proddutur
-
Proddatur Sabha Photos: జగనన్నా.. మీ వెంటే మేము (ఫొటోలు)
-
ప్రొద్దుటూరు గడ్డ పై సీఎం జగన్ సింహగర్జన
-
అందరి బాగు కోసం రెండు బటన్లు నొక్కండి: సీఎం జగన్
Memantha Siddham Bus Yatra Updates పేదల భవిష్యత్ ఈ ఎన్నికలపై ఆధారపడి ఉంది: సీఎం జగన్ 2014లోనూ ఈ కూటమి మోసపూరిత హామీలిచ్చాయి. రైతు రుణమాఫీ అన్నాడు.. మోసం చేశాడు పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానన్నాడు.. చేశాడా? పేదల ఖాతాల్లో బాబు ఒక్క రూపాయి అయినా వేశారా? నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు.. ఇచ్చాడా? మూడు సెంట్లు స్థలం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా? ఇదే బ్యాచ్.. మళ్లీ ఇప్పుడు ఒక్కటయ్యారు ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి.. సైకిల్‌ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ సింకులోనే ఉండాలి ప్రతి ఇంటికి సంక్షేమం అందాలంటే మళ్లీ మీ జగనే రావాలి ప్రతి ఇంటికి రేషన్ రావాలంటే మళ్లీ జగనన్నే రావాలి పేదల భవిష్యత్ బాగుండాలంటే మళ్లీ మీ జగనన్నే రావాలి మీరే నాకు స్టార్ క్యాంపెయినర్లు ప్రతి ఇంటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని చెప్పాలి గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగుపడాలన్నా మళ్లీ జగన్‌ను గెలిపించండి జగనన్న ముఖ్యమంత్రి అయితేనే రైతన్న ముఖంలో సంతోషం నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నగదు పడాలన్నా జగన్ననే ముఖ్యమంత్రి అవ్వాలి చంద్రముఖి చెడద పోవాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటేయాలి చంద్రబాబు చేసేది శవ రాజకీయాలు, కుట్రలు: సీఎం జగన్ ఈనాడు పేపర్‌ను చూస్తే.. ఛీ ఇదీ ఒక పేపరేనా అనిపిస్తోంది చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ, నా ఇద్దరు చెల్లెలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 కలిసి ఒకే ఒక్కడిపై యుద్ధం చేస్తున్నారు. వీరెవరికి ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదు నాకు దేవుడు, ప్రజలు అండగా ఉన్నారు అధికారం కోసం చంద్రబాబు అందరికి కాళ్లు పట్టుకుంటున్నారు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ప్రతి గ్రామంలోనూ అభివృద్ధి, సంక్షేమాన్ని చేసి చూపించాం ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తున్నాం రూ.3 వేలు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం, దేశంలోనే ఎక్కడా లేదు పెన్షన్ కోసం ప్రతి ఏడాది రూ.24 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం సీఎం జగన్ ప్రసంగం@ ప్రొద్దుటూరు బహిరంగ సభ నా విజయాలకు కారణమైన మీ అందరికీ కృతజ్ఞతలు: సీఎం జగన్ 58 నెలల పాలనలో ప్రతి రంగంలోనూ మార్పులు తీసుకొచ్చాం రూ.2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో జమ చేశాం వైఎస్సార్ జిల్లా నేలమీద.. ఈ పొద్దుటూరు గడ్డమీద.. నన్ను మీ బిడ్డగా భావించి నిరంతరం కాపాడుకుని ఎవరు ఎన్ని కష్టాలు పెట్టినా.. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఎన్ని సమస్యలు సృష్టించినా నన్ను కాపాడుకున్న మీకు పేరు పేరునా కృతజ్ఞతలు ఈ రోజు నా ముందు కనిపిస్తున్న స్థాయిలో ఈ జిల్లాలో ఎప్పుడూ సమావేశం జరిగి ఉండదు. ఓ మహా సముద్రం కనిపిస్తోంది. మంచికి మద్దతు పలికే ఇంతటి మహా ప్రజా సైన్యం మధ్య మన ప్రజా జైత్రయాత్రకు ముందు వరసలో మన వైఎస్సార్సీపీ పార్టీ జెండా తలెత్తుకుని ఎగురుతోంది ఇక్కడే అధికారాన్ని పేదల భవిష్యత్తు కోసం రైతులు, అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, భావితరాలు, మన గ్రామాలు, ఇంటింటి అభివృద్ధి, సంక్షేమం కోసం ఒక బాధ్యతగా ఈ 58 నెలల పాలనలో ప్రతి రంగంలోనూ విప్లవానికి మారుపేరుగా మార్పులు తీసుకొచ్చాం. ఎప్పుడూ జరగని విధంగా.. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా రూ.2.70 లక్షల కోట్ల రూపాయలు లంచాలు, వివక్ష అనేవి లేకుండా నేరుగా ప్రజల చేతుల్లో ఉంచి ప్రజా ప్రభుత్వ అజెండా.. ఇక్కడ కనిపిస్తున్న మన జెండా కాబట్టే చెబుతున్నా ఈ జెండా తలెత్తుకుని ఎగురుతోంది అని.. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా, చూసినా కోట్ల గుండెలు, మన పార్టీకి, ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ 2024 ఎన్నికల సమరానికి సిద్ధం అంటున్నాయి! కాబట్టే ఈ జెండా మరే ఇతర జెండాతోనూ జతకట్టడం లేదు.. లక్షల సింహాల గర్జన... చరిత్రలో చిరస్థాయిగా గుర్తుండి పోతుంది. గట్టిగా గర్జించండి.. మేమంతా సిద్ధమేనని! పేదల ఇంటింటి అభివృద్ధికి అడ్డుపడుతున్నా ఈ దుష్ట చతుష్టయాన్ని చిత్తుగా ఓడించేందుకు పాంచజన్యం పూరించేందుకు శ్రీకృష్ణుడిలా మీరంతా సిద్ధమేనా? మీ అర్జునుడు సిద్ధంగానే ఉన్నాడు! మే 13న ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేసి మరో వంద మందికి చెప్పి ఓట్లు వేయించి మనందరి పార్టీని గెలిపించేందుకు, అభివృద్ధి నిరోధకులను పేదల వ్యతిరేకులను ఓడించేందుకు మీరంతా సిద్ధమేనా? 2024 ఎన్నికల సమరానికి సిద్ధంగా ఉన్నాం నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబు 45 ఏళ్ల అనుభవం ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబుకు మేనిఫెస్టో గుర్తుకొస్తుంది ఎన్నికలయ్యాక బాబు ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తాడు వైఎస్ వివేకాను ఎవరు చంపారో అందరికి తెలుసు హంతకుడికి నా వాళ్లు మద్దతిస్తున్నారు పేదల భవిష్యత్తుకు అడ్డుపడుతున్న దుష్ట చతుష్టయాన్ని ఓడించాలి దుష్టచతుష్టయాన్ని ఓడించేందుకు మీ అర్జునుడు సిద్ధం నేను దేవుడు, ప్రజలనే నమ్ముకున్నా చంద్రబాబు మేనిఫెస్టోలోని 10 శాతం హామీలను కూడా నెరవేర్చలేదు మన మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చిన ఘనత మనది చంద్రబాబు వదిన గారి చుట్టం కంపెనీకి బ్రెజిల్ నుంచి డ్రగ్ వచ్చాయి తప్పు చేసేది వారు.. నెపం నెట్టేది మనపై ప్రొద్దుటూరులో వైఎస్సార్సీపీ భారీ బహిరంగ సభ పేదల సొంతింటి కలను సీఎం జగన్ నెరవేర్చారు: రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి 175కు 175 సీట్లు గెలవడమే మన టార్గెట్ సీఎం జగన్‌కు అండగా మేమంతా సిద్ధం: వైఎస్ అవినాష్‌రెడ్డి ఇచ్చిన ప్రతీ హామీని సీఎం జగన్ నెరవేర్చారు ప్రొద్దుటూరుకి చేరుకున్న సీఎం జగన్ ప్రొద్దుటూరు లోకి ప్రవేశించిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర సీఎం జగన్‌కు సాదర స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు, అభిమానులు మరికాసేపట్లో బహిరంగ సభ ప్రాంగణంకు చేరుకోనున్న సీఎం జగన్ ఎర్రగుంట్ల రోడ్డులోని రెడ్డి కల్యాణ మండపం వద్ద సీఎం జగన్‌కు స్వాగతం పలికేందుకు ఎదురు చూస్తున్న ప్రొద్దుటూరు ఎమ్మేల్యే రాచమల్లు శివప్రసాద్ బస్సుయాత్రకు జనం జైత్ర యాత్ర అశేషంగా కదలివచ్చిన ప్రజలు పల్లెపల్లెల నుంచి కదం తొక్కిన జనం జనంతో కిక్కిరిసిన వేంపల్లె ప్రధాన రహదారి బస్సు యాత్రకు ఘనస్వాగతం పలికేందుకు మారుమూల గ్రామాల నుంచి ప్రధాన రహదారికి తరలివచ్చిన పల్లె ప్రజల జగన్‌ను చూసేందుకు సుదీర్ఘ నిరీక్షణ.. టెంట్లు వేసుకుని, భోజనాలు ఏర్పాటు చేసుకుంటూ దారిపొడవునా సీఎం జగన్ కోసం నిరీక్షణ రోడ్‌షోలో జగన్‌ను చూసిన వెంటనే హర్షధ్యానాలు, కేరింతలతో స్వాగతం పలికిన జనం అడుగడుగునా పూలతో సీఎం జగన్‌కు ఆత్మీయ స్వాగతం పలికిన ప్రజలు వెల్లువెత్తిన జనంతో అనుకున్న సమయం కన్నా ఆలస్యంగా నడుస్తున్న బస్సుయాత్ర జనసంద్రంగా మారిన ఎర్రగుంట్ల మెయిన్ రోడ్డు ఎర్రగుంట్లలో రోడ్డుకిరువైపులా కిక్కిరిసిన జనం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అపూర్వస్వాగతం ప్రొద్దుటూరులో జయహో జగన్ జయహో జగన్ నినాదాలతో మారుమోగుతున్న ప్రొద్దుటూరు సభా ప్రాంగణం కాసేపట్లో ప్రొద్దుటూరుకు చేరుకోనున్న మేమంతా సిద్ధం యాత్ర బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించనున్న సీఎం జగన్ ఎండను సైతం లెక్క చేయకుండా.. జనసంద్రంగా యర్రగుంట్ల రోడ్లు మధ్యాహ్నం 2గంటల నుండి రోడ్ల మీద బారులు తీరిన ప్రజలు సీఎం జగన్ రాక కోసం వేచి ఎదురుచూపులు సాయంత్రానికి భారీగా వచ్చిన జనం కాసేపట్లో ప్రొద్దుటూరు బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం జగన్ ► యర్రగుంట్ల మండల పెద్దనపాడు దాటిన బస్సు యాత్ర ► మేమంతా సిద్ధం మొదటి రోజు.. వీరపనాయనిపల్లి మండలంలో ముగిసిన సీఎం జగన్ బస్సు యాత్ర జగనన్న సాయ గుణం మరువడు ఎన్నికల వేళ.. జన క్షేత్రంలోకి సీఎం జగన్ మేమంతా సిద్ధం ప్రచార యాత్ర ప్రారంభం దారి పొడవునా స్వాగతం పలుకుతున్న జనం ప్రచారంలోనూ సాయ గుణం మరువని జగన్ తనను కలిసి సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారి నుంచి వినతిపత్రాలు స్వీకరించిన సీఎం వైఎస్ జగన్ ప్రొద్దుటూరులో బహిరంగ సభ కాసేపట్లో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభ సభకు భారీగా తరలివస్తున్న పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అభిమాన నాయకుడ్ని చూసేందుకు పోటెత్తుతున్న అబిమాన గణం కాసేపట్లో సభా వేదిక వద్దకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా చేరుకోనున్న సీఎం జగన్ రేపటి మేమంతా సిద్ధం యాత్ర షెడ్యూల్ రెండోరోజు.. రేపు కర్నూల్, నంద్యాలలో సీఎం జగన్ ప్రచార యాత్ర ఉదయం 9గం.30ని. ఆళ్లగడ్డ నుంచి బయల్దేరనున్న సీఎం జగన్ 10గం.30ని.కి ఎర్రగుంట్లకు చేరిక గంటపాటు ఎర్రగుంట్లలో ప్రజలతో మమేకం 11గం.30ని. ఎర్రగుంట్ల వేదిక నుంచి బయల్దేరనున్న సీఎం జగన్ వెంకటపురం, గోవిందపల్లి నుంచి రైతునగరం క్రాస్‌కు చేరిక రైతునగరం క్రాస్ వద్ద భోజన విరామం రైతు నగరం క్రాస్ నుంచి నూనెపల్లి, ఎస్పీజీ గ్రౌండ్స్ మీదుగా నంద్యాల చేరిక నంద్యాలలో బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్ సాయంత్రం నంద్యాల సభా వేదిక నుంచి పాణ్యం, కల్వబుగ్గ, ఓర్వకల్, కర్నూల్ క్రాస్, పెద్దటేకురు మీదుగా నాగలపురం చేరిక రాత్రికి నాగలపురంలోనే బస ప్రొద్దుటూరులో సభాస్థలి వద్ద దృశ్యాలు ప్రొద్దుటూరు లో జరుగనున్న మేమంతా సిద్ధం బహిరంగ సభకు తరలి వస్తున్న అశేష జనవాహిని కమలాపురం నియోజకవర్గంలో కొనసాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర వీరపునాయుని పల్లెలో సీఎం జగన్ బస్సు యాత్ర కోసం వేచి ఉన్న ప్రజలు కాసేపట్లో ప్రొద్దుటూరుకు.. కొనసాగుతున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కాసేపట్లో ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభ కడప పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం తొలి బహిరంగ సభ లక్షల మంది హాజరవుతారనే అంచనా ప్రొద్దుటూరు క్రాస్ వద్దకు చేరుకున్న బస్సు యాత్ర సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రొద్దుటూరు క్రాస్ వద్దకు చేరుకుంది వేంపల్లి హనుమాన్ జంక్షన్ వద్ద ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం జగన్ వేంపల్లి హనుమాన్ జంక్షన్ వద్ద బారులు తీరిన జనం వేంపల్లెలో సీఎం జగన్ వేంపల్లె నాలుగు రోడ్ల కూడలికి చేరుకున్న సీఎం జగన్ బస్సు యాత్ర భారీగా జన సందోహం కడప పార్లమెంట్ స్థానాల పరిధిలో సాగుతున్న ప్రచార యాత్ర సాయంత్రం ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభ కాసేపట్లో వీరపునాయునిపల్లె, యర్రగుంట్ల మీదగా పొద్దుటూరు చేరుకోనున్న బస్సు యాత్ర కుమ్మరాంపల్లె వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు స్వాగతం పలికిన ప్రజలు. జగనన్నకు స్వాగతం పలికేందుకు.. సీఎం జగన్ బస్సు యాత్రకు స్వాగతం పలికేందుకు తరలిన ప్రజానీకం మేమంతా సిద్ధం పేరుతో జనంలోకి సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర వీరపనాయనిపల్లి మండలంలోని తంగేడు పల్లి క్రాస్ రోడ్డు వద్ద ఎదురు చూస్తున్న మహిళలు ప్రారంభమైన సీఎం జగన్ బస్సు యాత్ర ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన మేమంతా సిద్ధం యాత్ర ఎన్నికల ప్రచారం ప్రారంభించిన సీఎం జగన్ వైఎస్సార్ ఘాట్ ప్రాంగణం నుంచి కదిలిన ‘మేమంతా సిద్ధం’ జగన్నాథ రథచక్రాలు ఇవాళ కడప పార్లమెంట్ స్థానాల పరిధిలో సాగనున్న ప్రచార యాత్ర సాయంత్రం ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభ వైఎస్సార్ ఘాట్ వద్ద అభిమానుతో సీఎం జగన్ సెల్ఫీ అన్న తో సెల్ఫీ కాదు.. అన్నే తీసిన సెల్ఫీ! వైఎస్సార్ ఘాట్ వద్ద మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభానికి ముందు అభిమానుల ఉత్సాహం సెల్ఫీ కోసం యత్నించిన యువకుల ఫోన్ తీసుకుని తానే సెల్ఫీ దించిన సీఎం జగన్ సీఎం జగన్ సర్వమత ప్రార్థనలు వైఎస్సార్ ఘాట్ వద్ద సర్వమత ప్రార్థనల్లో పాల్గొంటున్న సీఎం జగన్ మూడు మతాల పెద్దల నుంచి ఆశీర్వాదం తీసుకున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం.. తొలిరోజు ఇలా.. ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ నుంచి మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభం వేంపల్లి మీదుగా.. కమలాపురం నియోజకవర్గం వీఎన్ పల్లి మీదుగా.. జమ్మలమడుగు నియోజకవర్గం, యెర్రగుంట్ల ప్రొద్దుటూరు జంక్షన్ మీదుగా.. జమ్మలమడుగు నియోజకవర్గం పొట్లదుట్టి మీదుగా.. ప్రొద్దుటూరు నియోజకవర్గం ప్రొద్దుటూరు టౌన్‌కు చేరిక సాయంత్రం ప్రొద్దుటూర్ టౌన్లో సిద్ధం సభ ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ వైఎస్సార్ విగ్రహానికి పూలతో నివాళులు అర్పించిన సీఎం జగన్ మరికాసేపట్లో బస్సు యాత్ర ప్రారంభం మరికాసేపట్లో సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం వైఎస్సార్ ఘాట్ వద్ద ముగిసిన ప్రార్థనలు మరికాసేపట్లో మేమంతా సిద్ధం బస్సు యాత్ర మొదలుపెట్టనున్న సీఎం జగన్ ఎన్నికల ప్రచార భేరికి శ్రీకారం చుట్టనున్న సీఎం జగన్ మహానేత వైఎస్సార్‌కు నివాళులర్పించి..ఆశీస్సులు తీసుకున్న సీఎం జగన్ వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులు ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద తండ్రి, దివంగత మహానేత వైఎస్సార్‌కు నివాళులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న సీఎం జగన్ ప్రార్థనల్లో సీఎం జగన్ తల్లి విజయమ్మ, పార్టీ నేతలు దివంగత వైఎస్సార్, తల్లి విజయమ్మ ఆశీస్సులతో యాత్ర ప్రారంభించనున్న సీఎం జగన్ మేమంతా సిద్దం పేరుతో రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర.. బహిరంగ సభలు 21 రోజుల పాటు క్షేత్రస్థాయిలోనే ఉండనున్న సీఎం జగన్ వైఎస్ఆర్ ఘాట్ వద్ద సీఎం జగన్ తల్లి విజయమ్మతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్న సీఎం జగన్ వైఎస్సార్ ఘాట్ వద్ద.. ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభం ప్రార్థనల్లో వైఎస్ విజయమ్మ, వైఎస్సార్సీపీ నేతలు ఇడుపులపాయ చేరుకున్న సీఎం జగన్ హెలిప్యాడ్ వద్ద నుంచి ఘాట్ వద్దకు చేరుకుంటున్న సీఎం జగన్ కడపకు చేరుకున్న సీఎం జగన్ మరికాసేపట్లో ఇడుపులపాయకు 'సీఎం జగన్ దివంగత మహానేత వైఎస్సార్‌కు వైఎస్ ఘాట్ వద్ద ప్రార్దనలు నిర్వహించనున్న సీఎం జగన్ అనంతరం మేము సైతం బస్సు యాత్రను ప్రారంభించనున్న సీఎం జగన్ ఇడుపులపాయ చేరుకున్న వైఎస్ విజయమ్మ ఇడుపులపాయ చేరుకున్న వైఎస్ విజయమ్మ వైఎస్ ఘాట్ వద్ద కాసేపట్లో ప్రత్యేక ప్రార్థనలు సీఎం జగన్‌తో కలిసి ప్రార్థనల్లో పాల్గొననున్న విజయమ్మ ►తాడేపల్లి నుంచి ఇడుపులపాయకు బయలుదేరిన సీఎం జగన్. ►గన్నవరం విమానాశ్రయం చేరుకున్న సీఎం జగన్. అక్కడి నుంచి కడపకు బయలుదేరిన జగనన్న. ►వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్న వస్తున్నాడు 🔥✊🏻#MemanthaSiddham pic.twitter.com/c4vJKgwwLq — Jagananna Connects (@JaganannaCNCTS) March 27, 2024 ►అనంతరం బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ►కాసేపట్లో తాడేపల్లి నుంచి ఇడుపులపాయకు బయలుదేరనున్న సీఎం జగన్. ►ఇడుపులపాయలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోసం భారీగా తరలివచ్చిన అభిమానులు. ప్రజాక్షేత్రంలో పేదోళ్లని గెలిపించేందుకు.. మేమంతా సిద్ధం యాత్రకి తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరిన జగనన్న!#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/f3SwjPEkQ3 — YSR Congress Party (@YSRCParty) March 27, 2024 ►సీఎం జగన్ కోసం ప్రత్యేకంగా లెదర్ చెప్పులు తయారుచేసుకుని తెచ్చిన ఓ అభిమాని. ►ఇడుపులపాయ.. సీఎం జగన్ బస్సుయాత్రకు ముస్తాబైన ఇడుపులపాయ pic.twitter.com/kZBbYLmvID — Rahul (@2024YCP) March 27, 2024 ►పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రగతిపథంలో నిలిపేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచారభేరి మోగించనున్నారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నివాళులు అర్పించిన అనంతరం ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను ప్రారంభిస్తారు. తొలి రోజు బస్సు యాత్ర కడప పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జరగనుంది. Memantha Siddham - Day 1 ఈరోజు నుంచి మేమంతా సిద్ధం యాత్రతో జనంలోకి జగనన్న! జననేతతో చేయి కలిపేందుకు మీరంతా సిద్ధమా✊🏻#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/K3NyVdRZPe — YSR Congress Party (@YSRCParty) March 27, 2024 ►ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం 21 రోజులపాటు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తూ ‘సిద్ధం’ సభలు నిర్వహించిన నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు మినహా మిగతా పార్లమెంట్ స్థానాల పరిధిలో బస్సు యాత్రను నిర్వహించనున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తాను చేసిన ప్రజా సంకల్ప పాదయాత్ర తరహాలోనే బస్సు యాత్రలోనూ రోజూ ఉదయం వివిధ వర్గాల ప్రజలు, మేధావులతో సీఎం జగన్ మమేకమవుతారు. ప్రభుత్వ పనితీరును మరింతగా మెరుగుపర్చుకోవడానికి వారి నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. సాయంత్రం ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. A special illustration will be released today at 10:00 AM in tribute to our leader, @ysjagan garu, as he kickstarts the #MemanthaSiddham Yatra. Stay tuned!#YSJaganAgain pic.twitter.com/f0UmuPTXiW — YSR Congress Party (@YSRCParty) March 27, 2024 తొలి రోజు యాత్ర ఇలా.. ► సీఎం జగన్ ఈరోజు ఉదయం తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు ఇడుపులపాయకు చేరుకుంటారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు. ►మధ్యాహ్నం 1.30 గంటలకు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను సీఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తారు. ► ఇడుపులపాయ నుంచి కుమారునిపల్లి, వేంపల్లి, సర్వరాజుపేట, వీరపునాయనిపల్లి (కమలాపురం), గంగిరెడ్డిపల్లి, ఊరుటూరు, యర్రగుంట్ల (జమ్మలమడుగు), పోట్లదుర్తి మీదుగా సాయంత్రం 4.30 గంటలకి ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డు సమీపంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభ వద్దకు సీఎం జగన్ చేరుకుంటారు. బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ► అనంతరం సున్నపురాళ్లపల్లి, దువ్వూరు, జిల్లెల, నాగలపాడు, బోధనం, రాంపల్లె క్రాస్, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన శిబిరం వద్దకు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. ఇది నాయకుడి మీద నమ్మకంతో వచ్చిన సైన్యం🔥 దుష్ట చతుష్టయంతో యుద్ధానికి నేను సిద్ధం.. మరో గొప్ప ప్రజా విజయాన్ని సాధించేందుకు మీరు సిద్ధమా✊🏻#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/cBrPETLAGn — YSR Congress Party (@YSRCParty) March 26, 2024 వైఎస్సార్సీపీ శ్రేణుల్లో జోష్ ►చేసిన మంచిని ప్రతి ఇంటికి వివరించి ప్రజల ఆశీర్వాదం తీసుకునేందుకు చేపట్టిన గడప గడపకూ మన ప్రభుత్వం, వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాలకు జనం బ్రహ్మరథం పట్టారు. సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో బలంగా నాటుకుపోయిన నమ్మకాన్ని ఈ రెండు కార్యక్రమాలు ప్రతిబింబించాయి. గత 58 నెలల పాలనలో సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా ప్రతి ఇంటా.. ప్రతి గ్రామం.. ప్రతి నియోజకవర్గంలో విప్లవాత్మక మార్పులు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నప్పుడు 175కు 175 శాసనసభ స్థానాలు, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయబావుటా ఎగురవేయడం కచ్చితంగా సాధ్యమేనని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ సీఎం జగన్ సిద్ధం సభలు నిర్వహించారు. ►భీమిలి (ఉత్తరాంధ్ర), దెందులూరు (ఉత్తర కోస్తా), రాప్తాడు (రాయలసీమ), మేదరమెట్ల (ఉత్తర కోస్తా)లలో నిర్వహించిన నాలుగు సభలకు జనం కడలితో పోటీపడుతూ పోటెత్తడంతో ఒకదానికి మించి మరొకటి గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడు, మేదరమెట్ల సభలు అతి పెద్ద ప్రజాసభలుగా నిలిచిపోయాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందే వైఎస్సార్సీపీ మరోసారి ప్రభంజనం సృష్టించడం ఖాయమని సిద్ధం సభలతో తేటతెల్లమైందని రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు. ►జనసేన–బీజేపీతో టీడీపీ జతకట్టినా... సార్వత్రిక ఎన్నికల్లో వార్ వన్‌సైడేనని, వైఎస్సార్సీపీ మరోసారి చారిత్రక విజయం సాధించడం తథ్యమని టైమ్స్‌నౌ–ఈటీజీ, జీన్యూస్–మాట్రిజ్ లాంటి డజనుకుపైగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థల సర్వేలు తేల్చి చెప్పాయి. ఇప్పటికే 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించిన సీఎం జగన్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి ముందే బస్సు యాత్ర ద్వారా తొలి విడత ప్రచారాన్ని పూర్తి చేసేందుకు సిద్ధమవడంతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నయా జోష్ కనిపిస్తోంది. -
16 కోట్లతో ప్రొద్దుటూరు అభివృద్ధి పనులు
-
YSRCP Bus Yatra: సామాజిక న్యాయం పాటించిన ఘనత సీఎం జగన్‌దే
సాక్షి, ప్రొద్దుటూరు: వైఎస్సార్సీపీ సామాజిక సాధికారిత బస్సుయాత్ర మూడో రోజులో భాగంగా ప్రొద్దుటూరు శివాలయ సర్కిల్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పలువురు నేతలు ప్రసంగించారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ‘ మునుపెన్నడూ లేని విధంగా అధికారంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సీఎం జగన్ అవకాశం కల్పించారు. బీసీల ధైర్యం సీఎం వైఎస్ జగన్. 2019కి ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు టీడీపీలో ఎంత ప్రాధాన్యత ఉందో అందరికీ తెలుసు. సామాజిక సాధికారిత బస్సుయాత్రను నల్లబ్యాడ్జిలతో అడ్డుకుంటామని లోకేష్ అంటున్నాడు. చేసిన తప్పుకు తండ్రి చంద్రబాబు జైల్లో ఉంటే తనయుడు లోకేష్ ఐదు రోజులు రాష్ట్రంలో లేడు. జైల్లో వేస్తారనే భయంతో ఢిల్లీకి పారిపోయాడు. తప్పులన్నీ రెడ్ బుక్‌లో రాస్తున్నాను అంటున్న లోకేష్ 2024 తరువాత ఆ రెడ్ బుక్ మడిచి ఎక్కడ పెట్టుకుంటాడు. ఎవరైనా తాను ముఖ్య మంత్రి కావాలని పార్టీ పెడతారు.. దత్త పుత్రుడు మాత్రం చంద్ర బాబు సీఎం కావాలని పార్టీ నడుపుతున్నాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు వైఎస్సార్సీపీకి అండగా ఉన్నంత వరకూ సీఎం జగన్‌ను గద్దె దించాలని చూడటం ఆ పార్టీలకు సాధ్యం కాదు’ పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ.. ‘75 ఏళ్ల భారత దేశంలో సామాజిక న్యాయం అనేదానికి సార్థకత కల్పించారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. మంత్రి వర్గ కూర్పులో బీసీలకు, మైనార్టీలకు సముచిత స్థానం కల్పించారు. బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీ బీసీలకు చేసేందేమీ లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు రాజ్యాధికార దిశగా చేయిపట్టుకుని వైఎస్సార్సీపీ ముందుకు నడిపిస్తోంది. గత ప్రభుత్వంలో ఒక్క ఎస్సీ మంత్రి లేరు. కేవలం ఎన్నికలు దగ్గర పడ్డాక మైనార్టీలకు టీడీపీ పదవులు ఇచ్చింది. సీఎం జగన్ సారథ్యంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అన్ని వెనుక బడిన వర్హాకు రాజకీయ అవకాశాలు కల్పించే దిశగా 50 శాతం రిజర్వేషన్ కల్పించింది. నవ రత్నాలు ద్వారా రాష్ట్రం లోని ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు. ఎంపీ బీద మస్తాన్ రావు మాట్లాడుతూ.. ‘తండ్రికి మించిన తనయుడిగా సీఎం జగన్ ప్రజా సంక్షేమ పథకాలను విజయవతంగా అమలు చేస్తున్నారు. కార్పోరేట్ వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి వైఎస్సార్ తీసుకువస్తే, వేల రోగాలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తెచ్చిన ఘనత సీఎం జగన్‌దే. టిడిపి గత ఎన్నికల్లో ఇచ్చిన మనిపెస్తో అమలు చేయలేదు.వైఎస్ జగన్ ఇచ్చిన మాటకు కట్టబడి నవరత్నాలు అందించారు.నేను 30 ఏళ్లు టిడిపిలో ఉన్నా ఎంపి పదవి ఇస్తానని చెప్పి మోసం.చేశారు. వైఎస్సార్సీపీ రాజ్యసభ పదవి ఇచ్చి నాకు న్యాయం.చేసింది. నాలాంటి ఎంతో మంది బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలకు సముచిత స్థానం కల్పించారు. -
ప్రొద్దుటూరులో 300 కిలోల బంగారం సీజ్
ప్రొద్దుటూరు క్రైం: బంగారం వ్యాపారానికి ప్రసిద్ధి గాంచిన వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఐటీ అధికారులు సోదాలు జరిపి సుమారు 300 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. బంగారు నగలతో పాటు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని రెండు వాహనాల్లో తిరుపతికి తరలించారు. ప్రొద్దుటూరులోని నాలుగు బంగారం దుకాణాల్లో ఈ నెల 19 నుంచి ఆదాయపన్నుశాఖ అధికారులు జరిపిన తనిఖీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. అధికారులు బంగారం దుకాణాలతో పాటు యజమానులు, వారి బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఒక దుకాణంలో సుమారు 200 కిలోలు, మరో రెండు దుకాణాల్లో 100 కిలోల వరకు లెక్కలు చూపని బంగారం లభించడంతో దాన్ని సీజ్ చేశారు. కాగా ఐటీ అధికారులు ఈ వివరాలను అధికారికంగా ధ్రువీకరించలేదు. పండుగ సమయంలో స్తంభించిన వ్యాపారం కొనుగోలుదారులకు బిల్లులు ఇవ్వకుండా బంగారు నగలు విక్రయించడంతో పాటు అక్రమంగా బంగారం దిగుమతి చేసుకుంటున్నారని ఫిర్యాదులు వెల్లటంతో ప్రొద్దుటూరులోని నాలుగు బంగారం దుకాణాల్లో ఈ నెల 19న సుమారు 40 మంది ఇన్‌కం ట్యాక్స్ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పెద్దమొత్తంలో లెక్కలు లేని బంగారం లభించడంతో పట్టణంలోని బంగారం దుకాణాల్లో జీరో వ్యాపారం జరుగుతోందన్న విషయం బయటపడిందని అధికారులు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ ఇలా సుదీర్ఘంగా సోదాలు జరగలేదని వ్యాపారులు పేర్కొన్నారు. వేలాది బంగారం దుకాణాలున్న ప్రొద్దుటూరులో ఐటీ అధికారుల దాడుల నేపథ్యంలో ఒక్కసారిగా వ్యాపారాలు స్తంభించిపోయాయి. తనిఖీలు తమవరకు ఎక్కడ వస్తాయో అనే భయంతో వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. పండుగ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయడానికి వచ్చిన ప్రజలు దుకాణాలు మూసివేయడంతో నిరాశ చెందారు. -
భర్త వివాహేతర సంబంధం.. భార్య కాపురానికి రాలేదని
సాక్షి, ప్రొద్దుటూరు క్రైం: భార్య కాపురానికి రాలేదనే కారణంతో గురుప్రతాప్ అనే యువకుడు విషద్రావణం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ప్రొద్దుటూరులోని ఆర్ట్స్‌కాలేజి రోడ్డుకు చెందిన సుంకేసుల గురుప్రతాప్ బుధవారం సాయంత్రం వన్‌టౌన్ పోలీస్‌ష్టేషన్ ఆవరణలో విషద్రావణం తాగాడు. పోలీసులు వెంటనే అతన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఔట్‌పోస్టు పోలీసులు తెలిపిన మేరకు.. గురుప్రతాప్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. చదవండి: (రాజేంద్రనగర్‌లో దారుణం.. టెన్త్ క్లాస్ విద్యార్థినిపై అత్యాచారం) అతనికి పట్టణంలోని గీతాశ్రమంవీధికి చెందిన అనూషతో ఏడేళ్ల క్రితం వివాహమైంది.. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రతాప్ మరో మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడనే కారణంతో భార్య 3 నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. అతను వారి ఇంటి వద్దకు వెళ్లి గొడవ చేస్తుండటంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వన్‌టౌన్ పోలీసులు అతన్ని స్టేషన్‌కు తీసుకొని వెళ్లారు. ఈ క్రమంలోనే అతను తన వెంట తెచ్చుకున్న విషద్రావణం తాగుతుండగా పోలీసులు సీసాను లాక్కున్నారు. వెంటనే ప్రతాప్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స చేస్తున్న వైద్యులు అతని ఆరోగ్య పరిస్థితి బాగుందని తెలిపారు. పోలీసులు బాధిత కుటుంబ సభ్యుల నుంచి వివరాలు నమోదు చేసుకున్నారు. చదవండి: ('ఏడాది కాపురం చేసి ఇప్పుడు మీకు, నాకు సంబంధం లేదంటున్నాడు') -
మాజీ ఎమ్మెల్యే ఎంవీ రమణారెడ్డి మృతికి సీఎం జగన్ సంతాపం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎం.వీ. రమణారెడ్డి ఆకస్మిక మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రమణారెడ్డి కుటుంబ సభ్యులకు సీఎం జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రమణారెడ్డి బుధవారం కర్నూలులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ నేతలు తమ సంతాపాన్ని తెలియజేశారు. చదవండి: Proddatur: మాజీ ఎమ్మెల్యే ఎంవీ రమణారెడ్డి కన్నుమూత -
ప్రేమోన్మాది ఘాతుకం.. కత్తితో కర్కషంగా..
సాక్షి, ప్రొద్దుటూరు క్రైం: అతనో ప్రేమోన్మాది.. తనను ప్రేమించాలంటూ ఆ యువతిని మూడు నెలలుగా వేధించేవాడు.. అతను కనిపిస్తే చాలు పాపం యువతి భయంతో వణికిపోయేది.. నువ్వంటే ఇష్టం లేదని ఎన్నిమార్లు చెప్పినా వినిపించుకోలేదు.. నా ప్రేమనే తిరస్కరిస్తావా అంటూ అతను యువతి ఇంటికి వెళ్లి కత్తితో కర్కషంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన ఆ యువతి ఆరోగ్యం విషమంగా మారింది. పట్టణంలోని నేతాజినగర్‌లో శుక్రవారం జొల్లు లావణ్య అనే యువతిపై సునీల్ అనే ఉన్మాది కత్తితో దాడికి పాల్పడ్డాడు. తనను ప్రేమించలేదనే కారణంతో అతను ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన మేరకు.. శ్రీనివాసులు ప్రొద్దుటూరులోని నేతాజినగర్–3లో నివాసం ఉంటున్నాడు. కొత్త మార్కెట్లో కోడిగుడ్ల దుకాణం నిర్వహిస్తున్నాడు. తనతో పాటు భార్య భారతి వ్యాపారం చేస్తుంటారు. ఆయనకు లావణ్యతో పాటు మరో కుమార్తె ఉంది. లావణ్య ఇటీవలే ఇంటర్ పూర్తి చేసింది. విజయవాడలోని ఒక కళాశాలలో బి–టెక్ చేర్పించాలనుకున్నారు. ఆదివారం లావణ్య విజయవాడకు వెళ్లాల్సి ఉంది. లావణ్య ఇంట్లో ఒంటరిగా ఉండగా.. పట్టణంలోని వివేకానంద కాలనీకి చెందిన సునీల్ అనే యువకుడు లావణ్యను మూడు నెలలుగా వేధిస్తున్నాడు. తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని ఇబ్బందులకు గురి చేసేవాడు. అయితే యువతి అందుకు తిరస్కరించడంతో అతను ఉన్మాదిగా మారాడు. సునీల్ ఎక్కడైనా బజారులో కనిపిస్తే చాలు లావణ్య భయంతో వణికిపోయేది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం తల్లిదండ్రులిద్దరూ దుకాణానికి వెళ్లారు. లోపల గడియ పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలంటూ కుమార్తెకు చెప్పారు. దీంతో లావణ్య బయట గేట్‌కు తాళం వేసి, ఇంటి లోపల గడియ పెట్టుకుంది. శ్రీనివాసులు దంపతులిద్దరూ దుకాణంలో ఉన్నారని గ్రహించిన సునీల్ నేరుగా నేతాజినగర్‌కు వెళ్లాడు. తలుపు తట్టడంతో ఎవరో వచ్చారని యువతి తలుపు తీసింది. వెంటనే అతను ఇంట్లోకి చొరబడి వెంట తెచ్చుకున్న కత్తితో యువతిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. దాడిలో చేతులకు బలమైన గాయాలు అయ్యాయి. చేతి వేళ్లు తెగి కింద పడ్డాయి. కత్తిని అక్కడే వదిలేసి ఉన్మాది సునీల్ అక్కడి నుంచి పారిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న ఆమెను చూసి స్థానికులు హుటా హుటినా జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాథమిక చికిత్స అనంతరం కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు. మూడు నెలలుగా టార్చర్ పెడుతున్నాడు.. కుమార్తెపై దాడి జరిగిందనే విషయం తెలియడంతో తల్లిదండ్రులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. రక్తంలో తడిసి ముద్దయిన లావణ్యను చూసి తల్లి భారతి విలపించసాగింది. ‘మూడు నెలల నుంచి సునీల్ నా బిడ్డను వేధిస్తున్నాడు.. అతనంటే ఇష్టం లేదని చెప్పినా వినిపించుకోలేదు.. రోజూ ఇద్దరు, ముగ్గురు స్నేహితులను వెంట పెట్టుకొని వీధిలోకి వచ్చేవాడు.. వాడిని వదిలి పెట్టకండి సార్..’అంటూ ఆమె ఆస్పత్రి బయట రోదిస్తోంది. సునీల్ వేధిస్తున్నాడని పలు మార్లు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపింది. వన్‌టౌన్ సీఐ నాగరాజు, ఎస్ఐ శివశంకర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. తల్లి భారతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ప్రత్యేక బృందాలతో సునీల్ కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. రిమ్స్‌లో లావణ్యను పరామర్శించిన ఐసీడిఎస్ అధికారులు కడప అర్బన్: ప్రేమోన్మాది సునీల్ చేతిలో దాడికి గురైన బిటెక్ విద్యార్థిని లావణ్యకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు శుక్రవారం ప్రొద్దుటూరు నుంచి కడప రిమ్స్‌కు తీసుకొచ్చారు. ఆమెను ఐసీడీఎస్ పీడీ పద్మజ, తమ సిబ్బందితో కలిసి పరామర్శించారు. విద్యార్థిని తల్లిదండ్రులు శ్రీనివాసులు, భారతిని అడిగి విషయం తెలుసుకున్నారు. వైద్యపరంగా, చట్టపరంగా తాము అండగా ఉంటామని వారు విద్యార్థినికి, తల్లిదండ్రులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ నిర్మలాదేవి, ఒన్‌స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ ఎన్. అశ్విని, ఎస్ఐ కమాల్‌బీ, డిసిపిఓ సుభాష్‌యాదవ్, పిఓ కమల్కుమార్లు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, నగర కార్యదర్శి వెంకటశివ, జిల్లా కార్యవర్గ సభ్యులు పి. చంద్రశేఖర్, టీడీపీ నాయకుడు జయచంద్ర, ఏపి మహిళా సమాఖ్య నగర కార్యదర్శి భాగ్యలక్ష్మి, ఉమాదేవి, ఏఐఎస్ఎఫ్ నగర నాయకులు శివశంకర్ తదితరులు లావణ్యను పరామర్శించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కిరాతకుడు సునీల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనీ డిమాండ్ చేశారు. -
‘సుబ్బయ్యపై 14 కేసులు ఉన్నాయి’
సాక్షి, కడప : ప్రొద్దుటూరు టీడీపీ నేత సుబ్బయ్య హత్య విషయంలో ఆ పార్టీ దిగజారుడు రాజకీయం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పారదర్శకమైన, జనరంజకమైన పాలన అందిస్తుంటే ఓర్వలేక టీడీపీ అసత్య ప్రచారాలు చేస్తోందని ఆరోపించారు. హత్యకు గురైన సుబ్బయ్యకు నేరచరిత్ర టీడీపీ హయాంలోనే ఉందని,14 కేసులు నమోదయ్యాయని అన్నారు. హత్యను ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి పైకి నెట్టేందుకు టీడీపీ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని , రాచమల్లు దేవునిపై ప్రమాణం చేసి తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకున్నారని అంజాద్ బాష తెలిపారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డికి వైఎస్సార్ జిల్లా వైఎస్సార్సీపీ నేతలు సంఘీభావం తెలిపారు. ప్రొద్దుటూరు లోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, ప్రభుత్వ చీఫ్ శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జున రెడ్డి, సుధీర్ రెడ్డి, రఘురామి రెడ్డి.. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు, అమర్నాధ్ రెడ్డి కలిశారు. ఇటీవల ప్రొద్దుటూరు లో టీడీపీ నేత హత్య నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించారు. ప్రతిపక్ష టీడీపీ ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యే రాచమల్లుకు మద్దతు తెలిపారు. జరిగిన పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రాచమల్లు ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కేవలం రాజకీయ లబ్ది కోసమే ప్రతిపక్షాలు నాపై ఆరోపణలు చేస్తున్నాయని వివరించారు. భూముల కొనుగోళ్లు, ఇతర వ్యవహారాల్లో నాకు ఎలాంటి ప్రమేయం లేదని అన్నారు. నాకున్న ఆస్తులు, ఇల్లు, భూములు అన్నీ తన అన్న సంపాదనే అని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఉందని నేను ఎక్కడా అక్రమాలకు పాల్పడలేదని అన్నారు. -
'సుబ్బయ్య హత్యపై శవరాజకీయం చేస్తున్నారు'
సాక్షి, కడప : ప్రొద్దుటూరులో జరిగిన టీడీపీ నేత సుబ్బయ్య హత్య పై డిప్యూటీ సీఎం అంజాద్ బాషా స్పందించారు. 'హత్యా రాజకీయాలు అధికార పార్టీ నాయకులు చేస్తున్నారని చంద్రబాబు, లోకేష్ చెప్పడం సిగ్గుచేటు. ఈ హత్య పై వారిద్దరు శవ రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. చెరుకులపాడు నారాయణను ఎవరు హత్య చేశారు. ఈ హత్యపై లోతైన విచారణ జరిపిస్తాం. ఆ హత్య ఎవరు చేశారో అప్పటి ప్రజలతో పాటు నాయకులకు తెలుసు. దివంగత రాజారెడ్డి హత్య కేసులో నిందితులకు క్షమాభిక్ష పెట్టారు. కులాలను ,మతాలను అడ్డం పెట్టుకొని టీడీపీ నేతలు కుల రాజకీయాలు, హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. టీడీపీ నేత సుబ్బయ్య పై మొత్తం 14 క్రిమినల్ కేసులు ఉన్నాయి. గత టీడీపీ హాయంలో ఇదే సుబ్బయ్య పై 4 క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. ఇవన్నీ టీడీపీ నాయకులకు తెలియదా...? బాధ్యతాయుమైన ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు శవ రాజకీయాలు చేయడం తగదు. రాష్ట్రంలో ఏ మూలన ఏ చిన్న గొడవ జరిగినా అధికార పార్టీ పై వేయాలని చూడటం దారుణం. మా ప్రభుత్వం అధికారంలోకి జిల్లాలో వచ్చాక కేవలం 51 హత్యలు వివిద కారణాలు వల్ల జరిగాయి.. పారదర్శకంగా పాలన సాగిస్తుంటే విమర్శలు చేయడం దుర్మార్గం. సుబ్బయ్య భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. హత్య చేశారని భావిస్తున్న వ్యక్తి గతంలో సుబ్బయ్య కు స్నేహితుడు. ఇప్పుడు మాట్లాడుకోవడం లేదని హత్య ను వైసీపీ నేతలపై వేయడం ఎంతవరకు సమంజసమంటూ' ఆయన పేర్కొన్నారు. -
చిరకాల కోరిక తీరకుండానే..
సాక్షి, ప్రొద్దుటూరు(కడప) : ప్రొద్దుటూరులోని బాలాజీనగర్–1కు చెందిన పెండ్లిమర్రి భాగ్యమ్మ (51) అమరనాథ్ యాత్రలో గుండె పోటుతో మృతి చెందింది. జూన్ 26న ఆమె భర్త శంకరయ్యతో కలిసి అమరనాథ్ యాత్రకు బయలుదేరి వెళ్లింది. 12 మంది బంధువులు, కర్నూల్ నుంచి సుమారు 100 మంది భక్తులతో కడప నుంచి నిజాముద్ధీన్ ఎక్స్‌ప్రెస్ రైలులో వెళ్లారు. 27న ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలోని వైష్ణవి ఆలయం, ద్వారక, స్వర్ణదేవాలయం, వాఘా సరిహద్దు, జమ్ము కాశ్మీర్‌లోని పలు ప్రదేశాలను సందర్శించారు. అమరనాథ్ కొండపైకి వెళ్లేందుకు ఈ నెల 3న మధ్యాహ్నం 3 గంటల సమయంలో కశ్మీర్లో ఉన్న బర్తాల్ బేస్ క్యాంపునకు చేరుకొని రాత్రి ఉండటానికి బాడుగ రూములు తీసుకున్నారు. ఆ రోజు రాత్రి అక్కడే బస చేసి గురువారం ఉదయం అమరనాథుని దర్శనానికి వెళ్లాలనుకున్నారు. ఇందుకోసం డోలీలకు డబ్బు కూడా చెల్లించారు. అయితే కొద్ది సేపటి తర్వాత సుమారు 3.30 గంటల సమయంలో భాగ్యమ్మకు గుండె పోటు రావడంతో కుప్ప కూలిపోయింది. భర్తతో పాటు యాత్రికులు ఆమె వద్దకు చేరుకునే లోపు తుదిశ్వాస విడిచింది. భార్య అకాల మరణాన్ని చూసి భర్త శంకరయ్య తల్లడిల్లిపోయారు. తమకు బుధవారం సాయంత్రం 4.40 గంటలకు సమాచారం అందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కశ్మీర్లో ఫోన్లు పని చేయకపోవడంతో వీరికి ఆలస్యంగా తెలిసింది. ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు మృతదేహం బర్తాల్ బేస్ క్యాంపు సమీపంలోని సోనామార్గ్ ఆస్పత్రిలో గురువారం ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని శ్రీనగర్‌కు తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తీసుకొని వచ్చారు. శుక్రవారం ఉదయం వారి స్వస్థలమైన ప్రొద్దుటూరుకు భాగ్యమ్మ మృతదేహాన్ని తీసుకొని వస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు. అదే రోజు ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి ఆరోగ్యంతో ఉండేది భాగ్యమ్మ పూర్తి ఆరోగ్యంతో ఉండేదని, ఏ రోజు ఆస్పత్రికి వెళ్లలేదని కుమార్తె నాగవేణి తెలిపింది. తల్లి మరణ వార్త విని ఆమె బోరున విలపించసాగింది. శంకరయ్య, భాగ్యమ్మ దంపతులకు మంజుల, నాగవేణి అనే కుమార్తెలు, శరత్ అనే కుమారుడు ఉన్నారు. కుమారుడు హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. శంకరయ్య జమ్మలమడుగు ఆర్టీసి డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గత ఏడాది అతను జమ్మలమడుగు డిపోకు బదిలీ అయ్యారు. వచ్చే ఏడాది డిసెంబర్లో పదవీ విరమణ పొందనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా బుధవారం ఉదయం 7.30 సమయంలో తల్లి భాగ్యమ్మ తమతో ఫోన్లో మాట్లాడిందని కుమార్తె నాగవేణి చెబుతూ విలపించసాగింది. కశ్మీర్లో ఉన్నామని, రేపు (గురువారం) ఉదయం అమరనాథ్ కొండపైకి వెళ్తామని తల్లి చెప్పినట్లు తెలిపింది. ఆమె ఫోన్ పని చేయకపోవడంతో ట్రావెల్స్ ప్రతినిధి ఫోన్‌తో మాట్లాడిందన్నారు. ఏదైనా అవసరం ఉంటే ఈ నంబర్‌కే ఫోన్ చేయాలని తల్లి చెప్పిందని, ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని రోదించింది. తల్లి మరణ వార్త విని కడపలో ఉంటున్న ఇద్దరు కుమార్తెలు, అల్లుళ్లు శ్రీధర్, అర్జున్ ప్రొద్దుటూరుకు వచ్చారు. తల్లి మృతదేహాన్ని ప్రొద్దుటూరుకు తీసుకొని వచ్చేందుకు కుమారుడు శరత్ హైదరాబాద్‌లోనే ఉండిపోయారు. ఈ సంఘటనపై రెవెన్యూ అధికారులు వివరాలు సేకరించి కలెక్టర్‌కు పంపినట్లు తెలిసింది. -
‘పసిడి’పురిలో...భయం భయం.!
సాక్షి, ప్రొద్దుటూరు(కడప) : దేశంలోనే పేరు గాంచిన ప్రొద్దుటూరు బంగారు మార్కెట్‌పై దొంగలు పంజా విసురుతున్నారు. అనుకున్నదే తడవుగా బంగారు నగలను సులభంగా కొట్టేస్తున్నారు. మాయ మాటలు చెప్పి మరీ బంగారు నగలతో ఉడాయిస్తున్నారు. రైళ్లలో కూడా బంగారు నగలను కొట్టేస్తుండటంతో వర్తకులు ప్రొద్దుటూరుకు రావడానికి జంకుతున్నారు. మంచి నాణ్యత, కచ్చితమైన ధర ఉంటుందనే ఉద్దేశంతో రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి బంగారం కొనుగోలు చేసేందుకు నిత్యం కొనుగోలు దారులు ఇక్కడికి వస్తుంటారు. స్థానికంగా ఉన్న స్వర్ణకారులే కాకుండా ఇతర రాష్ట్రాల వారు ఇక్కడ పని చేస్తూ కోరిన డిజైన్లలో ఆభరణాలను తయారు చేస్తుంటారు. దీంతో పూర్వం నుంచి ప్రొద్దుటూరు మార్కెట్‌కు మంచి పేరుంది. అయితే మార్కెట్లో జరిగే మోసాలు, ఐపీలు, చోరీలు పసిడి వ్యాపారంపై ప్రభావాన్ని చూపుతాయేమోనని వ్యాపారులు, స్వర్ణకారులు ఆందోళన చెందుతున్నారు. కోయంబత్తూరు, చెన్నై, ముంబయి తదితర ప్రాంతాల వారికి ఇక్కడి వ్యాపారులు బంగారు నగలు తయారు చేయడానికి ఆర్డర్లు ఇస్తుంటారు. ఆయా ప్రాంతాలకు చెందిన వ్యాపారులు పెద్ద మొత్తంలో బంగారు నగలు తయారు చేసుకొని రోజు ప్రొద్దుటూరుకు వస్తారు. అయితే రైళ్లతో పాటు దారిలో అటకాయించి బంగారు నగలను దోచుకున్న సంఘటనలు ఎక్కువగా చోటు చేసుకోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. గతంలో వ్యాపారులు ఎర్రగుంట్లకు రైల్లో వచ్చి ప్రొద్దుటూరుకు చేరుకునేవారు. అయితే ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలతో వ్యాపారులు వేర్వేరు ప్రాంతాల మీదుగా ఇక్కడికి వస్తున్నారు. వీళ్లు తెచ్చే బంగారు నగలకు చాలా వరకు బిల్లులు ఉండవు. దీంతో పోలీసులు, ఆదాయపు పన్ను శాఖ వాళ్ల కళ్లు గప్పి రావాల్సిన పరిస్థితి ఉంది. ప్రొద్దుటూరులో ఇటీవల వరుసగా చోటు చేసుకుంటున్న సంఘటనలతో బంగారు మార్కెట్లో అయోమయం నెలకొంది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు నెలన్నర క్రితం ప్రొద్దుటూరులోని పశ్చిమ బెంగాల్‌కు చెందిన మిథున్ దలై అనే స్వర్ణకారుడి నుంచి 100 గ్రాముల బంగారు నగలను గుర్తు తెలియని వ్యక్తి దోచుకొని వెళ్లాడు. తనకు కొత్త మాడళ్లతో బంగారు చైన్లు తయారు చేయించాలని, కొన్ని రకాల చైన్లు చూపిస్తే తన అన్నకు చూపించి వస్తానని చెప్పి బంగారు నగలతో ఉడాయించాడు. కోయంబత్తూరు నుంచి రైలులో ప్రొద్దుటూరుకు బంగారు నగలను తీసుకొని వస్తున్న వ్యాపారిని రైల్వే పోలీసులమని చెప్పి నలుగురు వ్యక్తులు చిత్తూరు జిల్లా పాకాల వద్ద బెదిరించి 1.5 కిలోల బంగారు నగలను దోచుకొని వెళ్లారు. వారంతా ప్రొద్దుటూరు పరిసర ప్రాంత వాసులు కావడంతో ఆ బంగారాన్ని ఇక్కడే కరిగించి విక్రయించారు. కొన్ని రోజుల క్రితం ఒక స్వర్ణకారుడు మార్కెట్లోని వ్యాపారి వద్దకు వెళ్లి గిరాకి వచ్చిందని, బంగారు నగల బాక్స్‌లు పంపించమని అడిగాడు. దీంతో ఆ వ్యాపారి తన వద్ద ఉన్న గుమాస్తాకు నాలుగు బంగారు నగల బాక్స్‌లు ఇచ్చి పంపించాడు. గుమాస్తా అక్కడే కూర్చొని ఉండగా ‘ కొంచెం ఆలస్యం అవుతుంది.. నువ్వు వెళ్లు.. నేను తర్వాత తీసుకొని వస్తాను ’అని చెప్పడంతో అతను వెళ్లిపోయాడు. అతను అలా వెళ్లిపోగానే స్వర్ణకారుడు నగల బాక్స్‌లతో ఉడాయించాడు. ఖాదర్‌హుస్సేన్ మసీదు వీధిలో ఉంటున్న ఒక వ్యాపారి వద్దకు కొందరు వ్యక్తులు వచ్చి స్వచ్ఛత కలిగిన బంగారు కావాలని అడిగారు. అతను లేదని చెప్పగా ఇదిగో డబ్బు తీసుకొని బంగారు ఇవ్వు అంటూ నోట్ల కట్టలను అతని ముక్కు వద్ద పెట్టారు. దీంతో అతను స్పృహ కోల్పోగా దుకాణంలో ఉన్న నగలు తీసుకొని వారు పారిపోయారు. భయంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కొన్నేళ్ల క్రితం బంగారు నగలతో కారులో ఎర్రగుంట్ల వైపు వెళ్తున్న కోయంబత్తూరు వ్యాపారిని దారిలో గుర్తు తెలియని దుండగులు అటకాయించి బంగారు నగలను దోచుకున్నారు. నగలు తయారు చేసేందుకు ఇచ్చిన బంగారం తీసుకొని ఇతర రాష్ట్రాలకు చెందిన స్వర్ణకారులు అనేక మార్లు పారిపోయిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. జడలగారి వీధి సమీపంలో డై మిషన్, చైన్ కంపెనీ నుంచి అక్కడే పని చేసే కొందరు పని వాళ్లు సుమారు 500 గ్రాముల బంగారుతో పరారయ్యారు. రాయల్ కాంప్లెక్స్‌లో కొన్ని నెలల క్రితం బంగారు వ్యాపారి సుమారు రూ. 10 కోట్ల మేర డబ్బు, బంగారంతో పారిపోయాడు. మెయిన్‌బజార్ సర్కిల్లో ఉన్న ఒక బంగారు వ్యాపారి కొన్ని రోజుల క్రితం రూ. 8 కోట్లు బాకీ చేసి ఐపీ పెట్టాడు. -
ప్రొద్దుటూరు టీడీపీలో తారాస్థాయికి విభేదాలు
వైఎస్సార్ జిల్లా: ప్రొద్దుటూరు టీడీపీలో విభేదాలు తారాస్ధాయికి చేరుకున్నాయి. ఎంపీ సీఎం రమేశ్‌పై మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి నిప్పులు చెరిగారు. తాను జీవించి ఉన్నంత వరకూ సీఎం రమేశ్ కుటుంబాన్ని ప్రొద్దుటూరు రాజకీయాల్లోని రానివ్వనని తెగేసి చెప్పారు. సీఎం రమేశ్ కనుసన్నల్లోనే ప్రొద్దుటూరులో కౌన్సిలర్లు రాజీనామాలు చేశారని ఆరోపించారు. ప్రొద్దుటూరు టీడీపీలో జరుగుతున్న అల్లర్ల వెనక సీఎం రమేశ్ హస్తం ఉందని మీడియా సమావేశంలో వరదరాజులు రెడ్డి పేర్కొన్నారు. ప్రొద్దుటూరులో టీడీపీకి చెందిన 22 మంది కౌన్సిలర్లు, తమ పదవులకు రాజీనామా చేస్తూ మున్సిపల్ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డికి సోమవారం లేఖ ఇచ్చిన సంగతి తెల్సిందే. -
చంద్రన్న పెళ్లి కానుక అడిగితే పెళ్లైందంటున్నారు!
సాక్షి, ప్రొద్దుటూరు : చంద్రన్న పెళ్లి కానుక కోసం దరఖాస్తు చేసుకున్న ఆ నిరుపేద కుటుంబాలకు అధికారులు చుక్కలు చూపించారు. కానుక మాట అటుంచి వరుడికి ఇదివరకే పెళ్లయిందనే నిందను మోపారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలం సోములవారిపల్లె గ్రామ పంచాయతీలో నివసిస్తున్న బాల ఓబులేసు, నాగలక్షుమ్మ కుమారుడు ఓబులేసుకు ఇదే ప్రాంతంలో నివసిస్తున్న రాజు, గుర్రమ్మల కుమార్తె రామాంజనమ్మను ఇచ్చి సెప్టెంబర్ 19న గండి క్షేత్రంలో వివాహం జరపించాలని పెద్దలు నిర్ణయించారు. ఇరువురి కుటుంబీకులు స్థానిక ఇటుకల పరిశ్రమల్లో పనిచేస్తూ సమీపంలోనే నివసిస్తున్నారు. నిరుపేదలైన వీరు సీఎం చంద్రబాబు ప్రకటించిన చంద్రన్న పెళ్లి కానుక కోసం ఇటీవల ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. ఆన్లైన్లో వివరాల నమోదు సందర్భంగా ఓబులేసుకు ఇదివరకే వివాహం అయిందని సర్వే జాబితాలో ఉంది. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు సంబంధిత అధికారులను సంప్రదించగా ప్రజాసాధికార సర్వేలో ఆ విధంగా నమోదైందని అధికారులు తెలిపారు. సమస్య పరిష్కారం కోసం శుక్రవారం గ్రామదర్శినిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. పెళ్లికాకుండానే పెళ్లి అయిందని ఎలా రాస్తారని అధికారులను ఓబులేసుతో పాటు బంధువులు ప్రశ్నించారు. అధికారులు మాత్రం ఇది తమ తప్పిదం కాదని బదులిచ్చారు. తప్పును సరిదిద్దితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటామని బాధితులు చెప్పగా రెండేళ్ల క్రితం జరిగిన ప్రజాసాధికార సర్వే సమయంలో ఉన్న సూపర్వైజర్ మాత్రమే దీనిని సరిచేసే అవకాశం ఉందని, తామేమి చేయలేమని స్పష్టం చేశారు. ఆ సమయంలో ఎవరు సర్వే చేశారు అనే వివరాలు అధికారుల వద్ద లేవు. ఇదే విషయాన్ని 1100 ద్వారా ఫిర్యాదు చేసినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. -
సీఎం రమేష్‌కు అంత సీన్ లేదు: వరదరాజులు రెడ్డి
సాక్షి, కడప : వైఎస్సార్ జిల్లా తెలుగుదేశం పార్టీలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎంపీ సీఎం రమేష్‌పై మాజీ ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ వరదరాజులురెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల్లో గెలిచే సత్తా సీఎం రమేష్‌కు లేదని, చంద్రబాబు నాయుడు దయవల్లే ఆయన ఎంపీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరదరాజులరెడ్డి శనివారమిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...‘ సీఎం రమేష్ స్థాయి గ్రామ పంచాయతీకి ఎక్కువ. మండలానికి తక్కువ. నేరుగా ఎన్నికల్లో గెలిచే సత్తా లేక జిల్లాలో గ్రూప్ రాజకీయాలు ప్రోత్సహిస్తున్నాడు. ప్రతి ఒక్క నియోజకవర్గంలో గ్రూపులు ప్రోత్సహిస్తూ తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేస్తున్నాడు. నామినేటెడ్ పదవులతో పబ్బం గడుపుకునే సీఎం రమేష్‌కు వర్గ రాజకీయాలు ఎందుకు?. కుందూ, పెన్నా వరద కాలువ విషయంలో సీఎం రమేష్ అయిదు శాతం కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. దొంగ ఆస్తులను తనఖా పెట్టి వేలకోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి డబ్బు అప్పుగా తీసుకున్నాడు.’ అంటూ ఆరోపణలు గుప్పిచ్చారు. -
బెదిరింపుల కేసులో విలేకరి అరెస్ట్
ప్రొద్దుటూరు క్రైం : డబ్బు ఇవ్వకుంటే విజిలెన్స్ అధికారులకు చెప్పి దాడులు చేయిస్తానని బెదిరించిన సంఘటనలో ప్రొద్దుటూరులోని అమృతానగర్‌కు చెందిన షేక్ మహ్మద్‌రఫి అనే ఒక పత్రికా (సాక్షి కాదు) విలేకరిని వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వన్‌టౌన్ సీఐ వెంకటశివారెడ్డి గురువారం సాయంత్రం స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. రఫి ఒక పత్రికా విలేకరిగానేగాక ఏపీ జర్నలిస్టు సంఘం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. అతను ఈ నెల 24న వసంతపేటకు చెందిన దొంతు ఓబులేసు కుమార్ అనే కిరాణా వ్యాపారి ఇంటికి వెళ్లాడు. తాను ఏపీ జర్నలిస్టు సంఘం అధ్యక్షుడినని చెప్పి రూ.3 వేలు ఇవ్వాలని డిమాండు చేసి రూ. 500 తీసుకున్నాడు. మిగతా డబ్బు రేపటిలోగా ఇవ్వకుంటే విజిలెన్స్ అధికారులకు ఫోన్ చేసి దాడులు చేయిస్తానని బెదిరించాడు. మిగిలిన డబ్బు ఇవ్వకపోవడంతో పలు మార్లు ఓబులేసుకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో దుకాణయజమాని వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రఫిపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు వన్‌టౌన్ ఎస్ఐ ఎంఏ ఖాన్ అతన్ని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు. బెదిరింపులకు ఉపయోగించిన సెల్‌ఫోన్‌ను కూడా అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నామని సీఐ వివరించారు. -
గేటు పడింది
ఐదేళ్ల నుంచి అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న ప్రొద్దుటూరు–కంభం రైలుమార్గం కథ కంచికి చేరేటట్లు కనిపిస్తోంది. కడప, ప్రకాశం జిల్లాలను కలుపుతూ ఈ రైల్వేలైన్ ఏర్ప డితే రెండుజిల్లాల మధ్య ఆర్థికవ్యా పార రంగాల పరంగా అభివృద్ధికి దోహదపడుతుందని భావించారు. గుంటూరు–గుంతకల్ మార్గంలో ఉన్న కంభం రైల్వేస్టేషన్‌కు, ఎర్రగుంట్ల–నం ద్యాల మార్గంలో ఉన్న ప్రొద్దుటూరు రైల్వేస్టేషన్ల మధ్య లైను వస్తుందనే ఆశలు అడియాశలుగామారాయి. రాజంపేట: రెండో ముంబయిగా ప్రసిద్ధి పొందిన ప్రొద్దుటూరు నుంచి ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని కంభం ప్రాంతాలను కలిపే రైల్వేలైన్ కలగానే మిగిలిపోనుంది. ఐదేళ్ల కిందట ఇది తెరపైకి వచ్చినా నేటికీ ఆచరణకు నోచుకోలేదు. రైల్వేమంత్రిత్వశాఖ కేవలం సర్వేకు నిధులు కేటాయిస్తోంది.ఇప్పుడు (2017–2018లో) ప్రణాళిక సంఘం ఆమోదించలేదు. ఇదే విషయాన్ని వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహనరెడ్డి ఇటీవల లోక్‌సభలో ప్రశ్నించిన నేపథ్యంలో ప్రొద్దుటూరు–కంభం రైల్వేలైన ప్రణాళికసంఘం ఆమోదించలేదని రైల్వేశాఖ స్పష్టంచేసింది. దీంతో ఈ మార్గంపై నీలినీడలు అలుముకున్నాయి. తప్పని ఎదురుచూపులు: యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రైలుమార్గం, ఎన్డీ ఉన్న సమయంలో మరో రైలుమార్గం ఇలా బడ్జెట్లో ప్రకటించడం తప్ప మరొకటి కనిపించడంలేదు. జిల్లాలో రెండు కొత్త లైన్ల పరిస్థితి ఎటూ తేలడంలేదు. సర్వేలు చేయిస్తున్నామని రైల్వేమంత్రిత్వశాఖ చెప్పుకుంటోంది.బడ్జెట్లో కూడా అరకొరగా కేటాయిస్తున్నారు. కొత్త రైలుమార్గం ఎప్పుడు వస్తుందో అని ప్రజలకు ఎదురుచూపులు తప్పడం లేదు. సర్వేతోసరి.. కొత్త రైలుమార్గంగా కంభం–ప్రొద్దుటూరులైన్ను తీసుకొచ్చారు. ప్రధాని మోదీ బడ్జెట్లో సర్వే కోసం నిధులు ప్రకటించారు.ఇందుకోసం ఆర్వీఎన్ఎల్ గతంలో టెండర్లను కూడా పిలిచింది. 2013–2014 రైల్వే బడ్జెట్లో కంభం–ప్రొద్దుటూరు కొత్త రైల్వే లైన్ కోసం రూ.10లక్షలు కేటాయించారు. అంచనా వ్యయం రూ.829కోట్లు కాగా దూరం 142కిలోమీటర్లు ఉందని రైల్వే వర్గాల సమాచారం.2016లో రైల్వే బడ్జెట్లో రూ.కోటి వ్యయం చేశారు. ఈవిధంగా ఈ మార్గం సర్వే దశలోనే ఉంది. 2017–18లో ఈ లైను గురించి ఊసేఎత్తలేదు. ఇప్పటికే కంభం పరిసర ప్రాంతాల్లో సర్వే చేసి వదిలేశారు. గతంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కొత్త రైలుమార్గాల గురించి రైల్వే మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్లారు. -
విశ్వసనీయతకు నిదర్శనంగా నిలుస్తాం
-
'నైతికంగా వైఎస్ఆర్సీపీ గెలిచింది'
వైఎస్ఆర్ కడప: ప్రొద్దుటూరులో వైఎస్ఆర్సీపీ నైతికంగా విజయం సాధించిందని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. ప్రజల్లో టీడీపీ మరింత చులకనైందని చెప్పారు. చైర్మన్ ఎన్నికను వాయిదా వేసేందుకు టీడీపీ కుటిలయత్నం చేసిందని ఆరోపించారు. భవిష్యత్తులో ఇలాంటి దురదృష్టకర ఘటనలు జరగకుండా కోర్టులు జోక్యం చేసుకోవాలని కోరారు. -
టీడీపీ వల్లే ఎన్నికలు ఆగిపోయాయి
-
అవినీతి కానిస్టేబుల్స్‌పై వేటు
వైఎస్సార్ జిల్లా: ప్రొద్దుటూరు పట్టణంలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్లపై వేటు పడింది. పలు ఆరోపణలు రావడంతో కానిస్టేబుల్ సురేష్, హెడ్ కానిస్టేబుల్ భూపాల్‌రెడ్డిలను ఉన్నతాధికారులు వీఆర్‌కు పంపించారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇరువురికి మట్కా, క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్‌లతో సంబంధాలు ఉన్నట్లు పలువురు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు అందాయని తెలిసింది. ఇటీవల పట్టణంలో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతన్ని సురేష్, భూపాల్‌రెడ్డిలు డబ్బు ఇవ్వాలని తరచూ బెదిరించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనిపై కూడా అప్పట్లో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. అంతేగాక ఓ మట్కా బీటర్‌తో సంబంధాలు పెట్టుకొని ఆర్థికంగా బాగా లబ్దిపొందినట్లు తెలుస్తోంది. పోలీసుల దాడుల నేపథ్యంలో మట్కా బీటర్కు వీరు ముందస్తు సమాచారం ఇచ్చేవారని విశ్వసనీయ సమాచారం. ఫిర్యాదులను కొద్దిరోజులుగా పరీశిలిస్తున్న జిల్లా ఎస్పీ.. సురేష్, భూపాల్‌రెడ్డిలను వీఆర్‌కు పంపాలని నిర్ణయం తీసుకున్నారు. ఇరువురు వెంటనే వీఆర్‌లో రిపోర్టు చేయాల్సిందిగా ఎస్పీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయని పోలీసు అధికారులు తెలిపారు. కాగా విచారణ అనంతరం రెండు లేదా మూడు రోజుల్లో తదుపరి చర్యలు కూడా ఉంటాయని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. వన్‌టౌన్ పీఎస్‌లో ఒకేసారి ఇద్దరిపై వేటు పడటంతో సిబ్బంది వెన్నులో వణుకుపుడుతోంది. -
అక్కాయపల్లెలో చోరీ
కడప అర్బన్ : కడప నగరం తాలూకా పోలీసు స్టేషన్ పరిధిలోగల అక్కాయపల్లెలో ఈనెల 11వ తేదీ రాత్రి నుంచి సోమవారం ఉదయం లోపు గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఇంటిలో చోరీకి పాల్పడినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జెడ్పీలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న గంగవరం సురేష్ తన భార్యతో కలిసి ఆదివారం చర్చికి వెళ్లాడు. అక్కడి నుంచి ప్రొద్దుటూరుకు తన బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి సోమవారం ఉదయం ఇంటికి వచ్చాడు. ఆ సమయానికే తాళాలు, గడియ పగులగొట్టి బీరువాలోని రెండున్నర తులం బంగారు ఆభరణాలను దోచుకెళ్లినట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా ఎస్ఐ రాజరాజేశ్వరరెడ్డి తెలిపారు. అప్రమత్తంగా ఉండాలి కడప తాలూకా పోలీసుస్టేషన్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో దొంగతనాల బారిన పడకుండా ప్రతి ఇంటికి స్టిక్కర్లను గతంలో అతికించామని ఎస్ఐ తెలిపారు. ఎక్కడికైనా ఊరికి వెళితే తిరిగి సాయంత్రానికి రాలేని వారు కచ్చితంగా 08562–242132, 94407 96907 నెంబర్లకు ఫోన్ చేసి తెలపాలన్నారు. తాము పోలీసుల నిఘాను ఏర్పాటు చేస్తామన్నారు. -
ప్రొద్దుటూర్‌లో AP బంద్
-
ఏటీఎంలు ఖాళీ
డబ్బుల్లేక విసుగెత్తిపోతున్న జనం తమ వద్దా డబ్బు లేదంటున్న బ్యాంకర్లు డబ్బు రీసైకిల్ కాకపోవడమే కారణం ప్రొద్దుటూరు : వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని విజయనగరం వీధికి చెందిన వాసుదేవరెడ్డి శనివారం ఏటీఎంలో డబ్బు తీసుకునేందుకు వెళ్లగా లేకపోవడంతో వెనక్కి తిరిగారు. పండుగ తాకిడికి ఏటీఎంలో డబ్బు అయిపోయిందేమో అని భావించాడు. సోమవారం (వర్కింగ్ డే) మధ్యాహ్న సమయంలో శ్రీ రాములపేటలోని ఏటీఎంలో ప్రయత్నించగా అందులోనూ డబ్బు లేదు. ఆ తర్వాత పట్టణంలో ఆరు చోట్ల ఉన్న ఏటీఎంల వద్దకు వెళ్లి చూశాడు. అన్ని చోట్లా అదే పరిస్థితి. పట్టణ శివారులో ఉన్న ఓ ఏటీఎం వద్దకు వెళ్లగా ఇక్కడా కాసేపటి క్రితమే డబ్బు అయిపోయిందని అక్కడున్న వారు సెలవిచ్చారు. దీంతో చేసేది లేక ఓ మిత్రుడికి ఫోన్ చేసి చేబదులు తీసుకోవడానికి బయలుదేరాడు. ఇలా ఒక్క ప్రొద్దుటూరులోనే కాదు.. దాదాపు జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. జిల్లాకు సంబంధించి కడప నగర పరిధిలో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 75 ఏటీఎంలు ఉండగా తర్వాత స్థానంలో ఉన్న ప్రొద్దుటూరులో 30 ఏటీఎంలను ఏర్పాటు చేశారు. ఈ ప్రకారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 32 బ్యాంక్లకుగాను 365 బ్రాంచిల పరిధిలో 238 ఏటీఎంలను ఏర్పాటు చేశారు. సామర్థ్యాన్ని బట్టి ఒక్కో ఏటీఎంలో రూ.45 లక్షల వరకు డబ్బు పెట్టే అవకాశం ఉంది. బ్యాంక్ అధికారుల అంచనా ప్రకారం ప్రతి ఏటీఎంలో రోజూ 150 వరకు ట్రాన్సాక్షన్లు జరుగుతాయని, యావరేజిగా రూ.7.50 లక్షల వరకు డ్రా చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. కొంత కాలంగా బ్యాంక్ సమీపంలో ఉన్న ఏటీఎంలలో తప్ప బయట ఉన్న ఏటీఎంలలో కావలసినంత డబ్బు పెట్టడం లేదని తెలుస్తోంది. ఈ కారణంగా ఖాతాదారులు ఏటీఎంల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం ముగిశాక ఈ ప్రభావం మరీ ఎక్కువగా కనిపిస్తోంది. వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో అందరు పండుగ ప్రభావమని భావించారు. అయితే వాస్తవానికి ఆర్థిక లేమి పరిస్థితులే కారణమని స్వయంగా బ్యాంకర్లే చెబుతున్నారు. రీసైకిల్ లేకపోవడమే కారణం తమ బ్యాంక్ వద్ద ఉన్న రెండు ఏటీఎంలలో రోజూ రూ.40 లక్షలు పెడుతున్నా ఖాతాదారులు డ్రా చేస్తున్నారే కానీ.. తిరిగి తమ బ్యాంక్‌కు డబ్బు రావడం లేదని ఓ బ్యాంక్ అధికారి తెలపగా, మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వ్యవధిలో తమ ఏటీఎం నుంచి రూ.10 లక్షలు డ్రా చేసిన విషయాన్ని గమనించి తాను ఆశ్చర్య పోయానని మైదుకూరు రోడ్డులోని మరో బ్యాంక్ మేనేజర్ సాక్షికి వివరించారు. ఒక్క ప్రొద్దుటూరులోని ఏటీఎంలకు సంబంధించే రోజు రూ.12 కోట్లు డబ్బు పెడుతున్నట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు. బ్యాంకర్ల అంచనా ప్రకారం సాధారణంగా డ్రా చేసిన డబ్బు ఏదో ఒక రూపంలో కొంత మొత్తమైనా తిరిగి బ్యాంక్‌లకు జమ కావలసి ఉంది. అయితే వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఖాతాదారులు తీసుకెళ్లిన డబ్బు తిరిగి బ్యాంక్‌లకు జమ కాకపోవడంతో బ్యాంక్‌లు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. కొద్ది రోజులుగా ఈ పరిస్థితి ఉందని తెలుస్తోంది. ఈ సమస్యను బ్యాంక్ ఉన్నతాధికారులు రిజర్వ్ బ్యాంక్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు సమాచారం. డబ్బు రీసైకిల్ కాని కారణంగా బ్యాంకర్లు ఇతర ప్రాంతాల్లోని బ్యాంక్‌ల నుంచి ఓడీ తీసుకుంటున్నారు. ప్రొద్దుటూరులో ఆ ఓడీ కూడా దొరకడం లేదని బ్యాంకర్లు వాపోతున్నారు. వ్యాపారాలు లేకపోవడం, పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఈ విధంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దాంతోపాటు మానవుని జీవన వ్యయం పెరగడం, పొదుపు తగ్గడం మరో కారణంగా చెప్పవచ్చు. ఇటీవల ప్రొద్దుటూరులో జరిగిన బంగారు వ్యాపారుల సమ్మె ప్రభావం అటు వారితోపాటు వస్త్ర వ్యాపారులపై కూడా తీవ్రంగా పడిందని ప్రముఖ వ్యాపారి బుశెట్టి రాంమోహన్‌రావు తెలిపారు. రీసైకిల్ కాకుండా డబ్బు ఎలా వెళ్లిందన్న విషయం చెప్పలేమని ఓ బ్యాంక్ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఆర్థిక సంక్షోభం వాస్తవమే ... డబ్బు రీసైకిల్ లేని కారణంగా ఆర్థిక సంక్షోభం ఉందని పలువురు బ్యాంకర్లు చెప్పిన విషయం నా దృష్టికి వచ్చింది. అయితే ఖాతాదారులకు ఇబ్బంది లేకుండా ఎలాగోలా కొంత కొంత డబ్బు సర్దుబాటు చేస్తున్నారు. - రఘునాథరెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ -
పింఛను కోసం వెళ్లి వృద్ధురాలి మృతి
ప్రొద్దుటూరు టౌన్ (వైఎస్సార్ జిల్లా) : ‘పింఛన్ తీసుకుని వస్తానమ్మా’ అని కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లిన ఓ వృద్ధురాలు వడదెబ్బకు ప్రాణాలు కోల్పోయింది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణం వెంకటేశ్వర్లుపేటలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని 39వ వార్డులో ఉన్న ప్రాథమిక పాఠశాల ఆవరణలో పింఛన్ పంపిణీ జరుగుతోంది. ఈ వార్డులో 250 మందికిపైగా పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. గుడిమి లక్ష్మమ్మ (65) అనే వృద్ధురాలు ఉదయం 9 గంటలకు పింఛన్ కేంద్రం వద్దకు వెళ్లి చాలా సేపు ఎండలో నిల్చుంది. 10.30 గంటలకు పింఛన్ తీసుకుని, కుమారుడు శివ ఇంటికి వెళుతూ దారిలో కుప్పకూలింది. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందింది. -
చిన్నారులతో హీరో హరీష్
ప్రొద్దుటూరు: పాతతరం సినిమా హీరో హరీష్ (ప్రేమఖైదీ) వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని వికాస్ విహార్ మానసిక వికలాంగుల పాఠశాలలో బుధవారం ప్రత్యక్షమయ్యారు. సంస్కృతి స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలోని కుట్టుశిక్షణా కేంద్రానికి వచ్చిన ఆయన పక్కనే ఉన్న వికాస్ విహార్ మానసిక వికలాంగుల పాఠశాలను సందర్శించారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న చిన్నారులతో కొద్దిసేపు గడిపి వారిని సంతోషపరిచారు. ఈ కార్యక్రమంలో సంస్కృతి స్వచ్చంద సంస్థ కార్యదర్శి శ్రీనివాసులురెడ్డి, ప్రజాచైతన్య సమాఖ్య అధ్యక్షుడు లక్ష్మీనర్సయ్య తదితరులు పాల్గొన్నారు. -
వెయ్యి బస్తాల శెనగలు స్వాధీనం
ప్రొద్దుటూరు (వైఎస్సార్ జిల్లా) : వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో విజిలెన్స్ అధికారులు వెయ్యి బస్తాల శెనగలు, పప్పులను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని సాయిశివ ఫ్రైడ్‌గ్రామ్ ఇండస్ట్రీస్‌పై శుక్రవారం మధ్యాహ్నం విజిలెన్స్ డీఎస్పీ ఫకృద్దీన్ ఆధ్వర్యంలో అధికారులు సోదాలు జరిపారు. ఈ దాడుల్లో సంస్థలో అనధికారికంగా నిల్వ ఉంచిన రూ.37 లక్షలకు పైగా విలువైన శెనగలను సీజ్ చేశారు. కాగా సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. -
వేరుశెనగ వ్యాపారి ఆత్మహత్య
ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఓ వ్యాపారి బలవన్మరణం చెందాడు. పట్టణానికి చెందిన కట్టమీది రామకృష్ణారెడ్డి(53) స్థానికంగా వేరుశెనగ వ్యాపారం చేస్తుంటాడు. గురువారం వేకువజామున ఎర్రగుంట్ల బైపాస్‌రోడ్డులోని పాలకేంద్రం ఆవరణలో చెట్టుకు ఉరి వేసుకున్నాడు. అతనికి అప్పుల బాధ కూడా లేదని, ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డాడో తెలియటం లేదని కుటుంబసభ్యులు అంటున్నారు. రామకృష్ణారెడ్డికి భార్య, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రొద్దుటూరులో నీటి కోసం ఆందోళన
ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లాలో తాగునీటి కోసం మహిళలు ఆందోళనకు దిగారు. ఈ ఘటన జిల్లాలోని జిల్లాలోని ప్రొద్దుటూరు మండలంలో గురువారం చోటు చేసుకుంది. తాగునీటి కష్టాలపై అధికారులకు స్థానిక మహిళలు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో ఆగ్రహం చెందిన స్థానికులు రాస్తారోకో నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో అధికారులు స్పందించి త్వరలో సమస్య పరిష్కారిస్తామని హామి ఇచ్చారు. ఆందోళన కారణంగా పట్టణంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. -
రిసార్ట్‌పై దాడి.. 15 మంది అరెస్ట్
ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని రాయల్‌కౌంటీ రిసార్ట్‌పై పోలీసులు సోమవారం సాయంత్రం దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న టీడీపీ నాయకుడితో సహా మరో 15 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1.06 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో మార్కెట్‌యార్డ్ మాజీ చైర్మన్, టీడీపీ నాయకుడు బండి భాస్కర్‌రెడ్డి కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. -
ప్రొద్దుటూరులో రాయలసీమ ప్రముఖుల సదస్సు
ప్రొద్దుటూరు(వైఎస్సార్ జిల్లా): వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని రాయల్‌కౌంటీ రిసార్ట్స్‌లో రాయలసీమ ప్రముఖుల సదస్సు జరిగింది. గురువారం జరిగిన ఈ సదస్సులో బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ అధికార ప్రతినిధి తెల్లపల్లి నర్సింహారెడ్డి, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు కపిలేశ్వరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయలసీమ సమస్యలపై చర్చించారు. సెప్టెంబర్‌లో ప్రధాని మోదీని రాయలసీమలో పర్యటించాలని కోరనున్నట్లు నర్సింహారెడ్డి తెలిపారు. రాయలసీమ కరవు కాటకాల గురించి కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. -
విధుల నుంచి తప్పించారని విషం తాగింది..
ప్రొద్దుటూరు(వైఎస్సార్ జిల్లా): విధుల నుంచి తప్పించారని మనస్తాపం చెందిన ఒక నర్సు విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన గురవారం వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలం కేంద్రంలో జరిగింది. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన మాణిక్యమ్మ(32) ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రిలోని లేబర్ వార్డులో నర్సుగా పని చేస్తుంది. కాగా, ప్రజల వద్ద నుంచి లంచం తీసుకుంటుందని ఆరోపణలు రావడంతో డీసీహెచ్ఎస్ రామేశ్వరుడు గత నెల 29న విధుల నుంచి తప్పించారు. విధుల నుంచి తప్పించడంతో మనస్తాపం చెందిన ఆమె గురువారం విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను వెంటనే ప్రొద్దుటూరులోని ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించారు. ప్రస్తుతానికి ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. కాగా, ఎమ్మెల్యే రాచమళ్లు శివప్రసాద్‌రెడ్డి మాణిక్యమ్మను పరామర్శించారు. అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని ఆమెకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. -
ఇద్దరు క్రికెట్ బుకీలు అరెస్ట్
వైఎస్సార్ జిల్లా (ప్రొద్దుటూరు) : వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండల కేంద్రంలో ఇద్దరు క్రికెట్ బుకీలను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. మండల కేంద్రంలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండులో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.5.30 లక్షలు, ఓ ఇండికా కారు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరు ప్రొద్దుటూరుకు చెందిన యేలి నాగరాజు కాగా, మరొకరు ప్రొద్దుటూరు రూరల్ మండలానికి చెందిన కోటగిరి గ్రామస్తుడు సింగనమల రమేష్‌గా పోలీసులు తెలిపారు. -
అమ్మవారి సాక్షిగా హత్య
ప్రొద్దుటూరు : పవిత్ర దేవాలయంలో సాక్షాత్తూ అమ్మవారి సాక్షిగా ఒక మహిళను దారుణంగా రాయితో బాది హత్య చేసిన ఘటన వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ప్రొద్దుటూరుకు చెందిన ఈశ్వరమ్మ అనే మహిళ పెన్నానది ఒడ్డున ఉన్న చౌడేశ్వరీదేవి ఆలయానికి పూజల నిమిత్తం వస్తూ ఉండేది. ఈ నేపథ్యంలో సోమవారం గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను అమ్మవారి పాదాల చెంత బండరాయితో బాది హత్య చేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ హత్య వెనుక ఆలయ వాచ్మెన్ నర్సింహులు హస్తముందేమోనన్న అనుమానంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
వృద్ధురాలిపై దాడి... బంగారం దోపిడీ
ప్రొద్దుటూరు : బీరువాలు తయారు చేసే వ్యక్తిలా ఇంట్లోకి ప్రవేశించిన ఓ దుండగుడు వృద్ధురాలిపై దాడి చేసి రెండు బంగారు చైన్లను లాక్కుని పరారయ్యాడు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో శుక్రవారం ఉదయం జరిగింది. స్థానికంగా వసంతగడ్డలో సరోజమ్మ(75) ఇంటికి శుక్రవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి వచ్చాడు. తాను బీరువాలు తయారు చేస్తానని, రిపేర్ ఉందా అంటూ సరోజమ్మను ప్రశ్నించాడు. అవసరం లేదని చెప్పేలోపలే దుండగుడు ఆమె తలపై బలంగా కొట్టాడు. వెంటనే ఆమె మెడలో ఉన్న రెండు బంగారు గొలుసులు లాక్కుని పరారయ్యాడు. గాయపడ్డ సరోజమ్మ కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకుని ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
అంబేద్కర్ చిత్రపటాన్నిపునరుద్ధరించాలని ధర్నా
కడప : రాజ్యంగ రూపశిల్పి డాక్టర్ బీఆర్.అంబేద్కర్ చిత్రపటాన్ని తొలగించి ఆయనను అవమానపరిచారని దళిత విద్యార్థి సంఘాలు మున్సిపల్ కార్యాలయం ఎదుట సోమవారం ఉదయం ధర్నా నిర్వహించాయి. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులోని మున్సిపల్ కార్యలయంలోని కమిషనర్ చాంబర్లో ఉన్న అంబేద్కర్ చిత్రపటాన్ని రెండురోజుల కిందట తొలగించారు. దాన్ని తిరిగి పునరుద్ధరించేంత వరకు తమ నిరసన కొనసాగుతుందని సంఘం నాయకులు తెలిపారు. (ప్రొద్దుటూరు) -
బాలకృష్ణ 'లెజెండ్' విజయోత్సవంలో ప్రమాదం
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ పాల్గొంటున్న లెజెండ్ చిత్రం విజయోత్సవ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. కడప జిల్లాలో ప్రొద్దుటూరులో ఆదివారం పోలీసు ఎస్కార్ట్ వాహనం అభిమానులను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, మరో ఇద్దరు అభిమానులు తీవ్రంగా గాయపడ్డారు. బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమా ప్రొద్దుటూరులో విజయవంతంగా ఆడుతోంది. ఈ సినిమా విజయోత్సవ కార్యక్రమానికి బాలకృష్ణ వస్తారని ప్రచారం జరగడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బందోబస్తు కోసం వచ్చిన పోలీసుల వాహనం అభిమానులను ఢీకొంది. -
కడపలో ముగ్గురు అనుమానాస్పద మృతి
-
జ్యువెలరీ షాపులో ముగ్గురు అనుమానాస్పద మృతి
ప్రొద్దుటూరు : వైఎస్ఆర్ జిల్లాలో ఓ నగల దుకాణంలో ముగ్గురు సిబ్బంది అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ప్రొద్దుటూరులోని తళ్లెం నగల దుకాణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం ఉదయం షాపు తెరచిన సిబ్బంది ముగ్గురు మృతి చెందటాన్ని గమనించారు. వారు పొగ వల్ల ఊపిరి ఆడక చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే ఈ సంఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యాజమాన్యం కూడా దీనిపై పెదవి విప్పటం లేదు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. చోరీకి యత్నం జరిగిందా? లేక మరేదైనా కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రొద్దుటూరులో వైఎస్సార్సీపీ నేత దారుణహత్య
ప్రొద్దుటూరు: వైఎస్సార్సీపీ నాయకుడు, వైఎస్సార్ జిల్లా మడూరు గ్రామ మాజీ సర్పంచ్ మర్రిబోయిన ఓబులేసు(53)ను గుర్తుతెలియని దుండగులు శుక్రవారం రాత్రి దారుణంగా హత్య చేశారు. ప్రొద్దుటూరు పట్టణానికి వచ్చి ఇం టికి వెళ్లే సమయంలో మార్గమధ్యలో కాపుకాసిన నలుగురు వ్యక్తులు కళ్లల్లో కారం చల్లి ఓబులేసును గొంతుకోసి హతమార్చినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. ఈయనకు భార్య ఈశ్వరమ్మ, ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. -
'వైఎస్ఆర్ సీపీకి 135 నుంచి 140 స్థానాలు'
ప్రొద్దుటూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి గురువారం ప్రొద్దుటూరులో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీమాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అధికారం చేపడుతుందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 135 నుంచి 140 స్థానాలు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతితో పాటు వైఎస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు, బద్వేల్, కడప నియోజకవర్గాల్లో ప్రచారం కొనసాగనుంది. 1వ తేదీన ప్రొద్దుటూరు, 2వ తేదీ బద్వేల్, 3వ తేదీ కడప నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఓ వైపు బుజ్జగింపులు.. మరో వైపు నిరసనలు
-
'టీడీపీ పార్టీ భూస్థాపితం అయిపోతుంది'
-
బోనులో ఉన్నా సింహం సింహమే
-
బోనులో ఉన్నా సింహం సింహమే
బోనులా ఉన్నా సింహం సింహమేనని, జగనన్నను కూడా ఎవరూ ఆపలేరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల అన్నారు. త్వరలోనే గజనన్న వచ్చి అందరికీ సాంత్వన పలుకుతారని ఆమె తెలిపారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో శుక్రవారం రాత్రి అశేష సంఖ్యలో హాజరైన జనసందోహం నడుమ ఆమె ఆవేశంగా ప్రసంగించారు. ఎన్నో పథకాలను వైఎస్ అద్భుతంగా అమలుచేసి చూపించారని, ఇంటింటికీ తలుపు తట్టి సంక్షేమ పథకాలను వైఎస్ఆర్ అందించారని చెప్పారు. ప్రజల మీద ఏ పన్నూ వేయకుండా అభివృద్ధి పథకాలను అమలు చేసిన ఘనత రాజశేఖరరెడ్డిదేనని గుర్తు చేశారు. అన్మదమ్ముల మధ్య కాంగ్రెస్ విభజన చిచ్చుపెట్టిందని, విభజనతో సీమాంధ్ర ప్రాంతం మొత్తం ఎడారి అవుతుందని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు ప్రకటించగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కసారిగా రాజీనామా చేశారని, అదే తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రతినిధులు మాత్రం మీనమేషాలు లెక్కిస్తూ కూర్చున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కిరణ్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలయ్యిందని, ఈయన పదే పదే ఢిల్లీ వెళ్లి రావడం తప్ప రాష్ట్రానికి ఒరగబెట్టింది కూడా ఏమీ లేదని తీవ్రంగా విమర్శించారు. ఆయనకు తెలుస్తూనే కాంగ్రెస్ అధిష్ఠానం రాష్ట్రాన్ని చీల్చిందని.. అలాంటి ఈ ముఖ్యమంత్రి పనికొచ్చేవాడో, పనికిరానివాడో ప్రజలే తేల్చాలని అన్నారు. హైదరాబాద్ నిర్మాణానికి 60 ఏళ్లు పట్టినప్పుడు పదేళ్లలోనే సీమాంధ్రకు రాజధాని నిర్మాణం ఎలా సాధ్యమని ఆమె ప్రశ్నించారు. జై సమైక్యాంధ్ర అంటూ ఆమె చేసిన నినాదాలతో వేలాది మంది గొంతు కలిపారు. ఏ ఒక్క ప్రాంతానికీ అన్యాయం జరగకుండా ఓ తండ్రిలా ఆలోచన చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పదేపదే కోరినా.. ఇది ప్రజాస్వామ్య దేశమని కూడా చూడకుండా ఈ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిందని షర్మిల మండిపడ్డారు. న్యాయం చేయగల సత్తా లేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. జగనన్న నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతులు కట్టుకు కూర్చోదని, జగనన్న నాయకత్వంలో ముందు నిలబడి పోరాటం చేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. నిర్బంధంలో ఉండి కూడా ఏడు రోజుల పాటు నిరాహార దీక్ష చేశారని, జనంలో ఉన్నా.. జైల్లో ఉన్నా జననేతేనని జగనన్న నిరూపించుకున్నారన్నారు. బయట ఉన్న ఈ కాంగ్రెస్, టీడీపీ నాయకులు దొంగలు, ద్రోహులని వాళ్లు కూడా నిరూపించుకున్నారన్నారు. -
స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతూ విద్యార్థి మృతి