అందరి బాగు కోసం రెండు బటన్లు నొక్కండి: సీఎం జగన్‌ | CM YS Jagan 'Memantha Siddham' Bus Yatra In YSR District Live Updates | Sakshi
Sakshi News home page

అందరి బాగు కోసం రెండు బటన్లు నొక్కండి: సీఎం జగన్‌

Published Wed, Mar 27 2024 7:24 AM | Last Updated on Thu, Mar 28 2024 11:57 AM

CM YS Jagan 'Memantha Siddham' Bus Yatra In YSR District Live Updates - Sakshi

Memantha Siddham Bus Yatra Updates

పేదల భవిష్యత్‌  ఈ ఎన్నికలపై ఆధారపడి ఉంది: సీఎం జగన్‌

  • 2014లోనూ ఈ కూటమి మోసపూరిత హామీలిచ్చాయి.
  • రైతు రుణమాఫీ అన్నాడు.. మోసం చేశాడు
  • పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?
  • పేదల ఖాతాల్లో బాబు ఒక్క రూపాయి అయినా వేశారా?
  • నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?
  • మూడు సెంట్లు స్థలం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?
  • ఇదే బ్యాచ్‌.. మళ్లీ ఇప్పుడు ఒక్కటయ్యారు
  • ఫ్యాన్‌ ఇంట్లోనే ఉండాలి.. సైకిల్‌ఇంటి బయటే ఉండాలి
  • తాగేసిన టీ గ్లాస్‌ సింకులోనే ఉండాలి

ప్రతి ఇంటికి సంక్షేమం అందాలంటే మళ్లీ మీ జగనే రావాలి

  • ప్రతి ఇంటికి రేషన్‌ రావాలంటే మళ్లీ జగనన్నే రావాలి
  • పేదల భవిష్యత్‌ బాగుండాలంటే మళ్లీ మీ జగనన్నే రావాలి
  • మీరే నాకు స్టార్‌ క్యాంపెయినర్లు
  • ప్రతి ఇంటికి వెళ్లి ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేయాలని చెప్పాలి
  • గవర్నమెంట్‌ హాస్పిటల్స్‌ బాగుపడాలన్నా మళ్లీ జగన్‌ను గెలిపించండి
  • జగనన్న ముఖ్యమంత్రి అయితేనే రైతన్న ముఖంలో సంతోషం
  • నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నగదు పడాలన్నా జగన్ననే ముఖ్యమంత్రి అవ్వాలి
  • చంద్రముఖి చెడద పోవాలంటే ఫ్యాన్‌ గుర్తుపై ఓటేయాలి

  • చంద్రబాబు చేసేది శవ రాజకీయాలు, కుట్రలు: సీఎం జగన్‌
  • ఈనాడు పేపర్‌ను చూస్తే.. ఛీ ఇదీ ఒక పేపరేనా అనిపిస్తోంది
  • చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ, నా ఇద్దరు చెల్లెలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 కలిసి ఒకే ఒక్కడిపై యుద్ధం చేస్తున్నారు.
  • వీరెవరికి ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదు
  • నాకు దేవుడు, ప్రజలు అండగా ఉన్నారు
  • అధికారం కోసం చంద్రబాబు అందరికి కాళ్లు పట్టుకుంటున్నారు
  • ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ప్రతి గ్రామంలోనూ అభివృద్ధి, సంక్షేమాన్ని చేసి చూపించాం
  • ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్‌ ఇస్తున్నాం
  • రూ.3 వేలు పెన్షన్‌ ఇస్తున్న రాష్ట్రం, దేశంలోనే ఎక్కడా లేదు
  • పెన్షన్‌ కోసం ప్రతి ఏడాది రూ.24 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం

సీఎం జగన్‌ ప్రసంగం@ ప్రొద్దుటూరు బహిరంగ సభ

  • నా విజయాలకు కారణమైన మీ అందరికీ కృతజ్ఞతలు: సీఎం జగన్‌
  • 58 నెలల పాలనలో ప్రతి రంగంలోనూ మార్పులు తీసుకొచ్చాం
  • రూ.2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో జమ చేశాం
  • వైఎస్సార్‌ జిల్లా నేలమీద.. ఈ పొద్దుటూరు గడ్డమీద.. నన్ను మీ బిడ్డగా భావించి నిరంతరం కాపాడుకుని ఎవరు ఎన్ని కష్టాలు పెట్టినా.. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఎన్ని సమస్యలు సృష్టించినా నన్ను కాపాడుకున్న మీకు పేరు పేరునా కృతజ్ఞతలు
  • ఈ రోజు నా ముందు కనిపిస్తున్న స్థాయిలో ఈ జిల్లాలో ఎప్పుడూ సమావేశం జరిగి ఉండదు. ఓ మహా సముద్రం కనిపిస్తోంది. మంచికి మద్దతు పలికే ఇంతటి మహా ప్రజా సైన్యం మధ్య మన ప్రజా జైత్రయాత్రకు ముందు వరసలో మన వైఎస్సార్‌సీపీ పార్టీ జెండా తలెత్తుకుని ఎగురుతోంది ఇక్కడే
  • అధికారాన్ని పేదల భవిష్యత్తు కోసం రైతులు, అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, భావితరాలు, మన గ్రామాలు, ఇంటింటి అభివృద్ధి, సంక్షేమం కోసం ఒక బాధ్యతగా ఈ 58 నెలల పాలనలో ప్రతి రంగంలోనూ విప్లవానికి మారుపేరుగా మార్పులు తీసుకొచ్చాం. ఎప్పుడూ జరగని విధంగా.. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా రూ.2.70 లక్షల కోట్ల రూపాయలు లంచాలు, వివక్ష అనేవి లేకుండా నేరుగా ప్రజల చేతుల్లో ఉంచి ప్రజా ప్రభుత్వ అజెండా.. ఇక్కడ కనిపిస్తున్న మన జెండా కాబట్టే చెబుతున్నా ఈ జెండా తలెత్తుకుని ఎగురుతోంది అని.. రాష్ట్రంలో ఎ‍క్కడికి వెళ్లినా, చూసినా కోట్ల గుండెలు, మన పార్టీకి, ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ 2024 ఎన్నికల సమరానికి సిద్ధం అంటున్నాయి!
  • కాబట్టే ఈ జెండా మరే ఇతర జెండాతోనూ జతకట్టడం లేదు.. 
  • లక్షల సింహాల గర్జన... చరిత్రలో చిరస్థాయిగా గుర్తుండి పోతుంది.
  • గట్టిగా గర్జించండి.. మేమంతా సిద్ధమేనని!
  • పేదల ఇంటింటి అభివృద్ధికి అడ్డుపడుతున్నా ఈ దుష్ట చతుష్టయాన్ని చిత్తుగా ఓడించేందుకు పాంచజన్యం పూరించేందుకు శ్రీకృష్ణుడిలా మీరంతా సిద్ధమేనా?
  • మీ అర్జునుడు సిద్ధంగానే ఉన్నాడు!
  • మే 13న ఫ్యాన్‌ మీద రెండు ఓట్లు వేసి మరో వంద మందికి చెప్పి ఓట్లు వేయించి మనందరి పార్టీని గెలిపించేందుకు, అభివృద్ధి నిరోధకులను పేదల వ్యతిరేకులను ఓడించేందుకు మీరంతా సిద్ధమేనా?
  • 2024 ఎన్నికల సమరానికి సిద్ధంగా ఉన్నాం
  • నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబు 45 ఏళ్ల అనుభవం
  • ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబుకు మేనిఫెస్టో గుర్తుకొస్తుంది
  • ఎన్నికలయ్యాక బాబు ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తాడు
  • వైఎస్‌ వివేకాను ఎవరు చంపారో అందరికి తెలుసు
  • హంతకుడికి నా వాళ్లు మద్దతిస్తున్నారు
  • పేదల భవిష్యత్తుకు అడ్డుపడుతున్న దుష్ట చతుష్టయాన్ని ఓడించాలి
  • దుష్టచతుష్టయాన్ని ఓడించేందుకు మీ అర్జునుడు సిద్ధం
  • నేను దేవుడు, ప్రజలనే నమ్ముకున్నా
  • చంద్రబాబు మేనిఫెస్టోలోని 10 శాతం హామీలను కూడా నెరవేర్చలేదు
  • మన మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చిన ఘనత మనది
  • చంద్రబాబు వదిన గారి చుట్టం కంపెనీకి బ్రెజిల్‌ నుంచి డ్రగ్‌ వచ్చాయి
  • తప్పు చేసేది వారు.. నెపం నెట్టేది మనపై

ప్రొద్దుటూరులో వైఎస్సార్‌సీపీ భారీ బహిరంగ సభ

  • పేదల సొంతింటి కలను సీఎం జగన్‌ నెరవేర్చారు: రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి
  • 175కు 175 సీట్లు గెలవడమే మన టార్గెట్‌
  • సీఎం జగన్‌కు అండగా మేమంతా సిద్ధం: వైఎస్‌ అవినాష్‌రెడ్డి
  • ఇచ్చిన ప్రతీ హామీని సీఎం జగన్‌ నెరవేర్చారు
     

ప్రొద్దుటూరుకి చేరుకున్న సీఎం జగన్‌

  • ప్రొద్దుటూరు లోకి ప్రవేశించిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర
  • సీఎం జగన్‌కు సాదర స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు, అభిమానులు
  • మరికాసేపట్లో బహిరంగ సభ ప్రాంగణంకు చేరుకోనున్న సీఎం జగన్‌

ఎర్రగుంట్ల రోడ్డులోని రెడ్డి కల్యాణ మండపం వద్ద సీఎం జగన్‌కు స్వాగతం పలికేందుకు ఎదురు చూస్తున్న ప్రొద్దుటూరు ఎమ్మేల్యే రాచమల్లు శివప్రసాద్

బస్సుయాత్రకు జనం జైత్ర యాత్ర

  • అశేషంగా కదలివచ్చిన ప్రజలు
  • పల్లెపల్లెల నుంచి కదం తొక్కిన జనం
  • జనంతో కిక్కిరిసిన వేంపల్లె ప్రధాన రహదారి 
  • బస్సు యాత్రకు ఘనస్వాగతం పలికేందుకు మారుమూల గ్రామాల నుంచి ప్రధాన రహదారికి తరలివచ్చిన పల్లె ప్రజల
  • జగన్‌ను చూసేందుకు సుదీర్ఘ నిరీక్షణ.. టెంట్లు వేసుకుని, భోజనాలు ఏర్పాటు చేసుకుంటూ దారిపొడవునా సీఎం జగన్‌ కోసం నిరీక్షణ
  • రోడ్‌షోలో జగన్‌ను చూసిన వెంటనే హర్షధ్యానాలు, కేరింతలతో స్వాగతం పలికిన జనం
  • అడుగడుగునా పూలతో సీఎం జగన్‌కు ఆత్మీయ స్వాగతం పలికిన ప్రజలు
  • వెల్లువెత్తిన జనంతో అనుకున్న సమయం కన్నా ఆలస్యంగా నడుస్తున్న బస్సుయాత్ర
  • జనసంద్రంగా మారిన ఎర్రగుంట్ల మెయిన్ రోడ్డు
  • ఎర్రగుంట్లలో రోడ్డుకిరువైపులా కిక్కిరిసిన జనం, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు అపూర్వస్వాగతం

ప్రొద్దుటూరులో జయహో జగన్‌

  • జయహో జగన్‌ నినాదాలతో మారుమోగుతున్న ప్రొద్దుటూరు సభా ప్రాంగణం
  • కాసేపట్లో ప్రొద్దుటూరుకు చేరుకోనున్న మేమంతా సిద్ధం యాత్ర
  • బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించనున్న సీఎం జగన్‌


ఎండను సైతం లెక్క చేయకుండా.. 

  • జనసంద్రంగా యర్రగుంట్ల రోడ్లు 
  • మధ్యాహ్నం 2గంటల నుండి రోడ్ల మీద బారులు తీరిన ప్రజలు 
  • సీఎం జగన్ రాక కోసం వేచి ఎదురుచూపులు
  • సాయంత్రానికి భారీగా వచ్చిన జనం


కాసేపట్లో ప్రొద్దుటూరు బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం జగన్‌

► యర్రగుంట్ల మండల పెద్దనపాడు దాటిన బస్సు యాత్ర

► మేమంతా సిద్ధం మొదటి రోజు.. వీరపనాయనిపల్లి మండలంలో ముగిసిన సీఎం జగన్‌ బస్సు యాత్ర


జగనన్న సాయ గుణం మరువడు 

  • ఎన్నికల వేళ.. జన క్షేత్రంలోకి సీఎం జగన్‌ 
  • మేమంతా సిద్ధం ప్రచార యాత్ర ప్రారంభం
  • దారి పొడవునా స్వాగతం పలుకుతున్న జనం
  • ప్రచారంలోనూ సాయ గుణం మరువని జగన్‌
  • తనను కలిసి సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారి నుంచి వినతిపత్రాలు స్వీకరించిన సీఎం  వైఎస్ జగన్

ప్రొద్దుటూరులో బహిరంగ సభ

  • కాసేపట్లో వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరులో సీఎం జగన్‌ ఎన్నికల ప్రచార సభ
  • సభకు భారీగా తరలివస్తున్న పార్టీ శ్రేణులు, కార్యకర్తలు
  • అభిమాన నాయకుడ్ని చూసేందుకు పోటెత్తుతున్న అబిమాన గణం
  • కాసేపట్లో సభా వేదిక వద్దకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా చేరుకోనున్న సీఎం జగన్‌

రేపటి మేమంతా సిద్ధం యాత్ర షెడ్యూల్‌

  • రెండోరోజు.. రేపు కర్నూల్‌, నంద్యాలలో సీఎం జగన్‌ ప్రచార యాత్ర
  • ఉదయం 9గం.30ని. ఆళ్లగడ్డ నుంచి బయల్దేరనున్న సీఎం జగన్‌
  • 10గం.30ని.కి ఎర్రగుంట్లకు చేరిక
  • గంటపాటు ఎర్రగుంట్లలో ప్రజలతో మమేకం
  • 11గం.30ని. ఎర్రగుంట్ల వేదిక నుంచి బయల్దేరనున్న సీఎం జగన్‌
  • వెంకటపురం, గోవిందపల్లి నుంచి రైతునగరం క్రాస్‌కు చేరిక
  • రైతునగరం క్రాస్‌ వద్ద భోజన విరామం
  • రైతు నగరం క్రాస్‌ నుంచి నూనెపల్లి, ఎస్పీజీ గ్రౌండ్స్‌ మీదుగా నంద్యాల చేరిక
  • నంద్యాలలో బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్‌
  • సాయంత్రం నంద్యాల సభా వేదిక నుంచి పాణ్యం, కల్వబుగ్గ, ఓర్వకల్‌, కర్నూల్‌ క్రాస్‌, పెద్దటేకురు మీదుగా నాగలపురం చేరిక
  • రాత్రికి నాగలపురంలోనే బస 


ప్రొద్దుటూరులో సభాస్థలి వద్ద దృశ్యాలు

ప్రొద్దుటూరు లో జరుగనున్న మేమంతా సిద్ధం బహిరంగ సభకు తరలి వస్తున్న అశేష జనవాహిని

కమలాపురం నియోజకవర్గంలో కొనసాగుతున్న సీఎం జగన్‌ బస్సు యాత్ర


వీరపునాయుని పల్లెలో సీఎం జగన్‌ బస్సు యాత్ర కోసం వేచి ఉన్న ప్రజలు

కాసేపట్లో ప్రొద్దుటూరుకు..

  • కొనసాగుతున్న సీఎం జగన్‌ మేమంతా సిద్ధం బస్సు యాత్ర
  • కాసేపట్లో ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభ
  • కడప పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం తొలి బహిరంగ సభ
  • లక్షల మంది హాజరవుతారనే అంచనా

ప్రొద్దుటూరు క్రాస్‌ వద్దకు చేరుకున్న బస్సు యాత్ర

  • సీఎం జగన్‌ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రొద్దుటూరు క్రాస్ వద్దకు చేరుకుంది

వేంపల్లి హనుమాన్ జంక్షన్ వద్ద ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం జగన్‌

వేంపల్లి హనుమాన్ జంక్షన్ వద్ద బారులు తీరిన జనం


వేంపల్లెలో సీఎం జగన్‌

వేంపల్లె నాలుగు రోడ్ల కూడలికి చేరుకున్న సీఎం జగన్‌ బస్సు యాత్ర

  • భారీగా జన సందోహం
  • కడప పార్లమెంట్‌ స్థానాల పరిధిలో సాగుతున్న ప్రచార యాత్ర
  • సాయంత్రం ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభ
  • కాసేపట్లో వీరపునాయునిపల్లె, యర్రగుంట్ల మీదగా పొద్దుటూరు చేరుకోనున్న బస్సు యాత్ర
     

కుమ్మరాంపల్లె వద్ద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు స్వాగతం పలికిన ప్రజలు.
 

జగనన్నకు స్వాగతం పలికేందుకు..  

  • సీఎం జగన్‌ బస్సు యాత్రకు స్వాగతం పలికేందుకు తరలిన ప్రజానీకం
  • మేమంతా సిద్ధం పేరుతో జనంలోకి సీఎం జగన్‌
  • ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర 
  • వీరపనాయనిపల్లి మండలంలోని తంగేడు పల్లి క్రాస్ రోడ్డు వద్ద ఎదురు చూస్తున్న మహిళలు

ప్రారంభమైన సీఎం జగన్‌ బస్సు యాత్ర 

  • ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన మేమంతా సిద్ధం యాత్ర 
  • ఎన్నికల ప్రచారం ప్రారంభించిన సీఎం జగన్‌
  • వైఎస్సార్‌ ఘాట్‌ ప్రాంగణం నుంచి కదిలిన ‘మేమంతా సిద్ధం’ జగన్నాథ రథచక్రాలు
  • ఇవాళ కడప పార్లమెంట్‌ స్థానాల పరిధిలో సాగనున్న ప్రచార యాత్ర 
  • సాయంత్రం ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభ

వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద అభిమానుతో సీఎం జగన్‌ సెల్ఫీ

  • అన్న తో సెల్ఫీ కాదు.. అన్నే తీసిన సెల్ఫీ!
  • వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభానికి ముందు అభిమానుల  ఉత్సాహం
  • సెల్ఫీ కోసం యత్నించిన యువకుల ఫోన్‌ తీసుకుని తానే సెల్ఫీ దించిన సీఎం జగన్‌


సీఎం జగన్‌ సర్వమత ప్రార్థనలు

  • వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద సర్వమత ప్రార్థనల్లో పాల్గొంటున్న సీఎం జగన్‌
  • మూడు మతాల పెద్దల నుంచి ఆశీర్వాదం తీసుకున్న సీఎం జగన్‌

మేమంతా సిద్ధం.. తొలిరోజు ఇలా..

  • ఇడుపులపాయ వైఎస్సార్‌ ఘాట్‌ నుంచి మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభం 
  • వేంపల్లి మీదుగా.. 
  • కమలాపురం నియోజకవర్గం వీఎన్‌ పల్లి మీదుగా.. 
  • జమ్మలమడుగు నియోజకవర్గం, యెర్రగుంట్ల ప్రొద్దుటూరు జంక్షన్‌ మీదుగా.. 
  • జమ్మలమడుగు నియోజకవర్గం పొట్లదుట్టి మీదుగా.. 
  • ప్రొద్దుటూరు నియోజకవర్గం ప్రొద్దుటూరు టౌన్‌కు చేరిక
  • సాయంత్రం ప్రొద్దుటూర్‌ టౌన్‌లో సిద్ధం సభ

ఇడుపులపాయ వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద సీఎం జగన్‌

  • వైఎస్సార్‌ విగ్రహానికి పూలతో నివాళులు అర్పించిన సీఎం జగన్‌
  • మరికాసేపట్లో బస్సు యాత్ర ప్రారంభం

     


మరికాసేపట్లో సీఎం జగన్‌ బస్సు యాత్ర ప్రారంభం

  • వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ముగిసిన ప్రార్థనలు
  • మరికాసేపట్లో మేమంతా సిద్ధం బస్సు యాత్ర మొదలుపెట్టనున్న సీఎం జగన్‌
  • ఎన్నికల ప్రచార భేరికి శ్రీకారం చుట్టనున్న సీఎం జగన్‌
  • మహానేత వైఎస్సార్‌కు నివాళులర్పించి..ఆశీస్సులు తీసుకున్న సీఎం జగన్‌

వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద సీఎం జగన్‌ నివాళులు

  • ఇడుపులపాయలో వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద తండ్రి, దివంగత మహానేత వైఎస్సార్‌కు నివాళులు
  • ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న సీఎం జగన్‌
  • ప్రార్థనల్లో సీఎం జగన్‌ తల్లి విజయమ్మ, పార్టీ నేతలు
  • దివంగత వైఎస్సార్‌, తల్లి విజయమ్మ ఆశీస్సులతో యాత్ర ప్రారంభించనున్న సీఎం జగన్‌
  • మేమంతా సిద్దం పేరుతో రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర.. బహిరంగ సభలు
  • 21 రోజుల పాటు క్షేత్రస్థాయిలోనే ఉండనున్న సీఎం జగన్‌ 

  • వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద సీఎం జగన్‌
  • తల్లి విజయమ్మతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్న సీఎం జగన్‌

వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద.. 

  • ఇడుపులపాయలో వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభం
  • ప్రార్థనల్లో వైఎస్‌ విజయమ్మ, వైఎస్సార్‌సీపీ నేతలు
  • ఇడుపులపాయ చేరుకున్న సీఎం జగన్‌
  • హెలిప్యాడ్‌ వద్ద నుంచి ఘాట్‌ వద్దకు చేరుకుంటున్న సీఎం జగన్‌

కడపకు చేరుకున్న సీఎం జగన్ 

  • మరికాసేపట్లో ఇడుపులపాయకు 'సీఎం జగన్‌
  • దివంగత మహానేత వైఎస్సార్‌కు వైఎస్‌ ఘాట్ వద్ద ప్రార్దనలు నిర్వహించనున్న సీఎం జగన్‌ 
  • అనంతరం మేము సైతం బస్సు యాత్రను ప్రారంభించనున్న సీఎం జగన్‌

ఇడుపులపాయ చేరుకున్న వైఎస్‌ విజయమ్మ

  • ఇడుపులపాయ చేరుకున్న వైఎస్‌ విజయమ్మ
  • వైఎస్‌ ఘాట్‌ వద్ద కాసేపట్లో ప్రత్యేక ప్రార్థనలు
  • సీఎం జగన్‌తో కలిసి ప్రార్థనల్లో పాల్గొననున్న విజయమ్మ

తాడేపల్లి నుంచి ఇడుపులపాయకు బయలుదేరిన సీఎం జగన్‌.

గన్నవరం విమానాశ్రయం చేరుకున్న సీఎం జగన్‌. అక్కడి నుంచి కడపకు బయలుదేరిన జగనన్న.

వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించనున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

అనంతరం బస్సు యాత్ర ప్రారంభం కానుంది. 

కాసేపట్లో తాడేపల్లి నుంచి ఇడుపులపాయకు బయలుదేరనున్న సీఎం జగన్‌.

ఇడుపులపాయలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కోసం భారీగా తరలివచ్చిన అభిమానులు. 

సీఎం జగన్‌ కోసం ప్రత్యేకంగా లెదర్‌ చెప్పులు తయారుచేసుకుని తెచ్చిన ఓ అభిమాని.

ఇడుపులపాయ..

పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రగతిపథంలో నిలిపేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచారభేరి మోగించనున్నారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి  నివాళులు అర్పించిన అనంతరం ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను ప్రారంభిస్తారు. తొలి రోజు బస్సు యాత్ర కడప పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో జరగనుంది.

ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం 21 రోజులపాటు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తూ ‘సిద్ధం’ సభలు నిర్వహించిన నాలుగు పార్లమెంట్‌ నియోజకవర్గాలు మినహా మిగతా పార్లమెంట్‌ స్థానాల పరిధిలో బస్సు యాత్రను నిర్వహించనున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తాను చేసిన ప్రజా సంకల్ప పాదయాత్ర తరహాలోనే బస్సు యాత్రలోనూ రోజూ ఉదయం వివిధ వర్గాల ప్రజలు, మేధావులతో సీఎం జగన్‌ మమేకమవుతారు.

ప్రభుత్వ పనితీరును మరింతగా మెరుగుపర్చుకోవడానికి వారి నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. సాయంత్రం ఆయా పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. 

తొలి రోజు యాత్ర ఇలా..
సీఎం జగన్‌ ఈరోజు ఉదయం తాడేపల్లి­లోని నివాసం నుంచి బయలు­దేరి మధ్యాహ్నం 1 గంటకు ఇడు­పు­లపాయకు చేరు­కుం­టారు. దివం­గత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి ఘాట్‌ వద్ద నివాళులు అర్పిస్తారు.
మధ్యాహ్నం 1.30 గంటలకు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభిస్తారు. 
ఇడుపులపాయ నుంచి కుమారునిపల్లి, వేంపల్లి, సర్వరాజుపేట, వీరపునాయనిపల్లి (కమ­లాపురం), గంగిరెడ్డిపల్లి, ఊరుటూరు, యర్రగుంట్ల (జమ్మలమడుగు), పోట్లదుర్తి మీదుగా సాయంత్రం 4.30 గంటలకి ప్రొద్దుటూరు బైపాస్‌ రోడ్డు సమీపంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభ వద్దకు సీఎం జగన్‌ చేరుకుంటారు. బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
అనంతరం సున్నపురాళ్లపల్లి, దువ్వూరు, జిల్లెల, నాగలపాడు, బోధనం, రాంపల్లె క్రాస్, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ బైపాస్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన శిబిరం వద్దకు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. 

వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో జోష్‌
చేసిన మంచిని ప్రతి ఇంటికి వివరించి ప్రజల ఆశీర్వాదం తీసుకునేందుకు చేపట్టిన గడప గడపకూ మన ప్రభుత్వం, వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమాలకు జనం బ్రహ్మరథం పట్టారు. సీఎం జగన్‌ నాయక­త్వంపై ప్రజల్లో బలంగా నాటుకుపోయిన నమ్మ­కాన్ని ఈ రెండు కార్యక్రమాలు ప్రతిబింబించాయి.  గత 58 నెలల పాలనలో సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా ప్రతి ఇంటా.. ప్రతి గ్రామం.. ప్రతి నియోజకవర్గంలో విప్లవాత్మక మార్పు­లు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నప్పుడు 175కు 175 శాసనసభ స్థానాలు, 25కు 25 లోక్‌సభ స్థానా­ల్లో వైఎస్సార్‌సీపీ విజయబావుటా ఎగురవేయడం కచ్చితంగా సాధ్యమేనని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ సీఎం జగన్‌ సిద్ధం సభలు నిర్వహించారు.

భీమిలి (ఉత్తరాంధ్ర), దెందులూరు (ఉత్తర కోస్తా), రాప్తాడు (రాయలసీమ), మేదరమెట్ల (ఉత్తర కోస్తా)­లలో నిర్వహించిన నాలుగు సభలకు జనం కడలితో పోటీపడుతూ పోటెత్తడంతో ఒకదానికి మించి మరొకటి గ్రాండ్‌ సక్సెస్‌ అయ్యాయి. ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడు, మేదరమెట్ల సభలు అతి పెద్ద ప్రజాసభలుగా నిలిచిపోయాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందే వైఎస్సార్‌సీపీ మరో­సారి ప్రభంజనం సృష్టించడం ఖాయమని సిద్ధం సభలతో తేటతెల్లమైందని రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు.

జనసేన–బీజేపీతో టీడీపీ జతక­ట్టినా... సార్వత్రిక ఎన్నికల్లో వార్‌ వన్‌సైడేనని, వైఎస్సార్‌సీపీ మరోసారి చారిత్రక విజయం సాధించడం తథ్యమని టైమ్స్‌నౌ–ఈటీజీ, జీన్యూస్‌–మాట్రిజ్‌ లాంటి డజనుకుపైగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థల సర్వేలు తేల్చి చెప్పాయి. ఇప్పటికే 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించిన సీఎం జగన్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడటానికి ముందే బస్సు యాత్ర ద్వారా తొలి విడత ప్రచారాన్ని పూర్తి చేసేందుకు సిద్ధమవడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో నయా జోష్‌ కనిపిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement