టీవీ9 కార్యాలయం వద్ద శుక్రవారం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కవరేజ్‌కు వెళ్లిన ‘సాక్షి’ మీడియా ప్రతినిధిపై రవిప్రకాశ్ అనుచరులు వాగ్వివాదానికి దిగారు. గేటు బయట నుంచే మీడియా వాళ్లు చిత్రీకరించే ప్రయత్నం చేస్తుండగా, వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ’సాక్షి’ రిపోర్టరుతో రవిప్రకాశ్ అనుచరులు దురుసుగా ప్రవర్తించారు.