'వైఎస్ఆర్ సీపీకి 135 నుంచి 140 స్థానాలు' | YS bharathi election compaigning in proddutur | Sakshi
Sakshi News home page

'వైఎస్ఆర్ సీపీకి 135 నుంచి 140 స్థానాలు'

Published Thu, May 1 2014 10:59 AM | Last Updated on Tue, Aug 14 2018 5:00 PM

'వైఎస్ఆర్ సీపీకి 135 నుంచి 140 స్థానాలు' - Sakshi

'వైఎస్ఆర్ సీపీకి 135 నుంచి 140 స్థానాలు'

ప్రొద్దుటూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి గురువారం ప్రొద్దుటూరులో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీమాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అధికారం చేపడుతుందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 135 నుంచి 140 స్థానాలు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతితో పాటు వైఎస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు, బద్వేల్, కడప నియోజకవర్గాల్లో ప్రచారం కొనసాగనుంది. 1వ తేదీన ప్రొద్దుటూరు, 2వ తేదీ బద్వేల్, 3వ తేదీ కడప నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement