తొమ్మిదో రోజు ముగిసిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర | CM YS Jagan Memantha Siddham Bus Yatra Day 9 Live Updates | Sakshi
Sakshi News home page

తొమ్మిదో రోజు ముగిసిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర

Published Sat, Apr 6 2024 7:20 AM | Last Updated on Sat, Apr 6 2024 9:48 PM

CM YS Jagan Memantha Siddham Bus Yatra Day 9 Live Updates - Sakshi

CM YS Jagan Memantha Siddham Bus Yatra Updates..

తొమ్మిదో రోజు ముగిసిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర

  • జువ్విగుంట క్రాస్‌ వద్ద నైట్ స్టే పాయింట్‌కి చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ బస్సు యాత్ర

సీఎం వైఎస్‌ జగన్‌ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర పొన్నలూరు చేరుకుంది

  • సీఎం జగన్‌కు పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతం పలికారు

  • సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది
  • కావలి బహిరంగ సభ అనంతరం ఏలూరుపాడు, ఉలవపాడు క్రాస్, సింగరాయకొండ క్రాస్, ఓగూరు, కందుకూరు, పొన్నలూరు, వెంకుపాలెం మీదుగా జువ్విగుంట క్రాస్‌ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరం వద్దకు సీఎం జగన్‌ చేరుకుంటారు.

కావలి బహిరంగ సభలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. 

  • మన నెల్లూరు జిల్లా కావలిలో  ఉవ్వేత్తున ఎగిసే కడలి తరంగాన్ని మించిన జన ప్రభంజనం.. ఇసుకవేసినా రాలనంతగా ఈ రోజు నా ఎదుట కనిపిస్తోంది
  • మంచి చేసిన మనకు మద్దతిచ్చేందుకు మీరంతా సిద్ధమా
  • మరో 5 వారాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి
  • ఇది జగన్‌, చంద్రబాబు మధ్య యుద్ధం కాదు..
  • పేదల పక్షాన ఉన్న మీ బిడ్డ జగన్‌ ఉన్నాడు..
  • పెత్తందార్ల పక్షాన ఉన్న చంద్రబాబు ఉన్నాడు..
  • మీ బిడ్డ హయాంలో ప్రతి ఇంటికి మంచి  జరిగింది
  • జరిగిన మంచి  కొనసాగించేందుకు మీరంతా సిద్ధమా 
  • అబద్ధాలు, మోసం, కుట్రలన్నీ కలిపితే చంద్రబాబు
  • చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకం కూడా గుర్తుకురాదు
  • బాబు పేరు చెప్తే పేదలకు చేసిన మంచి ఒక్కటీ లేదు..
  • ఎన్నికల ముందు మాత్రమే చంద్రబాబుకు మేనిఫెస్టో  గుర్తుకొస్తుంది
  • బాబు తన మేనిఫెస్టోలో కనీసం ఒక్క హామీనైనా నెరవేర్చలేదు
  • చంద్రబాబు మంచి చేసి ఉంటే మూడు పార్టీలతో పొత్తు ఎందుకు?
  • మేనిఫెస్టో చూపించే దమ్ము, ధైర్యం చంద్రబాబు ఉందా? 

  • మోసాలు, వెన్నుపోట్లతో బాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నారు
  • ఇప్పటికీ చేసిన పనులు చెప్పుకునే దమ్ము చంద్రబాబుకు లేదు..
  • మీ బిడ్డ ప్రతి ఇంటికి మంచి చేశాడు
  • రూ. 2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం
  • ఒక్కసారి ఆశీర్వదించినందుకే 58 నెలలపాటు సంక్షేమం అందించా
  • మేనిఫెస్టోలోని 99 శాతం హామీలు నెరవేర్చాం
  • ఇంటింటికి పౌర సేవలను డోర్‌ డెలివరీ చేయిస్తున్నాం

  • లంచాలు, వివక్ష లేని వ్యవస్థ తీసుకొచ్చా
  • నాడు-నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చాం
  • వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం..
  • నేను చేసిన మంచిలో కనీసం 10 శాతమైన బాబు చేశాడా? 
  • సచివాలయ, వాలంటీర్‌ వ్యవస్థలను తీసుకొచ్చాం
  • ప్రతి గ్రామంలోనూ ఆర్‌బీకే, విలేజ్‌ క్లినిక్స్‌​ పెట్టాం
  • మహిళల రక్షణ కోసం దిశ యాప్‌ తీసుకోచ్చాం
  • అవ్వాతాతల సంక్షేమం, మహిళా సాధికారత చేసి చూపించాం.. 
     
  • ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించాం
  • 99 శాతం హామీలు నెరవేర్చి మళ్లీ మీ ముందుకు వచ్చా..
  • మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి
  • మరో ఐదేళ్లపాటు మంచి కొనసాగాలంటే తోడుగా ఉండాలి..
  • ఫ్యాన్‌కు రెండు ఓట్లు వేస్తేనే ఇంటింటి అభివృద్ధి జరుగుతుంది.
  • ఇంటింటికి వెళ్లి చంద్రబాబు చేసిన మోసాలు చెప్పండి
  • 2014లో ముగ్గురి ఫొటోలతో ముఖ్యమైన హామీలు ఇ‍చ్చారు..
  • రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?
  • పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తానన్నాడు.. చేశాడా? 
  • ఆడబిడ్డప పుడితే రూ. 25వేలు డిపాజిట్‌ చేస్తానన్నాడు.. చేశాడా?
  • ఇంటికో ఉద్యోగం అన్నాడు.. ఇచ్చాడా?
  • ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు... ఇచ్చాడా?
  • 3 సెంట్ల ‍స్థలం.. కుట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు.. ఇచ్చాడా?
  • రూ. 10వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ అన్నాడు.. చేశాడా?
  • సింగ్‌పూర్‌ని మించి అభివృద్ధి చేస్తానన్నాడు.. చేశాడా?
  • ప్రతి నగరంలో హైటెక్‌ సిటీ అన్నాడు.. నిర్మించాడా?
  • మళ్లీ మోసం చేసేందుకు బాబు కొత్త మేనిఫెస్టోతో వస్తున్నాడు..
  • సూపర్‌ సిక్స్‌, సెవెన్‌ అంటున్నాడు.. నమ్మొద్దు
  • రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకునేందు మీరంతా సిద్ధమా?

జగన్‌ను మళ్లీ సీఎం చేసేందుకు సిద్ధం: ప్రతాప్‌కుమార్‌ రెడ్డి

కావలి బహిరంగ సభలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రసంగం ఆయన మాటల్లోనే..:

  • అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ చూస్తుంటే జనసముద్రం కనిపిస్తా ఉంది. 
  • మన పక్కన సముద్రం ఉంది ఆ సాగర ఘోష వినపడదు కానీ జన హృదయ నేత, ఉప్పొంగిన జనసముద్రం హోరు సాక్షిగా మీముందు రెండు మాటలు మాట్లాడతాను. 
  • రామరాజ్యం, ధర్మరాజ్యం తర్వాత మనదేశ చరిత్రలో గుప్తుల రాజ్యంలో ఆకలి చావులు లేవు. 
  • అశోకుని కాలంలో కులమతాల వివక్షత లేదు. 
  • కాకతీయ రాజ్యంలో మహిళలదే ఎప్పుడూ పైచేయిగా ఉండేది. 
  • అదే రాయలవారి పాలనలో సమ సమాజం, వైద్య, విద్య, వ్యవసాయం అన్నీ కూడా సుభిక్షంగా ఉండేవి. 
  • ఇవన్నీ కూడా మనం చరిత్ర బుక్కుల్లో రాసుకున్నాం, చదువుకున్నాం.
  • ఆ శకాలు, కాలాలు ముగిసిపోగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్‌లో మనం చూస్తా ఉన్నాం అభద్రత, అశాంతి, అవినీతి పెరిగిపోగా దేవుడా మా బ్రతుకులు బాగుచేయ్, దేవుడా మా కష్టాలు తీర్చవయ్యా అంటూ అభాగ్యుల ఆర్తనాదాలు మిన్నంటిన సమయంలో ఆ దైవం దిగిరాలేదు కానీ ఆంధ్రప్రదేశ్ ఆవేదనను తొలగించి అభాగ్యుల కష్టాలను, కన్నీటిని తుడిచే మన దూతగా, మన రాష్ట్రానికి వెలుగు చూపే రత్నాల దీపంగా జగనన్నను ఈ రాష్ట్రానికి పంపారు. 
  • రాయలసీమ గడ్డ పైనుంచి నడిచివచ్చే రాయలపాలన వారసుడిగా నవరత్నాల వెలుగులు అందరికీ పంచే సంక్షేమ దివిటి చేతబూని బడుగు, బలహీన భవిష్యత్తు వారధిగా మన ముందుకు వస్తున్నాడు మన జననేత జగనన్న.  
  • మీ రాకతో మన కావలి, మా కావలి పులకించింది. నువ్వే మా నమ్మకమంటూ స్వాగతిస్తోంది. 
  • జయహో జగన్, జై జగన్ నినాదాలతో ఎన్నికల సమరంలో మీవెంట నడిచేందుకు మేమంతా సిద్ధమంటూ మా యువత, మా అక్కచెల్లెమ్మలు అంతా కూడా ఉరకలేస్తున్నారు. 
  • జనం గుండెల్లో గుడి కట్టడమే అజెండాగా మన ముందుకు వచ్చిన జగనన్న కోసం మనమంతా కూడా సిద్ధమా. 
  • శ్రామిక శక్తికి సంపద సమానంగా అందితేనే సంక్షేమరాజ్యం, ప్రజలు స్వయంగా సమృద్ధి సాధించాలన్నా గాంధీజీ స్వప్నాలు, ఆశయాలు సాధించాలన్నా అది జగనన్నకే సాధ్యం.
  •  కాబట్టి ఈరోజు మీ అందరికీ గుర్తుంది, జగనన్న మాట చెబితే తప్పకుండా చేస్తాడు. 
  • అదేవిధంగా ఈరోజు ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించిన ముఖ్యమంత్రిగా ఈదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగనన్నే అని మనమంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. 
  • అందుకే ఈరోజు జగనన్నను ఈ రాష్ట్రానికి మరలా మనం ముఖ్యమంత్రిని చేసుకోవడానికి మీరందరూ కూడా సిద్ధమా. 
  • మన కావలి నియోజకవర్గానికి సంబంధించి జగనన్న.. రామాయపట్నం పోర్టు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన మత్స్యకారుల కోసం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ లాంటి ప్రాజెక్టును కూడా ఇవ్వడం జరిగింది.
  •  మన కావలి నియోజకవర్గం అభివృద్ధిపథంలో దూసుకుపోవడమే కాకుండా ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందుతోందంటే అది ఒక్క జగనన్నకే సాధ్యమైందని తెలియజేస్తున్నాను. 
  • కాబట్టి మన కావలి ప్రజలు తప్పకుండా జగనన్న వెంట మనమంతా కూడా నడవాలి. 
  • జరిగే ఎన్నికల పోరాటంలో తప్పకుండా జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకునేందుకు మనమంతా కూడా సిద్ధమా అని అడుగుతున్నాను.

కావలి బహిరంగ సభా వేదికపై సీఎం జగన్‌

  • బహిరంగ సభలో పోటెత్తిన ప్రజాభిమానం.. ఇసుకేస్తే రాలనంత జనం

కావలి బహిరంగ సభ వేదికపైకి చేరుకున్న సీఎం జగన్‌

  • సీఎం జగన్‌ వాక్‌ ర్యాంప్‌ మీద నడుస్తూ లక్షలాదిగా తరలి వచ్చిన ప్రజలకు అభివాదం చేశారు
     
  • ప్రజలకు సీఎం జగన్‌ అభివాదం చేశారు
  • కావలి బహిరంగ సభకు లక్షలాదిగా ప్రజలు తరలి వచ్చారు
  • కాసేపట్లో బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్‌

  • మేమంతా సిద్ధం బస్సు యాత్రలో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆర్‌ఎస్‌ఆర్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ లంచ్ స్టే పాయింట్ వద్ద సీఎం జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన అఖిలభారత యాదవ సంఘం, రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్‌.
  • ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభసభ్యుడు బీద మస్తాన్‌రావు

నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర

  • ఆర్‌ఎస్‌ఆర్‌ స్కూల్‌ ప్రాంగణానికి చేరుకున్నబస్సు యాత్ర
  • మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజల బ్రహ్మరథం
  • సీఎం జగన్‌కు అడుగడుగునా జననీరాజనం
  • కాసేపట్లో కావలిలో ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభ
  • కావలి బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్‌

సీఎం జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరికలు

  • శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆర్‌ఎస్‌ఆర్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ లంచ్‌ స్టే పాయింట్‌ వద్ద సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎ‍స్సార్‌సీపీలో చేరిన జనసేన అమలాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి శెట్టిబత్తుల రాజబాబు
  • ఉమ్మిడి తూర్పుగోదావరి జిల్లా జనరల్‌ సెక్రటరీ ఎస్‌.శ్రీనుబాబు, ఎస్సీ విభాగం రాష్ట్ర నాయకులు ఎం శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ సీహెచ్‌ వెంకటేశ్వరరావు
  • కొవ్వూరు వీరమహిళా విభాగం నేత చెట్టి సుబాషిణి, జనసేన అమలాపురం మండల పార్టీ జనరల్‌ సెక్రటరీ కె చినబాబుతో పాటు జనసేన పార్టీ వివిధ విభాగాలకు చెందిన ఇతర నేతలు

సీఎం జగన్‌ బస్సుయాత్ర నేపథ్యంలో ఆయన రాక కోసం ముంగమూరు క్రాస్‌ రోడ్డు వద్ద భారీ సంఖ్యలో వేచిచూస్తున్న అభిమానులు. 

సీఎం జగన్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు. ఎండను సైతం లెక్క చేయకుండా సీఎం జగన్‌ కోసం ఎదురుచూపులు. 

రాజుపాలెం చేరుకున్న సీఎం జగన్‌

కోవూరు క్రాస్ వద్దకు చేరుకున్న సీఎం జగన్‌ బస్సుయాత్ర

కోవూరు నియోజకవర్గం రేగడి చెలిక వద్ద రోడ్డుమీద ప్లకార్డు పట్టుకొని ఉన్న యువతిని చూసి కాన్వాయ్ ఆపిన సీఎం జగన్

  • ఏలూరుకు చెందిన బాల కళ్యాణి శ్రీ సిటీలో పని చేస్తుండగా.. స్థానికంగా వ్యక్తి వేధిస్తున్నాడని.. పోలీసులు పట్టించుకోవడంలేదని సీఎం జగన్‌కు ఫిర్యాదు చేసిన యువతీ
  • ఘటనపై విచారణ జరపాలని అధికారులు ఆదేశించిన సీఎం జగన్

నెల్లూరులో సీఎం జగన్‌ను కలిసిన టీవీ యాక్టర్‌, కమెడియన్‌ రియాజ్‌

ఈ సందర్బంగా ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికిన నేతలు.

నెల్లూరు జిల్లాలో తొమ్మిదో రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైంది. 

రూరల్ నియోజకవర్గంలోని చింతా రెడ్ది పాలెం క్రాస్ రోడ్ వద్దకు చేరుకున్న సీఎం జగన్‌ బస్సు యాత్ర. 

► సీఎం జగన్‌కి ఘన స్వాగతం పలికిన రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ అనం అరుణమ్మ, మేయర్ స్రవంతి, ఇతర ముఖ్య నేతలు

చింతరెడ్డిపాలెం నైట్‌ స్టే పాయింట్‌ వద్ద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసిన నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కావలి, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి, కందుకూరు నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలు.

పలువురు పార్టీ నేతలు, సీనియర్‌ కార్యకర్తలను పేరుపేరునా పలకరిస్తూ.. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న సీఎం జగన్. ఈ సందర్బంగా పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసిన ముఖ్యమంత్రి.

► నెల్లూరు జిల్లా సిద్ధమా..? సీఎం జగన్‌ ట్వీట్‌

వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నేడు తొమ్మిదో రోజు (శనివారం) కొనసాగునుంది. సీఎం వైఎస్‌ జగన్‌ శుక్రవారం రాత్రి బస చేసిన చింతరెడ్డిపాలెం ప్రాంతం నుంచి శనివారం ఉదయం తొమ్మిది గంటలకు బస్సుయాత్రకు బయలుదేరుతారు.

నేడు కొవ్వూరు క్రాస్, సున్నబట్టి, తిప్ప, గౌరవరం మీదుగా ఆర్‌ఎస్‌ఆర్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కావలి క్రాస్‌ మీదుగా కావలి జాతీయ రహదారి వద్దకు చేరుకుని సాయంత్రం మూడు గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

సభ అనంతరం ఏలూరుపాడు, ఉలవపాడు క్రాస్, సింగరాయకొండ క్రాస్, ఓగూరు, కందుకూరు, పొన్నలూరు, వెంకుపాలెం మీదుగా జువ్విగుంట క్రాస్‌ వద్ద ఏర్పాటుచేసిన రాత్రి బస శిబిరం వద్దకు చేరుకుంటారు.

ఎనిమిది రోజుల మేమంతా సిద్ధం బస్సుయాత్రలో అభిమానం ఇలా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement