస్ విజయమ్మ, వైఎస్సార్సీపీ నేతలు ఇడుపులపాయ చేరుకున్న సీఎం జగన్ హెలిప్యాడ్ వద్ద నుంచి ఘాట్ వద్దకు చేరుకుంటున్న సీఎం జగన్ కడపకు చేరుకున్న సీఎం జగన్ మరికాసేపట్లో ఇడుపులపాయకు 'సీఎం జగన్ దివంగత మహానేత వైఎస్సార్‌కు వైఎస్ ఘాట్ వద్ద ప్రార్దనలు నిర్వహించనున్న సీఎం జగన్ అనంతరం మేము సైతం బస్సు యాత్రను ప్రారంభించనున్న సీఎం జగన్ ఇడుపులపాయ చేరుకున్న వైఎస్ విజయమ్మ ఇడుపులపాయ చేరుకున్న వైఎస్ విజయమ్మ వైఎస్ ఘాట్ వద్ద కాసేపట్లో ప్రత్యేక ప్రార్థనలు సీఎం జగన్‌తో కలిసి ప్రార్థనల్లో పాల్గొననున్న విజయమ్మ ►తాడేపల్లి నుంచి ఇడుపులపాయకు బయలుదేరిన సీఎం జగన్. ►గన్నవరం విమానాశ్రయం చేరుకున్న సీఎం జగన్. అక్కడి నుంచి కడపకు బయలుదేరిన జగనన్న. ►వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్న వస్తున్నాడు 🔥✊🏻#MemanthaSiddham pic.twitter.com/c4vJKgwwLq — Jagananna Connects (@JaganannaCNCTS) March 27, 2024 ►అనంతరం బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ►కాసేపట్లో తాడేపల్లి నుంచి ఇడుపులపాయకు బయలుదేరనున్న సీఎం జగన్. ►ఇడుపులపాయలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోసం భారీగా తరలివచ్చిన అభిమానులు. ప్రజాక్షేత్రంలో పేదోళ్లని గెలిపించేందుకు.. మేమంతా సిద్ధం యాత్రకి తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరిన జగనన్న!#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/f3SwjPEkQ3 — YSR Congress Party (@YSRCParty) March 27, 2024 ►సీఎం జగన్ కోసం ప్రత్యేకంగా లెదర్ చెప్పులు తయారుచేసుకుని తెచ్చిన ఓ అభిమాని. ►ఇడుపులపాయ.. సీఎం జగన్ బస్సుయాత్రకు ముస్తాబైన ఇడుపులపాయ pic.twitter.com/kZBbYLmvID — Rahul (@2024YCP) March 27, 2024 ►పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రగతిపథంలో నిలిపేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచారభేరి మోగించనున్నారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నివాళులు అర్పించిన అనంతరం ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను ప్రారంభిస్తారు. తొలి రోజు బస్సు యాత్ర కడప పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జరగనుంది. Memantha Siddham - Day 1 ఈరోజు నుంచి మేమంతా సిద్ధం యాత్రతో జనంలోకి జగనన్న! జననేతతో చేయి కలిపేందుకు మీరంతా సిద్ధమా✊🏻#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/K3NyVdRZPe — YSR Congress Party (@YSRCParty) March 27, 2024 ►ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం 21 రోజులపాటు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తూ ‘సిద్ధం’ సభలు నిర్వహించిన నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు మినహా మిగతా పార్లమెంట్ స్థానాల పరిధిలో బస్సు యాత్రను నిర్వహించనున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తాను చేసిన ప్రజా సంకల్ప పాదయాత్ర తరహాలోనే బస్సు యాత్రలోనూ రోజూ ఉదయం వివిధ వర్గాల ప్రజలు, మేధావులతో సీఎం జగన్ మమేకమవుతారు. ప్రభుత్వ పనితీరును మరింతగా మెరుగుపర్చుకోవడానికి వారి నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. సాయంత్రం ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. A special illustration will be released today at 10:00 AM in tribute to our leader, @ysjagan garu, as he kickstarts the #MemanthaSiddham Yatra. Stay tuned!#YSJaganAgain pic.twitter.com/f0UmuPTXiW — YSR Congress Party (@YSRCParty) March 27, 2024 తొలి రోజు యాత్ర ఇలా.. ► సీఎం జగన్ ఈరోజు ఉదయం తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు ఇడుపులపాయకు చేరుకుంటారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు. ►మధ్యాహ్నం 1.30 గంటలకు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను సీఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తారు. ► ఇడుపులపాయ నుంచి కుమారునిపల్లి, వేంపల్లి, సర్వరాజుపేట, వీరపునాయనిపల్లి (కమలాపురం), గంగిరెడ్డిపల్లి, ఊరుటూరు, యర్రగుంట్ల (జమ్మలమడుగు), పోట్లదుర్తి మీదుగా సాయంత్రం 4.30 గంటలకి ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డు సమీపంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభ వద్దకు సీఎం జగన్ చేరుకుంటారు. బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ► అనంతరం సున్నపురాళ్లపల్లి, దువ్వూరు, జిల్లెల, నాగలపాడు, బోధనం, రాంపల్లె క్రాస్, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన శిబిరం వద్దకు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. ఇది నాయకుడి మీద నమ్మకంతో వచ్చిన సైన్యం🔥 దుష్ట చతుష్టయంతో యుద్ధానికి నేను సిద్ధం.. మరో గొప్ప ప్రజా విజయాన్ని సాధించేందుకు మీరు సిద్ధమా✊🏻#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/cBrPETLAGn — YSR Congress Party (@YSRCParty) March 26, 2024 వైఎస్సార్సీపీ శ్రేణుల్లో జోష్ ►చేసిన మంచిని ప్రతి ఇంటికి వివరించి ప్రజల ఆశీర్వాదం తీసుకునేందుకు చేపట్టిన గడప గడపకూ మన ప్రభుత్వం, వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాలకు జనం బ్రహ్మరథం పట్టారు. సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో బలంగా నాటుకుపోయిన నమ్మకాన్ని ఈ రెండు కార్యక్రమాలు ప్రతిబింబించాయి. గత 58 నెలల పాలనలో సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా ప్రతి ఇంటా.. ప్రతి గ్రామం.. ప్రతి నియోజకవర్గంలో విప్లవాత్మక మార్పులు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నప్పుడు 175కు 175 శాసనసభ స్థానాలు, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయబావుటా ఎగురవేయడం కచ్చితంగా సాధ్యమేనని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ సీఎం జగన్ సిద్ధం సభలు నిర్వహించారు. ►భీమిలి (ఉత్తరాంధ్ర), దెందులూరు (ఉత్తర కోస్తా), రాప్తాడు (రాయలసీమ), మేదరమెట్ల (ఉత్తర కోస్తా)లలో నిర్వహించిన నాలుగు సభలకు జనం కడలితో పోటీపడుతూ పోటెత్తడంతో ఒకదానికి మించి మరొకటి గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడు, మేదరమెట్ల సభలు అతి పెద్ద ప్రజాసభలుగా నిలిచిపోయాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందే వైఎస్సార్సీపీ మరోసారి ప్రభంజనం సృష్టించడం ఖాయమని సిద్ధం సభలతో తేటతెల్లమైందని రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు. ►జనసేన–బీజేపీతో టీడీపీ జతకట్టినా... సార్వత్రిక ఎన్నికల్లో వార్ వన్‌సైడేనని, వైఎస్సార్సీపీ మరోసారి చారిత్రక విజయం సాధించడం తథ్యమని టైమ్స్‌నౌ–ఈటీజీ, జీన్యూస్–మాట్రిజ్ లాంటి డజనుకుపైగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థల సర్వేలు తేల్చి చెప్పాయి. ఇప్పటికే 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించిన సీఎం జగన్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి ముందే బస్సు యాత్ర ద్వారా తొలి విడత ప్రచారాన్ని పూర్తి చేసేందుకు సిద్ధమవడంతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నయా జోష్ కనిపిస్తోంది. -
ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక సాధికార సారథి జగన్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
27 నుంచి సీఎం వైఎస్ జగన్ 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర
సాక్షి, అమరావతి: పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు.. మరోసారి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుని అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 27న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రచార భేరి మోగించనున్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించి.. ఎన్నికల సంగ్రామానికి ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు దాదాపు 21 రోజులపాటు బస్సు యాత్ర కొనసాగనుంది. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి సిద్ధం సభలు నిర్వహించిన నాలుగు జిల్లాలు (విశాఖపట్నం, ఏలూరు, అనంతపురం, బాపట్ల) మినహా మిగతా జిల్లాల్లో బస్సు యాత్ర జరగనుంది. ప్రతి రోజూ ఒక పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో ఉదయం పూట వివిధ వర్గాలు, రంగాల ప్రజలతో సీఎం జగన్ సమావేశమవుతారు. ప్రభుత్వ పనితీరును మరింతగా మెరుగు పర్చుకోవడానికి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. కొందరు పార్టీ కార్యకర్తలను, అభిమానులను కూడా కలుస్తారు. సాయంత్రం పార్లమెంట్ నియోజకవర్గంలో బహిరంగ సభ ఉంటుంది. ఆ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఈ సభకు తరలి రానున్నారు. బస్సు యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు సీఎం జగన్ పూర్తిగా ప్రజలతో మమేకం కానున్నారు. యాత్రలోనే ఎక్కడికక్కడ విడిది చేయనున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశామని చెబుతూ.. ప్రతి ఇంటికీ మేలు చేశామని వివరించనున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో వ్యవసాయ రుణాల మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి వంటి వాటితోపాటు 650 హామీలు ఇచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి.. వాటిని అమలు చేయకుండా మోసం చేయడాన్ని కూడా ప్రజలకు విశదీకరించి చెప్పనున్నారు. అప్పట్లో మోసం చేసిన కూటమి మరోసారి జట్టుకట్టి మళ్లీ వస్తోందంటూ ప్రజలను అప్రమత్తం చేయనున్నారు. మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మీ ఇంటికి మంచి జరిగి ఉంటే.. మీ బిడ్డకు అండగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేయనున్నారు. కదనోత్సాహంలో పార్టీ శ్రేణులు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసిన సీఎం జగన్.. గత 58 నెలల్లో డీబీటీ రూపంలో 2.70 లక్షల కోట్లు, నాన్ డీబీటీ రూపంలో రూ.1.79 లక్షల కోట్లు వెరసి రూ.4.49 లక్షల కోట్ల ప్రయోజనాన్ని 87 శాతం కుటుంబాలకు చేకూర్చారు. విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ, జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ద్వారా గుమ్మం వద్దకే ప్రజలకు ప్రభుత్వ సేవలను అందిస్తున్నారు. చేసిన మంచిని ప్రతి ఇంటా వివరించి.. ఆశీర్వాదం తీసుకోవడానికి చేపట్టిన ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గత 58 నెలల పాలనలో వచ్చిన విప్లవాత్మక మార్పులు ప్రతి నియోజవకర్గం, ప్రతి గ్రామం, ప్రతి ఇంటా కనిపిస్తున్నప్పుడు 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించడం సుసాధ్యమేనని సీఎం జగన్.. శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్లలో నిర్వహించిన సిద్ధం సభలకు సముద్రంతో పోటీ పడుతూ జనం హాజరయ్యారు. రాప్తాడు, మేదరమెట్ల సభలు రాష్ట్ర చరిత్రలో అతి పెద్ద ప్రజా సభలుగా నిలిచాయి. ఎన్నికలకు ముందే వైఎస్సార్సీపీ ప్రభంజనం ‘సిద్ధం’ సభల్లో కళ్లకు కట్టినట్లు కన్పించడంతో పార్టీ శ్రేణులు కదనోత్సాహంతో కదం తొక్కుతున్నాయి. క్లీన్ స్వీపే లక్ష్యంగా అడుగులు టీడీపీ–జనసేన–బీజేపీ శ్రేణులు నైతిక స్థైర్యం కోల్పోయి కకావికలమైతే.. వైఎస్సార్సీపీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. ఈ దశలో సీఎం జగన్ బస్సు యాత్ర వారిలో మరింత ఉత్సాహాన్ని నింపనుంది. క్లీన్ స్వీప్ లక్ష్యంగా ముఖ్యమంత్రి అడుగులు ముందుకు వేస్తున్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులను ‘మేం సిద్ధం.. మా బూత్ సిద్ధం.. ఎన్నికల సమరానికి మేమంతా సిద్ధం’ పేరుతో గ్రామ స్థాయి నుంచి మరింత పటిష్టంగా ఎన్నికలకు సన్నద్ధం చేసేలా సీఎం జగన్ దిశా నిర్దేశం చేస్తారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 18న విడుదల కానున్న నేపథ్యంలో, ఆలోగా తొలి దశ ప్రచారంగా బస్సు యాత్ర పూర్తి చేయాలని నిర్ణయించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక మలి విడత ప్రచారాన్ని చేపట్టనున్నారు. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి కకావికలు వైఎస్సార్సీసీ సిద్ధం సభలు సూపర్ హిట్ కావడంతో టీడీపీ శ్రేణులు కకావికలమయ్యాయి. జననేతతో టీడీపీ పొత్తు లెక్క తేలాక, రెండు పార్టీలు ఉమ్మడిగా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన జెండా సభ జనం లేక అట్టర్‌ప్లాప్ కావడంతో ఆ పార్టీల శ్రేణులు నైతిక స్థైర్యం కోల్పోయాయి. ఈ క్రమంలోనే ఒకే రోజు 175 శాసనసభ, 24 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన సీఎం వైఎస్ జగన్.. అందులో వంద స్థానాలు అంటే 50 శాతం స్థానాలను బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాలకు ఇవ్వడంతో ఆ వర్గాల్లో హర్షాతిరేకాలు మిన్నంటాయి. శాసనసభ, లోక్‌సభ నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఇంటింటా ప్రచారం చేస్తూ ప్రజా క్షేత్రంలో దూసుకెళ్తున్నారు. మరో వైపు నైతిక స్థైర్యం కోల్పోయిన శ్రేణుల్లో ధైర్యాన్ని నింపేందుకు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దల కాళ్లావేళ్లా పడి ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకున్నాక.. మూడు పార్టీలు కలిసి చిలకలూరిపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రధాని మోదీ పాల్గొన్నప్పటికీ జనం మొహం చాటేయడంతో అట్టర్ ప్లాప్ అయ్యింది. దాంతో మూడు పార్టీల కార్యకర్తలే కాదు నేతలూ పూర్తిగా డీలాపడ్డారు. -
‘సాధికారత’తో మురిసిన మంగళగిరి
సాక్షి ప్రతినిధి, గుంటూరు: బడుగు, బలహీన వర్గాల సాధికారతతో గుంటూరు జిల్లా మంగళగిరి మురిసింది. బుధవారం పట్టణంలో ఘనంగా నిర్వహించిన వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు వేలాదిగా పాల్గొన్నారు. సీఎం జగన్ నేతృత్వంలో తాము సాధించిన సాధికారతను సగర్వంగా ప్రదర్శించారు. యువత నుంచి వృద్ధుల వరకు ఈ యాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. ‘మళ్లీ నీవే ముఖ్యమంత్రివి కావాలి జగన్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త గంజి చిరంజీవి అధ్యక్షతన మిద్దె సెంటర్లో జరిగిన భారీ బహిరంగ సభలో వేలాదిగా ప్రజలు పాల్గొన్నారు. సభలో ప్రసంగించిన నేతలు సీఎం వైఎస్ జగన్ సారథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సాధించిన అభివృద్ధిని వివరించారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సామాజిక న్యాయానికి మంగళగిరే నిదర్శనమని చెప్పారు. మంగళగిరి సీటును అగ్రకులానికి చెందిన అభ్యర్థి నుంచి మార్చి బీసీలకు కేటాయించడమే బీసీలకు సీఎం జగన్ ఇస్తున్న ప్రాధాన్యతను తెలుపుతుందని అన్నారు. సామాజిక విప్లవం తెచ్చిన తొలి సీఎం జగన్ దేశంలో సామాజిక కులాల గురించి ఆలోచించి, సామాజికి విప్లవాన్ని తెచ్చిన తొలి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డే అని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను అందలం ఎక్కించారని, ఈరోజు ఇలా తలెత్తుకొని తిరగడానికి సీఎం జగనే కారణమని చెప్పారు. చంద్రబాబు ఆణగారిన వర్గాలను అవమానించేవారని, ఈ వర్గాలను ఓటు బ్యాంకులా మాత్రమే తప్ప ఏనాడూ సాటి మనిషిగా చూడలేదని అన్నారు. మంగళగిరిలో స్థానికుడిగా ఉన్న గంజి చిరంజీవిని గెలిపించుకోవాలని, హైదరాబాదులో ఉండే టీడీపీ అభ్యర్థిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అగ్రస్థానం రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ అన్నింటా అగ్రస్థానం ఇస్తున్నారని మంత్రి జోగి రమేష్ చెప్పారు. మంత్రి పదవులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలుగా, నామినేటెడ్ పదవుల్లోనూ ఈ వర్గాలకే పెద్ద పీట వేసిన తొలి సీఎం వైఎస్ జగన్ అని తెలిపారు. అగ్రవర్ణ అభ్యర్థులు గెలిచిన మంగళగిరిలో బీసీ అభ్యర్థి గంజి చిరంజీవిని నిలబెడుతున్నారని, సీఎం జగన్ సామాజిక న్యాయానికి ఇదే నిదర్శనమని చెప్పారు. మంగళగిరి అని స్పష్టంగా పలకటం రాని లోకేశ్‌కి మంగళగిరి ఎందుకు అని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ పేదల పక్షపాతి అని, బడుగు వర్గాలకు ఆయన చేసిన మేలు మరెవరూ చేయలేరని పార్టీ నేత, ప్రభుత్వ సలహాదారు (సామాజిక న్యాయం) జూపూడి ప్రభాకర్ అన్నా రు. రెండుసార్లు రెడ్డి సామాజిక వర్గం గెలిచిన మంగళగిరిలో బీసీ అభ్యర్ధిని రంగంలోకి దింపే సాహసం ఒక్క జగన్ మాత్రమే చేయగలరని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. మంగళగిరిలో బీసీ నేతను గెలిపించుకొనే అవకాశాన్ని వదులుకోవద్దని పిలుపునిచ్చారు. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త, ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, బీసీ విభాగం ఉపాధ్యక్షులు చిల్లపల్లి మోహనరావు పాల్గొన్నారు. -
YSRCP Bus Yatra: చిలకలూరిపేటలో ప్రజలు బ్రహ్మరథం
వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. చిలకలూరిపేటలో నిర్వహించిన సాధికార బస్సు యాత్రలో ప్రజాప్రతినిధులకు అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారు. బస్సుయాత్రలో భాగంగా నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. అలాగే సంక్షేమ పథకాల లబ్ధిదారులతోనూ ముచ్చటించారు. అనంతరం నిర్వహించిన భారీ బైక్ ర్యాలీతో చిలకలూరిపేటలో బహిరంగ సభా వేదిక వద్దకు బస్సు యాత్ర చేరుకుంది. వైఎస్సార్సీపీ జెండా ఎగురవేయడానికే వెళ్తున్నా: మంత్రి విడుదల రజిని ఈ భారీ బహిరంగ సభలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడుదల రజిని మాట్లాడుతూ, వై.ఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సామాజికంగా, ఆర్థికంగా చేసిన అభివృద్ధిని చాటి చెప్పేందుకే సామాజిక సాధికార యాత్రను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. చిలకలూరిపేట నుంచే వై.ఎస్ జగన్మోహన్రెడ్డి సామాజిక న్యాయానికి శ్రీకారం చుట్టారని, ఇక్కడ నుంచే బీసీ మహిళను అసెంబ్లీకి పంపించడమే కాకుండా మంత్రి పదవి కూడా ఇచ్చి చరిత్రలో ఎన్నడూలేని విధంగా వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం కల్పించారని గుర్తు చేసారు. చిలకలూరిపేటలో మున్సిపల్ చైర్మన్ పదవి ముస్లీంలకు, మార్కెట్ యార్డు చైర్మన్ ఎస్సీలకు పదవులు కట్టెబెట్టారన్నారు. రూ.2వేల కోట్లతో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, రూ.900 కోట్లతో బైపాస్ పనులు జరుగుతున్నాయని, అతి తర్వలోనే సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోబోతున్నామని, రూ.150 కోట్లతో అమృత్ పథకాన్ని కేంద్రం సహకారంతో చేపట్టి మంచినీటి సమస్యను తీర్చబోతున్నారని వెల్లడించారు. కాపు, ఎస్సీ, బీసీ భవన్లు కూడా పెద్ద మనసుతో వై.ఎస్ జగన్మోహన్రెడ్డి మంజూరు చేసారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం కోటి రూపాయలతో తాను సొంత నిధులతో ముస్లీంలకు స్థలాన్ని ఇవ్వగా, మరో మూడు ఎకరాలు కూడా సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి మంజూరు చేయడానికి సుముఖుత వ్యక్తం చేసారన్నారు. ముఖ్యమంత్రి అండదండలతో అనేక కీలక ప్రాజెక్టులను చిలకలూరిపేటలో కనీవిని ఎరుగని రీతిలో చేపట్టడమే కాకుండా, వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేసుకోని నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని, నాడు - నేడు స్కీమ్ ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేసామన్నారు. రూ.1100 కోట్ల రూపాయల సంక్షేమాన్ని వై.ఎస్ జగన్మోహన్రెడ్డి చిలకలూరిపేట నియోజకవర్గానికి అందించారంటే ఈ ప్రాంత ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ, అప్యాయతను అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గుంటూరు పశ్చిమలో పార్టీ రెండుసార్లు ఓడిపోయిందని, ఈ సారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి నన్ను అక్కడకు పంపుతున్నారని, తాను ఎక్కడ ఉన్నా సరే చిలకలూరిపేట ప్రజలు తన మనసులో ఉంటారని ఉద్ఘాటించారు. చంద్రబాబు నిజస్వరూపాన్ని గుర్తించండి: ఎమ్మెల్సీ ఏసు రత్నం ఎమ్మెల్సీ ఏసురత్నం మాట్లాడుతూ, కల్లబొల్లి మాటలు చెబుతూ, మరోసారి ప్రజలను మోసం చేయడానికి తహతహలాడుతూ ముందుకు వస్తున్న వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నిజస్వరూపాన్ని గుర్తించాలని. 600 హామీలిచ్చి ప్రజలను గత ఎన్నికల్లో మోసం చేసిన అంశాన్ని ప్రజలు మరిచిపోలేదని హెచ్చరించారు. 31 లక్షల ఇళ్లను బడుగు, బలహీన వర్గాల కోసం ఇళ్లు కట్టించి ఇవ్వడానికి సన్నహాలు చేస్తుంటే, చంద్రబాబు అడ్డుకుంటున్నారని విమర్శించారు. సామాజిక, ఆర్థిక, విద్యా, ఆరోగ్య సాధికారత: ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మరో ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మాట్లాడుతూ, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని రీతిలో ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, విద్యా సాధికారతను సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి చేసి చూపించారన్నారు. షెడ్యూల్ కులాల అభివృద్ధికి రూ.60,500 కోట్లు, బీసీ కులాల కోసం రూ.70,750 ఎస్టీ సంక్షేమానికి రూ.23,430 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి రూ.23 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ముఖ్యమంత్రి దేశ, రాష్ట్ర చరిత్రలో ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. అణగారిన బడుగు, బలహీన వర్గాలను అభివృద్ధి చేయడంతో పాటుగా ఉన్నత విద్యావంతులను చేయాలని సీఎం లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు. 37 వేల స్కూల్స్ కోసం రూ.12 వేల కోట్లతో అభివృద్ధి చేసి కార్పోరేట్‌కు ధీటుగా తీర్చిదిద్దారన్నారు. జగన్‌ను మరోసారి సీఎం చేస్తాం: నియోజకవర్గ ఇన్చార్జి మల్లెల రాజేశ్ చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి మల్లెల రాజేశ్ నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రతీ సామాజిక వర్గానికి సంక్షేమం, రాజ్యాధికారం కల్పనలో పెద్ద పీట వేసి ఇచ్చిన మాటను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని ఉద్ఘాటించారు. కులం, మతం చూడకుండా అందరికీ సంక్షేమం అందిస్తూ స్వర్గీయ వై.ఎస్ రాజశేఖర్ రెడ్డికి తగ్గ తనయుడుగా నిలిచారన్నారు. చిలకలూరిపేటలో వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేసి రాష్ట్రానికి మరోసారి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డిను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. -
చిలకలూరిపేటలో సామాజిక సాధికార బస్సు యాత్ర సక్సెస్
-
‘జగనన్న సామాజిక న్యాయం మొదలైంది ఇక్కడి నుంచే’
సాక్షి, పల్నాడు: ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని సొంత నియోజకవర్గంలో భావోద్వేగంగా ప్రసంగించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయాన్ని అమలు చేస్తున్నారని ప్రసంగించారామె. సోమవారం చిలకలూరిపేటలో వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభ జరిగింది. ఆపై నిర్వహించిన సభలో మంత్రి విడుదల పాల్గొని మాట్లాడారు. ఒక బీసీ మహిళలైన తనకు చిలకలూరిపేట సీటు ఇచ్చి గెలిపించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రిగా అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు. గతంలో ఎప్పుడూ జరగనంత అభివృద్ధి తమ ప్రభుత్వంలో చిలకలూరిపేటలో జరిగిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ మెజార్టీతో గెలిపించాలి మళ్లీ జగనన్ననే ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఆమె సభకు హాజరైన ప్రజలకు పిలుపు ఇచ్చారామె. కానుక అందిద్దాం.. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన పథకాలు మరే ఇతర ముఖ్యమంత్రి అమలు చేయలేదని చిలకలూరిపేట వైఎస్సార్సీపీ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చిలకలూరిపేట అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని తెలిపారు. చిలకలూరిపేటలో వైఎస్సార్సీపీని గెలిపించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మరోసారి కానుక అందిద్దామని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉంటాయని గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. దేశంలోనే 30 లక్షల మందికిపైగా నిరుపేదలకు ఇల్లపట్టాలు పంపిణీ చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని తెలిపారు. చదవండి: వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యేలకు చుక్కెదురు -
Sullurpeta: సామాజిక జైత్రయాత్ర
ఒక కుటుంబంలో చిచ్చుపెట్టి, బంధాలను చీల్చే కుట్ర రాజకీయాలు... అభివృద్ధి, సంక్షేమ పథకాలపై అబద్ధపు ప్రచారాలు... చంద్రబాబు, ప్యాకేజీస్టార్ పవన్ కలిసి చేస్తున్న దగాకోరు రాజకీయాలు... ఇవన్నీ ఒక ఎత్తయితే పచ్చ పత్రికలు రాస్తున్న తప్పుడు కథనాలు... టీవీ చానెళ్లలో జగనన్నపై చేస్తున్న దుష్ప్రచారం... వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎలాగైనా సరే ముఖ్యమంత్రి పీఠం నుంచి దించాలనే ప్రతిపక్షాల కుతంత్రాలు.. ఇవన్నీ కలిసి రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తుంటే, ప్రజలు మాత్రం జగనన్న వెంటే అంటూ సామాజిక సాధికార యాత్రకు తరలివచ్చిన జనసంద్రం చెబుతోంది. ఇది జైత్రయాత్రలా సాగింది. సూళ్లూరుపేట: నియోజకవర్గంలోని నాయుడుపేట పట్టణంలో ఆదివారం చేపట్టిన సామాజిక సాధికారయాత్రతో పట్టణమంతా జనసంద్రంలా మారింది. గుండెలనిండా జగనన్నపై అభిమానాన్ని నింపుకుని పట్టణ వీధుల్లో జగనన్న సైనికులు కవాతు నిర్వహించినట్టుగా సాగింది సామాజిక సాధికార యాత్ర. సంక్షేమ పథకాల సృష్టికర్త, నిరుపేదల జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చిన ఆశాకిరణం, ప్రతి పేదింటికీ పెద్ద కొడుకుగా, తమ్ముడిగా, అన్నగా, మనవడిగా, మామయ్యగా నిలిచిన జగనన్నకు జై అంటూ నినాదాలతో పట్టణం మారుమోగింది. సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన సామాజిక సాధికార యాత్ర విజయవంతమైంది. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి జనం తండోపతండాలుగా తరలిరావడంతోనాయుడుపేట పట్టణంలో జాతరను తలపించింది. ముందుగా పట్టణంలోని పిచ్చిరెడ్డితోపు విజయగణపతి ఆలయం వద్ద ప్రత్యేక పూజలతో యాత్ర ప్రారంభమైంది. వైఎస్సార్‌కు నివాళి అర్పిస్తున్న ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అక్కడి నుంచి గాంధీమందిరం, పార్కు, గడియారం సెంటర్, వెల్కమ్ సెంటర్, పెద్ద దర్గామీదుగా పురవీధుల్లో బాణసంచా వేడుకలతో వేలాదిమంది జనం మధ్యన సామాజిక సాధికార ర్యాలీ సాగింది. ర్యాలీ సాగినంత సేపు వైఎస్సార్సీపీ నాయకులపై పూలు చల్లి పట్టణ ప్రజలు వారి అభిమానాన్ని చాటుకున్నారు. సాధికార బస్సు యాత్ర సాగుతున్నంత సేపు జై జగన్.. జైజై జగన్ అనే నినాదాలు మిన్నంటాయి. సాధికారయాత్ర పాత బస్టాండ్‌వద్దకు చేరుకోగానే అక్కడే వున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, దివంగతనేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, సావిత్రిభాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సభా ప్రాంగణానికి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్సార్ ప్రతిమకు పూలమాలలు వేశారు. రాజ్యసభ సభ్యులు, రీజనల్ కో–ఆర్డినేటర్ వేణుంబాక విజయసాయిరెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రులు కళత్తూరు నారాయణస్వామి, అంజాద్‌బాషా, జిల్లా పార్టీ అధ్యక్షులు, వెంకటగిరి ఇన్చార్జి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, మాజీమంత్రి పీ అనిల్‌కుమార్ యాదవ్, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణచక్రవర్తి, మేరిగ మురళీధర్, కామిరెడ్డి సత్యనారా యణరెడ్డి లాంటి పెద్దలందరూ జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రసంగిస్తున్న విజయసాయిరెడ్డి, పక్కన ఎమ్మెల్యే కిలివేటి, ఎన్డీసీసీబీ చైర్మన్ సత్యనారాయణరెడ్డి ఆ తరువాత ముందుగా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సభకు అధ్యక్షత వహించి అధ్యక్షోపన్యాసం చేశారు. ఆయన సూళ్లూరుపేట నియోజకవర్గంలో గడిచిన అయిదేళ్లలో రూ.3,470 కోట్లతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేశామన్నారు. సంక్షేమ పథకాల కింద డీబీటీ రూపంలో రూ.1,275 కోట్లు, నాన్ డీబీటీ కింద రూ.7,200 కోట్లు నిరుపేదల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా వెళ్లిందని చెప్పారు. అభివృద్దికి, సంక్షేమానికి ఇంతకన్నా నిదర్శనం ఏమి కావాలన్నారు. అనంతరం డిప్యూటీ ముఖ్యమంత్రులు నారాయణస్వామి, అంజాద్‌బాషా, మాజీ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ ప్రసంగించారు. బాబులంతా బెంబేలు అనిల్‌కుమార్ యాదవ్ ప్రసంగిస్తున్నంత సేపు సభా ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగింది. ఇందులో ముఖ్యంగా ‘‘ఇటీవల బాబులు తయారయ్యారంట.. చంద్రబాబు, లోకేష్‌బాబు, కల్యాణ్‌బాబు, బాలయ్యబాబులట. ఈ బాబులందరినీ కట్టకట్టుకుని బంగాళాఖాతంలో కలిపేసే రోజు మనముందుంది. జగనన్న కొట్టే దెబ్బకు ఈ బాబులంతా బెంబేలెత్తిపోవడం గ్యారంటీ.’’ అని చెప్పడంతో జనమంతా చప్పట్లు కొట్టి సంఘీభావాన్ని తెలిపారు. సాధికార యాత్రకు హాజరైన జనసందోహంలో ఒక భాగం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేసి దళితులకు ఒక గౌరవాన్ని తీసుకొచ్చారని అన్నారు. విచ్చేసిన అహుతులందరికీ ఎమ్మెల్యే కిలివేటి శాలువాలు కప్పి బుద్దుడు బొమ్మలను బహూకరించారు. ఈ సభకు అశేష జనం తరలిరావడం విశేషం. -
‘ఏపీకి ఎవరొచ్చినా సీఎం జగన్‌ను ఏమీ చేయలేరు’
నెల్లూరు: గత ప్రభుత్వాలు బడుగు, బలహీన వర్గాలను పట్టించుకోలేదని, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక బడుగు, బలహీన వర్గాలను అభివృద్ధి చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట సామాజిక సాధికార బస్సుయాత్రలో నారాయణస్వామి మాట్లాడుతూ.. ‘ ఏపీకి ఎవరొచ్చినా సీఎం జగన్‌ను ఏమీ చేయలేరు. మేలు జరిగి ఉంటేనే ఓటు వేయమని ధైర్యంగా జగన్ అడుగుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్ రాజకీయ పదవులు ఇచ్చారు. ఎస్సీలుగా ఎవరైనా పుడతారా అని చంద్రబాబు హేళన చేసి మాట్లాడారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తే దానిని కూడా తట్టుకోలేకపోతున్నారు. వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చింది. వైఎస్ చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్లో ఆయన పేరు చేర్చారు. వైఎస్ కుటుంబం అంటే నాకు ఎంతో గౌరవం.. దళిత ప్రజా ప్రతినిధులు అందరూ వైఎస్ జగన్‌తోనే ఉంటారు. కాంగ్రెస్‌లో చేరి జగనన్నపై యుద్ధం చేస్తామని షర్మిల అంటున్నారు. తప్పు చేయని వైఎస్ జగన్‌ను కాంగ్రెస్ పార్టీ జైల్లో పెట్టింది. ఇవన్నీ గుర్తులేవా? అని ప్రశ్నించారు. మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ‘ గతంలో ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు. ఎంతో కొంత చేశారు. కానీ ఎస్పీ, ఎస్టీ, బీసీ మహిళలకు యాభై శాతం పదవులు ఇచ్చిన ఘనత మాత్రం జగన్‌కే దక్కుతుంది. చంద్రబాబు ఎక్కడో మూలన, అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. నగరం నడిబొడ్డున ఉండాలని జగన్ నిర్ణయించి.. స్వరాజ్ మైదాన్‌లో పెట్టించారు. జగన్నే లక్ష్యం చేసుకునే కుట్రలు చేస్తున్నారు. ఇందుకోసం కుటుంబాల్లో కూడా చిచ్చుపెడుతున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల కూడా వారి కుట్రలో భాగస్వామ్యమయ్యారు. వైఎస్సార్సీపీ చీల్చి.. చంద్రబాబుకు ప్రయోజనం కలిగించాలని చూస్తున్నారు. షర్మిల మాట్లాడిన ప్రతిమాటను వైఎస్సార్ అభిమానులను బాధిస్తోంది. వైఎస్సార్‌ను దేవుడిగా భావించే ప్రతి కుటుంబం కూడా బాధపడుతోంది. షర్మిల మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి’ అని తెలిపారు. -
ప్రభంజనంలా వైఎస్ఆర్ సీపీ బస్సు యాత్ర
-
నేటి సామాజిక సాధికార యాత్ర షెడ్యూల్
తాడేపల్లి : వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. నిన్నటితో(శనివారం) 41 రోజులు పూర్తి చేసుకున్న సామాజిక సాధికార యాత్రం నేడు 42వ రోజులోకి అడుగుపెట్టింది. ఆదివారం అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంతో పాటు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో జరుగనుంది. ఉరవకొండ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త విశ్వేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది. దీనిలో భాగంగా మధ్యాహ్నం రెండు గంటలకు వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం, మధ్యాహ్నం మూడు గంటలకు ఆర్టీసీ బస్టాండ్ నుంచి బస్సుయాత్ర ప్రారంభం కానుంది. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు అంబేద్కర్ సర్కిల్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు.ఈ సభకు మంత్రులు గుమ్మనూరు జయరాం, ఉషశ్రీ చరణ్, ఎంపీ తలారి రంగయ్య తదితరులు హాజరుకానున్నారు ఇక రాజానగరంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు కోరుకొండ మండలం దోసకాయపల్లిలో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం ఉంటుంది. అనంతరం కోరుకొండ వరకూ బస్సుయాత్ర ఉంటుంది. మధ్యాహ్నం మూడు గంటలకు కోరుకొండ బూరుగపూడి గేట్ వద్ద నిర్వహించే బహిరంగ సభలో మంత్రులు తానేటి వనిత, జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సినీ నటులు అలీ తదితరులు పాల్గొనున్నారు. -
నేటి సామాజిక సాధికార యాత్ర షెడ్యూల్
తాడేపల్లి : వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర భాగంగా నేడు(శనివారం) విశాఖ నార్త్ నియోజకవర్గంతో పాటు కాకినాడ జిల్లా పెద్దాపురం, నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గాల్లో జరుగనుంది. విశాఖ నార్గ్ నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో బస్సుయాత్ర నిర్వహించనున్నారు. ఉదయం పదకొండు గంటలకు వైఎస్సార్సీపీ ప్రతినిధుల మీడియా సమావేశం ఉండగా, పన్నెండు గంటలకు అక్కయ్యపాలెం ఎన్జీవోస్ కాలనీలో స్కూల్ ప్రారంభోత్సవంలో పాల్గొనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు మాధవధార లాస్ట్ బస్ స్టాప్ నుండి బైక్ ర్యాలీ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం మూడు గంటలకు పోర్ట్ హాస్పిటల్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ రీజనల్ ఇన్‌ఛార్జి వైవీ సుబ్బా రెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, కారుమురి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, గుడివాడ అమర్నాథ్, తదితరులు హాజరుకానున్నారు. మరొకవైపు కాకినాడ జిల్లా పెద్దాపురంలో బస్సుయాత్ర నిర్వహించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు పెద్దాపురం వైఎస్సార్సీపీ కార్యాలయం నుండి బస్సుయాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం మూడు గంటలకు పెద్దాపురం మున్సిపల్ సెంటర్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమానికి ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే అదీప్‌రాజ్, ఎమ్మెల్సీ కొయ్యే మోషెన్‌రాజు తదితరులు హాజరుకానున్నారు. ఇక పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో బస్సుయాత్ర నిర్వహించనున్నారు. మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది. దీనిలో భాగంగా సాయంత్రం మూడు గంటలకు ముత్తుకూరులోని వాణి మహల్‌సెంటర్ నుంచి ర్యాలీ ప్రారంభం కానుంది. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు ముత్తుకూరు బస్టాండ్‌లో బహిరంగ సభ జరుగనుంది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎంపీలు గురుమూర్తి, బీద మస్తాన్ రావు, మైనార్టీ సెల్ రాష్ట్ర నేత ఖాదర్ బాషా, నెల్లూరు నగర మేయర్ స్రవంతి, తదితరులు పాల్గొనున్నారు. -
సామాజిక సాధికారత సీఎం జగన్ వల్లే సాధ్యం: రాజోలు వైఎస్ఆర్సీపీ నేతలు
-
తిరుపతి, డా.బీఆర్ అంబేద్కర్ జిల్లాల్లో సామాజిక సాధికార యాత్రలు
-
వేంకటగిరిలో సామాజిక సాధికార యాత్ర
-
నేటి సామాజిక సాధికార యాత్ర షెడ్యూల్
తాడేపల్లి : వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర 40వ రోజుకు చేరుకుంది. ఈ బస్సుయాత్రలో భాగంగా నేడు(శుక్రవారం) తిరుపతి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సాగనుంది. తిరుపతి జిల్లా వెంకటగిరిలో వైఎస్సార్సీపీ ఇంచార్జ్ నేదురమల్లి రామ్ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు నేదురమల్లి బంగ్లా నుండి ప్రారంభమయ్యే ర్యాలీ ఉక్కిలి మీదుగా రాపూరు వరకు జరుగనుంది. అనంతరం మూడు గంటలకు రాపూరు మెయిన్ సెంటర్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీనికి పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు హాజరుకానున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో మల్కిపురంలో జరిగే బస్సుయాత్రలో భాగంగా మధ్యాహ్నం గం. 1.30కి మల్కిపురంలోని కేఎస్‌ఎన్‌రాజు నివాసంలో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం ఉంటుంది. అనంతరం రెండు గంటలకు శివకోడు లాకుల నుండి బస్సుయాత్ర ప్రారంభం అవుతుంది. మూడు గంటలకు మల్కిపురం ప్రధాన సెంటర్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ, విశ్వరూప్, ఎంపీలు అనురాధ, మోపిదేవి తదితరులు హాజరుకానున్నారు. -
నేటి సామాజిక సాధికార యాత్ర షెడ్యూల్
నంద్యాల: అప్రతిహతంగా సాగుతున్న వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సుయాత్రలో భాగంగా 39వ రోజు(గురువారం) నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంవలోని కల్లూరులో జరుగనుంది. ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్న బస్సుయాత్రలో మధ్యాహ్నం 12 గంటలకు కేఎస్సార్ కన్వషన్ హాలులో వైఎస్సార్సీపీ నేతలు సమావేశం నిర్వహించనున్నారు. రెండు గంటలకు అదే ఫంక్షన్ హాలులో మీడియా సమావేశం ఉంటుంది. మూడు గంటలకు కేఎస్సార్ కన్వషన్ హాలు నుంచి చెన్నమ్మ సర్కిల్ వరకూ బైక్ ర్యాలీ నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు చెన్నమ్మ సర్కిల్లో బహిరంగ సభ ఉంటుంది. ఈ సభకు డిప్యూటీ సీఎం నారాయణ స్వాయి, ఎంపీలు గోరంట్ల మాధవ్, గురుమూర్తి, సంజీవ్ కుమార్ తదితరులు హాజరుకానున్నారు. -
హుకుంపేటలో వైఎస్ఆర్ సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర
-
సామాజిక సాధికార యాత్ర: పోటెత్తిన ‘అనంత’
సాక్షి, అనంతపురం: వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్రకు అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఈరోజు(శుక్రవారం) అనంతపురం నియోజకవర్గంలో చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అనంతపురంలో ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర అంబేద్కర్ విగ్రహం నుంచి పాతవూరు గాంధీ విగ్రహం వరకూ సాగింది. అనంతరం చెన్నకేశవస్వామి ఆలయం ఎదురుగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రి ఉషాశ్రీచరణ్, మాజీ మంత్రి పేర్ని నాని, జూపూడి ప్రభాకర్, ఎంపీ తలారి రంగయ్య తదితరులు హాజరయ్యారు. పేర్ని నాని మాట్లాడుతూ.. ‘ఎస్సీ ఎస్టీ, బీసీ మైనారిటీలను మోసం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు.వెనుకబడిన వర్గాలకు చంద్రబాబు ప్రాధాన్యత లేదు. చంద్రబాబు హయాంలో మైనారిటీ, ఎస్టీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించలేదు. ఓడిపోయిన నారా లోకేష్‌కు మంత్రి పదవి ఇచ్చారు. 17 మంది ఎస్సీ ఎస్టీ, బీసీ మైనారిటీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్సార్‌దే. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు సంక్షేమం ఎందుకు పట్టించుకోలేదు?, రుణమాఫీ పేరుతో రైతులు డ్వాక్రా రుణాలను మోసం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు. మీకు మంచి జరిగుంటే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయండి’అని విజ్ఞప్తి చేశారు. అనంతపురం ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినవ అంబేద్కర్ వంటి వారు. ఎస్సీ ఎస్టీ, బీసీ మైనారిటీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మళ్ళీ వైఎస్ జగన్‌ను ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది’ అని తెలిపారు. ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ సీఎంగా ఉన్నంతకాలం సంక్షేమ పథకాలు ఉంటాయి. అభివృద్ధి విషయంలో వైఎస్సార్ ఒక అడుగు ముందుకేస్తే, సీఎం జగన్ రెండు అడుగులు వేస్తున్నారు’ అని పేర్కొన్నారు. -
అనంతపురంలో సామాజిక సాధికార బస్సు యాత్ర
-
మండపేటలో మార్మోగిన సాధికార నినాదం
సాక్షి, అమలాపురం: మండపేట నియోజకవర్గంలో సామాజిక సాధికార నినాదం మార్మోగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో బడుగు, బలహీన వర్గాలు సాధించిన సాధికారతను శుక్రవారం నియోజకవర్గంలో నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రతిబింబించింది. మండపేటతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కూడా ఈ యాత్రకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. దీంతో మండపేట వీధులన్నీ జనసంద్రాలే అయ్యాయి. రెండు వేల ద్విచక్ర వాహనాలతో యువత ర్యాలీ చేశారు. తాపేశ్వరంలో ప్రారంభమైన యాత్ర మండపేటలోని కలువపువ్వు సెంటర్లోని సభా ప్రాంగణం వరకు దిగ్విజయంగా సాగింది. యాత్ర పొడవునా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వారికి సీఎం జగన్ చేసిన మేలును వివరిస్తూ సాగారు. ప్రజలు వారికి పూలు, హారతులతో స్వాగతం పలికారు. వేలాదిగా ప్రజలు పాల్గొన్న సభలో నేతలు సీఎం జగన్ అందిస్తున్న పథకాలు, ప్రజలకు చేస్తున్న మేలును వివరించారు. సీఎం జగన్ పేరు వచ్చిన ప్రతిసారీ సభలోని ప్రజలు పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేశారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. సామాజిక న్యాయం సీఎం జగన్‌తోనే సాధ్యమైంది: మంత్రి జోగి రమేష్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తోనే రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధ్యమైందని మంత్రి జోగి రమేష్ అన్నారు. స్వతంత్ర భారత చరిత్రలో ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రీ ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ చేసినంత మేలు చేయలేదని తెలిపారు. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తలెత్తుకొని తిరగగలుగుతున్నారంటే, అది సీఎం జగన్ అందించిన చేయూత ఫలితమేనని చెప్పారు. వెనుకబడిన వర్గాలకు నిజమైన రాజ్యాధికారాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమే అందించారు. 25 మంది మంత్రులు ఉంటే వారిలో 15 మంది బీసీలేనని, 9 మంది రాజ్యసభ సభ్యుల్లో నలుగురు, నామినేటెడ్ పదవుల్లో 50 శాతం బీసీలకే ఇచ్చారని వివరించారు. చరిత్ర సృష్టించిన జగన్: ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే రాష్ట్రంలో 30.65 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి చరిత్ర సృష్టించారని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో యూపీలో పేదలకు, బడుగు, బలహీన, దళిత వర్గాలకు ఇళ్ల స్థలాలు పంపిణీ ప్రారంభించారని, ఇప్పటివరకు ఇచ్చింది 20 లక్షల మందికి మాత్రమేనని తెలిపారు. అణగారిన వర్గాలకు గౌరవం అనేది విద్యతో వస్తుందని గుర్తించిన సీఎం జగన్ ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారని అన్నారు. పేదలకు అత్యంత ఆధునిక వైద్యాన్ని అందిస్తున్నారన్నారు. ఇటువంటి ముఖ్యమంత్రిని మనందరం మరోసారి సీఎంను చేసుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. పేదల ఆత్మబంధువు సీఎం జగన్: జూపూడి ప్రభాకరరావు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల ఆత్మబంధువు అని మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు చెప్పారు. పేదలకు అన్ని విధాలుగా అండదండగా ఉంటూ, బడుగుల కుటుంబాలను ఆర్థికంగా నిలదొక్కుకొనేలా పథకాలను అందిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం అంటే భూస్వామి కాదు.. పెట్టుబడిదారు కాదు.. ప్రభుత్వం అంటే ప్రజలదే అని నిరూపించిన ఏకైక నాయకుడు సీఎం జగన్ అని అన్నారు. రాష్ట్రంలో 72 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, 52 శాతం మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పదవులు ఇచ్చారని తెలిపారు. ఓటు వేయనివారికి సైతం పథకాలు అందించిన ఘనత జగన్‌కు దక్కుతోందన్నారు. మహిళా సాధికారిత జగన్‌తోనే: ఎంపీ చింతా అనూరాధ సీఎం వైఎస్ జగన్‌తోనే రాష్ట్రంలో మహిళా సాధికారత సాధ్యమైందని ఎంపీ చింతా అనూరాధ చెప్పారు. చట్ట సభలలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును కేంద్రం తెచ్చిందని, సీఎం జగన్ స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో 50 శాతానికి మించి మహిళలకు రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అధికంగా లబ్ధిపొందారని తెలిపారు. -
చేనేత పురిలో చైతన్య భేరి
కర్నూలు (రాజ్‌విహార్): చేనేత వస్త్రాలకు మారుపేరైన ఎమ్మిగనూరులో సామాజిక చైతన్యం వెల్లివిరిసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న వైనాన్ని వివరిస్తూ వైఎస్సార్సీపీ శుక్రవారం పట్టణంలో ఘనంగా సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించింది. నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలివచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు ఈ యాత్రలో పాల్గొని, సాధికారతను ప్రదర్శించారు. మండల పరిషత్ కార్యాలయంనుంచి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. బస్సు యాత్ర సాగిన పురవీధులు జనంతో కిక్కిరిసిపోయాయి. అనంతరం బస్టాండు వద్ద వేలాది ప్రజలతో భారీ బహిరంగ సభ జరిగింది. యాత్ర మొదలుకొని సభ ముగిసేవరకు పట్టణం జై జగన్ నినాదాలతో మార్మోగింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను సీఎం వైఎస్ జగన్ సాధికారత దిశగా నడిపించిన తీరును నేతలు వివరిస్తున్నప్పుడు సభా ప్రాంగణం నినాదాలు, ఈలలు, కేరింతలతో హోరెత్తింది. మళ్లీ జగనే కావాలి అంటూ ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇది జగనన్న పెంచిన ఆత్మగౌరవం : మంత్రి మేరుగు నాగార్జున ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు తలెత్తుకొని తిరుగుతున్నారంటే అది సీఎం వైఎస్ జగన్ పెంచిన ఆత్మగౌరవమే కారణమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. ఎందరో మహానుభావులు కలలుగన్న సామాజిక న్యాయం, సామాజిక సాధికారతను సీఎం జగన్ నిజం చేసి చూపించారని అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉండగా దళితులు, బలహీనవర్గాలను ఎన్ని అవమానాలకు గురిచేశారో ఎవరూ మరువలేరని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ వర్గాలనే అణిచివేశారని వివరించారు. సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత బడుగు, బలహీన వర్గాలను అక్కున చేర్చుకొని ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధిలోకి తెచ్చారని చెప్పారు. సీఎం జగన్ వల్లే నేడు మన బిడ్డలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ చదువులు చదువుతున్నారని తెలిపారు. చంద్రబాబు మాటలు నమ్మవద్దన్నారు. వచ్చే ఎన్నికల్లో జగనన్నను భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. కుల మతాలు చూడని నాయకుడు : ఎంపీ గురుమూర్తి పేదలకు మేలు చయడంలో సీఎం జగన్‌ను మించిన నేత లేరని ఎంపీ గురుమూర్తి చెప్పారు. కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమాన్ని అందిస్తున్న ఏకైక నాయకుడు సీఎం జగన్ అని తెలిపారు. నాలుగున్నరేళ్లలో రూ. 2.50 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో జమ చేశారన్నారు. అవినీతి రహిత పాలన అందించేందుకు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారని, పథకాలను ఇంటివద్దకే అందిస్తున్నారని వివరించారు. ఒకప్పుడు నాయకులు చుట్టూ మనం తిరిగే వాళ్లమని, కానీ ప్రభుత్వ సిబ్బంది మన సేవ కోసం ఇంటి వద్దకే వస్తున్నారని తెలిపారు. అట్టడుగు వర్గాలకు మేలు: ఎంపీ గోరంట్ల మాధవ్ రాష్ట్రంలో సీఎం జగన్ నేతృత్వంలో అట్టడుగు వర్గాలకు మేలు జరుగుతోందని, వారంతా అభివృద్ధి చెందుతున్నారని ఎంపీ గోరంట్ల మాధవ్ చెప్పారు. చంద్రబాబు బడుగు బలహీన వర్గాలను పావులా వాడుకుని, అధికారంలోకి వచ్చాక అణచివేశారని తెలిపారు. చంద్రబాబుకు ఈ సారి డిపాజిట్లు కూడా రావన్నారు. కనీసం బర్రెలక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని పవన్ రాష్ట్రంలో ఏం చేయగలరని ప్రశ్నించారు. బడుగులకు గుర్తింపు తెచ్చిన సీఎం జగన్: ఎంపీ డాక్టర్ సంజీవ్‌కుమార్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో బడుగులకు గుర్తింపు తెచ్చారని ఎంపీ డాక్టర్ సంజీవ్‌కుమార్ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి నుంచి కేబినెట్, నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్ద పీట వేసి, ఆ వర్గాలను తలెత్తుకునేలా చేశారని అన్నారు. చంద్రబాబు పాలనలో ఈ వర్గాలన్నీ అవహేళనకు, అణచివేతకు గురయ్యాయని చెప్పారు. టీడీపీ చేస్తున్న సామాజిక కుట్రకు ఓటుతో సమాధానమివ్వాలన్నారు. వచ్చే ఎన్నికల్లో పేదల పక్షాన ఉన్న సీఎం జగన్‌ను గెలిపించి మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య తదితరులు ప్రసంగించారు. -
మండపేటలో ‘సామాజిక’ హోరు
మండపేట: వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. ఈరోజు(శుక్రవారం) డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో నిర్వహించిన సామాజిక సాధికార బస్సుయాత్ర బహిరంగ సభకు జనసంద్రం పోటెత్తింది. మండపేట కలువ పువ్వు సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభకు అశేష జనవాహిని హాజరై సామాజిక సాధికార యాత్రకు సంఘీభావం తెలిపింది. మండపేటలో ఎమ్మెల్సీ తీట త్రిమూర్తులు ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగింది. తోట త్రిమూర్తులు మాట్లాడుతూ.. ‘2019లో మండపేట నియోజకవర్గం ప్రజలు చేసిన తప్పు మళ్ళీ చేయరు. జగనన్న పాలను చూసి 2019 తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలో వైఎస్సార్సీపీని గెలిపించారు. చంద్రబాబు ఇచ్చే భరోసా ఆయన తనయుడికి మాత్రమే.. ప్రజలకు కాదు. మరోసారి చంద్రబాబు ప్రజలకు కల్లబొల్లి కబుర్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం జగన్ చేసింది పాదయాత్ర.. లోకేష్ చేసింది జాగింగ్ మాత్రమే. రాష్ట్రంలో మరోసారి వైఎస్ జగన్ పాలన రావాలి’ అని పేర్కొన్నారు. ఎంపీ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. ‘ఏడాదికి 16 వేల కోట్ల లోటు ఆదాయం ఉన్న రాష్ట్రం మనది. ముఖ్యమంత్రి మారే సమయంలో తక్షణం తీర్చాల్సిన అప్పులు నాలుగు ఐదు వేల కోట్ల రూపాయలు ఉంటాయి. మన రాష్ట్రంలో టిడిపి తక్షణం తీర్చాల్సిన 80 వేల కోట్ల రూపాయలు అప్పు మిగిల్చింది.కోవిడ్ సమయంలో రాష్ట్ర ప్రజలను ఆదుకున్నది సీఎం జగన్ కాదా?, రాష్ట్రంలో నూటికి 78 మంది పేదవాళ్లే ....వాళ్లని ఆదుకునే ప్రయత్నమే సీఎం జగన్ చేస్తున్నారు. సరైన న్యాయం మీరే చెప్పండి.ఒకే కులం అనేక సంవత్సరాలు పాటు మండపేటను పాలిస్తోంది. గతంలో ఒకసారి మార్చమని అడిగాం... ప్రజలు మార్చారు.22 కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటివరకు 20 లక్షల మందికి ఇళ్ళ పటాలిస్తే... ఐదు కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో నాలుగేళ్లలో 31 లక్షల ఇళ్ల పట్టాల సీఎం జగన్ ఇవ్వటం దేశ చరిత్రలోనే ఒక రికార్డు. ఇచ్చిన ప్రతి హామీ నూటికి నూరు శాతం అమలు చేసిన పార్టీ వైఎస్సార్సీపీ మాత్రమే. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన వారిని జడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా అనేక రాజ్యాంగబద్ధ పదవుల్లో నిలిపిన ఘనత వైఎస్ఆర్ సీపీదే’ అని స్పష్టం చేశారు. మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. ‘ఇది పేదలకు పెత్తందార్లకు మధ్య జరిగే యుద్ధం.జగనన్న కటౌట్ చూసే జనం వస్తున్నారు. చంద్రబాబుకు లోకేష్‌కి కూడా పనిలేదు.చంద్రబాబు , లోకేష్, పవన్ కళ్యాణ్ ,రాధాకృష్ణ, హైదరాబాదులో ఉండి ఆంధ్రాలో విషం చిమ్ముతారు.అధికారంలోకి వస్తే చంద్రబాబు మొత్తం ప్రభుత్వ పథకాలను తీసేస్తారంట.బాబుకి గ్యారెంటీ ఉందా?, లోకేష్ పాదయాత్ర చేశాడా.... ఎవరైనా చూశారా...?, పాదయాత్ర అంటే వైఎస్ఆర్ చేయాలి... లేదంటే వైఎస్ జగన్ చేయాలి. యువగళం సభలో చంద్రబాబే ముఖ్యమంత్రి అభ్యర్థిని లోకేష్ చెప్పినా.... పవన్ కళ్యాణ్ సిగ్గులేకుండా స్టేజ్‌పైన కూర్చున్నాడు.నేను వంగవీటి మోహనరంగా అభిమానిని.టిడిపికి ఓటు వేస్తే వంగవీటికి ద్రోహం చేసినట్టే.25 మంది మంత్రులుంటే 17మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మంత్రులు ఉన్నారు ఇదీ సామాజిక సాధికారత. సామాజిక సాధికారత పాటించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. మండపేటలో జరిగే యుద్ధం పేదలకు పెత్తందార్లకు మధ్య జరిగుతుంది.చంద్రబాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పి అక్కచెల్లెలను మోసం చేశారు.. రైతులు మోసం చేశారు’ అని ప్రజలకు స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు మాట్లాడుతూ..‘ప్రభుత్వం అంటే భూస్వామి కాదు... పెట్టుబడిదారుడు కాదు... ప్రభుత్వం అంటే ప్రజలదే... అని నిరూపించిన ఏకైక నాయకుడు సీఎం జగన్. రాష్ట్రంలో 72% బీసీలకు, 52 శాతం మహిళలకు సీఎం జగన్ పదవులు ఇచ్చారు. ప్రతిపక్ష నేతలు నేలను గెలవగలరేమో తప్ప ప్రజలను జయించలేరు.పేదపిల్లలకు ఇంగ్లీష్ మీడియం అందించడానికి ప్రయత్నించిన సీఎం జగన్‌ను ఆపేందుకు ప్రతిపక్షాలు ఎంతో ప్రయత్నించాయి.నేర్పితే తెలుగు చచ్చిపోతుందని రామోజీరావు అన్నాడు. సీఎం జగన్ ధైర్యం, సాహసం ముందు ప్రతిపక్షాలు నిలబడలేవు. తన రాజకీయ చరిత్రలో చంద్రబాబు తన కులాన్ని మాత్రమే ప్రోత్సహించాడు.ఆయన ప్రోత్సహించిన ఈనాడు ఎన్టీఆర్‌ను ఎత్తేసి మళ్లీ నేలపై పడేసింది. పేదవాడికి జగన్ అన్నం పెట్టారు... అక్కచెల్లెమ్మలను ఆదుకున్నారు. దేశంలో ఈ స్థాయిలో పేదలను ఆదుకుంటున్న ప్రభుత్వం మరొకటి లేదు. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం అప్పు 176 లక్షల కోట్లు. దమ్మున్న జగనన్నను చూసి పర్వతంలాంటి కాంగ్రెస్ పార్టీ కూడా గజగజ వణికింది.పవన్ కళ్యాణ్.... ఈ రాష్ట్రం ప్రయోగశాల కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న కోటి మంది దళితులు వారి వెనకాల వచ్చే బిసిలు మళ్ళీ జగనన్ననే నాయకుడిగా ఎన్నుకుంటారు’ అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ మాట్లాడుతూ.. ‘రానున్న కాలంలో కాపు, బీసీ సామాజిక వర్గాలు కలిసి జగనన్న విజయానికి తోడ్పడాలి. 70 ఏళ్లుగా పార్లమెంటు ఆమోదించని మహిళా బిల్లును తనకున్న ఎంపీలతో ఒంటి చేత్తో గెలిపించిన వ్యక్తి సీఎం జగన్.రాష్ట్రంలో ఓ బీసీ రిజర్వేషన్ ఉండాలని కోరుకున్న వ్యక్తి సీఎం జగన్.ప్రజలతో మమేకమైన తోట త్రిమూర్తులను మండపేటలో కచ్చితంగా గెలిపించాలి’ అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎంపీ చింతా అనురాధ మాట్లాడుతూ.. ‘ ప్రజలందరూ సామాజికంగా ఆర్థికంగా బలపడాలన్నదే సీఎం జగన్ ఆలోచన. పార్లమెంట్లో మహిళల కోసం 33 శాతం రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టారు కానీ సీఎం జగన్ 50 శాతం పదవులు మహిళలకు ఇచ్చారు’ అని పేర్కొన్నారు. -
నేడు మండపేటలో సామాజిక సాధికార బస్సు యాత్ర
-
దేవరపల్లిలో జన జాతర
సాక్షి, రాజమహేంద్రవరం/దేవరపల్లి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించిన సంక్షేమం, చేసిన మేలును వివరించేందుకు తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లిలో ఆదివారం నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతమైంది. దేవరపల్లి, గోపాలపురం, నల్లజర్ల, ద్వారకా తిరుమల మండలాల నుంచి అశేష సంఖ్యలో తరలి వచ్చిన జన ప్రవాహంతో దేవరపల్లి పరిసర ప్రాంతాలు, సభా ప్రాంగణం పోటెత్తాయి. తొలుత కృష్ణంపాలెం హైవే నుంచి సుమారు 3 వేల ద్విచక్ర వాహనాలతో 6 కిలోమీటర్ల మేర భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆరు వేల మందికి పైగా యువత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిమానులు పాల్గొన్నారు. దేవరపల్లి బస్టాండ్ వద్ద డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పూలమాలలు వేసి, అంజలి ఘటించారు. అనంతరం ప్రజలనుద్దేశించి మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రసంగించారు. సభ ప్రారంభం నుంచి ముగిసే వరకూ ప్రజలు నేతల ప్రసంగాలు శ్రద్ధగా విన్నారు. సీఎం జగన్ తమకు చేసిన మంచిని గుర్తుకు చేసుకుని ‘జై జగన్.. 2024 జగన్ వన్స్‌మోర్’ అంటూ నినదించారు. సంఘ సంస్కర్త సీఎం జగన్: మంత్రి చెల్లుబోయిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓ సంఘ సంస్కర్త అని రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార శాఖల మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చెప్పారు. నాలుగన్నరేళ్ల పాలనలో అనేక సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లోకి రూ.2.60 లక్షల కోట్లు జమ చేశారని, ఇందులో అధిక శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే చేరాయని తెలిపారు. పేదలకు అంతర్జాతీయస్థాయి విద్య, వైద్య సౌకర్యాలను చేరువ చేస్తున్నారన్నారు. సీఎం జగన్ చేపట్టిన కార్యక్రమాలతో రాష్ట్రంలోని ప్రతి ఎస్సీ, ప్రతి ఎస్టీ, ప్రతి బీసీ, ప్రతి మైనారిటీ తలెత్తుకొని తిరుగుతున్నారని వివరించారు. వృద్ధి రేటు పెంచిన సీఎం జగన్: మంత్రి కారుమూరి సీఎం జగన్ తీసుకొచ్చిన పథకాలతో అన్ని వర్గాల ప్రజలు అభ్యున్నతి సాధిస్తున్నారని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. పేదల ఆరి్థక స్థితిగతులు మార్చారని అన్నారు. దీంతో రాష్ట్ర వృద్ధి రేటు 11.5 శాతానికి పెరిగిందని తెలిపారు. సీఎం జగన్ వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. వర్షాలకు తడిసిన ధాన్యం కొని రైతులకు 72 గంటల్లోనే నగదు చెల్లించామన్నారు. సామాజిక సాధికారత సాధ్యం చేశారు : మంత్రి తానేటి వనిత దశాబ్దాలుగా ప్రజలు ఎదురు చూస్తున్న సామాజిక సాధికారతను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాధ్యం చేసి చూపించారని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలకు సంక్షేమంలో, పదవుల్లో పెద్ద వాటా ఇచ్చి, వారిని అభివృద్ధి పథంలోకి తెచ్చారని తెలిపారు. పేద విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు సీఎం జగన్ ట్యాబ్‌లు ఇస్తున్నారని, వారికి ఉపయోగపడే కంటెంట్ మాత్రమే వాటి ద్వారా అందిస్తున్నారని చెప్పారు. దీనిని కూడా కొందరు తప్పుపడుతున్నారని, పెత్తందార్ల పిల్లలు ఇంగ్లిష్ మీడియం చదవవచ్చు కానీ, పేద పిల్లలు చదివితే భరించలేరా అని ప్రశ్నించారు. సీఎం జగన్ పేదలకు భూములిచ్చారు: ఎంపీ సురేష్ వైఎస్ జగన్ అధికారం చేపట్టాక అసైన్డ్, అన్యాక్రాంతమైన భూములను పేదలకు అందించారని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అన్నారు. మహిళా సాధికారతకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న నేత జగనేనన్నారు. రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి: ఎంపీ మార్గాని భరత్‌రామ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ వచ్చిన తర్వాత రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్ తెలిపారు. ఈ అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి సీఎం జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. రూ.10 వేల కోట్లు వెచ్చిస్తే మూడు రాజధానులు అభివృద్ధి చెందుతాయని అన్నారు. నియోజకవర్గంలో రూ.3 వేల కోట్లతో సంక్షేమం, అభివృద్ధి: ఎమ్మెల్యే తలారి ఈ నాలుగున్నరేళ్లలో గోపాలపురం నియోజకవర్గంలో సంక్షేమం, అభివృద్ధికి సీఎం జగన్ రూ.3 వేల కోట్లు వెచ్చించారని ఎమ్మెల్యే తలారి వెంకట్రావు చెప్పారు. ఇందులో రూ.1,200 కోట్లు కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. -
జనం.. జైత్రయాత్ర
రాష్ట్రంలో సామాజిక చైతన్యం వెల్లివిరిసింది. కర్నూలు, ఎన్టీఆర్ జిల్లా నందిగామ, తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో ఆదివారం నిర్వహించిన సామాజిక సాధికార యాత్రలకు ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. సీఎం జగన్ పాలనలో తాము సాధించిన సాధికారతను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు చాటిచెప్పారు. ఈ సందర్భంగా మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ.. ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను చంద్రబాబు అవహేళన చేసి కించపరిస్తే.. జగన్ వారందరినీ చేయిపట్టి అభివృద్ధి పథం వైపు నడిపించారు. ఎన్నడూలేనన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి.. బడుగులకు లబ్ధి చేకూర్చి వారి అభివృద్ధికి బాటలు వేశారు. పదవుల్లోనూ అధిక ప్రాధాన్యమిచ్చిన ఏకైక సీఎం జగన్’ అని వివరించారు. నందిగామ (పెనుగంచిప్రోలు): ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సామాజిక చైతన్యం వెల్లివిరిసింది. ఆదివారం సాయంత్రం నందిగామలో నిర్వహించిన సామాజిక సాధికార యాత్రకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు అసంఖ్యాకంగా హాజరయ్యారు. యువత పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. నియోజకవర్గం నలుమూలల నుంచి యాత్రకు తరలివచ్చిన వారితో పట్టణంలోని వీధులన్నీ కిటకిటలాడాయి. జై జగన్.. జగనే కావాలి అంటూ వారు చేసిన నినాదాలతో పట్టణం మార్మోగింది. పట్టణంలోని గాంధీ సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభకు జనం వెల్లువలా తరలి వచ్చారు. 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కేవలం ఓటు బ్యాంక్‌గా వాడుకుని వదిలేయగా జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక అన్ని విధాలా బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేసి రాజ్యాధికారం కల్పించారని వక్తలు చెప్పటంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున హర్షం వ్యక్తమైంది. వైఎస్ జగన్మోహన్రెడ్డికి మరోసారి అధికారం ఇవ్వాలని మంత్రులు, నేతలు పిలుపునివ్వటంతో ప్రజలు జై జగన్.. అంటూ పెద్ద ఎత్తున మద్దతు పలికారు. జగనన్న పాలనలో సామాజిక విప్లవం : మంత్రి మేరుగు నాగార్జున సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో సామాజిక విప్లవం వచ్చిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. స్వాతంత్య్రం వచ్చాక ఎందరో మహనీయులు సామాజిక విప్లవం రావాలని కోరుకున్నారని, వారి ఆశయాలను సాధ్యం చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని తెలిపారు. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అవహేళన చేస్తూ చంద్రబాబు అన్నమాటలను ఎవరూ మరచి పోరాదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అగ్రతాంబూలం ఇచ్చిన లీడర్ ఒక్క జగనే అని అన్నారు. చంద్రబాబు ఒక గజదొంగ అని, చట్టాలను అనుకూలంగా మార్చుకుని బడుగు, బలహీన వర్గాల హక్కులను కాలరాశారని చెప్పారు. సామాజిక సాధికారత విధానంగా...: డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో రాష్ట్రంలో సామాజిక సాధికారత ఒక నినాదంగా కాకుండా విధానంగా అమలు జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అన్ని విధాలుగా మోసం చేశారని చెప్పారు. వైఎస్ జగన్ వచ్చిన తర్వాతే ఈ వర్గాలు తలెత్తుకొని తిరుగుతున్నాయన్నారు. కేబినెట్లో 25 మంది మంత్రులు ఉంటే 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అవకాశం కల్పించిన ఘనత ఒక్క జగన్మోహన్రెడ్డికి మాత్రమే దక్కుతుందన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వలేదన్నారు. జగన్ ప్రభుత్వంలో మొదటి కేబినెట్లోనే తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారన్నారు. శాసనçÜభలో, శాసన మండలిలో నలుగురు మైనార్టీలకు అవకాశం ఇచ్చారన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వంలో ఐదేళ్లలో కేవలం రూ.2,650 కోట్లు కేటాయిస్తే, సీఎం జగన్ ఈ నాలుగున్నరేళ్లలోనే రూ.23,175 కోట్లు ఖర్చు చేశారన్నారు. జగనన్నను గుండెల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగమే స్ఫూర్తి..: జోగి అంబేడ్కర్ రాజ్యాంగమే స్ఫూర్తిగా, పూలే ఆలోచనలను జోడించి సీఎం సామాజిక న్యాయం అమలు చేస్తున్నారని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర దేశంలో సామాజిక న్యాయం ఒక్క జగన్ వల్లనే సాధ్యమైందన్నారు. చంద్రబాబు వర్ల రామయ్యకు రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పి ఆనక కనకమేడల రవీంద్రకు కేటాయించటం బడుగు, బలహీన వర్గాల పట్ల ఆయనకు ఉన్న వైఖరి అర్ధమవుతుందన్నారు. 2024 ఎన్నికల్లో అందరూ జగన్‌కు మద్దతు పలకాలన్నారు. నందిగామ, జగ్గయ్యపేట, పామర్రు, పెనమలూరు ఎమ్మెల్యేలు మొండితోక జగన్మోహన్రావు, సామినేని ఉదయభాను, కైలే అనిల్‌కుమార్, కొలుసు పార్థసారథి, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, మొండితోక అరుణ్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకరరావు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక పాల్గొన్నారు. -
పలమనేరులో మిన్నంటిన సాధికార నినాదం
సాక్షి, చిత్తూరు/పలమనేరు: సాధికార నినాదంతో చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం మార్మోగింది. నియోజకవర్గంలోని పలమనేరు, పెద్దపంజాణి, వీకోట, బైరెడ్డిపల్లి మండలాల నుంచి భారీగా తరలి వచ్చిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలతో శనివారం సామాజిక సాధికార బస్సు యాత్ర ఘనంగా జరిగింది. యాత్రలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నేతలు తొలుత గంగవరం వద్ద వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళుర్పిం చారు. ఆనంతరం భారీ జనసందోహం మధ్య యాత్ర బయల్దేరింది. ఈ యాత్రకు అడుగగడునా ప్రజలు నీరాజనాలు పలికారు. జై జగన్ అని నినదిస్తూ పూలు జల్లుతూ యాత్రకు స్వాగతం పలికారు. అనంతరం అశేష జన సందోహం మధ్య సామాజిక సాధికార సభ జరిగింది. సభ ఆద్యంతం జై జగన్, జగనే కావాలి అంటూ ప్రజలు నినాదాలతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు. సన్నగా వర్షం కురుస్తున్నప్పటికీ లెక్కచేయకుండా సభను విజయవంతం చేశారు. జగనన్నతోనే సామాజిక న్యాయం: డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అక్కున చేర్చుకొని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా చెప్పారు. సామాజిక న్యాయమంటే ఏమిటో చేతల్లో చూపించిన ముఖ్యమంత్రి జగన్ ఒక్కరేనని తెలిపారు. సీఎం జగన్ అధికారంలోకి వస్తూనే బడుగు, బలహీన వర్గాలకు అత్యంత ఆవశ్యకమైన విద్య, వైద్య రంగాలను అత్యాధునికంగా తీర్చిదిద్దారని, అందరికీ సొంతింటి కలను నిజం చేస్తున్నారని, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నారని తెలిపారు. రాజకీయ రంగంలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అందలం ఎక్కిస్తున్నారన్నారు. కేబినెట్ నుంచి నామినేటెడ్ పదవుల వరకు అన్నింటిలోనూ ఈ వర్గాలకే పెద్ద పీట వేశారని చెప్పారు. సీఎం జగన్ చలవతో నేడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు తలెత్తుకొని తిరుగుతున్నారని అన్నారు. సీఎం జగన్ అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నారు: డిప్యూటీ సీఎం నారాయణస్వామి రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నది సీఎం వైఎస్ జగన్ మాత్రమేనని డిప్యూటీ సీఎం నారాయణస్వామి చెప్పారు. సీఎం జగన్ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమాన్ని అందిస్తున్నారని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో చంద్రబాబు, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ 5 అభివృద్ధి నిరోధక శక్తులని పేద పిల్లల చదువుల కోసం ట్యాబ్‌లిస్తే వాటి కారణంగా ఎంతో నష్టమంటూ రామోజీరావు తప్పుడు కథనం రాశారని, ఆయన మనవడు మాత్రం ట్యాబ్‌లు వాడొచ్చా అని ప్రశ్నించారు. రూ.700 కోట్లతో పలాసలో ఫిల్టర్ నీళి్చచ్చి, కిడ్నీ ఆస్పత్రిని కట్టినా ఎల్లోమీడియా కడుపు మంటతో తప్పుడు రాతలు రాసిందన్నారు. ప్రతిపక్షానికి బాధగా ఉంది: మంత్రి జయరామ్ బీసీలకు పెద్దపీట వేసింది సీఎం వైఎస్ జగన్ మాత్రమేనని మంత్రి గుమ్మనూరు జయరామ్ తెలిపారు. మన బిడ్డలు బాగా చదివి బాగుపడుతుంటే ప్రతిపక్షానికి చాలా బాధగా ఉందని అన్నారు. వాల్మీకి కులస్థుడైన తన తలరాతను మార్చింది కేవలం జగనన్నే అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మేలు జరగాలంటే జగనన్న రావాల్సిందే మాజీమంత్రి, నెల్లూరు ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. నాఎస్సీ, నా ఎస్టీ, నాబీసీ, నా మైనారిటీ అని చెప్పే వ్యక్తి సీఎం జగన్ మాత్రమేనని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో పనులు కావాలంటే జన్మభూమి కమిటీ వాళ్ళ ఇంటి ముందుకెళ్లి నిలబడాలని, అదే వైఎస్ జగన్ ప్రభుత్వంలో పథకాలే ఇంటి ముందుకొస్తున్నాయని తెలిపారు. పక్క రాష్ట్రంలో 8 చోట్ల పోటీ చేసినా డిపాజిట్లు దక్కని దత్తపుత్రుడు ఇక్కడకొచ్చి తాటతీస్తా.. తొక్కతీస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మరో శ్రీలంక అని విషప్రచారం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయినప్పటి నుంచి ఇప్పటివరకు పలమనేరు నియోజకవర్గంలో సంక్షేమం, అభివృద్ధికి రూ.2,200 కోట్లు ఖర్చు చేశారని పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ చెప్పారు. ఈ అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే మళ్లీ సీఎం జగన్నే ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీలు భరత్, రమేష్ యాదవ్, డీసీసీబీ చైర్పర్సన్ రెడ్డెమ్మ తదితరులు పాల్గొన్నారు. నేడు గోపాలపురం నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర దేవరపల్లి: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మేలు, వారిని సామాజిక సాధికారత వైపు నడిపించిన వైనాన్ని వివరించేందుకు వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర ఆదివారం తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో జరగనుంది. -
సాధికార నినాదంతో మురిసిన మహేంద్ర తనయ
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సాధికార నినాదంతో మహేంద్ర తనయ నది మురిసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల విజయ సంకేతాలతో మెరిసింది. మహేంద్ర తనయ తీరంలోని శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర బుధవారం ఘనంగా జరిగింది. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన బడుగు, బలహీనవర్గాలతో పాతపట్నం కిటకిటలాడింది. యాత్రకు దారి పొడవునా జనం బ్రహ్మరథం పట్టారు. బూరగాం నుంచి పాతపట్నంలో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు వచ్చే సరికి జనాలతో ఆ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన ప్రసంగాలకు జనం జేజేలు పలికారు. పేదల సంక్షేమంలో సీఎం జగన్ నంబర్ వన్ : మంత్రి ధర్మాన ప్రసాదరావు మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. పేదలకు సంక్షేమాన్ని అందించడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మించిన వారు లేరని చెప్పారు. సంక్షేమ పథకాల ద్వారా రూ. 2.40 లక్షల కోట్లు రాష్ట్ర ప్రజలకు అందజేశారని తెలిపారు. ఆకలి చూసి, కన్నీరు తుడవడమే సీఎం జగన్‌కు తెలుసునని అన్నారు. పేదలకు గూడు, నీడ కల్పించాలన్న లక్ష్యంతో రూ. 12,800 కోట్లతో భూమి కొని మరీ 32 లక్షల ఇళ్లు నిర్మాణం చేస్తున్నారని వివరించారు. నాడు–నేడు, జగనన్న ఆరోగ్య సురక్ష, ఆరోగ్య శ్రీ వంటి పథకాలతో ప్రజల జీవన స్థితిగతుల్లో పెద్ద ఎత్తున మార్పు వస్తుందని చెప్పారు. ఒకప్పుడు విత్తనాలు, ఎరువుల కోసం క్యూలో కొట్లాటలు జరిగేవని, జగన్ పాలనలో రైతులకు అలాంటి ఇబ్బందులు లేవన్నారు. చంద్రబాబులా రాజకీయాలు చేసి లబ్ధిదారుల ఎంపిక ఏనాడూ చేయలేదని చెప్పారు. చంద్రబాబు పధ్నాలుగేళ్ల పాలనలో శ్రీకాకుళం జిల్లాకు ఒక్క మంచి పని చేయలేదన్నారు. బాబు అధికారంలో జన్మభూమి కమిటీలతో ప్రజలను వేధించారని తెలిపారు. పైసా అవినీతి జరగలేదు: స్పీకర్ తమ్మినేని సీతారాం బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సీఎం వైఎస్ జగన్ పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. ఒక్క పైసా అవినీతి లేకుండా లక్షల కోట్లు ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో పైసా అవినీతి లేకుండా పాలన జరుగుతోందని, అవినీతి జరిగినట్లు రుజువు చేస్తే స్పీకర్ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని సీఎం జగన్ బడుగుల అభివృద్ధికి పాటు పడుతున్నారని అన్నారు. రాజ్యాంగ ఆశయాల సాధన: ఎమ్మెల్యే కళావతి పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి మాట్లాడుతూ ఉత్తరాంధ్రలోని అత్యంత వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్ పెద్ద ఎత్తున నిధులు కేటాయించి పలు కీలక ప్రాజెక్టులు చేపడుతున్నారని వివరించారు. గిరిజనులకు పోడు భూముల హక్కులిచ్చారని తెలిపారు. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం: ఎమ్మెల్యే రెడ్డి శాంతి పాలకొండ నియోజకవర్గంలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలకు వైఎస్ జగన్ పరిష్కారం చూపించారని ఎమ్మెల్యే రెడ్డి శాంతి తెలిపారు. వంశధార నిర్వాసితుల నోటి ముందున్న కూడును కూడా టీడీపీ నేతలు లాక్కున్నారని చెప్పారు. ప్రతిపక్ష హోదాలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్ జగన్ సీఎం కాగానే వంశధార నిర్వాసితులకు రూ. 216 కోట్లు అదనపు పరిహారం అందించారని తెలిపారు. రూ.750 కోట్లతో వైఎస్సార్ శుద్ధ జలం ప్రాజెక్టును చేపట్టి ఉద్దానం ప్రజల కష్టాలను తీరుస్తున్నారన్నారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీలు పాలవలస విక్రాంత్, వరుదు కల్యాణి, నర్తు రామారావు, ఎమ్మెల్యేలు గొర్లె కిరణ్‌కుమార్, కంబాల జోగులు, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పాల్గొన్నారు. -
నేడు పాతపట్నంలో సాధికార యాత్ర
సాక్షి, అమరావతి: సీఎం జగన్ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అభివృద్ధి పథంలో నిలిపిన వైనాన్ని వివరిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. బుధవారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరగనుంది. -
చోడవరంలో సాధికార స్వరం
సాక్షి, అనకాపల్లి: అనకాపలి జిల్లా చోడవరంలో మంగళవారం సాధికార నినాదం హోరెత్తింది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఆర్థికంగా, సామాజికంగా సాధికారత సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు నియోజకవర్గంలో కదం తొక్కాయి. వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేశాయి. ఇది బడుగు, బలహీన వర్గాల విజయయాత్రలా సాగింది. యువత బైక్ ర్యాలీతో సందడి చేశారు. వందలాది బైక్‌లు, కార్లు, ఆటోలతో ప్రారంభమైన బస్సు యాత్రలో నియోజకవర్గంలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధిని వివరించారు. కొత్తకోట జెడ్పీ హైస్కూల్లో నాడు–నేడు ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. బుచ్చెయ్యపేటలో జల్‌జీవన్ మిషన్‌ను ప్రారంభించారు. అనంతరం వేలాదిమందితో వడ్డాదిలో భారీ బహిరంగ సభ జరిగింది. జయహో జగన్ అంటూ పెద్ద సంఖ్యలో ప్రజలు నినదించారు. పేదల స్థితిగతులు మార్చిన సీఎం జగన్: మంత్రి ధర్మాన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో పేదల స్థితిగతులను మార్చారని, ఆర్థికంగా బలోపేతం చేసి సంఘంలో గౌరవాన్ని పెంచారని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల రూపంలో రూ.2.60 లక్షల కోట్లు పేదల ఖాతాల్లో సీఎం జమ చేశారని తెలిపారు. అవినీతికి తావు లేకుండా పాలన అందిస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో రాష్ట్రంలో వ్యవసాయం దయనీయంగా ఉండేదని, వ్యవసాయ వృద్ధి రేట్లో 16వ స్థానంలో ఉండేదని తెలిపారు. సీఎం జగన్ వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి, రైతులకు అండదండలందించారని, దాంతో వ్యవసాయ రంగంలో ఏపీ 4వ స్థానానికి ఎదిగిందని వివరించారు. కోట్లాది రైతులు, పేదల కుటుంబాలలో వెలుగులు నింపిన వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎంను చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వేదికపై ప్రసంగిస్తున్న మంత్రి కారుమూరి జగన్ పథకాలతో పేదరికం తగ్గింది : ఎంపీ నందిగం సురేష్ వైఎస్ జగన్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో పేదరికం తగ్గిందని ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. అమెరికా అధ్యక్షుడు వస్తే అప్పటి సీఎం చంద్రబాబు బిచ్చగాళ్లను దాచిపెట్టారని, ఇలా పేదరికాన్ని దాచకూడదని, తగ్గించాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందించడం ద్వారా సీఎం జగన్ పేదరికాన్ని రూపుమాపుతున్నారని అన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను సీఎం జగన్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తీరు అద్భుతమని చెప్పారు. దళిత రైతు బిడ్డనైన తనను సీఎం జగన్ ఢిల్లీలో ప్రధానమంత్రి పక్కన కూర్చోబెట్టారన్నారు. ఒకప్పుడు ఏ ప్రధానిని చూడాలనుకున్నానో.. అదే ప్రధాని పక్కన కూర్చున్నానంటే ఇది కాదా సామాజిక సాధికారత అని అన్నారు. ఒంటరిగా పోరాటం చేసిన దళిత బిడ్డ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా పవన్‌కు తెలంగాణలో రాలేదని, వారు వచ్చే ఎన్నికల్లో ఏమి సాధిస్తారని ప్రశ్నించారు. అందరి సంక్షేమమే సీఎం జగన్ ధ్యేయం: మంత్రి కారుమూరి రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ధ్యేయమని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చెప్పారు. సీఎం జగన్ సంక్షేమాన్ని అందించడంలో కుల, మత, పార్టీ, ప్రాంతీయ భేదాలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ పైసా అవినీతికి తావు లేకుండా సంక్షేమాన్ని అందిస్తున్నారన్నారు. డిప్యూటీ సీఎం రాజన్న దొర మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని ప్రతి ఒక్కరూ సైనికుల్లా ముందుకు కదిలి మరోసారి జగన్‌ను సీఎంగా ఎన్నుకోవాలన్నారు. చోడవరంలో రూ.1,900 కోట్లతో సంక్షేమం, అభివృద్ధి : కరణం ధర్మశ్రీ ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. సీఎం జగన్ చోడవరం నియోజకవర్గంలో 90 శాతం రాజకీయ, నామినేటెడ్ పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే అందించారన్నారు. నియోజకవర్గంలో సంక్షేమం, అభివృద్ధికి రూ.1,900 కోట్లు ఖర్చు చేశారన్నారు. ప్రధానంగా రూ.80 కోట్లతో రోడ్లు, నాడు – నేడు ద్వారా రూ.87 కోట్లు విద్యా రంగంలో ఖర్చు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, అనకాపల్లి ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి, ఎమ్మెల్యేలు పెట్ల ఉమాశంకర్ గణేష్, గొల్ల బాబురావు, తిప్పల నాగిరెడ్డి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి పాల్గొన్నారు. -
రాజంపేట.. జనంతోట
సాక్షి రాయచోటి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయూతతో ఆర్థికంగా, సామాజికంగా నిలదొక్కుకొన్న బడుగు, బలహీన వర్గాలు అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో సాధికారతను ప్రదర్శించాయి. నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు మంగళవారం రాజంపేటకు తరలివచ్చారు. వేలాది మంది జై జగన్ నినాదాలు చేస్తుండగా వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర సాగింది. మధ్యాహ్నం మన్నూరు వద్దగల యల్లమ్మ ఆలయంలో నేతలు పూజలు చేసి ర్యాలీని ప్రారంభించారు. అక్కడి నుంచి యాత్ర పాత బస్టాండ్ వరకు సాగింది. వేలాది ప్రజలు హాజరైన సభలో నేతలు ప్రసంగించారు. బడుగు, బలహీనవర్గాలను వెన్ను తట్టి నడిపించిన నాయకుడు జగన్: డిప్యూటీ సీఎం అంజాద్బాష రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచి వారిని వెన్నుతట్టి నడిపించిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని డిప్యూటీ సీఎం అంజాద్బాష చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అభివృద్ధి పథంలో నడిపించి, సామాజిక న్యాయంతో సాధికారత సాధించిన సీఎం దేశంలో వైఎస్ జగన్ ఒక్కరేనని అన్నారు. కేవలం మాటలతో సరిపెట్టక, ఆలోచనలతో ఆగిపోకుండా, ఆచరణలో అనేక పథకాలతో పేదల ఆర్థికస్థాయిని పెంచారని, రాజకీయంగా ఉన్నత పదవులిచ్చి సామాజిక సాధికారతకు అసలైన అర్థం చెప్పారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్లో 17 పదవులిచ్చారని, ఇతర పదవులు, నామినేటెడ్ పదవుల్లోనే అధికశాతం ఈ వర్గాలకే ఇచ్చారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మరింతగా అభివృద్ధి సాధించాలంటే జగన్‌ను మరోసారి సీఎంను చేసుకోవాలన్నారు. మనకు, పిల్లల భవిష్యత్తుకు వైఎస్ జగన్ అవసరం: మంత్రి మేరుగు మనతోపాటు మన పిల్లల భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరికొంత కాలం సీఎంగా ఉండాల్సిన అవసరం ఉందని మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. అనేక సంక్షేమ పథకాలతో బడుగులకు అండగా నిలుస్తున్న నాయకునికి మద్దతు ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు గుండెల మీద చేయి వేసుకుని బతుకుతున్నారంటే అది సీఎం జగన్ చలవేనని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలను అడుగడుగునా అవహేళన చేసి, అవమానించిన చంద్రబాబు ఓ దురహంకారి అని అభివర్ణించారు. రాష్ట్రంలో బడుగులకే పెద్దపీట: మాజీ ఎంపీ బుట్టా రేణుక రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకే సీఎం జగన్ పెద్దపీట వేసి, వారిని అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని మాజీ ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా బీసీలను ఉన్నత స్థానాల్లో నిలుపుతోందని తెలిపారు. ప్రతి హామీని నెరవేర్చారు సీఎం జగన్ : ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలంటూ ఈ వర్గాలన్నింటినీ అక్కున చేర్చుకున్న ముఖ్యమంత్రి దేశంలో జగనన్న ఒక్కరేనని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ కొనియాడారు. విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చేసి, బడుగు బలహీనవర్గాల పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తున్నారన్నారు. ఇంగ్లిష్ చదువులతో పేద, వెనుకబడిన వర్గాల పిల్లలు అంతర్జాతీయస్థాయిలో పోటీపడాలని తపిస్తున్న జగనన్నను 2024లో మరోమారు ముఖ్యమంత్రిని చేసుకొనేందుకు ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి , జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి, రాయలసీమ జిల్లాల సమన్వయకర్త, ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, కడప మేయర్ సురే‹Ùబాబు, ఎమ్మెల్సీ రమే‹Ùయాదవ్, టీటీడీ బోర్డు మెంబర్ అశ్వర్థనాయక్ పాల్గొన్నారు. -
CM Jagan: సింహంలా ఒక్కరే వస్తారు
సాక్షి, అన్నమయ్య: రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును వివరించడానికి వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతంగా సాగుతోంది. మంగళవారం అన్నమయ్య జిల్లాలో రాజంపేట నియోజకవర్గాల్లో సామాజిక సాధికార యాత్ర జరుగుతోంది. రాజంపేట బహిరంగ సభలో వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు మాట్లాడారు. ఇప్పటివరకు ఎంతో మంది ముఖ్యమంత్రులను చేశామని, కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం సామాజిక సాధికారత సాధించి చరిత్ర తిరగరాశారని అన్నారు. సీఎం జగన్ ఎంతో మంది సామాన్యులకు పదవులిచ్చారని తెలిపారు. బీసీలను రాజ్యసభకు పంపిన గొప్ప వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. మళ్లీ కొందరు అబద్దపు హామీలతో మోసం చేసేందుకు వస్తున్నారని అన్నారు. వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. వైఎస్ జగన్‌ను అశీర్వదించండని కోరారు. రాజంపేట ప్రజలు అదృష్టవంతులని.. రామలక్ష్మణుల్లా మల్లికార్జునరెడ్డి, అమరనాథ్‌రెడ్డిలు రాజంపేటను కాపాడుతున్నారని డిప్యూటి సీఎం అంజాద్ బాషా అన్నారు. రాజంపేట బహిరంగ సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మల్లికార్జునరెడ్డి, అమరనాథ్‌రెడ్డి వంటి నాయకులు రాజంపేటకు ఉండటం అదృష్టమని తెలిపారు. సామాజిక న్యాయాన్ని ఇంత వరకు ఎప్పుడైనా చూశామా? బీసీలు తనకు పేటెంట్ అని చెప్పిన చంద్రబాబు బీసీలను వాడుకొని వదిలేశారని ఆరోపించారు. కానీ ఆచరణలో సీఎం వైఎస్ జగన్ చేసి చూపారని గుర్తుచేశారు. ఇంటికొకరు ఇంజనీరు, వైద్యలు ఉండాలని ఆనాడు దివంగత వైఎస్సార్ ఆశించారని తెలిపారు. ఇప్పుడు ఆయన తనయుడు అదే పరిపాలనను కొనసాగిస్తున్నారని అన్నారు. టీడీపీ హాయంలో మైనార్టీ మంత్రి, ఎమ్మెల్యే లేరని, ఓట్ల కోసమే చివరలో ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశారని మండిపడ్డారు. అదే వైఎస్ జగన్ మైనార్టీని డిప్యూటి సీఎంను చేశారని గుర్తుచేశారు. అనేక మందిని కార్పోరేషన్లకు చైర్మన్లుగా చేశారని పేర్కొన్నారు. కేవలం జగన్‌ను ఎదుర్కొవడానికి అన్ని పార్టీలు ఎకమవుతున్నాయని అన్నారు. ఎంతమంది ఏకమైనా సింహంలా జగన్ ఒక్కరే వస్తారని తెలిపారు. సీఎం జగన్‌ను ప్రతి ఒక్కరు ఆశీర్వదించాల్సిన అవసరం ఉందని అంజాద్ బాషా అన్నారు. రాజంపేటలో అభివృద్ది జరిగిందంటే దివంగత వైఎస్అర్, వైఎస్ జగన్ హాయంలోనే జరిగిందని కడప జడ్పీ ఛైర్మన్ అకేపాటి అమరనాధరెడ్డి తెలిపారు. రాజంపేట బహిరంగ సభలో అకేపాటి అమరనాధరెడ్డి మాట్లాడారు. రాజంపేటలో తాగునీరు సమస్య లేదంటే అది వైఎస్అర్ చలువే అన్నారు. రాజంపేటకు ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, తాను ప్రజలకు వాచ్మెన్లలా ఉన్నామని, అందరికీ అండగా ఉన్నామని తెలిపారు. ఇక్కడ ఎమ్మెల్యే గెలిపించి రాష్టంలో సీఎంగా వైఎస్ జగన్ గెలిపించాలని అన్నారు. అన్ని కులాలపై ప్రేమ చూపిన వ్యక్తి జగన్ అని కొనియాడారు. అందరినీ విద్యావంతులను చేయ్యాలని అనేక సంస్కరణలు చేశారని గుర్తుచేశారు. ఇప్పుడున్న పథకాలన్ని అమలవ్వాలంటే మళ్లీ జగనే రావాలని తెలిపారు. -
‘పేదల గౌరవం పెంచిన సీఎం జగన్’
సాక్షి, అనకాపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలోనే రాష్ట్రంలో సామాజిక న్యాయం జరిగిందని వైఎస్సార్సీపీ కీలక నేతలు అన్నారు. మంగళవారం జిల్లాలోని చోడవరం నియోజకవర్గంలో జరిగిన సామాజిక బస్సు యాత్ర తదనంతర బహిరంగ సభలో వివిధ వర్గాలకు సీఎం జగన్ చేసిన మంచితో పాటు టీడీపీ దుష్ప్రచారాన్ని జనాలకు వాళ్లు తెలియజేశారు. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ నేతృత్వంలో ఈ సభ జరిగింది. ‘‘గత ప్రభుత్వం వెనుకబడిన వర్గాలను పట్టించుకోలేదు. దళితుల్ని అవమానించిన వ్యక్తి చంద్రబాబు. కానీ, వెనుకబడిన వర్గాలను జగన్ గుండెల్లో పెట్టుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు న్యాయం చేసిన నాయకుడు జగన్. కేబినెట్లో.. నామినేటెడ్ పోస్టుల భర్తీల్లోనూ వెనుకబడిన వర్గాల వాళ్లకే ప్రాధాన్యం ఇచ్చారు. అవినీతికి తావు లేకుండా సంక్షేమం అందించాం. కుల, మత.. రాజకీయ పార్టీలతో సంబంధంలేకుండా సంక్షేమ పథకాలు అందించాం. .. సీఎం జగన్ పాలన ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. రూ.2.67 లక్షల కోట్లను నేరుగా లబ్ధి దారుల ఖాతాలో జమ చేశాం. ఇచ్చిన హామీలు సీఎం జగన్ నెరవేర్చారు. కానీ, ప్రభుత్వంపై టీడీపీ విష ప్రచారం చేస్తోంది. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా.. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీదే విజయం. ప్రజలు సీఎం జగన్నే మళ్లీ కోరుకుంటున్నారు’’ అని వైఎస్సార్సీపీ నేతలు అన్నారు. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. ‘‘రూ. 1,900 కోట్లతో చోడవరం నియోజక వర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. రూ. 80 కోట్ల రూపాయలతో నియోజక వర్గంలో రోడ్లను ఏర్పాటు చేశాం. విద్యా రంగంలో నాడు నేడు కోసం రూ.87 కోట్లు ఖర్చు చేశాం. జనసేన-టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా సీఎం జగన్ విజయాన్ని అడ్డుకోలేరు. జయహో జగన్.. అంటూ పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవ్వడమే దీనికి నిదర్శనం. ఎంపీ సత్యవతి మాట్లాడుతూ.. సభకు వచ్చిన జనాలను చూస్తే వార్ వన్ సైడ్ అవుతుందనిపిస్తోంది. కులాలు మతాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం. సీఎం జగన్.. సుదీర్ఘ కాలం పాదయాత్ర ప్రజల కష్టాలను తెలుసుకున్నారు. ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశారు. జిల్లాకు ఒక మెడికల్ ఏర్పాటు చేశారు. కాబట్టి.. 175 స్థానాలకు 175 స్థానాలను వైఎస్సార్సీపీ గెలుచుకుంటుంది. ఎంపీ నందిగాం సురేష్ మాట్లాడుతూ.. చంద్రబాబు బడుగు,బలహీన వర్గాల్ని అవమానించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు జగన్ మోహన్ రెడ్డికి సంపూర్ణ మద్ధతు ఇస్తున్నారు. వైఎస్ జగన్ పాలనతో ఏపీలో పేదరికం తగ్గింది. చంద్రబాబుకు ఏదో ఒక రోజు శిక్ష పడుతుందని కోర్టులు చెబుతున్నాయి. ఈ రాష్ట్రానికి లోకేష్ అవసరం ఏముంది?. రాష్ట్ర సంపదను దోచుకున్నారు. అందువల్లే టీడీపిని ప్రజలు పక్కన పెట్టారు. ఆకలి తీర్చే నాయకుడు కావాలో-మోసం చేసే నాయకుడు కావాలో ప్రజలు ఆలోచన చేయాలి. టీడీపీకి జనసేన పార్టీని అద్దెకు ఇచ్చారు. పవన్ అవసరం అయినప్పుడు తన పార్టీని తాకట్టు పెడుతున్నారు. తెలంగాణలో పవన్‌కు డిపాజిట్లు రాలేదు. బర్రెలక్కకు అంతకన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి. పవన్ కల్యాణ్,చంద్రబాబు,లోకేష్ అవసరం ఈ రాష్ట్రానికి లేదు. సింగిల్ గా పోటీ చేసే దమ్ము, ధైర్యం లేదు వీళ్లకు. సీఎం జగన్ ప్రజల్ని మాత్రమే నమ్ముకున్నారు. మంత్రి కారుమురి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ‘‘టీడీపీ హయాంలో రూ.400 కోట్లు కూడా చోడవరం కోసం ఖర్చు చేయలేదు. అదే ఈ నాలుగున్నరేళ్లలో రూ.1,900 కోట్లు జగనన్న ప్రభుత్వం ఖర్చు చేసింది. చంద్రబాబు తన హయాంలో టీడీపీ కార్యకర్తలకు మాత్రమే పథకాలు ఇవ్వాలని ఆదేశించారు. అదే సీఎం జగన్ .. అర్హులైన వాళ్లందరికీ పథకాలు వర్తింపజేయాలని చెప్పారు. ఇచ్చిన ప్రతీ హామీనే కాదు.. ఇవ్వని మరికొన్ని హామీల్ని కూడా సీఎం జగన్ అమలు చేశారు. విద్యా విప్లవం తెచ్చిన ఘనత కూడా సీఎం జగన్‌దే. మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో వ్యవసాయం తిరోగామిలోకి వెళ్లింది. అదే వైఎస్సార్సీపీ హయాంలో మాత్రం అభివృద్ధి పెరిగింది. ఆ టైంలో జీడీపీ 16వ స్థానంలో ఉంటే.. ఇప్పుడు 4వ స్థానంలో ఉంది. రైతుల కోసం రైతు భరోసా కేంద్రాల్ని ఏర్పాటు చేశాం. ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండరు. పేదల ఖాతాల్లో 2 లక్షల 40 వేల కోట్ల రూపాయలు జమ చేసిన ఘనత సీఎం జగన్‌దే. రూపాయి అవినీతికి తావులేకుండా పాలన ఏపీలో సాగుతోంది. డబ్బు ఇవ్వటమే కాదు పేదవాని గౌరవాన్ని పెంచారు. నాడు-నేడు ద్వారా విద్యా వ్యవస్థలో సమూలా మార్పులు తెచ్చారు. రాబోయే రోజుల్లో విద్యా వ్యవస్థ లో ఆంధ్రప్రదేశ్ ముందు వరసలో ఉంటుంది. చంద్రబాబుకు అధికారం ఇస్తే మళ్ళీ రైతాంగం నాశనం అవుతుంది. అన్ని వ్యవస్థలు నాశనం అవుతాయి. -
గత ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను పట్టించుకోలేదు: బుట్టారేణుక
-
ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో సామాజిక సాధికార యాత్ర
-
రాజంపేటలో బహిరంగ సభ
-
నేడు చోడవరం, రాజంపేట నియోజకవర్గాల్లో సాధికార యాత్ర
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును వివరించడానికి వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతంగా సాగుతోంది. మంగళవారం అనకాపల్లి జిల్లాలో చోడవరం, అన్నమయ్య జిల్లాలో రాజంపేట నియోజకవర్గాల్లో సామాజిక సాధికార యాత్ర జరుగుతుంది. బడుగు, బలహీన, వెనుకబడిన, మైనార్టీ వర్గాలకు సీఎం జగన్ చేసిన మేలును యాత్రలో ఆ వర్గాలకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు వివరించనున్నారు. -
కమలాపురం.. జనసంద్రం
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ఆదివారం నిర్వహించిన సామాజిక సాధికార యాత్రకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు పోటెత్తారు. చెన్నూరులో నిర్వహించిన బహిరంగ సభకు జనం వెల్లువలా తరలివచ్చారు. వివిధ గ్రామాల నుంచి డప్పుల దరువులు, ఆటపాటలతో ప్రజానీకం ర్యాలీగా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. ఇలా వేలాది మంది తరలి రావడంతో సభాస్థలిలో అందరూ కూర్చునే పరిస్థితి లేకుండా పోయింది. వెరసి చెన్నూరులో ఎటు చూసినా, ఏ వీధిలో చూసినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వైఎస్సార్సీపీ జెండాలను రెపరెపలాడిస్తూ కనిపించారు. కమలాపురం ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాయకులు తమ ప్రసంగాల్లో సీఎం జగన్ పేరును ఉచ్ఛరించగా.. సభికులు పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు. అంబేడ్కర్ ఆలోచన విధానాలు అమలు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జ్యోతిరావ్ పూలే, కొమురం బీమ్ వంటి మహానీయుల ఆలోచనలను అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డేనని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. అణగారిన వర్గాలకు అండగా, భావి తరాల ఉన్నతికి దూరదృష్టితో పెద్దపీట వేస్తున్న వైఎస్ జగన్‌ను మరోమారు మన కోసం ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కామెడీ యాక్టర్ పవన్, నయవంచకుడు చంద్రబాబు కలిసికట్టుగా వస్తున్నారని, వారి మాయమాటలు నమ్మొద్దని సూచించారు. సామాజిక సాధికారత మా విధానం : డిప్యూటీ సీఎం అంజద్‌బాషా స్వతంత్ర భారతదేశంలో సామాజిక సాధికారత అనేది ఒక నినాదంగానే మిగిలిపోయిందని, అయితే వైఎస్సార్సీపీ సామాజిక సాధికారతను తన విధానంగా మార్చుకుందని ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్బీ అంజాద్‌బాషా చెప్పారు. 2014–19 వరకు సాగిన టీడీపీ ప్రభుత్వంలో ఒక్క మైనార్టీకి కూడా మంత్రివర్గంలో స్థానం లభించలేదని, వైఎస్సార్సీపీ.. నలుగురు మైనార్టీలను ఎమ్మెల్యేలుగా చేసిందని, మరో నలుగురికి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించిందన్నారు. తనకు ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారని చెప్పారు. ఏపీలోనే సామాజిక విప్లవం: మంత్రి మేరుగు సామాజిక న్యాయం అనేది ఏపీలోనే, వైఎస్ జగన్ నాయకత్వంలోనే సాకారమైందని సాంఘిన సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. రాజ్యాంగ బద్ధంగా బడుగులకు రావాల్సిన హక్కులు సంక్రమిస్తున్నాయని తెలిపారు. చంద్రబాబు హయాంలో దళితులపై, బీసీలపై దాడులు చూశామని, దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అన్న నాడే చంద్రబాబు దళితద్రోహి అని తేలిపోయిందని, బీసీల తోకలు కత్తిరిస్తానన్న నాడే బీసీ వ్యతిరేకి అని వారు పసిగట్టారని చెప్పారు. సన్నిధి గొల్ల కొనసాగింపు: మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తిరుమల సన్నిధి గొల్లను తిరిగి కొనసాగించి రాష్ట్రంలోని యాదవుల ఆత్మగౌరవాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలిపారని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. రాయలసీమలో తొలిసారి యాదవులకు ఎమ్మెల్సీ దక్కిందని, మేయర్ పదవులను యాదవులకు అప్పగించి గౌరవించిన చరిత్ర సీఎం జగన్‌దేనన్నారు. ఆచరణలో చూపిన సీఎం: ఎంపీ అవినాష్‌రెడ్డి సామాజిక సాధికారిత కాగితాలకే పరిమితమయ్యేదని.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే దానిని ఆచరణలో చూపారని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి చెప్పారు. కేబినెట్ కూర్పు నుంచి నామినేటెడ్ పదవులు.. చివరకు ఆలయాల పాలక మండళ్లలో సైతం చిత్తశుద్ధి ప్రదర్శించారని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలకు సమన్యాయం పాటించిన చరిత్ర జగనన్నదేనని మాజీ ఎంపీ బుట్టా రేణుకా అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు రమేష్‌యాదవ్, రామచంద్రారెడ్డి, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి, టీటీడీ బోర్డు మెంబర్ యానాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
మడకశిరలో బడుగుల భారీ కవాతు
సాక్షి, పుట్టపర్తి: మడకశిర జన సాగరమైంది. బడుగులు భారీ కవాతు చేయగా.. తమకు మేలు చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపేందుకు జన సునామీ తరలివచ్చింది. గుండెల నిండా అభిమానం నింపుకుని ‘జై జగన్’ నినాదాలతో హోరెత్తించింది. నాలుగున్నరేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జరిగిన మేలును వివరించేందుకు వైఎస్సార్సీపీ తలపెట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర గురువారం శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో కొనసాగింది. వైఎస్సార్సీపీ రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచన మేరకు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ అధ్యక్షతన స్థానిక వైఎస్సార్ సర్కిల్లో నిర్వహించిన సామాజిక సాధికార బస్సుయాత్రలో జనం పోటెత్తారు. అంతకుముందు సరస్వతి విద్యామందిరం ఉన్నత పాఠశాల నుంచి నిర్వహించిన ర్యాలీలోనూ అభిమానులు, కార్యకర్తలు సందడి చేశారు. సభలోనూ బడుగు, బలహీన వర్గాల సామాజిక సాధికారత వెల్లివిరిసింది. సామాజిక సాధికార బస్సు యాత్రలో వేలాదిగా పాల్గొని వైఎస్ జగన్ అండతో తాము ఎంత ఉన్నతంగా బతుకుతున్నదీ వెల్లడించారు. చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఓటు బ్యాంకుగా వాడుకుని వదిలేయగా.. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నివిధాలా పెద్దపీట వేసి రాజ్యాధికారం కల్పించిన వైనాన్ని పలువురు నేతలు వెల్లడించగా.. సభికుల నుంచి పెద్దఎత్తున హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. బడుగులకు సాధికారత కల్పించిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి మరోమారు అధికారం కట్టబెడదామని మంత్రులు, నేతలు పిలుపునివ్వడంతో ప్రజలు ఈలలు, కేకలతో మద్దతు ప్రకటించారు. జగన్‌తోనే సామాజిక సాధికారత: మంత్రి జయరామ్ సీఎం జగన్‌తోనే సామాజిక సాధికారత సాధ్యం అవుతోందని జిల్లా ఇన్చార్జి మంత్రి గుమ్మనూరు జయరామ్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై జగన్ అపారమైన ప్రేమ చూపుతున్నారన్నారు. నాలుగున్నరేళ్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా సుమారు రూ.2.50 లక్షల కోట్లు నేరుగా బ్యాంకు ఖాతాలకు జమ చేసినట్టు వివరించారు. సంక్షేమ పాలన నిరంతరం అందాలంటే 30 ఏళ్లపాటు జగనన్నను సీఎంగా కొనసాగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జగన్ వచ్చాకే దళితులకు గౌరవం: ఎంపీ నందిగం జగన్ సీఎం అయ్యాక మంత్రివర్గంలో ఐదుగురికి చోటు కల్పించారని ఎంపీ నందిగం సురేష్ అన్నారు. అందులో ఒకరికి డిప్యూటీ సీఎంతో పాటు మరో మహిళకు హోంశాఖను కట్టబెట్టి గౌరవించారన్నారు. వైఎస్ కుటుంబం మేలు మరువలేం: ఎమ్మెల్యే తిప్పేస్వామి మడకశిర నియోజకవర్గానికి వైఎస్ కుటుంబం చేసిన మేలు మరువలేనిదని ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి అన్నారు. జగన్ సీఎం కాగానే.. ఏటా మడకశిరకు కృష్ణా జలాలు అందిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. నేరుగా మడకశిరకు కృష్ణా జలాలు తీసుకురావడానికి బైపాస్ కెనాల్ ఏర్పాటుకు రూ.214 కోట్లు మంజూరు చేశారని పేర్కొన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మంగమ్మ, ఎమ్మెల్యే శంకరనారాయణ, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, వివధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
సామాజిక జైత్ర యాత్ర.. హోరెత్తిన మడకశిర
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: మడకశిర నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరిగింది. మడకశిర పట్టణంలోని సరస్వతి విద్యామందిరం నుంచి వైఎస్సార్ సర్కిల్ దాకా బస్సు యాత్ర సాగింది. అనంతం వైఎస్సార్ సర్కిల్ లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యేలు డాక్టర్ తిప్పేస్వామి, శంకర్ నారాయణ, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్మన్ బోయగిరిజమ్మ, హిందూపురం వైఎస్సార్ సీపీ సమన్వయకర్త కురుబ దీపిక పాల్గొన్నారు. చంద్రబాబుకు విశ్వసనీయత లేదు. చంద్రబాబు ఇచ్చే హామీలను నమ్మొద్దు. మోసం చేయడం ఆయన అలవాటు. కులాలు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం జగన్‌దే. 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 175 సీట్లు ఖాయం -మంత్రి గుమ్మనూరు జయరాం చంద్రబాబు-పవన్ కళ్యాణ్ పొత్తు ఎలాంటి ప్రభావం చూపదు. తెలంగాణ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కంటే బర్రెలక్కకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ చంద్రబాబు. కేసుల భయంతో ఏపీ ప్రయోజనాలు తాకట్టు పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు. సీఎం జగన్ పేదల పక్షపాతి -హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ -
నేటి సామాజిక సాధికార బస్సుయాత్ర షెడ్యూల్..
శ్రీసత్యసాయి జిల్లా: వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర జిల్లాలోని మడకశిర నియోజకవర్గంలో కొనసాగనుంది. ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు మంత్రులు, ఎమ్మెల్యేల మీడియా సమావేశం ఉండనుంది. మడకశిర పట్టణం లోని సరస్వతి విద్యామందిరం నుంచి వైఎస్సార్ సర్కిల్ వరకూ బస్సుయాత్ర సాగనుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు మడకశిర వైఎస్సార్ సర్కిల్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. -
మాటల్లేవ్.. ఇది చేతల ప్రభుత్వం.. ప్రజల ప్రభుత్వం
వేలాదిగా తరలి వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు జై జగన్ నినాదాలతో హోరెత్తిన సభ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో సామాజిక సాధికారత సాధించిన వైనాన్ని వివరించిన నేతలు అనంతపురం జిల్లా రాప్తాడులో సామాజిక సాధికారత నినాదం మార్మోగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు వేలాదిగా తరలి వచ్చి..విజయయాత్ర చేశారు. ఈ సందర్భంగా మంత్రులు, నేతలు మాట్లాడుతూ.. ‘బడుగు, బలహీన వర్గాలను చంద్రబాబు అణిచివేస్తే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేయి పట్టుకుని అభివృద్ధి పథం వైపు నడిపించారు. ఆయన తెచ్చిన నవరత్నాల పథకాల ద్వారా ప్రతి ఇంటా వెలుగులు నిండాయి’ అని చెప్పారు. రాప్తాడు సాధికార మహోత్సవం అపూర్వం సాక్షి,అమరావతి/రాప్తాడు రూరల్: ఫ్యాక్షన్‌ను తోసిరాజని అనంతపురం జిల్లా రాప్తాడులో సామాజిక సాధికారత నినాదం మార్మోగింది. రాయలసీమ ప్రాంతంలో కీలక నియోజకవర్గం అయిన రాప్తాడులో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజల ఆదరాభిమానాలతో సామాజిక సాధికార బస్సు యాత్ర సోమవారం అపూర్వ రీతిలో ఉత్సవంలా సాగింది. వేలాదిగా తరలి వచ్చిన ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీ ప్రజలు విజయయాత్ర చేశారు. ముఖ్యంగా మహిళలు కూడా పెద్దసంఖ్యలో తరలిరావడం విశేషం. సీఎం వైఎస్ జగన్ పాలనలో తమకు లభించిన ప్రాధాన్యతను, రాజ్యాధికారం పొందిన వైనాన్ని ప్రజలకు వివరించారు. అనంతరం జరిగిన సభకు బడుగు, బలహీన వర్గాల ప్రజలు పోటెత్తారు. సీఎం జగన్ నామస్మరణతో సభా ప్రాంగణం మార్మోగింది. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో సామాజిక సాధికారత సాధించిన వైనాన్ని మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు వివరించినప్పుడు ప్రజలు పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు. ‘జగనన్నే మా భవిష్యత్తు.. 2024 ఎన్నికల్లో మళ్లీ వైఎస్ జగనే గెలవాలి .. జగనే కావాలి’ అంటూ ఒకే గళమై నినదించారు. దేశ చరిత్రలో ఒకే ఒక్కడు : కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ దేశ చరిత్రలో సామాజిక న్యాయం చేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ చెప్పారు. సీఎం జగన్ అణగారిన వర్గాలకు అండగా నిలిచి, వారి అభ్యున్నతికి పాటుపడుతున్నారని తెలిపారు. ఆయన తీసుకొచ్చిన నవరత్నాల పథకాల ద్వారా ప్రతి ఇంటా వెలుగులు నిండాయన్నారు. సీఎం వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలకు ఎంత మేలు జరిగిందనేది ఇక్కడికి వచ్చిన జనాలే సాక్ష్యమన్నారు. మీ ఇంటికి మేలు జరిగిందంటేనే నాకు ఓటేయండి.. లేదంటే వద్దని ధైర్యంగా చెప్పిన నాయకుడు వైఎస్ జగన్ అని అన్నారు. బడుగు, బలహీన వర్గాలను మరింతగా అణచివేసిన నాయకుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. చంద్రబాబు పార్టీకే గ్యారంటీ లేదు కానీ ప్రజలకు ష్యూరిటీ ఇస్తాడట అని వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉన్నతంగా బతుకుతున్నారు: మంత్రి మేరుగు ‘మంత్రివర్గంలో అధిక శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే. అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్ పర్సన్ ఈ వర్గాల వారే. ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుల్లోనూ ఈ వర్గాలకే ప్రాధాన్యం. నామినేటెడ్ పదవుల్లో ఈ వర్గాలకే పెద్ద పీట. ఏ సంక్షేమ పథకం తీసుకున్నా లబ్ధిదారుల్లో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే. సీఎం వైఎస్ జగన్ పాలనలో ఈ వర్గాలు ఉన్నతంగా బతుకుతున్నాయి. ఇదే అసలైన సామాజిక సాధికారత’ అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. చంద్రబాబు హయాంలో అవహేళనకు, హింసకు గురైన ఈ వర్గాలు ఇప్పుడు తలెత్తుకొని తిరుగుతున్నాయని వివరించారు. ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా, బీసీల తోక కత్తిరిస్తా, బీసీలు జడ్జీలుగా పనికి రారంటూ రకరకాలుగా అవమానించిన వ్యక్తి చంద్రబాబు అని చెప్పారు. బాబు మనకు రావాల్సిన రాజ్యాంగబద్ధ హక్కులన్నీ కాల రాశారన్నారు. అన్ని వర్గాలను ఆదరించి, ఉన్నతంగా తీర్చిదిద్దుతున్న సీఎం వైఎస్ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రాజ్యం: ఎంపీ నందిగం సురేష్ జగనన్న సీఎం అయ్యాక రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రాజ్యం నడుస్తోందని ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. ప్రతి కులానికీ దన్నుగా నిలిచారని తెలిపారు. నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థలు, పార్టీ పదవుల్లో 75 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే అవకాశం కల్పించారని, సీఎం వైఎస్ జగన్ దేవుడు పంపిన వ్యక్తి అని అన్నారు. మనల్ని ఆదుకున్న జగనన్నకు అండగా ఉందామని పిలుపునిచ్చారు. నేడు రాయదుర్గంలో బస్సు యాత్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన కార్యక్రమాలతో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు సాధించిన అభివృద్ధిని, సాధికారతను వివరించేందుకు వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర రాష్ట్రంలో విజయవంతంగా సాగుతోంది. సోమవారం అనంతపురం జిల్లా రాప్తాడులో యాత్ర అద్భుత రీతిలో జరిగింది. మంగళవారం అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరగనుంది. -
‘అడ్డంకులెన్నొచ్చినా ఏపీలో సంక్షేమం ఆగలేదు’
సాక్షి,అనంతపురం:ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్న ఘనత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. అనంతరపురం జిల్లా రాప్తాడులో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర బహిరంగ సభలో మంత్రులు మేరుగ నాగార్జున, గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మేరుగ మాట్లాడుతూ తెలంగాణ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు డిపాజిట్లు కూడా దక్కలేదని, బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా పవన్ కళ్యాణ్‌కు రాలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను నమ్మే స్థితిలో జనం లేరన్నారు. మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ ‘టీడీపీ భవిష్యత్తుకు గ్యారంటీ లేదన్న విషయం గుర్తుంచుకోవాలి. తన ముగ్గురు భార్యలకు పవన్ కళ్యాణ్ గ్యారెంటీ ఇస్తారా? ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల ఆశాకిరణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్లే సామాజిక న్యాయం సాధ్యం అయింది. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి పట్టం కట్టి మళ్లీ వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా చేసుకోవాలి’ అని పిలుపునిచ్చారు. బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ మాట్లాడుతూ ‘తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ఒక్క స్థానంలోనూ పోటీ చేయలేదు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే టీడీపీ సంబరాలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. తెలంగాణ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌కు డిపాజిట్లు కూడా రాలేదు’ అని సురేష్ గుర్తు చేశారు. ‘ఇచ్చిన హామీలను ఏనాడూ చంద్రబాబు అమలు చేయలేదు. జగన్ పాలనలో 99 శాతం హామీలు నెరవేరాయి. పేదల సంక్షేమానికి చంద్రబాబు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుంది. టీడీపీ పాలనలో రాప్తాడు నియోజకవర్గంలో ఫ్యాక్షనిజం ఉండేది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో ముఠా కక్షలు అంతమయ్యాయి’ అని సురేష్ తెలిపారు. ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ ‘తెలంగాణ ఎన్నికల్లో ఓటమి భయంతో చంద్రబాబు పోటీ చేయలేదు. పోటీ చేసిన పవన్ కళ్యాణ్‌కు డిపాజిట్లు కూడా రాలేదు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ చంద్రబాబు నాయుడు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అత్యధికంగా ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి పదవులు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదే’ అని ఎంపీ మాధవ్ కొనియాడారు. పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ మాట్లాడుతూ ‘ఎస్సీ ఎస్టీ బీసీలను కులవృత్తులకే పరిమితం చేయాలని చంద్రబాబు నాయుడు కుట్రలు చేశారు. సీఎం జగన్ పాలనలో అణగారిన వర్గాలకు ఆత్మగౌరవం లభించింది’ అని తెలిపారు. ఈ బస్సు యాత్రలో ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, శంకర్ నారాయణ, డాక్టర్ తిప్పేస్వామి, అనంతవెంకటరామిరెడ్డి, డాక్టర్ సిద్ధారెడ్డి, ఎంపీలు నందిగాం సురేష్, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మంగమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, జెడ్పీ చైర్మన్ బోయగిరిజమ్మ, మేయర్ మహమ్మద్ వాసీం, అహుడా ఛైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, రజక కార్పొరేషన్ చైర్మన్ రంగన్న, డీసీసీబీ చైర్మన్ లిఖిత, ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఇదీచదవండి..అందులో కోటి 30 లక్షల మంది ప్రయాణం.. -
వెల్లివిరిసిన గిరిజన చైతన్యం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: సుదీర్ఘకాలంగా వెనుకబడి ఉన్న గిరిజన ప్రాంత దశను మార్చేలా పార్వతీపురం మన్యం జిల్లాను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి గిరిజనం జై కొట్టారు. విద్య, వైద్య రంగాలను సమూలంగా మార్చడమే గాక ప్రభుత్వ సేవలను తమ ఆవాసాలకే చేర్చినందుకు హర్షధ్వానాలతో కృతజ్ఞతలు తెలిపారు. భారీఎత్తున భూ పంపిణీతో బతుకులు మార్చిన జగనన్నకు జేజేలంటూ పాటలు పాడారు. గిరిజన పక్షపాతికి సుదూర గిరిశిఖర గ్రామాల నుంచీ తరలివచ్చి ధన్యవాదాలు చెప్పారు. బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార యాత్ర దృశ్యమిది. గిరిజన చైతన్యానికి ఈ యాత్ర అద్దంపట్టింది. తొలుత కురుపాం నియోజకవర్గం గరుగుబిల్లి మండలం నందివానివలస గ్రామం నుంచి వందలాది యువకులు ద్విచక్రవాహనాలపై ర్యాలీగా బయల్దేరారు. 11 గ్రామాల మీదుగా 12 కిలోమీటర్లకు పైగా సాగిన ఈ ర్యాలీకి ప్రజలు ప్రతి గ్రామంలో ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కురుపాం పోలీస్ స్టేషన్ జంక్షన్ వద్ద ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అధ్యక్షతన భారీ బహిరంగ సభ జరిగింది. సభ ఆద్యంతం జై జగన్, జై జై జగన్ నినాదాలతో హోరెత్తింది. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ నాలుగున్నరేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చేసిన మేలును ప్రజాప్రతినిధులు వివరిస్తుంటే ప్రజలు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి ప్రత్యేక జిల్లాతో గిరిజనులకు గుర్తింపు: ఎంపీ గొడ్డేటి మాధవి సుదీర్ఘకాలంగా వెనుకబడి ఉన్న గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని, ప్రత్యేకంగా పార్వతీపురం మన్యం జిల్లాను ఏర్పాటుచేసి 45 లక్షల మంది గిరిజనులకు గుర్తింపు ఇచ్చారని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి చెప్పారు. ప్రజలంతా వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. సీఎం జగన్ దేశానికే స్ఫూర్తి: ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి, చెప్పని పథకాలను ఎన్నింటినో అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్ దేశానికే స్ఫూర్తిగా నిలిచారని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేసి, సాధికారత కల్పించిన సీఎం ఒక్క జగన్ మాత్రమేనని అన్నారు. ముఖ్యమంత్రి పీఠం కోసం చంద్రబాబు సొంత మామకు వెన్నుపోటు పొడిచినట్లే 2014 ఎన్నికల్లో గెలిపించిన ప్రజలనూ మోసం చేశారని చెప్పారు. 2024 ఎన్నికల్లోనూ మాయమాటలు చెప్పడానికి చంద్రబాబు సహా టీడీపీ మోసగాళ్లు మళ్లీ ప్రజల ముందుకొస్తున్నారని, వారి మాటలు నమ్మవద్దని అన్నారు. గిరిజన బిడ్డలకు పెద్దపీట: ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర రాష్ట్రంలోని గిరిజనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు అనేక నామినేటెడ్ పదవులు ఇచ్చి అన్ని రంగాల్లో ముందడుగు వేసేలా తీర్చిదిద్దుతున్నారని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర చెప్పారు. చంద్రబాబు ఏనాడూ గిరిజనులకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదన్నారు. బాబుకు భిన్నంగా సీఎం వైఎస్ జగన్ గిరిబిడ్డలను అనేక పథకాలతో ఆదరిస్తున్నారని, మంచి విద్య, అధునాతన వైద్యం అందిస్తున్నారని తెలిపారు. గిరిజనులకు రాజ్యాధికారం ఇచ్చిన ఘనత వైఎస్ జగన్‌దేనని అన్నారు. గిరిజనులకు అందుబాటులో విద్య: ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ, సాలూరులో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంతో పాటు పార్వతీపురంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు ద్వారా గిరిజనులకు ఉన్నత విద్యను సీఎం వైఎస్ జగన్ అందుబాటులోకి తెస్తున్నారని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడే సీఎం జగన్ వెంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు నిలవాలని, లేదంటే నష్టపోతామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, అలజంగి జోగారావు, శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
మచిలీపట్నంలో కదం తొక్కిన బడుగు జనం
చిలకలపూడి (మచిలీపట్నం): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించిన చేయూతతో ఆర్థికంగా, సామాజికంగా సాధికారత సాధించిన బడుగు, బలహీన వర్గాలు మచిలీపట్నంలో కదంతొక్కాయి. బుధవారం ఇక్కడ జరిగిన వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు వేలాదిగా పాల్గొన్నారు. సీఎం జగన్ అండతో తాము సాధించిన విజయాన్ని వివరిస్తూ నియోజకవర్గంలో కలియతిరిగారు. జై జగన్ అంటూ వీరు చేసిన నినాదాలతో మచిలీపట్నం మారుమోగింది. స్థానిక ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆధ్వర్యంలో సాధికార యాత్ర ఘనంగా జరిగింది. అనంతరం జరిగిన సభలో ప్రజలు అశేష సంఖ్యలో పాల్గొన్నారు. బస్సు యాత్రలో పాల్గొన్న నాయకులు అట్టడుగు వర్గాల ఆశలు, ఆశయాలు నెరవేర్చిన సీఎం జగన్: మంత్రి ధర్మాన సభలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలోని అట్టడుగు వర్గాలు ఆశలు, ఆశయాలను నెరవేర్చారని చెప్పారు. ఎలాంటి ఉద్యమాలు లేకుండానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలకు రాజకీయ అధికారం కట్టబెట్టారని, ఇలా చేయడానికి దమ్ము, ధైర్యం ఉండాలని అన్నారు. 32 లక్షల మందికి ఇళ్లస్థలాలు అందించటం ద్వారా ముఖ్యమంత్రి చరిత్ర సృష్టించారన్నారు. చంద్రబాబు విద్యను ప్రైవేటు పరం చేయటం వల్ల అట్టడుగు వర్గాలకు విద్య అందలేదన్నారు. వైఎస్ జగన్ కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దటంతో పాటు విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు ఇచ్చి పౌష్టికాహారాన్ని కూడా అందిస్తున్నారని, తల్లుల ఖాతాల్లో అమ్మఒడి ద్వారా నగదు జమ చేస్తున్నారని వివరించారు. ఈ నాలుగున్నరేళ్లలో సీఎం జగన్ లక్షల కోట్లు నేరుగా లబి్ధదారుల ఖాతాల్లో జమ చేశారని తెలిపారు. తలసరి ఆదాయం, వ్యవసాయం, జీవన ప్రమాణాలు, పరిశ్రమల కల్పనలో మన రాష్ట్రం దేశంలోనే 4, 5 స్థానాల్లో ఉందని కేంద్ర ప్రభుత్వ సంస్థలే చెబుతుండగా రాష్ట్రంలో అభివృద్ధి లేదని ప్రతిపక్షాలు విమర్శించడం శోచనీయమన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలకంటే మెరుగైన పాలన అందిస్తున్న సీఎం జగన్‌ను ఆదరించాలని కోరారు. బడుగుల తలరాతలు మారుస్తున్న జగన్: ఎమ్మెల్యే అనిల్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. కులవృత్తుల వారికి కత్తెరలు, ఇస్త్రీ పెట్టెలు, గొర్రెలు, వలలు ఇచ్చి వారు ఇలాగే బతకాలని చంద్రబాబు ప్రయత్నిస్తే.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇదే బడుగులకు ప్రపంచస్థాయి విద్యనందిస్తూ వారి తలరాతలు మారుస్తున్నారని అన్నారు. మత్స్యకారుల వలసల నివారణకు, వారి ఉపాధికి సీఎం జగన్ తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నారన్నారు. 2019లో గెలిపించినందుకు సీఎం జగన్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాల ద్వారా పదడుగులు ముందుకు వేస్తే 2024లో గెలిపిస్తే 100 అడుగులు ముందుకు వేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఒక ఇంట్లో ఒకరు చదువుకుంటే నెలకు రూ.15 వేలు, ఇద్దరుంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.90 వేలు అని లోకేశ్ చెప్పారని, ఇదెలా సాధ్యమని ప్రశ్నించారు. ఇలా ఇస్తే ఏడాదికి లక్ష కోట్ల రూపాయలు దీనికే సరిపోతాయన్నారు. జగన్‌ను మళ్లీ గెలిపించుకుందాం: ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ చంద్రబాబు ఒక్క ముస్లిం నాయకుడినీ మంత్రిగా చేయలేదని, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులు ఇవ్వలేదని, సీఎం జగన్ డిప్యూటీ సీఎం పదవితో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఇచ్చి గౌరవించారని ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేందుకు సీఎం జగన్ కృషి చేశారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఆర్థికంగా, సామాజికంగా తలెత్తుకొనేలా చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని బందరు ఎమ్మెల్యే పేర్ని నాని చెప్పారు. జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్, ఎమ్మెల్సీ పోతుల సునీత, వైఎస్సార్సీపీ యువజన విభాగం జోనల్ ఇన్చార్జి పేర్ని కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
అర్హత ఉంటే చాలు సంక్షేమ పథకాలు అందించాం
-
సాధికారతను చాటిన మచిలీపట్నం
మచిలీపట్నం(కృష్ణాజిల్లా): మచిలీపట్నంలో సామాజిక సాధికారత నినాదం ఉప్పొంగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజల ‘జై జగన్’ నినాదాలతో మచిలీపట్నం హోరెత్తింది. నియోజకవర్గంలో మచిలీపట్నం నగరపాలక సంస్థ ఎదుట బుధవారం నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర సభకు అశేష జనవాహిని తరలివచ్చింది. ఈ కార్యక్రమంలో ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నాని, ఎమ్మెల్యేలు కైలే అనిల్ కుమార్, హఫీజ్ ఖాన్, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, పోతుల సునీత, కృష్ణా జిల్లా జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక తదితర వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ‘గడచిన 75 ఏళ్లల పాలన కంటే సీఎం జగన్మోహన్రెడ్డి పాలన భిన్నమైనది. ప్రజల ఆకాంక్షలు,ఆశలు నెరవేర్చాలనేదే సీఎం జగన్ తాపత్రయం. ఈ దేశంలో రాజకీయ అవకాశం కల్పించాలని ఎంతోమంది ఉద్యమాలు చేశారు. అన్ని వర్గాలకు అధికారం కట్టబెట్టిన వ్యక్తి సీఎం జగన్.ఎంతో ఆత్మవిశ్వాసం ఉంటేనే ఇలా చేయగలరు. గత ప్రభుత్వంలో మైనార్టీలు,గిరిజనులకు కనీస అవకాళం కల్పించలేదు. పేదల కన్నీళ్లు తుడిచి ఆకలి తీరుస్తుంటే చంద్రబాబు బాధపడిపోతున్నాడు. డబ్బంతా ఖర్చైపోతోందని గగ్గోలు పెడుతున్నాడు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలివ్వడం మామూలు విషయం కాదు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏనాడైనా జరిగిందా ఇలా? 12,800 కోట్లు ఖర్చు చేసి పేదలకు ఇంటి స్థలాలు అందించారు.ఊళ్లకు ఊళ్లు నిర్మాణాలు జరుగుతున్నాయి చంద్రబాబు పేదవాడి కోసం ఒక్క సెంటు స్థలమైనా కొన్నాడా?,పథకాలను ఓట్లతో ముడిపెట్టడం చంద్రబాబుకి అలవాటు. ఈ రాష్ట్రంలో ప్రైవేట్ విద్య ఎదగడానికి ఎవరు కారణం. ప్రైవేట్ విద్య ఎవరి కారణంగా వచ్చింది. సీఎం జగన్ వచ్చాక ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యం దక్కింది. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చారు. అధికారంలోకి వచ్చి ఏం చేస్తాడో చంద్రబాబు చెప్పాడా?, ఎందుకు చంద్రబాబుకి ఓటేయాలి.నాలుగేళ్లు ఈ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని చంద్రబాబు వేస్ట్ అన్నాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కంటే ఎక్కువ ఎలా ఇస్తానంటున్నాడు’ అని ప్రశ్నించారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ‘ సామాజిక సాధికార యాత్ర ఎందుకో రాష్ట్రమంతా పర్యటించి తెలియజేస్తున్నాం. బీసీలను గుండెల్లో పెట్టుకుని చూస్తానని సీఎం జగన్ చెప్పారు. చెప్పిన మాట ప్రకారం ప్రతీ పదవుల్లో 50 శాతం అవకాశం కల్పించారు. 40 ఏళ్లుగా టీడీపీ నేతల గుండెల్లో బీసీలమైన మేము సున్నాలమే. మీ దృష్టిల్లో సున్నాలమైన మమ్మల్ని సీఎం జగన్ నాయకులను, మంత్రులను చేశారు. మన తరాలు, తలరాతలు మారాలని, ఆలోచన చేసిన వ్యక్తి సీఎం జగన్. చంద్రబాబు గతంలో ఎంతమందికి కత్తెరలు,ఇస్త్రీపెట్టెలు ఇచ్చాడు. ఓ పది వేల మందికి కత్తెరలు,ఇస్త్రీపెట్టెలతో మసిపూసి మారేడుకాయ చేశారు. నేను మీకు మంచి చేస్తేనే ఓటేయండని చెప్పే ధైర్యం జగనన్నకు తప్ప ఎవరికైనా ఉందా?, ప్రజలను ముంచేందుకు మళ్లీ తండ్రీ కొడుకులు రెఢీ అవుతున్నారు. చంద్రబాబు మత్స్యకారుడిని తోలుతీస్తానన్నాడు. సీఎం జగన్ మత్స్యకారుడిని రాజ్యసభకు పంపించారు రాష్ట్రంలో 9 ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేస్తున్నారు. విశాఖలో బోట్లు తగలబడితే కేవలం నాలుగు రోజుల్లో వారికి సాయం అందించిన వ్యక్తి సీఎం జగన్. 2024 ఎన్నికల్లో మళ్లీ జగన్ గెలిపించుకుందాం. కులం పేరుతో ఒకాయన పార్టీ పెట్టాడు. చంద్రబాబును సీఎం చేయడానికి పనిచేస్తానంటున్నాడు. కాపులంతా ఆలోచన చేయాలి.రాబోయే ఎన్నికలు బక్కవాడికి...బలిసినోడికి మధ్య యుద్ధం. తండ్రిని అరెస్ట్ చేస్తే ఢిల్లీ పారిపోయిన వ్యక్తి లోకేష్.ఆ పప్పు పులకేష్ మనకు అవసరమా ...ప్రజలు ఆలోచన చేయాలి. మచిలీపట్నం నుంచి 2024లో పేర్ని కిట్టుని అంతా ఆశీర్వదించాలి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లా నుంచి ఒక్క బీసీ మంత్రి రాలేడు. కానీ సీఎం జగన్ ఒక బీసీనైన నన్ను మంత్రిని చేశారు.’ అని తెలిపారు. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘మచిలీపట్నంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు డీబీటీ ద్వారా రూ. 615 కోట్లు అందాయి. మచిలీపట్నం పోర్టు నిర్మాణం జరుగుతోంది. మచిలీపట్టణాన్ని పేర్ని నాని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయనంత సామాజిక న్యాయాన్ని సీఎం జగన్ చేసి చూపించారు. ఎంపీ అయోధ్యరామిరెడ్డి మాట్లాడుతూ.. ‘ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్ర వర్ణ పేదలకు ఈ ప్రభుత్వం ఎంతో మేలు చేసింది. అధికారంలోకి వచ్చాక ఏం చేశామో బస్సుయాత్రలో ప్రజలకు తెలియజేస్తున్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన 17 మందికి కేబినెట్లో మంత్రులుగా సీఎం జగన్ అవకాశం ఇచ్చారు. 13 జెడ్పీ చైర్మన్లలో9 చోట్ల అట్టడుగువర్గాలకు స్థానం కల్పించారు. రాజకీయంగా మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేశారు. వైఎస్సార్సీపీ నాలుగేళ్ల పాలనలో పేదరికం తగ్గించగలిగాం’ అని తెలిపారు. -
చైతన్యం వెల్లివిరిసిన నెల్లిమర్ల
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లా నెల్లిమర్లలో సామాజిక చైతన్యం వెల్లివిరిసింది. సీఎం వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలను సాధికారత దిశగా నడిపించిన వైనాన్ని వివరిస్తూ బడుగు, బలహీన వర్గాల ప్రజలు నియోజకవర్గంలో భారీ సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు సీఎం వైఎస్ జగన్ తమకు చేసిన మేలును వివరించారు. యువత బైక్‌లతో ర్యాలీ చేశారు. నెల్లిమర్ల డైట్ కాలేజీ మీదుగా కొండవెలగాడ, జర్జాపుపేట వరకూ యాత్ర సాగింది. కొండవెలగాడలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను ప్రజాప్రతినిధులు సందర్శించారు. సాయంత్రం 4 గంటలకు నెల్లిమర్ల మొయిదా జంక్షన్ వద్ద భారీ బహిరంగ సభ జరిగింది. వేలాదిగా తరలివచ్చిన ప్రజలతో సభా ప్రాంగణం జనసంద్రాన్ని తలపించింది. జై జగన్ – జైజై జగన్, జగనే కావాలి – జగనే రావాలి నినాదాలు సభలో హోరెత్తాయి. పేదల పెన్నిధి సీఎం జగన్ : ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర సీఎం వైఎస్ జగన్ పేదల పెన్నిధి అని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర చెప్పారు. చంద్రబాబు సీఎంగా ఉండగా గిరిజనులు, ముస్లింలకు ఒక్క మంత్రి పదవీ ఇవ్వలేదన్నారు. సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్ని రంగాల్లో అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. మంత్రి పదవుల నుంచి నామినేటెడ్ పదవుల వరకు అన్నింటా పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు. గిరిజనుడైన తాను ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నానంటే జగన్ వల్లే నని అన్నారు. 2014 ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం ఇలా 600 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అందర్నీ మోసం చేశారన్నారు. వ్యవస్థల్లో సమూల మార్పులు: మంత్రి ధర్మాన ప్రసాదరావు మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వ్యవస్థల్లో సమూల మార్పులు తెచ్చారని తెలిపారు. పేదల కోసం విద్య, వైద్య రంగాలను సమూలంగా ప్రక్షాళన చేసి, అధునాతనంగా తీర్చిదిద్దారని అన్నారు. ఇప్పుడు ప్రతి పేద కుటుంబం మంచి విద్యను, మంచి వైద్యాన్ని పైసా ఖర్చు లేకుండా అందుకుంటున్నాయని తెలిపారు. విభజన తర్వాత పదేళ్ల వరకూ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ వదిలేసి వచ్చిన చంద్రబాబు కొత్త రాజధానిని రాజ్యాంగం, చట్టం ప్రకారం గాకుండా వ్యాపారంగా మార్చేశారన్నారు. రాష్ట్రంలో పెద్ద పట్టణం, అన్ని హంగులూ ఉన్న విశాఖని కాదని, తన అనుయాయులతో భూములు కొనిపించిన ప్రాంతంలో అర్ధరాత్రి రాజధానిని ప్రకటించిన పాపం చంద్రబాబుదేనన్నారు. సీఎం జగన్‌ది సుపరిపాలన: మంత్రి సీదిరి అప్పలరాజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్ని వర్గాలకూ సంక్షేమాన్ని అందిస్తూ సుపరిపాలన చేస్తున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలను అక్కున చేర్చుకొని, సాధికారత దిశగా నడిపించారని తెలిపారు. ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను అవమానించిన చంద్రబాబును అందరూ సమష్టిగా మరోసారి ఓడించాలని పిలుపునిచ్చారు. భోగాపురంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి: మంత్రి అమర్నాథ్ నెల్లిమర్ల నియోజకవర్గంలో సీఎం జగన్ ఇటీవల భూమిపూజ చేసిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం వేగంగా జరుగుతోందని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. రూ.4,750 కోట్లతో నిర్మిస్తున్న ఈ విమానాశ్రయంతో 50 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. సారిపల్లి ఇండ ్రస్టియల్ పార్కు అప్‌గ్రేడ్ పనులకు సీఎం త్వరలో శంకుస్థాపన చేయబోతున్నారని తెలిపారు. నెల్లిమర్లలో రూ.1172 కోట్ల సంక్షేమం: ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు నెల్లిమర్ల నియోజకవర్గంలో నాలుగున్నరేళ్లలో రూ.1,172 కోట్లు సంక్షేమ కార్యక్రమాల కోసం సీఎం వైఎస్ జగన్ వెచ్చించారని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు చెప్పారు. రామతీర్థంలో విధ్వంసాన్ని టీడీపీ రాజకీయం చేస్తే, సీఎం జగన్ మాత్రం రూ.4.5 కోట్లతో ఆలయాన్ని పునర్నిర్మించారని తెలిపారు. వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్‌బాబు, ఎమ్మెల్యేలు శంబంగి అప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, కంబాల జోగులు, కడుబండి శ్రీనివాసరావు, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ శోభా స్వాతిరాణి, నవరత్నాల వైస్ చైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి పాల్గొన్నారు. -
కదంతొక్కిన కైకలూరు
సాక్షి, భీమవరం/కైకలూరు: కొల్లేరులో సామాజిక సాధికార నినాదం ఉప్పొంగింది. కోల్లేరే పొంగిందా అన్నట్టుగా కైకలూరును జన సునామీ ముంచెత్తింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజల ‘జై జగన్’ నినాదాలతో కైకలూరు నియోజకవర్గం హోరెత్తింది. నియోజకవర్గంలో మంగళవారం జరిగిన వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర వేలాది ప్రజలతో ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన బస్సు యాత్ర కైకలూరు సీతారామ›› ఫంక్షన్ హాల్ నుంచి రైతుబజారు సెంటర్లోని బహిరంగ సభ వేదిక వరకు సాగింది. అడుగడుగునా ప్రజలు పూలవర్షం కురిపిస్తూ యాత్రకు బ్రహ్మరథం పట్టారు. వివిధ ప్రాంతాల మహిళలు, గ్రామ పెద్దలు వాహనాలతో యాత్రకు వచ్చారు. సమావేశం ఆద్యంతం ‘జగనే కావాలి–జగనే రావాలి’ నినాదాన్ని హోరెత్తించారు. నాడు వివక్ష.. నేడు సామాజిక సాధికారత: మంత్రి రజిని ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ నాలుగున్నరేళ్ల క్రితం వరకు వివక్షకు గురైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సీఎం వైఎస్ జగన్ అండతో ఇప్పుడు సామాజిక సాధికారత సాధించి, తలెత్తుకు తిరుగుతున్నారని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ఈ నాలుగేళ్లలో పేదల సంక్షేమం కోసం డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ.4.8 లక్షల కోట్లు ఇస్తే.. అందులో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే అందించారని తెలిపారు. రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి బాటలు వేస్తున్న ఏకైక సీఎం జగన్ అని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా జగనన్నకు అండగా నిలవాలని కోరారు. 17 ఎమ్మెల్సీల్లో 14 బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకే: మంత్రి కారుమూరి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ సామాజిక న్యాయానికి పెట్టింది పేరని అన్నారు. 17 ఎమ్మెల్సీల్లో 14 బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాలకు ఇచ్చారని, బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆర్.కృష్ణయ్య, పిల్లి సుభాష్ చంద్రబోస్, బీద మస్తా¯Œ యాదవ్, మోపిదేవి వెంకటరమణలను రాజ్యసభకు పంపారని తెలిపారు. 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపించలేదని విమర్శించారు. బీసీ అయిన జయమంగళ వెంకటరమణకు చంద్రబాబు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్లు రెండింటిలోనూ హామీ ఇచ్చి మోసం చేశారని, సీఎం జగన్ మాత్రం ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించారని గుర్తుచేశారు. న్యాయం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్: ఎంపీ మోపిదేవి రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ పేదల కష్టాలు ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా ఎలాంటి పథకాలు ప్రవేశపెడితే వారు అభివృద్ధి చెందుతారో సీఎం జగ¯న్ ఆలోచన చేశారన్నారు. దీనికి అనుగుణంగానే ప్రతి కుటుంబానికీ రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ లబ్ధి చేకూరిందన్నారు. రాజకీయంగా అణచివేతకు గురైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సామాజిక న్యాయం చేశారన్నారు. అన్నింటా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే పెద్దపీట : మంత్రి జోగి రమేష్ కైకలూరు సభలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. సీఎం జగన్ సామాజిక ధర్మాన్ని పాటిస్తూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, బాబూ జగ్జీవన్‌రామ్, మహాత్మా జ్యోతిరావ్ పూలే వంటి మహనీయుల అడుగు జాడల్లో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నారని చెప్పారు. కేబినెట్ సహా అన్ని పదవుల్లో, పథకాల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలకే పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు. కేబినెట్లో 25 మంది మంత్రులు ఉంటే వారిలో 17 మంది ఈ వర్గాల వారినే సీఎం నియమించారన్నారు. సంక్షేమ పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆరి్థకాభివృద్ధికి బాటలు వేశారని వివరించారు. ఈ ఘనత జగన్‌దే: ఎమ్మెల్యే నాగేశ్వరరావు సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ ఒక్క కైకలూరులోనే 15 వేల ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కిందన్నారు. నియోజకవర్గంలో సంక్షేమ పథకాల కోసం రూ.746 కోట్లు అందించారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక పాల్గొన్నారు. -
తోక కత్తిరించి తాట తీస్తా..మంత్రి కారుమూరి పవర్ ఫుల్ స్పీచ్
-
సాధికారతను చాటిన ఎచ్చెర్ల
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎచ్చెర్ల ప్రజలు సామాజిక సాధికారతను ఎలుగెత్తి చాటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అండదండలతో సాధించిన అభివృద్ధిని వివరిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు నియోజకవర్గమంతా కలియదిరిగారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో జరిగిన వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర ఆద్యంతం పండుగ వాతావరణంలో జరిగింది. రణస్థలం నుంచి చిలకపాలెం – పొందూరు రోడ్డు వరకు 15 కిలోమీటర్లు సాగిన బస్సు యాత్రకు జనం బ్రహ్మరథం పట్టారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై జగన్ అంటూ యువత నినాదాలతో హోరెత్తించారు. నియోజకవర్గంలోని రణస్థలం, లావేరు, జి.సిగడాం, ఎచ్చెర్ల మండలాల నుంచి బడుగు, బలహీన వర్గాల ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. అనంతరం చిలకపాలెంలో జరిగిన బహిరంగ సభకు ఇసకేస్తే రాలనంతగా ప్రజలు హాజరయ్యారు. అన్ని కులాలకు సమాన హక్కులు కల్పింస్తున్న సీఎం జగన్: స్పీకర్ తమ్మినేని సీతారాం వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే రాష్ట్రంలో అన్ని కులాలకు సమాన హక్కులు కల్పిస్తున్నారని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వంటి కులాలకు జరుగుతున్న అన్యాయాలను గుర్తించి, వారికి రాజ్యాధికారాన్ని, సంపదను అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి చైర్మన్లను, 700 మంది డైరెక్టర్లను నియమించారన్నారు. అనేక పథకాలు, అంతర్జాతీయ స్థాయి విద్య, అధునాతన వైద్యాన్ని అందిస్తున్నారని వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అక్కున చేర్చుకున్న ఏకైక సీఎం వైఎస్ జగన్ అని మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. కరోనా సమయంలో గుజరాత్‌కు వలస వెళ్లిన 4,500 మంది మత్స్యకారులను ప్రత్యేక బస్సుల్లో సురక్షితంగా జిల్లాకు తెచ్చామని, 24 మంది మత్స్యకారులను పాకిస్థాన్ నుంచి విడిపించామని చెప్పారు. బీసీలు జడ్జీలుగా ఉండకూడదని కేంద్ర న్యాయ శాఖకు లేఖ రాసిన ఘనత చంద్రబాబుదన్నారు. ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలను అవహేళన చేసిన చంద్రబాబుకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న పవన్ అప్పట్లో చంద్రబాబు పాలనను ఎందుకు విమర్శించలేదని ప్రశ్నించారు. జగనన్న బలం చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా సుపరిపాలన సాధ్యమవుతుందన్నారు. దేశానికి సచివాల య, వలంటీర్ వ్యవస్థలు ఆదర్శంగా నిలిచాయన్నారు.తన పని తీరు నచ్చితేనే ఓటు వేయమని అడగగలిగే ఏకైక సీఎం వైఎస్ జగన్ అని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. సీఎం జగన్ అన్ని కులాలకు న్యాయం జరిగేలా ఉప ముఖ్యమంత్రులు, మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులను ఇచ్చారని తెలిపారు. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు దేశ చరిత్రలో ఎన్నడూ లేవని ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ తెలిపారు. కులం, మతం, ప్రాంతం, లంచం, వివక్షకు తావు లేకుండా ప్రతి ఒక్కరికీ సంక్షేమ ప్రయోజనాలు అందాయన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు మాత్రమే అసంతృప్తిగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు కంబాల జోగులు, రెడ్డి శాంతి, బడ్డుకొండ అప్పలనాయుడు, బొత్స అప్పలనరసయ్య, ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాస్, వరుదు కల్యాణి, నర్తు రామారావు, పెనుమత్స సురేష్‌బాబు, జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠం నాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచారు: మంత్రి ధర్మాన సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచారని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. సీఎం జగన్ విశాఖను రాజధాని చేయాలనుకుంటుంటే టీడీపీ మాత్రం అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తోందని విమర్శించారు. విశాఖను రాజధాని చేస్తే ఇక్కడ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. -
తాడిపత్రిలో జనహోరు
అనంతపురం ఎడ్యుకేషన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందించిన చేయూతతో సాధికారత సాధించిన బడుగు, బలహీన వర్గాలు సోమవారం అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ‘సామాజిక సాధికార బస్సు యాత్ర’ చేశాయి. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో తాడిపత్రి జనపత్రిగా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రధాన రోడ్డు వేలాది ప్రజలతో కిక్కిరిసింది. ముందుగా పట్టణంలోని కూరగాయల కొత్త మార్కెట్ ఎదురుగా ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిరావుపూలే విగ్రహాన్ని జిల్లా ఇన్చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి కారుమూరు నాగేశ్వరరావు ఆవిష్కరించారు. అనంతరం భగత్‌సింగ్ నగర్ నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర సీబీ రోడ్డు మీదుగా వైఎస్సార్ సర్కిల్ వరకు సాగింది. మధ్యలో సిద్దిబాషా దర్గాలో ప్రార్థనలు చేశారు. దారిపొడవునా బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అనంతరం తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో వేలాదిమంది పాల్గొన్నారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకుంటున్న చర్యలను ప్రజాప్రతినిధులు, నేతలు వివరించినప్పుడు ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ‘మళ్లీ రావాలి జగన్ – కావాలి జగన్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు మాకే ఉంది : మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నాలుగున్నరేళ్లలో సామాజిక న్యాయం చేసి నిరూపించిన సీఎం వైఎస్ జగన్ అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చెప్పారు. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు వైఎస్సార్సీపీ నేతలకే ఉందన్నారు. సామాజిక న్యాయం జరగాలని, పేదవాడు పేదవాడిగానే ఉండిపోకూడదని, పేదల కుటుంబాల్లోనూ డాక్టర్లు, ఇంజినీర్లు కావాలని సీఎం వైఎస్ జగన్ పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చారని తెలిపారు. సీఎం జగన్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ దూసుకుపోతోందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పల్లకీ మోసిన జగన్‌ను మళ్లీ గెలిపిద్దాం: మంత్రి ఉషశ్రీచరణ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పల్లకీ మోశారని, మరోసారి ఆయన్నే ముఖ్యమంత్రిని చేసుకోవాలని మంత్రి ఉషశ్రీ చరణ్ పిలుపునిచ్చారు. బడుగు, బలహీన వర్గాలను గుర్తించి రాజకీయ ప్రాధాన్యత ఇచ్చిన గొప్ప వ్యక్తి వైఎస్ జగన్ అని చెప్పారు. 139 బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు, బీసీల్లో పుట్టాం అని గర్వంగా చెప్పుకునేలా చేశారని తెలిపారు. సీఎం జగన్ అగ్రకులంలో పుట్టినా బీసీ కుల గణనకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. సీఎం జగన్‌ను గుండెల్లో పెట్టుకుంటాం: ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం పని చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను గుండెల్లో పెట్టుకుంటామని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ చెప్పారు. ఈ వర్గాలను సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా నిలబెట్టేందుకు సీఎం జగన్ అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. సామాజిక న్యాయం చేసిన సీఎం జగన్ : ఎంపీ తలారి రంగయ్య రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్ని రంగాల్లో అత్యధిక ప్రాధాన్యం కల్పించి, సామాజిక న్యాయం చేసిన సీఎం జగన్ అని అనంతపురం ఎంపీ తలారి రంగయ్య చెప్పారు. రాయలసీమలో మొత్తం 8 ఎంపీ స్థానాలు ఉంటే 5 స్థానాలు బీసీ, ఎస్సీలకు ఇచ్చారన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున బీసీ, ఎస్సీలకు ఏ పార్టీ టికెట్లు ఇవ్వలేదన్నారు. రాష్ట్రానికి జగన్ అవసరం చాలా ఉంది: ఎంపీ నందిగం సురేష్ పేదలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఈ రాష్ట్రానికి ఉందని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. సీఎం జగన్ అతి సామాన్యమైన వ్యక్తులను పైసా ఖర్చు లేకుండా ఎంపీలుగా చేశారని, వారిలో తాను ఒకడినని అన్నారు. -
సబ్బవరం.. బడుగు జనసంద్రం
సాక్షి, అనకాపల్లి: పెందుర్తి నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు శనివారం నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర జన సునామీని తలపించింది. పెందుర్తి మండలం వేపగుంట జంక్షన్‌లోని వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ప్రారంభమైన ర్యాలీ సబ్బవరం మండలం మూడు రోడ్ల జంక్షన్లో బహిరంగ సభాస్థలి వరకూ భారీ ఎత్తున సాగింది. వేలాది ప్రజలు కడలిలా బస్సు యాత్రలో పాల్గొన్నారు. వందలాది బైక్‌లతో యువత ర్యాలీ చేశారు. యాత్ర ఆద్యంతం సామాజిక నినాదాన్ని హోరెత్తించారు. పెందుర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రూ.8 కోట్లతో నూతనంగా నిర్మించిన ప్రయోగశాల భవనాన్ని వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మంత్రి అమర్నాథ్, ఎమ్మెల్యే అదీప్‌రాజ్ ప్రారంభించారు. అనంతరం జరిగిన భారీ బహిరంగ సభలో పలువురు వైఎస్సార్సీపీ నేతలు ప్రసంగించారు. రాష్ట్రంలోని అణగారిన వర్గాలను సీఎం వైఎస్ జగన్ ఏ విధంగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారో నేతలు వివరించినప్పుడు ప్రజలు ‘జై జగన్’ అంటూ పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసమే పనిచేస్తున్న సీఎం జగన్: స్పీకర్ సీతారాం సామాజిక సాధికార సభలో స్పీకర్ తమ్మినేనీ సీతారాం మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిరంతరం అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పని చేస్తున్నారని చెప్పారు. అంబేడ్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన సామాజిక సాధికారిత సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో అమలవుతోందని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో 139 కులాలను గుర్తించి, 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసి, వాటిని చైర్మన్లు, 700 మంది డైరెక్టర్లను నియమించారన్నారు. ఆటో డ్రైవర్‌గా పనిచేసిన దళితుడైన నందిగం సురేష్ ను పార్లమెంట్‌కు, నలుగురు బీసీలను రాజ్యసభకు పంపించారన్నారు. అభివృద్ధి జరగలేదని దుష్ప్రచారం చేస్తున్న వారికి రాష్ట్రంలో రూ.2.30 లక్షల కోట్ల సంక్షేమం కనబడలేదా అని ప్రశ్నించారు. చిరిగిన నిక్కరు, చిరిగిన పుస్తకాలతో పెచ్చులూడిన భవనాల్లో చదువుకునే పేద పిల్లలకు ఉచితంగా కార్పొరేట్ తరహా విద్య అందించడం, ఇంగ్లిష్ మీడియంలో బోధించడం అభివృద్ధి కాదా అని నిలదీశారు. ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలు సైతం విశాఖలో పెట్టుబడులు పెట్టడం, తీరప్రాంత అభివృద్ధితో పాటు నూతన పోర్టులు, హార్బర్ల నిర్మాణం అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు. ఈ నాలున్నరేళ్లలో మీ కుటుంబాల్లో ఆనందాన్ని నింపిన సీఎం జగన్‌కు రానున్న ఎన్నికల్లోనూ మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. సామాజిక సాధికార యాత్రకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలు తండోపతండాలుగా వస్తుంటే ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. ఈ యాత్ర గురించి పొరుగు రాష్ట్రాల్లోనూ చర్చ జరుగుతోందని తెలిపారు. జనమే జగన్ బలం: డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు కొనియాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నాలుగు ఉపముఖ్యమంత్రి పదవులు కల్పించి అక్కున చేర్చుకున్నారన్నారు. జనమే జగన్ బలమని, ఈ సైన్యం వైఎస్సార్సీపీ విజయసారథులని అన్నారు. జగనన్న పాలనలో సామాజిక న్యాయం: ఎంపీ సురేష్ రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలు బాగుంటేనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని నమ్మిన సీఎం వైఎస్ జగన్ రాజకీయ, నామినేటెడ్ పదవుల్లో సామాజిక న్యాయం చేశారని ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. ఇది పెత్తందార్ల రాజ్యం కాదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల రాజ్యమని చూపించారన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడటం ఓ విప్లవమని, సాధికారతకు నిదర్శనమని అన్నారు. పెందుర్తిలో రూ.2,162 కోట్లతో సంక్షేమం: ఎమ్మెల్యే అదీప్‌రాజ్ పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ మాట్లాడుతూ సీఎం జగన్ పాలనలో పెందుర్తి నియోజకవర్గంలో సంక్షేమ పథకాలకు రూ.2,162 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. జెడ్పీ చైర్ పర్సన్ సుభద్ర, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పాల్గొన్నారు. -
జనసంద్రంతో హోరెత్తిన పెందుర్తి
పెందుర్తి(అనకాపల్లిజిల్లా): అనకాపల్లి జిల్లా పెందుర్తిలో శనివారం నిర్వహించిన వైఎస్సార్సీపీ సామాజిక సాధికారిత బస్సుయాత్ర జనసంద్రంతో హోరెత్తింది. ఎమ్మెల్యే అదీప్‌రాజు ఆధ్వర్యంలో జరిగిన సామాజిక సాధికారిత బస్సుయాత్ర సభకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరై తమ సంఘీభావం తెలిపారు. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ.. ‘ రూపాయి లంచం లేకుండా సీఎం జగన్ పాలన చేశారు. కులాలు మతాలు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. చంద్రబాబులాగా మాట తప్పే వ్యక్తి సీఎం జగన్ కాదు. మాట ఇస్తే మడమ తిప్పని వ్యక్తి సీఎం జగన్. నా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అని చెప్పిన సీఎంలు గతంలో ఎవరు లేరు. ప్రభుత్వ పాఠాశాలలను కార్పొరేట్ పాటశాలలుగా మార్చిన నాయకుడు సీఎం జగన్.మహిళలు కోసం అమ్మ ఒడి, చేయూత, ఆసరా, వసతి దీవెన, విద్య దీవెన వంటి పథకాలు ప్రవేశపెట్టారు. అధికారంలో ఉన్నపుడు అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారు’ అని పేర్కొన్నారు ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మాట్లాడుతూ.. ‘ రాష్ట్ర చరిత్రలో ఏ సీఎం కూడా దైర్యంగా నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ అని దైర్యం చెప్పలేదు. ప్రతి కుటుంబం సీఎం జగన్ పథకాలతో బాగుపడింది.పేదల పిల్లలను అగ్ర వర్ణాల పిల్లలతో సమానంగా చదివిస్తున్నారు. బీసీలను ఎస్సీలకు చంద్రబాబు అవమానించారు’ అని తెలిపారు. ఎంపీ సత్యవతి మాట్లాడుతూ.. ‘ సామాజిక న్యాయం సీఎం వైఎస్ జగన్‌తోనే సామాజిక న్యాయం సాధ్యమైంది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఎన్నో పదవులు కట్టబెట్టారు. త్వరలో వైజాగ్ వచ్చే సీఎం వైఎస్ జగన్‌కు స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.. ఎమ్మెల్యే ధర్మశ్రీ మాట్లాడుతూ.. ‘పెందుర్తి సభను చూసి చంద్రబాబుకు వణుకు పుడుతోంది. 2 లక్షల 35 వేల కోట్లు ప్రజలకు రూపాయి అవినీతి లేకుండా ఇచ్చిన గొప్ప నేత సీఎం వైఎస్ జగన్.సంక్షేమ పథకాలు వలన బడుగు బలహీనర్గాలు బాగుపడ్డాయి’అని స్పష్టం చేశారు. ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. ‘ బీసీలకు అత్యధిక మంత్రి ఇచ్చారు. దళిత మహిళను హోంమంత్రి చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌ది. బడుగు బలహీనర్గాల వారిని చంద్రబాబు ముష్టి వారిగా చూశారు. పేదల ఇంగ్లీష్ మీడియంను చంద్రబాబు అడ్డుకున్నారు. ద్రబాబు ఎన్నడూ నీతిగా పాలన చేయలేదు మళ్ళీ జగన్ సీఎం కాకపోతే మన జీవితం 25 ఏళ్లు వెనక్కి పోతుంది. రెండు ఎకరాల నుంచి 2 లక్షల కోట్లు చంద్రబాబు ఎలా సంపాదించారు?, లేని రోగాలు చెప్పుకొని చంద్రబాబు బెయిల్ తెచ్చుకున్నారు. చంద్రబాబు ఒక దొంగ అని గతంలో పవన్ చెప్పారు. ప్యాకేజీ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ మాట మారిపోయింది’ అని మండిపడ్డారు. స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. ‘ జన ప్రవాహాన్ని చూస్తే వేదిక దగ్గరకు వెళ్ళగలనా అనే అనుమానం కలిగింది. సామాజిక సాధికార యాత్రకు ప్రవాహంలా తరలి వస్తున్నారు. సామాజిక సాధికార యాత్ర చూసి ప్రతి పక్ష పార్టీలు కలవర పాటుకు గురవుతున్నాయి. సామాజిక సాధికార యాత్రపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అంబేద్కర్ పూలే అశయాలను సీఎం జగన్ అమలు చేస్తున్నారు. ఏపీ లో ఉన్న పేదరికాన్ని సీఎం జగన్ పారద్రోలుతున్నారు. పేదరికం ప్రభుత్వ పథకాలకు అనర్హత కాకూడదు అనేది సీఎం జగన్ విధానం.కులాలు మతాలు పార్టీలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అణగదొక్కిన కులాలను సీఎం జగన్ ఆదుకున్నారు. క్యాబినెట్ లో బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేశారు.బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను చట్ట సభలకు పంపించారు.’ అని స్పష్టం చేశారు. -
మా జగన్ అన్న పాలనలోనే సామాజిక న్యాయం
-
చరిత్ర సృష్టించిన సామాజిక సాధికార యాత్ర..టీడీపీ పని అయిపొయింది
-
ఒక్క మాటతో చంద్రబాబుకు బుద్ధి చెప్పిన బీసీ మహిళ
-
నేడు తుని, పెందుర్తి నియోజకవర్గాల్లో సామాజిక సాధికార బస్సు యాత్ర
-
బస్సుయాత్రకు విశేషమైన మద్దతు (ఫొటోలు)
-
‘సామాజిక సాధికారితను అమలు చేసిన ఒకే ఒక్కడు సీఎం జగన్’
జగ్గయ్యపేట(ఎన్టీఆర్ జిల్లా): వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికారిత యాత్రలో భాగంగా 20వ రోజు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో నిర్వహించిన సభకు జనం పోటెత్తారు. ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో జగ్గయ్యపేటలోని బలుసుపాడు నాలుగురోడ్ల కూడలిలోజరిగిన సామాజిక సాధికారిత బస్సుయాత్ర సభకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సభలో ఎంపీలు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, నందిగం సురేష్, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, విడదల రజని, ఎమ్మెల్యేలు మొండితోక జగన్మోహన్రావు, వసంత కృష్ణప్రసాద్, కొక్కిలిగడ్డ రక్షణనిధి, కొలుసు పార్థసారథి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, కృష్ణాజిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక, రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ ఖాదర్ భాషా తదితరులు హాజరయ్యారు. ఖాదర్‌బాషా మాట్లాడుతూ.. ‘వైఎస్సార్సీపీ అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పార్టీ. చంద్రబాబుకు ఆయన సామాజికవర్గమే కనిపిస్తుంది. చంద్రబాబు జైలుకు పోతే కేసులకు భయపడి ఢిల్లీకి పారిపోయిన దద్దమ్మ లోకేష్. మరో దద్దమ్మ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ పారిపోయాడు. ఒరేయ్ లోకేష్ నీకు జగన్ మోహన్ రెడ్డి ఎవరో తెలియదా?, చంద్రబాబు ఒక్క మహిళకైనా మహాలక్ష్మి పథకం ఇచ్చాడా?, మహిళలకు అమ్మ ఒడి పథకం ఇచ్చిన ఘనత జగన్మోహన్రెడ్డిది. మేనిఫెస్టోను మాయం చేసిన వ్యక్తి చంద్రబాబు. రెండు పేజీల మేనిఫెస్టోను పవిత్ర గ్రంధంలా భావించి అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్రెడ్డి. ఐదేళ్లలో మైనార్టీ సంక్షేమానికి చంద్రబాబు రెండువేల కోట్లిస్తే.. సీఎం జగన్ నాలుగున్నరేళ్లలో 24 వేల కోట్లు ఇచ్చాడు. మా నమ్మకం నువ్వే జగనన్న. హజ్‌యాత్రకు వెళ్లే వారి పై భారం పడకుండా రూ. 15 కోట్లు ఇచ్చారు. 4% రిజర్వేషన్లు ఇచ్చి మా మనసులో వైఎస్సార్ నిలిచిపోయారు.వక్ఫ్ బోర్డును రక్షిస్తానని చెప్పారు.. రక్షించారు. మైనార్టీలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న వ్యక్తి సీఎం జగన్’ అని స్పష్టం చేశారు. నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు మాట్లాడుతూ.. ‘స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక పార్టీ ఒక సామాజిక వర్గానికే పరిమితమైంది. అన్ని కులాలు అభివృద్ధి చెందితేనే అసలైన అభివృద్ధి.సామాజిక సాధికారతను అమలు చేసిన నేతలు వైఎస్సార్, జగన్‌లు. ఆర్ధికంగా,సామాజికంగా,రాజకీయంగా అన్ని రంగాల్లో సాధికారతను ఇచ్చిన ప్రభుత్వం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం. డబ్బున్నోళ్లకే చదువులనే విధానాన్ని మార్చిన గొప్ప నేత జగన్ మోహన్ రెడ్డి. స్కూల్స్ ,విద్య,వైద్యంలో మార్పులు తెచ్చిన ఘనత జగన్మోహన్రెడ్డిది. సాయం కోసం ఒకరి వద్ద తల వంచుకునే అవసరం లేకుండా చేసిన గొప్ప వ్యక్తి సీఎం జగన్. మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే సాధికారత. ఆ సాధికారత ఇచ్చిన ఒకే ఒక్కడు సీఎం జగన్,.పేదలు,బడుగు,బలహీన వర్గాలు,రైతులకు అండగా నిలిచిన వ్యక్తి జగన్మోహన్రెడ్డి. పప్పు బెల్లాల్లా పంచేస్తున్నారని విమర్శించిన వాళ్లు జగన్ కంటే ఎక్కువిస్తామంటున్నారు .25 ఇళ్లకే వాలంటీర్లను పెడతామంటున్నారు. సీఎం జగన్ దేశానికి దిక్సూచి’ అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కొలుసు పార్ధసారథి మాట్లాడుతూ.. ‘ రాష్ట్రంలో ఏమూలకు వెళ్లినా అంబేద్కర్,పూలే ,జగ్జీవన్ రామ్ విగ్రహాలు కనిపిస్తాయి. వీరంతా మన హక్కుల కోసం కలలు కన్న గొప్ప వ్యక్తులు.అంబేద్కర్,పూలే ,జగ్జీవన్ రామ్ ల ఆశయాలను కొనసాగిస్తున్న వ్యక్తి జగన్మోహన్రెడ్డి. సీఎం జగన్ వచ్చిన తర్వాత బలహీన వర్గాలకు ప్రాధాన్యం దక్కింది. బీసీ, ఎస్సీలను మంత్రులను చేసిన మగాడు సీఎం జగన్. కేవలం కమ్మ సామాజిక వర్గం నేతలే కృష్ణాజిల్లా జడ్పీ చైర్మన్లుగా పని చేసేవారు. ఒక బీసీ మహిళను కృష్ణా జడ్పీ చైర్ పర్సన్ చేసిన వ్యక్తి సీఎం జగన్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన తర్వాత వాస్తవ బడ్జెట్ రూ. 8 లక్షల కోట్లు. 4 లక్షల 70 వేల కోట్లు కేవలం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అందించిన వ్యక్తి జగన్మోహన్రెడ్డి’ అని కొనియాడారు. మంత్రి విడదల రజని మాట్లాడుతూ.. ‘సంక్షేమ సామాజిక సాధికార సృష్టికర్త జగనన్న. నాలుగున్నరేళ్లుగా సామాజిక సాధికారత సంతోషాన్ని మనం పొందుతున్నాం. బడుగు,బలహీన వర్గాలు జగనన్న పాలనలో తలెత్తుకుని బ్రతుకుతున్నారు. క్యాబినెట్లో 17 మందికి మంత్రిగా అవకాశం కల్పించారు .ప్రతీ పదవుల్లోనూ 50% శాతం మనకే ఇచ్చారు. బడుగు బలహీన వర్గాలకు కావాల్సింది నోట్లు కాదు...గౌరవం. ఆ గౌరవాన్ని నిలబడేలా చేసిన వ్యక్తి జగన్మోహన్రెడ్డి. కార్పొరేట్ వైద్యం మన ఇంటికే వస్తుంది.. కార్పోరేట్ విద్య మన ఊరిలోనే అందుతోంది’ అని తెలిపారు. -
మళ్లీ జగనన్నే.. మళ్లీ మనకు సుపరిపాలనే!
సాక్షి, వైఎస్సార్ కడప: నియోజకవర్గం నలుమూలల నుంచి అశేషజనం తరలిరావడంలో కడప నగరం జనసంద్రమే అయింది. సామాజిక సాధికారయాత్ర వెంట వేలాదిగా జనం నడిచారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభ విజయవంతమైంది. డిప్యూటీ సీఎం, కడప ఎమ్మెల్యే అంజాద్‌బాషా ఆధ్వర్యం జరిగిన సభలో ఎంపీ అవినాష్‌రెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి ఆదిమూలపు సురేష్, మేయర్ రేష్సుబాబు, మాజీ ఎంపీ బుట్టారేణుక, ఎమ్మెల్సీ పోతుల సునీతలతో పాటు పలువులు ఎమ్మెల్సీలు, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్, కార్పొరేషన్ల ఛైర్మన్లు పాల్గొన్నారు. సాధికారత నినాదమే.. ఒక విధానం! '76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో సామాజిక సాధికారతను నినాదంగా కాకుండా, ఒక విధానంగా మార్చేసిన గొప్ప ముఖ్యమంత్రి మన జగన్మోహన్రెడ్డి. పేదలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం, సంక్షేమంలో అగ్రపీఠం.. సీఎం వైఎస్ జగన్ సర్కార్‌లోనే దక్కింది. మునుపెన్నడూ లేని చరిత్రను వైఎస్సార్సీపీ ప్రభుత్వం సాధించింది. అణగారిన వర్గాలను సొంతం చేసుకొని, వారి ఉన్నతికి విశేషంగా కృషి చేస్తోంది. ఈ కడప గడ్డపై రెండుసార్లు ఎమ్మెల్యేను చేయడమే కాదు, మంత్రి వర్గంలో అవకాశం కల్పించారు ముఖ్యమంత్రి. అక్కడితో ఆగలేదు.. నాకు ఏకంగా ఉపముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చి స్థాయి పెంచారు జగనన్న. చంద్రబాబు హయాంలో ఒక్క మైనార్టీ సోదరుడికి అధికార పదవుల్లో అవకాశం లేదు. కానీ జగనన్న హయాంలో మైనార్టీలకు అటు శాసనసభ, శాసనమండలి, కార్పొరేషన్లలో పదవులు వచ్చాయి. నమ్మించి మోసం చెయ్యడం చంద్రబాబు నైజం. నమ్మినవారికోసం ఎంతదూరమైన వెళ్లడం జగనన్న నైజం. ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, మైనార్టీలను అవమానించిన చరిత్ర చంద్రబాబుది. గతంలో కేవలం మాటలకే పరిమితమైన సామాజిక న్యాయాన్ని ఆచరణలో చూపెట్టింది జగనన్న ప్రభుత్వమే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఉన్నత స్థాయే లక్ష్యంగా పనిచేస్తోంది ఈ ప్రభుత్వం. కడప జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి వివిధ పథకాల ద్వారా రూ.7,984.48 కోట్లు అందించారు. అందులో ఎస్సీలకు రూ.2000.92 కోట్లు, ఎస్టీలకు రూ.212.47 కోట్లు, మైనార్టీలకు రూ.508 కోట్లు అందాయి. నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే.. అది మనపై జగనన్నకు ఉన్న ప్రేమకు నిదర్శనం! ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వాన్ని నడుపుతున్న జగనన్నకు మనమంతా అండగా ఉందాం.' - డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా నవరత్నాల ద్వారా రాష్ట్రప్రజల శ్రేయస్సు.. 'మనమంతా జగనన్న కుటుంబసభ్యులం. సంక్షేమ పథకాల లబ్దిని నేరుగా పేదలకు అందేలా చేస్తున్నారు జగన్మోహన్రెడ్డి. మధ్య దళారులు లేకుండా చేయడం ద్వారా, పథకాలు పారదర్శకంగా లబ్దిదారులకు అందేలా చేయడం జగనన్న లక్ష్యం. నవరత్నాల ద్వారా రాష్ట్రప్రజల శ్రేయస్సు కోసం జగనన్న అందిస్తున్న సాయం అంతా ఇంతా కాదు. అణగారిన కులాల పట్ల చిన్నచూపు ఉన్న వాడు చంద్రబాబు. కానీ జగనన్న పేదబిడ్డలు, ధనవంతుల పిల్లలకు తీసిపోరాదని గట్టిగా భావించారు. ఆ దిశలోనే ఆయన విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. మన బిడ్డలకు ఇంగ్లీషు చదువులు అందుబాటులోకి తెచ్చారు. కులాలకతీతంగా మన ఆర్థిక, సామాజిక స్థాయి పెంచేలా పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.' - డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఈ నాలుగున్నరేళ్లలో.. 'బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల వేదికపై ఆ వర్గాలకు చెందిన ఇద్దరు ఉపముఖ్యమంత్రులున్నారంటే.. ఇక జగనన్న హయాంలో జరిగిన సామాజిక సాధికారత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాటలతో కాకుండా, చేతల్లో సామాజిక న్యాయం చేసి చూపిన జగనన్న నిజమైన పాలకుడు. మన నాయకుడని చెప్పుకోవడం ఎంతో గర్వంగా ఉంటుంది. ఈ నాలుగున్నరేళ్లలో జగనన్న అన్ని రంగాలలో, అన్ని కులాలవారికి సమన్యాయం చేశారు. డప్పుకార్మికులకు, చేనేత వర్గాలకు, చర్మకారులకు, మత్స్యకారులకు ఇలా ఒకటేమిటి అన్ని అణగారిన వర్గాలకు చెయ్యిపట్టుకుని ముందుకు నడిపిస్తున్నారు. అంబేడ్కర్, మహాత్మఫూలే ఆశయాలనే ఆదర్శంగా తీసుకుని, సామాజిక సాధికారత విషయంలో రోల్‌మోడల్‌గా మారారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. "జగనన్నే మన విశ్వాసం. జగనన్నే మన నమ్మకం." మీకు మంచి జరిగివుంటేనే నాకు మద్దతు ఇవ్వండి, ఆశీర్వదించండి అని జగనన్న చెబుతున్నాడు. ఆయన మనకు మంచి చేశాడు. మనం ఆయనకు అండగా ఉండితీరాలి. వారి గుండెల్లో కడప ప్రజలు ఉన్నారన్నది మరిచిపోవద్దు. ఇక్కడ నుంచి ఒక ఉపముఖ్యమంత్రిని తయారు చేశారంటే.. కడప జనం జగనన్నకు ఎంతగా రుణపడిపోయారో అర్థం చేసుకోవాలి. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు గమనిస్తే.. కడప నియోజకవర్గానికి జరుగుతున్న మంచి ఎంతో తెలుస్తుంది.' - మంత్రి ఆదిమూలపు సురేష్ మళ్లీ జగనన్నే.. మళ్లీ మనకు సుపరిపాలనే! 'ఈనాడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రభుత్వం ఎలా చేయూతనందిస్తోందో మనమందరం చూస్తున్నాం. తన పాదయాత్ర సమయంలో బడుగు,బలహీనవర్గాల బాధలు కష్టాలు చూసిన జగనన్న, నేడు వారి కష్టాలు తొలగించాలని, బాధలు లేకుండా చేయాలని చిత్తశుద్దితో కృషి చేస్తున్నారు. ఓ వైపు సంక్షేమ పథకాలతో ఆర్థికంగా చేయూతనిస్తూ, సామాజిక సాధికారతతో బలహీనవర్గాలు ఆత్మగౌరవంతో, తలెత్తుకు తిరిగేలా చేస్తున్నారు. ఇక మహిళా సాధికారత కూడా జగనన్న ఎజెండా అయింది. మహిళల ఆర్థిక స్వావలంబనకోసం జగనన్న అందిస్తున్న ప్రోత్సాహం ఎంతో ఉంది. జగనన్నను గెలిపించుకోవాలి. మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలి. మళ్లీ మనకు సుపరిపాలనే కావాలి.' - మాజీ ఎంపీ బుట్టా రేణుక జగనన్నలా ఎవ్వరూ ఆలోచించలేదు! 'దేశంలో మనం ఎన్నో పార్టీలు చూశాం. ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం. సామాజికన్యాయం పాటిస్తామన్నవారే కానీ.. సామాజిక న్యాయం చేసిన పాపాన పోలేదు. అఖిలేష్‌యాదవ్, నితీష్‌కుమార్, కుమార్స్వామిలు.. ఇలా ఎందరో బీసీ నాయకులు ముఖ్యమంత్రులుగా చేశారు. ఎస్సీలున్నారు. ఇప్పటికీ పదవుల్లో ఉన్నవారు ఉన్నారు. కానీ ఎవ్వరూ సామాజిక న్యాయం విషయంలో జగనన్నలా ఆలోచించలేదు. ఆ దిశలో అడుగులు వేయలేదు. కులం,మతం, ప్రాంతం చూడని జగనన్న హయాంలో, అణగారిన వర్గాలకు చెందిన ఎంతోమంది రాజ్యాధికారంలో భాగస్వాములయ్యారు. అధికారపదవులు పొందారు.' - మేయర్ సురేష్ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం.. 'పేద,బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి జగనన్న. పేదల జీవితాల్లో వెలుగులు నింపాలన్న తాపత్రయంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించి, అణగారిన వర్గాలను అవమానించిన చరిత్ర చంద్రబాబుది. అందుకే 2019లో ఆయన వెన్నువిరిచి మూల కూర్చోబెట్టారు ప్రజలు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యంపై దృష్టిపెట్టి, అంబేడ్కర్, పూలేల ఆదర్శాలను పాటిస్తూ, వైఎస్సార్ ఆశయాల బాటలో ముందుకు సాగుతూ.. ఓవైపు సామాజిక సాధికారత సాధించడంతో పాటు, పేదలు, అణగారిన వర్గాల ఆర్థిక స్థాయి పెంచుతున్న గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.' - ఎమ్మెల్సీ పోతుల సునీత -
అన్ని స్పీచ్ లు ఒక లెక్క..ఈ స్పీచ్ ఒక లెక్క..
-
సామాజిక జైత్రయాత్రకు పోటెత్తిన అభిమానం..
-
బొబ్బిలిలో బడుగుల గర్జన
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సామాజిక సాధికార విజయ నినాదంతో గర్జించారు. బుధవారం బొబ్బిలిలో జరిగిన వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలకు నియోజకవర్గం నలు దిక్కుల నుంచి ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. వందలాది బైక్‌లతో యువకులు ర్యాలీగా వచ్చారు. ముందుగా మెట్టవలసలో కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే), భారత్ నిర్మాణ్ సేవా కేంద్రం–వెల్నెస్ సెంటర్ భవనాలను డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకటచిన్న అప్పలనాయుడు ప్రారంభించారు. అనంతరం నియోజకవర్గంలో అట్టహాసంగా యాత్ర నిర్వహించారు. బొబ్బిలి శ్రీకళాభారతి ఆడిటోరియం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వేలాది మంది పోటెత్తారు. జై జగన్... జై వైఎస్సార్సీపీ నినాదాలతో ప్రజలు హోరెత్తించారు. నాలుగేళ్లలో ఎంతో మేలు: శంబంగి రైతులు ఎక్కువగా ఉన్న బొబ్బిలి నియోజకవర్గంలో ఈ నాలుగేళ్లలో కొత్తగా 11,500 ఎకరాలకు సాగునీరు అందించామని, మరో 4,500 ఎకరాలకు నీరందించడానికి పనులు చేయాల్సి ఉందని ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్నఅప్పలనాయుడు చెప్పారు. ఈ సభలో ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, బొత్స అప్పలనర్సయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, అలజంగి జోగారావు, ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో నిర్వహించిన సామాజిక సాధికార యాత్ర సభకు హాజరైన అశేష జనవాహినిలో ఓ భాగం బలహీనవర్గాలకు పెద్ద పదవులిచ్చిన సీఎం జగన్: ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు పెత్తందారులకు మాత్రమే పెద్దపీట వేసిన టీడీపీ పాలనకు భిన్నంగా బలహీనవర్గాలకు పెద్ద పదవులు కట్టబెట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారికీ సీఎం జగన్ సముచిత స్థానం ఇచ్చారన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిచ్చారని తెలిపారు. ధనవంతుల పిల్లల్లాగే పేదల బిడ్డలకు ఇంగ్లిష్ మీడియం విద్యను అందుబాటులోకి తెచ్చారన్నారు. బడుగు, బలహీన వర్గాలు సాధించిన సాధికారత కొనసాగాలంటే సీఎం వైఎస్ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. సంక్షేమ పాలన జగన్‌తోనే సాధ్యం: పుష్పశ్రీవాణి సంక్షేమ పాలన సీఎం వైఎస్ జగన్‌తోనే సాధ్యమని కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి అన్నారు. వివిధ సంక్షేమ పథకాల కింద దళితులకు రూ.75 వేల కోట్లు, గిరిజనులకు రూ.25 వేల కోట్ల ఆర్థిక ప్రయోజనం అందించారని చెప్పారు. బొబ్బిలి గడ్డపై జనసునామీ: మజ్జి శ్రీనివాసరావు సీఎం వైఎస్ జగన్ పిలుపుతో జరుగుతున్న సామాజిక సాధికార యాత్రకు బొబ్బిలి గడ్డపై జనసునామీ పోటెత్తిందని విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు చెప్పారు. బొబ్బిలి ప్రజల చిరకాల వాంఛ రెవెన్యూ డివిజన్‌ను సీఎం జగన్ సాకారం చేశారని చెప్పారు. చెరకు రైతుల బకాయిలు సుమారు రూ.35 కోట్లు చెల్లించారన్నారు. గతంలో ఇక్కడ గెలిచిన బొబ్బిలి రాజులు పదవుల కోసం పార్టీ మారారని, ఆస్తులు పెంచుకోవడమే తప్ప ప్రజల కష్టాలను పట్టించుకోలేదని విమర్శించారు. -
Fact Check: ‘ఈనాడు’ వక్ర బుద్ధి..
సాక్షి, అమరావతి: పెత్తందార్ల పెద్ద రామోజీరావు మరోసారి చిన్న బుద్ధిని చూపించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చంద్రబాబు, ఈనాడు రామోజీరావుకు కలవరం కలిగిస్తోంది. అందుకే పెల్లుబుకుతున్న జనాదరణను తక్కువగా చూపించేందుకు రామోజీరావు తనకు అలవాటైన రీతిలో దిగజారుడు పాత్రికేయానికి పాల్పడుతున్నారు. అదీ.. బడుగు, బలహీన వర్గాలు నిర్వహించుకుంటున్న కార్యక్రమాలపైన బురద జల్లుతున్నారు. వైఎస్సార్సీపీ దిగ్విజయంగా నిర్వహిస్తున్న ‘సామాజిక సాధికార బస్సు యాత్ర’కు వెల్లువెత్తుతున్న ప్రజాస్పందన వాస్తవ చిత్రాన్ని చూపించేందుకు జంకుతున్నారు. బహిరంగ సభలు ప్రారంభానికి ముందు (జనం రాక ముందు), సభ ముగిసిన తర్వాత (వక్తల ప్రసంగాలు పూర్తయి జనం వెళ్లిపోయిన తరువాత) ఖాళీ అయిన కుర్చీల ఫొటోలు తీసి ఈనాడు పత్రికలో ప్రముఖంగా ప్రచురిస్తున్నారు. బహిరంగ సభలకు జనం రావడం లేదని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార సభకు సంబంధించి కూడా ఇలాంటి వక్ర బుద్ధే ప్రదర్శించారు. అదీ.. అసెంబ్లీ స్పీకర్‌గా ఎదిగిన ఓ బీసీ నేత ప్రసంగిస్తుండగా ప్రజలు లేరంటూ కొన్ని ఖాళీ కుర్చీల ఫొటో వేశారు. ఈ సభలో పాల్గొన్న అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రసంగిస్తుండగానే జనం వెళ్లిపోయారని పాఠకులను నమ్మించేందుకు పాట్లు పడ్డారు. కానీ వాస్తవం ఏమిటంటే.. ఆ సభ ముగిసి, జనం వెళ్లిపోయిన తరువాత తీసిన చిత్రాన్ని ఈనాడు ప్రచురించింది. అది కూడా సభా వేదికకు దూరంగా ఉన్న ఖాళీ కుర్చీల ఫొటోలను ప్రచురించింది. వాస్తవంగా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర విజయవంతమైంది. వేలాదిగా జనం తరలిరావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఎల్లో మీడియా తప్ప ఇతర ప్రధాన పత్రికలు ఆ ఫొటోలను ప్రముఖంగా ప్రచురించాయి. ఇతర టీవీ చానళ్లు కూడా ఆ బహిరంగ సభ విజయవంతమైన వీడియోలను ప్రసారం చేశాయి. దాంతో ఈనాడు రామోజీ పన్నాగం బెడిసికొట్టింది.