నిందితుడు రఫితో సీఐ వెంకటశివారెడ్డి, ఎస్‌ఐ ఎంఏ ఖాన్
ప్రొద్దుటూరు క్రైం : డబ్బు ఇవ్వకుంటే విజిలెన్స్ అధికారులకు చెప్పి దాడులు చేయిస్తానని బెదిరించిన సంఘటనలో ప్రొద్దుటూరులోని అమృతానగర్‌కు చెందిన షేక్ మహ్మద్‌రఫి అనే ఒక పత్రికా (సాక్షి కాదు) విలేకరిని వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వన్‌టౌన్ సీఐ వెంకటశివారెడ్డి గురువారం సాయంత్రం స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. రఫి ఒక పత్రికా విలేకరిగానేగాక ఏపీ జర్నలిస్టు సంఘం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. అతను ఈ నెల 24న వసంతపేటకు చెందిన దొంతు ఓబులేసు కుమార్ అనే కిరాణా వ్యాపారి ఇంటికి వెళ్లాడు.
తాను ఏపీ జర్నలిస్టు సంఘం అధ్యక్షుడినని చెప్పి రూ.3 వేలు ఇవ్వాలని డిమాండు చేసి రూ. 500 తీసుకున్నాడు. మిగతా డబ్బు రేపటిలోగా ఇవ్వకుంటే విజిలెన్స్ అధికారులకు ఫోన్ చేసి దాడులు చేయిస్తానని బెదిరించాడు. మిగిలిన డబ్బు ఇవ్వకపోవడంతో పలు మార్లు ఓబులేసుకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో దుకాణయజమాని వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రఫిపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు వన్‌టౌన్ ఎస్‌ఐ ఎంఏ ఖాన్ అతన్ని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు. బెదిరింపులకు ఉపయోగించిన సెల్‌ఫోన్‌ను కూడా అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నామని సీఐ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment