
'నైతికంగా వైఎస్‌ఆర్‌సీపీ గెలిచింది'
వైఎస్‌ఆర్ కడప: ప్రొద్దుటూరులో వైఎస్‌ఆర్‌సీపీ నైతికంగా విజయం సాధించిందని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. ప్రజల్లో టీడీపీ మరింత చులకనైందని చెప్పారు. చైర్మన్ ఎన్నికను వాయిదా వేసేందుకు టీడీపీ కుటిలయత్నం చేసిందని ఆరోపించారు. భవిష్యత్తులో ఇలాంటి దురదృష్టకర ఘటనలు జరగకుండా కోర్టులు జోక్యం చేసుకోవాలని కోరారు.