చంద్రబాబు, టీడీపీ ఎంపీల ఒత్తిడితోనే రీపోలింగ్
హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, టీడీపీ ఎంపీల ఒత్తిడితోనే అవసరం లేని చోట కూడా రీపోలింగ్ నిర్వహిస్తున్నారని వైఎస్సార్ సీపీ నేత పీఎన్వీ ప్రసాద్ స్పష్టం చేశారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో మూడు చోట్ల అసలు పోలింగ్ అవసరమే లేదని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఈసీని కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జమ్మలమడుగు 80, 81,82 పోలింగ్ బూత్ ల పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు తెలిపారు. పోలింగ్ తీరుపై ఏజెంట్లు ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదన్న సంగతిని గుర్తు చేశారు.
చంద్రబాబు, టీడీపీ ఒత్తిడితోనే రీపోలింగ్ జరుపుతున్నట్లు తెలిపారు. కనీసం రిటర్నింగ్ అధికారి కూడా రీపోలింగ్ కు సిఫార్సు చేయలేదన్నారు. చంద్రబాబు తీరు చెడు ఆనవాయితీకి దారి తీస్తుందన్నారు. జమ్మలమడుగులో రీపోలింగ్ నిర్ణయాన్ని సమీక్షించాలని ఈసీని కోరినట్లు ప్రసాద్ తెలిపారు.