సాక్షి ప్రతినిధి, విజయనగరం : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సరళి వైఎస్‌ఆర్ సీపీ హవాను స్పష్టంగా తెలియజేస్తోంది. ఎన్నికలు జరిగిన తొమ్మిది అసెంబ్లీ, ఒక ఎంపీ నియోజవర్గా ల్లో ఫ్యాన్ గాలి హైస్పీడ్‌లో జంఝామారుతంలా వీచినట్టు స్పష్టమైన సంకేతాలు వెలువడడంతో ఆ పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగితేలుతున్నాయి. ఓటర్ల అభిప్రాయం, ఎన్నికల సరళి చూస్తే జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీ విజయ బావుటా ఎగురవేయడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర విభజన నే పథ్యంలో ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆశలు వదులుకోగా, టీడీపీ వాపును చూసి బలంగా భ్రమపడింది.
అయితే ఆ కలలు ఈ పోలింగ్‌తో కరిగిపోయాయి. పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలివచ్చిన వృద్ధులు, మహిళలు, యువకులు ఫ్యాన్‌కే ఓటు వేశామని పలుచోట్ల చెప్పడం కనిపిం చింది. ముఖ్యంగా ఏజెన్సీ మండలాల్లో గిరిజనులు పోటీపడి మరీ ఓట్లు వేశారు. దీంతో జిల్లాలో ఫ్యాన్ ప్రభంజనం సృష్టించనుందన్న అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎక్కడా చూసినా అదే చర్చ జరిగింది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ స్పష్టమైన ఆధిక్యం సాధించే అవకాశం కనిపిస్తోంది. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ఆదుకున్న వైఎస్సార్ కుటుంబానికి అండగా ఉండాలనే కృతనిశ్చయంతో అన్ని వర్గాలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఓటేశాయి.
అంతటితో ఆగకుండా ఎవరికి వేశామన్న దానిపై సంకేతాలు ఇచ్చాయి. దీంతో వైఎస్సార్‌సీపీ గాలి ఉద్ధృతంగా వీచినట్టు స్పష్టమయింది. జిల్లా ఓటర్లు ఎంతో ఉత్సాహంతో ఓటు వేశారు. మధ్యాహ్నం వరకు మండే ఎండలు ఇబ్బంది పెట్టినా ఒంటి గంట తర్వాత వాతావరణం చల్లబడటంతో పెద్ద ఎత్తున బారులు తీరారు. తమ అభిమాన నేత కోసం గంటల తరబడి క్యూలో నిలబడి ఓటేశారు. మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీ సంక్షేమ పథకాలను పొందిన వారంతా ఓటేసేందుకు ఆత్రుత కనబరిచారు. జిల్లా వ్యాప్తంగా సెలైంట్ ఓటింగ్ పడింది. ఇప్పుడా ఓట్లు ఎవరికిపడ్డాయన్న దానిపై పార్టీల్లో చర్చప్రారంభమైంది. కానీ, సెలైంట్ ఓటిం గ్ జరిగిందంటే అదొక కొత్త పార్టీకి పడే ఓటనే వాదన వినిపించింది. దాదాపు అన్ని వర్గాల్లో ఇదే అభిప్రాయం వ్యక్తమయింది.
ఆ రెండు పార్టీలకు క్రాస్ ఓటింగ్ గుబులు
కాంగ్రెస్, టీడీపీలకు క్రాస్ ఓటింగ్ గుబులు పట్టుకుంది. ఒక ఓటు అటు, ఒక ఓటు ఇటు అన్న నినాదంతో చాలా మంది ఓట్లు వేసినట్టు తెలిసింది. ముఖ్యంగా ఆ రెండు పార్టీల నుంచి వైఎస్సార్‌సీపీకి క్రాస్ ఓటింగ్ పడినట్టు తెలిసింది. దీంతో టీడీపీ, కాంగ్రెస్ నాయకులు డిఫెన్స్‌లో పడ్డారు. విజయనగ రం, చీపురుపల్లి, నెల్లిమర్ల, గజపతినగరం, సాలూ రు, కురుపాం నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ ఎక్కువగా జరిగినట్టు తెలుస్తోంది. విద్యావంతులైన ఓటర్లతో పాటు సామాన్య జనం కూడా ఈసారి క్రాస్ ఓటింగ్ చేసేందుకు ఆసక్తి చూపించారు.
ఆనందోత్సాహాల్లో వైఎస్సార్ సీపీ శ్రేణులు
పోలింగ్ సరళికి తమకు అనుకూలంగా ఉందని, ఎంపీ స్థానంతో సహా అన్ని అసెంబ్లీ స్థానాలను భారీ మెజార్టీతో గెలుస్తామని వైఎస్సార్‌సీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. వన్‌సైడ్‌గా పోలింగ్ జరిగిందని, ఏకపక్షంగా ఫలితాలొస్తాయని, సెలైం ట్ ఓటింగ్ తమకు బాగా కలిసివస్తుందన్న ఆశాభా వం వ్యక్తం చేస్తున్నాయి.
ఫ్యాన్ ప్రభంజనం
Published Thu, May 8 2014 2:13 PM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM
Advertisement