reporter
-
Mahakumbh 2025: కుంభమేళా కవర్ చేస్తున్న రిపోర్టర్.. ఇంతలో ఊహించని విధంగా
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో కుంభమేళాకు సంబంధించిన ఏదో ఒక వార్త ప్రతిరోజూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా అటువంటి వీడియో ఒకటి నెటిజన్లను తెగ అలరిస్తోంది.ఒక మీడియా సంస్థకు చెందిన రిపోర్టర్ అత్యంత ఉత్సాహంగా కుంభమేళాపై వీడియో కవర్ చేస్తున్నాడు. అక్కడికి వచ్చినవారిని పలు వివరాలు అడిగి తెలుసుకుంటున్నాడు. ఆ రిపోర్టర్ ఒక వ్యక్తిని కుంభమేళా అనుభవాల గురించి అడుగుతుండగా, ఆ పక్కనే ఉన్న ఒక యువకుడు తాను మాట్లాడుతానని అడగడాన్ని వీడియోలో మనం గమనించవచ్చు. దీనికి సమాధానంగా ఆ రిపోర్టర్ కొంచెం దూరంగా ఉండు.. తరువాత నువ్వు మాటాడవచ్చు అని చెబుతాడు. కొద్దిసేపు అలానే నిలబడిన ఆ యువకుడు ఒక్కసారిగా ముందుకువచ్చి, ఆ రిపోర్టర్ నుంచి మైక్ తీసుకుని పారిపోవడాన్ని మనం వీడియోలో చూడవచ్చు. ఇది జరిగిన వెంటనే ఆ రిపోర్టర్‌తో పాటు అక్కడున్నవారంతా ఆ యువకుడిని వెంబడిస్తారు. महाकुंभ मे माहौल पूरी तरह हंसी मजाक का बना रखा है लोगो ने.... अब रिपोर्टर साहब का माइक लेकर लड़का फरार 😅😃 pic.twitter.com/03ndTJvlxa— Ganesh Bhamu (@GaneshBhamu87) January 27, 2025ఈ వీడియో @GaneshBhamu87 అనే ఖాతా నుంచి ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకూ ఒక లక్షా 71 వేలకు పైగా నెటిజన్లు వీక్షించారు. ఈ వీడియోను చూసిన కొందరు యూజర్స్ ఇది రిపోర్టర్ ఆడిన గేమ్ అని వ్యాఖ్యానిస్తుండగా, మరికొందరు ఇలాంటి ఘటనలు కుంభమేళాను రంగులమయం చేస్తాయని వ్యాఖ్యానిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఒక్క రోజులో 1.5 కోట్ల మంది పుణ్యస్నానాలు -
రిపోర్టర్ కి బొత్స దిమ్మతిరిగే కౌంటర్
-
TV5 రిపోర్టర్ కి బొత్స అదిరిపోయే కౌంటర్
-
ఆంధ్రజ్యోతి రిపోర్టర్ పై రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే
-
పుతిన్‌పై ప్రశ్న.. రిపోర్టర్‌పై బైడెన్ ఆగ్రహం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా ఓ మీడియా ప్రతినిధిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం(సెప్టెంబర్13) వైట్‌హౌస్‌లో బైడెన్, బ్రిటన్ పీఎం కీర్ స్టార్మర్ ముఖ్యమైన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సంబంధించి బ్రీఫింగ్ ఇస్తుండగా స్కై న్యూస్ మీడియా ప్రతినిధి ఒకరు బైడెన్‌ను ప్రశ్నించారు.రష్యాపై ఉక్రెయిన్ లాంగ్ రేంజ్ క్షిపణులను ప్రయోగించే విషయంలో పశ్చిమ దేశాలకు పుతిన్ వార్నింగ్ ఇవ్వడాన్ని రిపోర్టర్ ప్రస్తావించారు. దీనికి బైడెన్ స్పందిస్తూ నేను మాట్లాడే వరకు మీరు నిశ్శబ్దంగా ఉంటే మంచిది.ముందు నన్నుపూర్తిగా చెప్పనివ్వండని రిపోర్టర్‌పై మండిపడ్డారు. అనంతరం సమావేశం ముగిసిన తర్వాత రిపోర్టర్ బైడెన్‌ను తిరిగి ప్రశ్నించారు.తాను పుతిన్ గురించి అసలు ఆలోచించనని,ఉక్రెయిన్‌తో యుద్ధంలో పుతిన్ గెలిచే ఛాన్సే లేదని బైడెన్ సమానధానమిచ్చారు.ఉక్రెయిన్‌కు సాయం చేసేందుకు అమెరికా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ లాంగ్ రేంజ్ క్షిపణుల వినియోగించడంపై అమెరికాకు కొత్త విధానమేమీ లేదని చెప్పారు. 2022 ఫిబ్రవరిలో మొదలైన రష్యా,ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోంది. -
సాక్షి రిపోర్టర్ పై..గుడ్లవల్లేరు కాలేజీ యాజమాన్యం దాడి
-
ABN రిపోర్టర్ కి గుడివాడ అదిరిపోయే కౌంటర్
-
అనపర్తిలో ‘పచ్చమూక’ అరాచకం.. ‘సాక్షి’కి బెదిరింపులు
సాక్షి, తూర్పుగోదావరి: రాష్ట్రంలో టీడీపీ నేతలు అరాచకాలు ఆగడం లేదు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పందలపాకలో వైఎస్సార్సీపీ నాయకులకు చెందిన రెండు షెడ్లను కూల్చేశారు. అదే ప్రాంతంలో ఇంకా షెడ్లు, పక్కా భవనాలు ఉన్నప్పటికీ పచ్చబ్యాచ్.. వాటి జోలికి పోలేదు. కవరేజ్‌కు వెళ్లిన సాక్షి టీవీ విలేకరిపై టీడీపీ గూండాలు బెదిరింపులకు దిగారు. పోలీసులు చోద్యంగురజాలలో రాళ్ల దాడి..పల్నాడు జిల్లా గురజాలలో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. గోగులపాడులో గ్రామం విడిచి ఎందుకు వెళ్లలేదంటూ వైఎస్సార్సీపీ కార్యకర్తపై టీడీపీ నాయకులు రాళ్లతో దాడి చేశారు. టీడీపీ నాయకుల దాడిలో వెంకట చలమయ్య తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.విశాఖలో వైఎస్సార్ ఫ్లెక్సీ చించివేతవిశాఖలో రోజురోజుకు టీడీపీ నేతల దౌర్జన్యాలు పెరుగుపోతున్నాయి. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జన్మదిన సందర్భంగా 43వ వార్డులో కార్పొరేటర్ ఉషశ్రీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని టీడీపీ నేతలు చించివేశారు. ఫ్లెక్సీని చించవద్దంటూ స్థానికులు చెబుతున్న కానీ టీడీపీ నేతలు పట్టించుకోలేదు. పార్టీలకతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అందించిన వైఎస్సార్ ఫ్లెక్సీని ధ్వంసం చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
‘సాక్షి’ విలేకరిపై జనసేన ఎమ్మెల్యే దాడి
రాంబిల్లి (అనకాపల్లి జిల్లా): అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండల సాక్షి విలేకరి, యలమంచిలి ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు బుదిరెడ్డి అప్పారావుపై జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ దాడికి పాల్పడ్డారు. శనివారం దిమిలి గ్రామంలో తన నివాసంలో అప్పారావు తనపై దాడి ఘటనను మీడియాకు వివరించారు. ‘ఈ నెల 3వ తేదీ బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ నా మొబైల్‌కు ఫోన్ చేశారు. నేను లిఫ్ట్ చేయకపోవడంతో తర్వాత ఆయన పీఏ చంద్రారావుతో ఫోన్ చేయించారు.అయినప్పటికీ నేను ఫోన్ తీయలేదు. మళ్లీ 20 నిమిషాల తర్వాత ఎమ్మెల్యే ఫోన్ చేసి మీతో మాట్లాడాలని, అచ్యుతాపురంలోని ఎస్టీబీఎల్ లేఅవుట్లో ఉన్న తన స్వగృహానికి రావాలని చెప్పారు. దానికి నేను రానని చెప్పాను. అయితే వెంటనే పంపించేస్తానని.. రాంబిల్లి మండలం కొత్తూరు వరకు కారు పంపిస్తానని ఎమ్మెల్యే చెప్పారు. అయినప్పటికీ నేను రానంటే రావాలని ఒత్తిడి తెచ్చారు. తప్పనిసరి పరిస్థితిల్లో నా స్వగ్రామం దిమిలి నుంచి బైక్‌పై కొత్తూరుకు వెళ్లాను. అప్పటికే అక్కడ బ్లాక్ స్కార్పియోతో ఎమ్మెల్యే డ్రైవర్ జగదీష్ ఉన్నాడు. నన్ను కారు ఎక్కించుకుని ఎస్టీబీఎల్‌లో అచ్యుతాపురం సీఐ బుచ్చిరాజు ఇంటి ముందు దించారు. అక్కడ 40 నిమిషాలు ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ కోసం ఎదురుచూశాను. అప్పటికి కూడా ఎమ్మెల్యే నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో నేను వెళ్లిపోతానని ఎమ్మెల్యే పీఏకు ఫోన్ చేసి చెప్పాను. దానికి పీఏ తన రూమ్ పక్కనే ఉందని, అక్కడకు రమ్మని చెప్పారు. నేను అక్కడికి వెళ్లగా గదిలో ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ ఉన్నారు. తాను లోపలకు వెళ్లగానే రూమ్ డోర్ మూసేశారు’ అని అప్పారావు వివరించారు.చంపేస్తానని హెచ్చరించారు..‘నన్ను గదిలో బంధించి ‘యథేచ్ఛగా తరలిస్తున్న అక్రమ మట్టి తవ్వకాలు’ పేరిట సాక్షిలో ఎందుకు వార్త రాశావు? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. అలాగే ఎన్నికలకు ముందు సాక్షిలో ప్రచురించిన కథనాలపై నిలదీశారు. తనకు టికెట్ రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ వచ్చాక ఎన్నికల్లో ఓడించడానికి కథనాలు రాశావంటూ మండిపడ్డారు. ఆ కథనాలు నేను రాయలేదని, విశాఖ ప్రధాన కార్యాలయం నుంచి సీనియర్లు రాశారని సమాధానమిచ్చినా ఆయన వినిపించుకోలేదు. వారం క్రితం ‘యథేచ్ఛగా మట్టి దందా’ పేరుతో ఎందుకు వార్త రాశావని బెదిరించారు. దానికి నేను సమాధానంగా అక్రమంగా మట్టి దందా చేస్తే ఖచ్చితంగా రాస్తానని.. ఇదే వార్త సాక్షితో పాటు ఈనాడులో కూడా వచ్చిందని చెప్పాను. దీంతో వెంటనే ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ నాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘నిన్ను చంపేస్తాను’ అని హెచ్చరించారు. నా తల్లిని తిట్టడంతోపాటు నీ సంగతి తేలుస్తానంటూ కోపంతో మెడ పట్టుకుని చంపేస్తా అని బెదిరించారు. ఆ క్షణంలో నాకు ప్రాణహాని ఉందని గ్రహించి అక్కడ నుంచి ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని బయటపడ్డాను. నాకు, నా కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించాలని విన్నవిస్తున్నా’ అని అప్పారావు తెలిపారు. -
ABN రిపోర్టర్ పై బొత్స పంచులే పంచులు
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై దుష్ప్రచారానికి నీతి ఆయోగ్ చెక్
సాక్షి, న్యూఢిల్లీ: పచ్చమీడియా విషప్రచారాన్ని అండగా చేసుకుని చెలరేగిపోయి, రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదారి పట్టించాలని చూసిన చంద్రబాబు నాయుడికి దిమ్మదిరిగే షాక్ నీతి ఆయోగ్ రూపంలో తగిలింది. ఎన్నికల ప్రచారంలో దూషణలు, పనికిమాలిన అబద్ధాలు చెప్పి ప్రజలను వంచించాలని చూసిన ఈ పచ్చపార్టీ అధినేతకు ఇది శరాఘాతమే.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఎల్లో మీడియాతో కలిసి చంద్రబాబు గణం చేసిన దుష్ప్రచారానికి నీతి ఆయోగ్ ఫుల్స్టాప్ పెట్టింది. ఈ చట్టానికి సంబంధించి కీలక సమాచారాన్ని వెల్లడించింది. ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో రైతుల భూములు లాక్కునే పరిస్థితి ఉండదని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. ఈ చట్టం వల్ల భూములన్నీ మరింత భద్రంగా ఉంటాయని... భూ పరిపాలన మరింత సులువవుతుందని పేర్కొంది. భూములపై రైతులకు సర్వహక్కులూ లభిస్తాయని... ఈ చట్టంతో పటిష్ఠమైన భూ యాజమాన్య నిర్వహణ సాధ్యమవుతుందని వెల్లడించింది.సమాచార హక్కు చట్టం కింద సాక్షి టీవీ డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ నాగిళ్ల వెంకటేష్ అడిగిన ప్రశ్నలకు నీతి ఆయోగ్‌లోని జల, భూవనరుల శాఖ ఈ విషయమై స్పష్టతను ఇచ్చింది. ఆ శాఖ అండర్ సెక్రటరీ రవీందర్ కౌర్ గురువారం ఒక లేఖ ద్వారా ఈ వివరాలను వెల్లడించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు సంబంధించిన ముసాయిదాను కేంద్ర భూవనరుల శాఖతో పాటు అన్ని రాష్ట్రాలకు ఇప్పటికే పంపించామని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. -
శ్రీలీలతో పోల్చినందుకు రిపోర్టర్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన అంజలి
-
సాక్షి విలేకరి ‘గురిజా’ మృతిపై వాస్తవాలు నిగ్గుతేల్చాలి
రణస్థలం: శ్రీకాకుళం జిల్లా లావేరు సాక్షి విలేకరి గురిజా దామోదరరావు మృతి బాధాకరమని ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ అన్నారు. రణస్థలంలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. తన పెదనాన్న గొర్లె శ్రీరాములునాయుడుకు, దామోదరరావు తండ్రి తవిటయ్యతో మంచి అనుబంధం ఉందని, దామోదర్ కుటుంబ సభ్యులతో తనకు ఎలాంటి విభేదాల్లేవని చెప్పారు. విపక్షాలు దీనిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించారు. వాస్తవాలు తెలీకుండా టీడీపీ నేతలు కళా వెంకటరావు, చంద్రబాబు స్పందించిన తీరు శవాలపై రాజకీయం చేసేలా ఉందని విమర్శించారు. దీనిపై పోలీసులు లోతైన విచారణ జరిపి నిజా నిజాలు నిగ్గు తేల్చాలని కోరారు. ఈ ఘటనపై ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశానని, దామోదర్ నాలుగు నెలలు ఎవరితో ఎక్కువ మాట్లాడారో కాల్స్ పరిశీలిస్తే వాస్తవాలు బయటపడతాయన్నారు. దామోదర్ కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఎచ్చెర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవి మాట్లాడుతూ కళా వెంకటరావు రాజకీయ లబ్ధి కోసమే దామోదర్ మృతిని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఎనిమిదేళ్ల కిందట కళా వెంకటరావు తన తమ్ముడినే చంపేశాడని కుటుంబ సభ్యులే కేసు పెట్టారని, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు వేధించారంటూ వంగర ఎస్ఐ, కళాతో పాటు ఆయన పీఏపైనా కేసు పెట్టారని గుర్తు చేశారు. టీడీపీ నేతలు వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు లావేటిపాలెం వైఎస్సార్సీపీ నేతలు, మృతుడి బంధువులైన లావేరు ఎంపీటీసీ ఇనపకుర్తి సతీష్, ఇనపకుర్తి చంద్రశేఖర్, సగరం విశ్వనాథం మాట్లాడుతూ దామోదర్ ఎనిమిది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలిపారు. టీడీపీ నేత జగ్గన్న దొరకు దామోదర్ రూ.10 లక్షలు అప్పు ఇచ్చాడని, ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో ఇబ్బంది పడుతున్నట్లు దామోదర్ చెప్పాడని పేర్కొన్నారు. వాస్తవాలకు విరుద్ధంగా ఎమ్మెల్యే కిరణ్‌కుమార్, లంకలపల్లి గోపిపై ఆరోపణలు చేస్తున్నారని, సూసైడ్ లెటర్ కూడా టీడీపీ వాళ్లు పెట్టించి ఉంటారని ఆరోపించారు. -
రిపోర్టర్ కు మంత్రి రోజా వార్నింగ్
-
ఎల్లో మీడియా రిపోర్టర్ కు లైవ్ లో కౌంటర్ ఇచ్చిన మంత్రి బొత్స
-
సాక్షి మీడియాపై నారా లోకేష్ అక్కసు
-
రెచ్చిపోయిన ‘ఈనాడు’ రిపోర్టర్
రాప్తాడు రూరల్: ఈనాడు పత్రికలో పని చేస్తున్న ఓ రిపోర్టర్ రెచ్చిపోయాడు. ప్రభుత్వ కార్యాలయ ఆవరణలో ఉన్న స్థలాన్ని కబ్జా చేసేందుకు పూనుకున్నాడు. అడ్డుకోబోయిన ఉద్యోగులను బెదిరించాడు. వివరాల్లోకి వెళ్తే... ఈనాడు పత్రికలో రిపోర్టర్‌గా పని చేసే చంద్రశేఖర్ ఆదివారం ఉదయం జేసీబీనీ వెంట పెట్టుకుని సమగ్ర శిక్ష కార్యాలయ ఆవరణలోకి దూసుకెళ్లాడు. ఆవరణలో ఉన్న కొన్ని చెట్లను తొలిగించి ఆ ప్రాంతాన్ని చదును చేయించాడు. సెలవు రోజు కావడంతో ఉద్యోగులెవరూ అక్కడ లేరు. విధుల్లో ఉన్న వాచ్‌మన్ శంకర్‌నాయక్ అడ్డుకునే ప్రయత్నం చేయగా దౌర్జన్యానికి పాల్పడ్డాడు. ఇదే విషయాన్ని సూపరింటెండెంట్ సునీల్‌కు వాచ్‌మెన చేరవేయడంతో వెంటనే ఆయనతో పాటు అసిస్టెంట్ సీఎంఓ గోపాలకృష్ణ, ఎంఈఓ గురుప్రసాద్ తదితరులు అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో వారితోనూ చంద్రశేఖర్ తీవ్ర స్థాయిలో వాదనకు దిగాడు. ‘ఏయ్...నేనంటే ఏమనుకున్నారు... నాపేరు చంద్రశేఖర్. 20 ఏళ్లుగా ఈనాడులో రిపోర్టర్‌గా పని చేస్తున్నా. మీరు ఇక్కడ ఈ రోజు ఉంటారు రేపు పోతారు. మీరు అనవసరంగా జోక్యం చేసుకోవద్దు’ అంటూ హెచ్చరించాడు. ఇది ప్రభుత్వ కార్యాలయమని ఏదైనా ఉంటే డీపీసీ, ఏసీపీతో మాట్లాడాలని సూపరింటెండెంట్ చెప్పినా వినకుండా ఎవరెవరికో ఫోన్లు చేసి గట్టిగా రెచ్చిపోయాడు. ఉద్యోగులు కూడా తీవ్రస్థాయిలో ప్రతిఘటించడంతో చివరకు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనిపై సూపరింటెండెంట్ సునీల్ ‘సాక్షి’తో మాట్లాడుతూ... ఈనాడు రిపోర్టర్ చంద్రశేఖర్ దౌర్జన్యంగా వచ్చి కార్యాలయ ఆవరణలోని చెట్లను తొలగించాడన్నారు. తాను అడ్డుకోబోతే బెదిరించాడన్నారు. ప్రభుత్వ కార్యాలయంలోని చెట్లను అక్రమంగా తొలిగించి స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించడంపై సోమవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. -
సాక్షి రిపోర్టర్ సురేష్ పై దాడి చేసిన టీడీపీ గూండాలు
-
దళిత ద్రోహి లోకేశ్‌ను అరెస్ట్ చేయాలి
తిరుపతి సిటీ: దళిత ద్రోహి నారా లోకేశ్‌ను వెంటనే అరెస్ట్ చేసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. ‘సాక్షి’ విలేకరి కరుణాకర్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ శనివారం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద అంబేడ్కర్ విగ్రహం ఎదుట దళిత సంఘాల నాయకులు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాగార్జున మాట్లాడుతూ వార్తల కవరేజ్ చేస్తున్న దళిత విలేకరిని అతి దారుణంగా లోకేశ్ గూండాలు తిట్టడం, కొట్టడం అమానుషమన్నారు. నాయకులు మల్లారపు మధు, నల్లారి బాబు, వెంకటస్వామి, యలమంచిలి ప్రవీణ్, తళారి రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
‘సాక్షి’ విలేకరులపై టీడీపీ గూండాల దాడి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: దళిత సామాజికవర్గానికి చెందిన సాక్షి విలేకరులు ఇద్దరిపై తెలుగుదేశం పార్టీ గుండాలు దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. లోకేశ్ పాదయాత్ర కవరేజికి వెళ్లిన ఓ విలేకరిపై బూతులు తిడుతూ భౌతికంగా దాడి చేసి, హింసించారు. పాదయాత్రంలో జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తున్న టీడీపీ కార్యకర్తలను చిత్రీకరించారన్న నెపంతో మరో మరో విలేకరిపై దాడికి పాల్పడ్డారు. లోకేశ్ పాదయాత్రపై వాస్తవాలను నిర్భయంగా రాస్తున్నారన్న అక్కసుతో లోకేశ్ ప్రైవేటు సైన్యం ఈ దాడులకు పాల్పడింది.లోకేశ్ పాదయాత్ర సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఒంగోలు నగరంలోని రవిప్రియ మాల్ వద్ద సెల్ఫీ కార్యక్రమం జరిగింది. కొందరు టీడీపీ కార్యకర్తలను సెల్ఫీకి అనుమతించకపోవడంతో అక్కడ గొడవ జరిగింది. ఈ సమయంలో పాదయాత్ర కవరేజికి వెళ్లిన సాక్షి విలేకరి, దళిత సామాజిక వర్గానికి చెందన కరుణాకర్ ఆ ఫొటోలు తీసేందుకు ప్రయత్నించారు. అది గమనించిన లోకేశ్ ప్రైవేటు సెక్యూరిటీ కరుణాకర్‌ను టెంట్‌లోకి లాక్కొని వెళ్లి డెయిరీ, సెల్‌ఫోన్, లాక్కొని తీవ్ర పదజాలంతో దుర్భాషలాడుతూ పిడుగుద్దులు గుద్దారు. ‘సాక్షి’ విలేకరులకు బాగా బలిసింది.. మీ సంగతి తేలుస్తామని దూషిస్తూ గంటసేపు టెంట్లో నిర్బంధించారు. సెల్‌ఫోన్ మొత్తం పరిశీలించి ఫొటోలు డిలీట్ చేశారు. మరోసారి పాదయాత్రలో ఫొటోలు తీసినా, వ్యతిరేక వార్తలు రాసినా సహించేది లేదని, పాదయాత్రలో కనిపిస్తే చంపుతామంటూ లొకేశ్ పర్సనల్ సిబ్బంది బెదిరించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే నీ సంగతి తేలుస్తామని బెదిరించి పంపేశారు. వెల్లంపల్లి దగ్గర జరిగిన లోకేశ్ పాదయాత్రలో సాక్షి విలేకరి మరొకరిపైనా టీడీపీ మూక దాడికి పాల్పడంది. పాదయాత్రలో జై జూనియర్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తున్న దళిత యువకులపై లోకేశ్ ప్రైవేటు సైన్యం దాడి చేసింది. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న నాగులుప్పలపాడు మండల ‘సాక్షి’ విలేకరి, దళిత సామాజికవర్గానికి చెందిన అత్తంటి మధుబాబుపై కూడా టీడీపీ మూక దాడికి పాల్పడింది. పది మంది చుట్టుముట్టి చేతిలో నుంచి సెల్‌ఫోన్ లాక్కొని ఫొటోలు, వీడియోలు డిలీట్ చేశారు. మరోమారు ఇటువంటివి పునరావృతమైతే ప్రాణాలు ఉండవంటూ తీవ్రస్థాయిలో బెదిరించి పంపేశారు. విలేకరి మధును వదిలేసినా జై జూనియర్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేసిన దళిత యువకులను శుక్రవారం రాత్రికి కూడా వారి నిర్బంధంలోనే ఉన్నట్లు సమాచారం. దాడి హేయమైన చర్య: దళిత సంఘాలు ఏ తప్పూ చేయని దళిత విలేకరులపై లోకేశ్ గుండాలు దాడికి పాల్పడటం హేయమైన చర్య అని దళిత సంఘాలు, జర్నలిస్టు సంఘాలు మండి పడుతున్నాయి. లోకేశ్ సిబ్బందిని అదుపులో పెట్టుకోకపోతే పాదయాత్ర సాగకుండా అడ్డుకుంటామని జర్నలిస్టు సంఘాలు హెచ్చరించాయి. దళిత విలేకరులు కరుణాకర్, మధుబాబుకు, వారి కుటుంబ సభ్యులకు లోకేశ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ‘సాక్షి’ రిపోర్టర్లపై దాడి దారుణం ‘సాక్షి’ విలేకరులు కరుణాకర్, మధుబాబుపై టీడీపీ గుండాల దాడి హేయమైన చర్య. ఒంగోలులో లోకేశ్ పాదయాత్రకు జనం నుంచి స్పందన లేదు. సాక్షి పత్రిక ఈ నిజాలను నిర్భయంగా రాస్తోంది. దీనిని జీర్ణించుకోలేక టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. సమాజంలో ఇలాంటి ఘటనలు మంచిది కాదు. ఫోర్త్ ఎస్టేట్‌గా చెప్పుకునే జర్నలిస్టులపై టీడీపీ గూండాల దాడి, సెల్ఫోన్లు లాక్కోవడం దారుణం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తీవ్రంగా గాయపడ్డ సాక్షి దళిత విలేకరి కరుణాకర్, ఆయన కుటుంబానికి అండగా ఉంటాం. – మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి -
ప్రభాస్, ఎన్టీఆర్ లా నేను వెళ్ళను...వాళ్లే నా దగ్గరికి రావాలి
-
టీడీపీ నేత రాజేంద్ర దౌర్జన్యం రిపోర్టర్ పై కత్తితో దాడి
-
ఎల్లో మీడియా రిపోర్టర్ ని ఒక్క రేంజ్ లో ఆడుకున్న స్పీకర్ తమ్మినేని
-
సినిమా ఈవెంట్స్ లో పర్సనల్ క్వశ్చన్స్
-
ఇదేం పద్ధతి.. రిపోర్టర్ ప్రశ్నిస్తుంటే.. మధ్యలో వెళ్లిపోయిన బైడెన్!
వాషింగ్టన్: ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేరు ఏదో ఒక రూపంలో వార్తల్లో వినిపిస్తూనే ఉంది. తాజాగా ఆయన ప్రవర్తించిన తీరుతో మరో సారి వార్తల్లోకెక్కారు. ఓ వైపు రిపోర్టర్లు ప్రశ్నలు సంధిస్తుంటే..అవేమీ తనకు కాదన్నట్టు గది నుంచి బయటకు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. అగ్రరాజ్యంలో రెండు బ్యాంకుల్లో సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. వీటి గురించి బైడెన్ మాట్లాడుతూ.. తమ బ్యాంకింగ్ వ్యవస్థ సురక్షితంగానే ఉందని భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతలో విలేకరులు పలు ప్రశ్నలు సంధించారు. ‘అసలు ఈ సంక్షోభం ఎందుకు తలెత్తిందనే దానిపై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి..? దీని తర్వాత ఇలాంటి పరిణామాలు ఉండవని మీరు అమెరికన్లకు భరోసా ఇవ్వగలరా..? అని ఒకరు తర్వాత ఒకరు ప్రశ్నలు అడుగుతున్నారు. అయతే వాటికి సమాధానం ఇవ్వకుండా ఆ గది నుంచి బైడెన్ మౌనంగా వెళ్లిపోయారు. అంతలో మరో రిపోర్టర్ "మిస్టర్ ప్రెసిడెంట్, ఇతర బ్యాంకులు కూడా ఇలా విఫలమైతే పరిస్థితి ఏంటి," అన్ని ప్రశ్నిస్తున్నా అవేవి పట్టించుకోకుండా గది తలుపు వేసి బయటకు వెళ్లారు. వైట్ హౌస్ యూట్యూబ్ ఛానెల్లో బైడెన్ బయటకు వెళ్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అమెరికా ప్రెసిడెంట్ విలేకరుల ప్రశ్నలకు బదులివ్వక మధ్యలో వదిలి వెళ్లడం ఇదేం మొదటిసారి కాదు. చైనా "స్పై బెలూన్" ఘటన తర్వాత జర్నలిస్టులు బైడెన్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. అంతలో ఆయన "నాకు విరామం ఇవ్వండని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గత సంవత్సరం, కూడా కొలంబియా అధ్యక్షుడిని కలిసిన తర్వాత విలేకరులు అతనిపై ప్రశ్నలు సంధిస్తున్నప్పుడు సమాధానం చెప్పకుండా బైడెన్ నవ్వుతున్న క్లిప్ వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో చాలా మంది "బైడెన్ జర్నలిస్టులతో ఎక్కువగా మాట్లాడడు.. ఎందుకంటే ఆయన వద్ద సమాధానాలు లేవని వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. "Can you assure Americans that there won't be a ripple effect? Do you expect other banks to fail?" BIDEN: *shuts door* pic.twitter.com/CNuUhPbJAi — RNC Research (@RNCResearch) March 13, 2023 -
రిపోర్టర్ బర్త్‌డే.. ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తారక్
-
బంగ్లాదేశ్ తొలి టెస్టు గెలుస్తుందా? విలేకరికి దిమ్మతిరిగే సమాధానమిచ్చిన కుల్దీప్
ఛాటోగ్రామ్ వేదికగా జరుగుతోన్న తొలి టెస్టులో భారత్ పట్టు బిగించింది. మొదటి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యం కలుపుకుని భారత్ 513 పరుగుల భారీ లక్ష్యాన్ని బంగ్లా ముందు ఉంచింది. ఆటకు రెండు రోజుల సమయం మిగిలిఉన్న నేపథ్యంలో కచ్చితంగా ఫలితం వచ్చే అవకాశముంది. ప్రస్తుత పరిస్ధిల బట్టి చూస్తే బంగ్లా కంటే భారత్‌కే విజయ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 513 పరుగుల టార్గెట్ చేధించడం అంత ఈజీ కాదు. అయితే వికెట్లు కాపాడుకొని ఈ మ్యాచ్‌ను డ్రా చేసే అవకాశమైతే బంగ్లాకు ఉంది. ఇక దాదాపు రేండేళ్ల తర్వాత టెస్టు జట్టులోకి వచ్చిన భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టి బంగ్లా పతనాన్ని శాసించాడు. ఇక మూడో రోజు ఆట ముగిసిన అనంతరం కుల్దీప్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా కుల్దీప్ యాదవ్‌కు ఒక విలేకరి నుంచి పిచ్చి ప్రశ్న ఎదురైంది. 513 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించి తొలి టెస్టును బంగ్లాదేశ్ గెలిచే అవకాశం ఉందని అనిపించడం లేదా? అని ప్రశ్నించాడు. దానికి బదులుగా కుల్దీప్ నవ్వుతూ స్పందించాడు. "వ్యక్తిగతంగా అయితే అలా జరగకూడదని నేను కోరు కుంటున్నాను. కానీ క్రికెట్లో ఏది అయినా జరగవచ్చు. బంగ్లా బ్యాటర్లలో ఎవరో ఒకరు 300 సాధిస్తే మీరు అనుకుంటుంది జరగవచ్చు. మేము వీలైనంత త్వరగా మ్యాచ్‌ను ముగించడానికి ప్రయత్నిస్తాము. నాలుగో రోజు అదే మా ప్రధాన లక్ష్యం" అంటూ కుల్దీప్ దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇచ్చాడు. ఇక నాలుగో రోజు డ్రింక్స్ విరామానికి బంగ్లాదేశ్ వికెట్ నష్టపోకుండా 81 పరుగులు చేసింది. చదవండి: Shubman Gill: డెబ్యూ సెంచరీతోనే అరుదైన రికార్డు కొట్టిన గిల్ -
మెస్సీతో ఇంటర్య్వూ; ఫిఫా ఫైనల్.. చివరి మ్యాచ్ అని తట్టుకోలేక
అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ తన దేశం తరపున ఆఖరి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో ఫ్రాన్స్‌తో జరిగే ఫైనల్ మ్యాచ్ మెస్సీకి ఆఖరిది కానుంది. ఈ విషయాన్ని సెమీస్‌లో క్రొయేషియాపై విజయం అనంతరం మెస్సీనే స్వయంగా ప్రకటించాడు. మెస్సీ నిర్ణయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ ఆరాధ్య దైవం ఆఖరి మ్యాచ్ ఆడుతున్న నేపథ్యంలో ఎలాగైనా ఫైనల్లో గెలిచి ఫిఫా వరల్డ్‌కప్‌తో అంతర్జాతీయ కెరీర్‌ను ముగిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం అర్జెంటీనా సహా ఫిఫా అభిమానులు మెస్సీ టైటిల్ గెలవాలని పూజలు చేస్తున్నారు. మరి మెస్సీ టైటిల్ కొట్టి తన కలను నెరవేర్చుకుంటాడా లేదా అనేది మరో రెండు రోజుల్లో తెలియనుంది.ఈ విషయం పక్కనబెడితే.. క్రొయేషియాతో మ్యాచ్ అనంతరం మెస్సీని ఇంటర్య్వూ చేసిన అర్జెంటీనాకు చెందిన మహిళ రిపోర్టర్ కన్నీటిపర్యంతం అయింది. రిపోర్టర్ ఎమోషన్‌కు చలించిపోయిన మెస్సీ చిరునవ్వుతో ఆమెను ఓదార్చాడు. మ్యాచ్ విజయం అనంతరం మెస్సీని ఇంటర్య్వూ చేసింది. ''నా దృష్టిలో ఇది ప్రశ్న కాదు.. అర్జెంటీనా ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ ఆదివారం(డిసెంబర్ 18న) ఫైనల్ ఆడబోతున్నాం. ఒక అర్జెంటీనా వ్యక్తిగా కప్పు మనమే గెలవాలని అందరితో పాటు నేను కోరుకుంటన్నా. కానీ దేశం తరపున మీకు ఇది చివరి మ్యాచ్ అని తెలిసినప్పటి నుంచి ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. రిజల్ట్‌తో మాకు సంబంధం లేదు. అది ఎలా అయినా రానీ మీరు మాత్రం మా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అర్జెంటీనాలో చిన్న పిల్లాడిని అడిగినా మెస్సీ గురించి ఎంతో గొప్పగా చెప్తుంటారు. అలాంటిది మన జట్టు ఇవాళ ఫైనల్‌కు అడుగుపెట్టడంలో మీది కీలకపాత్ర కావడం మాకు సంతోషకరం. ఇప్పటికి ఇది నిజమా.. కలా అనేది తెలుసుకోలేకపోతున్నాం. ఫుట్‌బాల్‌కు మీరు చేసిన సేవలు ఎన్నటికి మరువం. మారడోనా లీగసీని కంటిన్యూ చేస్తూ ఫుట్‌బాల్‌లో ఎనలేని కీర్తి ప్రతిష్టలు సాధించారు. మిమ్మల్ని బీట్ చేయడం ఎవరి తరం కాదు. మాలాంటి వాళ్లకు మెస్సీ ఒక స్పూర్తి.. ఒక అర్జెంటీనా మహిళను అయినందుకు గర్వపడుతున్నా థాంక్యూ మెస్సీ'' అంటూ ఎమోషనల్ అయింది. ఇదంతా ఓపికతో విన్న మెస్సీ చిరునవ్వుతో మెరిశాడు. అనంతరం రిపోర్టర్‌ను దగ్గరికి తీసుకొని ఆమెను ఓదార్చాడు. మీతో సహా అర్జెంటీనా ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేయడానికి ప్రయత్నిస్తా. ఫిఫా వరల్డ్‌కప్ టైటిల్ గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతాం. ఈసారి వరల్డ్‌కప్‌లో మా జర్నీ అంత ఈజీగా సాగలేదు. క్లిష్ట పరిస్థితులను దాటుకొని ఫైనల్‌కు చేరుకున్నాం. మరొక అడుగు పూర్తి చేస్తే సక్సెస్ అయినట్లే. మీ అభిమానానికి థాంక్స్ అంటూ పేర్కొన్నాడు. ఇక మెస్సీ ఫిఫా వరల్డ్‌కప్ అనంతరం అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు. 2005 నుంచి అర్జెంటీనా సీనియర్ జట్టుకు ఆడుతున్న మెస్సీ 171 మ్యాచ్‌లు ఆడి 96 గోల్స్ సాధించాడు.ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన అర్జెంటీనా ప్లేయర్‌గా మెస్సీ నిలిచాడు. బటిస్టుటా (10 గోల్స్) పేరిట ఉన్న రికార్డును మెస్సీ (11 గోల్స్) సవరించాడు. ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్ల జాబితాలో మెస్సీ సంయుక్తంగా ఆరో స్థానానికి చేరుకున్నాడు. మిరోస్లావ్ క్లోజ్ (16), రొనాల్డో నజారియో (15), గెర్డ్ ముల్లర్ (14) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. 😭 pic.twitter.com/iYhhMAWSwB — Emma 📊 (@emmaiarussi) December 13, 2022 చదవండి: FIFA: గాయంతో అన్న దూరం.. తమ్ముడు అదరగొడుతున్నాడు Kylian Mbappe: 'బాధపడకు మిత్రమా.. ఓడినా చరిత్ర సృష్టించారు' -
రిపోర్టర్‌పై నటి హేమ ఫైర్.. ‘భక్తి కోసం వచ్చా కాంట్రవర్సికి కాదు’
నటి హేమ ఇంద్రకిలాద్రి అమ్మవారిని మంగళవారం దర్శంచుకున్నారు. ఈ రోజు ఉదయం విజయవాడలోని దుర్గమ్మను దర్శించుకున్న ఆమె అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రిపోర్టర్‌పై ఆమె ఫైర్ అయ్యింది. నటి హేమ అమ్మవారి భక్తురాలు అనే విషయం తెలిసిందే. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఏటా ఆమె ఇంద్రకిలాద్రి అమ్మవారిని దర్శించుకుంటారు. అలాగే ఈ ఏడాది కూడా ఆమె అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చారు. చదవండి: బిగ్‌బాస్ 6లోకి సుడిగాలి సుధీర్? వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌజ్‌లో హంగామా! ఇక దర్శనం అనంతరం ఆమె మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘అందరికి నమస్కారం. నేను మీ హేమను. అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం ప్రోటోకాల్ ఇబ్బంది అని, చాలా మంది జనాలు పోటేత్తి వస్తున్నారన్నారు. దీంతో ఈ ఏడాది రాలేనేమో అనుకున్నా. కానీ, అమ్మవారే ఈ రోజు నన్ను ఇక్కడికి రప్పించారు. ఇక్కడ దర్శనం చేసుకున్న భక్తులు చాలా పుణ్యం చేసుకున్నారు. మీ అందరికి కొండంత ధైర్యం ఇవ్వమని అమ్మవారిని కోరుకున్నాను’ అన్నారు. చదవండి: Prabhas Adipurush Teaser: కేజీఎఫ్-2 రికార్డ్ బ్రేక్.. బద్దలుకొట్టిన ఆదిపురుష్ ఈ క్రమంలో ఓ రిపోర్టర్ టికెట్స్ తీసుకున్నారా? లేదా? అని ప్రశ్నించగా.. సహనం కోల్పోయిన ఆమె అతనిపై సీరియస్ అయ్యారు. ‘మేం ఇద్దరం వచ్చాం. హుండీలో పది వేలు వేశాను. అమ్మవారికి 20 వేలు పెట్టి చీర తెచ్చాను. మీరు టికెట్ గురుంచి మాట్లాడుతున్నారు. ప్రోటోకాల్ ప్రకారమే ఫాలో అవుతున్నాం. దీన్ని కాంట్రవర్శి చేయడం సరికాదంటూ’ అతడిపై మండిపడ్డారు. అంతేకాదు తాను భక్తి కోసం వచ్చానని, కాంట్రవర్సికోసం కాదంటూ ఘాటుగా స్పందించారు. -
సోనూసూద్ గొప్ప మనసు.. స్టూడెంట్ రిపోర్టింగ్‌కు ఫిదా.. సాయం చేస్తానంటూ
సోనూసూద్.. దేశంలో ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరేమో.. తన సినిమాల కంటే చేసిన సేవలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి.. రీల్ హీరోగానే కాకుండా రియల్ హీరోగా మారిన మంచి మనసున్న మహారాజు. లాక్డౌన్ కాలంలో వేలాది మందికి నేనున్నానంటూ అండగా నిలిచాడు. కష్టం వచ్చిందని సోనూసూద్ దృష్టికి తీసుకొస్తే చాలు.. తనకు చేతనైనంత సాయం చేస్తుంటారు. నేటికి తన సేవలను కొనసాగిస్తున్నాడు. తాజాగా జార్ఖండ్లోనిని ఓ విద్యార్థి సమస్యకు పరిష్కారం చూపి మరోసారి తన ఉదారతను చాటుకున్నాడు. కొన్ని రోజుల క్రితం ఓ బాలుడు తన ప్రభుత్వ పాఠశాల దుస్థితిని వివరిస్తూ రిపోర్టర్‌గా మారిన సంగతి తెలిసిందే. సర్ఫరాజ్ అనే విద్యార్థి అచ్చం రిపోర్టర్లా నటిస్తూ పాఠశాల అంతా తిరుగుతూ తరగతి గదిలో అధ్వానమైన పరిస్థితులు, సరైన టాయిలెట్స్ లేకపోవడాన్ని రిపోర్టింగ్ చేశాడు. దీన్నంతటినీ మరో స్నేహితుడు వీడియో చిత్రీకరించాడు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. చాలా మంది నెటిజన్లు స్పందిస్తూ బాలుడి నైపుణ్యాలను ప్రశంసించారు. शायद आपने ऐसा पत्रकार नहीं देखा हो ये विडीओ है झारखंड की जहां एक छोटा बच्चा जर्नालिस्ट बन कर अपने स्कूल के बदहाली को एक्ष्पोस करता है बच्चे का नाम सरफराज है और विडीओ ज़िला गोड्डा से है। 1/2@zoo_bear @AshrafFem @khanumarfa @khan_zafarul @meerfaisal01 @alishan_jafri @IamYasmeeny pic.twitter.com/14Uw53iIRn — Mohammad Sunasara (@MdSunasara5) August 4, 2022 అయితే ఈ వీడియోపై తాజాగా సోనూసూద్ స్పందించాడు. బాలుడి వీడియోను రీట్వీట్ చేస్తూ.. ‘సర్ఫరాజ్.. ఇకపై నువ్వు కొత్త స్కూల్ నుంచి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. కొత్త పాఠశాల, హాస్టల్ తమ కోసం ఎదురుచూస్తున్నాయి’ అని తెలిపారు. ఇక సోనూసూద్ గొప్ప మనసును నెటిజన్లు మరోసారి కొనియాడుతున్నారు. -
‘నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి’.. పిల్లాడి సమాధానం వింటే నవ్వు ఆపుకోలేరు
సోషల్ మీడియా అంటేరు అనేక విషయాల సమూహం. సెలబ్రిటీల నుంచి సాధారణ జనాల వరకు ఎన్నో అంశాలపై తమ తమ అభిప్రాయాలును ఈ వేదికగా పంచుకుంటున్నారు. నిత్యం వేలాది సరదా, ఆసక్తికర, విషయ పరిజ్ఞానాన్ని పెంచే కంటెంట్, వీడియోలు హల్చల్ చేస్తుంటాయి. తాజాగా ఓ ఫన్నీ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. బిహార్‌లో ఓ లోకల్ న్యూస్ రిపోర్టర్ అక్కడున్న కొంత మంది విద్యార్థులను పిలిచి పలు ప్రశ్నలు అడిగాడు. అయితే రిపోర్ట్ర్ అడిగిన ప్రశ్నలను సరిగా అర్థం చేసుకోకుండానే ఓ పిల్లాడు తమకు తోచిన సమాధానాలు చెప్పాడు. ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థిని నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటని ప్రశ్నించగా.. పూర్తిగా వినకుండానే బైగాన్(వంగాయ) అని సమాధానమిచ్చాడు. తరువాత ఆ రిపోర్టర్ అబ్బాయిని సబ్జెక్ట్ గురించి అడుగుతున్నానని చెప్పడంతో ‘ఓహ్ సారీ, ఇట్స్ ఇంగ్లీషు’ అని బదులిచ్చాడు. ‘నీకు ఇంగ్లీష్‌లో ఏవైనా పద్యాలు గుర్తున్నాయా?’ అని అడిగితే.. బాలుడు కొంచెం కూడా తడబడకుండా ‘55 నుంచి 100 వరకు స్పెల్లింగ్ చెప్పగలను’ అంటూ సమాధానం చెప్పాడు. చదవండి: షాకింగ్: సామాన్య పౌరుడిగా.. లండన్ మెట్రోలో దుబాయ్ యువరాజు అంతేగాక దేశ ప్రధాని ఎవరో చెప్పమని రిపోర్టర్ ప్రశ్నించగా.. మొదట నితీష్ కుమార్, ఆపై లాలూ యాదవ్ అని సమాధానం చెప్పాడు. దీంతో విసుగు చెందిన రిపోర్టర్ పీఎం అనే పదాన్ని నొక్కి చెప్పడంతో ‘మోదీ’ అని చెప్పాడు. పూర్తి పేరు అడిగినప్పుడు.. మోదీ సర్కార్! అంటూ గట్టిగా అరిచాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.. ఇప్పటి వరకు వీడియోకు 9 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. అయితే పిల్లవాడు తెలిసీ తెలియక చెప్పిన సమాధానాలు నెటిజన్లచేత నవ్వూలు పూయించాయి. తనకు విషయ పరిజ్ఞానం లేదనే దాని కంటే అతడి అమాయకత్వపు జవాబులు విని పడిపడి నవ్వుతున్నారు.. కావాలంటే మీరూ ఈ వీడియోను చూడండి. చదవండి: Viral Video: కిల్లింగ్ స్టెప్స్‌తో అదరగొట్టిన డాక్టర్లు View this post on Instagram A post shared by 💯💯 Saur_kamalvanshi💯💯🙌🙌 (@its_saurabh_kamalvanshi) -
లైవ్‌లో కుర్రాడి దవడ పగలగొట్టిన రిపోర్టర్
వైరల్: లైవ్‌లో యాంకర్లు, జర్నలిస్టుల వీడియోలు తరచూ వైరల్ అవుతున్నవే. అలాంటిది ఈ వీడియో. లైవ్‌లోనే ఓ కుర్రాడి దవడ పగలకొట్టింది రిపోర్టర్. దీంతో ఆమెను సపోర్ట్ చేసేవాళ్లు కొందరైతే.. మరికొందరు తిట్టిపోస్తున్నారు. చుట్టూ జనం మూగి ఉన్న టైంలో.. ఆమె అక్కడ రిపోర్టింగ్ చేస్తూ కనిపించింది. అయితే.. ఉన్నట్లుండి ఒక్కసారిగా అసహనంతో ఆమె పక్కనే ఉన్న కుర్రాడి చెంప పగలకొట్టింది. బహుశా విసిగించినందుకే ఆమె అలా చేసి ఉంటుందని భావిస్తున్నారు చాలామంది. వీడియో ట్విటర్లో పోస్ట్ చేసిన వ్యక్తి కూడా ఆమె ఎందుకలా చేసిందో కారణం చెప్పలేదు. బహుశా ఆ కుర్రాడు అసభ్యంగానో, అభ్యంతరకరంగానో ప్రవర్తించి ఉంటాడని.. అందుకనే అలా శిక్షించి ఉంటుందని మద్దతు ప్రకటిస్తున్నారు కొందరు. పాకిస్థాన్‌లో ఈద్ అల్ అదా వేడుకల సందర్భంగా రిపోర్టింగ్ చేస్తున్న టైంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ????????? pic.twitter.com/Vlojdq3bYO — مومنہ (@ItxMeKarma) July 11, 2022 మైరా హష్మీ వివరణ ఆ వీడియోలో ఉన్న జర్నలిస్ట్ పేరు మైరా హష్మీ. సోషల్ మీడియాలో ఆమె వీడియో ట్రోల్ అవుతుండడంతో స్పందించింది. ఇంటర్వ్యూ టైంలో ఆ కుర్రాడు పక్కనే ఉన్న కుటుంబాన్ని వేధిస్తున్నాడు. ఇది వాళ్లను ఇబ్బందికి గురి చేసింది. అలా చేయొద్దని మొదట మంచిగా చెప్పాను. కానీ, సౌండ్ చేస్తూ మరింత రెచ్చిపోయాడు. సహించాలా? అతనికి మళ్లీ అవకాశం ఇవ్వాలా? అనిపించింది. అందుకే అలా చేశా అని ఆమె ట్విటర్లో వివరణ ఇచ్చుకుంది. అయితే విషయం ఏదైనా సరే అలా పబ్లిక్పై చెయ్యి చేసుకునే హక్కు ఆమె ఎక్కడిదని? పలువురు నెటిజన్స్ నిలదీస్తున్నారు. یہ لڑکا انٹرویو کے دوران فیملی کو تنگ کر رہا تھا _جسکی وجہ سے فیملی پریشان ہوگئی تھی__میں نے پہلے پیار سے سمجھایا کے ایسا نہیں کرو مگر سمجھانے کے باوجود یہ لڑکا نہیں سمجھا اور زیادہ ہُلّڑ بازی کررہا تھا_ جس کے بعد مجھے زیب نہیں دیا کہ اسے اور موقع دیکر برداشت کیا جائے ؟ pic.twitter.com/4jmuSsInYg — Maira Hashmi (@MairaHashmi7) July 11, 2022 -
నోరు ముయ్.. నీకు అన్నీ చెప్పాలా: బాబా రాందేవ్
ఛండీగఢ్: యోగా గురు బాబా రామ్‌దేవ్ సహనం కోల్పోయారు. లైవ్‌లోనే ఓ జర్నలిస్టుపై అసహనం వ్యక్తం చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. రామ్‌దేవ్ బుధవారం హర్యానాలోని కర్నాల్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, అంతకు ముందు 2014లో బాబా రామ్ దేవ్ ప్రజలు లీటర్‌కు రూ. 40 పెట్రోల్, రూ. 300 లకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు. ఈ సందర్బంగా ఓ మీడియా విలేకరి గతంలో బాబా రామ్‌దేవ్ చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నలపై ప్రశ్నించారు. దీంతో బాబా రామ్ దేవ్ సహనం కోల్పోయి లైవ్‌లోనే బెదిరించారు. తాజాగా చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో విలేకరి, రామ్ దేవ్ బాబా వ్యాఖ్యలపై ప్రశ్నించగా.. ‘‘అవును, ఇప్పుడు ఏం చేయమంటారు..? ఇలాంటి ప్రశ్నలు అడగకండి.. నేనేమీ మీ కాంట్రాక్టర్‌ను కాదు.. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన పనిలేదు..’’ అన్నారు. ఇంతో సదరు విలేకరి మరోసారి ప్రశ్నించగా.. అతడిపై రామ్ దేవ్ సీరియస్‌గా చూస్తూ..‘‘ నేను, ఆ వ్యాఖ్య చేశాను. అబ్ క్యా కర్ లేగా (నువ్వేం చేస్తావు)? నోరు మూసుకో. మళ్లీ అడగకు.. ఇలా మాట్లాడకు.. మంచిది కాదు.. నువ్వు మీ పేరెంట్స్‌కు మంచి కొడుకుగా ఉండాలి’’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. అనంతరం బాబా రామ్ దేవ్ మాట్లాడుతూ.. కష్ట సమయాల్లో మరింత కష్టపడి పనిచేయాలని రామ్‌దేవ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘‘ఇంధన ధరలు తగ్గితే పన్ను రాదని, దేశాన్ని ఎలా నడుపుతారని, జీతాలు చెల్లిస్తారని, రోడ్లు ఎలా వేస్తారని ప్రభుత్వం చెబుతోందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవును, ద్రవ్యోల్బణం తగ్గాలి, అందుకు ఒప్పుకుంటాను.. అయితే ప్రజలు కష్టపడి పనిచేయాలి. తాను కూడా తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి రాత్రి 10 గంటల వరకు పని చేస్తాను" అని అన్నారు. ఇదిలా ఉండగా.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. బుధవారం లీటర్ పెట్రోల్, డీజిల్‌పై మరో 80 పైసలు పెరిగింది. దీంతో గత తొమ్మిది రోజులలో లీటరుకు రూ. 5లకు పైగా పెరిగాయి. Yoga Guru Ramdev was seen on camera losing his cool and threatening a journalist, who asked him about his comments in the past on reducing petrol price. @ndtv pic.twitter.com/kHYUs49umx — Mohammad Ghazali (@ghazalimohammad) March 30, 2022 -
లైవ్‌లో న్యూస్ అందిస్తున్న రిపోర్టర్‌కి యాక్సిడెంట్ : వైరల్ వీడియో
లైవ్‌లో న్యూస్ అందిస్తున్న సమయంలో రిపోర్టర్‌కి యాక్సిడెంట్ అయిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అసలు విషయంలోకెళ్తే...అమెరికాకు చెందిన వెస్ట్ వర్జీనియా టెలివిజన్ ఛానెల్ ప్రత్యక్ష ప్రసారంలో రిపోర్ట్ంగ్ అందిస్తున్న ఒక మహిళకి లైవ్‌లోనే యాక్సిడెంట్ అయ్యింది. ప్రమాదం జరిగిన మహిళ టోరీ యోర్గీగా గుర్తించారు. అయితే ఆమె లైవ్ టెలీకాస్టింగ్‌లో రోపోర్టింగ్ చేస్తోంది. ఇంతలో ఒక ఎస్యూవీ కారు ఆమెను వెనుక నుంచి ఢీ కొడుతుంది. అయితే ఆ లైవ్ న్యూస్‌లోనే ఆమె గట్టిగా అరవడం, ఆ తర్వాత సదరు ఆ వాహనదారుడితో మాట్లాడటం వినిపిస్తుంది. అయినప్పటికీ ఆమె మళ్లీ కాసేపటికి తేరుకుని తన రిపోర్టింగ్‌ని యథావిధిగా కొనసాగించడం విశేషం. ఈ మేరకు టీవీ యాంకర్ టిమ్ మీరు బాగానే ఉన్నారా! అని టోరీని ప్రశ్నిస్తాడు. దీంతో టోరీ తాను బాగానే ఉన్నా, కానీ యాక్సిడెంట్ ఎలా జరిగిందో నాకు తెలియదు అని చెబుతుంది. అంతేకాదు టిమ్ కూడా తాను రిపొర్టర్ అదృశ్యమవ్వడమే చూశాను తప్ప ప్రమాదం ఎలా జరిగిందో గమనించలేదని చెప్పారు. లైవ్‌లో న్యూస్ అందిస్తుండగా జరిగిన తొలిప్రమాదం కదా అని యాంకర్ టిమ్ రిపోర్టర్ టోరీని అడిగాడు. దీంతో ఆమె ఇలాంటి ప్రమాదాలు చాలా ఎదుర్కొన్నాను కానీ తనకు ఎటువంటి గాయాలు కాలేదని చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యింది. అంతేకాదు లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్కేయండి. "We're good, Tim." pic.twitter.com/9kn2YElDLK — Timothy Burke (@bubbaprog) January 20, 2022 (చదవండి: ఎక్స్ రే అమ్మకానికి పెట్టిన డాక్టర్... ఎందుకో తెలుసా) -
మైకులో బండబూతు తిట్టి.. ఆపై ఫోన్లో సారీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నోటి దురుసు వ్యవహారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఎప్పుడూ హుందాగా, ప్రశాంతంగా కనిపించే బైడెన్లో వేరియేషన్ కనిపించడంతో ఆశ్చర్యపోతున్నారంతా. సోమవారం ఓ జర్నలిస్టును బండ బూతు తిట్టడం.. అదీ మైక్ సాక్షిగా అందరికీ వినిపించేలా కావడంతో ఘటనపై దుమారం రేగింది. కన్జర్వేటివ్ పార్టీ ప్రొ ఛానెల్ ఫాక్స్ న్యూస్‌లో పని చేస్తున్నాడు పీటర్ డూసీ. అతన్ని బైడెన్ ‘స్టుడిప్ సన్ ఆఫ్ **’ అంటూ తీవ్ర పదజాలంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తిట్టేశాడు . అయితే ఈ ఘటన జరిగిన గంట తర్వాత వ్యక్తిగతంగా డూసీకి కాల్ చేసి మరీ బైడెన్ క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. ‘అది తన వ్యక్తిగతంగా చేసిన కామెంట్ కాదని..’ ఆయన ఆ జర్నలిస్ట్‌కు వివరణ ఇచ్చినట్లు సమాచారం. జనవరి 24న వైట్‌హౌజ్‌లో కాంపిటీషన్ కౌన్సిల్ భేటీ జరిగింది. అనంతరం జరిగిన ప్రెస్మీట్లో పీటర్ డూసీ, అధ్యక్షుడు బైడెన్‌ను ద్రవ్యోల్బణంపై ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నతో కోపాన్ని అణుచుకోలేక.. వెటకారంగా ‘ద్రవ్యోల్భణం గొప్ప ఆస్తి’ అంటూ వెటకారంగా సమాధానమిస్తూనే.. ‘వాట్ ఏ స్టుడిప్..’ అంటూ బూతు తిట్టేశాడు. మైక్ ఆన్‌లో ఉంది గమనించని బైడెన్.. ఆ తర్వాత సిబ్బంది ఆ విషయం చెప్పడంతో సైలెంట్ అయిపోయారు. అయితే డూసీ సైతం ఆ కామెంట్లను సరిగ్గా వినలేకపోయాడట. ఆపై బ్రీఫ్ రూంలో ఆ కామెంట్లను విని చిన్నబుచ్చుకున్నాడట. చివరికి బైడెన్ క్షమాపణలతో ఈ వివాదం ముగిసినట్లయ్యింది. #WATCH | US President Joe Biden appeared to be caught on a hot mic after a journalist asked him a question related to inflation at the end of his press conference (Video Courtesy: C-Span) pic.twitter.com/ZJCP7X3QZS — ANI (@ANI) January 25, 2022 చదవండి: ఏడాదిన్నర చిన్నోడు.. ఫోన్లోనే లక్షా యాభై వేల షాపింగ్ చేశాడు -
రిపోర్టర్‌పై దాడి ఘటనలో ముగ్గురి అరెసు
నిజామాబాద్‌అర్బన్: ‘సాక్షి’దినపత్రిక మాక్లూర్ విలేకరి కమలాపురం పోశెట్టిపై జరిగిన దాడి ఘటనలో ఐదుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. వార్తల సేకరణ కోసం వెళ్తుండగా మాక్లూర్ మండల రిపోర్టర్ పోశెట్టిపై ఈ నెల 13న వల్లభాపూర్ వద్ద ముగ్గురు దుండగులు ఇనుప రాడ్లతో దాడికి దిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను నిరసిస్తూ, పోలీసుల వ్యవహార శైలికి నిరసనగా జర్నలిస్టులు వరుస ఆందోళనలు చేపట్టారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డిని కలిసి విన్నవించడంతో పాటు చలో మాక్లూర్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తులో వేగం పెంచారు. రిపోర్టర్‌పై దాడి ఘటనలో మొత్తం ఐదుగురిపై కేసు నమోదు చేశామని, ఇందులో ముగ్గురిని ఇప్పటికే అరెస్టు చేసినట్లు నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్లు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రిపోర్టర్ పోశెట్టి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి, బ్రిలియంట్ స్కూల్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించినట్లు వివరించారు. దాడికి పాల్పడిన కె.సురేశ్, మహమ్మద్మోసిన్, ప్రసాద్‌లపై కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్లు చెప్పారు. అలాగే, బాధితుడి ఫిర్యాదు మేరకు దాడికి ప్రేరేపించిన మహేందర్, రంజిత్లపైనా కేసు పెట్టినట్లు పేర్కొన్నారు. అలాగే, అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశామని, కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతోందని స్పష్టం చేశారు. -
‘సాక్షి’ రిపోర్టర్‌పై ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అనుచరుల హత్యాయత్నం
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల సాక్షి రిపోర్టర్ కమలాపురం పోశెట్టిపై ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అనుచరులు హత్యాయత్నం చేశారు. శనివారం మండలంలోని కొత్తపల్లిలో జెడ్పీ చైర్మన్ విఠల్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించనున్న రైతుబంధు సంబురాల కార్యక్రమం కవరేజ్ నిమిత్తం ఆయన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, వల్లభాపూర్ గ్రామ సమీపంలో రెండు బైక్‌లపై, మంకీ క్యాప్‌లు ధరించి వచ్చిన ముగ్గురు దుండగులు ఇనుప రాడ్లతో దాడి చేశారు. సమీపంలోని పొలాల్లో నాట్లు వేస్తున్న కూలీలు పరుగున రావడంతో దుండగులు పారిపోయారు. తీవ్రంగా గాయపడిన పోశెట్టిని నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. మాక్లూర్ సొసైటీలో చోటుచేసుకున్న రూ.30 లక్షల అక్రమాలపై పోశెట్టి ఇటీవల వార్తలు రాశారు. అలాగే, గత శుక్రవారం మెట్పల్లిలో జరిగిన రైతుబంధు ఉత్సవాల్లో విఠల్‌రావు మాట్లాడుతూ.. సోయిలేని ప్రజాప్రతినిధి అంటూ ఎమ్మెల్యే గురించి వ్యాఖ్యలు చేశారు. ఈ వార్త రాయడంతోపాటు గతంలో సొసైటీలో అక్రమాల గురించి రాసినందుకు మాక్లూర్ సొసైటీ చైర్మన్ కొడుకు గోపు రంజిత్, నందిపేట మండలం లక్కంపల్లి సర్పంచ్ భర్త మహేందర్ సూత్రధారులుగా ఈ హత్యాయత్నం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోశెట్టి ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఖబడ్దార్ జీవన్‌రెడ్డి: విరాహత్ రిపోర్టర్‌పై హత్యాయత్నాన్ని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అరాచకాల చిట్టాను వెలికితీస్తామంటూ ఖబడ్దార్ అని హెచ్చరించారు. క్షమించరాని నేరం: ప్రవీణ్‌కుమార్ (బీఎస్పీ) పోశెట్టిపై హత్యాయత్నాన్ని బీఎస్పీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఖండించారు. అక్రమాలను వెలుగులోకి తెచ్చిన గిరిజన విలేకరిపై దాడి చేయడం క్షమించరాని నేరమన్నారు. -
వయసులో చిన్నది.. బాధ్యత పెద్దదే! వైరల్ అవుతున్న చిట్టితల్లి
The girl is seen in the video Bad Condition Of Kashmir Roads: ఇంతవరకు మనం చూసే వైరల్ వీడియోలు కొన్ని సందేశాత్మకంగానూ, ప్రజలను ఆలోచింప చేసే విధంగానూ ఉన్నాయి. అయితే కొన్ని వైరల్ వీడియోలైతే ఆనంద్ మహీంద్రలాంటి ప్రముఖులను సైతం కదిలించాయి. అచ్చం అలాంటి సందేశాత్మకమైన ఆలోచింప చేసే క్యూట్ వైరల్ వీడియో ఒకటి నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. అసలు విషయంలోకెళ్తే.. ఈ వైరల్ వీడియోలో ఒక చిన్నపాప రిపోర్టర్లా కశ్మీర్లో రోడ్ల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో, ప్రజలు ఏవిధంగా చెత్త పారేస్తున్నారో వివరించింది. పైగా ఆ వీడియోలో ఈ రోడ్లు ఇంత దారుణంగా ఉండటం వల్ల తన ఇంటికి అతిధులు కూడా రాలేకపోతున్నారని చెబుతోంది. అంతేకాదు రిపొర్టర్ మాదిరి చెప్పి చివరిలో కెమెరామెన్ అమ్మతో అని ముగిస్తుంది. ఇటీవల కశ్మీర్ లోయలో భారీ మంచు, వర్షం కురిసిన సంగతి తెలిసింది. దీంతో రోడ్లు బురదగా మారి అత్యంత అధ్వానంగా ఉన్నాయి. ఈ మేరకు రెండు నిమిషాల నిడివి గల ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్కేయండి. Meet Youngest reporter from the #Kashmir Valley. pic.twitter.com/4H6mYkiDiI — Sajid Yousuf Shah (@TheSkandar) January 9, 2022 (చదవండి: 60 మిలియన్లకు కోవిడ్ కేసులు..మృతుల సంఖ్య 8 లక్షలకుపైనే!) (చదవండి: అఫ్ఘనిస్తాన్‌లో పేలుడు... తొమ్మిది మంది మృతి) -
పెద్దయ్యాక ఏమవుతావ్.. రిపోర్టర్ ప్రశ్నకు పిల్లవాడి దిమ్మతిరిగే సమాధానం
త్వరలో దేశంలోని అయిదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఐదింటిలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ ఎన్నికల కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. యూపీలో ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచార కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు. ఇటు మీడియా సైతం ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలపై దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలో ఓ న్యూస్ రిపోర్టర్, చిన్న పిల్లవాడికి మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన వీడియోలో న్యూస్ ఛానల్ రిపోర్టర్ ఓ అబ్బాయి వద్దకు వచ్చి పెద్ద అయ్యాక నువ్వు ఏం అవుతావ్ అని ప్రశ్నించాడు. దీనికి అతను ఎవరూ ఉహించని విధంగా సమాధానం చెప్పాడు. ‘చదువుకోకపోతే ఏం అవుతాము. ఏం అవ్వము.. ఒకవేళ చదువుకుంటే పెద్దయ్యాక పని చేస్తాను. ఓ ఇల్లు కట్టుకుంటాను. మంచిగా స్థిరపడతా. తిని తాగుతా.. పెళ్లి చేసుకొని భార్యను తెచ్చుకుంటా. ఇద్దరు, ముగ్గురు పిల్లల్ని కంటా.. అంటూ సమాధానిమిచ్చాడు. చదవండి: ఆ ఆనందం వెలకట్ట లేనిది!: హృదయాన్ని కదిలించే వైరల్ వీడియో!: అయితే పిల్లవాడు ఇచ్చిన ఫటాఫట్ సమాధానాలకు రిపోర్టర్‌తోపాటు అక్కడున్న వారంతా పగలబడి నవ్వారు. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో షేర్ చేయడంతో ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన నెటిజన్లు నవ్వకుండా ఉండలేకపోతున్నారు. ‘పిల్లవాడు ఎంతో తెలివిగా ఆలోచించాడు. నేటి జీవితంలో విద్య విలువ ఇప్పటికే తెలుసుకున్నాడు. శభాష్ బేటా’ అంటూ కామెంట్లు చేస్తున్నాడు. చదవండి: వైరల్: హర్యానా రాణితో ముసలాయన స్టెప్పులు.. తగ్గేదేలే! View this post on Instagram A post shared by Bhutni_ke (@bhutni_ke_memes) -
మంగళగిరిలో సాక్షి రిపోర్టర్‌పై టీడీపీ గూండాల దాడి
సాక్షి, గుంటూరు: మంగళగిరిలో సాక్షి టీవీ రిపోర్టర్ అభిరామ్‌పై టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. న్యూస్ కవరేజీ కోసం వెళ్లిన అభిరామ్‌ని అసభ్య పదజాలంతో దూషించిన పచ్చ పార్టీ నేతలు.. చొక్కా పట్టుకుని కొట్టారు. అతని చైన్ దొంగిలించారు. అక్కడ నుంచి వెళ్లకుంటే పరిస్థితి దారుణంగా ఉంటుందని హెచ్చరించారు. ఇష్టానుసారంగా దాడి చేయడంతో అభిరామ్‌కు గాయాలయ్యాయి. అభిరామ్‌పై దాడిని అడ్డుకోబోయిన మిగతా రిపోర్టర్లపై కూడా టీడీపీ నేతలు జులుం చూపించారు. వారిని నెట్టివేశారు. గాయాలపాలైన బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
ఏపీపీఎస్సీ: హార్టికల్చర్ ఆఫీసర్లు, తెలుగు రిపోర్టర్ జాబ్స్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ)... ఏపీ హార్టికల్చర్ సర్వీస్‌లో.. హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► పోస్టులు: హార్టికల్చర్ ఆఫీసర్లు ► మొత్తం పోస్టుల సంఖ్య: 39 ► అర్హతలు: హార్టికల్చర్‌లో నాలుగేళ్ల బీఎస్సీ డిగ్రీ/ బీఎస్సీ ఆనర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ► వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో ఐదేళ్ల సడలింపు లభిస్తుంది. ► ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ► పరీక్ష విధానం: రాత పరీక్ష ఆబ్జెక్టివ్ తరహా పద్ధతిలో నిర్వహిస్తారు. తెలుగు, ఇంగ్లిష్ నుంచి 50 ప్రశ్నల చొప్పున 100 ప్రశ్నలు– 100 మార్కులకు అర్హత పరీక్ష ఉంటుంది. దీనికి పరీక్ష సమయం 100 నిమిషాలు. పేపర్1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 ప్రశ్నలు–150 మార్కులకు; పేపర్2 హార్టికల్చర్–1, 150 ప్రశ్నలు– 150 మార్కులకు; పేపర్ 3, హార్టికల్చర్–2 150 ప్రశ్నలు– 150 మార్కులకు నిర్వహిస్తారు. ఈ మూడు పేపర్లకు ఒక్కో పేపర్‌కు పరీక్ష సమయం 150 నిమిషాలు కేటాయించారు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.10.2021 ► దరఖాస్తులకు చివరి తేది: 02.11.2021 ► వెబ్సైట్: https://psc.ap.gov.in ఏపీపీఎస్సీ– 05 తెలుగు రిపోర్టర్ పోస్టులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ)... ఏపీ లెజిస్లేచర్ సర్వీస్‌లో తెలుగు రిపోర్ట్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► పోస్టులు: తెలుగు రిపోర్టర్లు ► మొత్తం పోస్టుల సంఖ్య: 05 ► అర్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్బీటీఈటీ హైదరాబాద్ నిర్వహించిన షార్ట్ హ్యాండ్, టైప్ రైటింగ్(తెలుగు)లో హయ్యర్ గ్రేడ్ అర్హతతోపాటు నిమిషానికి 80 పదాల వేగంతో తెలుగు షార్ట్ హ్యాండ్ టైపింగ్ చేయాలి. ► వయసు: 01.07.2021 నాటికి 18–42ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ /ఈడబ్ల్యూఎస్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో ఐదేళ్ల సడలింపు లభిస్తుంది. ► ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ► పరీక్ష విధానం: ఈ పరీక్షను మొత్తం 300 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీపై 150 ప్రశ్నలు–150 మార్కులకు ఉంటుంది. పేపర్ 2లో 150 మార్కులకు తెలుగులో షార్ట్‌హ్యాండ్ డిక్టేషన్, లాంగ్‌హ్యాండ్‌లో ట్రాన్స్‌స్క్రిప్షన్ టెస్ట్ ఉంటుంది. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.10.2021 ► దరఖాస్తులకు చివరి తేది: 08.11.2021 ► వెబ్సైట్: https://psc.ap.gov.in -
Afghanistan: నేను చనిపోలేదు.. తాలిబన్లు చితకబాదారు
కాబూల్: మేం మారిపోయామని, మునుపటిలా లేమని తాలిబన్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వాళ్ల మాటలకు చేతలకు ఏమాత్రం పొంతన లేనట్లు అక్కడ జరుగుతున్న పరిణామాలను చూస్తే తెలుస్తోంది. తాజాగా కాబూల్‌లో ఆ దేశ మీడియాకు చెందిన ఓ రిపోర్టర్‌ను విధులు నిర్వహిస్తుండగా చితకబాదారు. వివరాల ప్రకారం.. టోలో న్యూస్‌కు చెందిన జియార్ యాద్ ఖాన్ అనే జర్నలిస్టు తాను రిపోర్టింగ్ చేస్తుండగా తాలిబన్లు కొట్టినట్లు చెప్పాడు. కాగా తొలుత తాలిబన్ల దాడిలో జియార్ చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే వాటిని ఖండిస్తూ అవన్ని అవాస్తవాలని అతను ట్వీట్ చేశాడు. కాబూల్ న్యూ సిటీలో పలు అంశాలపై రిపోర్ట్ చేస్తున్న సమయంలో తాలిబన్లు తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు తెలిపాడు. అంతేగాక కెమెరాలు, సాంకేతిక పరికరాలతో పాటు తన మొబైల్ ఫోన్ కూడా తీసుకున్నారని చెప్పాడు. చదవండి: ‘కొంత మంది మనుషుల కన్నా.. ఈ కోతి చాలా నయం’ -
నంద్యాల రిపోర్టర్ హత్య కేసు: దర్యాప్తునకు డీజీపీ ఆదేశం
సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లా నంద్యాలలో రిపోర్టర్ కేశవ్ హత్య ఘటనపై దర్యాప్తునకు డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశించారు. హత్య చేసిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. సస్పెండైన కానిస్టేబుల్‌తో పాటు హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. ముద్దాయిలను అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ తెలిపారు. కర్నూలు జిల్లా నంద్యాలలో యూట్యూబ్ చానల్ వీ5 విలేకరి కేశవను ఆదివారం రాత్రి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. పదేళ్లుగా విలేకరిగా పనిచేస్తున్న అతడిపై కక్షగట్టిన కానిస్టేబుల్ సుబ్బయ్య, అతడి సోదరుడు పదునైన ఆయుధంతో వీపు వెనుకభాగంలో పొడిచి హత్యచేసినట్లు అనుమానిస్తున్నారు. -
ఆరుగురు విలేకరులు అరెస్ట్..
సాక్షి,రావులపాలెం: రావులపాలెం వద్ద జాతీయ రహదారిపై బియ్యం లారీని అడ్డగించి, డ్రైవర్‌ను, రూ.లక్షల్లో డబ్బులు ఇవ్వాలని సరకు యజమానిని బెదిరించిన ఆరుగురు విలేకరులను అరెస్టు చేసినట్టు అమలాపురం డీఎస్పీ వై.మాధవరెడ్డి తెలిపారు. గురువారం రావులపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 14 తేదీ తెల్లవారుజామున స్థానిక అరటిమార్కెట్ యార్డు సమీపంలో తణుకు నుంచి రావులపాలెం వస్తున్న బియ్యం లోడు లారీని కొత్తపేట నియోజకవర్గానికి చెందిన ఏడుగురు విలేకరులు ఆపారు. లారీ డ్రైవర్‌ను కిందకు దిగమని బిల్లులు చూపించాలని బెదిరించారు. డ్రైవర్ బిల్లులు చూపించినా ఇవి పీడీఎఫ్ రైస్, మీ ఓనర్‌కు ఫోన్ చేయ్, లేకపోతే కేసు పెట్టి జైలుకు పంపుతామని బెదిరించారు. ఫోన్లో రైస్‌మిల్లు గుమస్తాతో మాట్లాడి రూ.రెండు లక్షలు ఇస్తే లారీని వదులుతామని లేకపోతే సీజ్ చేస్తామని బెదిరించారు. ఈ ఘటనపై సరకు యజమాని గుంటూరుకు చెందిన కె.గంగాధరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏడుగురిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీరిలో ఆకొండి వీరవెంకటసత్య సూర్యనారాయణమూర్తి (పశ్చిమవాహిని, తిరుపతి), చిర్రా నాగరాజు (ఆర్టీఐ యాక్ట్ న్యూస్ చానల్), అయినవిల్లి విజయబాబు (అనంత వాయిస్ తెలుగు దినపత్రిక), ఉందుర్తి రవికుమార్ (డీఆర్ఎస్ యూట్యూబ్ చానల్), పలివెల రాజు (జైజనని తెలుగు దినపత్రిక), ఉమ్మిడిశెట్టి వెంకటేశ్వరరావు (గోదావరి దినపత్రిక)లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి నాలుగు మోటారు సైకిళ్లు, ఏడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఏడో ముద్దాయి సీహెచ్ రాజేంద్రప్రసాద్ (వి10 న్యూస్ చానల్) పరారీలో ఉన్నాడని అతన్ని పట్టుకోవడానికి ఒక టీమ్‌ను ఏర్పాటు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. ముద్దాయిలను కొత్తపేట జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ వద్ద హాజరు పర్చనున్నట్టు తెలిపారు. సమావేశంలో సీఐ వి.కృష్ణ, ఎస్సై పి.బుజ్జిబాబు, అడిషనల్ ఎస్సై ఆర్. బెన్నిరాజు ఉన్నారు. -
వెబ్ చానెల్లో అవకాశం అంటూ రూ.10 లక్షలకు టోపి..
సాక్షి, సిరిసిల్లక్రైం(కరీంనగర్): వెబ్‌చానల్‌లో రిపోర్టర్‌గా అవకాశం కల్పిస్తానని నమ్మబలికి తలా రూ. 10 వేలు మొత్తం 100 మంది వద్ద రూ.10 లక్షలు వసూలు చేసిన సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన రంజిత్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం. బాధితుడైన జగిత్యాల జిల్లా చెందిన శ్రీనివాస్ మీడియా ఎదుట తన గోడు వెల్లబోసుకున్నాడు. ఆదిలాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల ఇలా అనేక జిల్లాలో రిపోర్టర్లను నియమించుకున్నట్లు చెప్పారు. ఒక వెబ్‌చానల్ చిరునామా తీసుకొని మోసానికి పాల్పడినట్లు వాపోయాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడి చిరునామాకు వెళ్లినట్లు తెలిసింది. అప్పటికే రంజిత్ పరార్ అయినట్లు సమాచారం. ఇదే రంజిత్ గతంలో ఫొటోషూట్ కోసం పలురకాల కెమెరాలు అద్దెకు తీసుకుని, ఇతరులకు అమ్ముకున్నాడని కేసు నమోదు అయింది. -
Joe Biden: రిపోర్టర్‌పై బైడెన్ సీరియస్.. అంత కోపమెందుకో?
జెనీవా: సాధారణంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మీడియా ముందు సౌమ్మంగానే ఉంటారు. కానీ బుధవారం జరిగిన సమావేశంలో ఆయన సహనం కోల్పోయారు. అందరు చూస్తుండగానే ఓ రిపోర్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో తొలి శిఖరాగ్ర సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. అనంతరం విలేకరుల సమావేశంలో బైడెన్ మాట్లాడుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. తరువాత ఆయన ఆ రిపోర్టర్‌కు క్షమాపణలు కూడా చెప్పారులెండి. అసలు బైడెన్ కోపం తెప్పించేలా ఏం అడిగారు?. పుతిన్‌తో భేటీ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో బైడెన్ సీఎన్ఎన్ వైట్‌హౌజ్ కరెస్పాండెంట్ కైట్లాన్ కొలిన్స్ ప్రశ్నలు అడుగుతూ.. ఈ భేటీ తర్వాత అయినా పుతిన్ తన ప్రవర్తనను మార్చుకుంటారనే విశ్వాసం మీకు ఉందా అని పదే పదే అడిగారు. సైబర్ అటాక్స్, మానవ హక్కుల ఉల్లంఘనల గురించి ప్రశ్నలకు పుతిన్ దగ్గర నుంచి సరిగా సమాధానం రాలేదని అడిగారు. అలాంటప్పుడు ఇది నిర్మాణాత్మక భేటీ ఎలా అవుతుందని ఆ రిపోర్టర్ ప్రశ్నించారు. దీంతో బైడెన్ ఒక్కసారిగా రిపోర్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ఆయన స్పందిస్తూ.. ‘అతను తన ప్రవర్తనను మార్చుకుంటాడని నాకు నమ్మకం లేదు. అయినా నేను నమ్మకంగా ఉన్నానని ఎప్పుడు చెప్పాను? నాకు దేనిపైనా నమ్మకం లేదు. నేను ఒక వాస్తవాన్ని చెబుతున్నాను. అది మీకు అర్థం కాకపోతే నేనేమీ చేయలేనని ’ అసహనం వ్యక్తం చేశారు. అదే క్రమంలో బైడెన్.. "నా ఎజెండా రష్యాకు లేదా మరెవరికీ వ్యతిరేకం కాదు, అది కేవలం అమెరికన్ ప్రజల కోసం" అని పుతిన్‌తో చెప్పినట్లు విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. సమావేశం ముగియడంతో బయలు దేరిన బైడెన్ వెనక్కి వచ్చి ఆ రిపోర్టర్‌కు క్షమాపణ చెప్పి వెళ్లారు. Oh my God. pic.twitter.com/GWHj1cVxG3— All American (@AllAmerican202) June 17, 2021 చదవండి: విబేధాల పరిష్కారం దిశగా తొలి అడుగు -
లైవ్‌లో రిపోర్టింగ్.. అనుకోని అతిథి రావడంతో షాక్
వాషింగ్టన్: న్యూస్ రిపోర్టర్‌గా లైవ్ స్ట్రీమింగ్ చేయడం అంత ఈజీ కాదు. చుట్టుపక్కల ఏం జరుగుతుందో అనేది పట్టించుకోకుండా కెమెరా వైపు చూస్తూ రిపోర్టింగ్ చేయాలి. ఒక్కోసారి అనుకోని పరిణామాలు జరిగి రిపోర్టర్స్ తమ ఏకాగ్రతను కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ఇది చాలదన్నట్లు సీరియస్ అంశాలపై మాట్లాడుతున్న సమయంలో ఇంట్లోని పెంపుడు జంతువులో లేక ఇతర జంతువులేవైనా లైవ్ స్ట్రీమింగ్‌లో కనిపిస్తే రిపోర్టర్ ఇబ్బందిగా ఫీలైనా.. దానిని చూసే వారికి మాత్రం నవ్వు తెప్పించడం ఖాయం. తాజాగా సీఎన్ఎన్ రిపోర్టర్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. మనూ రాజు అనే వ్యక్తి సీఎన్ఎన్ చానెల్లో రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడు. రాజు వాషింగ్టన్ డీసీలో తన లైవ్ బైట్‌కు సిద్ధమయ్యాడు. దర్జాగా సూట్ వేసుకొని వార్తలు చదివేయడానికి ప్రిపేర్ అయ్యాడు. కెమెరాను చూస్తూ వార్తలు చదవడం మొదలుపెట్టాడు. ఇంతలో అతని సూట్‌పై ఒక పరుగు పాకుతుండడం కెమెరాకు చిక్కింది. రాజు దానిని గ్రహించకుండా తన పని తాను చేసుకుంటున్నాడు. అయితే ఆ పురుగు అతని మెడ వద్దకు రావడంతో లైవ్‌లో ఉన్నానన్న విషయం మరిచిన రాజు పురుగును అవతలికి విసిరేశాడు. ఆ తర్వాత పక్కనున్న వారిని '' అలాంటి పురుగులు నా జట్టులో ఉన్నాయా '' అంటూ అడిగాడు. ఇదంతా కెమెరాలో రికార్డ్ అవుతూనే ఉండడంతో అక్కడున్న వారిని నవ్వులు పూయించింది. ఈ వీడియోను స్వయంగా రాజు తన ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు ట్రోల్స్, మీమ్స్‌తో రెచ్చిపోయారు. చదవండి: ఫ్లైట్‌లో దంపతుల ముద్దులు.. బ్లాంకెట్ ఇచ్చిన ఎయిర్ హోస్టస్ Had an unwelcome visitor try to crawl into my live shot earlier. pic.twitter.com/Pu68z0cWSN — Manu Raju (@mkraju) May 27, 2021 -
తుఫాన్ వస్తుంటే బయటకొచ్చావ్ ఏంటి.. రిప్లై ఏంటో తెలుసా!
భువనేశ్వర్: కరోనా కోరలు చాస్తుండటంతో కట్టడి చర్యలను పకడ్భందీగా అమలు చేస్తున్నారు. మహమ్మారి కొమ్ములు విరిచేందుకు అన్ని రాష్ట్రాలు కలిసి కట్టుగా పనిచేస్తున్నాయి. కర్ణ్యూ, లాక్డౌన్ ఆంక్షలను కఠినతరం చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు. సడలింపు సమయం అనుమతి దాటిన తరువాత ఎవరూ రోడ్డుమీదకు రాకుండా పోలీసులు గస్తీ కాస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం చిన్నచిన్న కారణాలను సాకులుగా చూపుతూ పోలీసులకు తలనొప్పిగా మారుతున్నారు. స్వీట్స్, కుక్కలు, అంటూ ఏవేవో వింత కారణాలు చెబుతూ అనవసరంగా బయట తిరుగుతున్నారు. అయితే ప్రస్తుతం కరోనాతోపాటు కొన్ని రాష్ట్రాలో యాస్ తుపాన్ తీవ్రంగా విరుచుకుపడుతోంది. యాస్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఒడిశా ఒకటి. తుఫాను ధాటికి పలుచోట్ల ఇళ్లు, భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు, లకొరిగాయి. ఈ నేపథ్యంలో ముంపు ప్రాంతాల్లోని ప్రజలను బయటకు రావొద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బుధవారం భీకరగాలులు, భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో బయటకొచ్చి తిరుగుతున్న వ్యక్తి ఓ మీడియా రిపోర్టర్ కంటపడ్డాడు. దీంతో రిపోర్టర్ ఆ వ్యక్తిని ఇంత గాలులు వీస్తున్నాయ్, తుఫాన్ వస్తుంది. ఎందుకు బయటకొచ్చావ్ అని ప్రశ్నించాడు. దీనికి బదులుగా నువ్వు బయటకొచ్చావ్... నేను కూడా బయటకొచ్చా అని ఆ వ్యక్తి తిక్క సమాధనం ఇచ్చాడు. అప్పుడు రిపోర్టర్.. నేను వార్తలను కవర్ చేయడానికి వచ్చానని చెప్పాడు. ఇది విన్న ఆ వ్యక్తి..అవును మేము బయటకు రాకుంటే మరి మీరు ఎవరిని చూపిస్తారు. మీకు కనిపించడమే కోసమే వచ్చానని కొంటె సమాధనం ఇచ్చాడు. ఇక ఈ వీడియోను స్థానిక మీడియా సోషల్ మీడియాలో పంచుకుంది. సదరు వ్యక్తి చెప్పిన సరదా సమాధానం ప్రస్తుతం నెటిజన్లతో నవ్వూలు పూయిస్తోంది. కావాలంటే ఈ వీడియోను మీరూ చూడండి. Such a kind hearted man. Doing so much for the humanity. Respect. pic.twitter.com/SCB1zhA5SQ — Arun Bothra (@arunbothra) May 26, 2021 -
మరో వివాదంలో కమల్: వైరల్ పిక్
సాక్షి, చెన్నై: ప్రముఖ నటుడు మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) చీఫ్, కమల్ హాసన్‌ను మరో వివాదంలో ఇరుక్కున్నారు. పోలింగ్ రోజు (మంగళవారం) కమల్‌హాసన్ ఒక రిపోర్టర్‌పై దాడి చేశారంటూ ఆరోపణలు గుప్పుమన్నాయి. రిపోర్టర్‌ను కొట్టానికి ప్రయత్నించారంటూ కోయంబత్తూర్ ప్రెస్ క్లబ్ ఈ ఘటనను ఖండించింది. సోషల్ మీడియా వేదిక ఫేస్బుక్ పోస్ట్‌లో కమల్‌పై ఆరోపణలు గుప్పించింది. ఈ సందర్భంగా రిపోర్టర్‌ను కొట్టడానికి కమల్ తన వాకింగ్ స్టిక్ పైకి లేపిన చిత్రం వైరల్ అవుతోంది. దీంతో వివాదం రగిలింది. కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గంలోని ఒక పోలింగ్ కేంద్రం వద్ద చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కమల్ బహిరంగ క్షమాపణ చెప్పాలని ప్రెస్ క్లబ్ డిమాండ్ చేస్తోంది. వీడియోను చిత్రీకరించవద్దని డిమాండ్ చేస్తూ కమల్ అడ్డుకున్నాడని రిపోర్టర్‌ను తన వాకింగ్ స్టిక్ తో కొట్టడానికి ప్రయత్నించాడని క్లబ్ ఆరోపించింది. అదృష్టవశాత్తూ అతడు గాయపడకపోయినా, కర్ర అంచు అనుకోకుండా జర్నలిస్టు మెడకు తగిలి ఉంటేపరిస్థితి దారుణంగా ఉండేదని ఆరోపించింది. ఈ ఘటన తమను, తమ పాత్రికేయ బృందాన్ని షాక్‌కు గురి చేసిందని తెలిపింది. అంతేకాదు దీనికి చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని కూడా హెచ్చరించడం గమనార్హం. అటు న్యూస్ జర్నలిస్ట్ దాడి ఘటనను ఖండించిన కాంగ్రెస్ అభ్యర్థి మయూరా జయకుమార్, బీజేపీ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు వనాతి శ్రీనివాసన్ కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ ఆరోపణలపై అటు కమల్ గానీ, ఎంఎన్ఎం గానీ అధికారికంగా స్పందించాల్సి ఉంది. இன்று கோவையில் #SunTV செய்தியாளர் மோகனை, மக்கள் நீதி மைய தலைவர் #கமலஹாசன் தாக்கியதாக தகவல் அறிந்தேன் சம்பவத்தை கண்டிக்கின்றேன் உடனடியாக கமலஹாசன் நடந்த சம்பவத்திற்கு மன்னிப்பு கோர வேண்டும் pic.twitter.com/gRgvr5tOWu — Mayura Jayakumar (@MayuraSJ) April 7, 2021 இன்று காலை கோவை ஜிசிடி கல்லூரி வளாகத்தில் திரு கமலஹாசன் அவர்கள் சன் நியூஸ் பத்திரிக்கையாளர் திரு மோகன் அவர்களை தனது கைத்தடியால் தாக்கியதாக கேள்விப்பட்டேன். இது மிகவும் வருத்தத்தை அளிக்கின்றது. — Vanathi Srinivasan (@VanathiBJP) April 7, 2021 -
రిపోర్టర్ మైక్ లాక్కొని కుక్క పరుగో పరుగు..చివరికి
రష్యా: ఫీల్డ్‌లో రిపోర్టర్లకు ఒక్కోసారి చిత్ర విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. అటువంటి విచిత్ర పరిస్థితే రష్యాలోని ఓ రిపోర్టర్‌కు ఎదురైంది. లైవ్‌లో రిపోర్టింగ్ చేస్తుండగా పాపం కుక్క బిస్కేట్ అనుకుందో ఏమోగానీ, ఆమె చేతిలోని మైక్ లాక్కుని పరుగులు తీసింది. అయితే ఆ కెమెరామెన్.. రిపోర్టర్ తిప్పలు రికార్డ్ చేయడంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. వీడియోలో ఉన్నది మిర్ టీవీ వెదర్ రిపోర్టర్ నాడెజ్దా సెరెజ్కిన అంటూ వాతావరణ విశేషాలు చెప్పడానికి సిద్ధం అవుతుండగా ఇంతలో ఓ కుక్క ఆమె చేతుల్లోని మైక్రోఫోన్ లాక్కుంది. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామంతో ఆమె అవాక్కయింది. తేరుకునే లోగానే ఆ కుక్క మైక్‌ను నోట కరుచుకుని పరుగులు తీసింది. ఆ తరువాత ఆ రిపోర్టర్ కూడా ఆ కుక్కను వెనకాలే పరిగెత్తింది. చివరికి పట్టు వదలకుండా కుక్క నోట్లో నుంచి తిరిగి తన మైక్‌ను సాధించింది. అనంతరం ఈ వీడియోను ”రష్యాలో ఒక కుక్క రిపోర్టర్ చేతిలోని మైక్రోఫోన్ లాక్కుని పరుగులు తీసింది.” అని క్యాప్షన్‌తో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారి నెటిజన్లను నవ్విస్తోంది. ( చదవండి: భారతీయ టెక్కీలకు భారీ ఊరట ) A dog in Russia grabbed the reporter's microphone and ran away during a live broadcast pic.twitter.com/R1T8VZ5Kpt — Ali Özkök (@Ozkok_A) April 2, 2021 -
వైరల్: హెలికాప్టర్లో ఊరేగుతూ.. ‘బరాత్’
జైపూర్: ‘జుట్టు ఉన్నమ్మ ఏ కొప్పైనా పెడుతుంది’ అన్నట్లు డబ్బులుంటే చాలు ఎన్ని వేషాలు అయినా వేయవచ్చు. ఇప్పుడు చెప్పిన ఈ సామెత ఎక్కువగా వివాహాలకు వర్తిస్తుంది. ధనవంతుల ఇళ్లలో జరిగే పెళ్లి వేడుక చూస్తే.. ఈ సామెత గుర్తుకు వస్తుంది. వారి ఇంట పెళ్లి ఖర్చుతో కొన్ని కుటుంబాలు ఏళ్ల తరబడి సుఖంగా బతికేయగలవు. వాళ్ల డబ్బులు వాళ్ల ఇష్టం మనకెందుకు గానీ. ఇప్పుడు ఈ ధనవంతుల ముచ్చట ఎందుకంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరలవుతోంది. ‘హెలికాప్టర్ వెడ్డింగ్’ పేరుతో ట్రెండ్ అవుతోంది. ఓ జర్నలిస్ట్ దాన్ని రిపోర్టు చేయడం కొసమెరుపు. ఈట్రేండి వివాహ వేడుక వివరాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే.. రాజస్తాన్‌లోని షేఖావతిలో ఈ నయా వివాహ వేడుక చోటు చేసుకుంది. రతన్‌గఢ్ తహసీల్‌లో ఓ చిన్న గ్రామానికి చెందిన కోటీశ్వరుడు తన కుమారుడి కోరిక మేరకు ‘బరాత్’ వేడుక కోసం హెలికాప్టర్ని రంగంలోకి దించాడు. వివాహం పూర్తయిన వెంటనే కొత్త జంట బరాత్ వేడుక కోసం హెలికాప్టర్లో ఎక్కి ఊరేగింది. ఈ తతంగాన్ని రిపోర్ట్ చేయడం కోసం ఓ జర్నలిస్ట్‌ని కూడా నియమించుకున్నాడు సదరు పెళ్లి కుమారుడి తండ్రి. ఈ రిపోర్టర్ వివాహం జరగుతున్న చోట ఉన్న పరిస్థితులు.. వధువు రియాక్షన్.. వరుడి స్పందన తదితర వివరాల గురించి పూస గుచ్చినట్లు రిపోర్డ్ చేశాడు. ‘‘కుమారుడి సంతోషం కోసం ఓ తండ్రి చేసిన ప్రయత్నం’’ అనే కామెటంరీతో వీడియో ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. చదవండి: పైశాచిక వివాహం అంటే ఏంటో తెలుసా? వధువు జంప్..చెల్లిని పెళ్లాడిన వరుడు..ఇక్కడే ట్విస్ట్ -
మీడియా ముసుగులో హవాలా!
సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా కంచికచర్ల సమీపంలో ఇటీవల పోలీసులకు పట్టుబడిన రూ.50 లక్షల వ్యవహారంలో విస్తుగొలిపే విషయం బయటపడింది. మీడియా ముసుగులో కొందరు పెద్ద ఎత్తున హవాలా కార్యకలాపాలు సాగిస్తున్నట్టు తేలింది. వివరాలు.. ఈ నెల 20న విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తున్న గరుడ బస్సును కంచికచర్ల పోలీసులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విశాఖ పెందుర్తికి చెందిన మహా న్యూస్ చానల్ రిపోర్టర్ సూర్యనారాయణ వద్ద రూ.50 లక్షల బ్యాగ్‌ను పోలీసులు గుర్తించారు. నగదుకు సంబంధించి సరైన ఆధారాలు చూపించకపోవడంతో పోలీసులు పూచీకత్తు రాయించుకొని.. వదిలిపెట్టారు. అయితే అదే బస్సులో హైదరాబాద్‌లో మరో రూ.3 కోట్ల నగదు కూడా దొరికినట్టు ప్రచారం జరిగింది. విశాఖ నుంచి హైదరాబాద్‌కు బస్సులో ఇంత నగదు ఎందుకు తీసుకెళ్తున్నారు? అసలు ఆ మొత్తం వారికి ఎలా వచ్చింది? అనే కోణాల్లో పోలీసులు దృష్టి సారించేలోపే.. టీడీపీ మాజీ మంత్రులు రంగంలోకి దిగి సర్దుబాటు చేసుకున్నారనే ప్రచారం జరిగింది. ఈ విషయం కాస్త బయటకు పొక్కడంతో పోలీసులు దర్యాప్తును మళ్లీ పట్టాలెక్కించారు. దీనిపై ఆదాయ పన్ను శాఖ అధికారులకు కూడా సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన ఐటీ శాఖ.. దర్యాప్తు మొదలు పెట్టడంతో హవాలా కార్యకలాపాలు వెలుగు చూసినట్టు తెలిసింది. పట్టుబడిన రూ.50 లక్షలను విశాఖకు చెందిన ఒక రియల్టర్, బిల్డర్ ఇచ్చినట్టు చెబుతున్నారు. టీడీపీ హయాం నుంచి మీడియా ముసుగులో రూ.కోట్లకు పడగలెత్తిన మీడియా హౌస్ కీలక వ్యక్తి.. పెద్ద ఎత్తున హవాలా కార్యకలాపాలకు పాల్పడినట్టు ఐటీ అధికారులు గుర్తించారని సమాచారం. ఆ మీడియా హౌస్ కేంద్రంగా గత మూడేళ్లలో రూ.30 కోట్లకు పైగా సొమ్ము హవాలా రూపంలో చేతులు మారినట్టు తెలిసింది. టీడీపీకి చెందిన కీలక నేతలు, ఎమ్మెల్యేలకు ఇందులో ప్రమేయముందని, వారి అండతోనే హవాలా వ్యవహారాన్ని చక్కబెడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రాథమిక సమాచారంతో రంగంలోకి దిగిన ఐటీ శాఖ.. ఆ న్యూస్ చానల్ డైరెక్టర్స్‌పై కూడా నిఘా పెట్టింది. దీంతో వారిలో ఒకరు పరారీలో ఉన్నట్టు తెలిసింది. -
కిటికీలోంచి కారం చల్లి, పెట్రోల్‌తో దాడి
సాక్షి, జవహర్‌నగర్: మేడ్చల్ జిల్లా కాప్రా మండలం జవహర్‌నగర్ మున్సిపాలిటీలో అక్రమ కట్టడాల కూల్చివేతల్లో గురువారం ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించేందుకు వెళ్లిన కమిషనర్ మంగమ్మ, కాప్రా తహసీల్దార్ గౌతమ్‌కుమార్, జవహర్‌నగర్ ఠాణా సీఐ పి.భిక్షపతిరావును లక్ష్యంగా చేసుకుని కబ్జాదారులు రెచ్చిపోయారు. పెట్రోల్, కారం పొడితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సీఐ భిక్షపతి చేతులకు, కాళ్లకు మంటలు అంటుకున్నాయి. అలాగే కార్పొరేషన్ సిబ్బంది, జవహర్‌నగర్ ‘సాక్షి’ విలేకరి సురేందర్‌కు గాయాలయ్యాయి. చదవండి: భాగ్య పెళ్లి.. ప్రతి ఒక్కరినీ కదిలిచింది.. ఘటన నేపథ్యమిదీ.. జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నంబర్ 432లో 1,500 గజాల స్థలాన్ని మహిళల కోసం పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాలని 6 నెలల కింద అప్పటి కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ భూమిపై కన్నేసిన కబ్జాదారులు రాత్రికి రాత్రే గదులు నిర్మించడంతో ఎమ్మార్వో గౌతమ్‌కుమార్ నేతృత్వంలోని బృందం నేలమట్టం చేసింది. అప్పటినుంచి ఆ భూమిని తాత్కాలిక డంపింగ్ కేంద్రంగా మున్సిపల్ అధికారులు వాడుతున్నారు. అయినా కూడా జవహర్‌నగర్ వాసి పూనమ్ చంద్ కుటుంబం మళ్లీ రెండు గదులు నిర్మించి ఆ భూమిని దక్కించుకోవాలని ప్లాన్ చేశారు. అయితే వాసం వెంకటేశ్వర్లు స్థానంలో కలెక్టర్‌గా వచ్చిన శ్వేతా మహంతి ఆ భూమిలో మహిళల కోసం షీ టాయిలెట్స్ పనులు చేపట్టాలంటూ మళ్లీ ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారం రోజుల కింద ఇక్కడకు వచ్చిన కార్పొరేషన్ అధికారులను పూనమ్ చంద్ కుటుంబసభ్యులు చనిపోతామంటూ బెదిరించడంతో వెనుదిరిగారు. తీవ్ర ఉద్రిక్తత.. మళ్లీ గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో 20 నుంచి 30 మంది పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆ రెండు గదులను కూల్చేందుకు వచ్చారు. జేసీబీ యంత్రాలతో తొలగించేందుకు సిద్ధం అవుతుండగా పూనమ్ చంద్, శాంతి కుమారి ఆ గదిలోకి వెళ్లి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని గడియపెట్టుకున్నారు. ఇది గమనించిన ఎస్సై సైదులు, ఇతర సిబ్బంది అక్కడికి వెళ్లగా, గది కిటికీలోంచి కారం పొడి చల్లారు. కర్రలకు బట్టలుచుట్టి వాటిపై పెట్రోల్ పోసి నిప్పంటించి బయటకు విసిరారు. ఆ వెంటనే అక్కడికి చేరుకున్న స్థానిక రాజకీయ పార్టీ నేతలు పూనమ్ చంద్ కుటుంబసభ్యులకు మద్దతు పలికారు. ‘వారు చస్తారు. లేదంటే చంపుతారు’ అంటూ రెచ్చొగొట్టేలా నినాదాలు చేశారు. అప్పటికే సాయంత్రం 6.30 గంటలైంది. సీఐ భిక్షపతి నేతృత్వంలోని పోలీసులు అక్కడి నుంచి అందరినీ చెదరగొట్టారు. అయితే గది లోపల కాగడాల మంటలు ఉండటంతో పూనమ్ చంద్ కుటుంబసభ్యులకు ఏమైనా అవుతుందని సీఐ తలుపులను కాళ్లతో తన్నారు. వెంటనే ఆ గదిలో ఉన్న శాంతి కుమారి నేరుగా పెట్రోల్ చల్లడంతో సీఐ భిక్షపతిపై పడింది. కుట్ర కోణంలో విచారణ: రాచకొండ సీపీ గదిలో నుంచి పొగలు వస్తున్నాయని సీఐ భిక్షపతి తలుపు తెరిచేందుకు యత్నించాడు. తలుపు తెరుచుకున్న వెంటనే లోపలి నుంచి మంటలు వచ్చాయి. ఎవరైనా అతడి మీద దాడి చేశారా.. అనేది పోలీసు విచారణలో తేలుతుంది. ఈ ఘటనలో కుట్ర కోణంతో పాటు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం. గదిలో ఉన్న శాంతికుమారి, పూనమ్‌చంద్‌లకు ఏమీ జరగలేదు. కేసు విచారణ కోసం వారిని అదుపులోకి తీసుకున్నాం. సీఐ భిక్షపతికి చేతులు, కాళ్లు 14 నుంచి 15 శాతం వరకు కాలాయి. – రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ -
హైదరాబాద్‌లో సాక్షి ప్రతినిధులపై దాడి
సాక్షి, హైదరాబాద్: హయత్‌నగర్‌లో కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డి అనుచరులు సాక్షి ప్రతినిధులపై దాడికి పాల్పడ్డారు. కార్పొరేటర్ సామ తిరుమల్‌రెడ్డి తమ ప్లాట్‌ను కబ్జా చేశారని నల్లగొండకు చెందిన ఓ కుటుంబం ఆదివారం ధర్నా నిర్వహించింది. ఆయన ప్రచార రథాన్ని బాధిత కుటుంబం అడ్డుకుంది. కవర్ చేసేందుకు వెళ్లిన సాక్షి ప్రతినిధులపై సామ తిరుమల్‌రెడ్డి అనుచరులు దాడి చేశారు. సాక్షి రిపోర్టర్ ఫోన్‌ను ధ్వంసం చేసి దౌర్జన్యానికి పాల్పడ్డారు. -
వైరల్: లైవ్‌లో రిపోర్టర్; ఫోన్ ఎత్తుకెళ్లిన దొంగ
అర్జెంటినా: అర్జెంటినాలో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. ప్రత్యక్ష ప్రసారం అందిస్తున్న రిపోర్టర్ సెల్‌ఫోన్‌ను దొంగలించిన వీడియోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వీపరితంగా వైరల్ అవుతోంది. డియోగో డెమార్కో సరండి నగరం నుంచి లైవ్ న్యూస్ అందించేందుకు సిద్దంగా ఉన్న రిపోర్టర్ ఫోన్‌ను ఓ వ్యక్తి అకస్మాత్తుగా లాక్కుని పారిపోతున్న వీడియో అదే లైవ్ కెమెరాలో రికార్డు అయ్యింది. దీంతో ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. అక్కడి స్థానిక న్యూస్ ఛానల్లో రిపోర్టర్‌గా పని చేస్తున్న డెమార్కోను మంగళవారం న్యూస్ స్టేషన్ నుంచి యాంకర్ రిపోర్టింగ్ ఇవ్వాల్సిందిగా చెప్పారు. దీంతో అతడు లైవ్ న్యూస్ అందించేందుకు సిద్దంగా ఉన్న రోలింగ్ కెమారాతో మాట్లాడబోతుండగా ఆకస్మాత్తుగా దొంగ వచ్చి అతడి చేతిలో ఉన్న సెల్ ఫోన్ లాక్కెల్లాడు. (చదవండి: వైరల్ వీడియో.. 60 గుడ్లతో ఆమ్లెట్) వెంటనే రిపోర్టర్ లైవ్ వదిలేసి దొంగ వెనక పరుగెత్తాడు. ‘నా ఫోన్ దొంగించాడు.. ఫోన్ ఇచ్చేయ్’ అంటూ స్పానిష్‌లో అరుస్తూ దొంగ వెనక పరుగెత్తాడు. అయితే అదృష్టవాత్తు ఆ స్థానికులు సహాయంతో రిపోర్టర్ తన ఫోన్‌ను తిరిగి పొందాడు. ఆ దొంగ స్థానికుడే కావడంతో రిపోర్టర్‌కు అక్కడి ప్రజలు దొంగ ఆచూకి తెలిపారు. దీంతో కాసేపటికే తన ఫొన్ తిరిగి పొందడంపై రిపోర్టర్ ఆనందం వ్యక్తం చేశాడు. ‘అదృష్టవశాత్తు నా ఫోన్ నాకు దొరికిందని, ఇందుకు తాను కృతజ్ఞుతుడి అని పేర్కొన్నాడు. అయితే తను దొంగను పట్టించాలనుకోవడం లేదని, ఫోన్ దొరికితే చాలు అని చాలు అనుకునకున్నానని చెప్పాడు. (చదవండి: ఒళ్లంతా తేనెటీగలతో.. షాకింగ్ వీడియో) -
రిపోర్టర్ కిడ్నాప్ కేసులో ఆసక్తికర విషయాలు
హైదరాబాద్ : యూట్యూబ్ రిపోర్టర్ కిడ్నాప్ కేసులో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. గతకొంత కాలంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తులతో రిపోర్టర్లు మిలాఖతైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బియ్యం తరలిస్తున్న వారిని బెదిరించి బంధించడంతోనే అజ్మత్ను కిడ్నాప్ చేసినట్లు సమాచారం. గురువారం మహ్మద్ ఇక్బాల్ దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. సీఐ వెంకటేశం తెలిపిన వివరాల ప్రకారం.. మహ్మద్ ఇక్బాల్, అతని స్నేహితులు అప్ఫర్, నయీమ్, తౌఫిక్, ఆసిఫ్, జబ్బర్, ఫయాజ్‌లు గత కాలంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి కర్నాటకలో అధిక ధరలకు విక్రయిస్తుండేవారు. (తీన్మార్ మల్లన్న హద్దులు దాటాడు..) ఇదే తరహాలో ఈ నెల 5న అఫ్సర్ తన డ్రైవర్ సిరాజ్‌తో కలిసి రోడామేస్ట్రీనగర్, జీడిమెట్లల్లో కొనుగోలు చేసిన బియ్యాన్ని ఆటోలో తరలిస్తుండగా అక్కడికి చేరుకున్న యూట్యూబ్ రిపోర్టర్లు సలీమ్, అజ్మత్, అజర్, పర్వీజ్ అహ్మద్ లతో పాటు మరికొంత మంది ఆటోను అటకాయించారు. తమకు డబ్బులు ఇవ్వకుంటలే పోలీసులకు పట్టిస్తామని బెదిరించి ఇక్బార్ బావ ఇమ్రాన్ నుంచి రూ. 15 వేలు వసూలు చేశారు. అంతే కాక తమకు నెలనెలా రూ. 1 లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేరోజు రాత్రి 10 గంటలకు బియ్యాన్ని తరలిస్తుండగా అక్కడికి చేరుకున్న అజ్మత్, సమీర్, సలీం, అజార్, నవీన్, శ్రీకాంత్‌లు అడ్డుకుని ఆటోలో ఉన్న సిరాజ్, హర్షద్‌లను గదిలో బంధించారు. ఆపై రూ.1 లక్ష ఇస్తేనే ఆటోను వదులుతామని బేరం పెట్టారు. వారిని విడిపించుకునేందుకు సలీం, అజ్మత్‌లు చెప్పిన కైసర్‌నగర్ చౌరస్తాకు ఇన్నోవా లో అక్కడికి చేరుకోగా యూట్యూబ్ రిపోర్టర్లు పారిపోయే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అజ్మత్ దొరకడంతో అతన్ని తాండూరుకు తీసుకెళ్లి మరోసటి రోజు వదిలిపెట్టారు. ఈ మేరకు ఇక్బాల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని కేసులు.. యూట్యూబ్ రిపోర్టర్లు అజ్మత్, సలీం, అజార్, నవీన్, శ్రీకాంత్, సమీర్, ఖయ్యూమ్‌లపై గతంలో కూడా పలువురు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఎక్కడైనా కొత్త నిర్మాణం చేపట్టినా, బోరు వేసినా వెళ్లి బెదిరించడం, అందిన కాడికి దండుకోవడం పనిగా పెట్టుకున్నారు. దీంతో ఆ దిశగా కూడా పోలీసులు వీరి ఆగడాలపై దర్యాప్తు చేపట్టారు. -
వైరల్: రిపోర్టర్‌కు కరోనా పేషెంట్ ఝలక్
-
చావు కబురు చల్లగా చెప్పాడు..
ఇస్లామాబాద్ : జన సమూహం ఉన్నచోట పొరపాటున తుమ్మినా అందరూ మనవైపే అనుమానంతో కళ్లు పెద్దవి చేసి చూస్తారు. ఆస్పత్రికిగానీ వెళ్లామంటే పక్కా కరోనానే అని ఫిక్సయిపోయి పలకరింపు కాదు కదా.. దరిదాపుల్లో కూడా కనిపించరు. అలాంటిది కోవిడ్ పేషెంట్ మీ దగ్గరకు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది? అది కూడా మాస్కు పెట్టుకోకుండా, భౌతిక దూరం పాటించకుండా! ఇంకేముందీ.. పై ప్రాణం పైనే పోతుంది. ఇలాంటి షాకింగ్ ఘటన పాకిస్తాన్‌లోని పెషావర్‌లో జరిగింది. స్థానిక న్యూస్ ఛానల్ రిపోర్టర్ పెషావర్‌లో పెట్రోల్ సంక్షోభం గురించి క్షేత్ర స్థాయిలో వివరిస్తూ ఉన్నాడు. ముఖానికి మాస్కు ఉన్నప్పటికీ కర్మకాలి దాన్ని కిందికి లాగి నేరుగా మాట్లాడుతున్నాడు. "చాలా చోట్ల పెట్రోల్ దొరకడం లేదు. ఉన్న కొద్ది పెట్రోల్ బంకుల్లో బారెడంత క్యూ ఉంది" అని చెప్పుకొస్తున్నాడు. (ప్రేయసి కోసం పాకిస్తాన్‌కు..!) అనంతరం అక్కడున్న ఓ వ్యక్తికి మైక్ అందించి తాజా పరిస్థితి గురించి చెప్పమన్నాడు. వెంటనే అతను 'అవును, ఇక్కడ పెట్రోలే దొరకట్లేదు' అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత 'నాకు కరోనా ఉంది. ఆస్పత్రికి వెళ్తున్నా' అని చావు కబురు చల్లగా చెప్పాడు. ఒక్క క్షణం ఆ జర్నలిస్టు గుండె ఆగి పోయినట్లు అనిపించింది. పైగా సదరు కరోనా పేషెంట్ కూడా ఫేస్ మాస్కు ధరించకపోవడం ఇక్కడ మరింత విషాదం. ఈ వీడియో క్లిప్పింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఓవైపు తన్నుకొస్తున్న నవ్వును ఆపుకుంటూనే నెటిజన్లు.. పాపం రిపోర్టర్ అంటూ సానుభూతి కురిపిస్తున్నారు. కొందరేమో నిర్లక్ష్య కరోనా పేషెంట్‌పై మండిపడుతున్నారు. (వైరల్: గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేయడానికి వెళ్తూ..) -
రిపోర్టర్ ఇంట్లో మద్యం పట్టివేత
-
‘సాక్షి’ విలేకరి మృతి
కోవెలకుంట్ల: కర్నూలు జిల్లా సంజామల మండలం ‘సాక్షి’ విలేకరి కుమ్మరి వెంకటేశ్వర్లు (45) గురువారం మృతి చెందారు. ఐదు రోజుల క్రితం పక్షవాతం రావడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నంద్యాలలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు తీసుకెళ్లారు. మంగళవారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో కోమాలోకి వెళ్లిన వెంకటేశ్వర్లు చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. వెంకటేశ్వర్లు గత 20 ఏళ్లుగా వివిధ పత్రికల్లోనూ, ‘సాక్షి’ ఎలక్ట్రానిక్ మీడియాలోనూ పనిచేశారు. 2014 నుంచి ‘సాక్షి’ సంజామల మండల విలేకరిగా పనిచేస్తున్నారు. ఐదేళ్లుగా ఏపీయూడబ్ల్యూజే బనగానపల్లె నియోజకవర్గ అధ్యక్షుడిగా కొనసాగుతూ యూనియన్ తరఫున జర్నలిస్టుల సంక్షేమానికి పాటు పడ్డారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కాగా మృతుని భార్య ఆరేళ్ల క్రితం మరణించింది. విలేకరి మృతి పట్ల వివిధ జర్నలిస్ట్ సంఘాల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. -
ఆంధ్రజ్యోతి రిపోర్టర్ ఇంట్లో మద్యం పట్టివేత
సాక్షి, అనంతపురం : కళ్యాణదుర్గంలో ఎక్సైజ్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ శంకర్ నాయక్ ఇంట్లో భారీగా మద్యం బయటపడింది. అతడి ఇంటి నుంచి 368 బాటిళ్ల కర్ణాటక మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రజ్యోతి విలేకరి శంకర్ నాయక్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. కాగా లాక్డౌన్ సమయంలోనూ అక్రమంగా మద్యం విక్రయించినట్లు శంకర్ నాయక్‌పై పలు ఆరోపణలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. (ఆంధ్రజ్యోతి వాహనం సీజ్) -
ప్యాంట్స్ లేకుండా లైవ్ రిపోర్టింగ్..
లాక్డౌన్ కారణంగా వర్క్‌ఫ్రమ్ హోమ్ చేస్తున్న కొందరు ఇంటి దగ్గరనుంచి పని చేయటమే కాదు.. అప్పుడప్పుడు తప్పులు చేసి, నవ్వులు కూడా పూయిస్తున్నారు. తాజాగా ఓ యాంకర్ వర్క్‌ఫ్రమ్ హోం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లైవ్‌లోకి వచ్చిన అతను ప్యాంట్స్ వేసుకోకపోవటంతో న్యూస్ ప్రోగ్రామ్ కాస్తా.. కామెడీ ప్రోగ్రాంగా మారింది. వివరాలు.. ఏబీసీ న్యూస్‌లో పని చేసే రీవ్ అనే న్యూస్ రిపోర్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. కొద్దిరోజులక్రితం లైవ్ ఇవ్వటానికి కెమెరా ముందుకు వచ్చి కూర్చున్నాడు. ప్రేక్షకులను విష్ చేసి వార్తలు చదవటం మొదలుపెట్టాడు. అయితే సూట్ వేసుకున్న రీవ్, దాని కింద ప్యాంట్స్ వేసుకోలేదు. ( వైరల్: ఈ మెసేజ్ చదవాలంటే మీ ఫోన్‌ను.. ) దీంతో ఈ కార్యక్రమాన్ని లైవ్ చూసిన వాళ్లలో కొందరు ఇందుకు సంబంధించిన వీడియోలను, స్ర్కీన్ షాట్లను సోషల్ మీడియాలో వైరల్ చేసేశారు. అంతేకాకుండా దీనిపై సందిస్తున్న కొందరు నెటిజన్లు.. ‘‘ చక్కనైన గది.. చక్కనైన నిక్కరు.. వాడు రిపోర్టర్రా బుజ్జీ..’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి : ( ఆన్లైన్ పెళ్లి; ఫోన్‌కు తాళి కట్టాడు ) -
దుల్కర్ సల్మాన్‌పై రిపోర్టర్ ఆగ్రహం
అనుమతి లేకుండా తన ఫోటోలు ఎలా ఉపయోగించారంటూ చిత్రబృందంపై ఓ మహిళా రిపోర్టర్ ఫైర్ అయ్యింది. సినిమా నుంచి తన ఫొటోను తొలగించాలని లేదా బ్లర్ చేయాలని హీరో దుల్కర్ సల్మాన్, దర్శకుడిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. వివరాల్లోకి వెళితే.. హీరో దుల్కర్ సల్మాన్ నటించిన `వారనె అవశ్యముండ్` సినిమాలో బరువు తగ్గించే ఓ క్లినిక్ పై సదరు మహిళా రిపోర్టర్ చేతన ఫోటోలను ఉపయోగించారు చిత్రబృందం. దీంతో ఫైర్ అయిన ఆమె అనుమతి లేకుండా బాడీ షేమింగ్ గురించి తన ఫోటోలు ఎలా ముద్రించారంటూ ఫైర్ అయ్యింది. దీంతో దుల్కర్ సల్మాన్ వెంటనే స్పందించాడు. `దీనికి మేం పూర్తి బాధ్యత వహిస్తున్నాం. ఇది ఎలా జరిగిందో నేను తెలుసుకుంటాను. మీ ఫొటోను ఎక్కడి నుంచి తీసుకొచ్చారో కనుక్కుంటాను. నా తరఫున, మా చిత్రబృందం తరఫున నేను క్షమాపణలు చెబతున్నాను` అంటూ దుల్కర్ రిప్లై ఇచ్చాడు. దర్శకుడు కూడా చేతనకు క్షమాపణలు చెప్పాడు. వెంటనే తగిన చర్యలు తీసుకుంటానని తెలిపాడు. ఇంత త్వరగా రియాక్ట్ అయ్యి క్షమాపణలు చెప్పినందుకు దన్యవాదాలు. డైరెక్టర్‌తో మాట్లాడాను. సమస్య పరిష్కారం అయ్యిందని చేతన పేర్కొన్నారు. దుల్కర్ సల్మాన్ మొట్టమొదటగా నిర్మించిన వారణే అవశ్యామున్ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను సాధించింది. ఈ చిత్రంలో ఈ చిత్రంలో సురేష్ గోపి, శోభన, కళ్యాణి ప్రియదర్శన్ ముఖ్య పాత్రలు పోషించారు. We take full responsibility for the error on our behalf. Will look into it with concerned departments of the film to understand how the images were sourced. I apologise from my end and from the film as well as @DQsWayfarerFilm for any difficulties caused. It wasnt intentional. — dulquer salmaan (@dulQuer) April 20, 2020 -
అనారోగ్యంతో సాక్షి విలేకరి మృతి
దిల్సుఖ్నగర్: అనారోగ్యంతో సీనియర్ విలేకరి పాలకూర జగన్(జంగయ్య) బుధవారం రాత్రి మృతి చెందాడు. సాక్షి దినపత్రికలో పది సంవత్సరాలుగా సైదాబాద్ కంట్రిబ్యూటర్‌గా పనిచేస్తున్నారు. ఇతనికి భార్య, కుమారుడు ఉన్నారు. జగన్ స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం. జగన్ మృతి పట్ల మలక్‌పేట నియోజకవర్గ ఎమ్మెల్యే అహ్మద్ బలాల, కార్పొరేటర్లు స్వర్ణలత రెడ్డి, సామ స్వప్నరెడ్డిలతో పాటు వివిధ పార్టీల నేతలు, జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు. -
మెడలో పాముతో మహిళ రిపోర్టింగ్
-
సాహసం: మెడలో పాముతో రిపోర్టింగ్
ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళా జర్నలిస్టు ఎంతో వినూత్నంగా రిపోర్టింగ్ చేశారు. పాముల భద్రత, విష సర్పాల నుంచి మనం ఎలా కాపాడుకోవాలన్న అంశాలపై అవగాహన కల్పించాలని ఆమె భావించారు. అందుకు అనుగుణంగా ఆమె ఓ పామును మెడలో వేసుకుని రిపోర్టింగ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. రిపోర్టింగ్ చేస్తున్న సందర్భంలో పాము ఒక్కసారిగా బుసలు కొట్టింది. పాము రిపోర్టర్ చేతిలోని మైక్‌ను మూడు స్తార్లు కాటు వేసింది. పాము తన కోరలతో మైక్‌ను కాటు వేస్తుంటే ఏం జరుగుతుందోనని ఆందోళన కలిగిందని రిపోర్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆ రిపోర్టర్ ఆ సమయంలో పడిన భయాన్ని తెలుపుతూ.. నేను పట్టుకున్న మైకుపై పాము కాటువేయగానే భయంతో వణికిపోయానని తెలిపారు. బుస్ బుస్ మంటూ ఆ పాము చేసిన శబ్ధానికి ఎంతో భయపడ్డానని పేర్కొన్నారు. ఒక వేళ పాము తన చేతిపై కాటు వేస్తే ఏం జరిగేదోనని ఆందోళన చెందానని తెలిపారు. ఈ సాహసంపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. భయపడుతూ మెడలో వేసుకోవడం దేనికంటూ కొందరు కామెంట్లు పెడుతుంటే మరికొందరు ప్రజల అవగాహన కోసం సాహసం చేసిన రిపోర్టర్‌కు అభినందనలు తెలిపారు. -
కొందరికి ఇలాగ కూడా సాయం చేయొచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ : కొందరికి ఎక్కడి నుంచి ఎప్పుడు ఎలా మేలు జరుగుతుందో తెలియదు, ఊహించలేము కూడా. ఇంగ్లండ్‌లోని ‘నెట్వర్క్ టెన్’ టీవీలో రిపోర్టర్‌గా పనిచేస్తున్న అంటాయినెట్ లత్తాఫ్ను అనూహ్యంగా అలాంటి మేలే జరిగింది. గత శుక్రవారం ఆమె టీవీలో ఏదో కార్యక్రమం గురించి మాట్లాడుతున్నారు. అప్పుడు ఆమె గొంతు వద్ద తిత్తిలాగా ఉబ్బుగా కనిపించింది. దీన్ని గమనించిన వెండీ మాక్కాయ్ అనే ప్రేక్షకుడు వెంటనే ఆమెకు ఓ సందేశం పింపించారు. ‘మీ గొంతు కింద తిత్తిలాగా కనిపిస్తోంది. వెంటనే వైద్యుడికి చూపించండి, లేకపోతే ప్రమాదం’ ఆ సందేశం సారాంశం. లత్తాఫ్, తమ వంశంలో ‘థైరాడ్ క్యాన్సర్’ ఉండడంతో ఆస్పత్రికి వెళ్లి వైద్యులకు చూపించారు. మూడు రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్లు చేసి వైద్యులు ఆమెకు ‘థైరోగ్లాసల్ డక్ట్ సిస్ట్’ ఉన్నట్లు ధ్రువీకరించారు. స్వర పేటికపై నుండే థైరాడ్ గ్రంధిలో అదనపు కణాలు పెరిగి రావడం వల్ల ఈ తిత్తి ఏర్పడుతుందని, అది క్రమంగా పెరగడం వల్ల శ్వాస సరిగ్గా ఆడదని, సరిగ్గా తినదీయదని, మాటలు సరిగ్గా రావని వైద్యులు చెప్పారు. వారి సలహా మేరకు లత్తాఫ్కు ఆమె శస్త్ర చికిత్స చేసి ఆ తిత్తిని తీసివేశారు. ఇద్దరు పిల్లలు భర్త ఉన్న ఇప్పుడు ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. ‘నా పట్ల శ్రద్ధ చూపించి నా జబ్బును ముందుగా కనుక్కొని సకాలంలో తెలియజేసినందుకు ధన్యవాదాలు’ అంటూ విక్టోరియా ప్రాంతంలో నివసిస్తున్న వెండీకి ఆమె సందేశం పంపించారు. ‘మీరు వైద్యులా, ఎలా కనిపెట్టారు?’ సోషల్ మీడియా వెండీపై ప్రశ్నలు, ప్రశంసలు కురిపించింది. ‘అబ్బే! నేను డాక్టర్‌ను కాను, నా స్నేహితుల్లో ఒకరికి ఇలాగే ఉంది. అది క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందని గ్రహించి స్పందించానంతే!’ వెండీ తెలిపారు. -
‘అతను మాట్లాడి ఉంటే.. నీ తిక్క కుదిరేది’
అప్పుడుప్పుడు టీవీ చానెళ్లలో రిపోర్టర్లు వేసే అతి వేషాలు ప్రేక్షలకు విసుగు తెప్పిస్తుంటాయి. కొన్ని సార్లు రిపోర్టర్లు ఎక్కడ ఉన్నాం, దేని గురించి మాట్లాడుతున్నామో కనీస అవగాహన లేకుండా అలా వాగుతూనే ఉంటారు. ప్రసుత్తం ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది పాత వీడియోనే కానీ మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ.. నవ్వులు పూయిస్తోంది. అమెరికాకు చెందిన కేటీఎల్ఏ న్యూస్ స్టేషన్‌కు చెందిన ఓ రిపోర్టర్.. ఓ సంఘటన గురించి రిపోర్ట్ చేస్తూ.. చేసిన వ్యాఖ్యలు కోపంతో పాటు నవ్వు తెప్పిస్తాయి. ఈ వీడియోలో సదరు రిపోర్టర్ మాట్లాడుతూ.. ‘చనిపోయిన వ్యక్తిని మేం కలుసుకున్నాం. కాకపోతే ప్రస్తుతం దీనిపై స్పందించడానికి అతను అందుబాటులో లేడు.. త్వరలోనే మరిన్ని వివరాలతో మిమ్మల్ని కలుసుకుంటాను’ అంటూ రిపోర్టింగ్ చేసింది. When I say I nearly passed out from laughing... pic.twitter.com/TJgpLocqrL — Yashar Ali 🐘 (@yashar) September 16, 2019 ఈ వీడియో చేసిన జనాలు.. ‘నీ తెలివి తెల్లారినట్లే ఉంది.. చనిపోయిన వ్యక్తి ఎలా స్పందిస్తాడు’.. ‘ఒక్కసారి అతడు లేచి మాట్లాడాల్సి ఉండేది.. అప్పుడు నీ రోగం కుదిరేది’.. ‘రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదవడం తప్ప వీరు సొంతంగా ఆలోచించలేరు’ అంటూ కామెంట్ చేస్తున్నారు జనాలు. -
సాక్షి ప్రతినిధిపై రవిప్రకాశ్ అనుచరులు దౌర్జన్యం
-
ఇంతింతై వనితింతై
మనిషికి రెండు చేతులు ఉన్నట్లే..ప్రతి మనిషి జీవితానికీ రెండు చేతులు ఉంటాయి.ఒకటి నిలబెట్టే హ్యాండ్.ఇంకోటి పడగొట్టే హ్యాండ్. కట్నం వేధింపులు.. భర్త మరణం..ఆడపిల్లకు జన్మనివ్వడం.. శివదేవి లైఫ్‌లో అన్నీ పడగొట్టే హ్యాండ్సే! అయినా ఆమె నిలబడింది. ఇంతింతై.. వనితింతై అన్నట్లు ఎదిగింది.ఏమీ మిగల్చని జీవితంలోంచి...చుట్టూ ఉన్న బతుకుల్ని తన అక్షరాలతో దిద్దేంతగా ఎదిగింది! శివదేవి.. ఉత్తరప్రదేశ్, బందా జిల్లాలో ఇప్పుడు అందరికీ తెలిసిన పేరు. ఓ దశాబ్దం కిందట శివదేవి తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేసి అత్తింటికి పంపించారు. అప్పుడు వాళ్లు అనుకున్నది చక్కటి వియ్యం అందుకున్నామని. అయితే కూతురి అత్తింటి వారు మాత్రం కయ్యానికి కాలు దువ్వారు! ఇంకా పెళ్లి పీటల మీద ఉండగనే కట్నం చాల్లేదంటూ గొంతెమ్మ కోరికలతో కొత్త కోడలిని హడలెత్తించారు. కయ్యాల మధ్యనే వియ్యాల వారింట్లో కూతుర్ని వదిలి పెట్టారు శివదేవి తల్లిదండ్రులు. కాపురం కష్టాలమయం అని తెలుస్తున్నప్పటికీ పుట్టింటివాళ్లకు భారం కాకూడదని కాలం నెట్టుకొచ్చింది శివదేవి. ఈ కష్టాలు చాలవన్నట్లు ఆమె భర్త అనారోగ్యంతో హఠాత్తుగా మరణించాడు. అప్పటికామె నిండు గర్భిణి. ‘అమ్మగారు అడుగు పెట్టింది.. ఇలా జరిగింది’ అనే దెప్పిపొడుపుల మధ్య పాపాయికి జన్మనిచ్చింది. అసలే డబ్బు పిచ్చి పట్టి ఉన్న అత్తగారిల్లు. ఆ ఇంట్లో సంపాదించే వ్యక్తి పోయాడు. పైగా పుట్టింది ఆడపిల్ల. ఒక నిస్సహాయురాలైన మహిళకు ఇంతకంటే నరకం ఇంకేం కావాలి? శివదేవిది అదే పరిస్థితి. భవిష్యత్తు అర్థం కావడం లేదు. ఏదో ఒకటి చేయకపోతే బతకలేనని మాత్రం తెలుస్తోంది. పోతే అటే పో... ఇక రాకు! ఆదివాసీ, దళిత మహిళలకు వృత్తివిద్యలో శిక్షణనిస్తారని తెలుసుకుంది శివదేవి. అది ఆరు నెలల కోర్సు, ఆ కోర్సులో చేరి చదువుకుంటానని అత్తగారిని అడిగింది. ‘చదువు, శిక్షణ అంటూ వెళ్లాలనుకుంటే... వెళ్లు. ఇక తిరిగి ఈ ఇంట్లో అడుగు పెట్టకు’ అని కసిరింది అత్త. ఇంట్లోనే ఉండడమా, ట్రైనింగ్‌కి వెళ్లడమా అనే సందిగ్ధం నుంచి శివదేవి త్వరగానే బయటపడింది. అప్పటికే ఇంట్లో ఓ సారి ఆమె మీద హత్యాప్రయత్నం జరిగింది. ఆ రోజు... తాను తినాల్సిన భోజనం విషపూరితమైంది. అప్పటికి ఇంట్లో అందరూ భోజనం చేశారు. ఆ రోజు భోజనం ఎందుకు విషపూరితమైందో ఆ భగవంతుడికే తెలుసు. తాను ఆ రోజు ఆ భోజనం తినకపోవడానికి కారణమూ ఆ దైవలీల మాత్రమే. పూజ చేసుకున్నాను, వాయనం తీసుకోమంటూ పక్కింటి వాళ్ల కోడలు పిలిచింది. ఆ రోజు అక్కడే భోజనం చేసింది తాను. తాను పక్కింట్లో భోజనం చేసినట్లు తెలిసిన తరవాత తన భోజనాన్ని అత్త రహస్యంగా పారవేయడమూ కంటపడింది. దానిని తిన్న ఇంటి పిల్లి మరణించడం కూడా. ఆ సంఘటన కళ్ల ముందు మెదలగానే శివదేవి ఒక నిర్ణయానికి వచ్చేసింది. తనకు, తన బిడ్డకు ఆ ఇంట్లో రక్షణ లేదు. రక్షణ ఇవ్వలేని ఇంటికోసం ప్రాణాలను ఫణంగా పెట్టాల్సిన అవసరం లేదనుకుందామె. తన పుట్టింటి వాళ్లను ‘ఆ ఆరు నెలలు పాపాయిని దగ్గర ఉంచుకుంటే, నేను ఆరు నెలల పాటు ట్రైనింగ్‌కి వెళ్తాను. ఆ తర్వాత నా జీవితానికి ఒక దారి ఏర్పరుచుకుంటాను. నా కాళ్ల మీద నేను నిలబడతాను’ అని అడిగింది. కూతుర్ని ఆ రొంపిలో నుంచి ఎలా బయటకు తీసుకు రావాలో తెలియక ఆవేదనతో నలిగిపోతున్న శివదేవి తల్లిదండ్రులు, ఆమె బిడ్డను చేతుల్లోకి తీసుకున్నారు. రిపోర్టర్‌గా ఉద్యోగం! ఆరు నెలల శిక్షణలో శివదేవికి తన మీద తనకు నమ్మకం వచ్చింది. ఎప్పుడో స్కూల్లో చదివి మర్చిపోయిన అక్షరాలను మళ్లీ పరిచయం చేసుకుంది. కోర్సు పూర్తయింది. చదవడం, రాయడంలో పట్టు వచ్చింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో తెలియదు. బతుకు పోరాటం ఎక్కడ నుంచి మొదలు పెట్టాలో తెలియడం లేదామెకి. తన ఫ్రెండ్ అనసూయ సలహా ప్రకారం ‘ఖబర్ లహరియా’ పత్రిక ఆఫీసుకు వెళ్లింది. బుందేలీ భాషలో ప్రచురితమవుతుంది. అణగారిన వర్గాల మహిళల సమస్యలకు అద్దం పట్టే పత్రిక అది. అభ్యుదయ భావజాలం కలిగిన మహిళల బృందం ఆ పత్రిక నడుపుతున్నది. శివదేవితో మాట్లాడిన తర్వాత ఆమె పుస్తకాల చదువుకంటే లోకాన్ని, మహిళల కష్టాలను బాగా చదివిందని అర్థమైంది పత్రిక నిర్వహకులకు. పెద్ద పెద్ద పుస్తకాలు చదవకపోయినప్పటికీ ఆమె పితృస్వామ్య,పెట్టుబడిదారీ సమాజాన్ని కళ్లకు కట్టినట్లు చెప్పగలుగుతోంది. ఆమె చూసిన జీవితాలను, వాళ్ల స్థితిగతులను రిపోర్ట్ చేస్తే చాలనుకున్నారు ఖబర్ లహరియా నిర్వహకులు. ఆమెకు రిపోర్టర్‌గా ఉద్యోగం ఇచ్చారు. రాళ్లు రప్పల మధ్య ప్రయాణం శివదేవి రిపోర్ట్ చేయాల్సిన సంఘటనలన్నీ గ్రామీణ ఉత్తరప్రదేశ్‌లోనే ఉంటాయి. దారి డొంక లేని, బస్సు ముఖం చూడని మారుమూల గ్రామాలకు వెళ్లాలి. నోట్ ప్యాడ్, పెన్ను ఉన్న బ్యాగ్, తలకు స్కార్ఫ్ చుట్టుకుని సైకిల్‌మీద వెళ్తుంటే దళిత వాడలు ఆశ్చర్యంగా చూశాయామెను. ఈ సంగతి ఆ నోటా ఈ నోటా అత్తగారింటికి చేరింది. వాళ్ల అసహనం హద్దులు దాటింది. కానీ ఆమె మీద దాడి చేయడానికి.. ఇప్పుడామె ఉన్నది తమింటి నాలుగ్గోడల మధ్య కాదు. అప్పటి నిస్సహాయ బేల కాదు. ఆమెను నిలువరించడం తమకు సాధ్యమయ్యే పని కాదని పళ్ల బిగువున భరించారు. ఇన్నింటినీ చూస్తూ తాను నిర్ణయించుకున్న దారిలో కొనసాగింది శివదేవి. రాళ్లు రప్పలతో నిండి ఉన్నది శివదేవి ఉద్యోగ ప్రయాణం మాత్రమే కాదు, ఆమె జీవిత ప్రయాణం కూడా. గ్రామాల్లో సాగుతున్న ఇసుక మాఫియా, బడి లేని గ్రామాలు, బస్సు లేని జనావాసాలు, మహిళల మీద దాడులు, అత్తింటి ఆరళ్లు.. అన్నింటినీ రిపోర్టు చేసింది. ఇవన్నీ ఒక ఎత్తయితే... 2014 లోక్‌సభ ఎన్నికలు ఆమె ఎదుర్కొన్న అతి పెద్ద సవాల్. పోలీసులు నవ్వారు ఐదేళ్ల కిందటి లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఆమె గ్రామాల్లో విస్తృతంగా పర్యటించింది. దళిత వాడలను చైతన్యపరచడానికి మహిళా పాఠకులను వారధిగా చేసుకుందామె. ఓటు నిర్ణయం తమదే అయి ఉండాలని... పీడనకు, ప్రలోభాలకు తల ఒగ్గకుండా ధైర్యంగా నిలబడాలని దళితులను చైతన్య పరుస్తూ వ్యాసాలు రాసింది ఖబర్ లహరియా పత్రిక. ఆ పత్రిక కాపీలను మహిళలకు చేర్చడం ద్వారా దళిత సమాజాన్ని చైతన్యవంతం చేయాలనేది ఆమె ఆలోచన. ‘ఖబర్ లహరియా’ ప్రతులను గ్రామాలకు తీసుకెళ్లి పంచుతోందని అక్కడి అగ్రవర్ణాల వాళ్లకు తెలిసింది. ఉత్తరప్రదేశ్‌లో పితృస్వామ్య, భూస్వామ్య భావజాలం ఎక్కువ. అక్కడి గ్రామపెద్దలకు శివదేవి చేస్తున్న పని ఏమాత్రం నచ్చలేదు. కొంతమంది దుండగులు ఆమెను అటకాయించి, ఆమె దగ్గరున్న పత్రిక కాపీలను, ఆమె కెమెరా ఫోన్‌ను లాక్కుని, ఆమెను అసభ్యంగా తిడుతూ, మరోసారి ఈ ఛాయలకు రావద్దని, వెళ్లిపొమ్మని బెదిరించారు. ఆమె పోలీస్ స్టేషన్‌కి వెళ్లి తనకు ఎదురైన సంఘటనను తెలియచేస్తూ తనకు రక్షణ కల్పించమని కోరుతూ కంప్లయింట్ రాసిచ్చింది. అక్కడి పోలీసులు సంగతంతా విని ఆమె రాసిన ఫిర్యాదు కాపీని కనీసం చదవకుండా ఓ పక్కన పడేసి, ఆమెను గేలి చేస్తూ నవ్వారు. అయినా శివదేవి క్లిష్టమైన రిపోర్టింగ్‌ని మానుకోలేదు. ఆమెకు పత్రిక కూడా అండగా నిలిచింది. ఆమెకు జిల్లా అంతటా గుర్తింపు రావడానికి కారణం ఆమె రిపోర్ట్ చేసిన సాహసోపేతమైన కథనాలే. ఇప్పుడు మళ్లీ లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి. ఆమె కలానికి మళ్లీ పని ఒత్తిడి పెరిగింది. ఈ పనిని సమర్థంగా నిర్వహించడానికి ఖబర్ లొహారియా నిర్వహకులు ఆమెకు స్కూటీ కొనిచ్చారు. డౌన్ పేమెంట్ కట్టి, మిగిలిన వాయిదాలు ఆమె చెల్లించుకునే పద్ధతిలో వాహనాన్ని ఇచ్చారు. ఆ సంస్థలో ఇలాంటి గుర్తింపును అందుకున్న తొలి ఉద్యోగి శివదేవి. – మంజీర రాని ఇంగ్లిష్‌తోనే నెగ్గుకొచ్చింది! శివదేవి ప్రస్తుతం జీవితం.. పదేళ్ల కఠోర శ్రమకు ఫలితం. 2010లో శిక్షణలో చేరినప్పటి నుంచి ఆమె ఏ రోజూ పని చేయకుండా విశ్రమించింది లేదు. తనకు వచ్చిన కొద్దిపాటి చదువుతోనే రాయదలుచుకున్న విషయాన్ని చక్కగా రాయగలిగిన పట్టు రావడానికి ఆమె పడిన శ్రమ తక్కువేమీ కాదు. ఇంగ్లిష్ రాని శివదేవికి ప్రభుత్వాఫీసుల్లో అధికారులు ఇంగ్లిష్‌లో మాట్లాడినప్పుడు ఎదురైన ఇబ్బందులు కూడా తక్కువేమీ కాదు. అత్తింటి వాళ్లు తనను, తన బిడ్డను చంపేయాలనుకున్నారు. ఆమె బతికి చూపించాలనుకుంది. సమాజం నుంచి గౌరవాలందుకుంటూ బతికి చూపిస్తున్న ధీరవనిత శివదేవి. దళితవాడల్లో తల్లిదండ్రులు ఇప్పుడు తమ పిల్లలకు ఆమెను ఆదర్శవంతంగా చూపిస్తున్నారు. -
పిచ్చి పీక్స్‌కు వెళ్లడం అంటే ఇదే..!
ఇస్లామాబాద్ : ప్రపంచంలో పాకిస్తాన్ రిపోర్టర్లు చేసినంత వెరైటీ రిపోర్టింగ్ వేరే ఎవరూ చేయరేమో. గాడిదల జనాభా పెరిగిపోతుందని చెప్పడం కోసం ఓ జర్నలిస్ట్ ఏకంగా గాడిద మీద కూర్చోని రిపోర్టింగ్ చేసిన సంఘటన మరువక ముందే.. అలాంటి మరో సంఘటన చోటు చేసుకుంది. వరద తీవ్రత గురించి చెప్పడానికి ఈ జర్నలిస్ట్ ఏకంగా ఆ ప్రవాహంలో నిల్చోని రిపోర్టింగ్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. నైలా ఇనయత్ అనే ట్విటర్ యూజర్ పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ నవ్వులు పూయిస్తోంది. దీనికి నైలా ‘ప్రొడ్యూసర్ వేరే ఏ చానెల్ రిపోర్ట్ చేయని న్యూస్ స్టోరీని తీసుకురా అని ఆదేశించాడు. పాపం అందుకే ఇలా’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ‘వరదలో నువ్వు కూడా కొట్టుకుపోతే అప్పుడు నీ గురించి రిపోర్ట్ చేయాల్సి వస్తుంది’. ‘ఇలాంటి తలకు మాసిన ఆలోచనలు ఎలా వస్తాయో’.. ‘పులిట్జర్ ప్రైజ్ ఇవ్వాల్సిన రిపోర్టింగ్’ ఇది అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. గతంలో ఓ జర్నలిస్ట్ గాడిదపై కూర్చుని రిపోర్టింగ్ చేయడం.. అది కాస్తా అతన్ని కింద పడేయడం అందరికి తెలిసిందే. Producer: Bring me a news story that no other channel has. Reporter: pic.twitter.com/cOLxx6Uvas — Naila Inayat नायला इनायत (@nailainayat) April 16, 2019 -
చిన్నాచితకా మనిషిని కాను
పశ్చిమగోదావరి, ఏలూరు (మెట్రో): పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నామంటూ ఉన్నతాధికారుల వద్ద గొప్పలు.. ఏదైనా చిన్న పొరపాటు జరిగితే దానిని కార్యదర్శులపైకి నెట్టి వారిపై చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు.. వాస్తవాలు రాసే సాక్షి విలేకరికి బెదిరింపులు.. నేను ఏదైనా చేస్తానంటూ హూంకరింపులు.. ఇవీ పంచాయతీల్లో ప్రజల సొమ్మును అప్పనంగా ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేస్తున్న ‘చిన్న’ అధికారి లీలలు. అప్పనంగా ప్రైవేటు సంస్థలకు.. జిల్లా పంచాయతీ కార్యాలయంలో షాడో కలెక్టర్‌గా వ్యవహరిస్తున్న డివిజనల్ స్థాయిచిన్న అధికారి లీలలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఈ అధికారి పంచాయతీలను సుందరంగా తీర్చిదిద్దుతున్నామంటూ ఉన్నతాధికారుల వద్ద గొప్పలు పోతున్నారు. పారిశుధ్యం నిమిత్తం ప్రవేశపెట్టిన ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్‌లను ఎక్కువ ధరకు కొని నిధులు గోల్మాల్ చేసిందే కాక.. వాటిని స్కానింగ్ చేసేందుకు ఏర్పాటు చేసిన సంస్థకు అప్పనంగా నిధులు దోచిపెడుతున్నారు. పంచాయతీల్లో పారిశుధ్య పనులు చేయకున్నా.. ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించకున్నా.. ఆర్ఎఫ్ఐడి ట్యాగ్‌లను మాత్రం తప్పనిసరిగా స్కానింగ్ చేయాలంటూ కార్యదర్శులపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. ఒక్కో స్కానింగ్‌కు రూ.3.50 చొప్పున అప్పనంగా కట్టబెడుతున్నారు. కార్యదర్శులంటే ‘చిన్న’చూపు ఈ అధికారి కార్యదర్శులంటే చిన్నచూపు చూస్తున్నారు. ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్లు స్కానింగ్ చేయని కార్యదర్శులపై విరుచుకుపడుతున్నారు. పంచాయతీల్లో చెత్త సేకరించే సిబ్బంది లేకపోవడం, గ్రీన్వెహికల్ సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడం వల్ల పారిశుధ్య పనులు సాగడం లేదు. అయినా ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్లు స్కాన్ చేయాలని కార్యదర్శులను ఆదేశిస్తున్నారు. మాట వినని కార్యర్శులను దుర్భాషలాడుతున్నారు. పంచాయతీలపై ప్రైవేటు వ్యక్తుల పెత్తనం జిల్లాలో ప్రతి మండలంలోనూ ఈ అధికారి ప్రైవేటుగా శానిటరీ ఇన్స్పెక్టర్ అంటూ కొంతమందిని నియమించి వారి ద్వారా కార్యదర్శులపై పెత్తనం చెలాయిస్తున్నారు. అంతే కాకుండా డివిజనల్ పంచాయతీ అధికారులనూ అజమాయిషీ చేస్తున్నారు. దీంతో ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తున్నామో అర్థంకాని పరిస్థితి పంచాయతీ క్షేత్రస్థాయి అధికారుల్లో నెలకొంది. ‘ప్రత్యేక’ పోస్టుతో మెమోలు ఈ అధికారి ఏ జిల్లాలోనూ లేని విధంగా పరిశుభ్రతపై ప్రత్యేక పోస్టును సృష్టించుకుని కార్యదర్శులకు మెమోలు జారీ చేయడమూ అధికారయంత్రాంగంలో చర్చనీయాంశమవుతోంది. అయినా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పంచాయతీ ఉద్యోగులకు ఎన్జీఓల అండ ఈ అధికారి వల్ల జిల్లాలో ఎక్కడైనా పంచాయతీ ఉద్యోగులు ఇబ్బందులు పడితే తమ దృష్టికి తీసుకురావాలని, ఏ ఉన్నతాధికారి వల్ల ఇబ్బందులకు గురికావద్దని జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ కార్యదర్శి చోడగిరి శ్రీనివాస్ చెప్పారు. ఉద్యోగులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ‘సాక్షి’కి బెదిరింపులు తన లీలలపై ‘సాక్షి’లో కథనాలు రావడంతో చిన్న అధికారికి కోపమొచ్చింది. ఆదివారం ‘సాక్షి’ విలేకరికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. ‘మీరు రాసుకుంటే.. నాలాంటి మెంటలోడు ఉంటాడు ఏదైనా చేయొచ్చుగా.. నేను ఏదైనా చేస్తా’ అంటూ హెచ్చరించారు. దూషణలకు దిగారు. -
హలో... నేను పైన్‌ను! అటు ఎవరు?
శుక్రవారం ఆట ముగిశాక, ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ మీడియా సమావేశంలో ఉండగా ఓ సరదా ఘటన చోటు చేసుకుంది. అదేంటంటే... పైన్ మాటలను రికార్డు చేసేందుకు జర్నలిస్టు ఒకరు తన ఫోన్‌ను అతడి ముందు పెట్టాడు. ఈలోగా ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. పైన్ ఏమాత్రం సంకోచించకుండా ఆ కాల్ లిఫ్ట్ చేశాడు. ‘నేను టిమ్ పైన్ మాట్లాడుతున్నా. అటు ఎవరు’? అని ప్రశ్నించాడు. దీనికి ‘హాంకాంగ్ నుంచి క్యాసీని మాట్లాడుతున్నా. మీరెవరంటూ?’ సమాధానం వచ్చింది. అనంతరం ‘మీకు మార్టిన్ కావాలా? అతడు మీడియా సమావేశంలో ఉన్నాడు. నేను అతడితో మీకు కాల్ చేయించవచ్చా?’ అని పైన్ అడగ్గా... ‘మెయిల్స్ చెక్ చేసుకోమనండి’ అని జవాబిచ్చాడు. ఈ విషయం మార్టిన్‌కు చెబుతానని పైన్ నవ్వుతూ సంభాషణను ముగించాడు. -
అశ్లీల నృత్యాలు అడ్డుకున్న విలేకరిపై దాడి
పశ్చిమగోదావరి ,చింతలపూడి: చింతలపూడి మండలం ప్రగడవరం పంచాయతీ ముక్కంపాడు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. అశ్లీల నృత్యాలు వద్దని వారించిన అదే గ్రామానికి చెందిన మానేపల్లి రవి (ఓ పత్రికా విలేకరి), అతని బంధువు రమేష్‌పై కొందరు యువకులు శనివారం రాత్రి దాడి చేశారు. దాడిలో బలమైన గాయాలైన రవి, రమేష్‌ను చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం ఏలూరు తీసుకువెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి జాతర సందర్భంగా గ్రామంలో అశ్లీల నృత్యాలు ఏర్పాటుచేశారు. గ్రామంలోని కొందరు వద్దని వారించినా వినకపోవడంతో పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అశ్లీల నృత్యాలను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన గ్రామానికి చెందిన కొందరు యువకులు శనివారం విధులు నిర్వర్తించి ఇంటికి వెళ్తున్న మానేపల్లి రవిపై దాడి చేసి కొట్టారు. సీఐ పి.రాజేష్ ఆదివారం ముక్కంపాడు గ్రామం చేరుకుని సంఘటనపై విచారణ జరిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజేష్ చెప్పారు. -
తీగలాగితే కదిలిన అవినీతి డొంక
గుంటూరు రూరల్: వ్యభిచార గృహాల నిర్వాహకులను బెదిరించడంతో పాటు పోలీసుల నుంచి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి భారీస్థాయిలో వసూళ్లకు పాల్పడుతున్న హోంగార్డ్, గతంలో ఓ న్యూస్ చానల్ (సాక్షికాదు) లో పని చేసిన కెమేరామన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళను బెదిరించి నగదు వసూలుకు పాల్పడిన ఘటనలో ఏఆర్ కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులకు ఊహించని నిజాలు బయటపడ్డాయి. నగరంలోని నగరాలు ప్రాంతానికి చెందిన మల్లేశ్వరి వ్యభిచార గృహం నిర్వహిస్తుంటుంది. ఈ క్రమంలో నగరంలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న హోంగార్డ్, గతంలో న్యూస్ చానల్లో పనిచేన కెమేరామన్లు ఆమెను బెదిరించి నగదు వసూలు చేశారు. నెలానెలా మూమూళ్లు ఇస్తే ఎవ్వరూ ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటామని హామీ ఇచ్చి భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడేవారు. ఏఆర్ కానిస్టేబుల్ బెదిరింపులు ఈ క్రమంలో రెండు రోజుల కిందట 6వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ మల్లేశ్వరి వద్దకు వెళ్లి రూ. 20 వేలను బెదిరించి వసూలు చేశాడు. దీంతో ఆమె గతంలో తనకు హామీ ఇచ్చిన హోంగార్డు, కెమేరామన్‌కు ఫోన్ ద్వారా విషయాన్ని చెప్పింది. దీంతో ఇద్దరు కలసి ఏఆర్ కానిస్టేబుల్‌పై నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా ఊహించని నిజాలు బయట పడ్డాయి. కెమేరామన్, హోంగార్డులే బెదిరిపులకు పాల్పడుతూ వసూళ్లు చేస్తుంటారని తెలిసింది. దీంతో వారినీ అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా బాగోతం బయటపడింది. పలు స్టేషన్లలో కేసుల నమోదు గతంలోనూ హోంగార్డు, మాజీ కెమేరామన్ ఇదే విధంగా వసూళ్లకు పాల్పడ్డ ఘటనల్లో నగరంలోని పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కెమేరామన్ గతంలో పాత గుంటూరుకు చెందిన ఒక మహిళను బెదిరించి నగదు వసూలు చేశాడు. దీంతో ఆమె జిల్లా ఎస్పీని సంప్రదించగా పాత గుంటూరు పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు. నగరంలోని ఈస్ట్, వెస్ట్ పరిధిలో మరో రెండు పోలీస్స్టేషన్లలో ఇద్దరిపై కేసులు నమోదైనట్లు సమాచారం. అయినా, వారిలో మార్పు రాలేదు. నగరంలోని పలు వ్యభిచార గృహాల నిర్వాహకుల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. గతంలో నగరంపాలెంలో ఓ పత్రికా విలేకరి ఇదే విధంగా వ్యభిచారం నిర్వాహకురాలిని బెదిరించి నగదు వసూళ్లకు పాల్పడిన ఘటనలో ప్రస్తుతం అదుపులోఉన్న కెమేరామన్ హస్తం ఉన్నట్లు సమాచారం. బెందిరింపులే ప్రవృత్తిగా హోంగార్డు అండతో నగరంలోని నగర శివారుల్లోని వ్యభిచార గృహాల్లో లక్షలాది రూపాయలు వసూళ్లు చేశాడని సమాచారం. బెదిరింపులకు పాల్పడేది ఇలా... ముందుగా వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్న వారి ఆచూకీ తెలుసుకుని అది ఏస్టేషన్ పరిధిలోకి వస్తుందో చూస్తారు. అనంతరం ఆ స్టేషన్‌కు వెళ్లి అక్కడ వారికి అనుకూలమైన కానిస్టేబుల్‌ను ఎంచుకుని అతని సహాయంతో హోంగార్డ్, కెమేరామన్లు వారిని బెదిరిస్తారు. ఒకవేళ కానిస్టేబుల్ వారికి అనుకూలించకపోతే అతనిపై లేనిపోని ఆరోపణలు చూపి అతనిని బెదిరించి వారి వైపునకు మలుచుకుంటారు. దీంతో చేసేదిలేక కానిస్టేబుల్స్ సైతం వారు చెప్పినట్లు ఆడుతుంటారని సమాచారం. ఈ క్రమంలో వ్యభిచార గృహాల నిర్వాహకుల నుంచి వచ్చే నగదును అందరూ పంచుకునేవారని తెలిసింది. ఈ విధంగా నగరంలోని పలు ప్రాంతాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న వారి వద్ద నుంచి లక్షల్లో నగదును వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. నిందితుల అరెస్టు ఎట్టకేలకు నల్లపాడు పోలీస్‌స్టేషన్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారని తెలిసింది. అయితే, వీరితో పాటు వ్యభిచార గృహాల నిర్వాహకులపై కూడా కేసులు నమోదు చేస్తేగానీ ఇటువంటి అరాచక శక్తులకు అడ్డుకట్ట పడదు. -
స్పాట్ బెడతా!
పోలీస్ సినిమాల గురించి మాట్లాడుకునేప్పుడు ఇప్పటికీ ప్రస్తావనకొచ్చే సినిమా. లాఠీకి పదునైన పనిచెప్పిన సినిమా. ఖాకీ పౌరుషాన్ని కళ్లకు కట్టిన సినిమాలోని దృశ్యాలు ఇవి.... సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం... ‘‘సార్... వికాస్ దినపత్రిక నుంచి వస్తున్నాను. నా పేరు విశ్వనాథ్’’ తనను తాను పరిచయం చేసుకున్నాడు కళ్లద్దాల రిపోర్టర్.‘‘సర్లేగాని అడుగు’’ అన్నారు సీయం క్యాజ్వల్గా.ఈలోపు ఇద్దరి మధ్య ఫొటోగ్రాఫర్ దూరి...‘‘కొంచెం నవ్వండి సార్’’ అన్నాడు.‘‘మధ్యలో నీ గొడవేంది. కాస్త అవతలుండు’’ అని విసుక్కున్నారు సీయం.రిపోర్టర్ ప్రశ్న అందుకున్నాడు...‘‘ముఖ్యమంత్రి కావాలని ముందే అనుకున్నారా? అవ్వక ముందు అయిన తరువాత మీ అనుభవాలు చెబుతారా?’’‘‘జరిగిపోయినదాని గురించి ఇప్పుడెందుకయ్యా. జరగాల్సిన దాని గురించి ఏమైన అడగదల్చుకుంటే అడుగు’’ అన్నారు సీయం.‘‘సార్... మీరు మద్యపానాన్ని నిషేధిస్తున్నారట?’’ అడిగాడు రిపోర్టర్.పక్కలో ఫుల్‌బాటిల్ పడ్డట్టు అదిరిపడ్డారు హోంమినిస్టర్గారు. అంతలోనే సర్దుకుని...‘‘అబ్బబ్బే...అలాంటిదేమీ లేదండీ.ఆలోచనలో ఉంది. సీయంగారు ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు’’ అని బుకాయిస్తూ ‘‘అనవసరంగా పేపర్లో రాయొద్దు’’ అన్నారు హోంమంత్రి.మంత్రిగారి మాటలకు సీయంగారికి చిర్రెత్తుకొచ్చింది.‘‘నిర్ణయానికి రాకపోవడం ఏందయ్యా. తీసిపారేయ్యడం ఖాయం’’ గట్టిగా చెప్పారు సీయం.‘‘కారణం చెబుతారా?’’ అడిగాడు రిపోర్టర్.‘‘చూడూ... నువ్వు తాగుతావా?’’ సూటిగా అడిగారు సీయం.సిగ్గుతో మెలికలు తిరిగాడు రిపోర్టర్.‘‘ఫరవాలేదు చెప్పు’’ అన్నారు సీయం.‘‘అప్పుడప్పుడూ సార్’’ మరింతగా సిగ్గుపడ్డాడు రిపోర్టర్.‘‘అయితే తాగెల్లి నీ పెళ్లాన్ని అడుగు చెబ్బుద్ది’’ అన్నారు సీయం.‘మీరు భలే కామెడీ మాట్లాడతారు సార్’’ మూడోసారి మెలికలు తిరిగాడు రిపోర్టర్.‘‘కడుపు మండినప్పుడు వచ్చేది కామెడియే లేవయ్యా’’ జీవితసత్యాన్ని చెప్పారు సీయం.మరో ప్రశ్న అందుకున్నాడు రిపోర్టర్...‘‘మీరు ఎన్నికలలో చేసిన వాగ్ధానాలను నెరవేర్చగలనని అనుకుంటున్నారా?’’హోంమంత్రికి మళ్లీ కోపం వచ్చింది.‘‘ఏమిటండీ అది...ఎన్నికలన్నాక ఎన్నెన్నో చెబుతాం. చెప్పాంగదా అని చేతుల్లో లేనివన్నీ చేయగలుగుతామా? అడిగేదో కాస్త ఆలోచించి అడగాలి’’ విసుక్కున్నారు హోంమంత్రి.సీయంగారు హోంమంత్రి వైపు గుర్రుగా చూశారు. ఆపై ఇలా అన్నారు...‘‘కృష్ణారావు! నీకు అపశకునాలు పలకడం అలవాటైపోయింది. ఇదిగో వికాసు...నాకు ప్రజలకు మధ్య దళారీలు పెట్టదల్చుకోలేదు’’రిపోర్టర్‌తో మాట్లాడిన తరువాత సీయంగారు బయటికి వచ్చారు. భారీ బందోబస్త్! ఎటు చూసినా పోలీసులు! ఆశ్చర్యంతో అదిరిపడ్డారు సీయం.‘‘ఏంది? ఏందయ్యా ఇదంతా?’’ కారు డోరు తీస్తూ విసుక్కున్నారు సీయం.‘‘మీకు సెక్యూరిటీ సార్’’ గొప్పగా అన్నారు హోంమంత్రి.‘‘ఒక్క మనిషికి ఏందయ్యా ఇంత హడావిడి. నాకు ఈ కారు చాలు. ఇంకేం బడ్లా’’ అన్నారు సీయం.‘‘మీరు ఇలా సెక్యూరిటీ కూడా వద్దనడం బాలేదు. చీఫ్ మినిస్టర్‌గా రేపొద్దున మీకేమైనా జరిగితే హోంమినిస్టర్‌గా తట్టుకోలేను’’ అర్జెంటుగా ఆందోళనను కళ్లలోకి తెచ్చుకున్నారు హోంమినిస్టర్.‘‘ఇదిగో హోము. ప్రజలకు మనం సెక్యూరిటీ ఇవ్వాలిగాని ప్రజల డబ్బుతో మనకెందుకయ్యాసెక్యూరిటీ?’’ నిలదీశారు సీయం.‘‘సార్! మా బాధ్యత కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ’’ అన్నాడు పెద్దపోలీసాయన.‘‘సరే...మీ తృప్తి కోసం గేటు బయట ఇద్దరు పోలీసులను పెట్టుకోండి. నా ముందుగానీ వెనగ్గాని మీరెవరు రాబల్లే. బయలుదేరండి’’ అన్నారు సీయం. కారు ఎక్కబోయే ముందు ‘‘రత్తమ్మా...ఏది కాస్త ఎదురు రా’’ అని పిలిచారు.నిండు ముల్తైదువు సీయంగారి కారుకు ఎదురొచ్చింది.ముందు సీట్లో హోంమంత్రి కూర్చోబోతుంటే...‘‘ఇదిగో కృష్ణారావు! అట్టా ఇరుక్కొని పోవడం దేనికి? బోలెడంత జాగా ఉంది. వెనక్కి రా కబుర్లు చెప్పుకుందాం’’ అన్నారు సీయం.‘‘ఎప్పుడూ ఇలా జోకులు వేస్తూనే ఉంటారు’’ నవ్వుతూ వెనకసీట్లో సీయం పక్కన కూర్చొన్నారు హోంమంత్రి. కారు కదిలింది. ‘‘చిరునవ్వుతో ఎదురొచ్చే ముల్తైదువు కంటే సెక్యూరిటీ ఏం ఉంటుంది!’’ అన్నారు సీయం. జీబు దిగి ఆ పోలీస్‌స్టేషన్‌లోకి రాజసంగా నడిచొచ్చాడు రౌడీషీటర్ నీలకంఠం. ‘‘నమస్తే బై. నేనే నీలకంఠం. ఈ సిటీ మొత్తానికి ఏ మనిషి మూమెంట్‌కి స్పాట్ పెట్టాలన్నా మనం పెట్టాల్సిందే. అసలు ఈ చుట్టుపక్కల ఏ కొత్త పోలీస్ ఆఫీసర్ వచ్చినా నన్ను కలవాల్సిందే. నువ్వు కల్వలేదు. నేను బాధపడను. నేను ఏ మూమెంట్ చేసినా, ఏ స్పాట్పెట్టినా ముందుగా చెప్పేది పోలీసోళ్లకే’’తనను తాను పరిచయం చేసుకుంటూనే తనతో పెట్టుకుంటే ఎంత ప్రమాదమో చెప్పకనే చెప్పాడు నీలకంఠం.ఆ తరువాత ‘సంటీ’ అని పిలిచాడు. తమ్ముడు సంటి జర్దా నములకుంటూ నడుముకు కట్టుకున్న కాశీ తువ్వాలును విప్పాడు. అందులోని డబ్బుల కట్టలను టేబుల్‌పై వేశాడు. కుక్కకు బిస్కెట్ వేసినట్లుగా, తీసుకోమన్నట్లుగా తల ఊపాడు నీలకంఠం.‘‘ఎట్లా పెట్టుకుందాం పేమెంట్స్. వీక్లియా? మంత్లీయా? మనకి పొలిటికల్ మూమెంట్ ఉంది. ప్రమోషన్ కోసం ట్రై చేస్తాం. మన స్పాట్ మీద స్టేట్పాలిటిక్స్ నడుస్తుంది’’ ఇలా ఏవేవో మాట్లాడుతున్నాడునీలకంఠం.అటు నుంచి మాత్రం సౌండు లేదు. స్పందన లేదు.‘‘మాట్లాడు’’ అన్నాడు నీలకంఠం.నీలకంఠాన్ని కోపంగా ఒక్క తోపు తోసి...‘‘పోలీస్‌స్టేషన్ అంటే సారాబట్టీ అనుకున్నావా? ఊచల్లో పెట్టి వెన్నుపూసలు వంచడానికి వచ్చాను. మైండిట్ రాస్కెల్’’ అని హెచ్చరించాడు ఇన్స్పెక్టర్. -
విలేకరి గోవర్ధన్ ఆకస్మిక మృతి
అనంతపురం రూరల్: విలేకరి గోవర్ధన్ (41) ఆకస్మికంగా మృతి చెందారు. రామగిరికి చెందిన ఈయన అనంతపురంలో ఆంధ్రభూమి విలేకరిగా పనిచేస్తున్నారు. ఆదివారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో అనంతపురం ప్రెస్‌క్లబ్‌లోని గదిలో మంచంపై కూర్చుని పేపర్ చదువుతున్న ఆయన ఉన్నట్టుండి కుప్పకూలారు. కొద్దిసేపటి తర్వాత అక్కడకు వచ్చిన తోటి జర్నలిస్టులు ఏమిలా పడిపోయాడని లేపడానికి ప్రయత్నించగా ఉలుకూపలుకూ లేకపోయింది. వెంటనే 108 వాహన సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పరిశీలించగా.. అప్పటికే అతను మృతిచెందినట్లు నిర్ధారించారు. విషయం తెలియగానే రామగిరి నుంచి కుటుంబ సభ్యులు హుటాహుటిన బయల్దేరి ప్రెస్‌క్లబ్‌కు చేరుకుని బోరున విలపించారు. సాయంత్రం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ నేతల నివాళి ప్రెస్‌క్లబ్‌లో హఠాన్మరణం చెందిన విలేకరి గోవర్ధన్ మృతదేహాన్ని వైఎస్సార్సీపీ అనంతపురం పార్లమెంటు అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, సమన్వయకర్త తలారి పీడీ రంగయ్య, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడి, నాయకులు వై.వి.శివారెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్రెడ్డిలు సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వై.వి.శివారెడ్డి విలేకరి కుటుంబానికి ఆర్థికసహాయం అందించారు. ఎస్పీ అశోక్‌కుమార్, ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఆలూరి సాంబశివారెడ్డిలు విలేకరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. త్రీటౌన్ సీఐ మురళీ, ఎస్ఐ జైపాల్‌రెడ్డిలు మృతి చెందిన పాత్రికేయుని వివరాలు సేకరించారు. -
స్టేడియం బయట రిపోర్టర్‌కు అనూహ్య పరిణామం
-
ఇసుక లారీల ఆగడాలపై విలేకరి ఆత్మహత్యాయత్నం
తాడేపల్లి రూరల్/మంగళగిరి రూరల్: రాజధాని అమరావతిలో ఇసుక లారీల కారణంగా పలు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని శుక్రవారం ఓ విలేకరి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. ఇసుక లారీల ఆగడాలను పోలీసులు పట్టించుకోవటం లేదంటూ ఓ పత్రికలో విలేకరిగా పనిచేస్తున్న నాయుడు నాగరాజు శరీరంపై పెట్రోలు పోసుకున్నాడు. సమాజం పట్ల బాధ్యత కలిగిన పాత్రికేయుడిగా తాను ప్రాణాలు అర్పిస్తే అయినా ఇసుక లారీలను నిషేధిస్తారా? అని ప్రశ్నించాడు. ఇసుక లారీలను కృష్ణాయపాలెం, పెనుమాక, ఉండవల్లి మీదుగా పంపాలని మంగళగిరి మండలం యర్రబాలెం గ్రామానికి చెందిన నాగరాజు డిమాండ్ చేశాడు. సమీపంలో ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమై నాగరాజును కాపాడటంతో ప్రాణాపాయం తప్పింది. లారీలను నిషేధించడాన్ని ప్రజాప్రతినిధులే నిర్ణయించాలని త్వరలో వారితో చర్చలు నిర్వహిస్తామని సీఐ మధుసూదనరావు చెప్పారు. ప్రమాదం జరిగినప్పుడు హడావుడి... మంగళగిరి నియోజకవర్గంలో ఇసుక లారీల జోరుపై నిత్యం ఏదో ఒకచోట ఆందోళన జరుగుతూనే ఉంది. ఏదైనా ప్రమాదం జరగగానే పోలీసులు రెండు రోజులు నియంత్రించడం త ర్వాత లారీలు యథావిధిగా తిరగడం మామూలై పోయింది. ఇసుక లారీలతో ఇబ్బందులకు గురవుతున్న యర్రబాలెం ప్రజలు ఎన్నోసార్లు ధర్నాలు చేసినా పట్టించుకున్న అధికారులు లేరు. విలేకరి నాగరాజు అధికారులను కలిసి గ్రామస్తుల గోడు వినిపించినా ఫలితం దక్కలేదు. గ్రామస్తులు ధర్నా చేయటంతో చివరకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసినా ఇసుక లారీల దూకుడుకు మాత్రం బ్రేకులు పడలేదు. గ్రామస్తులు శుక్రవారం మరోసారి ధర్నాకు దిగి లారీలను అడ్డుకున్నారు. బైపాస్ రోడ్డుకు మరమ్మతులు చేస్తే... వాస్తవానికి యర్రబాలెం నుంచి బైపాస్ రోడ్డు ఏర్పాటుచేశారు. సీఆర్డీఏ అధికారులు స్పందించి ఇసుక లారీలు వెళ్లే రహదారికి మరమ్మతులు చేసి బీటీ రోడ్డు నిర్మిస్తే దుమ్ము, ధూళి నివారించే అవకాశం ఉంది. యర్రబాలెం ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయి. యర్రబాలెం చెరువు నుంచి సినిమాహాల్ మీదుగా ట్రాఫిక్‌ను పంపించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
రిపోర్టరుకు షాకిచ్చిన అఖిలేష్
లక్నో : మాజీ ముఖ్యమంత్రులు ప్రభుత్వ బంగ్లాలు ఖాళీ చేసి వెళ్లాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో తమకు కొంత సమయం కావాలంటూ సమాజ్‌వాద్ పార్టీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై అఖిలేష్ మీడియాకు సవాల్ చేశారు. .‘నాకు అనుకూలమైన ఇంటిని చూడండి...అప్పుడు నేను ఈ బంగ్లాను వదిలి వెళ్తాను’ అని తెలిపారు. మహారాష్ట్రలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంల పనితీరు గురించి అఖిలేష్ మీడియాతో మాట్లాతుండగా...ఒక జర్నలిస్ట్ ‘అధికార బంగ్లాలను వదిలి వెళ్లే అంశం’ గురించి ప్రస్తావించాడు. దానికి ఆయన ఏమాత్రం తడుముకోకుండా ‘మేము ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయడానికి సిద్ధంగానే ఉన్నాం...కానీ మాకు కొంత సమయం కావాలి. నాకు, నేతాజీకి ఈ లక్నో పట్టణంలో నివసించడానికి స్థలం లేదు. ఒక వేళ మీరు మాకోసం అనువైన ప్రదేశాన్ని చూస్తే..అప్పుడు మేము తప్పకుండా ఈ బంగ్లాను ఖాళీ చేస్తామ’ని అన్నారు. అంతేకాకుండా విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారంటూ ఆ జర్నలిస్ట్‌పై అఖిలేష్ అసహనం వ్యక్తం చేశారు. మాజీ సీఎంలు ప్రభుత్వ బంగ్లాలు ఖాళీ చేయాలన్న సుప్రీం ఆదేశాలను అనుసరించి యూపీ సర్కార్ మాజీ ముఖ్యమంత్రులకు నివాసాలు ఖాళీ చేయవల్సిందిగా ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ములాయం ఆరోగ్యం దృష్ట్యా ఇప్పటికిప్పుడే ప్రభుత్వ బంగ్లాలు ఖాళీ చేయలేమని, తమకు రెండేళ్ల సమయం కావాలంటూ అఖిలేష్ యాదవ్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు.